- ఖైదీలకు మైక్రోచిప్‌లను అమర్చాలని నిర్ణయం
- త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం
- ఖైదీల పరారీ, మొబైల్ ఫోన్ వినియోగం నియంత్రణ కోసమే
సాక్షి, ముంబై: ఖైదీలపై ‘అంతర్గత’ నిఘా ఉంచాలని రాష్ట్ర జైళ్ల శాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఖైదీలకు మైక్రోచిప్ ఇంప్లాట్స్ ( వీటిని శరీరంలో ఏర్పాటు చేస్తారు)ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు నేరస్తులు తప్పించుకుని పారిపోయారు. ఈ నేపథ్యంలో జైళ్లలో అధునాతన పద్ధతిలో జాగ్రత్తపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జైళ్లలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లను (ఆర్‌ఎఫ్‌ఐడీ) అమర్చేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వీటితోపాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)లను కూడా అమర్చనున్నట్లు సమాచారం. మంత్రాలయలోని ఓ సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు, నిపుణులు జైళ్లలో తగిన పద్దతులను అవలంబించడానికి సంబంధించిన నివేదికను ఈ వారం చివరిలో హోంశాఖకు అందిస్తారని తెలిపారు. ‘ఖైదీలకు అమర్చే మైక్రోచిప్‌లను ‘స్పై చిప్’ అని కూడా అంటారు. ఈ చిప్‌ను వ్యక్తి చర్మం లోపల అమర్చుతారు.’ అని ఆయన తెలిపారు.
రాష్ట్ర జైళ్లు పూర్వ పరాలు..
రాష్ర్టంలో తొమ్మిది సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. 27 జిల్లా, 10 ఓపెన్, ఒక ఓపెన్ కాలనీ, 172 సబ్‌జైళ్లు ఉన్నాయి. ఒక సబ్‌జైల్‌లో మహిళలు, పురుషులు మొత్తం కలిపి 28 వేల మంది ఉంటారు. పుణే, ముంబైలో మహిళల కోసం రెండు ప్రత్యేక జైళ్లు ఉన్నాయి. ఆథర్ జైల్‌లో సామర్థ్యం 800 మంది కాగా, 3 రెట్ల మంది ఉన్నారు. దీంతో మాన్‌ఖుర్డ్‌లో కొత్త జైలు నిర్మించాలని అధికారులు కోరుతున్నారు.
ఇక ఖైదీలపై ‘అంతర్గత’ నిఘా!
Published Wed, Apr 29 2015 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement