గాలినే శక్తిగా మార్చేసుకుంటుంది | Israeli company William Has introduced innovative technology | Sakshi
Sakshi News home page

గాలినే శక్తిగా మార్చేసుకుంటుంది

Published Thu, Jan 17 2019 12:54 AM | Last Updated on Thu, Jan 17 2019 12:56 AM

Israeli company William Has introduced innovative technology - Sakshi

ఈ రోజుల్లో అన్నీ స్మార్ట్‌ అయిపోతున్నాయి. టీవీ, ఫ్రిజ్, వాచీలన్నీ నెట్‌కు అనుసంధానమై పోతున్నాయి. మరి ప్రతిదాంట్లోనూ ఓ బ్యాటరీ ఉంటే.. వాటిని చార్జ్‌ చేసుకోవడం ఎంత ఇబ్బందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇజ్రాయెల్‌ కంపెనీ విలియట్‌ ఓ వినూత్నమైన టెక్నాలజీని ఆవిష్కరించింది. బ్యాటరీ అన్నది అవసరం లేకుండా బ్లూటూత్‌ టెక్నాలజీతో పనిచేసే మైక్రోచిప్‌ను తయారు చేశారు. కాగితం మందం, పోస్టల్‌ స్టాంప్‌ సైజులో ఉండే ఈ మైక్రోచిప్‌ బరువుతోపాటు ఉష్ణోగ్రతలను గుర్తించగలదు. ఆ సమాచారాన్ని బ్లూటూత్‌ టెక్నాలజీ ద్వారా మూడు మీటర్ల దూరం వరకూ పంపగలదు.

ఇందుకు కావాల్సిన శక్తిని మొత్తం వైఫై, బ్లూటూత్, సెల్‌ సిగ్నల్స్‌ నుంచి సేకరిస్తుంది. ఈ రకమైన మైక్రోచిప్‌ల కారణంగా సెల్‌ఫోన్‌ సంకేతాల ద్వారా వెలువడే రేడియోధార్మికత కొంత మళ్లీ వినియోగంలోకి వస్తుందని అంచనా. ఇటీవల జరిగిన ఒక ప్రదర్శనలో తాము ఈ మైక్రోచిప్‌ను ప్రదర్శించామని శాంసంగ్, అమెజాన్‌ వంటి ప్రముఖ సంస్థలు విలియట్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ నెట్‌కు అనుసంధానం కాని గాడ్జెట్‌లను కూడా ఈ కొత్త మైక్రోచిప్‌ ద్వారా కనెక్ట్‌ చేయవచ్చునని విలియట్‌ సీఈవో తల్‌ తామీర్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement