యుద్ధం వల్ల సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుందా? ఆ యా దేశాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్క రణలకు సిద్ధం కావటం అనేది ప్రయోజనకరమైనఅంశమా? లేదా అది యుద్ధనీతిని తప్పటం, అనైతి కతను ప్రోత్సహించటం అవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పడు తలెత్తుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశించని రంగం అంటూ లేదు. యుద్ధరంగంలోకి అది తన బాహువులను చాస్తోంది. ఇజ్రాయెల్ రణ క్షేత్రంలోకి ఏఐ ప్రవేశించటం తాజాగా చర్చనీ యాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేపట్టటానికి ఇంతవరకూ పరిచయం లేని కృత్రిమమేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించింది. హమాస్‌కు సంబంధించి దాదాపు 37 వేలకు పైగా లక్ష్యాలను గుర్తించటానికి దీనిని ఉపయోగించారు. అలాగే దీని ఆధారంగానే పాలస్తీనియన్ పౌరులను కొందరిని గుర్తించి హతమార్చారు.
‘మిషన్ లెర్నింగ్ విధానాల ద్వారా యుద్ధ వ్యూహాలను అమలు చేశారు. ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమమేధ వ్యవస్థకు ‘లావెండర్’ అని పేరు పెట్టారు. ఇక్కడ మనిషి పాత్ర పరిమితం. దానిని అమలు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవటమే. ‘ఊ’ అనుకున్న తర్వాత కొన్ని సెకండ్లలో పని పూర్తయిపోతుంది. ఇజ్రాయెల్ జర్నలిస్టు ఒకరు బాహ్య ప్రపంచానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్లో ఆరుగురు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారని ప్రకటించారు.అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు నిరసనగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేష న్‌లో ఇంత వరకు 33 వేలమందికి పైగా పాలస్తీని యన్లు మృత్యువాతపడ్డారు.
ఈ నేపథ్యంలో ఇజ్రా యెల్‌కి యుద్ధ సహాయాన్ని నిలిపివేయాలన్నడిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తున్న యూఎస్, బ్రిటన్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. పాలస్తీనా పౌరుల మరణాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూనే, బిలియన్ డాలర్ల విలు వైన బాంబులు, ఫైటర్ జెట్ల అందచేతను యూఎస్ సమర్థించుకుంటోంది. మరో వైపు బ్రిటిష్ ప్రధాని రుషి సునాక్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో ఛారిటీ వరల్డ్ కిచెన్‌సెంటర్లో ఏడుగురు బ్రిటిష్ పనివాళ్లు చనిపోవటంతో ఈఅంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు రష్యా – ఉక్రెయిన్‌ల యుద్ధంలో ఉక్రె యిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి మానవ ప్రమేయం లేకుండా వాటంతటికవే లక్ష్యాలను గుర్తించటం, దాడులు చేయటం వంటివి చేస్తాయి. కృత్రిమ మేధ ద్వారా శాటిలైట్ చిత్రాలను, డ్రోన్ వీడియో ఫీడ్‌లను పొందటం వల్ల యుద్ధ భూమిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసు కోవచ్చు. చకచకా నిర్ణయాలు తీసుకోవటానికి వీల వుతుంది. శత్రువును వేగంగా, కచ్చితంగా ఎదుర్కోవ టానికి వీలవుతుంది.
పూర్తిగా స్వయంచాలిత ఆయుధాలను విని యోగించటం అనే అంశంపైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒకరు ఒకరకమైన సాంకేతికత ఉపయో గిస్తే, దానిని ఎదుర్కోవటానికి మరో సాంకేతికత ముందుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ‘ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్’ వస్తున్నాయి.
ఇవి డ్రోన్ ఆపరేటర్ పైన దాడులకు ఉపయోగపడతాయి. ఇది మరీ కొత్తది అని కూడా చెప్పలేం. ఐసిస్ కొన్నేళ్ల క్రితం అధునాతమైన డ్రోన్ సైన్యాన్ని వినియోగించేది. ఇరాకీ బృందాలపై దాడులు నిర్వహించింది. ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొన్నట్టు ఏఐని కొనటం సాధ్యం కాదు. స్వయం చాలిత ఆయుధాలతో యుద్ధనియమాలు అంటి పెట్టుకుని యుద్ధాలు చేయాలి. అమెరికా, రష్యాతో పాటు దాదాపు 30 దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. యుద్ధాల విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధం (1914–1918)లో మెషిన్ గన్‌లు, గ్రెనేడ్లు ఇతర ఆయుధాలు... సబ్ మెరైన్లు, పాయిజనస్ గ్యాస్, వార్ ప్లేన్లు, ట్యాంకులు ఉపయోగించారు.
రెండో ప్రపంచ యుద్ధం (1939–1945) వచ్చేనాటికి రాడార్ టెక్నాలజీ ప్రవేశించింది. కొంత మంది చరిత్రకారులు ఈ సాంకేతికతే అణుబాంబు కంటే విజయానికి కీలకపాత్ర పోషించేదని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధానికి తెరవేయటానికి తొలి అణుబాంబును అభివృద్ధి చేశారు. రెండు దశాబ్దాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయటానికి అవసర మైనన్ని బాంబులు సిద్ధమైపోయాయి. యుద్ధంలో అణుబాంబును ఉపయోగిస్తే వచ్చే నష్టాన్నిఅంచనా వేసుకుని ఏ దేశానికి ఆ దేశం దానిని ఉపయోగించటానికి వెనకడుగు వేసేలా తయా రయ్యింది పరిస్థితి.
మీరు శత్రు దేశం పైన అణుబాంబు వేసి సర్వనాశనం చేస్తే, మరో నిమిషం అవతల దేశం కూడా అదే పని చేస్తుంది. అందుకే తర్వాత రోజుల్లో చిన్నవి, తక్కువ శక్తిమంతమైన బాంబులను తయారుచేయటం మొదలు పెట్టారు. అణుబాంబు రూపొందించటంలో కీలక భూమిక షోషించిన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హైమర్ తర్వాత రోజుల్లో తాను చేసిన పనికి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా, ముందుగా మిలిటరీలోనే దానికి బీజాలు పడ్డాయనేది చారిత్రక సత్యం.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు
సీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065'
Comments
Please login to add a commentAdd a comment