ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో చాలా ఆఫీసులు, రెస్టా రెంట్లు, కాన్సర్ట్ హాల్స్, సినిమా థియేటర్లు, కొన్ని బ్యాంకులు... వాళ్ల ఆవరణలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సినేషన్ చేసుకున్నారా? లేదా? అని అడుగుతున్నాయి. కొన్ని సంస్థలయితే వాక్సిన్ కంపల్సరీ చేశాయి. అయితే ప్రతి చోటికీ వాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పట్టుకెళ్లలేం కదా! అందుకే ఆ వివరాలన్నీ భద్ర పరిచి చర్మం కింద అమర్చగలిగే ఓ చిప్‌ను ఆవిష్క రించింది స్వీడిష్ స్టార్టప్ ఎపిసెంటర్.
బియ్యం గింజ సైజులో ఉండే ఈ మైక్రోచిప్‌లో మీకు సంబం ధించిన వాక్సినేషన్ సమాచారమంతా ఉంటుంది. మీరు ఆఫీసు, ఏదైనా స్టోర్, ఎయిర్‌పోర్ట్ ఎక్కడికి వెళ్లినా సరే.. ఆ చిప్‌ను స్కాన్ చేస్తే చాలు వాక్సినేషన్ సమాచారమంతా అందులో ప్రత్యక్ష మవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ అవ సరం లేదు. మీ ఫోన్ ఛార్జింగ్‌లేకపోయినా పర్లేదు. నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రొటోకాల్ టెక్నాలజీ ఉన్న ఏ గ్యాడ్జెట్ అయినా ఈ చిప్‌ను చదివేస్తుంది.
విద్యుదయస్కాంత తరంగాలతో రెండు డివైస్‌ల మధ్య సమాచారం పాస్ అవు తుంది. ప్రస్తుతానికి కేవలం వాక్సినేషన్ సమాచారం కోసమే ఉపయోగి స్తున్నా... భవిష్యత్‌లో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు, తాళం చెవిలా సైతం ఉపయోగించొచ్చంటుందీ సంస్థ. ఈ చిప్ ప్రధాన ప్రయోజనం సౌకర్యవం తంగా ఉంచడమేనని ఎపిసెంటర్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరు పాట్రిక్ మెస్టర్టన్ తెలిపారు.
ఎపిసెంటర్ ఆఫీసు ఆవరణలో తమ ఉద్యోగులకు ఈజీ యాక్సెస్‌కోసం 2015లోనే ఈ చిప్‌ను తయారు చేసింది. జస్ట్ చేయి ఊపితే చాలు... తలుపులు తెరుచుకోవడం, ప్రింటర్ ఆపరేషన్ వంటి పనులకు ఉపయోగించింది. ఈ సూక్ష్మ చిప్‌ను చర్మం కింద ఉంచడం చాలా ఈజీ. చిన్న సిరంజ్ సహాయంతో అమర్చేస్తారు.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment