Palestinian
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్‌లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్‌లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్‌ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
తిండి లేక అలమటిస్తున్న పాలస్తీనియన్లు!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు. -
మానవాళికి హమాస్ అపచారం
ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంతమాత్రమూ సాధ్యం కాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియన్లను చెరబట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతి కోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్‌ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే హమాస్ దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాదిమంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది. అవీవ్ కుట్జ్ నా బాల్య స్నేహితుడికి చాలా సన్నిహిత మిత్రుడు. ఇజ్రాయెల్‌లో కఫార్ అజా ప్రాంతంలో భార్య లివ్నాత్, ముగ్గురు పిల్లలతో అవీవ్ చాలా కాలం నుంచి నివసిస్తున్నాడు. తమ కిబుట్జ్ (కిబుట్జ్ అంటే హిబ్రూ భాషలో పెద్ద వ్యవసాయ క్షేత్రం. స్వచ్ఛందంగా, పోటీరహితంగా పనిచేయడానికి ముందుకొచ్చే వ్యక్తుల సమూహం అక్కడ నివసిస్తుంది)పై హమాస్ జరిపే రాకెట్లు, మోర్టార్ల దాడులు చూస్తూనేవున్నా ఏదో ఒక నాటికి ప్రశాంతత ఏర్పడక పోతుందా అన్న ఆశతో కుట్జ్ కుటుంబం అక్కడే వుంటోంది. యుద్ధ క్షేత్రంలో కాస్తయినా శాంతిని వెదుక్కోవాలనే సంకల్పంతో యేటా పతంగుల పండుగ నిర్వహించటం కుట్జ్ కుటుంబానికి అలవాటు. ఆ ఉత్సవంలో రంగురంగుల గాలిపటాలు, అందులో కొన్నింటిపై శాంతి సందేశాలు– అన్నిటినీ గాజా సరిహద్దు ముళ్ల కంచెకు సమీపంలోనే ఎగరేస్తారు. ‘మేం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం తప్ప ఘర్షణను కాదని చెప్పటమే ఈ ఉత్సవ సారాంశం’ అని గతంలో జరిగిన పతంగుల పండుగలో పాల్గొన్న లివ్నాత్ సోదరి చెప్పారు. ఈసారి పతంగుల పండుగ అక్టోబర్ 7న జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ఉత్సవ ప్రారంభానికి కొన్ని గంటల ముందు హమాస్ ఉగ్రవాదులు కఫార్ అజాపై విరుచుకు పడ్డారు. దాన్ని చెరబట్టారు. కుట్జ్ అయిదుగురు కుటుంబ సభ్యులనూ హత మార్చారు. ఇటువంటి ఉదంతాలు మనసును కలచివేస్తాయి. మనుషులు ఎందుకీ దారుణాలకు పాల్పడతారు? దీనిద్వారా హమాస్ సాధించదల్చుకున్నది ఏమిటి? ఒక ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవటం సంప్రదాయ సంగ్రామం లక్ష్యంగా ఉంటుంది. హమాస్ ఉగ్రవాదం దీనికి భిన్నం. భయోత్పాతాన్ని వ్యాపింపజేయటం, లక్షలమంది ఇజ్రా యెలీ, పాలస్తీనా పౌరుల్లోనూ, ప్రపంచ ప్రజానీకంలోనూ విద్వేష బీజాలు నాటడం దాని మానసిక యుద్ధతంత్ర ఆంతర్యం. పీఎల్ఓ వంటి ఇతర పాలస్తీనా సంస్థలకు హమాస్ భిన్నమైనది. మొత్తం పాలస్తీనా పౌరులందరితో దాన్ని సమం చేయకూడదు. హమాస్ తన పుట్టుక నుంచీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ ఉనికిని, మనుగడ సాగించేందుకు దానికిగల హక్కును గుర్తించ నిరాకరిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇతర అరబ్బు దేశాల పౌరుల మధ్య శాంతి సాధనకు ఏర్పడే ప్రతి అవకాశాన్నీ తన శక్తికొద్దీ ధ్వంసం చేస్తోంది. ప్రస్తుత హింసా పరంపరకు నేపథ్యం ఇజ్రాయెల్‌కూ, గల్ఫ్ దేశాలకూ మధ్య కుదురుతున్న శాంతి ఒప్పందాలు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య సైతం శాంతి ఒప్పందం చిగురించబోతున్నది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్యా సాధారణ సంబంధాలు ఏర్పర్చడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దురాక్రమణలో బతుకులు వెళ్లదీస్తున్న లక్షలాదిమంది పాలస్తీనా వాసులకు ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించటానికి తోడ్పడుతుంది. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి ప్రక్రియ పునఃప్రారంభం కావటానికి దోహదం చేస్తుంది. శాంతి స్థాపన అవకాశాల కన్నా హమాస్‌ను భయపెట్టగలిగేది మరేదీ వుండదు. అందుకే అది అక్టోబర్ దాడులకు తెగబడింది. కేవలం ఆ కారణంతోనే కుట్జ్ కుటుంబ సభ్యులనూ, మరో వేయిమందికి పైగా ఇజ్రాయెలీ పౌరులనూ అత్యంత పాశవికంగా హతమార్చింది. హమాస్ చర్య దాని సంపూర్ణ అర్థంలో అక్షరాలా మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరమే. మానవత్వంలో మనకుండే విశ్వాసాన్ని ధ్వంసం చేయటమే. ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంత మాత్రమూ సాధ్యంకాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియ న్లను చెర బట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతికోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్‌ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే కుట్జ్ కుటుంబ సభ్యుల హత్య, ఇతర దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాది మంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది. హమాస్‌పై సాగిస్తున్న యుద్ధంలో తన ప్రాంతాన్నీ, పౌరులనూ పరిరక్షించుకోవటం మాత్రమే కాదు... తన మానవీయతను కాపాడు కోవటం కూడా ఇజ్రాయెల్ కర్తవ్యమే. తమ స్వస్థలంలో శాంతి సౌభాగ్యాలు అనుభవించే హక్కు పాలస్తీనా పౌరులకుంది. దాంతోపాటు ఘర్షణల మధ్య కూడా వారి మౌలిక మానవ హక్కులను అన్ని పక్షాలూ గుర్తించి తీరాలి. ఇది ఒక్క ఇజ్రాయెల్‌కు మాత్రమే కాదు... గాజా స్ట్రిప్‌తో సరిహద్దు వుండి, దాన్ని పాక్షికంగా మూసివేసిన ఈజిప్టుకు కూడా వర్తిస్తుంది. ఇక హమాస్ విషయానికొస్తే మాన వాళి మొత్తం ఆ సంస్థనూ, దాని మద్దతుదార్లనూ వెలివేయాలి. గాజా యుద్ధ ఉద్దేశాలేమిటో విస్పష్టంగా ఉండాలి. హమాస్‌ను నిరాయుధీకరించాలి. గాజా స్ట్రిప్‌ను నిస్సైనికీకరించాలి. అలాగైతేనే పాలస్తీనా పౌరులు గౌరవ మర్యాదలతో మనుగడ సాగి స్తారు. వారితోపాటు ఇజ్రాయెల్ పౌరులు కూడా నిర్భయంగా జీవనం కొనసాగిస్తారు. ఈ లక్ష్యాలు సాధించేంతవరకూ మన మానవీయతనుకాపా డుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. తీరని వేదన అనుభవిస్తున్న పాలస్తీనియన్లకు సహానుభూతి ప్రకటించటం మానసికంగా అశక్తతలో, అచేతనలో కూరుకుపోయిన చాలామంది ఇజ్రాయెలీ పౌరులకు కష్టమే. మనసులు స్వీయ విషాదంతో నిండి పోయిన వర్తమానంలో కనీసం వేరేవారి వ్యథను గుర్తించటానికి కూడా అందులో చోటు మిగలదు. ఎన్ని కష్టాల్లోనైనా అలాంటి చోటును నిలుపుకోగలిగిన కుట్జ్ కుటుంబం, వారిలాంటి అనేకులు ఇవాళ మృత్యు ఒడికి చేరారు. లేదా తీవ్ర మనోవ్యాకులత లోనికి జారుకున్నారు. అటు పాలస్తీనా పౌరులదీ ఇదే పరిస్థితి. వారు సైతం చెప్పలేనంత వ్యథను అనుభవిస్తున్నారు. మా బాధలను గమనించే స్థితిలో లేరు. కానీ ఈ వేదనాభరిత స్థితికి దూరంగావున్న ఇతరులంతా వాస్తవాలను పాక్షిక దృష్టితో చూసే మందబుద్ధిని వదుల్చుకుని బాధాసర్పద్రష్టులందరికీ సహానుభూతి ప్రకటించటానికి కృషి చేయాలి. శాంతి స్థాపనకు చోటుండేలా సహాయపడటం వెలుపలి వారి కర్తవ్యం. ఆ బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయంలో మేం అశక్తులమయ్యాం. మా కోసం మీరు ఆ మంచి పని చేయండి. ఏదో ఒకరోజు ఈ కష్టాలన్నీ కడతేరినప్పుడు, ఈ గాయాలు మానినప్పుడు ఇజ్రాయెలీ పౌరులూ, పాలస్తీనా పౌరులూ ఆ చోటులో సురక్షితంగా మనుగడ సాగిస్తారు. యువల్ నోవా హరారి ఇజ్రాయెల్ పౌరుడు. చరిత్రకారుడు, తత్వవేత్త. ‘సేపియన్స్’, ‘హోమో డియుస్’, ‘అన్‌స్టాపబుల్ అజ్’ తదితర పుస్తకాల రచయిత. యువల్ నోవా హరారి (‘టైమ్’ సౌజన్యంతో) -
గాజాపై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం.. 10 వేల పాలస్తీనియన్ల మృత్యువాత
ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య యద్ధం గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య భీకర పోరు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతుంది. హమాస్ నెట్‌వర్క్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక, బాంబు దాడుల్లో ఇప్పటివరకు మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య తాజాగా 10 వేలకు చేరుకుంది. గాజాపై ఇజ్రాయెల్ మరణహోమంలో 10,022 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. వీరిలో 4,104మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధిక మంది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతిచెందినట్లు తెలిపింది. అయితే హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన 500కుపైగా రాకెట్లు గాజాపై ల్యాండ్ అయ్యాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్ దేశస్తులు మరణించారు. ఇక గాజా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు దానిని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. ఇది ఈ యుద్ధంలో చాలా ముఖ్యమైన దశ అని, తాము మరింత కీలకంగా దాడులు చేయబోతున్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా గాజాలోని సాధారణ పాలస్తీనియన్లు తలదాంచుకుంటున్న శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి.సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై జరిగిన బాంబు దాడుల్లో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చదవండి: యుద్ధంలో కీలక ఘట్టాన్ని చేరాం: ఇజ్రాయెల్ -
బ్లింకెన్ పర్యటన వేళ.. టర్కీలో యూఎస్ ఎయిర్‌బేస్‌పై దాడి
అంకారా: టర్కీలో పాలస్తీనా మద్దతుదారులు అమెరికా వైమానిక స్థావరంపై దాడికి ప్రయత్నించారు. వందల సంఖ్యలో నిరసనకారులు ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడ్డారు. బారికేడ్లను దాటడానికి ప్రయత్నిస్తూ పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, ఖుర్చీలను విసిరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ట్యియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. గాజా యుద్ధంపై చర్చలు జరపడానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నేడు(సోమవారం) టర్కీలో పర్యటిస్తున్న క్రమంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. గాజా యుద్ధంపై ఇజ్రాయెల్‌ను టర్కీ మొదటినుంచీ విమర్శిస్తోంది. హమాస్ పేరుతో అమాయకులైన ప్రజలపై దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్‌ను నిందిస్తోంది. ఇదే క్రమంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొనడానికి ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి టర్కీలో పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలోనే తాజాగా వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఇస్లామిస్ట్ టర్కిష్ సహాయ సంస్థ IHH హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ గాజాపై ఇజ్రాయెల్ దాడులను, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఈ దాడికి పిలుపునిచ్చింది. 🚨 JUST IN: Turkish Police Disperse Pro-Palestinian Protesters Near İncirlik Air Base Which Houses U.S. Troops pic.twitter.com/TsAjfbTz6G — Mario Nawfal (@MarioNawfal) November 5, 2023 ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: గాజాను రెండుగా విభజించాం.. ఇజ్రాయెల్ సైన్యం కీలక పకటన -
మంకుపట్టుకు మనస్సాక్షి విడుపు
గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వేలాది మంది లండన్ వీధులలోకి రావడం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలోని మిక్కిలి ‘సుందరమైన’ దృశ్యాలలో ఇది ఒకటి అనిపిస్తుంది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు ప్యారిస్, బెర్లిన్ లాంటి నగరాలలోనూ జరిగాయి. యు.ఎస్.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్ వాయిసెస్ ఫర్ పీస్’ సంస్థ ఆధ్వర్యంలో అమెరికన్ కాంగ్రెస్‌లోనూ, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లోనూ స్థానిక యూదులు భారీ ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? జరగబోయే అకృత్యాలను ఆపగలవా? ఏమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి. ప్రజాస్వామ్యంలోని మిక్కిలి సుందరమైన దృశ్యాలలో ఒకటి – ఈ ‘సుందరమైన’ అనే విశేషణాన్ని నేను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగిస్తున్నాను – పదులు లేదా వందల వేలమంది తాము సహించరాని అన్యాయంగా భావిస్తున్న దానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనను వ్యక్తం చేయడం. ఆ నిరసనకు మీ సొంత ప్రభుత్వం దారి ఇచ్చిందా లేక ప్రపంచంలోని మరొక చివరన అది మలుపు తిరిగిందా అన్నది విషయమే కాదు. అదొక మూకుమ్మడి నైతిక వివేచనను రేకెత్తించిందన్నది, మానవుల ఆత్మను కదిలించిందన్నది ముఖ్యం. నిజానికి అది వారి ఉనికి యొక్క లోతు. అందుకే వారి స్పందన మానవత్వానికి సహేతుకమైన సమర్థన. అది మానవులను జంతువుల కన్నా ఉన్నతంగా ఉంచుతుంది. గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వందల వేల మంది లండన్ వీధులలోకి రావడం చూసినప్పుడు నాలో ఈ ఆలోచన మెదిలింది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు పారిస్, బెర్లిన్, అమెరికా నగరాలలోనూ జరిగాయి. వాస్తవానికి యు.ఎస్.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్ వాయిసెస్ ఫర్ పీస్’ ఆధ్వర్యంలో అమెరికన్ కాంగ్రెస్ లోనూ, అలాగే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లోను స్థానిక యూదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ సందర్భంలోనైతే అది విశ్వాసాల వెన్నుదన్నులను కలుపుకున్న మతం పట్టు కంటే గట్టిది. నన్ను తప్పుగా అనుకోకండి. అక్టోబర్ 7న హమాస్ ఏదైతే చేసిందో అది అనాగరికమైనది, క్రూరమైనది, ఏమాత్రం క్షమార్హం కానిది. అయితే ఒక నెల తర్వాత అది అర్ధసత్యం మాత్రమే. హమాస్ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ 9,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 22,000 మందిని గాయపరిచింది. మృతులలో నలభై శాతం మంది చిన్నారులే. విద్యుత్తు, నీరు, ఇంధనం, ఆహారం అంద కుండా చేస్తూ వస్తున్న కొన్ని వారాల దారుణమైన వైమానిక దాడుల తర్వాత ఇప్పుడు రెండవ దశ భూతల దాడులు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు అడుగుతున్నది చాలా సరళమైనదనీ, సూటి అయినదనీ నేను ఊహించగలను. శిక్ష, ప్రతీకారం సమర్థనీయం అయినప్పటికీ ఇది చాలాదూరం వెళ్లలేదా? చాలాకాలం అయి పోలేదా? ఉత్తర గాజాలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం కోసం దక్షిణం వైపునకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కానీ అలా వెళ్లినవారు తలదాచుకున్న దక్షిణ ప్రాంతాలైన ఖాన్ యూనిస్, రాఫాల పైన కూడా బాంబులు కురిపించడం మొదలుపెట్టింది. ‘అల్ జజీరా’ ప్రతినిధి కుటుంబం నుసిరత్ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో మరణించింది. గాజా నగరంలో 600 మంది మాత్రమే పట్టే సామర్థ్యం గల షిఫా ఆసుపత్రి ఇప్పుడు బాంబు దాడుల నుంచి తప్పించుకోడానికి అక్కడికి చేరిన 20,000 మందితో కిక్కిరిపోయిందనీ; శిథిలాలు, మురుగు నీరును మాత్రమే తాము చూడగలుగుతున్నామనీ అక్కడి వైద్యులు చెబుతున్నారు. మత్తుమందు లేకుండానే ఆసుపత్రి కారిడార్ నేలపైన శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లుగా కూడా నివేదికలు అందుతున్నాయి. అదే నగరంలోని అల్ ఖుద్స్ ఆసుపత్రికి – నేరుగా వైమా నిక దాడులకు గురి అయ్యే ప్రమాదం ఉన్నందున రోగులను ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు అందాయి. మరి ఇంక్యుబేటర్లలో, అత్యవసరంగా వెంటిలేటర్ల పైన ఉన్న శిశువులను ఎక్కడికి తరలించాలి? గాజాకు అయిన వర్ణనాతీతమైన గాయం గురించి ఒక పాలస్తీనా వ్యక్తి గుండెను పిండేసే మాటలను ‘బీబీసీ’తో అన్నారు: ‘‘సురక్షితంగా ఉండేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి అని ప్రజలు అడగడం లేదు. మనం చనిపోయేటప్పటికి ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నారు.’’ నిజం ఏమిటంటే ఇజ్రాయెల్ అంత రాత్మ కూడా ఈ భయానక స్థితికి చలించింది. ఆ స్థితిని వ్యక్తీకరించడం అంత తేలిగ్గా కనిపించకపోవచ్చు. హమాస్ కంటే ఎక్కువ అని కాదు, హమాస్‌తో సమానంగా అణచి వేసే ప్రయత్నాలతో ఇజ్రాయెల్ ఏమీ సౌకర్యంగా ఉండకపోవచ్చు. కనుక నెమ్మ దిగా, కానీ స్థిరంగా మాటలను కూడబలు క్కుంటోంది. ‘హఆరెడ్జ్’... ఇజ్రాయెల్‌లో పేరున్న వార్తా పత్రిక. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన మరుసటి రోజు, అక్టోబర్ 8న తన సంపాదకీయ వ్యాసంలో... ‘దాడి వల్ల ఇజ్రాయెల్‌కు సంభవించిన విపత్తుకు బాధ్యత వహించవలసిన ఒకే ఒక వ్యక్తి బెంజమిన్ నెతన్యాహూ’ అని రాసింది. పాలస్తీనా ఉనికిని, హక్కులను నెతన్యాహూ విస్మరించారని ఆరోపించింది. 9వ తేదీన ఆ పత్రిక ‘ప్రతీకార ఉద్యమాలకు, యుద్ధ నేరాలకు ఆస్కారం ఉండొచ్చు’ అని హెచ్చరించింది. ఆ పత్రిక వ్యాసకర్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గిడియన్ లెవీ 19వ తేదీన ‘ఎనఫ్’ (చాలు) అనే శీర్షికతో సంపాదకీయం పేజీలో రాసిన వ్యాసాన్ని ‘ఈ రక్తపాతాన్ని తక్షణం ఆపి తీరాలి, వినాశానికి హద్దులు ఉంటాయి’ అని ప్రారంభించారు. ఇజ్రాయెల్ గురించి మీరేం అనుకున్నా, స్థానిక యూదు పౌరులకు అది ప్రజాస్వామ్య దేశం అనేందుకు ‘హఆరెడ్జ్’ ఒక కాదన లేని రుజువు. భారతదేశంలో ఈ విధమైన పరిస్థితుల్లో పత్రికలు రాసే సంపాదకీయాలు, అభిప్రాయాలు తీవ్రవాదం, దేశద్రోహం అభియో గాలను ఆహ్వానించవచ్చు. అంటే ఇజ్రాయెల్‌లోనూ ఇప్పుడు నిరస నల సౌందర్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? మరింత దారుణంగా జరగబోయే అకృత్యాలను అవి ఆపగలవా? చెప్పలేను. బహుశా ఆపలేవేమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి.అందుకు ఒకే కారణం అవి జరగవలసి ఉండటం. నిశ్శబ్దంగా ఉండ లేని స్వరాలు అవి. కనుక మాట్లాడటాన్ని మన మనస్సాక్షి కొన సాగిస్తూనే ఉంటుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్‌ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్‌కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్‌లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు. అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశంకానున్నారు. At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza. Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D — Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023 I am in Israel, a nation in grief. I grieve with you and stand with you against the evil that is terrorism. Today, and always. סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT — Rishi Sunak (@RishiSunak) October 19, 2023 -
గాజా సరిహద్దుల్లో 1500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్.. ప్రస్తుతం వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. తాజాగా గాజా సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ ప్రాంతంలో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు కనుగొన్నామని. గాజా సరిహద్దుపై నియంత్రణ పునరుద్ధరించామని సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ . వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి ఎవరూ లోపలికి రాలేదని, కానీ పలుచోట్ల చొరబాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. గాజా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రజలను సైన్యం దాదాపు తరలించిందని చెప్పారు. అయితే ఈ మరణాలను పాలస్తీనా మిలిటెంట్లు ధృవీకరించలేదు. మరోవైపు గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,600 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 900 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 68700 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. చదవండి: ఇజ్రాయెల్ సూపర్ నోవా ఫెస్టివల్‌పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..? హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ కాల్చి పారేస్తున్నారు. తాజాగా గాజా సరిహద్దు లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లను గుర్తించిన ఇజ్రాయెల్ పోలీసులు వారిని వెంబడించి మట్టుపెట్టారు. కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేసి గన్‌తో కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు.ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. We will continue working on the front lines to defend our civilians from terror pic.twitter.com/PQk9KiiKoT — Israel Police (@israelpolice) October 9, 2023 -
పాలస్తీనాకు మద్దతుగా సీడబ్ల్యూసీ తీర్మానం
ఇజ్రాయెల్ భద్రతా దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజల భూభాగం, స్వయం ప్రతిపత్తి, గౌరవం, జీవించే హక్కు కోసం తాము దీర్ఘకాలిక మద్దతునిస్తున్నట్లు స్పష్టం చేసింది. సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాలు శాంతియుత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలకు భరోసా ఇస్తూ చర్చల ద్వారా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేరాలని తమ పార్టీ ఎప్పుడూ విశ్వసిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పాలస్తీనాకు మద్దతుగా తాజా ప్రకటన వెలువడింది. A resolution in support of Palestine has been passed in the meeting of the “Working Committee”, the highest policy making body of the Congress. “The Congress Working Committee reiterates its support for the rights of the Palestinian people to land, self-governance and… https://t.co/CAGdATJWyD pic.twitter.com/IQl5iKtD0q — The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) October 9, 2023 ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?!
‘‘దీనిని నేనెలా ఆపగలను! నాకింకా పదేళ్లే. ఎప్పుడేం జరుగుతుందోనని నాకు భయంగా ఉంటోంది. ఎవరూ ఇలా కాకుండా ఆపలేరా?’’ అని గాజాలోని ఒక పాలస్తీనా బాలిక కన్నీటితో ప్రశ్నిస్తున్న వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. జాతులు సృష్టిస్తున్న విధ్వంసంలో ఛిద్రమౌతున్న బాల్యానికి ప్రతీకలా ఉన్న ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?! నదీన్ అబ్దెల్ తయూఫ్ పాలస్తీనా బాలిక. గాజాలో ఉంటోంది ఆమె కుటుంబం. గాజాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల్లో నదీన్ కుటుంబానికి తృటిలో మృత్యువు తప్పింది. ఉలిక్కిపడి ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి పరుగెత్తింది నదీన్. అదృష్టం ఆమెను ఎంతసేపు వెన్నంటి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం అంటే.. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, బంధువులు, చుట్టపక్కల ఇళ్లవాళ్లు, స్కూల్ టీచర్లు, స్కూల్లో ఫ్రెండ్స్.. వీళ్లందరితో కలిసి ఉండటం! రోజూ ఒకర్నొకరు చూసుకుంటూ, పలకరించుకుంటూ, సహాయాలు చేసుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, టీచర్స్ని డౌట్స్ అడుగుతూ, ఇంటికి ఫ్రెండ్స్‌ని తెచ్చుకుంటూ, ఫ్రెండ్స్ ఇళ్లకు తను వెళుతూ.. ఇవన్నీ అదృష్టాలే. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. ఏ క్షణమైనా గాజాలో బాంబులు పడొచ్చు. అంటే ఏ క్షణమైనా ప్రాణాలను లేదంటే ఆప్తుల్ని కోల్పోవచ్చు. ఐదు రోజుల క్రితం ఇజ్రాయిల్–పాలస్తీనాల మధ్య ఘర్షణ మొదలైంది. ఘర్షణ అనడం చిన్నమాట. యుద్దం అనాలి. గగన తలం నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఇజ్రాయిల్ గాజా మీద వేస్తోందా, గాజా ఇజ్రాయిల్ మీద వేస్తోందా అని కాదు నదీన్ ప్రశ్న! ‘‘దీన్నెవరూ ఆపలేరా? నేను చిన్నదాన్ని. పదేళ్లు నాకు. నేనేం చేయగలను?’’ అని మనసును కలచివేసేలా ఏడుస్తూ అడుగుతోంది. కాస్త జ్ఞానం కలిగినవాళ్లకు అది అడగడంలా అనిపించదు. మరి! నిలదీసినట్లుగా ఉంటుంది. ∙∙ అవును! వీడియో క్లిప్‌లో నదీన్ అలా అడగడం.. ‘మీరు మనుషులేనా?’ అని అడిగినట్లుగానే ఉంటుంది మనసుతో చూడగలిగిన వారెవరికైనా! ‘మిడిల్ ఈస్ట్ ఐ’ అనే మీడియా సంస్థ ప్రతినిధి గాజాలోని శిథిలాల పక్కన నిశ్చేష్టురాలైన నిలుచుని ఉన్న నదీన్ని పలకరించినప్పుడు ఆమె అడిగిన ప్రతి మాటా ఒక శతఘ్ని గర్జించినట్లే ఉంది. ఆమె చెంపలపై జారిన ప్రతి కన్నీటి బిందువు ఉప్పొంగిన ఒక దుఃఖ సముద్రంలానే ఉంది! 1.19 నిముషాల ఆ వీడియో క్లిప్ మే 15 న ట్విట్టర్లో అప్లోడ్ అయితే ఇప్పటి వరకు కోటీ ముప్పై లక్షల మందికి పైగా వీక్షించారు. ‘‘ఎప్పుడూ నాకు ఏదో జరగబోతున్నట్లే ఉంటుంది. ఎందుకో తెలీదు. ఇదంతా చూడండి. ఎలా కుప్పకూలి ఉందో. నేనేమీ చేయలేకపోతున్నాను. పోనీ, నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఈ సమస్యని పరిష్కరించాలనా?! పదేళ్ల పిల్లని. ఏమాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు డాక్టర్ అవాలని ఉంది. లేదా ఇంకేదైనా. నా ప్రజలకు సహాయం చేయాలని ఉంది. ఇలా ఉంటే మరి చేయగలనా? భయమేస్తోంది. కానీ మరీ ఎక్కువగా కాదు. నా ప్రజలకు కోసం ఏదైనా చేయగలను. కానీ ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా భవంతులు నిలువునా కూలి ఉండటం చూసి రోజూ ఏడుస్తున్నాను. నాకనిపిస్తుంటుంది. ఇలా జరగడం అవసరమా అని! ఏమిటీ కర్మ అని కూడా. ఇవన్నీ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ‘వాళ్లు మనల్ని ద్వేషిస్తారు. అందుకే ఇవన్నీ చేస్తున్నారు’ అని ఇంట్లో అంటున్నారు. మేమంటే వాళ్లకు ఇష్టం ఉండదట. నా చుట్టూ ఉన్న ఈ పిల్లల్ని చూడండి. అంతా పసివాళ్లు. వాళ్లపైన మిస్సయిల్స్ వేసి చంపేస్తారా! అది కరెక్టు కాదు. అది కరెక్టు కాదు’’ అని నదీన్ కన్నీళ్లతో అనడం వీడియోను చూసే వాళ్ల చేత కంట తడి పెట్టించేలా ఉంది. ట్విట్టర్లో నదీన్ మాట్లాడుతున్న క్లిప్‌ను చూసి షెల్లీ నాట్ అనే ఒక తల్లి స్పందించింది. ‘‘నాకు 11 ఏళ్ల కూతురు ఉంది. నదీన్ ముఖంలోని ఆవేదన నా గుండెను బద్దలు చేసింది. పరిస్థితులు ఆమెను వయసుకు మించి పెద్దదాన్ని చేసినట్లుగా అనిపిస్తోంది. ఆమె బాల్యం ఛిద్రమైపోయింది’’ అమె ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచాధినేతలారా ఎక్కడున్నారు? అకస్మాత్తుగా మీ అందరికీ అంధత్వం వచ్చేసిందా?’’ అని ఇంకొకరు.. ‘‘ఈ చిన్నారి మాటల్ని విన్నాక మనుషులుగా మనం విఫలమయ్యాం అనిపించింది’’ ‘‘నా గుండె ముక్కలైపోయింది. ఎంత అవివేకమైన, స్వార్థం నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం..’’ అనీ స్పందనలు వచ్చాయి. బ్యారీ మలోన్ అనే ట్విటిజెన్.. ‘‘దేవుడా.. ఆ చిన్నారికి నీ దీవెనలివ్వు’’ అని వేడుకున్నాడు. నదీన్ టీచర్ ఝీద్ కూడా ట్వీట్ చేశారు. ‘‘తను నా స్టూడెంట్. తన చుట్టు పక్కల ఏం జరిగిందో ప్రెస్ అడుగుతుంటే చెబుతోంది. దేవుడి దయవల్ల నదీన్, ఆమె కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. అయితే తనింకా షాక్ నుంచి తేరుకోలేదు’’ అని రాశారు. నదీన్లానే షాక్ నుంచి తేరుకోని బాలలు, మహిళలు, వృద్ధులు గాజాలో ఎంతో మంది ఉండి ఉంటారు. ఇది ఎలా మొదలైనా కానీ, చిన్నారుల హరివిల్లుల లోకంలో నిప్పురవ్వలు కురిపించకుండా అంతమైపోవాలి. మనుషులుగా మనం.. పిల్లల పూలతోటలో తిరిగి మొలకెత్తాలి. Terrified 10 year old girl from Gaza explaining how growing in such conditions is preventing her from having a decent education and environment where she could become a productive person for her community.#PalestinianLivesMatter #GazaUnderAttack pic.twitter.com/5a7tdkFGhN — Hamza Ghammat (@GHHamzaaa) May 18, 2021 -
గాజా ఆందోళనల్లో 13 మంది మృతి
గాజా సిటీ: ఇజ్రాయెల్ సరిహద్దు వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన వేలాది మంది పాలస్తీనా ఆందోళనకారులపై ఇజ్రాయెల్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసలో 12 వందల మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. పాలస్తీనా శరణార్థుల్ని దేశంలోకి అనుమతించాలంటూ ఆందోళనకారులు గాజా ప్రాంతంలో సరిహద్దు వెంట శుక్రవారం నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. కొద్దిమంది ఆందోళనకారులు ఫెన్సింగ్ వైపుగా దూసుకురావడంతో ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపాయి. డ్రోన్ సాయంతో సరిహద్దు వెంట టియర్ గ్యాస్‌తో ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు సరిహద్దు వైపుగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది. -
మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ : ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస మంటలు పుట్టిస్తున్నారు. పాకిస్తాన్‌ను నిధులు నిలిపివేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్.. తాజాగా పాలస్తీనాను లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేను గుర్తించే విషయంపై ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో.. పాలస్తీనాకు నిధులు నిలిపేస్తామంటూ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వరుస ట్వీట్లతో ఆ దేశంపై విరుచుకుపడ్డారు. ప్రతి ఏడాది వందల మిలియన్ డాలర్ల సహాయాన్ని తీసుకుంటూ.. అమెరికాపై ఏ మాత్రం గౌరవం చూపడం లేదని అన్నారు. ఇజ్రాయిల్‌తో శాంతి చర్చలను కొనసాగించేందుకు సూతం పాలస్తీనా అథారిటీ ఆసక్తి చూపడం లేదన్నారు. పాలస్తీనా అథారిటీ శాంతిని కోరుకోవడం లేదు.. అటువంటి పరిస్థితుల్లో వారికి సహాయ నిధులు అందించాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అగ్రరాజ్యం ప్రతి ఏడాది పాలస్తీనా అథారిటీకి 300 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తోంది. అదే ఇజ్రాయిల్‌కు 3.1 బిలియన్ల సైనిక సహాయం చేస్తోంది. దీనిని వచ్చే ఏడాది నుంచి 3.8 బిలియన్ డాలర్లకు పెంచుతంది. ఇదిలావుండగా.. జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా అథారిటీ అగ్రరాజ్యం నుంచి తమ రాయబారిని వెనక్కు పిలిపించింది. ...peace treaty with Israel. We have taken Jerusalem, the toughest part of the negotiation, off the table, but Israel, for that, would have had to pay more. But with the Palestinians no longer willing to talk peace, why should we make any of these massive future payments to them? — Donald J. Trump (@realDonaldTrump) January 2, 2018 -
గాజాపై ఆగని దాడులు
12 వుంది పాలస్తీనియన్ల మతి గాజా: గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైవూనిక దాడుల్లో ఆదివారం 12 వుంది పాలస్తీనావాసులు మతిచెందారు. 48 రోజులనుంచి కొనసాగుతున్న పరస్పర దాడులను నివారించేందుకు బళ్లీ శాంతి చర్చలు జరపాలని ఈజిప్టు పిలుపునిచ్చిన మరుసటిరోజే ఇజ్రాయెల్ కాల్పులకు పాల్పడింది. అరుుతే ఇటు పాలస్తీనా నుంచి కాని, అటు ఇజ్రాయెల్ వైపునుంచి కాని ఈజిప్టు పిలుపునకుస్పందన కనిపించలేదు. ఆదివారం ఇజ్రాయెల్ విమానాలు గాజాలో 20 చోట్ల బాంబులు వేశారుు. రఫా పట్టణంలో 13 అంతస్తుల ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా ఇజ్రాయెల్ నేలవుట్టం చేసింది. శనివారం గాజాలో కూడా ఇజ్రాయెల్ ఇదే తరహాలో 12 అంతస్తుల భవనాన్ని బాంబులతో కూల్చివేసింది. ఉగ్రవాదులు తలదాచుకుంటున్న భవనాలను కూల్చివేస్తావుంటూ ఇజ్రాయెల్ వారం రోజులనుంచి హెచ్చరికలు చేస్తోంది. ఇటు పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ భూభాగంపై 20 రాకెట్లను ప్రయోగించారు. -
మా విధానంలో మార్పులేదు: సుష్మ
గాజా హింసాకాండపై తీర్మానం కుదరదన్న ప్రభుత్వం న్యూఢిల్లీ: పాలస్తీనా అంశంపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పూ లేదని, గాజా ప్రాంతంలో సంఘర్షణపై ఎవరిపక్షమూ వహించబోమని ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో పరిస్థితిపై తీర్మానం చేయాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. గాజా పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానమిస్తూ, గాజా సమస్యపై సభలో రెండురకాల అభిప్రాయాలు ఉండరాదని, హింసాకాండ ఎక్కడ తలెత్తినా ఖండిస్తున్నామనే ఉమ్మడి సందేశాన్ని పంపించాలని సూచించారు. శాంతిచర్చలపై ఈజిప్ట్ చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్, పాలస్తీనా ఆమోదించాలని ఆమె అభిప్రాయపడ్డారు. అంతకు ముందు సభలో చర్చ సందర్భంగా,. గాజాలో హింసాకాండను ప్రతిపక్ష సభ్యులు ఖండించారు. గాజాపై తీర్మానాన్ని ఆమోదించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌నుంచి సైనిక కొనుగోళ్లను ప్రభుత్వం ర ద్దుచేసుకోవాలని, గాజా సమస్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించాలని కూడా డిమాండ్ చేశారు. 176వ నిబంధనకింద జరిగే చర్చకు సంబంధించి, సభలో తీర్మానం ఆమోదం సాధ్యంకాదని, సభలో ఏకాభిప్రాయంలేనపుడు తాను చేయగలిగిందేమీలేదని రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ స్పష్టంచేశారు. ఆగని భీకర పోరాటం గాజాలో, ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య రెండు వారులుగా సాగుతున్న భీకర పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించడ ంతోపాటు, హమాస్ మిలిటెంట్ల చొరబాటు యత్నాలను కూడా వమ్ముచేసింది. 14రోజుల పోరాటంలో ఇప్పటివరకూ 535మంది పాలస్తీనియన్లు, 18మంది సైనికులు సహా 20మంది ఇజ్రాయెలీలు మరణించారు. దాడుల్లో 3,100పాలస్తీనియన్లు గాయపడ్డారు. మరో వైపు,.తాజా పరిస్థితుల నేపథ్యంలో తక్షణం కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి, అమెరికా పిలుపునిచ్చాయి. -
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
337కు చేరిన మృతుల సంఖ్య ఆశ్రయం కోల్పోయిన 40 వేలమంది పాలస్తీనియన్లు గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లకు చెందిన హమాస్ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటుగా భూతల దాడులనూ ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు అంతకంతకూ గాజా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. గాజాలోని ఒక ఇంటిపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని సైనికులు హతమార్చారని, మిగతావారు వెనుదిరిగి గాజా ప్రాంతంలోకి పరారయ్యారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ 12 రోజులుగా జరుపుతున్న దాడులతో మృతుల సంఖ్య 337కు చేరింది. దాడులతో 40 వేలమందికి పైగా పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఇరుపక్షాలను కాల్పుల విరమణకు ఒప్పించేందుకు, సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, దౌత్యవేత్తలు సన్నద్ధమయ్యారు. పశ్చిమాసియాకు మూన్ పయనమవుతున్నారు. మరోవైపు ఘర్షణ తీవ్రతరమై గాజా ప్రాంతంలో పరిస్థితి మరింత విషమించింది. ఉభయపక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టం నిబంధనలను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సహాయ, కార్యకలాపాల సంస్థ సూచించింది.