బందీల విడుదలకు మార్గం సుగమం | 600 Palestinian Prisoners To Released From Israeli Jail, More Details Inside | Sakshi
Sakshi News home page

బందీల విడుదలకు మార్గం సుగమం

Published Thu, Feb 27 2025 11:46 AM | Last Updated on Thu, Feb 27 2025 12:17 PM

600 Palestinian Prisoners to Released From Israeli Jail

ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌–హమాస్‌ చర్చలు 

నలుగురు ఇజ్రాయేలీల మృతదేహాలను అప్పగించనున్న హమాస్‌ 

600 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్న ఇజ్రాయెల్‌   

జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య బందీల విడుదలకు మార్గం సుగ మం అయ్యింది. ఇరు వ ర్గాలు తాజాగా ఓ ఒప్పందానికి వచ్చాయి. నలుగురు ఇ జ్రాయెల్‌ బందీల మృతదదేహాలను అప్పగించేందుకు హ మాస్‌ అంగీకరించగా, 600 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని ఈజిప్టు తెలిపింది. తొలి దశ కాల్పుల విరమణ ఒ ప్పందంలో భాగంగా బం«దీల మా ర్పిడి సమయంలోనూ,మృతదేహాలను విడుదల చేసినప్పుడు హమాస్‌ అవమానకరంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దశలోని పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో ఇజ్రాయెల్‌ కాలయాపన చేసింది. 

ఈ జాప్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని హమా స్‌ పేర్కొంది. వారిని విడుదల చేసేవరకు రెండో దశ చర్చలు సాధ్యం కాదని పేర్కొంది. మొదటి దశ ఒప్పందం ఈ వారంతో ముగియనుండటంతో బం«దీల మార్పిడిపై ఈజిప్టు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్, మృతదేహాలను అప్పగించేందుకు హమా స్‌ అంగీకరించాయి. గురువారం నాటికి మారి్పడి జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ బంధీల మృతదేహాలను ఎటువంటి బహిరంగ వేడుకలు లేకుండా ఈజిప్టు అధికారులకు అప్పగించనున్నారు. 

గాజా కాల్పుల విరమణ..
జనవరి 19న కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనప్పటి నుంచి హమాస్‌ 25 మంది ఇజ్రాయెల్‌ బందీలను బహిరంగ వేడుకల ద్వారా విడుదల చేసింది. హమాస్‌ చర్యలను ఇజ్రాయెల్‌తో పాటు రెడ్‌క్రాస్, ఐక్యరాజ్యసమితి అధికారులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఖైదీలు, బందీల మారి్పడిని హుందాగా, వ్యక్తిగతంగా చేపట్టాలని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ ఇరు వర్గాలను కోరింది. మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా 1,100 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. 

మొదటి దశ ముగింపు 
తాజా ఒప్పందంతో దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఎనిమిది మృతదేహాలు సహా 33 మంది ఇజ్రాయెల్‌ బందీల విడుదల ఒప్పందం ముగిస్తుంది. రెండో దశ చర్చలు కొన్ని వారాల కిందటే జరగాల్సి ఉండగా.. ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా మిడిల్‌ ఈస్ట్‌రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. హమాస్‌ చెరలో ఉన్న మిగిలిన బందీలందరినీ విడుదల చేయాలని, యుద్ధానికి ముగింపు పలకడానికి రెండో దశ చర్చలకు వెళ్లాలని ఇరు పక్షాలను కోరనున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement