
బార్లీతో డయాబెటిస్‌కు చెక్
పరిపరి శోధన
ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు బార్లీ జావ కాచుకుని తాగడమే తప్ప, మనవాళ్లు బార్లీని పెద్దగా వినియోగించరు. బార్లీని తరచుగా తీసుకున్నట్లయితే, డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చని స్వీడిష్ పరిశోధకులు చెబుతున్నారు. స్వీడన్‌లోని లంద్ వర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీపై విస్తృత పరిశోధనలు జరిపి, పలు ఆసక్తికరమైన అంశాలను కనుగొన్నారు.
బార్లీని తరచుగా తీసుకుంటే డయాబెటిస్‌తో పాటు స్థూలకాయాన్ని, గుండెజబ్బులను కూడా గణనీయంగా నివారించుకోవచ్చని వారు చెబుతున్నారు. బార్లీలోని పీచుపదార్థాలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయని, త్వరగా ఆకలి కలగకుండా చూస్తాయని తమ పరిశోధనల్లో తేలినట్లు వెల్లడిస్తున్నారు.