Barley
-
బార్లీ నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? షుగర్ అదుపులో ఉంటుందా?
మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిని మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిల్లో అద్భుతమైన తృణధాన్యం బార్లీని ఒకటిగా చెప్పుకోవచ్చు. బార్లీలో బి-కాంప్లెక్స్, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్ ఖనిజాలు లభిస్తాయి. ఇంకా పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.బీ విటమిన్, పీచు పదార్థం సంపూర్ణంగా మనకు అందాలంటే పొట్టుతోపాటు బార్లీ గింజలను తీసుకుంటే మంచిది. బార్లీ గింజల్ని బ్రెడ్, సూప్‌లు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ, ఆల్కహాలిక్ పానీయాల్లో కూడా వాడతారు. ముఖ్యంగా బీర్మాల్ట్ మూలంగా కూడా పనిచేస్తుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడితే, వారికి ఎదుగుదలకి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. బరువు నియంత్రణలోబార్లీ వాటర్‌లో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మంచి ఆహారం, వ్యాయామంతో పాటు బార్లీ నీళ్లు తాగితే వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.షుగర్ వ్యాధిగ్రస్తులకుబార్లీ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ స్థాయిల నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. కేన్సర్ నివారణలో సాయపడుతుంది. అంతేకాదు బార్లీ నీళ్లతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది కూడా. -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
Health: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తగ్గించండి! ఇవి తింటే మేలు!
Diet Tips For Control Piles: కొందరికి నిద్రలేవగానే టాయిలెట్‌కి వెళ్లాలంటే నరకమే. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావం. నొప్పితో బాధపడుతుంటారు. అయితే పైల్స్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం వల్ల కొంత మేలు జరుగుతుంది. అవేమిటో చూద్దాం... ►పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి. ►ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసి, ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ►వేయించిన ఆహారం: ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది. ►ఉప్పు అధికంగా తినొద్దు. ►కారంగా ఉండే ఆహారాలు: ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది. ►కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు: ముఖ్యంగా కాఫీ, టీల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల వాటిని వీలయినంత వరకు తగ్గించడం మేలు. ►ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలు మలాన్ని గట్టిగా ఉండేలా చేస్తాయి. తద్వారా మోషన్‌కి వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు ఆల్కహాల్ మానుకోవడం మంచిది. వీటిని తినండి.. ►బార్లీ ►క్వినోవా ►బ్రౌన్ రైస్ ►వోట్స్ ►చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి. ►క్యారట్ ►బీట్రూట్ ►బ్రోకలీ ►కాలీఫ్లవర్ ►కాలే ►క్యాబేజీ ►గుమ్మడికాయ ►బెల్ పెప్పర్స్ ►దోసకాయ ► జామపండు ►బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి. చదవండి: ఔషధాల ఖజానా పుదీనా Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
Health Tips: రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే అద్భుత ఫలితాలు!
Summer Care- Health Benefits Of Barley Water: వేసవి వచ్చేసింది... వేడితో అనేక సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి. డీహైడ్రేషన్ సమస్యలు తప్పవు. అయితే వేసవిలో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీనీళ్లతో చెక్ పెట్టొచ్చు. కేవలం వేసవి సమస్యలకే కాదు... అనేక ఆరోగ్య సమస్యలకు బార్లీ బాగా పని చేస్తుంది. పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్లు, సగ్గుజావ తాగించేవాళ్లు పెద్దలు. అయితే, కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. అదెలాగో చూద్దాం. ►వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ►పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ►మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. ►మధుమేహులకు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది. ►ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు. ►బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ►రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ►మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇకనైనా బార్లీ నీళ్లు ట్రై చేస్తారు కదూ! చదవండి👉🏾Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే చదవండి👉🏾Health Tips: గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా? చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
రైతుకు సిరులు... ఒంటికి సత్తువ!
ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. 1960ల్లో, మన దేశంలో ఒక మనిషి ఏడాదికి సగటున 32.9 కిలోల చిరుధాన్యాలను తినేవాడు. 2010 నాటికి వీటి వాడకం 4.2 కిలోలకు.... అంటే 87%కి పడి పోయింది. ‘పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణ వలన గోదుమ ఉపయోగం పెరిగింది. దీన్ని శ్రేష్ఠమైన తిండి అనుకుంటున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గింది. వీటిని నాసిరకం తిండిగా భావిస్తున్నారు’ అని 2014లో ‘అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి’ తెలిపింది. 1960వ దశకం మధ్యలో ఒక పట్టణవాసి సగటున సంవ త్సరానికి 27 కిలోల గోదుమలు తినేవాడు. ఇది 2010లో రెట్టింపయింది. కొన్ని దశాబ్దాల నుండి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోదుమ, బియ్యానికి రాయితీ లిస్తున్నది. అందువలన ప్రజల్లో ప్రత్యేకించి పట్టణ జనాభాలో వీటి ఉపయోగం పెరిగింది. చిరుధాన్యాల వాడకం తగ్గింది. ‘2013–ఆహార భద్రతా చట్టం’ చేయక ముందు గోదుమలు, బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చింది. ఫలితంగా ముతక ధాన్యాల వినియోగం పడిపోయిందని ప్రభుత్వేతర సంస్థ ‘ధన్’ నాయకుడు మునియప్పన్ కార్తికేయన్ అన్నారు. 1956 నుండి చిరుధాన్యాల పంట విస్తీర్ణం తగ్గింది. సజ్జ 23%, రాగి 49%, జొన్న 64%, ఇతర ధాన్యాల సాగునేల 85% తగ్గింది. ఈ విస్తీర్ణం ఇంకా తగ్గితే దేశం చిరుధాన్య పంటలను కోల్పోతుంది. చిరుధాన్యాలు తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలు గల గరుగు, పొడి నేలల్లో, కరువు ప్రదేశాల్లో పండుతాయి. వీటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. దిగుబడి ఎక్కువ. విత్తనాల పేటెంటు, బహుళ జాతి సంస్థల గొడవలు లేవు. ముందు ఏడాది గింజలను మరుసటి సంవత్సరం విత్తనాలుగా వాడవచ్చు. మెరుగుపర్చబడిన చిరుధాన్యాల విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఉత్పత్తిని బాగా పెంచాయి. 2013లో ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో 1,09,10,000 టన్నులతో భారత్ మొదటి స్థానంలో ఉంది. వరికి కావలసిన నీటిలో 28% నీరే వీటికి సరిపోతుంది. ప్రస్తుత కరువుకే కాక పెరగబోయే భవిష్యత్తు కరువులకు కూడా ఇవి పరిష్కారమవుతాయి. ఈ పంటలతో మనకు తిండి గింజలు, పశువులకు మేత లభిస్తాయి. వీటిలో ఆమ్ల శాతం తక్కువ. పీచు శాతం, పోషక విలువలు ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 531%, బియ్యం కంటే 1,033% ఇనుము ఎక్కువ. సజ్జల్లో గోదుమల కంటే 314%, బియ్యం కంటే 611% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 265%, బియ్యం కంటే 516% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 839%, బియ్యం కంటే 3,440% సున్నం ఎక్కువ. బియ్యంలో కంటే సజ్జలు, గోదుమల్లో 4 రెట్ల సున్నం ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 313%, బియ్యం కంటే 783% ఖనిజ లవణాలు ఎక్కువ. కొర్రల్లో గోదుమల కంటే 220%, బియ్యం కంటే 550% ఖనిజ లవణాలు ఎక్కువ. గోదుమలు, బియ్యం కంటే చిరుధాన్యాలలో పోషక పదార్థాలు, నత్రజని అధికం. కేవలం బియ్యం తిన్న ఆడపిల్లల కంటే 60% జొన్నలు, 40% బియ్యం తిన్న ఆడపిల్లల ఎదుగుదల రేటు ఎక్కువని హైదరాబాదు ‘భారతీయ చిరుధాన్యాల పరిశోధక సంస్థ’, ‘జాతీయ పోషకాహార సంస్థ’ 2015 ఏడాది అధ్యయనాల్లో తెలిపాయి. (చదవండి: ఒప్పుకొందామా? తప్పందామా?) ఇతర పంటలతో పోల్చితే చిరుధాన్యాల పంటలు పర్యావరణానికి తక్కువ హానికరం. ఈ పరిస్థితుల్లో ఈ పంటలు ఉపయోగకరం. చిరుధాన్యాల పునరుద్ధరణ పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే పలు ప్రయోజనాల చిరు ధాన్యాలను పండిద్దాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకుందాం. (చదవండి: పడిలేచిన కెరటం... ‘పోలవరం’) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
ఫాస్ట్ఫుడ్స్కు స్వస్తి.. పూర్వీకుల ఆహారంపై మక్కువ చూపుతున్న జనం
తరం మారుతోంది...వారి స్వరం కూడా మారుతోంది. ఆరోగ్యమే మహా భాగ్యమంటూ చిరుధాన్యాలను తమ ఆహార మెనూలో చేర్చి అగ్రస్థానం కల్పిస్తున్నారు. తమ జాబితాలో మొదటి స్థానంలో ఉండే బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్లను తొలగిస్తూ ఆరోగ్యప్రద ఆహారాలకు ప్రధానంగా యువత ప్రాధాన్యమిస్తున్నారు. ఫాస్ట్ఫుడ్స్కు క్రమేపీ దూరమవుతూ.. చిరు ధాన్యాల వైపు జనం దగ్గరవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో ఇందుకు అనుగుణంగా మార్కెట్ కూడా మారుతోంది. చిరుధాన్యాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడంతో బియ్యం దుకాణాల్లో ఇవి కూడా అమ్మకానికి పెడుతున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు, చపాతి, మురుకులు, ఇడ్లీలు కూడా చిరుధాన్యాలతో తయారు చేస్తున్నారు. కరోనా రాకతో మరింత గిరాకీ మనిషికి హిమోగ్లోబిన్ 15 గ్రాములుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్నిటికంటే రాగులు ద్వారా శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలకు కాల్షియాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రాగికి బెల్లం జతచేసిన ఆహార పదార్ధాలు ఇళ్లల్లో తయారీ చేయిస్తూ తమ పిల్లలకు అందిస్తున్నారు. గ్లూకోజ్ స్థాయులను కూడా నియంత్రించడంలో రాగులు దోహదపడుతుండడంతో మధుమేహులు కూడా ఆకర్షితులవుతున్నారు. వీటితోపాటు జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. బెల్లంతో చేసిన తినుబండారాలను ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. బెల్లం పాకంతో వేరుశెనగ, నువ్వు ఉండలు, రాగి లడ్డు, మినపలడ్డు, రాగి అట్టులను యువత ఇష్టపడుతుండడంతో మిఠాయి దుకాణాల్లో ఇవి స్థానం దక్కించుకుంటున్నాయి. -
వేసవిలో హీరోయిన్ రకుల్ తాగే డ్రింక్ ఇదే..
అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. వేడి తట్టుకోడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నిమ్మ రసం, పుదీనా రసం వంటి ద్రావణాలను తీసుకుంటుంటారు. ఇవన్నీ ఓకే.. రకుల్ ప్రీత్‌సింగ్ ఇంకోటి కూడా చెబుతున్నారు. ‘‘ఈ వేసవి తాపంలో శరీరానికి బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి’’ అంటున్నారామె. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం యోగా, జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు రకుల్. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటారు. తాజాగా ఎండ వేడి నుంచి చల్లబడటానికి రకుల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘వేసవి తాపాన్ని ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే బార్లీ నీళ్లు బెస్ట్. ఈ ద్రావణాన్ని నా న్యూట్రిషనిస్ట్ సూచించారు. వేసవిలో వచ్చే ఆరోగ్య, జీర్ణ సమస్యలన్నింటినీ బార్లీ ద్రావణం దూరం చేస్తుంది. చోటా నామ్ (బార్లీని ఉద్దేశించి) బడా కామ్ (పేరు చిన్నదే అయినా పని పెద్దది)’’ అని చెప్పుకొచ్చారు రకుల్. పేరు చిన్నదే అయినా బాగా మేలు చేస్తుందన్నది రకుల్ ఉద్దేశం. రకుల్ చెప్పినట్లు బార్లీ వాటర్ తీసుకుంటే కూల్ అయిపోవచ్చు. -
బార్లీతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
ఎంతో ఆరోగ్యస్పృహ ఉన్నవారు మినహా ‘బార్లీ’ని ఆహారంగా తీసుకునేవారు మన సమాజంలో కొద్దిగా తక్కువే. అయితే బార్లీ గింజల్లోని పోషకాలు ఎంతో ఆరోగ్యకరం కాబట్టే వీటిని హెల్త్ డ్రింక్స్‌లో విరివిగా వాడుతుంటారు. అంతేకాదు... ఆరోగ్యకరం అంటూ ఉత్పత్తి చేసే బ్రెడ్లూ, బిస్కెట్లలోనూ దీన్ని వాడుతుంటారు. బార్లీతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. బార్లీలో పోటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బార్లీలో పీచు పదార్థాలు కూడా ఎక్కువ. అందువల్ల అది జీర్ణాశయపు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. బార్లీలోని పీచుపదార్థాల వల్ల అవి రక్తంలో చక్కెరను అతి మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో చక్కెర అదుపునకు బాగా తోడ్పడతాయి. ఈ కారణం వల్లనే అవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంతో పాటు, డయాబెటిస్ లేనివారిలో నివారణకూ తోడ్పడతాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ను బాగా అదుపు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్‌నూ అదుపు చేసే గుణం ఉండటం వల్ల ఇవి అనే రకాల గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారిస్తాయి. బార్లీలోని విటమిన్–ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడతాయి. వీటిల్లో ఐరన్ కూడా ఎక్కువే. అందువల్ల రక్తహీనతను నివారిస్తాయి. బార్లీలో ఉండే క్యాల్షియమ్, ఫాస్ఫరస్ ఎముకలను మరింత శక్తిమంతం చేస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్, జింక్ వంటి ఖనిజాలు చర్మానికీ, వెంట్రుకలకూ మెరుపునిస్తాయి. బార్లీలోని విటమిన్ బి–కాంప్లెక్స్‌తో పాటు విటమిన్–సి... మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. -
బార్లీతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నారా.. అయితే బార్లీ తినడం మొదలుపెట్టండి. బార్లీ అటు ఎల్డీఎల్తోపాటు నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను కూడా ఏడు శాతం వరకూ తగ్గించగలదని కెనెడాలోని సెయింట్ మైకేల్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు రకాల కొలెస్ట్రాల్‌లు గుండె జబ్బులకు కారణమవుతాయని అంటున్నారు. గుండెకు బార్లీ చేసే మేలు గురించి చాలాకాలంగా తెలిసినా... ఎల్డీఎల్, నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్లపై దీని ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది తమ అధ్యయనం ద్వారా వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ వ్లాదిమిర్ వుక్సన్ తెలిపారు. ఓట్స్‌తో పోలిస్తే బార్లీలో పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికే కాకుండా సాధారణ వ్యక్తులకూ ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. - సాక్షి, హైదరాబాద్ -
బార్లీతో డయాబెటిస్‌కు చెక్
పరిపరి శోధన ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు బార్లీ జావ కాచుకుని తాగడమే తప్ప, మనవాళ్లు బార్లీని పెద్దగా వినియోగించరు. బార్లీని తరచుగా తీసుకున్నట్లయితే, డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చని స్వీడిష్ పరిశోధకులు చెబుతున్నారు. స్వీడన్‌లోని లంద్ వర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీపై విస్తృత పరిశోధనలు జరిపి, పలు ఆసక్తికరమైన అంశాలను కనుగొన్నారు. బార్లీని తరచుగా తీసుకుంటే డయాబెటిస్తో పాటు స్థూలకాయాన్ని, గుండెజబ్బులను కూడా గణనీయంగా నివారించుకోవచ్చని వారు చెబుతున్నారు. బార్లీలోని పీచుపదార్థాలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయని, త్వరగా ఆకలి కలగకుండా చూస్తాయని తమ పరిశోధనల్లో తేలినట్లు వెల్లడిస్తున్నారు. -
ఇంట్లో బార్లీ ఉడికితే.. ఆరోగ్యమే..!
తిండి గోల బి.పి నియంత్రణలో ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరగాలన్నా, మూత్రం సాఫీగా అవ్వాలన్నా... బార్లీ నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే బార్లీ ఇంట ఉండాల్సిందే అనిపించేంతటి ఘన చరిత్రను బార్లీ సొంతం చేసుకుంది. ఇంచుమించు గోధుమల్లాగే కనిపించే బార్లీకి 13 వేల ఏళ్ల ఘనచరిత్ర ఉంది. అయితే, ముందుగా ఈ గింజను వంటకాలలో వాడింది మాత్రం టిబెటెన్లు. అటు తర్వాత మధ్య యూరప్‌కి ఈ పంట పాకింది. ఆఫ్రికన్లు కూడా బార్లీ పంటను విస్తృతంగా సాగుచేస్తున్నారు. బార్లీ గింజకు ఉండే గట్టిదనం వల్ల పై పొట్టు అంత సులువుగా రాదు. దీంతో దీనిని ముత్యంతో పోల్చారు విదేశీయులు. జపాన్ నూడుల్స్‌లోనూ, రష్యా వంటకాలలోనూ, మద్యపానీయాల తయారీలోనూ బార్లీ గింజలను విరివిగా ఉపయోగిస్తుంటారు. బార్లీ పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. రసాయనాల వాడకం ఉండదు. పొట్టుతోనూ, పొట్టు తీసినవి, పిండి, ఫ్లాక్స్గానూ బార్లీ మనకు అందుబాటులోకి వచ్చింది. ఉడకడానికి ఎక్కువ సమయం పట్టే బార్లీలో పీచుతో పాటు పోషకవిలువలు సమృద్ధిగా ఉన్నాయి. అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి