వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..! | Is Barley Good for Health check these Nutrition Benefits | Sakshi
Sakshi News home page

వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!

Published Sat, Mar 2 2024 1:17 PM | Last Updated on Sat, Mar 2 2024 1:19 PM

Is Barley Good for Health check these Nutrition Benefits - Sakshi

బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా  ఉంటుంది. ఇది  కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రక్తపోటును  అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో  ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్‌  తాగవచ్చు.
ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే
 బార్లీ నీళ్లు తాగితే  జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది.
 పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.
 గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.
మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్‌. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement