పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్‌లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్‌లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు.
గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్‌ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment