Microchip Technology To Invest $300 Million To Expand India Operations - Sakshi
Sakshi News home page

భారత్‌లో అమెరికా టెక్‌ కంపెనీ వేల కోట్లలో పెట్టుబడులు

Published Tue, Jul 4 2023 7:28 AM | Last Updated on Tue, Jul 4 2023 8:35 AM

Microchip Technology 300 Million Investment In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎంబెడెడ్‌ కంట్రోల్‌ సొల్యూషన్స్‌లో ఉన్న యూఎస్‌ కంపెనీ మైక్రోచిప్‌ టెక్నాలజీ భారత్‌లో రూ.2,460 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది.

కార్యకలాపాల విస్తరణ, ఇంజనీరింగ్‌ ల్యాబ్స్, నిపుణుల నియామకం, సాంకేతిక కేంద్రాలకు మద్దతు, విద్యా సంస్థలకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. కాగా, ఇక్కడి కోకాపేట్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న వన్‌ గోల్డెన్‌ మైల్‌ ఆఫీస్‌ టవర్‌లో 5 అంతస్తులను కంపెనీ కొనుగోలు చేసింది. పరిశోధన, అభివృద్ధి కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చింది. ఈ కేంద్రంలో 1,000 మంది ఉద్యోగులు కూర్చునే వీలుంది.

భారత్‌లో కార్యకలాపాలను పెంపొందించడానికి మైక్రోచిప్‌ ముఖ్యమైన వ్యూహాత్మక నిబద్ధతను ప్రకటించిందని సంస్థ ప్రెసిడెంట్, సీఈవో గణేశ్‌ మూర్తి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇండస్ట్రియల్, డేటా సెంటర్, కంప్యూటింగ్, ఆటోమోటివ్, కంన్సూ్యమర్‌ అప్లయాన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగాలకు మైక్రోచిప్‌ సేవలు అందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement