water
-
నీటి సంరక్షణలో ప్రముఖ సిమెంట్ కంపెనీ
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తాము దృష్టి సారించిన నీటి నిర్వహణ పద్ధతులు, ప్రభావవంతమైన పాలనా వ్యవస్థల ద్వారా బాధ్యతాయుతమైన నీటి నిర్వహణ పట్ల తమ నిబద్ధతను అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వెల్లడించింది. అల్ట్రాటెక్ నీటి నిర్వహణ ప్రయత్నాలు.. యూనిట్ ప్రాంగణంలో, కంచెకు ఆవల ఉన్న ప్రాంతాలను.. అంటే కంపెనీ కార్యకలాపాలను నిర్వహించే ప్రాంతాలలోని కమ్యూనిటీలను సైతం చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వున్న అల్ట్రాటెక్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిమెంట్ తయారీ యూనిట్, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్, నీటి సంరక్షణ పట్ల సమగ్ర విధానాన్ని కలిగి ఉంది. వారి నీటి సంరక్షణ కార్యక్రమాలలో ఒకటి వరుసగా నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లాలోని పెట్నికోట, అయ్యవారిపల్లి గ్రామాలపై దృష్టి పెడుతుంది. ఇక్కడ తక్కువ వర్షపాతం, భూమి క్షీణత, అతి తక్కవ పంట ఉత్పాదకత వంటివి గ్రామీణ జీవనోపాధికి చాలా కాలంగా అడ్డంకులుగా ఉన్నాయి. ఫలితంగా, ఈ ప్రాంతంలో సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమాలను అమలు చేయడానికి యూనిట్ 2019-20లో ఐదు సంవత్సరాల కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ రోజు వరకు.. ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ ఈ గ్రామాల్లో ఏడు వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణాలను నిర్మించింది. ఇది భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఈ నిర్మాణాలు 35,000 క్యూబిక్ మీటర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాయి, జనవరి 2025 నాటికి 7 లక్షల క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని ఇవి సేకరించాయి. దీని వలన భూగర్భ జలాలు 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగాయి, దాదాపు 346 హెక్టార్ల సాగు భూమికి నీటిపారుదల లభించింది.గతంలో బంజరుగా ఉన్న 400 ఎకరాల భూమిని కూడా సాగులోకి తీసుకువచ్చారు, వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయ భద్రతను పెంచారు. సమతుల్య పోషక వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు ఈ గ్రామాల్లో నేల మరియు భూగర్భ జల కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడ్డాయి. ఈ ప్రాజెక్ట్ నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని ఈ రెండు గ్రామాల్లో నివసిస్తున్న 500 గృహాలలో 2,000 మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది.అల్ట్రాటెక్ సమగ్ర నీటి సంరక్షణ విధానంకమ్యూనిటీ నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు, అల్ట్రాటెక్ దాని తయారీ కార్యకలాపాలలో నీటి సంరక్షణకు బహుముఖ విధానాన్ని కూడా తీసుకు వచ్చింది. ఈ విధానంలో అయిపోయిన గని గుంటలను జలాశయాలుగా మార్చడం, పైకప్పుపై వర్షపు నీటి సేకరణ నిర్మాణాలను నిర్మించడం, పునర్వినియోగించబడిన నీటి వినియోగం పెరగడంతో పాటు తయారీ కార్యకలాపాలలో నీటి సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు ఉన్నాయి.అల్ట్రాటెక్ తమ అనేక తయారీ యూనిట్లలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) ప్లాంట్లను ఏర్పాటు చేసింది, దీని ద్వారా యూనిట్లలో 100 శాతం శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా మంచినీటిపై ఆధారపడటం తగ్గుతుంది. నీటి సామర్థ్య మెరుగుదల అవకాశాలను గుర్తించడానికి, రోజుకు 100 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటి ఆధారపడటం ఉన్న దేశీయ ప్రదేశాలలో ఇది ద్వైవార్షిక నీటి ఆడిట్లను కూడా నిర్వహిస్తుంది.ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ తమ యూనిట్ ప్రాంగణంలో అనేక నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ప్రారంభం నుంచి ఈ యూనిట్ తమ ప్రాంగణంలో 1.9 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సేకరించి, రీఛార్జ్ చేసి.. తిరిగి ఉపయోగించుకుంది, ఒక్క FY24 లో మాత్రమే 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఆదా చేసింది. -
నీటిని ఒడిసిపట్టారు
‘నీరు ఉన్న చోట ఊరు ఉంటుంది’ అనే మాట ఉంది. ఊరు సరే... నీటి మాట ఏమిటి?‘నీటిని డబ్బులా ఖర్చు చేయవద్దు’ అనే రోజులు వచ్చాయి.నీటి విలువ గురించి అవగాహన కలిగించడం నుంచి సంరక్షణ వరకు విమెన్ వాటర్ వారియర్స్ క్షేత్రస్థాయిలో, ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్నారు...అస్సాంలోని అమ్తోలా గ్రామానికి చెందిన అరుణా దాస్ గుస్తా సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు తరచుగా హాజరయ్యేది. ఆ అలవాటే తనని నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది. గ్రామంలోని వాటర్ యూజర్ గ్రూప్ (డబ్ల్యూయుజీ) అధ్యక్షురాలిగా నీటి సమస్యలపై గళమెత్తడంలో గణనీయమైన పాత్ర పోషించింది. ‘ప్రతి విషయం నీటితో ఆరంభమై నీటితో ముగిసిపోతుంది’ అంటున్న అరుణ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ్రపోగ్రామ్ (ఇండియా) ద్వారా ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని పాలియ కాలన్ గ్రామానికి చెందిన రమణ్‌దీప్ కౌర్ నీటి సంరక్షణ నుంచి నీటి కాలుష్యం వరకు....ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. కౌర్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది. గ్రామంలో ‘వాటర్ మేనేజ్మెంట్ కమిటీ’లు ఏర్పాటు చేసింది.ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళలను వాటర్ మేనేజ్మెంట్ గ్రూపులలో భాగమయ్యేలా చేసింది.మహారాష్ట్రలోని కోటంబ గ్రామంలో మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం రేణుక. కోడలుగా ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన రేణుక కొంత కాలానికి ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. ‘వాటర్ ఎయిడ్ ఇండియా’ సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. నీటి వృథాను అరికట్టడానికి, నీటి సంరక్షణపై అవగాహన కలిగించడానికి గ్రామీణ మహిళలతో కమిటీని ఏర్పాటు చేసింది.మధ్యప్రదేశ్‌లోని నయాపూరా గ్రామానికి చెందిన బబితా లిరోలియా నీటి సంరక్షణ, నీటి నాణ్యత పరీక్షించడం, నీటి పంపుల రిపేర్...మొదలైన ఎన్నో విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్’ బబితాను ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తించింది.మధ్యప్రదేశ్‌లోని మహుకల గ్రామానికి చెందిన రాధ మీనా ‘విమెన్ ప్లస్ వాటర్ అలయెన్స్’ ్రపోగ్రామ్ వాలెంటరీ వర్కర్. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడం నుంచి కుళాయిల్లో లీకేజీ సమస్య లేకుండా చేయడం, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం వరకు ఎన్నో పనులు చేస్తోంది. ప్రతీ వీధి తిరుగుతూ నీటి సంరక్షణ గురించి లౌడ్ స్పీకర్‌తో ప్రచారం చేసేది..దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విమెన్ వాటర్ వారియర్స్‌లో వీరు కొందరు మాత్రమే. ‘వరల్డ్ వాటర్ డే’ సందర్భంగా అందరికీ వందనాలు. – శిరీష చల్లపల్లినీటి నిజాలు⇒ ప్రపంచంలో 2 బిలియన్ మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కలుషిత నీటి వల్ల సంభవించే వ్యాధులతో మరణిస్తున్నారు ⇒భవిష్యత్తులో నీటి కొరత ఒక ప్రధాన సమస్యగా మారనుంది. పరిష్కారంగా, డీసాలినేషన్ (సముద్ర జలాన్ని తాగే నీటిగా మార్చడం), వర్షపు నీటి సేకరణ, జల పునర్వినియోగం వంటి టెక్నాలజీలు అవసరం. ప్రతి వ్యక్తి నీటిని పొదుపుగా వాడడం ముఖ్యం.వాటర్ గర్ల్... నీటి పుస్తకాలు‘వాటర్ గర్ల్’గా గుర్తింపు పొందిన గర్విత గుల్హాటీ ‘వై వేస్ట్?’ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, సీయివో. తన ఫౌండేషన్ ద్వారా నీటి విలువ, నీటి సంరక్షణ గురించి యువ రచయితలు రాసిన రచనలను ప్రచురిస్తోంది. -
‘దేవా’.. ఒక్క మోటారు!
సాక్షి, హైదరాబాద్: ఒక్క మోటార్‌పై 50 వేల నుంచి 65 వేల ఎకరాల్లోని పంటల మనుగడ ఆధారపడి ఉంది. దేవాదుల ప్రాజెక్టు కింద ప్రస్తుత యాసంగిలో సాగు చేస్తున్న ఈ పంటలు మరో రెండు వారాల్లో చేతికొచ్చే దశలో ఉండగా, తీవ్ర నీటి కొరత కారణంగా ఎండిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ కింద దేవన్నపేట వద్ద కొత్తగా నిర్మించిన పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లుండగా.. కనీసం ఓ మోటారునైనా యుద్ధప్రాతిపదికన వినియోగంలోకి తేవడం ద్వారా ఆ పంటలకు గోదావరి జలాలను మళ్లించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి గత 10 రోజులుగా అక్కడే ఉండి పంప్‌హౌస్‌ను సిద్ధం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిలు.. మోటార్‌ను ఆన్ చేసి నీటిని విడుదల చేసేందుకు పంప్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించినా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి వచ్చేశారు.ఇవి ఆస్ట్రియాకి చెందిన ఆండ్రీజ్ కంపెనీ మోటార్లు కావడంతో ఆ దేశం నుంచి సాంకేతిక నిపుణులు పంప్‌హౌస్‌కు చేరుకుని సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటికి మోటారు సిద్ధం చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తాజాగా మంత్రి ఉత్తమ్‌కు సమాచారమిచ్చింది. అదే జరిగితే ధర్మసాగర్లో నిల్వలు పెరిగి అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీటిని తరలించి స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల ప్రాంతంలోని పంటలకు సరఫరా చేసేందుకు అవకాశం కలగనుంది. 800 క్యూసెక్కులు సరఫరా చేస్తేనే.. దేవాదుల ఎత్తిపోతల కింద 1,28,280 ఎకరాల్లో ఆరుతడి, 70,350 ఎకరాల్లో వరి కలుపుకుని మొత్తం 1,98,630 ఎకరాలకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో సాగుచేస్తున్న పంటలకు సరిపడా నీళ్లు అందుతుండగా, దేవాదుల ప్రాజెక్టు కిందే తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేవన్నపేట పంప్‌హౌస్‌లోని ఒక మోటార్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చి 800 క్యూసెక్కులను నీటిని సరఫరా చేయగలిగితే అంత మేరకు పంటలను రక్షించుకోగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాదాలు నివారించే పనుల వల్లే ఆలస్యం పంప్‌హౌస్ నిర్మాణం చాలా రోజుల కిందే పూర్తికాగా, రక్షణ చర్యల్లో భాగంగా పైపులకు సిమెంట్ ఇన్కేసింగ్ పనులు చేయాలని నిపుణులు సూచించారు. పంప్‌హౌస్ లోతు ఎక్కువగా ఉండడంతో నీళ్లు వెనక్కి తన్ని వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ సిఫారసు చేశారు. గత రెండు నెలలుగా ఈ పనులు జరుగుతుండగా, ఇప్పటికే రెండు మోటార్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇందులో ఒక మోటార్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. మూడో దశ పూర్తైతే ..రైతు దశ తిరిగినట్టే..! సమ్మక్కసాగర్ బరాజ్ బ్యాక్‌వాటర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం నీళ్లను తరలించనుండగా, ప్రస్తుతం సమ్మక్కసాగర్‌లో 2.5 టీఎంసీల నిల్వలున్నాయి. రోజూ 1500 క్యూసెక్కుల వరద వస్తోంది. దేవాదుల తొలిదశ కింద 5.18 టీఎంసీలు, రెండో దశ కింద 7.25 టీఎంసీలు, మూడో దశ కింద 25.75 టీఎంసీలు కలిపి మొత్తం 38.16 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి మొత్తం 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటికే తొలి రెండు దశల పనులు పూర్తయ్యాయి. మూడో దశ కూడా పూర్తైతే ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతు దశ తిరగనుంది. -
కొబ్బరి నీరు వర్సెస్ చెరకు రసం: ఈ సమ్మర్లో ఏ పానీయం బెస్ట్..!
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్‌కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..చెరకు రసంఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుందిచెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయిఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిదీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎవరు తీసుకోవాలంటే..?బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుందిఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.కొబ్బరి నీరుదీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు. జీర్ణక్రియకు సహాయపడుతుందివిషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందిపేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందిఅదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.రెండింటిలో ఏది బెటర్ అంటే..కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!) -
ఆశాజనకం శ్రీశైలం నీటిమట్టం
-
CM Revanth Reddy: తెలంగాణకు నీటి వాటాపై కేంద్ర మంత్రులతో భేటీ
-
ఇచ్చిన మాట ప్రకారం నీరివ్వండి!
ప్రణాళికా సంఘం నివేదిక ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా. స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా ఈ జిల్లా పరిస్థితి దాదాపు ఏమీ మారలేదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లా నలుదిక్కులా అనేక నదులు ఉపనదులూ ప్రవహి స్తున్నా వ్యవసాయం ఇప్పటికీ వర్షాధారంగానో లేదా భూగర్భ జలాలపైనో ఆధారపడి సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున సాగునీటిని అందించడానికి ‘ప్రాణహిత– తుమ్మిడి హెట్టి’ ప్రాజె క్టుకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2008లో శంకు స్థాపన చేసింది. దానికి ‘బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. ప్రాణహిత నుండి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. కాలువ నిర్మాణానికి జిల్లాలో 1700 కోట్లు ఖర్చు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 38 వేల కోట్లు అయ్యే మొత్తం ప్రాజెక్టుకు, ఆనాడే 9 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో బీ(టీ)ఆర్ఎస్ అధి కారంలోకి వచ్చింది. నీరు లేదనే కుంటి సాకు చూపి, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ పేరిట (కాళేశ్వరం) మేడి గడ్డకు ప్రాజెక్టును మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష యాభైవేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో ముగ్గురు మంత్రులు ముచ్చటగా ప్రారంభించారు. నాలుగేళ్ల లోపే ఏడవ బ్లాకులోని అనేక గేట్లు, ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా భారీ లీకేజీలు, సీపేజీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ‘డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం పరిశీలించింది. నీరు నిలువ ఉంచడం ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలోని నీటిని బయటికి పంపాలని నాటి ప్రభుత్వాన్ని కోరింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ఘోరమైన తప్పులు చేసిందని నిర్ధారించింది. ఈ నివేదికప్రకారం: పునాదికి సంబంధించిన భూగర్భ పరీక్షలు ఏమాత్రం చేయలేదు. బలహీనమైన పునాదులపై బ్యారేజీలు నిర్మించింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారే జీలలో, ప్రాజెక్టుల వలె భారీ ఎత్తున నీటిని నిలువ చేశారు. బ్యారేజీలను డ్యాముల వలె నిర్వహించారు. ఆ భారీనీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు భారీగా దెబ్బతిన్నాయి. కేవలం నాలుగు మీటర్ల పునాది క్రింద ఉన్న అడుగు పొరల్లోని ఇసుకంతా భారీ ఎత్తున కొట్టుకుపోయింది. స్పిల్‌వే నిట్టనిలువుగా పునాది నుండి మూడు ఫీట్ల వెడల్పుతో చీలిపోయి, రెండు చెక్కలయ్యింది. భూమిలో కుంగిపోయింది. మేడిగడ్డ వలెనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఎప్పుడైనా భూమిలో కుంగిపోవచ్చు. నాడు భూమిలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు నిశితంగా పరిశీలించి దీని నిర్మాణ ంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ కమిషన్ వేసి సొమ్ము రికవరీ చేసి శిక్షిస్తామని ప్రకటించారు. ప్రత్యా మ్నాయంగా ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ అంతటికీ సాగునీరు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా, ప్రాజెక్టును ప్రస్తావించడం లేదు. యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ‘పినాకీ చంద్రఘోష్ కమిషన్’ విచారణ జరుపుతోంది. నేటి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వారివారి నియోజకవర్గాల్లో, కొత్త ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వెచ్చించి శరవేగంతో నిర్మిస్తున్నారు. ఎన్ని కల ప్రణాళికలో పేర్కొన్న ప్రాణహిత – తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన కడెం ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కుప్టి ప్రాజె క్టు’కు నిధుల కేటాయింపు కానీ, దాని కనీస ప్రస్తావన కానీ లేదు. కుంటాల జలపాతం ఎగువన ఉన్న, కుప్టి ప్రాజెక్టుతో కడెం ఆయకట్టు చివరి వరకు గూడెం ఎత్తిపోతలు లేకుండానే పూర్తిగా రెండు పంటలకు సాగునీరు ఇవ్వవచ్చు. కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. చెన్నూరు– ప్రాణహిత వరకు, మంచి ర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని బీడు భూము లకు సంపూర్ణ గ్రావిటీతో సాగునీరు అందుతుంది. ‘నెహ్రూ ఉత్తర కాలువ’ లేదా ‘మందాకిని ఎన్టీఆర్ కాలువ’ సాగునీటి కలలు పూర్తిగా నిజం అవుతాయి. ఎల్లంపల్లికి వచ్చే ప్రాణహిత కాలువ, కడెం (నెహ్రూ ఉత్తర లేదా మందాకిని) కాలువ ఎక్స్ (గీ) ఆకారంలో క్రాస్ అవుతూ వెళ్తాయి. బెల్లంపల్లి, చెన్నూర్ నియో జకవర్గాల బీడు భూములకు అవసరమయ్యే నీటిని ప్రాణహిత ద్వారా, కడెం కాలువకు అనుసంధానించ డానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఉత్తర కాలువకు... శ్రీరాంసాగర్ నీటినీ, సదర్మాట్ నీటినీ, ఎల్లంపల్లి నీటినీ పూర్తి గ్రావిటీతో అనుసంధానం చేయవచ్చు. కుప్టి ప్రాజెక్టు సముద్రమట్టానికి 1450 అడుగుల ఎత్తులో ఉంటుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం ఎత్తు 700 అడుగులు. అంటే కడెం కంటే 750 అడుగుల ఎత్తులో కుప్టి ప్రాజెక్టు బెడ్ లెవెల్ ఉంటుంది. కడెంకు కుప్టికి మధ్య ఉన్న దూరం కేవలం 30 కి. మీ. మాత్రమే. 750 అడుగుల ఈ వ్యత్యాసపు ఎత్తు అనేది, నీటిపారుదల పరిభాషలో భారీ ఎత్తు గానే పరిగణిస్తారు. కాలుష్యం లేని జల విద్యుత్తుకు, ఎత్తి పోతలు అసలే లేని గ్రావిటీ సాగుకు అత్యద్భు తమైన అరుదైన ప్రాకృతిక అనుకూలత! జల విద్యుత్తు భారీ ఎత్తున ఉత్పత్తి అవుతుంది. కుప్టితో కుంటాల జలపాతం సంవత్సరం అంతా నీరు ఎత్తిపోస్తూ, తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా భారీ ఆదాయంతో కళకళలాడుతుంది. నేరేడిగొండ, ఇచ్చోడ ప్రాంతపు బీడు భూములకు ఎత్తిపోతలతో సాగునీరు ఇవ్వవచ్చు. -నైనాల గోవర్ధన్ (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799) -
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
-
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
రైళ్లు స్టేషన్లలో ఆగినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రధాన స్టేషన్లలో వద్దో, జంక్షన్ల వద్దో ట్రైన్లను శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉండటం మనకు తరుచు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. దానికో ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. అది కూడా ట్రైన్ కదులుతున్నప్పుడే క్లీనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. మనోడికి ఆ ట్రైన్ నీట్ గా కనిపించలేనట్లు ఉంది. అందుకే అలా క్లీనింగ్ చేసినట్లు ఉన్నాడు.రైల్వే ట్రాక్ పక్కగా ఉండే వాటర్ \హోస్ తీసుకుని వచ్చే వెళ్లే ట్రైన్లపై నీళ్లు కొడుతూ ఉన్నాడు. అయితే ఒక ట్రైన్ పై వాటర్ హోస్ తో క్లీన్ చేయడాన్ని ఒక యూజర్ తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ‘రెడ్డిట్’ తన ఖాతాలో పోస్ట్ చేసింది.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మనోడికి ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు’ అని ఒకరు రియాక్ట్ కాగా, ప్యాసింజర్ల పై కోపంలా ఉంది. ప్రత్యేకంగా ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న ప్రయాణికుల్నే టార్గెట్ చేసి అలా వాటర్ స్ప్రే చేస్తున్నాడు’ అని మరొకరు స్పందించారు. ‘ ఇలా కొడితే ట్రైన్ ఖాళీ అయ్యి తనకు సీట్ దొరుకుతుందని కాబోలు’ అని మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యారు. -
ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?
నాకు ఇప్పుడు ఎనిమిదవ నెల. ముందుగానే ఉమ్మనీరు పోతే కష్టమని విన్నాను. ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ప్రమాదం ఉంటుందా?– మమత, జమ్మలమడుగు.శిశువు చుట్టూ గర్భంలో ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు కొంతమందిలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వెజైనా లేదా సర్విక్స్ బలహీనమైనా, ఎనిమిదవ నెలలో ఉమ్మనీరు సంచి పలుచనైయి, చిట్లుతుంది. అప్పుడు నొప్పులు లేకుండానే ఉమ్మనీరు పోవటం వలన లోపల శిశువుకు, తల్లికి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. 24 వారాల నుంచి 37 వారాల లోపల ఉమ్మనీరు పోతే ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం. ఇది తెలుసుకోవటం కొందరికి తెలియక పోవచ్చు. అకస్మాత్తుగా నీరు వెజైనా నుంచి పోవటం, కంట్రోల్ చేసుకోలేకపోవటం, ధారగా ఉండటం, యూరిన్ వాసన లేకపోవటం లాంటివి ఉంటే, ఇంట్లోనే తెలుసుకోవచ్చు. లేదా వెంటనే డాక్టర్ని కలిస్తే, వారు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా చెక్ చెస్తారు. అమోనిసోర్ అనే టెస్ట్ ద్వారా కూడా డాక్టర్ చెక్ చేస్తారు. ఇది వెజైనల్ స్వాబ్ టెస్ట్ లాగా ఉంటుంది. ఇది 99 శాతం సెన్సిటివ్ టెస్ట్. మీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ పరీక్షతో పాటు, మీ పల్స్, బీపీ, టెంపరేచర్ చెక్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. ఒకవేళ లీకింగ్ ఉందని తెలిస్తే, అడ్మిట్ చేసి 24–48 గంటలు అబ్జర్వ్ చేస్తారు. ఈ సమయంలో బేబీ వెల్ బీయింగ్ స్కాన్ చేస్తారు. యాంటీబయోటిక్స్ ఇస్తారు. నెలలు నిండలేదు కాబట్టి శిశువుకు లంగ్ మెచ్యూరిటీ కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నియో నాటాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ చేసి ప్రీమెచ్యుర్ బేబీ రిస్క్స్, కాంప్లికేషన్స్, కేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు నొప్పులు వచ్చి, ప్రసవం అవుతుంటే సురక్షితంగా, ఎలా కాన్పు చెయ్యాలి అని చూస్తారు. ఒకవేళ నొప్పులు రాకపోతే, పైన చెప్పినట్లు యాంటీబయోటిక్స్ ఇచ్చి, అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలో వివరిస్తారు. వారానికి రెండుసార్లు ఉమ్మనీరు, బేబీ బ్లడ్ ఫ్లో స్టడీస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ 37 వారాల వరకు పొడిగించడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తారు. రెగ్యులర్ చెకప్స్, ఫాలో అప్స్లో ఏ సమస్య లేకుండా డాక్టర్ సలహాలను పాటించాలి. (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
ముందున్నవి ‘పానీ’పట్టు యుద్ధాలే
సాక్షి, అమరావతి: ప్రపంచంలో 2030 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల (72 శాతం) మందిని నీటి కష్టాలు చుట్టుముడతాయా? పాకిస్తాన్, ఇథియోఫియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకవా? జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలి చావులు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం(యూఎన్‌యూ) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ జలభద్రత నివేదిక. ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదికలో పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం.. మురుగు నీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేవడం.. పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా జల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆ నివేదిక సూచించింది. 17 సుస్థిరాభివృద్ధి సూచికల జారీ ప్రపంచంలో 195 దేశాలున్నాయి. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం తీవ్రత, వర్షపాతంలో తగ్గుదల, తీవ్రమవుతున్న ఆహార కొరత తదితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జల భద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. » మురుగు నీటిని శుభ్రపరిచి పునర్ వినియోగంలోకి తేవడం, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే జలభద్రత » పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నీటి వినియోగం » తద్వారా జల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచన కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాల గమనాన్ని ఎల్‌నినో, లానినోలు దెబ్బతీస్తున్నాయి. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటికొరతకు ప్రధాన కారణం. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటం కూడా నీటి ఎద్దడికి దారితీస్తోంది. ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటికష్టాలు చుట్టుముడతాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాస్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్‌ల్యాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాత్వియా తదితర దేశాల్లోని 100 కోట్ల మంది, 49 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి. -
సహజత్వం కోల్పోతున్న నీరు
సాక్షి, సిద్దిపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బుల ఇతర కెమికల్స్ వల్ల వాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతోందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పరిశోధనల ద్వారా తేల్చారు. వాగులో పుణ్యస్నానాలు చేశాకే... మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న.. మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. వాగుకు ఇరువైపులా2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవులో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు పంపిస్తారు. భక్తులు జంపన్నవాగులో మునక వేసిన తర్వాత బ్యాటరీ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే లక్షలాది మంది భక్తులు జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపులు, సబ్బుల కారణంగా జంపన్న వాగులోని నీరు సహజత్వానికి కోల్పోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానాన్ని చాలా చోట్ల కెమికల్ కుంకుమలు ఆక్రమించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. 18 శాంపిల్స్ సేకరణ గతేడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్న వాగులో ఆరు చోట్ల, జాతర సమయంలో ఆరు చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు ఆరుచోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు.వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాలలో టెస్ట్ చేశారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అయితే పీహెచ్ 6.5 నుంచి 8.5, డిజాల్వడ్ ఆక్సిజన్(డీవో) 6 ఎంజీ కంటే ఎక్కువ (లీటరు నీటిలో), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) 2ఎంజీ అంతకంటే తక్కువ (లీటరు నీటిలో), బాక్టీరియా అసలు ఉండొద్దు. 24, 25 తేæదీల్లో నేపాల్‌లో ప్రజెంటేషన్ బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాఠ్మాండ్లో ఈ నెల 24,25 తేదీల్లో జరిగే 3వ అంతర్జాతీ య బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సాముహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు డాక్టర్ మదన్మోహన్కు ఆహ్వానం అందింది.నివారణ మార్గాలుసహజత్వాన్ని కోల్పోయిన నీటిలోబ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. » వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. » క్లోరినేషన్ ఎక్కువగా చేయాలి. » సబ్బు, షాంపుల వినియోగం, బట్టలు ఊతకడం, కుంకుమ వేయడాన్నినియంత్రించాలి. » జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్థారణ అయ్యింది. జాగ్రత్తలు పాటించాలి పుణ్యస్నానాలు చేయడం మంచిదే. తగు జాగ్రత్తలు పాటించాలి. పుణ్యస్నానాలు చేసే సమయంలో పూజా ద్రవ్యాలు అందులో వేయొద్దు. షాంపూలు, సబ్బులు వినియోగించడం వలన నీరు సహజత్వం కోల్పోయి కాలుష్యం అవుతుంది. దీంతో చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ మదన్ మోహన్, సిద్దిపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే.. -
గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
అందమైన, మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇది వారి వారి జీవన శైలి, జెనెటిక్ ప్రభావాలు, పని పరిస్థితులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న రంగు, ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా శ్రమ, ఓర్పు అవసరం అనడంలో ఆశ్చర్యం లేదు. దీని కోసం సెలబ్రిటీలు చాలా కేర్ తీసుకుంటారు. వారిలో గ్లోబల్ పాప్ స్టార్, జెన్నీ కిమ్ ఒకరు. కిమ్ లాంటి షైనింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామా?గ్లోబల్ స్టార్, జెన్నీ కిమ్ ముఖం మచ్చలేని చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది. బ్లాక్పింక్గా పేరొందిన జెన్సీ మచ్చలేని, మెరిసే చర్మానికి పాపులర్. అసలు ఆమె స్కిన్ టోన్ చూసిన సౌందర్య నిపుణులు, అభిమానులు ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన ముఖ సౌందర్యం ఆమె సొంతం.చర్మ సంరక్షణకోసం ఆమె ఏం చేస్తుంది?జెన్నీ సహజమైన మెరుపు కోసం, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్కిన్కేర్కు ఆమె అనుసరించే పద్ధతులు చాలా సరళమైనవి, పైగా ప్రభావ వంతమైవి. ఏదైనా పెద్ద ఈవెంట్లకు ముందు ఆమె ముఖాన్ని ఐసింగ్ (ఐస్‌వాటర్‌లో ఫేస్‌ను ముంచడం) చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్ వంటి ముఖ్యమైన పద్ధతులను పాటిస్తుంది. ప్రీ-ఈవెంట్ బ్యూటీ హ్యాక్ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంది. ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు, కేవలం ఐస్-కోల్డ్ వాటర్ లాంటివి కూడా సరిపోతాయని తెలిపింది.ఐస్ వాటర్ ట్రిక్ఏదైనా ప్రధాన కార్యక్రమానికి ముందు తన ముఖాన్ని ఐస్ వాటర్ గిన్నెలో కాసేపు ఉంచుతుంది. ఈ చర్మ సంరక్షణలో పురాతన ట్రిక్ తనకు చాలా ఇష్టమైనదనీ, ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంతోపాటు, ఉబ్బును తగ్గించి, మెరుపును పెంచుతుందని తెలిపింది.ఈ టెక్నిక్‌ను స్కిన్‌కేర్ ప్రిపరేషన్ స్టెప్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మేకప్‌కు మించి అందంగా చేస్తాయని పేర్కొంది. అలాగే చల్లని నీరు రక్త నాళాలను టైట్ చేస్తుందనీ, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుందని చెప్పింది. తద్వారా ముఖంలోని చర్మానికి తక్షణ బూస్ట్ ఇస్తుందని వివరించింది.హైడ్రేషన్ కోసం ఫేస్ మాస్క్జెన్నీ ఫేస్ మాస్క్‌లకు పెద్ద అభిమాని, హైడ్రేషన్ , పోషణను నిర్వహించడానికి ఈమాస్క్ వేసుకోవడం దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటుందట. ఫేస్ మాస్క్‌లు, ముఖ్యంగా షీట్ మాస్క్‌లు, కొరియన్ స్కిన్‌కేర్‌లో ప్రధానమైనవి. ఇవి చర్మం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.డీప్ క్లీన్ స్కిన్ కోసం డబుల్ క్లెన్సింగ్జెన్నీ స్కిన్‌కేర్ రొటీన్లో మరో ముఖ్యమైన భాగం డబుల్ క్లెన్సింగ్. దీని కోసం ముందుగా మేకప్, సన్‌స్క్రీన్ అదనపు నూనెలను తొలగించడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ను ఉపయోగిస్తుందట. ఆ తరువాత మురికి మలినాలను తొలగించడానికి వాటర్ ఆధారిత క్లెన్సర్‌ను వాడుతుంది. డబుల్ క్లెన్సింగ్ చర్మం అవసరమైన తేమను తొలగించకుండా పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!స్మూత్ స్కిన్ కోసం రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్జెన్నీ తన చర్మాన్ని మృదువుగా , మృత చర్మ కణాలను తొలగించుకునేందుకు ఎక్స్ఫోలియేషన్ ( స్క్రబ్బింగ్) రొటీన్‌గా ఆచరిస్తుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ పోర్స్‌ను ఓపెన్ చేసి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మనం వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరుస్తుంది. అతిగా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పరిమితంగా ఈ పద్థతిని పాటిస్తుంది. ఐ క్రీమ్‌లు , సీరమ్లుజెన్నీ స్కిన్‌కేర్ రొటీన్లో కీలకమైన భాగం ఐ క్రీమ్‌లు ,సీరమ్. ఐ క్రీమ్‌లు ద్వారా కంటికింద మచ్చలు, కళ్ల ఉబ్బులాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మరోవైపు, సీరమ్స్ ద్వారా స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందని, హెల్తీగా ఉంటుందని తెలిపింది. వీటిన్నితోపాటు, పుష్కలంగా నీరు తాగుతుంది. ఇక కొరియన్ చర్మ సంరక్షణలో ముఖ్య భాగమైన ప్రతీరోజూ సన్‌స్క్రీన్‌ను వాడుతుంది. దీని ద్వారా అకాల వృద్ధాప్యాన్ని కాకుండా ఉంటుందనీ, అలాగే హానికరమైన UV కిరణాల నుండి చర్మానికి రక్షణఉంటుందని వివరించింది.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది
-
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్‌లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
ఈ నీళ్లు.. చాలా ఖరీదు గురూ!
నీరు.. మానవాళికి తప్పనిసరిగా అవసరమైన వనరు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభ్యమయ్యే నీటిని ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు సాధారణంగా రూ.20 ఉంటుంది. కంపెనీ, ఇతరత్రా అంశాలను బట్టి రూ.2వేల బాటిల్ కూడా ఉంది. కానీ జపాన్‌కు చెందిన ఫిల్లికో అనే కంపెనీ ఇంతకుమించిన ధరకు మంచినీళ్లను అమ్ముతోంది. ఆ కంపెనీ వాటర్ బాటిళ్ల ధర రూ.84వేల నుంచి మొదలై ఏకంగా రూ.8 లక్షల వరకు ఉంది. ధర చూస్తే గుండె గుభేల్మనడం ఎంత నిజమో.. ఆ బాటిల్ చూసిన తర్వాత వావ్ అని అనకుండా ఉండలేకపోవడం కూడా అంతే నిజం. ఆ బాటిల్ అందం అలాంటిది మరి. ఇంతకీ ఆ బాటిల్ నీళ్లకు అంత రేటెందుకు? అవేమైనా పైనుంచి దిగొచ్చాయా అనే కదా మీ సందేహం? ఔను.. జపాన్‌లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోబ్‌లోని రౌకా నేషనల్ పార్క్‌లో ఉన్న నునోబికి ఫాల్స్ నుంచి రాతిశిలల ద్వారా సహజసిద్ధంగా శుద్ధి అయి కిందకు వచ్చిన నీళ్లవి. నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువల్ల అక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతిశిలల్లో నుంచి ఫిల్టర్ కావడం వల్ల మరింత స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిలోని సహజసిద్ధమైన ఖనిజ లవణాలు, స్వచ్ఛత పోకుండా కనీస ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగించి ప్యాక్ చేస్తారు. ఎంత కష్టపడి నాణ్యమైన నీటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్యాక్ చేసినా.. రంగు, రుచి, వాసన లేని నీటికి మరీ ఇంత రేటేంటి బాస్ అంటారా? ఇదే డౌట్ ఫిల్లికో కంపెనీ యజమాని క్రిస్టియన్ డయోర్కీ వచి్చంది. మనిషికి నిత్యావసరమైన నీటిని లగ్జరీ వస్తువుగా అధిక ధరకు అమ్మడం ఎలా అని ఆలోచించారు.దేవతా రెక్కలు.. కిరీటాలు..» ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ చేయడం సులభం అని డియోర్ భావించారు. దానికి తగినట్టుగా తమ బాటిల్ డిజైన్‌ను వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శాటిన్ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా బాటిల్ డిజైన్ చేయించారు. తాము విక్రయించే ధరకు అది చాలదనే భావనతో దానికి అదనపు సొబగులద్దారు. బాటిల్ మూతలను రాజు, రాణి కిరీటాలను పోలి ఉండేలా రూపొందించారు.దేవతలకు రెక్కలు ఉన్నట్టుగా బాటిల్‌కు రెండు రెక్కలు కూడా జోడించారు. అవసరమైన చోట వెండి పూత పూయించారు. లగ్జరీ బ్రాండ్ స్ఫటికాలను ఉత్పత్తి చేసే స్వరోవ్స్కీ స్ఫటికాలను బాటిల్‌పై అమర్చారు. వెరసి.. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేనంత అందమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీనికి ఫిల్లికో జ్యవెలర్ వాటర్ అని పేరు పెట్టి.. ఇది సార్ మా బ్రాండ్ అంటూ తొలుత తమ వీఐపీ కస్టమర్లకు పరిచయం చేశారు. వారి నుంచి అద్భుత స్పందన వచ్చిoది. అనంతరం ఫిల్లికో కంపెనీ 2008లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడంతో ఈ బ్రాండ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతే అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. 2005లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, బాటిళ్ల డిజైన్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేతితోనే తయారుచేస్తారు. అందువల్ల నెలకు 5వేల బాటిళ్లను మించి ఉత్పత్తి చేయరు. ఇది కూడా ఈ బ్రాండ్ డిమాండ్ కొనసాగడానికి మరో కారణం. ప్రస్తుతం ఫిల్లికో జ్యువెలరీ వాటర్ రెండో తరం నడుస్తోంది. ఈ బాటిల్ ప్రారంభ ధర వెయ్యి డాలర్లు. (దాదాపు రూ.84 వేలు). ఒక్కోసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మరింత వినూత్నమైన బాటిళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటారు. వాటి ధర ఏకంగా రూ.8.40 లక్షల వరకు కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ బాటిల్లో ఉన్న నీళ్లను కాదు.. ఆ నీళ్లున్న బాటిల్‌ను ఇంత ధర పెట్టి కొనాలన్న మాట. అయితే, దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే కష్టమే కదా? కేవలం తమ స్టేటస్ సింబల్ చాటుకోవాల్సిన సందర్భాల్లో ఓ రెండు గుటకలు వేయక తప్పదు మరి. అసలే బ్రాండ్ వాటర్.. పైగా లిమిటెడ్ ఎడిషన్స్. ఆ మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి.. కాదంటారా? – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ ‘జల’గల రాజకీయం
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ ‘జల’గల రాజకీయం చేస్తుంది. విజయనగరం జిల్లా ఎల్ కోట కళ్లెంపూడిలో బీజేపీ నేత కోన మోహనరావు నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక తమ నామినేషన్ స్వీకరించాలని డీఈ శ్రీచరణ్ కాళ్లు పట్టుకున్నారు. కాళ్లు పట్టుకున్నా నామినేషన్‌ను డీఈ శ్రీచరణ్ అనుమతించలేదు. టీడీపీ నేతలు చెప్పినట్టు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు.శనివారం విజయ నగరం జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు గందరగోళంగా సాగాయి. వైఎస్సార్సీపీ మద్దతు రైతులకు చివరి నిమిషం వరకూ నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో.. సాగునీటి సంఘాల ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించింది. కొన్ని చోట్ల కూటమి పక్షాలే ఎన్నికల్లో బాహాబాహీకి దిగాయి. జనసేన,బీజేపీ నాయకులు ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడం ఉద్రక్తితకు దారి తీసింది.ఇలా ఒక్క విజయ నగరం జిల్లా మాత్రమే కాకుండా సాగు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ప్రతి చోట టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తమ వాళ్లు తప్ప ఇతరులెవరూ పోటీ చేయకూడదని హుకుం జారీ చేస్తున్నారు. తాము చెప్పిన వాళ్లే ఎన్నికయ్యేలా చూడాలని అధికారులకు సూచిస్తున్నారు. దీంతో కూటమి నేతలు హుకుం జారీ చేయడంతో అధికారులు వారి ఆదేశాల్ని పాటిస్తున్నారు. బలవంతపు ఏకగ్రీవం చేస్తున్నారు. దీంతో కూటమి నేతలే ఎన్నికైనట్లు ప్రకటనలు చేస్తున్నారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా పోటీ చేస్తున్న రైతుల్ని వేధింపులకు గురి చేయడమే కాదు, నామినేషన్ పత్రాల్ని సైతం చించేస్తున్నారు. ఓటర్లను లోపలికి అనుమతించకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసుల ప్రతాపం చూపిస్తున్నారు. -
ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌తో హై రిస్క్: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే!
ఎన్ని హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నా, ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్న మనందరికి భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ ఒక హెచ్చరిక లాంటి వార్తను అందించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్‌ను "హై-రిస్క్ ఫుడ్" కేటగిరీలో చేర్చింది. అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటించాలని పేర్కొందిఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ ప్రకారం, కొత్త మార్గదర్శకాలకనుగుణంగా ప్రకారం, తయారీదారులు , ప్రాసెసర్లు లైసెన్స్‌లు లేదా రిజిస్ట్రేషన్లను మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలి. అక్టోబరులో, ప్యాకేజ్డ్ వాటర్‌కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మరియు మినరల్ వాటర్ తయారీ దారులందరూ ఇప్పుడు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు తప్పనిసరిగా వార్షిక, రిస్క్ ఆధారిత తనిఖీలు చేయించుకోవాలి.గతంలో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS , FSSAI రెండింటి ద్వారా ద్వంద్వ ధృవీకరణ అవసరాల తొలగించాలి డిమాండ్ చేసింది. కానీ ఈ వాదనలను తోసిపుచ్చిన సంస్థలు తప్పని సరిగా తనిఖీలు చేయించాలని, సంబంధిత ధృవీకరణ పత్రాలను పొందాలనిస్పష్టం చేశాయి. దీనికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలలో వ్యాపారం చేస్తున్నవారు, FSSAI-గుర్తింపు పొందిన మూడవ-పక్ష (థర్డ్‌పార్టీ) ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్లను పొందాల్సి ఉంటుంది.హై-రిస్క్ ఫుడ్ కేటగిరీల క్రింద వచ్చే ఇతర ఉత్పత్తులు:పాల ఉత్పత్తులు, అనలాగ్స్పౌల్ట్రీతో సహా మాంసం , మాంసం ఉత్పత్తులు,మొలస్క్లు, క్రస్టేసియన్లు , ఎచినోడెర్మ్లతో సహా చేపలు , చేప ఉత్పత్తులుగుడ్లు , గుడ్డు ఉత్పత్తులునిర్దిష్ట పోషక అవసరాల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తులుతయారుచేసిన ఆహారాలు (ప్రిపేర్డ్ ఫుడ్)భారతీయ స్వీట్లుపోషకాలు, వాటి ఉత్పత్తులు (ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే)కాగా ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం చాలా ప్రమాదమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాదు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల ఒక్కోసారి కేన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్‌ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు
గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉన్నా అడిగి మరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. తీర్థం తాగేటప్పుడు నిలబడకూడదు. కూర్చుని మాత్రమే సేవించాలి. తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలుఅన్నం తింటున్నప్పుడు అన్నాన్ని, ఆ అన్నం పెట్టువారిని తిట్టటం, దుర్భాషలాడటం చేయరాదు. ఏడుస్తూ తినడం, గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదుఒడిలో కంచం, పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనటం, గేలిచేయటం నష్టదాయకం. భోజనానంతరం ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవారికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు. -
సందడిగా తిరిగి.. నీళ్లబకెట్‌లో పడి..
ఖైరతాబాద్: రాత్రి 9 గంటలు.. ఇంట్లో కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడాదిన్నర పాప తప్పటడుగులు వేస్తూ తిరుగుతుండగా తల్లి గోరుముద్దలు పెడుతోంది. చిన్నారి సందడికి అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ పాప బెడ్రూం బాత్రూంలోని నీళ్లబకెట్‌లో పడి విగతజీవిగా మారింది. ఖైరతాబాద్ ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్ డివిజన్లోని ఐమా క్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో బి బ్లాక్ 307 ఫ్లాట్‌లో తోట సతీష్ కుమార్, రేణుక దంపతులు నివసిస్తున్నారు. ఈ ఫ్లాట్‌లో మొత్తం 12 మంది ఉంటున్నారు. సతీష్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఏడాదిన్నర వయసున్న మూడో కూతురు ఆది్వక మంగళవారంరాత్రి ఇంట్లో తల్లి పెట్టే గోరుముద్దలు తింటూ సందడి చేస్తూ, తప్పటడుగులు వేస్తూ, అటు ఇటు తిరుగుతోంది. ఈ క్రమంలో తల్లి కూడా భోజనం ముగించుకొని 9.30 గంటలకు బెడ్రూంలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకునేందుకు వెళ్లగా అటాచ్డ్ బాత్రూం తలుపు తెరిచి ఉంది. అందులో ఉన్న నీళ్లబకెట్‌లో పాప కాళ్లు పైకి కనిపించడంతో తల్లి లబోదిబోమంటూ ఏడుస్తూ బయటికి తీసింది. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని వాసవి హాస్పిటల్‌కు పాపను తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు రాత్రి 11 గంటల నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. కళ్ల ముందు ఆడుకుంటూ ఉన్న పాప అంతలోనే మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నా యి. -
శ్రీశైలం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లిరూరల్: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పెరుగుతుండటంతో గురువారం 4 రేడియల్ క్రస్ట్‌గేట్లను తెరచి 1,12,300 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,89,328 క్యూసెక్కుల వరద శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. బుధవారం నుండి గురువారం వరకు బుధవారం నుండి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలంకు 1,27,093 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంది. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగటంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి గురువారం 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2,10,149 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 20 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 1,62,000 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు మొత్తం 1,90,826 క్యూసెక్కులు దిగువకి విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ కాలువలు, ఎస్ఎల్బీసీ, వరద కాలువల ద్వారా 19,323క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో బ్యారేజి రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 21 వేల 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
అతిగా నీళ్లు తాగుతున్నారా?
నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ప్రతి సెలబ్రిటీ ప్రకావంతమైన చర్మం వెనుక సీక్రెట్ హైడ్రేషన్. మంచి ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం పుష్కలంగా నీళ్లు తాగడం అత్యంత కీలకం. నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అలానే బ్యాలెన్స్‌గా తాగడం అనేది కూడా అత్యంత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలమంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. మోతాదుకి మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో నిపుణుల మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.అధికంగా నీళ్లు తాగితే..హైపోనాట్రేమియాగా పిలిచే ఇంటాక్సికేషన్ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతలు పలుచన చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగులు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా అవి ఉబ్బుతాయి. ఇక్కడ సోడియం నరాల సిగ్నలింగ్ , కండరాల పనితీరుకి ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్. తగినంత సోడియం లేకుండా శరీరం సాధారణ సెల్యులార్ పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా బహుళ అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలానే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఎప్పడైతే అధికంగా నీరు తీసుకుంటామో దీని వల్ల రక్తం పలుచబడటానికి దారితీస్తుంది. ఫలితంగా ఎలక్ట్రోలైట్స్ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యూలర్ వాపుకి కారణమయ్యి.. మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదకరం కాదు కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్ ఎడెమా అంటారు. సెరిబ్రల్ ఎడెమా లక్షణాలు...వికారం, వాంతులుతలనొప్పులుగందరగోళంఅలసటకండరాల తిమ్మిరిమూర్చకోమా, తలనొప్పిచేతులు, పాదాలు లేదా ముఖంలో వాపు ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగడం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎంత నీరు తాగితే బెటర్..మనం ఉంటున్న వాతారవణం, శారీరక శ్రమ తదితర అంశాల ఆధారంగా నీటిని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా నిపుణులు సిఫార్సు చేసినవి..పురుషులు: రోజుకు సుమారుగా 3.7 లీటర్లు (125 ఔన్సులు) మొత్తం ద్రవాలు (నీరు, ఇతర పానీయాలు, ఆహారంతో సహా).మహిళలు: రోజుకు సుమారుగా 2.7 లీటర్లు (91 ఔన్సులు) మొత్తం ద్రవాలు.ఇంతకు మించి తీసుకుంటే ఓవర్‌హైడ్రేషన్ సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల మన శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎక్కువ చెమట పట్టే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవడం మంచిది. (చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!) -
కృష్ణాలో పెరుగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్/తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహం గంటగంటకూ పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 1,95,929 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ వద్ద ఆరు రేడియల్ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా నాగార్జున సాగర్‌కు 1,67,898 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 1,75,782 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. 1,59,070 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 2,32,110 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఇక్కడి నుంచి 2,45,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. జేఈ రాజేష్ మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 1,62,689 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రానుందన్నారు. ఈ దృష్ట్యా బ్యారేజీ వద్ద 20 గేట్లు 4 అడుగులు, 50 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. శనివారం సాయంత్రానికి 1,74,120 క్యూసెక్కులు వస్తోంది. దిగువ ప్రాజెక్ట్‌లకు 99,488 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.398 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.371 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రానికి జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. కాగా, నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,29,600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగుల వద్ద ఉంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. ఇక్కడ నుంచి కుడి కాలువకు 6,112, ఎడమ కాలువకు 6,173, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 29,597, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. కాగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి 84,297 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇందులో కేఈ మెయిన్‌కు 4,028, కేడబ్ల్యూ మెయిన్‌కు 2,519, డెల్టాలోని కాలువలకు 6,547 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు. -
అదృష్టవంతురాలంటే ఈమెనే..
విధి మనిషిని నడిపిస్తుందని అంటుంటారు. విధి చేతిలోనే మనిషి జీవితం ఉందని కూడా అంటారు. దీనిని రుజువు చేసే ఉదాహరణలు మనకు తరచూ ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూసిన వారంతా కంగుతింటున్నారు.పైగా ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళను అత్యంత అదృష్టవంతురాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతుండగా పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పైనుంచి ఒక పెద్ద సింటెక్స్ వాటర్ ట్యాంక్ నేరుగా ఆ మహిళ పైన పడుతుంది. దీనిని చూసిన వెంటనే ఎవరైనా సరే ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఉంటుందని అనుకుంటారు. అయితే కొద్ది సేపటికి ఆ మహిళ ట్యాంక్ మధ్య నుంచి లేచి నిలబడుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, జరిగిన ప్రమాదాన్ని గమనించి, ఆ మహిళతో మాట్లాడతాడు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq— Hemant Batra (@hemantbatra0) October 13, 2024ఇది కూడా చదవండి: హైదరాబాద్: వేడుకగా రావణ దహనం -
సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు
రబాత్: ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈత చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి, అరుదైన దృశ్యాలను మన కళ్లముందు ఉంచాయి.ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తాయి. అయితే సెప్టెంబరులో ఈ ప్రాంతంలో వార్షిక సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో ప్రభుత్వం తెలిపింది. రాజధాని రబాత్‌కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగౌనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మి.మీ. కంటే అధిక వర్షపాతం నమోదైంది.విషయం తెలుసుకున్న పర్యాటకులు ఈ ఎడారి ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడి ఈత చెట్ల మధ్య ఏర్పడిన నీటి మడుగులను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ వారు చెబుతున్నారు. గడచిన 50 సంవత్సరాలలో మొదటిసారిగా, ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన హుస్సేన్ యూఅబెబ్ తెలిపారు.ఈ ప్రాంతంలో వరుసగా ఆరేళ్ల పాటు కరువు తాండవించింది. దీంతో రైతులు తమకున్న కాస్త పొలాలను బీడుగా వదిలివేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు ఎడారి దిగువన ఉన్న భూగర్భజలాల నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా అల్జీరియాలో 20 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సహాయ నిధులను విడుదల చేయాల్సి వచ్చింది. జగోరా- టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ఇరికి సరస్సు నీటితో నిండుగా ఉండటాన్ని నాసా ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..! -
‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజీ సామర్థ్యం 72.77 టీఎంసీలు.. డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందన్నది రాష్ట్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వే చేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలో 548 జలాశయాలలో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది. 45 ఏళ్లలో కొండలా పూడిక కృష్ణానదిపై నంద్యాల జిల్లాలో శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు.. సాగు, తాగునీటి అవసరాలకు ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని తేల్చింది. జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే..శ్రీశైలం జలాశయంపై తెలంగాణలో ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం.. లైవ్ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ ఎత్తున వ్యయంతో కూడిన పని.. పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదీ శ్రీశైలం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం👉తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976👉 కనీస నీటిమట్టం: 854 అడుగులు👉 గరిష్ట నీటిమట్టం: 885 అడుగులు👉 క్యాచ్మెంట్ ఏరియా: 60,350 చదరపు కిలోమీటర్లు👉 గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం: 615.18 చదరపు కిలోమీటర్లు -
సహారాలో పచ్చందనం
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...! వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది. భారీ వర్షాలు సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్గా పిలుస్తారు. ఈ సీజన్లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 21 వేల ఏళ్లకోసారి... సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు
ఢాకా: సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చించనుంది. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్- బంగ్లాదేశ్ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. అయితే నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.బంగ్లాదేశ్ జలవనరుల సలహాదారు సైదా రిజ్వానా హసన్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చలు జరుపుతుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాతే చర్చలు జరుపుతామన్నారు. అంతర్జాతీయ నదుల నీటిని పంచుకోవడం సంక్లిష్టమైన సమస్య అని, అయితే దీనిలో రాజకీయాలకు తావు ఉండకూడదని రిజ్వానా పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలపై ఏ దేశం కూడా ఏకపక్షంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లదని, బదులుగా రెండు దేశాలూ వెళ్లాలని అన్నారు.భారత్‌తో వర్షపాతం డేటాను పంచుకోవడం మానవతా చర్య అని రిజ్వానా పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ఈ డేటా ఉపకరిస్తుందన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వాదనలు స్పష్టంగా, బలంగా ఉన్నాయన్నారు. దేశంలోని అంతర్గత నదులను సమిష్టిగా రక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాగా ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌తో విభేదాలను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి -
పట్నాకు గంగ ముప్పు.. పాఠశాలలు మూసివేత
పట్నా: బీహార్‌లోని పట్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 76 ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ఈ పాఠశాలలు సెప్టెంబర్ 26 వరకు మూసివేయనున్నారు. పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గంగా నది చాలా చోట్ల ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు.జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల సమయానికి పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయి (48.60 మీటర్లు) దాటి ప్రవహిస్తోంది. అలాగే హతిదా, దిఘా ఘాట్ల వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో డిఎండి అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసీఎస్) ప్రత్యయ అమృత్ 12 జిల్లాల అధికారులతో ఆన్లైన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గంగానది నీటిమట్టం పెరిగితే అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.గంగా నది ఒడ్డున ఉన్న దాదాపు 12 జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 13.56 లక్షల మంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, పట్నా, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్, ఖగారియా, భాగల్పూర్, కతిహార్ తదితర 12 జిల్లాలకు చెందిన ప్రజలను ప్రత్యేక సహాయ శిబిరాలకు తరలించారు.ఇది కూడా చదవండి: వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి.. -
నీటిపైనే ల్యాండ్ అవుతుంది.. బోట్ కాదు - ఇదొక ఫ్లైట్ (ఫోటోలు)
-
ఆశలు సమాధి చేసి..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్ఆర్పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్‌నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్‌ఆర్‌పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్‌నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు. వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదురామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న పాతరాజీవ్నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్‌నగర్‌లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్‌పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. -
చిరుద్యోగులపై సర్కార్ పగ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల్లో పనిచేసే చిరుద్యోగులపై పలు జిల్లాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జులుం చూపిస్తున్నారు. 15–20 ఏళ్లగా పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానంలో తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ లాగిన్స్ కలిగి ఉండటంతో పాటు ల్యాబ్ ట్రైనింగ్ పొంది ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పనిచేస్తున్న తమను తొలగించడానికి వీలు లేదని ఆ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈమేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు మెమో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక కొంత మంది అధికారులు కొన్ని జిల్లాల్లో సిబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో 111 వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉండగా.. వాటిలో ఔట్సోర్సింగ్ విధానంలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వారికి ఉండే కనీస ప్రభుత్వ సౌకర్యాలు కూడా మొదట్లో ఆయా ల్యాబొరేటరీస్‌లో పనిచేసే వారికి వర్తించేవి కావు. అయితే గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి వారికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించారు. ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఆయా ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి్పడి చేసే ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వంలో మొదలవగా, ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆరి్థక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 15–20 ఏళ్లుగా ఉన్న తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడడంపై రాష్ట్రవ్యాప్తంగా వారు ఆందోళన బాట పట్టారు. పవన్ ఇంటి ముందు ప్రదర్శన.. ఉద్యోగుల తొలగింపునకు అధికార కూటమి పార్టీ ల ఎమ్మెల్యేల రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ నివాసం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వచి్చన ఉద్యోగులు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కలి్పంచాలి, మినిమం టైం స్కేలు వర్తింపజేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పవన్‌కళ్యాణ్ తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.. సమస్యను పవన్, అధికారుల దృష్టికి తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అక్కడ నుంచి వెనుతిరిగారు. గత ఐదేళ్లూ నీటి శుద్ధి పరీక్షల్లో ఏపీనే టాప్..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో కలుíÙతాలు గుర్తిస్తే తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మన రాష్ట్రం గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే టాప్‌గా నిలిచింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం ముందు, తర్వాత స్థానిక పంచాయతీ సిబ్బంది లేదంటే శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో నీటి నమూనాలు సేకరించి వాటిని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ల్యాబొరేటరీల్లో పరీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలో ఉండే తాగునీటి వనరులకు సైతం 97 శాతం పైబడి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. నీటి నాణ్యత పరీక్షల్లో గత ఆరి్థక ఏడాదిలో మన రాష్ట్రంలో 25,546 చోట్ల కలుíÙత నీటిని గుర్తించగా, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. -
ప్రభుత్వ సాయం అందలేదని బాధితుల ధర్నా
భవానీపురం (విజయవాడపశ్చిమ): బుడమేరు వరద ముంపునకు గురైన తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదని కృష్ణానదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గురువారం రాత్రి రోడ్డు మీదకు ధర్నా చేశారు. వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన తమ ఇళ్లలోని వస్తువులను వదిలేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడా తల దాచుకుంటున్న తాము గత నాలుగు రోజుల నుంచి తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరక్క నానా అవస్థలు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులందరికీ సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ బాధితులకు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించడంతో వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న మరో ఇద్దరు పోలీసులు అతన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. బాధితుల్లో కొందరు భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ ఉన్నవారు ‘మీ ప్రాంతం రెడ్ జోన్లో లేదు’ అని చెప్పటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు ధర్నా చేస్తున్నారని తెలిసి విజయవాడ పశ్చిమ తహసీల్దార్ వచ్చి బాధితులతో మాట్లాడారు. రెడ్ జోన్ విషయంపై ఆయన్ని నిలదీయగా.. అటువంటిదేమీ లేదని, అయితే ఈ ప్రాంతం జాబితాలో లేకపోవడంతో సమస్య ఏర్పడిందని సముదాయించారు. ఉదయమే వచ్చి నష్టపోయిన వారి జాబితా సిద్ధం చేసి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మా కోసం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఇళ్లు మునిగిపోయి.. ఆహారం, మందులు, విద్యుత్ లేక పిల్లలతో, వృద్ధులతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు’ అని విజయవాడలోని ముంపు ప్రాంతాల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు మునిగిపోయి తాము ఏడుస్తుంటే.. సీఎం చంద్రబాబు పడవలో అటూ, ఇటూ తిరుగుతూ చేతులూపుకుంటూ వెళ్లిపోతున్నారని వాపోయారు. తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలోని కుమ్మరిపాలెం సమీపంలో ఉన్న లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నీట మునిగింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నారు. 193 కుటుంబాలు ఉంటున్న తమ అపార్ట్మెంట్ నీటిలో చిక్కుకుంటే.. ప్రభుత్వం గాలికి వదిలేసిందని గోనుగుండ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాగునీరు, విద్యుత్ లేదని వాపోయారు. తమ క్షేమ సమాచారం బయటి ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెబుదామన్నా, సెల్ఫోన్లు పని చేయక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గణేశ్ అనే బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం పట్టించుకోలేదని.. పడవ వాళ్లకు చెప్పి బయటి నుంచి 400 ఆహార పొట్లాలు తెప్పించుకుంటుంటే దారిలోనే పోలీసులు అడ్డుకున్నారని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. హృద్రోగంతో బాధ పడుతున్నానని, మందుల కోసం పడవ వాళ్లను అడిగితే రూ.వెయ్యి అడుగుతున్నారని నాగేశ్వరమ్మ వాపోయింది. న్యూ ఆర్ఆర్లో వరదలో చిక్కుకున్న తమను ఒడ్డుకు చేర్చాలని ప్రభుత్వ బోట్ల వాళ్లను అడిగితే మనిషికి రూ.వెయ్యి అడుగుతున్నారని ఎ.రవికుమార్ వాపోయాడు. పాత ఆర్‌ఆర్‌పేటలోని జేపీ అపార్ట్మెంట్లో 300 కుటుంబాలకు పైగా ఉంటున్నాయని, తాగు నీరు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఎకో విలేజ్‌లో కలుషిత నీరు.. 200 మంది అస్వస్థత
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఎకో విలేజ్- 2 సొసైటీలో కలుషిత నీరు తాగి, 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారు. అధికారులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడాలోని ఎకో విలేజ్- 2లో రెండు రోజుల క్రితం ట్యాంక్‌ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఆ తరువాత ఈ ట్యాంకు నీటిని తాగిన 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఉదంతం గురించి సొసైటీలో ఉంటున్న వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌ను రసాయనాలతో శుభ్రం చేశారని, అయితే వాటర్ ట్యాంక్‌లో ఇంకా రసాయనం మిగిలి ఉందని, దాని కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తాము బయటి నుంచి నీరు తెచ్చుకుని వినియోగించుకుంటున్నామన్నారు. -
నేనున్నానంటూ వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
అమరావతి.. అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి/తాడేపల్లి/తాడికొండ: భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైకోర్టు, సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవహించింది. ఇతర ప్రభుత్వ భవనాలు సైతం జలమయమయ్యాయి. రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. సీడ్ యాకిŠస్స్ రోడ్డుపైన వరద నీరు భారీగా ప్రవహించింది. రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు సైతం నీటమునిగాయి. రహదారులు నీటితో నిండిపోయి నదుల్ని తలపిస్తుండటంతో రాజధాని ప్రాంతానికి రెండు రోజులుగా ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉధృత రూపం దాలి్చన కొండవీటి వాగు.. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోని ఉండవల్లి అవుట్‌పాల్ స్లూయిజ్‌ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఈ వాగు రాజధాని ప్రాంతంలో 31.15 కి.మీల పొడవునా ప్రవహిస్తోంది. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కొండవీటి వాగును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వాగు కట్టలను బలోపేతం చేసి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.కాని ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడంతో కొండవీటి వాగు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తుళ్లూరు మండలంలోని కోటేళ్లవాగు, అయ్యన్నవాగు, నక్కవాగు, పాలవాగుల ద్వారా వచ్చే వరద ఉధృతి కూడా కొండవీటి వాగులో ప్రవహించాల్సిన పరిస్థితి రావడంతో రాజధానికి నీటి గండం తప్పడం లేదు. ముంపు ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు కమిటీలు మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. పైగా ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతులను భయపెట్టి, బెదిరించి సేకరించారు. ఇలా నిరి్మంచిన రాజధాని నిర్మాణాలు ఇప్పుడు రెండు రోజులపాటు కురిసిన వర్షాలకే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సారపాక వాగు కల్లోలంకృష్ణా నది వరద నీరు రాజధాని ప్రాంతంలోని సారపాక వాగులోకి ప్రవహిస్తుండడంతో కలకలం రేగింది. వరద నీరు సారపాక వాగు గుండా బయటకుపోయేందుకు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గతంలో పైపులైను వేశారు. ఆదివారం అందులో నుంచి రాజధాని గ్రామాల్లోకి నీరు రావడాన్ని స్థానికులు గమనించి ఆపేందుకు ప్రయతి్నంచారు. అయినా కుదరకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే రాకపోవడంతో గ్రావెల్, ఇసుక, బూడిదను తీసుకువచ్చి తూముల వద్ద వేయడంతో ప్రవాహం కొంచెం ఆగింది. స్థానికులు దీన్ని గుర్తించకపోతే వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాలు ముంపునకు గురయ్యేవి.కొట్టుకుపోయిన కొండవీటి వాగు గేట్లుసాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు కృష్ణా నదిలో కలిసేచోట ఉన్న గేట్లలో రెండు గేట్లు ఆదివారం రాత్రి కొట్టుకుపోయినట్టు సమాచారం. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటి వాగు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద 17.5 అడుగుల నీటిమట్టం వస్తేనే తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కాగా.. కృష్ణా నదిలో భారీగా వస్తున్న వరద నీరు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సంపులో చేరడం.. వాగుకు పైనుంచి వచ్చే వరద నీరు సంపు వరకు రాకపోవడంతో గంటగంటకు కొండవీటి నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి గుహల వద్ద కొండవీటి వాగు 8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండగా.. రాత్రికి 11 అడుగులకు చేరింది.మరో రెండు అడుగులు పెరిగితే ఉండవల్లిలో కొంత భాగం, పెనుమాకలో పంట పొలాలు, టిడ్కో నివాసాలు మునిగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద సిబ్బందితో సమీక్షిస్తున్నారు.కృష్ణా నది నుంచి కొండవీటి వాగులోకి నీరు రాకుండా ఇసుక బస్తాలు వేయించడంతోపాటు ఎత్తిపోతల పథకం వద్ద నీటి సంపులో పేరుకుపోయిన తూటికాడను తొలగించే పనులు చేపట్టారు.రైతు కష్టం ‘కృష్ణా’ర్పణంసాక్షి, అమరావతి: రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కృష్ణా నదీపరివాహాక ప్రాంతంలో మాగాణి, మెట్ట అనే తేడా లేకుండా వాణిజ్య, ఆహారపంటలు దెబ్బతిన్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంటఆదివారం సాయంత్రానికి అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం 2.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 50వేలకు పైగా ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా 2.30 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. ఆ తర్వాత 40 వేల ఎకరాల్లో పత్తి, 12వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా 2.30 లక్షల ఎకరాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఆ తర్వాత గోదావరి డెల్టా పరిధిలో 25వేల ఎకరాలు, ఉత్తరాంధ్రలో 1500 ఎకరాల్లో పంటలు మునిగినట్టు లెక్కతేల్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 20వేల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 15వేల ఎకరాలు, నంద్యాలలో 10వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన పంట పొలాల్లో 60 నుంచి 70 శాతం పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30–40శాతం పంటలు ముంపు నుంచి తేరుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
పోటెత్తిన కృష్ణమ్మ
విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద దిగువకు ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సాగర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం 10 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,06,242 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,063 క్యూసెక్కులు కలిపి 4,74,205 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 4,20,280 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,97,524 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 12,261 క్యూసెక్కులు కలిపి దిగువ కృష్ణాలోకి 5,09,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లాంచీలు నిలిపివేతఎగువ నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నాగార్జున కొండకు వెళ్లే లాంచీలను శని, ఆదివారాలు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వరద ఉధృతి తగ్గి, గాలులు తగ్గితే లాంచీలను నడుపుతామని, పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీలను నిలిపి వేసినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.పులిచింతలకు భారీగా వరద నీరుఎగువ నుంచి 6,36,945 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 6.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 24 క్రస్ట్ గేట్లు ఉండగా 21 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 5,69,744 క్యూసెక్కులను దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏడీఈ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెయిల్ పాండ్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా ఆదివారం విడుదల చేసిన 5,69,744 క్యూసెక్కుల వరద నీరే అత్యధికం. నీటిమట్టం 73.55 మీటర్లకు చేరుకోవడంతో టెయిల్ పాండ్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేతరెండో ప్రమాద హెచ్చరిక జారీతాడేపల్లి రూరల్/అమరావతి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి 11 గంటలకు 10,25,776 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మొత్తం గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని గెస్ట్హౌస్లలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎక్స్క్లూయిస్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో మత్స్యకారులు తమ పడవలను రేవుపై వరద నీటిలోనే భద్రపర్చుకున్నారు. దిగువ ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతి పెరగడంతో మత్స్యకారులు తమ పడవలను పుష్కరఘాట్లపైనే వదిలేశారు. మహానాడు మసీదు రోడ్డులో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఇన్చార్జి తహశీల్దార్ సతీష్‌కుమార్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ.. గుండిమెడ నుంచి కృష్ణా నది కరకట్టవైపు ప్రయాణించడంతో పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది. వరద ఉధృతి పెరిగితే ప్రాతూరు, గుండిమెడ పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది లంక పొలాల్లో పశువుల కాపరులు తమ పశువులను బయటకు తీసుకువచ్చారు. మంగళగిరి మండలం రామచంద్రాపురం, దుగ్గిరాల మండల పరిధిలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు తదితర ప్రాంతాల్లో కృష్ణా నది పొంగిపొర్లడంతో కరకట్ట లోపల వున్న పంట పొలాలు మునిగిపోయాయి. పుట్టలమ్మ తల్లి ఆలయం చుట్టూ వరద నీరు చేరడంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. -
నిలువెత్తు నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: భారీ వర్షాల వల్ల ముంపు ముప్పు పొంచి ఉందని ముందే తెలిసినా అలసత్వంతో వ్యవహరించి లక్షలాది మందిని నిరాశ్రయులుగా మిగిల్చింది! సర్కారు నిర్లక్ష్యం బెజవాడకు పెనుశాపంగా మారింది. భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందు నుంచే వాతావరణ శాఖ, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. భారీ వర్షాలు, వరద నిర్వహణపై ప్రణాళిక, అవగాహన లేకపోవడం, అలసత్వం కారణంగా విజయవాడ నగరవాసులు ముంపులో చిక్కుకుపోయారు. వరద పోటెత్తిన తర్వాత సీఎం చంద్రబాబు హడావుడి చర్యలకు దిగారు.ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వానికి పలు రకాల మెసేజ్‌లు పంపింది. వాతావరణ సమాచారాన్ని ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ముందుండే ఏపీ వెదర్‌మ్యాన్ ప్రణీత్ ఆగస్టు 28వ తేదీ నుంచి ఎక్స్ మాధ్యమం ద్వారా పదేపదే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవ్వాలని, అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూనే ఉన్నారు.గత 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ఓ వినతిపత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో అందులో వివరంగా పేర్కొన్నారు. అయినాసరే పట్టించుకునే నాథుడే లేకపోవడంతో రికార్డు స్థాయి వర్షానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ముంపునకు గురయ్యాయి. మూడు లక్షల ఎకరాల్లోపంట పొలాలు దెబ్బతిన్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి బుడమేరు ఉప్పొంగి బెజవాడలోని అనేక ప్రాంతాలను ముంచేసింది.పీకల మీదకు వచ్చాక..కనీస హెచ్చరికలు లేకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి వేయడంతో బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం, జి.కొండూరు మీదుగా కౌలూరు హెడ్ రెగ్యులేటర్ వరకూ వస్తుంది. అక్కడ గేట్లు ఎత్తితే విజయవాడ రూరల్ మండలం, విజయవాడ నగరంలోని సింగ్‌నగర్ పరిసరాలన్నీ మునిగిపోతాయి. ఈ విషయం తెలిసి కూడా శనివారం రాత్రి 7.30 గంటలకు గేట్లు ఎత్తివేశారు. దీనికితోడు వెల్లటూరు వద్ద పటమట చెరువుతోపాటు దానిపైనున్న పలు చెరువులకు గండ్లు పడ్డాయి.దీంతో వరద అంతా బుడమేరులోకి రావడంతో కట్ట తెగిపోయింది. బుడమేరు వరద నీరు పోలవరం కాలువ మీదుగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలవాలి. కానీ పోలవరం కాలువకు పలుచోట్ల గండ్లు పడడంతో ఆ వరదంతా విజయవాడవైపే వస్తోంది. బుడమేరు వరద హెడ్‌రెగ్యులేటర్ వద్ద 11 అడుగుల మేర నిలిచిపోయే దాకా అధికార యంత్రాంగం కళ్లు తెరవలేదు. పీకల మీదకు వచ్చాక ఎటువంటి హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తేశారు. దీంతో శనివారం రాత్రి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. మరోవైపు కొండవీటివాగు పొంగి రాజధాని గ్రామాల్లోకి నీరు చేరింది. చివరికి హైకోర్టు కూడా ముంపు బారినపడింది. సెక్రటేరియేట్, అసెంబ్లీ కూడా జలమయంగా మారాయి. కృష్ణా డెల్టా పరిధిలో లక్షల ఎకరాలు మునిగిపోయాయి. హడావుడే.. కానరాని సన్నద్ధత వర్షాలపై హెచ్చరికలు పట్టించుకోకుండా సీఎంతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు వీకెండ్ విశ్రాంతిలో ఉండిపోయారు. ముందస్తు సన్నద్ధత లేకపోగా, వర్షాలు తీవ్రంగా కురుస్తున్నా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, జిల్లాలను అప్రమత్తం చేయలేదు. ఎప్పటిమాదిరిగానే ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారులంతా చాలామంది శుక్రవారమే హైదరాబాద్ వెళ్లిపోయారు. వర్షాలు దంచి కొట్టడంతో సాయంత్రానికి పరిస్థితి తీవ్రత గమనించి అప్పుడు హడావుడిగా సమీక్ష నిర్వహించారు. రెండు గంటలకు ఒకసారి తనకు రిపోర్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.సీసీఎల్ఏ నేతృత్వంలో ఉన్నతాధికారులతో రాత్రి 8 గంటల తర్వాత ఒక కమిటీని నియమించారు. అయితే అప్పటికి వారిలో చాలామంది అధికారులు అందుబాటులో లేరు. తీవ్రత తెలిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి తూతూమంత్రంగా సమీక్ష చేశారు. మరోవైపు చంద్రబాబు నివేదికలు, సమీక్షలతో కాలం గడిపారు. ఇదంతా జరుగుతుండగానే ఎటువంటి హెచ్చరికలు లేకుండా అధికారులు బుడమేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేశారు.ఫలితంగా తెల్లారేసరికి విజయవాడ ముంపునకు గురైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (వాతావరణ శాఖ) మూడు రోజుల క్రితమే హెచ్చరించింది. మరోవైపు ఎగువ నుంచి కృష్ణాతో పాటు మూసీ, మున్నేరు, బుడమేరు, కట్టలేరు, నాలేరు, రామిలేరుల నుంచి భారీ వరద ప్రభావం ముంచెత్తుతుందని సీడబ్ల్యూసీ కూడా అప్రమత్తం చేసింది. అయినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.మునిగాక బోట్లు తెప్పిస్తారా?అనంతరం సమీక్షల పేరుతో అధికారులను పని చేయనివ్వకుండా సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి సంబంధం లేని మాటలతో అధికారులకు విసుగు తెప్పించారు. ఆ తర్వాత ముంపునకు గురైన విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి వెళ్లి రాత్రంతా అక్కడే ఉంటానని, బోట్లు తెప్పిస్తానని, హెలికాఫ్టర్లు రప్పిస్తానని చెప్పారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మునిగిపోయాక వచ్చి పడవలు తెప్పిస్తాననడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నిర్వహణపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరించి తర్వాత తాపీగా తప్పు గత సర్కారుదేనని చంద్రబాబు బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.వీటికి జవాబేది బాబూ?1 ఐఎండీ, సీడబ్ల్యూసీ హెచ్చరికలను ఎందుకు బేఖాతర్ చేశారు?2 ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ఇంత అలసత్వం ఎందుకు?3 బుడమేరు గేట్లు ఎత్తేముందు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు?4 సాక్షాత్తూ మీ ఇంట్లోకే వరద పోటెత్తితే కార్యాలయాల్లో తలదాచుకోవడం నిజం కాదా? 5 వరద బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం అందకపోవటానికి మీ వైఫల్యం కారణం కాదా?6 విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని పని చేయనివ్వకుండా మీ చుట్టూ తిప్పుకోవడం సబబేనా? -
లక్షల మందిని తరలించలేం
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్‌నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్‌నగర్‌లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్‌షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారు. సీనియర్ ఐఏఎస్‌లను విజయవాడకు రప్పించాప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్‌నగర్ 16 డివిజన్లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇంత వర్షం.. అసాధారణంరాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. -
అక్రమ నివాస ఫలితం.. చంద్రబాబూ వరద బాధితుడే
సాక్షి, అమరావతి: భారీ వర్షాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ సౌధాన్ని వరద ముంచెత్తింది. దీంతో చంద్రబాబు కూడా వరద బాధితుడిగా మారారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) గత నెల 28నే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించాల్సిన చంద్రబాబు తన కర్తవ్యాన్ని విస్మరించారు. ఫలితంగా తాను విజనరీనని చెప్పుకునే సీఎం చంద్రబాబు స్వయంగా వరద కోరల్లో చిక్కుకున్నారని అధికారవర్గాలే చెబుతున్నాయి.ఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని.. రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. విజయవాడ నగరానికి, లక్షలాది మంది ప్రజలకు వరద ముప్పును తప్పించడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే విజయవాడలో ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచే సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్తవ్యం మరిచి.. విద్యుక్త ధర్మం విస్మరించి.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి గరిష్ట వరద ప్రవాహం వస్తుందని తెలిసినా చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేయలేదు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉన్న అక్రమ సౌధంసహా 35 బంగ్లాలను వరద చుట్టుముట్టింది. ఇందులో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ గెస్ట్ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది.సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా జలవనరుల అధికారులు విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. వరద జలాలు చుట్టుముట్టడంతో ఆ సౌధంలో నివాసం ఉండటం ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రికి కృష్ణాలో ప్రవాహం 10.50 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని, అప్పుడు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని తేలి్చచెప్పారు. దాంతో విధి లేని పరిస్థితుల్లో ఆదివారం రాత్రి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం చంద్రబాబు తన మకాం మార్చారు. నాడు ముంచేశారని.. నేడు తానే మునిగి.. కృష్ణా నదికి 2019లో ఆగస్టు 14 నుంచి 17 వరకూ భారీ వరదలు వచ్చాయి. అప్పుడు కూడా చంద్రబాబు నివాసంతోపాటూ 35 అక్రమ బంగ్లాలు నీట మునిగాయి. 2020, 2021, 2022లోనూ ఇదే జరిగింది. కానీ.. ఇప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఐఎండీ హెచ్చరికలను పట్టించుకోలేదు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఫలితంగా తానే వరద బాధితుడిగా చంద్రబాబు మారారు. అప్పట్లో తన నివాసాన్ని ముంచడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు ముంపు ముప్పును తప్పించుకోలేకపోయారని అధికారవర్గాలే ప్రశి్నస్తున్నాయి.చరిత్రలో మూడో అతి పెద్ద ప్రవాహం.. కృష్ణా నదిపై సర్ ఆర్ధర్ కాటన్ తొలుత ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు 1903, అక్టోబర్ 7న గరిష్ఠంగా 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచి్చంది. ఆ తర్వాత 2009, అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజ్‌లోకి 11,10,404 క్యూసెక్కుల వరద ప్రవాహం వచి్చంది. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే.. కృష్ణా నది చరిత్రలో ఇప్పుడొచ్చిన ప్రవాహం మూడో గరిష్ఠ వరద ప్రవాహంగా రికార్డుల్లోకి ఎక్కనుంది. -
సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. రాత్రి బస చేస్తే ప్రమాదమే
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. సిబ్బంది మోటార్లతో వరద నీటిని తోడుతున్నారు. సీఎం నివాసం వైపు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇల్లు నీటమునిగింది.కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో ఆయన ఇంట్లోకి వరద నీరు పోటెత్తింది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. కరకట్టపై అక్రమంగా కట్టిన చంద్రబాబు ఇల్లు మునకవైయస్ జగన్ గారి హయాంలో ప్రకాశం బ్యారేజ్‌లోని ఒక గేటుకి బోటు అడ్డంపడితే.. మా ఇంటిని ముంచేందుకు కుట్ర అంటూ అప్పట్లో చంద్రబాబు, నారా లోకేష్ గగ్గోలు ఇప్పుడు చంద్రబాబు ఇంటి ప్రాంగణంలోకి చేరిన వరద నీరు.. మరి ఇప్పుడు ఎవరు కుట్ర… https://t.co/qruHOMsQbk pic.twitter.com/tkH6rRhfav— YSR Congress Party (@YSRCParty) September 1, 2024చంద్రబాబు ఇంటికి వరద ముప్పు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి పెరిగింది. 9.17 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో రాత్రికి వరద ఉదృతం కానుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని, ఈ రాత్రికి ఇంట్లో బస చేస్తే ప్రమాదం ఉందని భావించిన అధికారులు..ప్రత్యామ్నాయ బస ఏర్పాట్లు చేస్తే మంచిదని సూచించారు. ఈరోజు రాత్రికి కలెక్టరేట్లో ఉంటే బావుంటుందని సలహా ఇస్తున్నారు.రాష్ట్ర చరిత్రలో రెండోసారిరాష్ట్ర చరిత్రలో 9.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రెండవ అతి పెద్ద వరదగా నమోదైంది. ఆ రికార్డును కొద్దిగంటల్లో అధిగమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 24 గంటల్లో 6 లక్షలు క్యూసెక్కులు వరద పెరిగింది. 2009లో అత్యధికంగా 11 లక్షలు క్యూసెక్కుల వరద నమోదు కాగా..గంట గంటకు పెరుగుతున్న వరదతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది -
అన్నదాతలకు వాయు‘గండం’..
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. -
రంగుమారిన ఎస్సారెస్పీ నీరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోని నీరు ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అంతేకాక ఈ నీరు దుర్వాసన వస్తోంది. ఇదే నీటిని ఆయకట్టుకు కాలువల ద్వారా సరఫరా చేస్తున్నారు. పంట భూముల్లోకి చేరిన నీటి దుర్వాసనను భరించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ నీటి వల్ల పంటలకు తెగుళ్లు వ్యాపిస్తాయని అంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో పాటు వ్యర్థాలు కొట్టుకు రావడంతో ఏటా ప్రాజెక్ట్‌లో నీరు రంగు మారుతోంది. గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ప్రాజెక్ట్‌లో నీరు రంగు మారింది. ఎందుకు రంగు మారుతోంది.. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని ధర్మాబాద్ వద్ద గల పలు కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను వరదలు వచ్చిన సమయంలో గోదావరిలోకి ఎక్కువగా వదులుతున్నారు. ఈ కారణంగానే నది నీరు కలుíÙతమవుతోందని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కెమికల్ ఫ్యాక్టరీలను కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక అధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు 231 క్యూసెక్కుల నీటిని వదులుతారు. అలాగే ప్రాజెక్ట్‌లో చేపల వేటపై సుమారు ఐదు వేల మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నీరు కలుషితం కావడం వల్ల ప్రాజెక్ట్‌లో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు రంగు మారడంపై వెంటనే విచారణ చేపట్టాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు. కలుషితం కాలేదని నివేదిక వచ్చింది గత ఏడాది ఇలానే నీరు రంగు మారడంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రాజెక్టును సందర్శించారు. నీటి శాంపిళ్లను సంగారెడ్డిలోని ల్యాబ్‌కు పంపించాం. అయితే ఎలాంటి కాలుష్యం లేదని నివేదిక వచ్చి0ది. ఇప్పుడు కూడా నీరు రంగు మారింది. ఎందుకు మారుతోందో తెలియడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం.– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్‌లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్‌గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్‌కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్‌లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్‌గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
చందమామపై నీటి జాడలు!
బీజింగ్: చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా? అంటే నిజమేనని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించగా, జలం జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) వెల్లడించింది. చైనా 2020లో ప్రయోగించిన చాంగే–5 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చింది. దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి చేర్చింది. వీటిపై చైనా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నమూనాల్లో భారీ స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్–1 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. -
నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?
డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌ని నీరు వర్సెస్ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్ల నుంచి డెజర్ట్‌ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. నీటిలో నానబెడితే..నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్ డైట్ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. పాలల్లో నానబెడితే..పాలల్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే..జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్‌ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
యూపీలో వరదలు.. 500 ఇళ్లలోకి సరయూ నీరు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నది వరదల కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు వరదల బారిన పడ్డారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.వరద బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. బారాబంకి డీఎం సత్యేంద్ర కుమార్, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు మూడు రోజులుగా సరయూ నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే 20 సెంటీమీటర్ల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15 గ్రామాల్లోని 500 ఇళ్లలోకి నీరు చేరిందని డీఎం పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు చెందిన వారు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో అధికారులు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. -
అడగకుండా నీళ్లు తాగాడని..
మియాపూర్: తమను అడగకుండా నీళ్లు తీసుకున్నాడని టీ స్టాల్లో పనిచేసే ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన చాకలి సాయిలు (35)కు భార్య మీనా ఇద్దరు కుమారులు మహి, కిరణ్ ఉన్నారు. బీరంగూడలో ఉంటూ మియాపూర్‌లోని లారీలలో ఇసుకను ఖాళీ చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిలు ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు మియాపూర్ వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేసి ఉదయం ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటలకు పనికి వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున దాహం వేస్తోందని మియాపూర్‌లోని రాజారామ్ కాలనీ సమీపంలో ఉన్న సురక్ష టీ స్టాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగుతుండగా టీ స్టాల్లో పని చేస్తున్న సతీష్ అనే యువకుడు సాయిలుతో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సాయిలు అక్కడి నుంచి సమీపంలో ఉన్న కూలీల అడ్డా వద్దకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత టీ స్టాల్లో పనిచేసే సతీష్ పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. స్నేహితులకు ఫోన్ చేసి.. రప్పించి.. సతీష్ ఆగ్రహంతో సమీపంలో ఉన్న స్నేహితులు భాను, లక్ష్మణ్ అలియాస్ లక్కీలకు ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురూ కలిసి సాయిలుపై దాడికి దిగారు. సమీపంలోని కూలీలు విడిపిస్తున్నా వినకుండా తీవ్రంగా కొట్టి సాయిలును స్కూటీపై తీసుకుని టీ స్టాల్ వద్ద పడేసి వెళ్లిపోయారు. స్థానికులు, కూలీలు చూసేసరికి సాయిలు మృతిచెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువు నాగారం సాయిలు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాయిలు హత్యకు గురయ్యారడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కూలీలు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘పట్టిసీమ’ పైప్‌లైన్ లీక్
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ లీకై 20 అడుగుల మేర నీరు ఎగసిపడింది. సమీపంలోని పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. యథావిధిగా శుక్రవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి కుడి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే మార్గమధ్యంలో చీకడోడిమెట్ట ప్రాంతంలో భారీగా నీరు లీకై పొలాల్లోకి చేరుతోంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టిసీమ ఇంజనీరింగ్ అధికారులు మోటార్లను నిలిపివేసి పైప్‌లైన్ పరిస్థితిని పరిశీలించారు. చీకడోడిమెట్ట ప్రాంతంలో ఎయిర్ వాల్ ప్లేట్ లేకపోవడంతో నీరు ఎగసిపడినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం నీటి విడుదలను పునరుద్ధరించారు. గతంలో పైప్‌లైన్ ఎయిర్ వాల్ ప్లేట్‌ను తొలగించి రైతులు సాగునీటిని వినియోగించుకున్నారని, ఆ తర్వాత ప్లేట్ సరిగా బిగించకపోవడం వల్ల నీటి ఒత్తిడికి అది ఎగిరిపోయి నీరు ఎగసిపడినట్టు డీఈ ఆర్.పెద్దిరాజు తెలిపారు. కాగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల రెండో తేదీన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి హడావుడిగా కుడి కాలువకు నీటిని విడుదల చేశారని, పైప్‌లైన్‌ను పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!
మన ప్రాథమిక అవసరాల్లో నీరు కూడా ఒకటి. నీరు లేకుండా భూమిపై మనుగడ సాగించడం అనేది అసాధ్యం. పెరుగుదలకు, నిర్వహణకు ఎంతో అవసరం నీరు. మానవ శరీరం దాదాపు 60% నీటితోనే ముడిపడి ఉంటుంది. మానవ శరీర పనితీరుకు అత్యంత అవసరం ఇది. ముఖ్యంగా జీర్ణక్రియ, శోషణ,పోషకాల రవాణాను సులభతరం చేయడంలో నీను ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెల్యులార్ ఫంక్షన్‌కు మద్దతు ఇస్తుంది. వంట చేసే దగ్గర నుంచి క్లీన్ చేయడానికి, చెట్లకు, జంతుజాలం ఉనికికి నీరు అవసరం. అలాంటి నీరుని అత్యంత ధరల్లో కూడా విక్రయిస్తారనే విషయం గురించి విన్నారా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఒకటి ఉంది. ఒక లీటర నీటికే ఎంత వెచ్చించాలో వింటే కంగుతింటారు. ఎందుకంతా అంటే..ఈ నీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం, దాని స్వచ్ఛత, ఫ్యాకేజింగ్ విధానం తదితరాల కారణంగా అంత లగ్జరీయస్ ఉంటుంది ఈ వాటర్ బాటిల్ ధర. వీటిని ప్రసిద్ధి బ్రాండ్ విడుదల చేస్తుంది. దీనిని ఫిల్లికో జ్యువెలరీ వాటర్ అని పిలుస్తారు. ఈ బాటిల్స్‌ని స్వరోవ్స్కీ స్పటికాలతో అలంకరిస్తారు. చక్కటి ఆభరణాల ముక్కలతో డిజైన్ చేస్తారు. అందువల్ల దీని ధర అంత రేంజ్లో ఉంటుంది. జపాన్‌లో కోబ్‌లోని సహజమైన నీటి బుగ్గ నుంచి తీసుకున్న నీరు ఇది. నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనికి తగ్గట్టుగా బాటిల్ డిజైన్ కూడా లగ్జరియస్‌గా ఉంటుంది. ప్రతి బాటిల్‌ని బంగారంతో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ని జపాన్ హస్తకళను హైలెట్ చేసేలా రూపొందిస్తారు. కొన్నిబ్రాండ్లు బంగారం, ప్లాటినం, అంతకంటే విలువైన రాళ్లతో డిజైన్ చేస్తారు. ఆ బాటిల్‌కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకురావడమే గాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నందుకు తగ్గట్టుగా ఆ బాటిల్ లుక్ ఉంటుంది. ఇంతకీ ఈ బాటిల్ లీటర్ నీటి ధర ఏకంగా రూ. 1,16,000/-(చదవండి: చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!) -
నాలుగడుగుల లోతుల్లోనే నీరు
సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. బావులు ఎన్నడూ ఎండిపోలేదు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. –ఆల నారాయణ, ఉప్పల్వాయి అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం... మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు. – సుతారి మహేశ్వరి, ఉప్పల్వాయి మా తాత తవ్వించిన బావి... మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం. –శంకర్‌గౌడ్, ఉప్పల్వాయి -
బెడిసికొట్టిన ప్రాంక్.. కదులుతున్న రైలుపై నీళ్లు చల్లడంతో..
ఇస్లామాబాద్: కొంతమంది యువతలో పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. చేయకూడని పనులు చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. రైలు పట్టాల సమీపంలో ఉన్న కాలువ వద్ద కొందరు యువకులు ఫ్రాంక్ కోసం ప్రయత్నించారు. రైలు రావడాన్ని గమనించిన వారు బైక్ ద్వారా నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చేష్టలకు సంతోష పడ్డారు. కాగా, రైలు ఇంజిన్‌పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపారు. దీంతో వెంటనే భయపపడిన యుకులు తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే కొందరు ప్రయాణికులు ఆ యువకుల వెంబడించి పట్టుకొని కొట్టారు.అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు యువకులు రైలుపై నీటిని చిమ్మిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని రైలులోకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. ان لوگوں کو لگ رھا تھا ٹرین رکے گی نہیں،ٹرین رکی،مسافروں نے طبیعت صاف کرکے ان کو دھویا اور پولیس نے بائیک بھی ضبط کرلی۔لیکن ان ذلیل لوگوں کو گرفتار کیا جانا چاھئے تھا۔ pic.twitter.com/sGCbbjugVL— صحرانورد (@Aadiiroy2) June 25, 2024 -
ఆతిశిని పరామర్శించిన అఖిలేష్
ఢిల్లీలో తలెత్తిన నీటి సమస్యకు పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిశి ఆరోగ్యం దిగజారడంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.మంత్రి ఆతిశి చికిత్స పొందుతున్న లోక్ నాయక్ ఆసుపత్రికి వచ్చిన అఖిలేష్ ముందుగా అక్కడి వైద్యులను అడిగి మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆతిశిని పరామర్శించారు. ఐదు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆతిశి మంగళవారం అస్వస్థతకు గురవడంతో ఆమె పార్టీ నేతలు ఎల్ఎన్ ఆస్పత్రికి తరలించారు.ఢిల్లీలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో మంత్రి ఆతిశి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 21న నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆతిశి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
నిప్పూ, నీళ్లూ! వెరైటీ షవర్ : ఇలా ఉన్నారేంట్రా మీరు! వైరల్ వీడియో
షవర్ బాత్ తెలుసు.. ఐస్ బాత్ గురించి విన్నాం...కానీ మీరెపుడైనా ఫైర్ బాత్ గురించి విన్నారా? అవును నిజంగానే ఫైర్ బాత్ స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి, నీళ్లు, నిప్పుతో కలిసి బాత్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.ఈ వీడియోలో ఒక పైప్ నుంచి నీళ్లతోపాటు, అగ్ని కూడా సెగలు కక్కుతూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. లావాలా ఉబికి వస్తున్న ఈ నీళ్లలోనే ఒక వ్యక్తి ఎంచక్కా షవర్ బాత్ చేస్తున్నాడు. అచ్చం పైనుంచి జాలువారే జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తున్నట్టుగా. ఈ వీడియోపై నెటిజనులు విభిన్నంగా స్పందించారు. అతని ఆరోగ్యంపై కొందరు ఆందోళనవ్యక్తం చేశారు. ఇలాంటి ఫీట్స్ ప్రమాదకరమని కొందరు, ఇలా చేస్తే కేన్సర్ బారిన పడటం ఖాయమని కొందరు వ్యాఖ్యానించారు.This must be one of the strangest showers in the world! 🚿🔥It's apparently located in Russia & spews both water and fire at the same time! 🤔 pic.twitter.com/Gh5fpW3ZQ4— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) June 17, 2024 సహజ వాయువు, నిప్పు, నీరుతో స్నానం ఇదని, ఈ నీటిలో ఎక్కడో ఒక రకమైన గ్యాస్ ఉందని, దీంతో నీటితో పాటు తేలికగా మంటలు వస్తున్నాయని కమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. అలాగే చాలా చల్లగా ఉంటుంది కానీ దుర్వాసన కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విచిత్రమైన ఘటన రష్యాలో జరిగిందని, ఇలాంటి ఘటనలు రష్యాలోనే మాత్రమే చోటు చేసుకుంటాయంటూ మరికొందరు కమెంట్ చేశారు. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
ఢిల్లీలో నీటి చౌర్యం.. ఎల్జీకి మంత్రి ఫిర్యాదు
దేశరాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీనికితోడు తాజాగా విద్యుత్ సంక్షోభం కూడా తలెత్తింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఏర్పడిన నీటి ఎద్దడి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. దీనిని అనువుగా మలచుకొన్న కొందరు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు.ఢిల్లీలోని మునక్ కెనాల్లో వాటర్ ట్యాంకర్ చోరీకి గురైన ఉదంతం సంచలంగా మారింది. నీటి చౌర్యాన్ని అరికట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ఈ నీటి చౌర్యంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్‌తో నీటి మాఫియా కుమ్మక్కైందని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా కార్యాలయ అధికారులు కూడా వాటర్ మాఫియా పేరుతో ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు హర్యానా కూడా సుప్రీం కోర్టు ఆదేశించిన రీతిలో ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదని ఎల్జీకి ఆప్ లేఖ రాసింది. తాజాగా ఢిల్లీ-హర్యానా మునాక్ కెనాల్ నుండి ట్యాంకర్లలో అక్రమంగా నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాలువ నుంచి ఢిల్లీకి మాత్రమే నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ఆ నీరు వేరేవైపు మరలిపోతోంది. ఎల్జీకి ఆప్ రాసిన లేఖలో రాజధానిలో నీటి ట్యాంకర్ల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని మంత్రి అతిషీ ప్రస్తావించారు.2023 జనవరిలో ఢిల్లీ జల్ బోర్డు 1179 ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. 2023 జూన్ నాటికి ఈ ట్యాంకర్ల సంఖ్య 1203. అయితే 2024 జనవరిలో వాటి సంఖ్య 888కి తగ్గిందని దీని వెనుకగల కారణాన్ని తెలుసుకోవాల్సి ఉన్నదని అతిషీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ ముఖ్య కార్యదర్శి, సీఈఓలు తన సూచనలను పాటించకుండా ట్యాంకర్ల సంఖ్యను తగ్గించారని ఆమె పేర్కొన్నారు. వారు ట్యాంకర్ మాఫియాతో కుమ్మక్కయ్యారని అతిషీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆమె కోరారు. ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని ఢిల్లీ జల్ బోర్డుకు పలుమార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోలేదని అతిషి పేర్కొన్నారు. -
చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
కమ్మర్పల్లి (నిజామాబాద్): వరద కాలువలో చెల్లెల్ని కాపాడబోయి అక్క నీట మునిగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గాం«దీనగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గాం«దీనగర్‌కు చెందిన చిత్తారి రాజు, మంజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కాలనీకి చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి కామారెడ్డి నుంచి మంజుల తండ్రితోపాటు ఆమె సోదరి పానేటి శ్యామల కూడా వచ్చారు.పంచాయితీ జరుగుతున్న సమయంలో మంజుల ‘నేను చనిపోతా’అంటూ పరుగెత్తికెళ్లి కాలనీకి పక్కనే గల కాలువ వద్దకు వెళ్లి అందులో దూకింది. చెల్లెల్ని కాపాడేందుకు శ్యామల, కాలనీ వాసులు కూడా కాలువ వద్దకు వెళ్లారు. శ్యామల ధైర్యం చేసి కాలువలోకి దూకింది. కాలనీ వాసులు చీరను విసరగా మంజుల దాన్ని పట్టుకొని పైకి వచ్చింది. కానీ శ్యామల ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్యామల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఢిల్లీ వాటర్ కష్టాలు
-
Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు!
ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. మనుషుల్లో హైబీపీతో చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగే లోబీపీతో కూడా బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ రెండూ ప్రమాదకరమైనవే. ఈ నేపథ్యంలోబీపీని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈనేపథ్యంలో బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ గురించి తెలుసుకుందాం.రక్తపోటు (బీపీ) ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. హైబీపీ పేషెంట్లతో పోలిస్తే లోబీపీ (హైపోటెన్షన్) పేషెంట్లు ఉన్నట్టుండి చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. తరచుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. హైపోటెన్షన్ రోగుల్లో గుండె, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్త ప్రసరణ కాకపోవడం దీనికి కారణం కావచ్చు.లో బీపీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నవడం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడాలి. లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్లే ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లతోపాటు, బిస్కట్లు, చిన్నచిన్న తిరు తిండ్లు వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. తులసి ఆకుల్లోని పొటాషియం , మెగ్నీషియం లాంటి పలు ఖనిజాలు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఒక స్థాయిలో ఉంచుతాయి.సోడియం (ఉప్పు) ఆహారంలో తగినంతగాఉండేలా చూ సుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి.గ్రీన్ టీ: గ్రీన్ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ ఉన్నాయి. ఇవి లోబీపీకి బాగా పని చేస్తాయి. కాఫీ , కెఫిన్ పానీయాలు లో బీపీని తాత్కాలికంగా పెంచుతాయి.అలసట, తల తిరగడంతల తిరగడం, వికారం అధిక చెమట, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
ఢిల్లీలో నీటి సంక్షోభం.. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా
-
నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్ ఏంటి అనేది ఎపుడూ హాట్ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ ముఖేష్ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట. రూ. 49 లక్షల వాటర్ బాటిల్ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో. -
‘‘ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర’’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల గడువు ఉందనగా ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) బీజేపీపై మరో సంచలన ఆరోపణ చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు.‘లోక్‌సభ ఎన్నికలు ప్రకటించగానే మా పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై రాగానే వెంటనే స్వాతిమలివాల్‌పై దాడి అనే కుట్రకు తెర తీశారు. ఇది కూడా వర్కవుట్ కాకపోవడంతో విదేశీ నిధులు వచ్చాయన్న పాత ఆరోపణలను మళ్లీ తవ్వారు. ఇప్పుడు తాజాగా హర్యానాలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఢిల్లీకి యమునా నది నీళ్లు ఆపివేశారు’అని ఆతిషి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మే25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
మధుమేహం, లేదా షుగర్వ్యాధి వచ్చిందంటే నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతతాయి. ఒత్తిడి లేని జీవితం, జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార నిబంధనలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ అదుపులో ఉండేలా ఒక చిన్న చిట్కాను తెలుసుకుందాం.శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.మధుమేహాన్ని వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే మధుమేహం లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఏడోఅతిపెద్ద కిల్లర్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.శరీరంలో పాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వ చేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ దీని పని. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహం బారినపడుతున్నారు.కారణాలుసరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది.వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, ఇంకా ముందు తరం నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది.వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనవి. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు. మెంతుల వాటర్ ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.లేదంటే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. నానబెట్టిన మెంతి వాటర్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుందిమెంతి సౌందర్య పోషణలోనూ బాగా ఉపయోగడుతుంది. మెంతి గింజలు పీరియడ్స్ సమస్యలకు కూడా మంచి చిట్కా పనిచేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి కూరను ఆకుకూరగా వాడుకోవచ్చు. నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. సరియైన సమాచారం, చికిత్స కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం -
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
ఎండలు చుర్రుమంటున్నాయి. ఒక్కటే దాహం, దాహం అన్నంతగా భగభగమంటోంది వాతావరణం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు చల్లటి పానీయాలు, పళ్ల రసాలు వెంట పరిగెడతారు అందరూ. ఐతే చాలామంది కొబ్బరినీళ్లు మంచివని. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ కొబ్బరి నీళ్లు రుచిగా ఉండటమేగాక తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల కొబ్బరి బోండాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో కొబ్బరి బోండాలను కొనగానే నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడాదట. నేరుగా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణలు. అదేంటీ..?నిజానికి ఎండ వేడిలో వస్తూ రోడ్డుపై కొబ్బరి బోండాలు కనిపించగానే హమ్మయ్యా అనుకుని వెంటనే కొబ్బరి బోండాలు కొని నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయటి వాతావరణం వేడిగా ఉంది. ఇక ఈ బోండాలు కూడా ఎంతసేపు ఈ వేడిలోనే ఉన్నాయన్నది తెలియదు. అందువల్ల అలా అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. ఎందుకంటే వాటిని కుప్పలుగా వేసి విక్రయిస్తుంటారు. అలా చాలా రోజుల నుంచి లేదా చాల సేపటి నుంచి ఎండలో ఉండిపోవడంతో దానిలో ఒక రకమైన ఆకుపచ్చని ఫంగస్ వస్తుందట. అందువల్ల కొబ్బరి బోండాన్ని కొన్న వెంటనే నేరుగా స్ట్రా వేసుకుని తాగేయ్యకుండా..ఓ పారదర్శకమైన గాజు గ్లాస్లో వేయించుకుని తాగాలని అంటున్నారు. అందులో నీరు స్పష్టంగా, ఎలాంటి చెడు వాసన లేదని నిర్థారించుకుని తాగడం అనేది ముఖ్యం అంది. ఎందుకంటే ఈ ఎండల ధాటికి ఎలాంటివైనా తొందరగా పాడైపోతాయి. నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాహం అంటూ ఆత్రతగా కొబ్బరి నీళ్లు తాగేయొద్దని సూచిస్తున్నారు. ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందంటే..ఆకు పచ్చని ఫంగస్ ఆహార పదార్థాల ఉపరితలాలపై వస్తుంది. అది ఆహార పదార్థాన్ని కుళ్లిపోయేలా చేయడం ద్వారా పోషకాలు పొందుతుంది. ఇది ఎగురుతూ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా కఠినమైన వాతావరణంలో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. తగినంత నీరు, సేంద్రియ పదార్థాలలో ఉన్న పదార్థాలపై ఇది పెరగడం ప్రారంభించి, నెమ్మదిగా మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..తీవ్రమైన అలెర్జీ, తుమ్ములు, ఎరుపు లేదా నీటి కళ్లు, చర్మంపై దద్దుర్లు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం. దగ్గు, శ్వాస ఆడకపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి. ఈ ఫంగస్‌లో హానికరమైన మైకోటాక్సిన్‌లతో నిండి ఉంటాయి. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. కడుపు, మూత్రపిండం, కాలేయం వంటి వాటిల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. నివారణ..ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. తాజా పండ్లు, కూరగాయాలను మాత్రమే తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చుచెడిపోయే వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకండిగాలి చొరబడని కంటైనర్లలో ఆహార పదార్థాల్ని నిల్వ చేయాలి.కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత కాలం సురక్షితంగా ఉంటాయో తెలుసుకుని నిల్వ ఉంచడానికి యత్నించాలి.(చదవండి: నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?) -
మంగళూరులో దాహం.. దాహం!
కర్నాటకలోని మంగళూరు ప్రజలు తాగునీటి ఎద్దడితో విలవిలలాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన నేత్రావతి నదిలో ఎక్కువ భాగం ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ సిటీలో రోజు విడిచి రోజు వారీగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ అధ్యక్షతన జరిగిన మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు పట్టణ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకూడదని, గృహ అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నీటిని వృథా చేయవద్దని అధికారులు కోరారు.గత ఐదేళ్లలో తొలిసారిగా మంగళూరు నగరం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తే నీటి ఎద్దడి సమస్య తీరుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని బెంగళూరు నగరం కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఇటీవలే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ. ఐదువేలు జరిమానా విధిస్తామని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏప్రిల్‌లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్‌లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్‌గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్‌గంజ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
ఈ ఆనంద్ మంచి ‘సరస్సు’ లాంటి వాడు.. ఇంట్రస్టింగ్ స్టోరీ
సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఇటీవల నీటి కొరత సంక్షోభానికి దారితీసింది. లేక్ సిటీగా పేరొందిన బెంగళూరులోజనం గుక్కెడు నీటికోసం అల్లాడిన పరిస్థితి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంలో చెరువుల పునరుద్ధరణ మిషన్కోసం అహరహం శ్రమిస్తున్న బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం రండి! కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎన్నో మంచి నీటి చెరువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న పరిస్థితిల్లో చెరువులన్నీ చాలా వరకు ఎండిపోయాయి. కొన్ని పూర్తిగాకనుమరుగయ్యే స్థితికి చేరాడు. దీనికితోడు తక్కువ వర్షపాతం మరింత ప్రభావితం చేసింది. ఇక్కడే మెకానికల్ ఇంజనీర్ ఆనంద్ మల్లిగవాడ్ హృదయం తప్పించిపోయింది. బాల్యంలో ఇంటికి సమీపంలోని చెరువు, దాని అందాలను ఆస్వాదించిన మల్లిగవాడ్కు చెరువుల దుస్థితి చూసి చలించిపోయాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు ఆనంద్ మల్లిగవాడ్ చెరువులను కాపాడటంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడు. 36ఎకరాల ఎండిపోయిన సరస్సును కేవలం 45 రోజుల్లోనే పునరుద్ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. చెరువుల పునరుద్ధరించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశాడు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడిగా మారిన ఆనంద్, ఇప్పటివరకు 7 సరస్సులను పునరుద్ధరించాడు. అంతేకాదు 2025 నాటికి నగరంలోని 45 చెరువులకు తిరిగి జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1960లలో బెంగళూరులో దాదాపు 290 సరస్సులు ఉండేవి. 2017 నాటికి 90కి పడిపోయింది. తొలి ప్రాజెక్టుగా ఎండిపోయిన కైలాసనహళ్లి సరస్సును నీటితో నింపాలని నిర్ణయించుకున్నాడు. అందరూ చూసి నవ్వారు.. అందరూ పిచ్చి వాడన్నారు అయినా తన ప్రయాణం అపలేదు. ఈ ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. అంతేకాదు ఇవాల్టి తాగు నీటి కష్టాలకు కారణం సరస్సులు, చెరువులు మాయం కావడం కూడా ఒక కారణమని అంటాడు. అందుకే భవిష్యత్తరాలకు చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అసవరం ఉందంటాడు. View this post on Instagram A post shared by Wyzr (@wyzr.in) ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు, ఐదొందలకు చేరడంతో వీటిరక్షణకు బిగించాడు.చెరువులను సంరక్షించుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేశాడు. నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. ఎట్టకేలకు తాను పనిచేస్తున్న కంపెనీ సన్సేరా ఇంజనీరింగ్ కంపెనీని ఒప్పించి లక్ష డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో బొమ్మసంద్రలోని 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవం పోశాడు. స్థానికులు, కూలీల సహాయంతో, అతను సరస్సు ఎండిపోయిన బెడ్ నుండి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలిగాడు. ఆ మట్టిని ఉపయోగించి సరస్సులో చిన్న చిన్న దీవులను తయారు చేశాడు. ఇపుడీ ఈ ద్వీపాలు ఇప్పుడు వేలాది పక్షులు, చెట్లతో అలరారుతున్నాయి. అలాగే 2018లో రెండెకరాల వాబసంద్రా, 2019లో 16 ఎకరాల కోనసంద్ర లేక్‌ను పునరుద్ధరించాడు. ఫార్మ, గ్రానైట్ కంపెనీల వ్యర్థాలతో నిండి వున్నచెరువును 65 రోజుల్లో 80 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దాడు. మల్లిగవాడ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు మద్దతిచ్చారు. తిరుపాళ్య సరస్సు పునరుజ్జీవన ప్రాజెక్ట్ 180 రోజులలో పూర్తి చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు 30 సంవత్సరాల తర్వాత మంచినీటితో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీని నిల్వ చేసే సామర్థ్యాన్ని 3 రెట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువులో పూడిక, కలుపు, మట్టిని, చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను త్రవ్వి తీసి కట్టలను బలోపేతం చేస్తాడు. తరువాత సరస్సు చుట్టూ బాగా మొక్కలు నాటిస్తారు. తద్వారా వలస పక్షుల కోసం ద్వీపాలను కూడా సృష్టించాడు. వర్షాకాలం తర్వాత ఆరు నెలల్లోనే సరస్సులను స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. అలాగే విరాళాల ద్వారా చెరువుల రక్షణకు పూనుకున్నాడు. 3. 5 ఎకరాల్లో ఉన్న గవిని రక్షించారు. ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు.దాదాపు ఎనిమిదేళ్లలో మల్లిగవాడ్ బెంగళూరులో మరో 35 సరస్సులను, అలాగే అయోధ్యలో ఏడు, లక్నోలో తొమ్మిది , ఒడిశాలో 40 చెరువును బాగు చేయడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ,కార్పొరేట్ కంపెనీల సాయంతో ఈ ప్రయాణం ఇలా సాగుతోంది. 2026లో 900 ఎకరాల హెన్నాగర సరస్సును బాగు చేయాలనేది లక్ష్యం. తద్వారా చుట్టుపక్కల రైతులకు లాభం చేకూరాలని, భూగర్భ జలాలను కాపాడాలనేది ప్రయత్నం. ఆనంద్ మల్లిగవాడ్ సందేశం ‘‘సహజ వనరులను గౌరవించడం నేర్చుకుందాం. ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి అందించిన వనరులను మనకు అవసరమై నంత మాత్రమే వాడుకుందాం. నీటిని సంరక్షింకుందాం. జీవితంలో సగం మన కోసం జీవిద్దాం. మిగిలి జీవితాన్ని పరిరక్షణ కోసం వెచ్చించుదాం. మన భవిష్యత్తరాలకు కోసం ఇదే ఉన్నతమైన దృక్పథం. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్‌జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్‌ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్‌కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన బోర్రుడ్ ఎల్జి, నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ, ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు. శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు. రామాలయంలో భక్తుల దర్శనం కోసం ఏడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయని, మరో మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. దర్శనం త్వరగా జరిగేలా పలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచివుంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశప్రజలంతా ప్రసార భారతి ద్వారా, ఇంట్లో నుంచే రామ్‌లల్లాను దర్శించుకోవచ్చన్నారు. -
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు. ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్‌కి దీనికి తేడా ఏంటీ అంటే.. బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్‌గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. డిటాక్స్ డ్రింక్‌గా.. ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు. నార్మల్ వాటర్‌తో ఈ ప్రయోజనాలు పొందగలమా..? నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. అలా అని డైరెక్ట్‌గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్‌ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. బ్యాక్ వాటర్‌తో కలిగే దుష్ప్రయోజనాలు.. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
చెట్టు నుంచి నీళ్లు రావడం చూశారా?
ప్రకృతి ఎప్పటికప్పుడూ తన వైవిధ్యంతో మనుషులను మంత్రముగ్దులయ్యేలా చేస్తూనే ఉంటుంది. కొన్నింటిని చూస్తే ప్రకృతిలో ఇంగ గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఓ విచిత్రమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వేసవి వచ్చిందంటే ఎందురయ్యే నీటి సమస్యకు ఆ అద్భుతం ఓ గొప్ప మార్గాన్ని అందించే ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా అద్భుతం అంటే.. ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జిల్లాలోని రంపచోడవరం -కింటుకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది . ఏం జరిగిందంటే..భూమి మూడోంతుల నీరు ఉంటుందని విన్నాం. కానీ కొన్ని చోట్ల భూమ్మీద నీరు కనిపించకపోయినా..తవ్వగానే ఉబికి రావడం జరగుతుంది. మరొకొన్ని చోట్ల కొండల్లోంచి పుట్టుకురావడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అత్యంత విభిన్నంగా చెట్టులోంచి నీరు వస్తోంది. అంది కూడా పంపు నుంచి లీకైనట్లుగా ధారాపాతంగా వస్తోంది. ఈ చెట్టుకి పూలు, కాయల తోపాటు నీళ్లు కూడా వస్తాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఆ చెట్టు పేరు నల్ల మద్ది చెల్లు. దీన్నుంచి నిరంతరాయంగా పంపు మాదిరిగా నీళ్లు ఫోర్స్‌గా వస్తాయి. అక్కడే ఇలాంటి చెట్లు వేలాదిగా ఉన్నాయి. ఈ చెట్టుకి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందట. ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అందుకు సంబంధించిన వీడియోని తీసి నెట్టింట షేర్ చేయండతో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వింతైన దృశ్యాన్ని చూసేయండి. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an — Telugu Scribe (@TeluguScribe) March 30, 2024 (చదవండి: పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!) -
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్‌బాబు పాల్గొన్నారు. -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
మోదీ వాటర్ గన్లపై కాంగ్రెస్ ఆగ్రహం
హోలీ వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు కనిపిస్తున్నాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్లు విరివిగా విక్రయమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్‌పై బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లను వినియోగించరని స్పష్టం చేశారు. -
ప్రధాని మోదీ వాటర్ గన్లకు ఆదరణ!
రంగుల పండుగ హోలీకి దేశవ్యాప్తంగా సన్నాహాలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మార్కెట్లలో పండుగ కొనుగోళ్లు జరుగుతుండగా, మరోవైపు పూలతో ఇళ్లను అలంకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, ఎంపీలతో సహా అనేక రాష్ట్రాల మార్కెట్లలో జనం మోదీ మాస్క్‌లను, వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వాతావరణానికి ఈ హోలీ వేడుకలు తోడై ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి, ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్‌గన్‌ను జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు అంతటా హోలీ సందడి కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో జనం ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో హోలీ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో వివిధ దేశాల రాయబారులు పూలతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!
నీళ్లు తాగడం మంచిదని తాగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఎలా తాగుతున్నం అనేది ఆలోచిస్తున్నారా?. చాలామంది చేసే తప్పే ఇది. పరగడుపునే నీళ్లు తాగమనగానే చల్లటి నీళ్లు తాగేస్తున్నారే తప్ప. కనీసం గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లను తీసుకునేందుకు యత్నించడం లేదు. పైగా నీళ్లు ఎక్కువుగా తాగుతున్నాం కదా!. అయినా ఈ సమస్యలేంటి అని వాపోతున్నారు. కానీ నీళ్లు తాగే పద్ధతి ఇది కాదు. అలాగే ఎప్పుడూ పడితే అప్పుడూ తాగిన ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఎలా తాగితే మేలంటే.. ఇక నీటిని 90 శాతం మంది తప్పుగానే తాగుతుంటారు. ఈ విధంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం అనంతరం 30 నిమిషాలు ఆగి తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు. అంతగా తాగాలనిపిస్తే ఒకసారి చప్పరించవచ్చు. అంతేగాదు నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. నిలుచుని తాగరాదు. లేదంటే అది జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కిడ్నీల పనితీరును నెమ్మదింపజేస్తుంది. కనుక నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను తాగాలి. చల్లని నీళ్లను తాగరాదు. కానీ కుండలోని నీళ్లను తాగవచ్చు. ఫ్రిజ్‌లో చల్ల బరిచిన నీళ్లను తాగరాదు. తాగితే శరీరంలో కఫం పెరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం సమస్య వస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకోలేదు. చల్లని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక చల్లని నీళ్లను తాగరాదు. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లను కూడా తాగరాదు. బాగా దాహంగా ఉందని ఆబగా తాగేయ్యకూడదు. నీళ్లను తాగేటప్పుడూ కొంత సమయం వ్యవధి ఇచ్చి తాగాలి. ఇలా ఎక్కువ మొత్తంలో నీళ్లను ఒకేసారి తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మంచిది కాదు. కనుక నీళ్లను కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. అంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మేర నీళ్లను తాగాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగాలి. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే నీళ్లను తాగరాదు. నీళ్లను అవసరం లేకపోయినా ఎక్కువగా తాగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అవసరం ఉన్నంత మేరకే నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. అధిక బరువు తగ్గుతారు. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. గోరు వెచ్చని నీళ్లను ఒక లీటర్ వరకు కూడా ఉదయం తాగవచ్చు. కానీ కొంత సమయం ఇచ్చి తాగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనాలను పొందవచ్చు. (చదవండి: Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..! -
ఏసీ నీటిని ఉపయోగించొచ్చా! ఆరోగ్యానికి మంచిదేనా?
వేసవి వచ్చిందంటే చాలు ఒక్కసారిగా అందరి ఇళ్లలో ఫ్యాన్ల కంటే ముందు ఏసీలు ఆన్ అయిపోతాయి. సూర్యుడి భగ భగలకు తాళ్లలేక చల్లటి ఏసిలో ఉండే కాస్త ప్రాణం లేచొచ్చిందరా బాబు అని అంటారు. అలాంటి ఏసీలను ఆన్ చేసినప్పుడూ నీళ్లు రావడం జరుగుతుంది. కంప్లసరీ ఆన్ చేసే వ్యవధిని బట్టి నీళ్లు ఎక్కువగా బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ నీటిని చాలా మంది పారబోసేస్తారు. వినయోగించరు. కానీ ఈ నీటిని హాయిగా ఉయపయోగించొచ్చట. మండు వేసవిలో ఉండే నీటి కొరతకు చెక్‌పెట్టేలా ఈ నీటిని ఆదా చేసుకోవచ్చని అంటున్నారు. ఇది ఏసీ నీరు కదా! సురక్షితమేనా? అంటే.. ఏసీ నుంచి వచ్చే వాటర్ కాబట్టి దీన్ని ఏసీ వాటర్ అంటున్నాం. కానీ, దీన్ని 'ఏసీ కండెన్సేట్ వాటర్' అంటారు. ఈ నీటిని మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించవచ్చు. ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే నీరు డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది. స్వేదనజలం టీడీఎస్ (Total dissolved solids) సున్నాకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. ఏసీ కండెన్సేట్ నీటి టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) విలువ 40 నుంచి 80 మధ్య మారుతూ ఉంటుంది. పర్యావరణంలో కాలుష్య స్థాయి, ఏసీ పరిస్థితితో ఈ విలువ పెరగవచ్చు. క్రమం తప్పకుండా సర్వీస్ చేయబడే క్లీన్ ఏసీ తక్కువ టీడీఎస్ విలువను కలిగి ఉంటుంది. 'అవుట్డోర్ ప్లాంట్స్' ఏసీ కండెన్సేట్ నీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఈ నీరు మొక్కలకు ఊహించదగిన నీటి స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది. చిన్న కుండలు, కంటైనర్లలో 'ఇండోర్ ప్లాంట్లు' నీరు తాగుటకు, కొన్నిసార్లు AC నీటిని ఉపయోగించడం లేదా సాధారణ పంపు నీటిలో కలపడం మంచిది.అయితే నీటిపారుదల కోసం ఉపయోగించే నీరు ఎసిటిక్గా ఉండటానికి తగినది కాదు. ఈ నీరు pHస్కేల్లో తటస్థంగా ఉండాలి. పారిశ్రామిక ప్రాంతం లేదా డ్రెయిన్ దగ్గర ప్రాంతాల్లో ఏసీ నీరు కొద్దిగా ఎసిటిక్గా ఉండవచ్చు. అలాంటప్పుడూ ఈ ఎసిటిక్ నీటిని నీటిపారుదల కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. పారిశ్రామిక ప్రాంతంలో ఉండేవారు ఈ నీటిపారుదల ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..? ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేగాదు మొక్కలు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నీటిలో మినరల్స్, ఖనిజాలు లేకపోవడం వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ ఏసీ నీటిని ఆదా చేయాలనుకుంటే..ఈ నీటితో వంటగది పాత్రలను కూడా కడగవచ్చు. ఏసీ కండెన్సేట్ నీటిలో బ్యాక్టీరియా, లోహాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని గిన్నెలు కడగడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి పనులకు ఉపయోగించడం మంచిదే కానీ కాని వంటగదిలోని పాత్రలను ఏసీ నీటితో శుభ్రం చేశాక మళ్లీ మంచినీళ్లు(శుభ్రమైన)తో మరొకసారి పాత్రలను కడగాల్సి ఉంటుంది. వేసవికాలంలో నీటి సమస్య ఉంటుంది కాబట్టి అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నీటిని ఇలా ఉపయోగించొచ్చు. (చదవండి: కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!) -
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాటర్ ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల పద్దతులను ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన శైలి మార్పులతోపాటు, కొన్ని ఆహారనియమాలతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఓక్రా (బెండకాయ లేదా లేడీస్ ఫింగర్ ) వాటర్. పరగడుపున బెండ కాయ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతారు. బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెండకాయలో కేన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ముఖ్యంగా పేగు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వినియోగం, సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. ఓక్రా వాటర్ అంటే ఏమిటి? బెండకాయ కూర, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంట గురించి తెలుసు.కానీ చాలామంది ఓక్రా వాటర్, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఓక్రా నీటిని తయారు చేయడం సులభం. 24 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. శుభ్రంగా కడిగిన నాలుగు బెండకాయలను ముక్కలుగా కోసం రాత్రంతా నీటిలో ఉంచాలి. దీని మొత్తం వల్ల పోషకాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్ని ఈ నీటిని సేవించడం వల్ల లభించే పోషకాలు, విటమిన్లు ఇలా ఉంటాయి. పోషకాలు, విటమిన్లు కేలరీలు: 31 కిలో కేలరీలు ప్రోటీన్: 2 గ్రాములు కొవ్వు: 0.2 గ్రాములు పిండి పదార్థాలు: 7 గ్రాములు ఫైబర్: 3 గ్రాములు మాంగనీస్: రోజువారీ విలువలో 33శాతం (DV) విటమిన్ సి: రోజువారీ విలువలో 24శాతం చర్మ సౌందర్యం చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలియేట్ వంటి విటమిన్లు ,యు మినరల్స్‌తో నిండిన ఓక్రా వాటర్ సహజ చర్మ టానిక్‌గా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా, ఓక్రాలో ముఖ్యంగా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది కీలకమైన ఖనిజం. అదనంగా, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్త్రీ,పురుషుల్లో లిబిడో(శృంగారేచ్ఛ)ను పెంచడంలో దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారు. -
ఈ ట్రిక్ ఎపుడైనా ట్రైచేశారా? మ్యాజిక్..అస్సలు వదలరు!
వంటిల్లు, వంట ఇంటి సామాను జిడ్డు వదిలించడం అంత తేలిక కాదు. దీనికి సంబంధించి అనేక చిట్కాలను మనం చూసే ఉంటాం. వాటిని చాలామంది పాటించి ఉంటారు కూడా. తాజాగా ఇలాంటి వంట ఇంటి చిట్కా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టూత్‌పేస్ట్+కోకాకోలా+క్లీనర్+బేకింగ్-సోడా+వాటర్‌తో తయారు చేసిన లిక్విడ్ మ్యాజిక్ఇంటర్నెట్ హల్చల్ చేస్తోంది. లెర్న్ సంథింక్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మూడు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. చిన్ని కోకోకాలా బాటిల్లో కొద్దిగా టూత్ ప్లేస్ వేసి బాగా కలిపాడు. ఆ రువాత ఆమిశ్రమాన్ని ఒకగిన్నెలోపోసి, దానికి బేకింగ్ సోడా, లిక్విడ్ క్లీనర్,కొద్దిగా నీళ్లు కలిపాడు. ఆ తరువాత దీన్నీ ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుని జిడ్డు పట్టిన పెనాన్ని శుభ్రం చేయడం ఇందులో చూడొచ్చు. This Magic products made by toothpaste+cocacola+cleaner+baking-soda+water pic.twitter.com/KOOeJwuvWn — Learn Something (@cooltechtipz) March 12, 2024 -
అమెరికాలో కాజీపేట విద్యార్థి దుర్మరణం
కాజీపేట: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన ఓ విద్యార్థి వాటర్ గేమ్స్ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేష్ కుమారుడు వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గత ఏడాది ఆగస్టు 22న అమెరికా వెళ్లాడు. ఇండియానా యూని వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫార్మటిక్స్ కోర్సు చదువుతున్నాడు. ఈనెల 9న మిత్రులతో కలిసి వెస్ట్ఫ్లోరిడాకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడు తుండగా, వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటరమణ నీటిలో పడి మృతిచెందాడు. వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి తెలిపారు. మృతదేహం ఈనెల 18 లేదా 19న భారత్‌కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. -
జోరుగా బోర్ల తవ్వకం
కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరానికి మించి.. నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. పరీక్షలకు స్వస్తి.. భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అనుమతులు తీసుకోకుండానే.. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఫండే: 'వానర జలక్రీడ'! మీరు విన్నది నిజమే!!
వానరాలు(కోతులు) చెట్లపైనుంచి దూకడం, గంతులేయడం, కీచుమంటూ అరవడంలాంటివి మనం ఎన్నో చూసుంటాం. అవి చేసే తమాషా చేష్టలకి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ వానరాలు ఎప్పుడైనా ఈత కొట్టడం చూశారా! చెరువులో కాదు, బావిలో కాదు, ఏకంగా సముద్రంలో.. నమ్మలేకున్నారు కదూ..! అయితే ఈ దృశ్యం చూడండి.. వానరాలు ఈతకొడుతూ కనిపించడం చాలా అరుదు. మకాక్ జాతికి చెందిన ఈ మగ వానరం సముద్రంలో హాయిగా మునకీత కొడుతున్న అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. థాయ్‌లాండ్‌లోని ఫై ఫై దీవి తీరం వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని కువైట్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సులేమాన్ అలాతికి తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో ఇటీవల ‘అండర్ వాటర్ ఫొటోగ్రఫీ–2024’ పోటీలో బహుమతి దక్కించుకుంది. ఇవి చదవండి: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా! -
ఇదేమీ అలెర్జీ రా బాబు..! స్నానం చేసిందా ఇక అంతే..!
స్నానం చేస్తే.. నరకయాతన అనుభవించే వాళ్లు ఉన్నారంటే నమ్ముతారా!. అసలు ఇలాంటి సమస్య కూడా ఉంటుందా? అని అనిపిస్తుంది.కానీ ఇలాంటి చిత్ర విచిత్రమైన అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. వాటికి సరైన చికిత్స విధానం, తగ్గించే మందులు లేకపోవడంతో వాళ్లు చెప్పుకోవడానికి కూడా వీల్లేనంత యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి భాదనే చవిచూస్తోంది యూకేకి చెందిన ఓ మహిళ. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్‌లోని సౌత్ కరోలినాకు చెందిన 22 ఏళ్ల మహిళ తీవ్రమైన నీటి అలెర్జీతో బాధపడుతోంది. అందువల్ల ఆమె స్నానం చేయలేని స్థితిని ఎదుర్కొంటుంది. అలాగని స్నానం చేయకుండా ఉండటం అనేది కుదరని పని. తప్పక స్నానం చేసినా.. వెనుటవెంటనే టవల్‌తో తుడిచేసుకోవాల్సిందే. ఒక చుక్క నీరు కూడా శరీరంపై ఉండటానికి వీల్లేదు. ఇది ఎంత దారుణమైన బాధంటే..ఆయా వ్యక్తులు పొరపాటున కూడా నీటిని తాకలేరు, కనీసం వారి స్వేద జలం కూడా వారికి ఇబ్బందే. ఆమె శరీరం పొరపాటున తడికి గురయ్యిన లేదా నీళ్లను తాకినప్పుడు వెంటనే దద్దుర్లు, దురద రావడం జరుగుతుంది. ఎంతలా అంటే అదేపనిగా దురద వస్తూ ఉండటంతో గోకకుండా ఉండలేనంత విధంగా ఒకటే దురదగా ఉంటుందని వేదనగా చెబుతోందామె. తనకు ఈ పరిస్థితి సుమారు 12 ఏళ్ల వయసు నుంచి మొదలయ్యిందని, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మరింత దిగజారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక భరించేలేక డాక్టర్ వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు కూడా ఈ అలెర్జీకి చికిత్స లేనందున వీలైయినంతగా స్నానం చేయకపోవడం లేదా స్నానం చేయడానికి దూరంగా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సూచించినట్లు తెలిపింది. అయితే ఇలా స్నానం చేయకుండా తడిగుడ్డతో లేదా వైప్స్‌తో తుడుచుకోవడం ఎంత నరకమో తెలుసా? అంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ మహిళ. తాను ఇలా స్నానం చేయకుండ ఉండలేను స్నానం చేస్తే తట్టుకోలేను అంటూ బాధగా తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. అయితే తనలాంటి వాళ్లు ఎవరైన ఉన్నారా? అని సోషల్ మీడియా ద్వారా సర్చ్ చేసి మరీ తెలుసుకున్నానని, తామంత ఒక కమ్యూనిటిగా ఉండి, తమ సమస్యలను ఒకరికొకరం షేర్ చేసుకుంటామని చెప్పింది. నిజానికి ఇదొక అరుదైన సమస్య. వైద్య చరిత్రలో నీటికి సంబంధించిన అలెర్జీలు 37 రకాలు ఉన్నాయని, ఇప్పటివరకు వాటికి సరైన చికిత్స విధానం లేదని వైద్యులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: చేప చర్మం కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్, అల్సర్లకు కూడా!) -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
నిమ్మ రసం తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
#LemonWater Side Effects వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయలకు గిరాకీ పెరుగుతుంది. సమ్మర్ సీజన్లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవిలో శరీరానికి కావల్సిన నీరు అందించడంతోపాటు, జీర్ణ సమస్యలను తొలగించడం, బరువు నియంత్రణలో కూడా సాయం చేస్తుంది. కానీ నిమ్మ నీరు ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? నిజానికి నిమ్మలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి ఖనిజాలు , ఫోలేట్ వంటి పోషకాలతో తోపాటు సీ విటమిన్ అధికంగా లభిస్తుంది. నీటికి రుచిని ఇవ్వడంతో పాటు, నిమ్మ రసం చర్మానికి మెరుపు నిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మరసం- సైడ్ ఎఫెక్ట్స్ ♦ గుండెల్లో మంట వస్తుంది. మోతాదు మించితే పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. అలాగే సిట్రస్ పండ్లు తరచుగా తీసుకొంటే మైగ్రేన్, తలనొప్పి పెరుగుతాయి. ♦ డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే లెమన్ వాటరతో మూత్రం అధికమై, శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అతిగా సేవిస్తే పొటాషియం లోపం ఏర్పడుతుంది. ♦ విటమిన్ సీ మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. ♦ఎసిడిటీ వస్తుంది. ♦ ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ♦ టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది ♦ నిమ్మలోని సిట్రస్ వల్ల పళ్ల ఎనామిల్‌కు నష్టం. దంత సమస్యలు కూడా వస్తాయి -
Watch Live : కుప్పంకు కృష్ణా జలాలిచ్చిన సీఎం జగన్
కుప్పంకు కృష్ణా జలాలు అందాయి. తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ... సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగం మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేవుడి దయతో ప్రజలందరిక చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం జరుపుకొంటున్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకొంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల శ్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు.. పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు.. ఆరోజునేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాటిచ్చాను. చంద్రబాబు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి, దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆ నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నా. కృష్ణా జలాలను తీసుకు రావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిపోయింది. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు తెచ్చాడు. వచ్చే టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీకు అందిస్తాడు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. మీరందరూ చూశారు. కొత్త కాదు. 14 ఏళ్లు ఈ పెద్దమనిషి సీఎంగా కూడా చేశాడు. మూడుసార్లు సీఎం అయ్యాడు. 35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడంటే, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చేవారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశాడు. ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు గానీ వీరికి మంచి నీళ్లు ఎలా అందించాలి, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం, పలమనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తిచేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. 561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు. 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబు. కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలవ కాకుండా చంద్రబాబు జేబులోకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నా. ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీజగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు ఇచ్చి పనులు జరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడూ మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. పులివెందులలో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా.. పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసిన కుప్పంలో ఉన్న పేదలందరికీ ఓ మాట చెబుతున్నా.. మీరందరూ నావాళ్లే. బాబుకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి ప్రజలకు మనసు చూపాం. మంచి చేశాం. ఇదే కుప్పాన్ని తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నా ఒక్కసారి టైమ్ తీసుకొని ఆలోచన చేయండి. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039. అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇదీ కాదా? అని అడుతున్నా. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా 1400 కోట్లు. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. ఇక్కడున్న మిమ్మల్నందరినీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. 10 సంవత్సరాల మీ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ కావాలని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించినది అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిందా? చూసుకోమని అడుగుతున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్ మెంట్ లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో కనిపిస్తుంది. మరి ఎవరిది మనసున్న పాలన? ఎవరికది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూల్లో నిలబడాల్సిన పని లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెలా ఇచ్చే పెన్షన్ నే తీసుకుంటే చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థే లేదు. అరకొర పెన్షన్ రూ.1000 కుప్పంలో కేవలం 31 వేల మందికి ఇచ్చిన పరిస్థితులు. మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 1000 పెన్షన్ ను 3 వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30 వేల మందికి ఇస్తుంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 45374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు హయాంలో 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా 507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు. మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో రైతన్నలకు ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏరోజూ జరగలేదు. రైతు భరోసానే లేదు. ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మన గ్రామ స్థాయిలో ఆర్బీకేలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. కుప్పంలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లు 93 కనిపిస్తాయి. వాలంటీర్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్. ఏకంగా 76 విలేజ్ క్లినిక్స్ కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తున్నాయి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే సచివాలయాల్లో పని చేస్తున్న మన పిల్లలు 942 మంది. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు వీటిలో పని చేస్తున్న పిల్లలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదు కేవలం 57 నెలల మీ బిడ్డ పాలనలోనే జరుగుతోంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేస్తే, 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు. అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్లు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు 172 కోట్లు ఇచ్చాం. మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది మరో 30 కోట్లు. దీని వల్ల 6055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59662 మంది అక్కచెల్లెమ్మలకు మరో 30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. చంద్రబాబు హయాంలో చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో చదివించే తల్లులు 35951 మందిని ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు. కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15721 పట్టాలిచ్చాం. ఈనెలలోనే మరో 15 వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. బాబు హయాంలో కుప్పంలో ఇళ్లు మంజూరు చేసింది పేదలకు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4871 ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో 45-60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా. మీ బిడ్డ హయాంలో ఈ 45-60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19921 మందికి మంచి జరిగిస్తూ వారి కుటుంబాల ఖాతాల్లోకి పంపింది 85 కోట్లు. వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి. నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని.. పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108, 104 వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అని తిరుగుతున్నాయంటే కేవలం మీ అన్న పాలనలోనే. ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే మనసున్న మన పాలనలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు. కుప్పంలో 7002 మందికి అందించిన సాయం 28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17552 మందికి మంచి జరిగిస్తూ 64 కోట్లు నేరుగా ఇచ్చాం. పేదవాడి కోసం, పిల్లల చదువుల కోసం బాబు ఏరోజూ ఆరాటపడలేదు. అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు. మనందరి ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్ష్ మెంట్ ఇస్తూ 12093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికీ జల్లెడ పడుతూ ఏ ఒక్కరికీ మిస్ కాకుండా ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టడం జరిగింది. ఇంత పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుతున్న పరిస్థితులు మన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదంటే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గానికి అర్హుడేనా? ఆలోచన చేయండి. బాబు ఎలాంటి వాడో తెలుసుకున్న చంద్రగిరి ప్రజలు.. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో నిలదీయాల్సిన అవసరం ఉంది. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? ఒక్క స్కీమైనా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక న్యాయం ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు. పేద ఇంటికి వెళ్దాం. ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్లు మీరు చేసిన మంచి ఏంటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని గట్టిగా నిలదీస్తే అదీ మాట్లాడడు. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నా. భరత్ ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 సంవత్సరాల్లో మంచి చేశాం. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నా. ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా? 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి రంగు రంగుల మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడో ఈ వ్యక్తిని నమ్మగలమా. 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం చూశారు. మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నా. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. -
పాక్‌కు రావి నది నీటిని ఆపేసిన భారత్
పాకిస్తాన్ వైపు వెళ్లే రావి నది నీటిని ఎట్టకేలకు భారత్ నిలిపివేసింది. డ్యామ్‌ను నిర్మించి, రావి నది నీటి ప్రవాహం పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారత్ నిలువరించింది. ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో 1960లో సంతకం చేసిన ‘ఇండస్ వాటర్ ట్రీటీ’ ప్రకారం రావి జలాలపై భారతదేశానికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోని షాపూర్ కంది బ్యారేజీ.. జమ్ము కశ్మీర్, పంజాబ్ మధ్య వివాదం కారణంగా నిలిచిపోయింది. ఫలితంగా గత కొన్నేళ్లుగా భారత్‌కు చెందిన నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌కు వెళుతోంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉండగా, సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నాయి. 1979లో పంజాబ్, జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలు రంజిత్ సాగర్ డ్యామ్‌తో పాటు దిగువన ఉన్న షాపూర్ కంది బ్యారేజీని నిర్మించడానికి, పాకిస్తాన్‌కు జలాలను ఆపడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై నాటి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా, అతని పంజాబ్ కౌంటర్ ప్రకాష్ సింగ్ బాదల్ సంతకం చేశారు. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి దీనిని పూర్తి చేయాలని భావించారు. 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాగా, షాపూర్ కంది బ్యారేజీని నిర్మించలేక పోవడంతో రావి నది నీరు పాకిస్తాన్లోకి ప్రవహిస్తూనే ఉంది. షాపూర్ కంది ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా, 2013లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ మధ్య వివాదాల కారణంగా 2014లో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఆగిపోయింది. 2018లో కేంద్రం మధ్యవర్తిత్వం వహించి, ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని తర్వాత డ్యాం పనులు ప్రారంభమై, ఎట్టకేలకు పూర్తయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబాలకు ఇకపై సాగునీరు అందనుంది. ఇన్నాళ్లూ ఈ నీరు పాకిస్తాన్‌కు తరలిపోయింది. ఇకపై 1,150 క్యూసెక్కుల సాగునీరు 32,000 హెక్టార్ల భూమికి అందనుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్‌లకు కూడా ఈ డ్యామ్ నీరు ఉపయోగపడనుంది. -
నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?
మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది. బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్లో నీటి కొరత ఉంది. అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది. -
fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్‌కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్‌పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు. అన్నీ తప్పుడు రాతలే రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది. ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్‌కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది. రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ముమ్మాటికీ తప్పుడు కథనమే ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్‌కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈనాడుది తప్పుడు కథనం కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం. ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం. – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్‌కి నీరు వదిలారు. – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది. – వాసుడు, రైతు, చాకరాజువేముల -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
తండ్రిని కాపాడేందుకు వెళ్ళి.. కొడుకు కూడా అనంత లోకాలకు!
వనపర్తిటౌన్: వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. సమీపంలోని చెరువులో బట్టలు ఉతికి, చేపలు పట్టేందుకు తండ్రీకొడుకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు తండ్రి చెరువులో పడ్డాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన కుమారుడు సైతం చెరువులో గల్లంతై మృతి చెందాడు. ఎస్ఐ జయన్న, స్థానికుల వివరాల మేరకు.. వనపర్తి దళితవాడకు చెందిన గంధం శివాన్ (58), అతడి కుమారుడు రుషికేష్ (29) బట్టలు ఉతికేందుకుగాను స్థానిక నల్లచెరువుకు వెళ్లారు. చెరువులో బట్టలు ఉతకడంతో పాటు చేపల వేటకు గాలం వేశారు. ఈ క్రమంలో తండ్రి శివాన్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. గమనించిన కుమారుడు రుషికేష్ వెంటనే తన బాబాయ్‌కి ఫోన్‌చేసి ‘నాన్న చెరువులో జారిపడ్డాడు.. కాపాడేందుకు వెళ్తున్నా’నని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న బాబాయ్‌కి తన అన్నాకొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని కొండపేట నుంచి గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చర్యలు చేపట్టారు. మొదట తండ్రి శివాన్ మృతదేహం లభించగా.. సాయంత్రం రుషికేష్ మృతదేహం లభ్యమైంది. తండ్రీకొడుకు మృతితో దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జయన్న తెలిపారు. -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!
ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కాశీలోని వ్యాపారులకు అయోధ్యలో వినియోగించబోయే ఐదు లక్షల కలశాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. జనవరి 15లోగా ఈ కలశాలను సిద్ధం చేసి అయోధ్యకు పంపనున్నారు. జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామాను ఇప్పటికే కాశీ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. వీటిలో బనారసీ దుపట్టా, రామనామి, స్టోన్ క్రాఫ్ట్ జాలీ వర్క్, జర్దోసీ, వాల్ హ్యాంగింగ్ మొదలైనవి ఉన్నాయి. కాశీ-అయోధ్య మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ)నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ప్రముఖ జీఐ ఉత్పత్తులున్నాయని, హస్తకళలు, చేనేతలకు సంబంధించిన అత్యుత్తమ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఇత్తడి గంటలు, చేతి గంటలు, పూజా పాత్రలు, లోటాలు, సింహాసనాలు, కలశాలు, గొడుగు, స్టోన్ క్రాఫ్ట్ జాలి వర్క్ మొదలైనవి అయోధ్యకు పంపిస్తున్నారన్నారు. మెటల్ క్రాఫ్ట్‌లోనే రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని చౌక్ నివాసి మెటల్ క్రాఫ్ట్ స్టేట్ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ కసెరా తెలిపారు. కాశీ ఉత్పత్తులకు అయోధ్య నుంచి గరిష్టసంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. చెక్కతో చేసిన రామ్ దర్బార్ కోసం వచ్చిన 1.25 లక్షల ఆర్డర్లు పూర్తయ్యాయని జాతీయ అవార్డు గ్రహీత రామేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడు మరో లక్ష ఆర్డర్లు వచ్చాయని, వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: అసోంలో ఇక శాంతి పవనాలు -
గాలితోనే జీవించిన జానీ బాబా! విస్తుపోయిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు!
ఏ కారణం చేతైనా ఒక్కపూట తినకపోతే రెండో పూట ఆకలికి ఆగడం కష్టమైన పనే. ఇక పూజో, వ్రతమో చేసి.. తప్పక సాయంకాలం వరకూ ఉపవాసం ఉండాల్సివస్తే మాత్రం రాత్రికి ఆ లెక్క పక్కాగా సరిచేయాల్సిందే. ఉదయం నుంచి తినలేదనే సాకుతో తూకం సరిచేసినట్లుగా నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. అలాంటిది ఒక మనిషి.. కొన్ని ఏళ్ల పాటు నీరు, ఆహారం తీసుకోకుండా బతకడం సాధ్యమేనా? గుజరాత్‌కి చెందిన ప్రహ్లాద్ జానీ బాబా 90 ఏళ్ల పాటు అలానే జీవించారు. గాంధీనగర్ జిల్లా, చరాడ అనే గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీ బాబాకు ‘చున్రీవాలా మాతాజీ’ అనే మరో పేరుంది. అతను నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా కేవలం గాలితోనే బతుకుతున్నాడనే వార్త 2001లో సంచలనం సృష్టించింది. అయితే అదే వార్త.. మరెందరికో అనుమానాలనూ రేకెత్తించింది. దాంతో 2003 నుంచి 2010 మధ్య కాలంలో ప్రహ్లాద్ బాబా జీవన శైలిపై నిఘాపెట్టిన కొందరు శాస్త్రవేత్తలు.. ‘అతను చెప్పేది, చేసేది నిజమే’ అని గ్రహించి నివ్వెరపోయారు. అప్పటికే 70 ఏళ్లు పైబడిన ఆ మాతాజీ.. ‘నేను నా పద్నాలుగో ఏట నుంచి తినడం, తాగడం మానేశాను. ఇన్నేళ్లు నేను బతికుండటానికి కారణం సాక్షాత్తు ఆ అమ్మవారే. స్వయంగా ఆవిడే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి నాకు నీరు, ఆహారం అవసరం లేదు’ అని ప్రకటించడంతో భక్తుల శాతం అమాంతం పెరిగింది. అతనిపై ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని.. ‘డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్’ (డీఐపీఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు నిఘా పెట్టారు. సుమారు 15 రోజుల పాటు పరిశీలనాత్మకంగా సీసీ కెమెరాల ద్వారా అతన్ని గమనించారు. ఆ పరిశీలనలో.. అతను ఏం తినకుండా, తాగకుండా కేవలం గాలి సాయంతోనే జీవిస్తున్నాడని, అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలింది. గాలితో మాత్రమే జీవించే యోగిగా ఎంతో ప్రజాదరణ పొందిన జానీ బాబా.. ‘మాతాజీ’గా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. అతని వేషధారణ.. పెద్దబొట్టు, పాపిట కుంకుమ, ముక్కపుడక, గాజులు, ఎర్రటి వస్త్రాన్ని చీరగా కట్టుకునే తీరు అంతా కూడా అమ్మవారిని తలపించేది. ‘ఆధ్యాత్మిక అనుభూతి’ కోసం జానీ చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి.. బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయం సమీపంలోని గుహలో నివసించారట. అక్కడే ధ్యానం చేసి.. తను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు ఆ సమీపంలోనే తన ఆశ్రమాన్ని నిర్మించారట. దశాబ్దాల పాటు అన్నపానీయాలు తీసుకోకుండానే జీవించిన మనిషిగా అంతర్జాతీయంగా పాపులరైనప్పటికీ.. సమాజంలోని ఓ వర్గం అతని శైలిని అనుమానించింది. తన 91 ఏట.. 2020 మే నెలలో మాతాజీ మరణించారు. అతని ఆశ్రమంలోనే ఆ బాబాకు సమాధి నిర్మించిన భక్తులు నేటికీ అతన్ని దైవంగానే భావించి పూజిస్తుంటారు. ప్రస్తుతం అతని శిష్యులే ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే చున్రీవాలా మాతాజీ.. అన్నేళ్లపాటు ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాకుండా ఎలా జీవించారు అనేది నేటికీ మిస్టరీనే! సంహిత నిమ్మన (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
ఆ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఊటలే!.. నీటి ఊటతో కూలుతున్న ఇళ్లు
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ల ముంపు బాధితులకు మరో ముప్పు వచ్చి పడింది. ఉబికి వస్తున్న నీళ్లతో కునుకు లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. నీటి ఊటలతో నివాసగృహాలు ధ్వంసమై కూలిపోతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది మక్తల్ మండలం భూత్పుర్, మాగనూర్ మండలం నేరడుగాం ముంపు గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అందని పరిహారం.. 2010 నవంబర్ 3న భూత్పుర్‌ను ముంపు గ్రామంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. గ్రామంలో 2,400 మంది జనాభా ఉంది. భూత్పుర్ రిజర్వాయర్‌లో 530 ఇళ్లు, 2,500 ఎకరాలు మునకకు గురవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అప్పట్లో ప్రభుత్వం తరి పొలానికి రూ.80 వేలు, మెట్టభూమి ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నేటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుకుసాగని పునరావాసం పనులు.. భూత్పుర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 2015లో అధికారులు స్థలం ఎంపిక చేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం, పునరావాస కేంద్రంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో ముంపు గ్రామంలోనే నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా రిజర్వాయర్ నీళ్లు ఇళ్లలోకి వస్తుండటంతో నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నేరడుగం నిర్వాసితుల గోస.. సంగంబండ రిజర్వాయర్‌కు కట్టకింద ఉన్న నేరడుగాం గ్రామంలో దాదాపు 2,200 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 2,800 ఎకరాలు రిజర్వాయర్‌లో, 300 ఎకరాలు కాల్వల్లో ముంపునకు గురికాగా.. నేటి వరకు నష్టపరిహారం అందలేదు. అదేవిధంగా 746 ఇళ్లు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించి, నంబరింగ్ ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకుగాను 150 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో ముంపు గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు పదేళ్లు గడిచినా భూత్పుర్, నేరడుగాం నిర్వాసితుల సమస్య తీరడంలేదు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలుతున్న ఇళ్లు.. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కారణంగా నేరడుగాం, భూత్పుర్ గ్రామాల్లో ఎక్కడ చూసినా నీటి ఊటలే కనిపిస్తున్నాయి. నీటి ఊటలతో నివాసగృహాలు కూలిపోతున్నాయి. రోజురోజుకూ నీళ్లు ఉబికి రావడం అధికం కావడంతో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వారి పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళనకు చెందుతున్నారు. ఉబికి వస్తున్న నీళ్లతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నష్టపరిహారం చెల్లించాలి.. రోజురోజుకూ భూత్పుర్ గ్రామంలో నివసించే పరిస్థితి లేకుండాపోతోంది. తమకు పునరావాసం కల్పించడంతో పాటు ఇళ్లు, స్థలాలను కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ సారించాలి. – కుర్వ హన్మంతు, సర్పంచ్, భూత్పుర్ ఇళ్లు కూలిపోతున్నాయి.. గ్రామంలో నీళ్లు ఉబికి వ స్తుండటంతో ఇళ్లు కూలిపోతున్నాయి. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాన్ని ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఉంది. అధికారులు గుర్తించిన 530 ఇళ్ల కు త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – ఆనంధ్ శేఖర్, భూత్పుర్ ప్రభుత్వం ఆదుకోవాలి.. భూత్పుర్ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. గ్రామంలో నీళ్లు ఉబికి వస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. – ఖతాల్ హుస్సేన్, కోఆప్షన్ సభ్యుడు, భూత్పుర్ -
సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులపైనా గురి
సాక్షి, హైదరాబాద్: సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం గత పదేళ్లలో చేసిన అప్పులు, వ్యయం, కల్పించిన ఆయకట్టు, నష్టాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం, పాలనపరమైన అనుమతులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, ప్రతిపాదించిన ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, మిగిలిన ఆయకట్టుకు సాగునీటి సరఫరాకు కావాల్సిన నిధులు, ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా తరలించిన జలాలు, ఇందుకు అయిన నిర్వహణ వ్యయం, ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం అప్పులు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.81 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా, ఇప్పటివరకు ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించారు? మిగిలిన ఆయకట్టుకు అందించడం సాధ్యమేనా? ఇందుకు ఎంత వ్యయం అవుతుంది? వంటి విషయాలతో సమాచారం తయారు చేసినట్లు చెబుతున్నారు. సీఎం సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ప్రత్యేక నివేదికను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల స్థితిగతులు, తెలంగాణ ఏర్పడడానికి ముందు చేసిన వ్యయం, తెలంగాణ వచ్చాక ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై కూడా నివేదికను రూపొందించారని అంటున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందించే అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టికి బదులు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన వార్ధా బ్యారేజీ విషయంలో ముందుకు వెళ్తారా? అన్నదానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రాప్ హాలిడే పైనా వివరణ నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వలు అడుగంటి పోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న 6.4 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సైతం నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మొత్తం ఎన్ని టీఎంసీల వరద వచ్చింది? ఆశించిన మేరకు వరద రాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్ని టీఎంసీలు సాగు, తాగునీటి అవసరాలకు వాడారు? తదితర అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వనుందని తెలిసింది. విద్యుత్ సంస్థల నష్టాలు, అప్పులే ప్రధానం తెలంగాణ వచి్చన తర్వాత రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకున్న అప్పులు, నష్టాలు, ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విశ్లేషిస్తూ విద్యుత్ శాఖ అధికారులు నివేదిక ఇచి్చనట్లు తెలిసింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమ, మంగళవారాల్లో విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీతో సమావేశమై విద్యుత్ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. కాగా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి రూ.28,140 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. రూ.12,515 కోట్ల ట్రూఅప్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించకుండా తామే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్‌ఎనీ్పడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్) నష్టాలు రూ.50,275 కోట్లకు పెరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరించనున్నట్టు తెలిసింది. -
'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!
మనం వంటల్లో వాడే ఇంగువతో బోలెడెన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మన ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇంగువని నిపుణులు చెప్పిన విధానంలో గనుక తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. దీన్ని 'హింగ్' లేదా 'ఇంగువ' అని కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన మసాలా. దీన్ని మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యల నుంచి సత్వరమే బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి మెరుగైన పోషక శోషణను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తదితర సమస్యల నుచి రిలీఫ్ పొందగలరని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఇలా ఇంగువ వాటర్‌ని ఇలా తయారు చేసుకుని తాగితే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇంగువ వాటర్ తయారీ విధానం: 1/4 టీస్పూన్ హింగ్ (ఇంగువ లేదా ఆసుఫోటిడా) 1 గ్లాసు వెచ్చని నీరు తయారీ విధానం: గోరు వెచ్చని నీటిలో ఇంగువ వేసి కలపండి. ఇంగువ పూర్తిగా నీటిలో కరిగిపోయేంత వరకు కాసేపు అలానే ఉంచండి. కాసేపటి తర్వాత ఆ నీటిని తాగండి. ఇలా పరగడుపునే ఖాళీ కడుపుతో తీసుకోంటే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!) -
శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక!
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో యూపీలోని యోగి సర్కారు శ్రీరామభక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ వాటర్ మెట్రో అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకు ప్రయాణిస్తూ, పర్యాటకులకు అయోధ్య సంస్కృతిని పరిచయం చేయనుంది. దేశంలో ఇది మొట్టమొదటి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందనుంది. ఈ వాటర్ మెట్రో 2024, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఇటీవల అయోధ్యలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర జలమార్గాలను ప్రోత్సహించడానికి సన్నాహాలు చేశారు. ఈ వాటర్ మెట్రో సరయూ నదిలో ముందుకు సాగనుంది. ఇది పర్యాటకులను అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకూ.. గుప్తర్ ఘాట్ నుండి అయోధ్యకు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటుంది. వాటర్ మెట్రోలో 50 అత్యాధునిక సీట్లు ఉండనున్నాయి. దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఘాట్ నుండి మెట్రో వరకు పర్యాటకులు వంతెనగా ఉపయోగించేందుకు రెండు జెట్టీలు కూడా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి! -
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో...
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
అధ్వానంగా ఎత్తిపోతల పథకం
నడిగూడెం: మండల కేంద్రం సమీపాన ఉన్న సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న ఎల్–34 ఎత్తిపోతల పథకం అధ్వానంగా మారింది. మోటార్లు పని చేయడం లేదు. పైపులైన్లు దెబ్బతిన్నాయి. మేజర్, మైనర్ కాల్వలు పలుచోట్ల పూడి, కంప చెట్లమయంగా మారాయి. దీంతో చివరి భూములకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. ఈ పథకం కింద నడిగూడెం పరిధిలో దాదాపు 100 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది నీటి పారుదల శాఖ కింద అత్యవసర మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు చేసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పనులు చేపట్టలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
ఛత్ వేడుకల్లో విషాదం.. వివిధ ప్రాంతాల్లో 22 మంది మృతి
బీహార్‌లోని పలు ఛత్ ఘాట్ల వద్ద నీట మునిగి 22 మంది మృతిచెందారు. ఆది, సోమవారాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు యువకులు, ఏడుగురు యువతులు, ఒక బాలిక సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. షాపూర్ సమీపంలోని బ్రహ్మాపూర్ చెరువులో అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఇద్దరు కవల సోదరులతో సహా ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహించిన జనం జగన్పుర సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డును దిగ్బంధించి, ట్రాఫిక్ చెక్‌పోస్టును ధ్వంసం చేసి దానిని తగులబెట్టారు. సరన్ జిల్లాలోని దిఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దాస్చక్ గ్రామంలో గంగా నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో మునిగి మరణించారు. దర్భంగా జిల్లాలోని నెహ్రా అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్పూర్ గ్రామంలో కొందరు యువకులు ఛత్ పూజ అనంతరం జూదం ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో నీటితో నిండిన గోతిలో రోషన్ అనే యువకుడు పడిపోయి మృతి చెందాడు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! -
మోకాలు లోతు నురగ నీటిలో ఛఠ్ పూజలు
ఢిల్లీ: యమునా నదిలో కలుషిత నీటిలోనే భక్తులు నేడు ఛఠ్ పూజలు నిర్వహించారు. కాళింది కుంజ్ వద్ద మోకాలు లోతు నురగ నీటిలో మహిళలు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యమునా నది కలుషిత నీటిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Delhi: Devotees stand in knee-deep toxic foam in Yamuna for Chhath Puja Read @ANI Story | https://t.co/M97YK6qIOn#Yamuna #ChhathPooja #Delhi #ToxicFoam pic.twitter.com/dPrvex1Esh — ANI Digital (@ani_digital) November 20, 2023 నాలుగు రోజుల పాటు సాగిన ఛఠ్ పూజా వేడుకల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు సోమవారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. యమునా నదిలో నురగలు వస్తున్నప్పటికీ తప్పనిస్థితిలో భక్తులు పూజా కార్యక్రమాలు చేశారు. అయితే.. యమునా నది నీటిలో అధిక పాస్పేట్ స్థాయిల కారణంగా నురగ నీరు ప్రవహిస్తోంది. యూపీ, హర్యానా సహా చుట్టుపక్కల రాష్ట్రాల పరిశ్రమల నుంచి కలుషిత నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా నది నీటిలో పాస్పేట్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. ఛఠ్ పూజా కార్యక్రమాలు ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్, యూపీ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఛఠ్ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. స్వచ్ఛత, సద్భావన, విశ్వాసాలకు నిలయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
కరెంటు, నీళ్లు కావాలంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలి: కేసీఆర్
-
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 78 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 731 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 300 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,044 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామన్‌పాడుకు 1,140 క్యూసెక్కులు మదనాపురం: జూరాల ఎడమ కాల్వ నుంచి రామన్‌పాడు జలాశయానికి 1,140 ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు 1,150, కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు విడుదల చేయడంతో పాటు తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ రనిల్‌రెడ్డి తెలిపారు. -
మీరే తెలంగాణ ద్రోహులు
లక్డీకాపూల్(హైదరాబాద్):‘అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు’’అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రో హులంటూ తననుద్దేశించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన వెన్నుపోటుదారులనీ, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి తమ కుటుంబాన్నే అభివృద్ధి చేసుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి దివాలా తీయించి, కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్ట్ కట్టి రూ.లక్ష కోట్లు కాజేశారు’అని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉ ద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫాంహౌస్‌కే.. నియామకాలు మీ ఇంట్లోకే పరిమితం చేశారు’అని షర్మిల ఆరోపించారు. -
కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే..
ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే మనుషులు, జంతువులు, చివరికి పక్షులు కూడా పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ జూలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అక్కడ చెట్లు, మొక్కలు సమృద్ధిగా ఉన్నందున, కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూలోని జంతువులు, పక్షులపై కాలుష్య ప్రభావం పడకుండా ఉండేందుకు జూ పార్కు సిబ్బంది అక్కడి చెట్లు, మొక్కలపై నీరు జల్లే పనిని చేపడుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ జూలాజికల్ పార్క్‌లోని చెట్లపై నీళ్లు చల్లాలని అక్కడి సిబ్బందిని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఆకాంక్ష మహాజన్ మాట్లాడుతూ తమ దగ్గరున్న నీరు చల్లే సదుపాయాలు ద్వారా చెట్లు, మొక్కలపై నీరు జల్లుతున్నామని, తద్వారా పక్షులు, జంతువులపై పొగమంచు ప్రభావం తక్కువగా పడుతుందన్నారు. జంతుప్రదర్శనశాల లోపల చాలా పచ్చదనం ఉందని, బయటి ప్రాంతాలతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈసారి అక్టోబర్ నుండే జంతువులకు శీతాకాలపు ఆహారాన్ని అందించే పనిని ప్రారంభించామని, ఈ ఆహారం జంతువులలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? #WATCH | Sprinkling of water done in Delhi's National Zoological Park, as a measure against the rise in Air Quality Index (AQI) in the national capital (04/11) pic.twitter.com/ufyMDFV4YU — ANI (@ANI) November 5, 2023 -
ఏపీలో నీటి యాజమాన్య పద్ధతులు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో నీటి యాజమాన్య పద్ధతులు సత్ఫలితాలిస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్ ఓరా కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న నీటి కొరతపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సులో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన ఐసీఐడీ సదస్సు జరుగుతోన్న విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సులో నీటి ఉత్పాదక పెంపునకు దోహదపడే అంశాలపై సిఫార్సులను ఆహ్వానించినట్లు తెలిపారు. వాతావరణ మార్పు ప్రభావం నీటి పారుదల రంగంపై ఎక్కువగా ఉందని.. దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చ జరుగుతోందన్నారు. ఇటీవల కాలంలో కురిస్తే కుండపోత, లేదంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, గణాంకాల ప్రకారం సగటు వర్షపాతం నమోదవుతున్నా సకాలంలో వానలు కురవకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లు, జల విద్యుత్కేంద్రాలను అకాల వరదలు దెబ్బతీస్తున్నాయని, దీంతో వాటి కట్టడాల పటిష్టత, డిజైన్లపై సమీక్షించాల్ని అవసరం ఉందన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రానున్న రెండు మూడు దశాబ్దాలకు రుతుపవనాలు అనుకూలంగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు వృద్ధి చేయడం, నీటిని పొదుపుగా వాడడం తప్పనిసరైందన్నారు. వాటర్ రీసైక్లింగ్‌పై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డిసాలినేషన్ ప్లాంట్లకు అధిక వ్యయం అవుతోందన్నారు. అందుకే మంచినీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే వీటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఉంటోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటి వ్యయం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం
అమెరికాకు చెందిన ఒక గమ్మత్తయిన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో పనిచేసే ఓ ఉద్యోగి అదే హోటల్లో బస చేసేందుకు వచ్చిన ఒక మహిళకు వీర్యం కలిపిన నీటిని ఇచ్చాడు. ఆమె ఆ నీటిని తాగినప్పుడు, ఆ రుచి కొత్తగా అనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె ఆ హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆ నీటికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, అందులో వీర్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సదరు హోటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితునిపై తక్షణంచర్యలు చేపట్టి, హోటల్ యాజమాన్యం నుంచి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరుతోంది. జేన్, జాన్ డో దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక హోటల్‌కి వెళ్లారు. రిట్జ్-కార్ల్టన్ హోటల్లో తనకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా స్వాగతం లభించిందని జేన్ తెలిపింది. అనంతరం హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. దీంతో ఒక మగ ఉద్యోగి ఐదు వాటర్ బాటిళ్లను వారి గదిలోకి తెచ్చి, వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత వారంతా నిద్రపోయారు. అర్ధరాత్రి దాహం వేయడంతో ఆమె ఆ బాటిల్లోని నీటిని తాగింది. అయితే ఈ నీటి రుచి కొత్తగా అనిపించడంతో ఆమె భర్తను నిద్ర నుంచి లేపి, విషయం చెప్పింది. దీంతో వారు ఈ విషయమై ముందుగా హోటల్ యాజమాన్యానికి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ హోటల్ ఉద్యోగి ఇచ్చిన నీటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఈ నీటిలో వీర్యం కలిసిందని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ మహిళ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ అకృత్యానికి పాల్పడిన హోటల్ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని, అతనికి త్వరగా శిక్ష పడకపోతే ఇలాంటి పనులను కొనసాగిస్తాడని అన్నారు. ఇది కూడా చదవండి: కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది! -
ఫోన్ నీటిలో పడిందా..? ఇలా చేయండి..
ప్రతి ఒక్కరి జీవితంలోను ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ఫోనో..ఫీచర్ఫోనో ఏదో ఒకటి తప్పకుండా ఉపయోగిస్తున్నారు. అయితే మనదో..మనకు తెలిసిన వారి ఫోన్ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం చూస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చేయకూడనివి.. నీటిలో తడిచిన వెంటనే ఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయటం కానీ, ఫోన్‌ను షేక్ చేయటం కాని చేయవద్దు. మీకు ఫోన్ గురించి తెలిసినా ఓపెన్ చేయవద్దు. ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల వారంటీ కోల్పోవలసి వస్తుంది. తడిసిన ఫోన్‌పై గాలిని ఊదే ప్రయత్నం చేయకూడదు. దాంతో నీరు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. అవగాహన లేకుండా ఎలాంటి హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి. చేయాల్సినవి.. వారెంటీ, ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఇన్సూరెన్స్ అయిపోతే ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తోపాటు మైక్రో ఓఎస్డీకార్డ్ను తొలగించాలి. రిములబుల్ బ్యాటరీ ఫోన్ అయితే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని చాలా సున్నితంగా ఫోన్లోని తడి భాగాలను తుడవాలి. తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అయితే జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి అందులో ఫోన్‌ను ఉంచి కప్పివేయాలని, అందువల్ల తేమశాతం తగ్గుతుందని కొందరు సూచిస్తుంటారు. అయితే దాంతో పూర్తిగా ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా అలా చేసినా మళ్లీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. -
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్‌లో ఏం జరుగుతోంది?
స్పెయిన్‌లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్‌లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్‌తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్‌గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్‌లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్‌లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్‌ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్‌వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..
ఎన్నో రకాల అలెర్జీల గురించి విన్నాం. కానీ ఇలాంటి వింతైన ఎలెర్జీ గురించి విని ఉండే అవకాశం లేదు. ఎందుకంటే? ఇది వస్తే అన్ని విధాలుగా కష్టం. మన మనుగడే కష్టమయ్యేలా చేసే భయానక అలెర్జీ. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని టెస్సా హాన్సెన్ స్మిత్ అనే మహిళ అత్యంత అరుదైన అలెర్జీకి గురైంది. దీని కారణంగా స్నానం చేయాలన్నా భయం. నీరు తాగాలన్న భయమే. కనీసం దప్పికగా ఉన్న నీరు తాగే అవకాశమే లేదు. పొరపాటున నీటి చుక్కలు తగిలేందుకు కూడా వీల్లేదు. ఎప్పుడైన బయటకు వెళ్లితే సడెన్‌గా వర్షం వచ్చిందంటే ఇక ఆ మహిళ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది. ఆమె చిన్నతనంలో అంతా బాగానే ఉంది. అందరిలా హయిగా తుళ్లుతూ ఆడుకుంటుండేది. ఎనిమిదేళ్ల వయసుక వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ భయనక అలెర్జీ వచ్చిందో ఇక ఆ లక్షణాలు ముదిరి ఆమెను కనీసం స్నానం అంటేనే భయపడిపోయేలా చేసింది. అసలు జీవితంలో ఎన్నటికీ బాత్ చేయలేని నిస్సహాయ స్థితిలోకి పడేసింది. కనీసం నీటి జల్లులు తాకిన ఇక అంతే!.. ఒక్కసారిగా శరీరం అంతా మండిపోతూ దద్దుర్లు వచ్చేస్తాయి. క్రమంగా అది ఏ స్థాయికి వచ్చేసిందంటే.. పొరపాటున దాహంగా ఉందని నీరు తాగిందా.. ఆమె గొంతు మండుతున్నట్లు ఉండి ఇక గిలగిల తన్నుకుపోయేంతలా అయిపోతుంది. ఆమె తల్లి ఎన్నో అరుదైన అనారోగ్యాలు చూసిన గొప్ప వైద్యురాలు. కానీ తన సొంత కుమార్తె అంతకంటే ఘోరమైన ఈ వింత అలెర్జీ బారిన పడటం ఆమెకు అత్యంత కష్టంగా ఉంది. View this post on Instagram A post shared by Tessa | living waterless (@livingwaterless) ఆమెకు నీటి సమస్య ఉందని తెలుసుకుని హుతాశురాలైంది. ఆమె సైతన తన కూతుర్నీ ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడేయాలో తెలియక సతమతమవుతోంది. దీన్ని ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అలెర్జీ అంటారు. అంటే నీళ్లు తగిలినా తాగినా మండుతున్నట్లు దద్దర్లు వచ్చేస్తాయి. అసలు నీళ్లు పడవు ఈ అలెర్జీ బారిన పడినవాళ్లకి. అందువల్లేఆమె అందరిలా ఆనందంగా జీవించగలిగే అవకాశమే లేదు. కనీసం స్నానం చేసే అవకాశం లేదు. పాలు మాత్రమే తీసుకోవాలి అది కూడా వ్యాధినిరోధక శక్తి కోసం. పాలల్లో నీళ్లు ఎక్కువ మోతాదు లేకుండా జాగ్రత్తపడాలి. దీని కారణంగా ఆమె ఆస్పత్రి బిల్లు నెలకు లక్షల్లో ఉంటుంది. ఈ ఖర్చుని భరించలేక తల్లిదండ్రులు ఆన్లైన్లో 'గోఫండ్ మీ' అనే వెబ్‌పేజీని ఓపెన్ చేసి తన కూతురు పరిస్థితిని వివరిస్తూ.. డబ్బు అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె గ్రాడ్యేయేషన్ చేస్తుంది. కనీసం స్పీడ్‌గా నడవకూడదు. ఎందుకంటే నడిస్తే చెమటలు పట్టి మళ్లీ ఎలెర్జీ విజృంభిస్తుందనే భయం. అందువల్లో రోజుల్లో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండకతప్పని స్థితి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 నుంచి 250 మందికి మాత్రమే ఆక్వాజెనిక్ ఉర్టికేరియా ఉందని గణాంకాల్లో వెల్లడైంది. View this post on Instagram A post shared by Tessa | living waterless (@livingwaterless) (చదవండి: ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా?) -
కుమార్తెకు డర్టీ వాటర్ బాటిల్ గిఫ్ట్.. తండ్రి చెప్పే ‘జీవిత సత్యం’ ఇదేనట!
ఒక యువతి తన పుట్టినరోజున తన తండ్రి ఎటువంటి విచిత్రమైన బహుమతి ఇచ్చాడో ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన తండ్రి తనకు మురికి నీటితో నిండిన బాటిల్‌ను బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అలాంటి బహుమతి ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ట్వట్టర్(ఎక్స్) యూజర్ ప్యాట్రిసియా మౌ తన పోస్టులో ‘ఈ సంవత్సరం నా పుట్టినరోజున, మా నాన్న నాకు మురికి నీటి బాటిల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను తమాషాకు చెప్పడం లేదు’ అని పేర్కొంది. ఇలాంటి బహుమతి పొందడం ఇదేమీ మొదటిసారి కాదని కూడా ఆమె చెప్పింది. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు అనేక బహుమతులు ఇచ్చారు. వాటిలో ప్రథమ చికిత్స కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్సైక్లోపీడియా, కీ చైన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేం. ఆ మురికి నీటి బాటిల్ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మురికి నీటితో కదులుతున్న బాటిల్ మన జీవితం లాంటిది. అయితే జీవితంలో మనం మన మనసును స్థిమితపరచుకున్నప్పుడు మనలోని మలినాలు 10 శాతం కంటే దిగువకు చేరుతాయి. మురికితో నిండిన బాటిల్‌ను స్థిరంగా ఉంచినప్పుడు ఇదే తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి దృక్ఫధాన్ని మనం కలిగివుండటం అవసరం అని ఆమె పేర్కొంది. ఆమె ఈ పోస్ట్‌ను అక్టోబర్ 2 న పోస్టు చేశారు. వైరల్‌గా మారిన ఈ పోస్టు ఇప్పటివరకూ 1.2 మిలియన్‌కు మించిన వీక్షణలు దక్కించుకుంది. ఈ పోస్ట్‌కు 5,900కు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘ఈ జీవిత పాఠాన్ని సేవ్ చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం? For my birthday this year, my dad gifted me a dirty bottle of water. Not kidding. In the past he’s gifted me: a first aid kit, pepper spray, an encyclopedia, a key chain, dedicated a book he wrote to me, etc. good ol dad gifts. He told me this years gift was extra special as… pic.twitter.com/N56AiGgErJ — Patricia Mou (@patriciamou_) October 2, 2023 -
తల్లి ఫోనులో మునక.. కొడుకు నీట మునక!
అమెరికాలోని టెక్సాస్‌లో గల ఒక వాటర్‌పార్క్‌లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్‌తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్‌గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్‌గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు. ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్‌పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్గార్డ్లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు. క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు. ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది? -
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు!
మనం రైలులో ప్రయాణించినప్పుడు ఏదో ఒక సందర్భంలో రైలు టాయిలెట్లో లేదా బయట వాష్ బేసిన్ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం. లేదా ఎవరో ఒకరు ఇటువంటి ఫిర్యాదు చేయడాన్ని మనం వినేవుంటాం. వేలాది మంది ప్రయాణికులతో రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. అందువల్ల ప్రయాణికులందరికీ అందుబాటులో సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వేశాఖకు పెద్ద సవాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రైలు ప్రయాణం మధ్యలో నీటి కొరత లాంటి సందర్భాలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. ఇకపై రైలులోని టాయిలెట్, వెలుపలి వాష్‌బేసిన్ దగ్గర నీరు అయిపోవడమన్నదే ఉండదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది. ఐఓటీ అంటే అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సమస్య పరిష్కారంలో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. ఇకపై రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలియజేశారు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్ విజయవంతమైంది. త్వరలో మిగతా రైళ్లలో కూడా అమలు చేయనున్నారు. ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది. దీంతో తదుపరి స్టేషన్లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతకు పరిష్కారం లభించనుంది. ఇది కూడా చదవండి: నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? -
ఆ నినాదం తెలంగాణ ప్రజలది కాదు.. కేసీఆర్‌ది
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకా లన్నది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ నినాదం మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, మరో నేత మల్రెడ్డి రాంరెడ్డిలతో కలసి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు హామీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. నిజంగా బీఆర్ ఎస్‌కు రాజకీయ విజ్ఞత ఉన్నట్టయితే సోనియాను గౌరవంగా స్వాగతించి ఉండాల్సింది. కానీ, మేం మీటింగ్ పెట్టుకోగానే బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్‌లు ఏకమై కుట్రలు చేశాయి. సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాయి. సోనియా తెలంగాణకు రావడంతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. వీళ్లంతా కలసి సభను అడ్డుకోవాలని చూశారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. సభ విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ చొక్కాలు చించుకుంటూ రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకుంటూ వెళతామని, తమ ట్రాక్ రికార్డు ఏమిటో తెలిసిన ప్రజలు.. తగిన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ఇచ్చామని, రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామని, అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించామని, అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడామని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర తమదని రేవంత్ పేర్కొన్నారు. ‘2004 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్న కాలంలో ప్రజలకు ఎలాంటి హామీలిచ్చామో, ఏమి నెరవేర్చారో చెపుతాం. 2014లో తెలంగాణ ఏర్పాటయిన తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారో వారినే చెప్పమనండి. మేం చర్చకు సిద్ధం’అని అన్నారు. బీఆర్ఎస్కు మిగిలింది ఇక 99 రోజులేనని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రాల అవసరాల్లో తేడాలుంటాయి తాటిచెట్టంత పెరిగితే.. మెదడు మోకాళ్లలోకి వస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును చూస్తే అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘ఇంటింటికీ ప్రణాళికలు మారినట్టే, రాష్ట్రాల అవసరాల్లో కూడా తేడాలుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు, ఆదాయం ఆధారంగా పార్టీల కార్యాచరణ ఉంటుంది. జాతీయ పార్టీలు అయినంత మాత్రాన దేశమంతా ఒకే విధానం అమలు కాదు. అలా చేయడం వృథా అవుతుంది. ఏ రాష్ట్రంలో ఏ అవసరం ఉందో గుర్తించి, వాటిని నెరవేర్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది’అని అన్నారు. బుర్ర లేకుండా వితండ వాదం చేయవద్దని, వెర్రిమాటలు మాట్లాడితే ప్రజలు చీరి చింతకు కడతారని వ్యాఖ్యానించారు. ధరణిని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను రేవంత్ పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో భూమి సమస్యే ప్రధానమైంది. భూమి కోసమే సాయుధ పోరాటం జరిగింది. కేసీఆర్ పాలనను బొందపెట్టడం ధరణితోనే మొదలు పెడతాం. ధరణిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకువస్తాం’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!
బీహార్‌లోని భాగల్పూర్లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. భాగల్పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ నీరు చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఒక యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపింది. ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియనప్పటికీ, గ్రామానికి చెందిన పలువురు ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు? -
వ్యవసాయదారులకు అండగా సాగునీటి ప్రాజెక్టులు
-
జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం కురిసిన భారీ వర్షం ప్రభావం జీ20 సదస్సుపైనా పడింది. సదస్సు జరుగుతున్న ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలోకి నీరు చేరింది. సిబ్బంది నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టారు. ఆయా దేశాల ప్రతినిధులు నీళ్లలోనే అటూఇటూ నడుస్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. -
Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.?
హైదరాబాద్ : జంట నగరాల్లో వానలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని పాంత్రాల్లో కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షంతో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురవడంతో.. రోడ్లు, లోతట్టు నీట మునిగాయి. అక్కడక్కడా పిడుగులు పడటంతో ప్రజలు వణికిపోయారు. షేక్ పేటలో పరిస్థితిని ఓ సిటిజన్ ఇలా వీడియోతో రిపోర్ట్ చేశాడు. Shaikpet 😦 #HyderabadRains @Director_EVDM pic.twitter.com/TTO7wP1Quv — @Coreena Enet Suares (@CoreenaSuares2) September 5, 2023 భూపాలపల్లి జిల్లాలో పిడుగుల బీభత్సం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు గూడూరు రాజేశ్వర్ రావు (46) మృతి చెందారు. పొలంలో కలుపు తీస్తుండగా రైతు పిడుగుపాటుకు గురయ్యారు. చిట్యాల మండలం శాంతినగర్‌లో మిరప నారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు చెలివేరు సరిత(30), నెరిపటి మమత(32) మరణించారు. మరో ఇద్దరు మహిళలు అరెపల్లి కొమురమ్మ, మైదం ఉమకు గాయాలయ్యాయి. వారిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఇద్దరు మహిళల స్వగ్రామం చిట్యాలగా గుర్తించారు. ఇక పిడుగుల వర్షంతో గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలా చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనంతగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా...మ్యాన్‌హోల్స్, నాలాలు పొంగిపోర్లుతున్నాయి. టోలిచౌకిలో దాదాపు కాలనీ అంతా నీళ్లు చేరాయి. This is Tolichowki a regular spot for floods from years. KTR as a minister what change have you brought to control this rain water on to roads. You have been Minister from 9 years and the situation is same from last 9 years. #HyderabadRains pic.twitter.com/0cME1UuEL2 — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) September 5, 2023 ట్రాఫిక్.. నరకయాతన కుండపోత వర్షంతో నగరమంతా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ పోలీసులు వీలైనంత వరకు వాహనదారుల్ని అలర్ట్ చేస్తూ కనిపించారు. #HYDTPinfo Commuters are requested to drive carefully in #Rain.@HYDTP officers for your assistance at all Junctions.#Rainfall #HyderabadRains @AddlCPTrfHyd pic.twitter.com/giuKMi269d — Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2023 ప్రధానంగా పంజగుట్ట నిమ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, అబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆఫీసులకు వెళ్లే టైంలో భారీవర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంత్ నగర్ లో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. At prashanth nagar Going to exam Jntuh ( St Mary's College) Jntuh oka boat isthe Easy ga reach avtham center ki#HyderabadRains #Hyderabad @examupdt @balaji25_t pic.twitter.com/mPotVP3HC7 — venky (@venky46799918) September 5, 2023 క్షేత్రస్థాయిలో అధికారులు నగరంలో వర్షం కురుస్తున్నందున మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్ఎఫ్ టీమ్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితి చక్కదిద్దుతున్నారని GHMC తెలిపింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 191 వద్ద పరిస్థితి ఇలా ఉంది. Heavy rainfall in several places of #Hyderabad today. Situation at the favourite place of #Waterlogging , at the pillar no.191, under PVNR Expressway at #Upperpally near Attapur area, traffic interrupts. GHMC at work.#HyderabadRains #HeavyRains pic.twitter.com/DZDOpQFlBx — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 బీ అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రజలకు చుక్కలు కనిపించాయి. #TrafficAlert : Today's situation at the Moosapet area in Hyderabad, traffic moves at snail's pace, as roads were marooned after heavy rains. The IMD issued an #OrangeAlert warning for Hyderabad, today.#HyderabadRains #TrafficJam #Hyderabad #Moosapet pic.twitter.com/kokSpgWlm9 — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 వరద నష్టం వరద ఒక్కసారిగా పోటెత్తడంతో భారీ ఆస్తినష్టం జరిగిందని పలువురు సిటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరి వాహనాలు కొట్టుకుపోతే.. మరికొందరి వాహనాలు నీట మునిగాయి. ఇంకొందరి ఇళ్లలో నీళ్లు చేరాయి. #HyderabadRains vs Two-Wheelers pic.twitter.com/tX7kxjcAUr — Donita Jose (@DonitaJose) September 5, 2023 వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు DRF టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. వరదలు, చెట్లు కూలడం తదితర సమస్యల నుంచి రక్షణకు ప్రజలు 040–21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని పేర్కొంది. 👉ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో@metcentrehyd శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.#HyderabadRains #rains #Hyderabad pic.twitter.com/XRhxtD0JTL — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 5, 2023 -
HYD Rains: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు
సాక్షి, మేడ్చల్: భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. పలువురు విద్యార్థులకు ఈ రోజు పరీక్షలు ఉండటంతో మునిగిపోయిన హాస్టల్ నుండి ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మైసమ్మగుడలో కాలువలు, నాళాలు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు నీట మునగటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. రెండు జేసీబీలను రప్పించి అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. -
అత్యంత అరుదైన చేప! ఐతే ఇది ఈత కొట్టదట..ఏకంగా..
నీటిలో చేపలు ఈతకొడతాయి. అయితే, ఇదొక వింత చేప. నీటి అడుగున ఇది నడుస్తుంది. దీనికి ముందు వైపు చేతుల్లా ఉపయోగపడే కాళ్లు పెద్దగా ఉంటాయి. వెనుకవైపు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల దీనిని హ్యాండ్‌ఫిష్ అంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ రకమైన చేప కెమెరా కంటికి చిక్కింది. ఇదివరకు విక్టోరియా తీరానికి చేరువలోని సముద్రంలో 1986లో ఒకసారి, 1996లో ఒకసారి ఇలాంటి హ్యాండ్‌ఫిష్ చేప కనిపించింది. ఇటీవల టాస్మానియా ఈశాన్యాన ఉన్న ఫ్లిండర్స్ దీవికి చేరువలో సముద్రం అడుగున నడుస్తున్న ఈ హ్యాండ్‌ఫిష్ అండర్‌వాటర్ కెమెరాకు చిక్కింది. ఇది నీటికి 292 అడుగుల లోతున ఉండగా కెమెరాకు చిక్కినట్లు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్త కార్లీ డివైన్ తెలిపారు. సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు టాస్మానియా సముద్ర జలాల్లో పరిశోధనల కోసం ‘ఆర్వీ ఇన్వెస్టిగేటర్’ ఓడలో అన్వేషణ సాగిస్తుండగా, ఈ అరుదైన చేప వారి కెమెరాకు చిక్కడం విశేషం. (చదవండి: అక్కడ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!) -
కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ జాతి నమ్మదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి ఎన్నటికీ నమ్మదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ గురువారం తెలంగాణ భవన్లో హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంటు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తోందని, కాంగ్రెస్, బీజేపీలకు దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ నాయకులు జే.ఆర్.కుమార్, శ్రీనివాసులు, సతీష్ ఉన్నారు. -
మంత్రాలయంలో వెలవెలబోతున్న తుంగభద్ర
సాక్షి, కర్నూలు: మంత్రాలయంలో తుంగభద్ర నది వెలవెలబోతుంది. నీళ్లు లేక భక్తులు స్నానాలకు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం అధికారులు తూతూ మంత్రంగా షవర్లు ఏర్పాటు చేశారు. మురుగునీటితో నిండిన తుంగభద్ర.. దుర్వాసన వెదజల్లుతుంది. కాగా, శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు అంగరవైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం విశ్వమోహనుడిని దర్శించుకుంటున్నారు. బుధవారం శ్రీమఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత రాఘవేంద్రుల మూల బృందావనికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామి బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే రాఘవేంద్రుల బృందావన ప్రతిమను బంగారు పల్లకీలో ఊరేగించారు. పూజామందిరంలో స్వామిజీ మూలరామ, వేదవ్యాసుల పూజోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు -
హైదరాబాద్‌లో విషతుల్యంగా నల్లానీరు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ‘జలం’ విషతుల్యంగా మారింది. నల్లా నీరు తాగడానికి సురక్షితం లేనట్లుగా ‘నీటి నమూనా పరీక్షల’ ఫలితాల నివేదికలు వెల్లడిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు వందల కిలో మీటర్ల దూరంలోని గోదావరి, కృష్ణా, మంజీరా, సింగూరు నదుల నుంచి జలాల తరలింపు, నీటి శుద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం నగరవాసుల పాలిట ప్రాణసంకటంగా తయారైంది. కనీసం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీరు తాగేందుకు సంతృప్తికరం కాదని వెల్లడవుతున్న నీటి శాంపిల్స్ పరీక్షల నివేదికలను సైతం ఎక్కడికక్కడే తొక్కిపెట్టి గోప్యత ప్రదర్శించడం మరింత విస్మయానికి గురిస్తోంది. నీటి నాణ్యత అంశంలో ప్రజల నుంచి ఫిర్యాదుతో పాటు ఒత్తిడి వస్తే తప్ప అధికారులు స్పందించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రస్తుతం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీటిని వేడి చేసి చల్లార్చి వడపోస్తే తప్ప తాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నల్లా నీటిని నేరుగా తాగితే జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నట్లు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి మాత్రం ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్ఓ నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు థర్ట్ పార్టీ నిర్వహించిన నీటి నమూనా పరీక్షలు వెల్లడించడం ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు విభాగాలుగా.. ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నిత్యం నాలుగు విభాగాలుగా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జలమండలి యంత్రాంగం పేర్కొంటోంది. జలమండలి, క్యూఏటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, స్వయం సహాయక బృందాల సభ్యుల ద్వారా వేర్వేరుగా నీటి శాంపిళ్లను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్న్ శాతం 0,5 పీపీఎం కంటే తక్కువగా ఉన్నా, కలుషితంగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినా తక్షణమే నీటి సరఫరా నిలిపివేసి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఇటీవల జలమండలి యంత్రాంగం సరికొత్త సంస్కరణలో భాగంగా వినియోగదారుల సమక్షంలో ఇంటి వద్దనే నీటి పరీక్షలు నిర్వహించే విధంగా లైన్మెన్ల ఫోన్లలో ‘నాణ్యత’ పేరుతో ప్రత్యేక యాప్ ఇన్స్టాల్ చేసి అందుబాటులోకి తెచ్చినా.. లైన్‌మన్ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు మాత్రం లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం కేవలం నాణ్యత యాప్ ద్వారానే ప్రతి రోజు సుమారు 15వేల శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తున్నట్లు పేర్కొంటున్నారే తప్ప.. వాటి పరీక్షల నివేదికలు బహిర్గతం చేసేందుకు వెనుకాడటం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఇదిగో నాణ్యతలేమి.. నల్లా ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో నాణ్యతలేమి ఆందోళ కలిగిస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును థర్ట్‌పార్టీ నిర్వహించిన నీటి శాంపిల్ పరీక్ష ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జలమండలి క్యూఏటీ విభాగాలు సంయుక్తంగా నగర వ్యాప్తంగా సరఫరా అవుతున్న నల్లా నీటిలో ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. నమూనా పరీక్షల్లో అసంతృప్తిగా వచ్చిన ఫలితాల నివేదికలను ఎప్పటికప్పుడు జలమండలి సంబంధిత ల్యాబ్‌కు సిఫారస్ చేస్తోంది. గత నెల (జులై)లో సేకరించిన నల్లా నీటి నమూనా పరీక్ష ఫలితాల నివేదిక ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిని పరిశీస్తే.. నల్లా నీటిలో నాణ్యత ప్రమాణాల స్థితి బెంబేలెత్తిస్తోంది. ► మొత్తమ్మీద సుమారు 38 ప్రాంతాల్లో సరఫరా జరిగిన నీరు తాగడానికి ఆమోదయోగ్యం కానట్టు నీటి నమూనా పరీక్షల నివేదికలో వెల్లడైంది. అమీర్‌పేట్, అంబర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, ఇమామ్‌గూడ, రెడ్‌హిల్స్, బన్సీలాల్‌పేట, బోయగూడ, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్ శాతం అసలు లేనట్లు పరీక్షలో తేలింది. ► మిగతా ప్రాంతాలు ఘాన్సీబజార్, ఆసిఫ్‌నగర్, రేతిబౌలి, షేక్‌పేట, లంగర్‌హౌస్, ఉస్మాన్‌గంజ్, చార్మినార్, వెంగళ్రావు నగర్, హుస్సేనీ ఆలం, ఖిల్వాత్, ఖైరతాబాద్, ముషీరాబాద్, రామ్‌నగర్, చంచలగూడ, కవాడిగూడ, సైదాబాద్, మలక్‌పేట, ఈదీబజార్, వనస్థిలిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్్ శాతం 0. 5 నుంచి 1.0 పీపీఎం వరకు ఉన్నప్పటికీ.. నీరు కలుషితం, ఇతరత్రా కారణంగా తాగడానికి యోగ్యం కాదని వెల్లడైంది. గడిచిన ఆరు నెలల నివేదికలు సైతం పరిశీలిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు బయటపడింది. అంతా గోప్యంగానే.. నల్లా ద్వారా సరఫరా చేసే నీటిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు జాతీయ స్థాయి సంస్ధల నుంచి అవార్డులపై అవార్డులు అందుకుంటున్న జలమండలి యంత్రాంగం నీటి శాంపిల్ పరీక్షల నివేదికలపై మాత్రం అత్యంత గోప్యత ప్రదర్శించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరవాసులకు సురక్షిత జలాలు అందించేందుకు నిత్యం సరఫరా జరిగే నీటి నాణ్యత పరిశీలన కోసం నాలుగు వేర్వేరు విభాగాల బృందాలతో నీటి శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. వాటి పరీక్షల నివేదికలు మాత్రం బహిర్గతం కాకుండా సంస్థ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు జాగ్రత్త పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తూ సంబంధిత విభాగం డైరెక్టర్ అధికారికంగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు ఇచ్చేందుకు నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక నీటి నమూనాలు పరీక్ష కేంద్రం అధికారి నివేదికలు ఇచ్చేందుకు తాను ఆథరైజ్ కాదని, ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. -
ఆ గ్రహంపై అధిక ఉష్ణోగ్రతలు.. తుఫాను గాలులు, రాళ్ల వర్షాలు
కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు రెండు గ్రహాలను కనుగొన్నారు. ఈ గ్రహాలు మిగిలిన గ్రహాల కన్నా భిన్నంగా ఉన్నాయి. వాటి పరిమాణం బృహస్పతి గ్రహానికి సమానంగా ఉంది. ఈ రెండు గ్రహాలు మన పాలపుంత గెలాక్సీలో వాటి నక్షత్రానికి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు అక్కడి అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కుతాయని, ఈ గ్రహాల్లో ఒకదానిపై ఆవిరితో కూడిన రాళ్ల వర్షం కురుస్తుండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తీవ్రతకు టైటానియం వంటి శక్తివంతమైన లోహాలు కూడా కరిగి ఆవిరైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలలో ఈ రెండు గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఈ గ్రహాల ద్వారా పాలపుంతలోని వైవిధ్యం, సంక్లిష్టత, విశిష్ట రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ గ్రహాల ద్వారా విశ్వంలోని గ్రహ వ్యవస్థ అభివృద్ధిలో వైవిధ్యాన్ని కూడా తెలుసుకోవచ్చంటున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రిపోర్టులో శాస్త్రవేత్తలు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యుఏఎస్‌పీ-178b అనే గ్రహాన్ని గుర్తించామని తెలిపారు. ఈ గ్రహంపైగల వాతావరణంలో సిలికాన్ మోనాక్సైడ్ వాయువు ఉంటుంది. ఈ గ్రహంపై పగటిపూట మేఘాలు ఉండవని, అయితే రాత్రిపూట గంటకు రెండు వేల మైళ్ల వేగంతో తుఫాను గాలులు వీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దీనితో పాటు, ఈ గ్రహంలోని ఒక భాగం ఎల్లప్పుడూ దాని నక్షత్రం వైపు ఉంటుంది. ఈ గ్రహానికి అవతలి వైపున ఉన్న సిలికాన్ మోనాక్సైడ్ చాలా చల్లగా ఉండడం కారణంగా మేఘాల నుంచి నీరు వెలువడేందుకు బదులుగా రాళ్ల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఈ గ్రహం మీద ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల రాళ్లు కూడా ఆవిరిగా మారుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొదటిసారి సిలికాన్ మోనాక్సైడ్ ఇలాంటి రూపంలో కనిపించింది. మరొక అధ్యయనం ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. దీనిలో అత్యంత వేడి వాతావరణం కలిగిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారనిపేర్కొన్నారు. 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి కేఈఎల్టీ-20బీ అని పేరు పెట్టారు. ఇది కూడా చదవండి: భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? -
చంద్రునిపైకి ఒక వాటర్ బాటిల్ పంపాలంటే.. అదానీ, అంబానీలే ఆలోచించాలి!
చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ కోసం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ కోసం భారత్ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేస్తాయి. ఏ దేశమైనా ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్ బాటిల్ పంపాలనుకుంటే, దానికి ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రునిపైకి మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్ సెర్నాన్ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుని ఉపరితలంపైకి ఒక వ్యక్తి చేరుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. నిజానికి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు.. చంద్రునిపైకి మనిషిని పంపాలని అమెరికా ప్లాన్ చేసింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 104,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది. చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్ బాటిల్ పంపాలంటే ఎంత ఖర్చవుతుందనే విషయానికి వద్దాం. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్ బాటిల్‌ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?హైపోనాట్రేమియా వస్తుంది జాగ్రత్త!
నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందుకే రోజూ వీలైంత ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మంచినీళ్లు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మరి ఒక మనిషి రోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? అతిగా నీళ్లు తాగితే వచ్చే ఇబ్బందులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం కావాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే, నీళ్లు మన శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే మంచిది కదా అని అతిగా నీళ్లు తాగడం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా నీళ్లు తాగడం వల్ల మెదడపు ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే నీళ్లు తీసుకోవాలి. హైపోనాట్రేమియా ఏర్పడి.. మరణానికి కూడా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగితే మంచిది. కానీ కొందరు కావాలని బలవంతంగా ఎక్కువగా నీళ్లు తీసుకుంటారు. దీని వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. ఇది ఎక్కువైతే, మెదడు వాపు,కోమాలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు దాహం ద్వారా అది మనకు తెలుస్తుంది. అప్పుడు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. చాలామంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నీరు చాలా త్వరగా శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీళ్లు తాగడానికి ప్రయత్నించడం. మరీ చల్లని, మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 3-4 లీటర్ల నీరు సరిపోతుంది. -
నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు"
ఇవి మైక్రో రోబోలు. ఫొటోలో కనిపిస్తున్నంతగా ఉండవు. మనిషి వెంట్రుక కంటే తక్కువ మందంతో సన్నని గొట్టాల మాదిరిగా ఉండే ఈ రోబోలు నీటిలోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగిస్తాయి. అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో నీటి కాలుష్యం వల్ల విపరీతమైన సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, ఈ మైక్రో రోబోలను రూపొందించారు. ఒక పైపులో ఈ మైక్రోరోబోలను భద్రపరచి ఉంచుతారు. కలుషితమైన నీటిలోకి వీటిని విడిచిపెడితే, గంటలోపే నీటిలో ఉండే సీసం, పాదరసం వంటి భారలోహ కణాలను పూర్తిగా తొలగిస్తాయి. నీటిలోకి ప్రవేశించగానే, ఇవి వీటి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుని, సూక్ష్మాతి సూక్ష్మమైన భార లోహకణాలను, ప్రమాదకర రసాయనాల కణాలను పీల్చేసుకుని, నీటిని సురక్షితంగా మారుస్తాయి. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
గోదావరిలో చుక్కనీటినీ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు. జీ–10 సబ్ బేసిన్లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు. -
చంద్రునిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం మనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరబోతోంది. చంద్రుని దక్షిణ ధృవం లో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించ బోతున్నాము? , అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది?, దాని లక్షణాలు. అలాగే చంద్రుని పై మట్టి పొరలు వాటి లక్షణాలు, సాంకేతికంగా, మానవాళికి వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి అంశాలను తెలుసుకుంటాం. చారిత్రకంగా చూస్తే , ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు పంపిన చంద్రయాన్ ఉపగ్రహాలన్నీ చంద్రుని ఉత్తర ధృవం మీదకు మాత్రమే చేరగలిగాయి . దక్షిణ ధృవం మీదకు కొన్ని ఉపగ్రహాలు పంపగలిగినా అక్కడ పరిశోధనలేమీ జరగలేదు. ఇప్పుడు మనం పంపిన చంద్రయాన్-3.. దక్షిణ ధృవం మీద దిగుతూ, రోవర్ సహాయంతో 14 రోజుల పాటు జరపబోయే ప్రయోగాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మన భారతీయ వేద విజ్ఞానం, పురాణాలూ ఇతిహాసాలు , యజ్ఞ యాగాదులలో కూడా ఖగోళ రహస్యాలను, గ్రహగతులు, లక్షణాల గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు మన భారతీయ సాంప్రదాయంలో జరుపుకునే యజ్ఞ యాగాదులలో , సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహ పూజ జరుపుతాము . ఆ సందర్భంలో చంద్రుని గురించి ఈ క్రింద మంత్రం చెబుతాం (నవ గ్రహ సూక్తం). ప్రస్తుతం మన ఆసక్తి అంతా చంద్రుడు కావున, దాని గురించి ఏమి చెప్పారో పరిశీలిద్దాం నవ గ్రహ సూక్తం లో చంద్రుని గురించిన శ్లోకం యిలా ఉంటుంది • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్ర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ చంద్ర గ్రహస్య దక్షిణతః అధి దేవతాం ఆపః సాంగం సవాహనం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ ॥ చంద్ర గ్రహస్య ఉత్తరతః ప్రత్యధి దేవతా గౌరి సాంగం సవాహనం సాయుధం సశక్తి , సపతి, పుత్ర పరివార సమేతం గౌరి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒ నమః॑ ॥ 2 ॥ ఈ క్రింద యిచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తే , సూర్యునికి ఆగ్నేయ దిక్కులో చంద్ర గ్రహాన్ని చూడగలము . ప్రతి గ్రహానికి దేవత మూడు ప్రధాన స్థాయిలు ఉన్నాయి. గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత. గ్రహం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అధి దేవత మీకు సహాయం చేస్తుంది. అవేమిటో ఒక్కక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము. ముందుగా గ్రహ దేవత అయిన చంద్రుని గురించి ఏమి చెప్పారంటే • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ ఆప్యా॑యస్వ (దయచేయండి ), సమే॑తు (ఒక చోటికి చేర్చు ) , తే (మీరు) , వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ (విశ్వ వ్యాప్తంగా వరాలను దీవెనలను అందించి ప్రయోజనం కలిగించే చంద్రుడు ), భవా॒ వాజ॑స్య సంగ॒థే (మీరే మా బలంగా మారండి ) చంద్రుని అధి దేవత - ఆపః (నీరు), యిది చంద్రునికి దక్షిణ దిక్కులో ఉంటుంది, ఈ నీటి గురించి ఇంకేమి చెప్పారంటే • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ అప్సుమే (ఈ నీటిలో ), సోమో॑ (చంద్రుని అంశ ) , అబ్రవీదం (చెప్పబడినది ), అంతర్విశ్వా॑ని (సమస్త - యూనివర్సల్ ) భేషజా (నివారణ ) ఈ ప్రకారం చంద్రునికి దక్షిణ దిక్కులో నీరు వున్నది, ఆ నీటి మీద జరిపే పరిశోధనల మూలంగా చంద్రుడి స్వభావాన్ని, పూర్వోత్తరాలను అర్థం చేసుకోగలం అని స్పష్ట మవుతుంది ఈ నీటి కి ఔషధ లక్షణాలు ఉండటం వలన ఇది వైద్య రంగంలో సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. తరువాత చంద్రుని ప్రత్యధి దేవత గౌరి, ఉత్తర దిక్కులో వున్న ప్రత్యధి దేవత గౌరి గురించి ఏమి చెప్పారంటే • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ మిమాయ (సృష్టించు), సలి॒లాని (నీళ్లు , ద్రవాలు), తక్ష॒తి (ఆధారం ) , ఏక॑పదీ (ఒక పాదం )... నవ॑పదీ (9 పాదాలు) , బభూ॒వుషీ (ఆమె అవుతుంది ), స॒హస్రా᳚క్షరా (అనంత నేత్రాలు కలది ), పరమే (సుప్రీం ), వ్యో॑మన్ (ఆకాశం, అంతరిక్షం ) ఈ శ్లోకం గౌరీ దేవత వైవిధ్యమైన రూపాలను వివరిస్తుంది, అలాగే సృష్టి, విశ్వం వివిధ అంశాలలో ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. ఇప్పటి వరకు చంద్రుని మీదకు చేరిన వివిధ దేశాల ఉపగ్రహాలను ఈ క్రింది చిత్రంలో చూడగలరు. దాదాపు అన్నీ చంద్రుని ముందు భాగం, పై అర్థ భాగంలోనే ఉన్నాయి. చైనా 2019 లో ప్రయోగించిన చేంజ్-4 మాత్రమే చంద్రుని వెనుక భాగం వైపు దించారు. చంద్రునిపై నీటి ఆనవాళ్లు: చంద్రునిపై నీరు ఉందని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ నీరు భూమిపై మనకు కనిపించే నీటికి భిన్నంగా ఉండే రూపాల్లో ఉంది. NASA వాళ్ళు 2018 లో విడుదలచేసిన మ్యాప్‌లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటాయి. గడ్డ కట్టడానికి (-157 డిగ్రీల సెల్సియస్) వీలు కల్పిస్తాయి. అలానే 2020 లో NASA విడుదల చేసిన మ్యాప్‌లు , సూర్యరశ్మి ఉన్న ప్రాంతాలలో కూడా నీరు ఉన్నట్లు ధృవీకరించింది. ఇప్పటికి వరకు చంద్రుని పైన లభించిన ప్రకారం Lunar Regolith (లూనార్ రెగోలిత్) లో ఘనమైన శిలలను కప్పి ఉంచే వదులుగా ఉండే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచించాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ అణువులు (హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక) కనుగొనబడ్డాయి. ఇలాంటి నీరు భవిష్యతుల్లో మంచి వనరులుగా ఉపయోగమున్నప్పటికీ వీటి వెలికితీత సవాళ్లు తో కూడుకున్న పని. అలాగే ఈ చంద్రుని నీటిని అధ్యయనం చేయడం వలన చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే గొప్ప అవకాశం లభిస్తుంది . ఈ రకంగా మన ఋషులు ద్రష్టలు వేదవాఙ్మయం ద్వారా అందించిన ఖగోళ శాస్త్ర రహస్యాలను, ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో క్రోడీకరించి , ప్రపంచ మానవాళి మనుగడకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతారని ఆశిద్దాం. -Dr. Y. Hanumantha Rao, email: hanuyr@gmail.com ఇదీ చదవండి: Chandrayaan 3 Mission Details: చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్ -
విద్యార్థి తాగునీటి బాటిల్లో మూత్రం
కొరుక్కుపేట(చెన్నై): పుదుకోట్టై సమీపంలోని కీలయూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఓ విద్యార్థిని ఇటీవల బాటిల్లోని నీరు తాగి వెంటనే వాంతులు చేసుకుంది. దీనికి కారణం ఏమిటని విచారించగా, ఆ విద్యార్థి తాగునీటి బాటిల్లో మూత్రం కలిపినట్లు తేలింది. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. దీంతో జిల్లా ప్రధాన విద్యాశాఖాధికారి మంజుల, అధికారి పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పాఠశాలకు పిలిపించి ప్రశ్నించారు. దీంతో విద్యార్థిని తాగే వాటర్ బాటిల్లో మూత్రం కలిపినట్లు ఇద్దరు విద్యార్థులు అంగీకరించారు. వెంటనే ఉపాధ్యాయులు ఇద్దరికీ పాఠశాల నుంచి బహిష్కరించారు. కాగా పుదుచ్చేరిలో సమీపంలోని వెంగ్కైవ్యాల్లో కొన్ని నెలల క్రితం ఓ పార్టీ వినియోగించే తాగునీటి ట్యాంక్‌లో మలం కలిపిన విషయం సంచలనం కలిగించింది. ఈ విషయం మరువక ముందే తాగినీటి బాటిల్లో మూత్రం కలిపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి -
చెట్లు నరుకుతుండగా వింత ఘటన.. వీడియో వైరల్
ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చెట్లు నరుకుతుండగా అకస్మాత్తుగా చెట్టులోంచి మంచినీళ్లు వచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో కొంతమంది చెట్లు నరుకుతుండగా, ఓ చెట్టులోంచి అకస్మాత్తుగా మంచినీళ్లు వచ్చాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను సైతం తాగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. -
మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు? -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్‌సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్‌కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్‌వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
సంతోషం వ్యక్తం చేస్తున్న వరద బాధితులు
-
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ విద్యార్థులు తమ క్లాస్‌మెట్ బాలిక వాటర్ బాటిల్లో యూరిన్ కలిపారు. ఆ విషయం తెలవని బాలిక ఆ నీటిని తాగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తెలుపుతూ రాసిన లవ్ లెటర్ని కూడా బాలిక తన బ్యాగులో గుర్తించింది. ఈ ఘటనపై స్థానికులు దుండగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్వారా జిల్లాలోని లుహారియా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. పాఠశాలలో లంచ్ బ్రేక్‌లో ఓ విద్యార్థిని తాగే వాటర్ బాటిల్లో కొంత మంది విద్యార్థులు మూత్రం కలిపారు. ఆ విషయం తెలియక ఆ బాలిక వాటిని తాగేసింది. దుర్వాసన పసిగట్టిన బాలిక.. తన బ్యాగులో ఉన్న లవ్ లెటర్లో పేర్కొన్న ఆ విషయాన్ని నిర్ధారించుకుంది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన సరైన చర్యలేవీ తీసుకోలేదు. ఈ వ్యవహారంపై స్థానికులు సోమవారం పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. ఆనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై దాడి చేయడానికి జనం వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీఛార్జీ కూడా జరిగింది. ఈ ఘటనలో జనం రాళ్లు రువ్వుకున్నారు. అయితే.. బాధితులు ఇప్పటికీ ఫిర్యాదు చేయలేదని ఏఎస్పీ జ్ఞాణశ్యామ్ శర్మ తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
పెట్రోల్‌కు బదులు నీళ్లు.. కొంత దూరం వెళ్లగానే..
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... వాహనదారులు శనివారం హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకొని కొంత దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. దీంతో మెకానిక్‌లను సంప్రదించగా ఇంజన్‌లోకి పెట్రోల్‌కు బదులుగా నీళ్లు చేరాయని తెలిపారు. వాహనంలోని పెట్రోల్‌ను తీసి పరిశీలించగా నీరు ఉండడంతో కల్తీ జరిగినట్లు గుర్తించారు. పెట్రోల్‌ను బాటిల్లో తీసుకుని వాహనదారులు వందల సంఖ్యలో బంక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో బ్లూ కోర్ట్ సిబ్బంది జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమనిగించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మా తప్పిదం ఏమి లేదని ట్యాంకర్ వచ్చి బంక్‌ల్లో పెట్రోల్ పోసి వెళ్లిపోయిందని తెలుపడం గమనార్హం. మరి పెట్రోల్ కల్తీ ఎక్కడ జరిగిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. జరిగిన పొరపాటుకు వాహనదారుల బండి నంబర్లు ఫోన్ నంబర్ రాసుకుని మళ్లీ ఎంత పెట్రోల్ పోయించుకున్నారో అంత పోసేందుకు ఒప్పందం చేసుకోవడంతో ఆందోళన సద్దుమనిగింది. -
వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్లో ఇటువంటి క్లిప్నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్‌పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. Tiger sighting in Monsoons. This comes from Bandipur. VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9 — Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023 -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్‌లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్‌సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
Kazipet Railway Station Floods Video: ఖాజీపేట రైల్వే ట్రాక్‌పై వరద నీరు