Swedish researchers
-
గప్‘చిప్’గా చెప్పేస్తుంది
ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో చాలా ఆఫీసులు, రెస్టా రెంట్లు, కాన్సర్ట్ హాల్స్, సినిమా థియేటర్లు, కొన్ని బ్యాంకులు... వాళ్ల ఆవరణలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సినేషన్ చేసుకున్నారా? లేదా? అని అడుగుతున్నాయి. కొన్ని సంస్థలయితే వాక్సిన్ కంపల్సరీ చేశాయి. అయితే ప్రతి చోటికీ వాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పట్టుకెళ్లలేం కదా! అందుకే ఆ వివరాలన్నీ భద్ర పరిచి చర్మం కింద అమర్చగలిగే ఓ చిప్‌ను ఆవిష్క రించింది స్వీడిష్ స్టార్టప్ ఎపిసెంటర్. బియ్యం గింజ సైజులో ఉండే ఈ మైక్రోచిప్‌లో మీకు సంబం ధించిన వాక్సినేషన్ సమాచారమంతా ఉంటుంది. మీరు ఆఫీసు, ఏదైనా స్టోర్, ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్లినా సరే.. ఆ చిప్‌ను స్కాన్ చేస్తే చాలు వాక్సినేషన్ సమాచారమంతా అందులో ప్రత్యక్ష మవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ అవ సరం లేదు. మీ ఫోన్ ఛార్జింగ్లేకపోయినా పర్లేదు. నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రొటోకాల్ టెక్నాలజీ ఉన్న ఏ గ్యాడ్జెట్ అయినా ఈ చిప్‌ను చదివేస్తుంది. విద్యుదయస్కాంత తరంగాలతో రెండు డివైస్ల మధ్య సమాచారం పాస్ అవు తుంది. ప్రస్తుతానికి కేవలం వాక్సినేషన్ సమాచారం కోసమే ఉపయోగి స్తున్నా... భవిష్యత్‌లో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు, తాళం చెవిలా సైతం ఉపయోగించొచ్చంటుందీ సంస్థ. ఈ చిప్ ప్రధాన ప్రయోజనం సౌకర్యవం తంగా ఉంచడమేనని ఎపిసెంటర్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరు పాట్రిక్ మెస్టర్టన్ తెలిపారు. ఎపిసెంటర్ ఆఫీసు ఆవరణలో తమ ఉద్యోగులకు ఈజీ యాక్సెస్కోసం 2015లోనే ఈ చిప్‌ను తయారు చేసింది. జస్ట్ చేయి ఊపితే చాలు... తలుపులు తెరుచుకోవడం, ప్రింటర్ ఆపరేషన్ వంటి పనులకు ఉపయోగించింది. ఈ సూక్ష్మ చిప్‌ను చర్మం కింద ఉంచడం చాలా ఈజీ. చిన్న సిరంజ్ సహాయంతో అమర్చేస్తారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఈ రోడ్డుపై చార్జింగ్ చేసుకోవచ్చు!
బ్రెస్సెల్స్: సమీప భవిష్యత్‌లో వాహనాలన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయా? శిలాజ ఇంధనాలకు విద్యుత్ సరైన ప్రత్యామ్నాయమా? అంటే స్వీడన్ పరిశోధకులు అవుననే చెబుతారు. చెప్పడమే కాదు.. రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా చార్జింగ్ అయ్యేలా ప్రత్యేకమైన ట్రాక్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. స్టాక్‌హోం విమానాశ్రయం నుంచి రోజెర్స్బెర్గ్ వరకూ నిర్మించిన ఈ ట్రాక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశమంతటా అమలు చేసేందుకు స్వీడన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని 70 శాతం తగ్గించాలని స్వీడన్ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు మధ్యలో విద్యుత్ ట్రాక్ ఈరోడ్ ఆర్లాండా, వాహనాల తయారీ సంస్థ డీఏఎఫ్, టెక్నాలజీ కంపెనీలు, విద్యాసంస్థలు, స్వీడన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. స్టాక్ హోం ఎయిర్పోర్ట్ నుంచి రోజెర్స్బెర్గ్లోని ఓ సరుకుల సరఫరా కేంద్రం వరకూ దాదాపు 2 కి.మీ పొడవుతో రోడ్డు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ మధ్యలో 6 సెం.మీ లోతులో విద్యుత్ వైర్లను అమర్చారు. దీంతో విద్యుత్‌తో నడిచే ప్రత్యేకమైన కారు లేదా లారీ ఈ మార్గంపైకి రాగానే దాని కింద ఉండే ప్రత్యేకమైన చేయి లాంటి నిర్మాణం ఆటోమేటిక్‌గా విద్యుత్ ట్రాక్‌ను గుర్తించి చార్జింగ్ ప్రారంభిస్తుంది. ఈ మార్గంలో కారు లేదా ట్రక్కు వెళుతున్నంతవరకూ బ్యాటరీలు చార్జ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కారు లేదా ట్రక్కు నిలిచిపోతే, విద్యుత్ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది. ఈ వ్యవస్థలో భాగంగా ఒక్కో వాహనం ఎంత విద్యుత్‌ను వినియోగించుకుంటుందో లెక్కించి సదరు కారు లేదా లారీ ఓనర్ నుంచి నగదును వసూలు చేస్తారు. దీనివల్ల విద్యుత్ కొరతతో వాహనాలు ఆగిపోవడమన్న సమస్యే తలెత్తదు. ఈ పైలెట్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో స్వీడన్ ప్రభుత్వం 70 శాతం భరిస్తోంది. లాభదాయకం.. సురక్షితం ఈ ప్రాజెక్టులో విద్యుత్ ట్రాక్ ఉన్న రోడ్డును 50 మీటర్లకు ఓ సెక్షన్ చొప్పున విభజిస్తారు. తద్వారా వాహనాలు సంబంధిత సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విద్యుత్ సరఫరా జరుగుతుంది. లేదంటే ఆగిపోతుంది. దీనివల్ల గణనీయంగా ఇంధనాన్ని, శక్తిని ఆదా చేయొచ్చు. దేశమంతటా రోడ్లపై ఇలాంటి ట్రాక్‌లను పరచడం వల్ల విద్యుత్ వాహనాల తయారీ ఖర్చు, బ్యాటరీల పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ ట్రాక్‌లను ఓ కి.మీ మేర అమర్చాలంటే దాదాపు రూ.8.46 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ మొత్తం ట్రామ్ కారు ఏర్పాటు వ్యయంతో పోల్చుకుంటే 50 రెట్లు తక్కువ. ఇక ఈ ట్రాక్‌ల కారణంగా చార్జింగ్ స్టేషన్ల కోసం వాహనదారులు వెతకాల్సిన బాధ తప్పుతుంది. వరదలు సంభవించినా, రోడ్డంతా ఉప్పు ఉండిపోయినా ఉపరితలంపై విద్యుత్ సరఫరా ఒక ఓల్ట్కు మించదనీ, ప్రజలు నిక్షేపంగా చెప్పులు వేసుకోకుండా నడవొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంధన కొరత అన్నదే లేకుండా ప్రజలు తమ వాహనాలు నడుపుకోవచ్చని హామీ ఇస్తున్నారు. -
బార్లీతో డయాబెటిస్‌కు చెక్
పరిపరి శోధన ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు బార్లీ జావ కాచుకుని తాగడమే తప్ప, మనవాళ్లు బార్లీని పెద్దగా వినియోగించరు. బార్లీని తరచుగా తీసుకున్నట్లయితే, డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చని స్వీడిష్ పరిశోధకులు చెబుతున్నారు. స్వీడన్‌లోని లంద్ వర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీపై విస్తృత పరిశోధనలు జరిపి, పలు ఆసక్తికరమైన అంశాలను కనుగొన్నారు. బార్లీని తరచుగా తీసుకుంటే డయాబెటిస్తో పాటు స్థూలకాయాన్ని, గుండెజబ్బులను కూడా గణనీయంగా నివారించుకోవచ్చని వారు చెబుతున్నారు. బార్లీలోని పీచుపదార్థాలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయని, త్వరగా ఆకలి కలగకుండా చూస్తాయని తమ పరిశోధనల్లో తేలినట్లు వెల్లడిస్తున్నారు. -
పొడగరులకు కేన్సర్ ముప్పు ఎక్కువట!
పరిపరి... శోధన ఆకర్షణీయంగా కనిపించే పొడగరులను అందరూ అబ్బురంగా చూస్తారు గానీ, వారికి కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందట! ఎదుగుదలను కుదించుకున్నట్లు కనిపించే పొట్టివాళ్లకు ఇలాంటి ప్రమాదమేదీ లేదట! పొట్టిగా ఉండటమా, పొడవు పెరగడమా అనేది మన చేతుల్లో లేదు. అంతా జన్యువుల మహిమ. అయితే, పొట్టి వాళ్లతో పోలిస్తే, కేన్సర్ సోకే ముప్పు పొడగరులకే ఎక్కువగా ఉంటుందని స్వీడిష్ పరిశోధకులు చెబుతున్నారు. సగటు ఎత్తు కంటే అదనంగా పెరిగే పది సెంటీమీటర్లకు ఈ ముప్పు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. అదనంగా పది సెంటీమీటర్ల ఎత్తు ఉండే మహిళలకు ఈ ముప్పు 18 శాతం మేరకు, పురుషులకు 11 శాతం మేరకు ఎక్కువగా ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని స్టాక్‌హోమ్ వర్సిటీకి చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.