Microchip
-
భారత్‌లో అమెరికా టెక్ కంపెనీ వేల కోట్లలో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్స్‌లో ఉన్న యూఎస్ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ భారత్‌లో రూ.2,460 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. కార్యకలాపాల విస్తరణ, ఇంజనీరింగ్ ల్యాబ్స్, నిపుణుల నియామకం, సాంకేతిక కేంద్రాలకు మద్దతు, విద్యా సంస్థలకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. కాగా, ఇక్కడి కోకాపేట్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న వన్ గోల్డెన్ మైల్ ఆఫీస్ టవర్‌లో 5 అంతస్తులను కంపెనీ కొనుగోలు చేసింది. పరిశోధన, అభివృద్ధి కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చింది. ఈ కేంద్రంలో 1,000 మంది ఉద్యోగులు కూర్చునే వీలుంది. భారత్‌లో కార్యకలాపాలను పెంపొందించడానికి మైక్రోచిప్ ముఖ్యమైన వ్యూహాత్మక నిబద్ధతను ప్రకటించిందని సంస్థ ప్రెసిడెంట్, సీఈవో గణేశ్ మూర్తి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇండస్ట్రియల్, డేటా సెంటర్, కంప్యూటింగ్, ఆటోమోటివ్, కంన్సూ్యమర్ అప్లయాన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాలకు మైక్రోచిప్ సేవలు అందిస్తోంది. -
పెట్టుబడుల వరద, హైదరాబాద్‌లో సెమీకండక్టర్ల తయారీ..ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో–ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
గప్‘చిప్’గా చెప్పేస్తుంది
ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో చాలా ఆఫీసులు, రెస్టా రెంట్లు, కాన్సర్ట్ హాల్స్, సినిమా థియేటర్లు, కొన్ని బ్యాంకులు... వాళ్ల ఆవరణలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సినేషన్ చేసుకున్నారా? లేదా? అని అడుగుతున్నాయి. కొన్ని సంస్థలయితే వాక్సిన్ కంపల్సరీ చేశాయి. అయితే ప్రతి చోటికీ వాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పట్టుకెళ్లలేం కదా! అందుకే ఆ వివరాలన్నీ భద్ర పరిచి చర్మం కింద అమర్చగలిగే ఓ చిప్‌ను ఆవిష్క రించింది స్వీడిష్ స్టార్టప్ ఎపిసెంటర్. బియ్యం గింజ సైజులో ఉండే ఈ మైక్రోచిప్‌లో మీకు సంబం ధించిన వాక్సినేషన్ సమాచారమంతా ఉంటుంది. మీరు ఆఫీసు, ఏదైనా స్టోర్, ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్లినా సరే.. ఆ చిప్‌ను స్కాన్ చేస్తే చాలు వాక్సినేషన్ సమాచారమంతా అందులో ప్రత్యక్ష మవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ అవ సరం లేదు. మీ ఫోన్ ఛార్జింగ్లేకపోయినా పర్లేదు. నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రొటోకాల్ టెక్నాలజీ ఉన్న ఏ గ్యాడ్జెట్ అయినా ఈ చిప్‌ను చదివేస్తుంది. విద్యుదయస్కాంత తరంగాలతో రెండు డివైస్ల మధ్య సమాచారం పాస్ అవు తుంది. ప్రస్తుతానికి కేవలం వాక్సినేషన్ సమాచారం కోసమే ఉపయోగి స్తున్నా... భవిష్యత్‌లో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు, తాళం చెవిలా సైతం ఉపయోగించొచ్చంటుందీ సంస్థ. ఈ చిప్ ప్రధాన ప్రయోజనం సౌకర్యవం తంగా ఉంచడమేనని ఎపిసెంటర్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరు పాట్రిక్ మెస్టర్టన్ తెలిపారు. ఎపిసెంటర్ ఆఫీసు ఆవరణలో తమ ఉద్యోగులకు ఈజీ యాక్సెస్కోసం 2015లోనే ఈ చిప్‌ను తయారు చేసింది. జస్ట్ చేయి ఊపితే చాలు... తలుపులు తెరుచుకోవడం, ప్రింటర్ ఆపరేషన్ వంటి పనులకు ఉపయోగించింది. ఈ సూక్ష్మ చిప్‌ను చర్మం కింద ఉంచడం చాలా ఈజీ. చిన్న సిరంజ్ సహాయంతో అమర్చేస్తారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గాలినే శక్తిగా మార్చేసుకుంటుంది
ఈ రోజుల్లో అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి. టీవీ, ఫ్రిజ్, వాచీలన్నీ నెట్‌కు అనుసంధానమై పోతున్నాయి. మరి ప్రతిదాంట్లోనూ ఓ బ్యాటరీ ఉంటే.. వాటిని చార్జ్ చేసుకోవడం ఎంత ఇబ్బందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇజ్రాయెల్ కంపెనీ విలియట్ ఓ వినూత్నమైన టెక్నాలజీని ఆవిష్కరించింది. బ్యాటరీ అన్నది అవసరం లేకుండా బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేసే మైక్రోచిప్‌ను తయారు చేశారు. కాగితం మందం, పోస్టల్ స్టాంప్ సైజులో ఉండే ఈ మైక్రోచిప్ బరువుతోపాటు ఉష్ణోగ్రతలను గుర్తించగలదు. ఆ సమాచారాన్ని బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మూడు మీటర్ల దూరం వరకూ పంపగలదు. ఇందుకు కావాల్సిన శక్తిని మొత్తం వైఫై, బ్లూటూత్, సెల్ సిగ్నల్స్ నుంచి సేకరిస్తుంది. ఈ రకమైన మైక్రోచిప్‌ల కారణంగా సెల్‌ఫోన్ సంకేతాల ద్వారా వెలువడే రేడియోధార్మికత కొంత మళ్లీ వినియోగంలోకి వస్తుందని అంచనా. ఇటీవల జరిగిన ఒక ప్రదర్శనలో తాము ఈ మైక్రోచిప్‌ను ప్రదర్శించామని శాంసంగ్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు విలియట్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ నెట్‌కు అనుసంధానం కాని గాడ్జెట్లను కూడా ఈ కొత్త మైక్రోచిప్ ద్వారా కనెక్ట్ చేయవచ్చునని విలియట్ సీఈవో తల్ తామీర్ తెలిపారు. -
ఉద్యోగుల వేళ్ల మధ్య మైక్రోచిప్
ఉద్యోగులారా..! మీ చేతులను ఓ సారి చూసుకోండి. మీ చేతులే ఇకపై బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్లో షాపింగ్‌లు జరిపే మెషీన్లుగా మారితే ఎలా ఉంటుంది. అవునండి. తమ చేతిలో కంపెనీలు ఇచ్చే మైక్రోచిప్స్‌ను అమర్చుకునేందుకు యూరప్‌లో ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు ఈ చిప్‌ను బొటన వేలు, చూపుడు వేలు మధ్య ఉన్న చర్మభాగంలో అమర్చుకున్నారు కూడా. అంతేకాదు ఆ చిప్‌ను ఉపయోగించి ఆన్లైన్ ట్రాన్సక్షన్స్తో పాటు కంపెనీల అవసరాలకు అనుగుణంగా వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. ఏంటీ చిప్.. బియ్యపు గింజంత సైజులో ఉండే ఈ చిప్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ)తో ట్యాగ్ చేస్తారు. దీనికి కాంటాక్ట్‌లెస్ బ్యాంకు కార్డుల వలె పని చేసే సామర్ధ్యం ఉంటుంది. అంటే ఇవి విద్యుదయాస్కాంత తరంగాలను ఉపయోగించి స్టోర్ చేసిన సమాచారాన్ని చదవగలుగుతాయన్నమాట. మరో విధంగా చెప్పాలంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్(ఎన్ఎఫ్సీ) గురించి మీరు వినే ఉంటారు కదా. అచ్చు అలానే కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు, మొబైల్ పేమెంట్లకు ఈ చిప్‌ను వినియోగించి పని కానించేయొచ్చు. ప్రస్తుతం ఈ చిప్ టెక్నాలజీ యూరప్ నుంచి అమెరికాకు కూడా పాకింది. 32ఎమ్ అనే ఓ అమెరికన్ కంపెనీ ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. అమెరికాకు చిప్ టెక్నాలజీ కొత్తేమీ కాదు. 2005లోనే ఆ దేశంలో చిప్ టెక్నాలజీ వినియోగంపై ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఉద్యోగి ఇష్టానికి వ్యతిరేకంగా చిప్‌ను అతని/ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టకూడదని దాని సారాంశం. నష్టాలకూ కొదవలేదు! ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌తో చిప్‌లను ఆన్లైన్ లావాదేవీలకు ఉపయోగించడం ప్రమాదకరమని స్టోక్హోమ్లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌లోని మైక్రోబయాలజిస్ట్ బెన్ లిబ్బర్టన్ అభిప్రాయపడుతున్నారు. ఎన్క్రిప్టెడ్ చిప్‌లను హ్యాక్ చేయడం సులభతరమని చెబుతున్నారు. చిప్‌లను అమర్చుకున్న ఉద్యోగులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు చేసింది కూడా. -
‘చిప్’లతో కృత్రిమ కిడ్నీలు
అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు వాషింగ్టన్: మానవునిలోని మూత్రపిండాల మాదిరిగా పనిచేసే కృత్రిమ కిడ్నీలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. సాధారణ కణాలతో తయారు చేసిన ఈ కిడ్నీలు అందులోని మైక్రోచిప్ ఫిల్టర్ల సాయంతో పనిచేస్తాయి. ఇవి చిన్న సైజులో ఉండటం వల్ల శరీరంలో సులువుగా అమర్చవచ్చు. లవణాలు, నీరు, విసర్జితాలను శరీరం నుంచి బయటికి పంపేందుకు ఈ పరికరాన్ని తయారు చేస్తున్నట్లు అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన విలియం ఫిస్సెల్ తెలిపారు. మూత్రపిండాలు పనిచేయడంలో విఫలమైనపుడు ఈ కృత్రిమ పరికరాన్ని అమర్చడం ద్వారా విసర్జితాలను బయటకు పంపొచ్చని చెప్పారు. కృత్రిమ కిడ్నీలో అమర్చిన చిప్‌లలో లవణాలను వడపోసేందుకు సూక్ష్మ రంధ్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయోగశాలలో కిడ్నీల్లోని కొన్ని కణాలను తీసుకుని మైక్రోచిప్ ఫిల్టర్ల చుట్టూ పెరిగేలా చేసి వీటిని తయారు చేశారు. -
ఇక ఖైదీలపై ‘అంతర్గత’ నిఘా!
- ఖైదీలకు మైక్రోచిప్‌లను అమర్చాలని నిర్ణయం - త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం - ఖైదీల పరారీ, మొబైల్ ఫోన్ వినియోగం నియంత్రణ కోసమే సాక్షి, ముంబై: ఖైదీలపై ‘అంతర్గత’ నిఘా ఉంచాలని రాష్ట్ర జైళ్ల శాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఖైదీలకు మైక్రోచిప్ ఇంప్లాట్స్ ( వీటిని శరీరంలో ఏర్పాటు చేస్తారు)ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు నేరస్తులు తప్పించుకుని పారిపోయారు. ఈ నేపథ్యంలో జైళ్లలో అధునాతన పద్ధతిలో జాగ్రత్తపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జైళ్లలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లను (ఆర్ఎఫ్ఐడీ) అమర్చేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)లను కూడా అమర్చనున్నట్లు సమాచారం. మంత్రాలయలోని ఓ సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు, నిపుణులు జైళ్లలో తగిన పద్దతులను అవలంబించడానికి సంబంధించిన నివేదికను ఈ వారం చివరిలో హోంశాఖకు అందిస్తారని తెలిపారు. ‘ఖైదీలకు అమర్చే మైక్రోచిప్‌లను ‘స్పై చిప్’ అని కూడా అంటారు. ఈ చిప్‌ను వ్యక్తి చర్మం లోపల అమర్చుతారు.’ అని ఆయన తెలిపారు. రాష్ట్ర జైళ్లు పూర్వ పరాలు.. రాష్ర్టంలో తొమ్మిది సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. 27 జిల్లా, 10 ఓపెన్, ఒక ఓపెన్ కాలనీ, 172 సబ్‌జైళ్లు ఉన్నాయి. ఒక సబ్జైల్లో మహిళలు, పురుషులు మొత్తం కలిపి 28 వేల మంది ఉంటారు. పుణే, ముంబైలో మహిళల కోసం రెండు ప్రత్యేక జైళ్లు ఉన్నాయి. ఆథర్ జైల్లో సామర్థ్యం 800 మంది కాగా, 3 రెట్ల మంది ఉన్నారు. దీంతో మాన్ఖుర్డ్లో కొత్త జైలు నిర్మించాలని అధికారులు కోరుతున్నారు.