Harvard university
-
పేస్ట్రీ చెఫ్ నుంచి వెల్నెస్ గురుగా..!
ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా విజయం సాధిస్తున్నారు. ఒకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా..! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే మాన్వి లోహియా. పేస్ట్రీ చెఫ్‌గా మొదలైన ప్రస్థానం న్యూట్రిషినిస్ట్, వెల్నెస్ నిపుణురాలిగా ఉన్నత స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది. ఎవరీమె? ఆమె జర్నీ ఎలా మొదలయ్యిందంటే..29 ఏళ్ల మాన్వి లోహియా తొలుత పేస్ట్రీ, బేకింగ్ వంటి పాక శాస్తంలో నైపుణ్యం సంపాదించి డిస్నీలో ఫడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్తో కెరీర్‌ని ప్రారంభించింది. సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా దూసుకుపోతూ ఓ పక్క తనకు ఇష్టమైన వెల్నెస్పై దృష్టిసారించింది. అలా హర్వర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎపిడెమియాలజీ బయోస్టాటిస్టిక్స్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటిన్నర ఏడాది గాయం, గుండె మూత్రపిండాలు, జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లలో పనిచేసింది. కొన్నేళ్లు ఈ విభాగాల్లో పరిశోధనలు చేసింది. ఆ తర్వాత తన మాతృభూమి భారత్‌కు వచ్చి తన దేశ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అలా ఆమె హరిద్వార్‌లో 'ఏకాంత' అనే వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించింది. మాన్వియా ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న రిజిస్టర్డ్ డైటిషియన్. పైగా దాదాపు 500 మందికి పైగా రోగులకు సేవలందించిన అనుభవం గలది. అంతేగాదు ఆమె ఆఫ్రికాలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సర్టిఫైడ్ హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంతోనే మాన్వియా ఏకాంత వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలకు విశ్వసనీయమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తోంది.తమ ఏకాంత వెల్నస్ సెంటర్లో ప్రజలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలన్నింటిని పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు మాన్వి. "ప్రజలు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి సంప్రదాయ వైద్య చికిత్సలు మంచి ప్రభావాన్ని అందించ లేకపోతున్నాయి. ఈ దైనందిన బిజీ జీవితంలో మంచి ఆరోగ్యం కోసం ప్రశాంతత నుంచే స్వస్థత పొందే యత్నం చేయాలి. అది ఇలాంటి వెల్నెస్ సెంటర్‌తోనే సాధ్యం. అంతేగాదు ప్రశాంతత అనేది పచ్చదనంతో కూడిన అభయారణ్యంతోనే సాధ్యమని భావించి ఆ విధంగానే తన వెల్నెస్ సెంటర్‌ని తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడకు విదేశీయులు సైతం వచ్చి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు మాన్వియా. చెప్పాలంటే ఇక్కడ మాన్వియా తన అభిరుచులకు అనుగుణంగా తన కెరీర్‌ని తీసుకువెళ్లింది. పాకశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ రెండు విభిన్న రంగాలు. కానీ ఆమె ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్స్ తోపాటు వెల్నెస్ సెంటర్ రన్ చేయడమే గాక ఆరోగ్య నిపుణురాలిగా, న్యూటిషినిస్ట్గా ఉన్నారు. పట్టుదట, సంకల్పం ఉంటే ఏకకాలంలో విభిన్న రంగాల్లో విజయం సాధించగలమని నిరూపించారు మాన్వి.(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..) -
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్‌లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్‌లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్‌ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
Meeta Sharma: ఆటలు ఆడు కన్నా
చీప్ ప్లాస్టిక్. చైనా ప్లాస్టిక్. ఇవాళ పిల్లల బొమ్మలు వీటితోనే దొరుకుతున్నాయి. కళాత్మకమైన దేశీయమైన చెక్కతో తయారైన బొమ్మలు పిల్లలకు ఉండాలి అని బొమ్మల కేంద్రం ప్రారంభించింది మీతా శర్మ. హార్వర్డ్‌లో చదువుకున్నా తన ఇద్దరు పిల్లలు ఆడుతున్న బొమ్మలను చూశాక ఆమె ఈ పని మొదలెట్టింది. ఇవాళ నెలకు వెయ్యి అర్డర్లు వస్తున్నాయి. 100 మంది బొమ్మల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. పిల్లలు ఆమె బొమ్మలతో చక్కగా ఆడుకుంటున్నారు. ఈసప్ కథల్లో ‘కాకి దప్పిక’ కథ పిల్లలందరికీ చెబుతారు. దప్పికగొన్న కాకి కుండలో నీళ్లను తాగడానికి ప్రయత్నించి, అవి అందకపోతే నాలుగు రాళ్లు జారవిడిచి, నీళ్లు పైకి తేలాక తాగుతుంది. ఆ విధంగా ఆ కథ అవసరం అయినప్పుడు యుక్తిని ఎలా పాటించాలో పిల్లలకు చెబుతుంది. ఈ కథ యూట్యూబ్‌లో వీడియో గా సులభంగా దొరుకుతుంది. కాని మీతా శర్మ తయారు చేసే బొమ్మల్లో ఇదే కథ మొత్తం బుజ్జి బుజ్జి చెక్క బొమ్మల సెట్టుగా దొరుకుతుంది. పిల్లలను ఉద్రేక పరిచే ఆటబొమ్మల కంటే ఇలాంటి బొమ్మలే అవసరం అంటుంది ‘షుమి’ అనే బొమ్మల సంస్థను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న మీతా శర్మ. కంప్యూటర్ ఇంజనీర్ మీతా శర్మది ఢిల్లీ. అక్కడే ఐఐటీ లో బిటెక్ చేసింది. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వివాహం అయ్యాక అమెరికాలోనే జీవితం మొదలెట్టింది. ‘మా పెద్దాడు పుట్టాక అమెరికాలో క్వాలిటీ బొమ్మలు కొనిచ్చాను ఆడుకోవడానికి. అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కొయ్యబొమ్మలు. పాడు కావు. హాని చేయవు. 2012 లో అమెరికా వద్దనుకుని ఇండియా వచ్చాక నాకు సమస్య ఎదురైంది. అప్పటికి నా రెండో కొడుక్కి రెండేళ్లు. ఇక్కడ వాడికి ఇద్దామంటే మంచి బొమ్మలే లేవు. అన్నీ ప్లాస్టిక్‌వి లేదా గాడ్జెట్స్, అమెరికన్ కామిక్స్‌లో ఉన్న కేరెక్టర్... ఇవే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ పిల్లలు నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. మన చిన్నప్పుడు చెక్కతో తయారు చేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంతో బాగుండేవి. అలాంటి బొమ్మలకోసం ఎంత వెతికినా దొరకడం లేదు. కొన్నిచోట్ల సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి కాని వాటి మార్కెటింగ్ సరిగా లేదు. అందుకని నాకే ఒక బొమ్మల తయారీ సంస్థ ఎందుకు మొదలెట్టకూడదు అనిపించింది. 2016లో షుమి సంస్థను స్థాపించాను’ అని తెలిపింది మీతా శర్మ. వేప, మామిడి కలపతో ‘నిజానికి సంస్థ స్థాపించడానికి పెట్టుబడి దొరకలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పిల్లల గేమ్స్ తయారు చేసే సంస్థలనే ప్రోత్సహించేవి. నా దారేమో సంప్రదాయ కలప బొమ్మల దారి. అందుకే సొంత పెట్టుబడితో సంస్థను స్థాపించాను. బొమ్మలు చేసే కళకారులను సంప్రదించి కేవలం వేప, మామిడి కలపతో ముద్దొచ్చే బొమ్మలను ముఖ్యంగా రెండేళ్ల వయసున్న పిల్లల కోసం ఎక్కువ గా ఆ తర్వాత పదేళ్ల లోపున్న పిల్లలకోసం బొమ్మలను తయారు చేయించాను. వాటికి ఉపయోగించే రంగులు కూడా రసాయనాలు లేనివే’ అంది మీతా శర్మ. ఢిల్లీలో తన సంస్థను స్థాపించాక రకరకాల కొయ్యగుర్రాలను, మూడు చక్రాల తోపుడు బండ్లను, బుజ్జి గుడారాలను, పిల్లలు ఆడే వంట సామగ్రిని, వారికి కొద్దిపాటి లెక్కలు నేర్పే ఆట వస్తువులను, కథలను బొమ్మల్లో చెప్పే సెట్లను ఇలా తయారు చేయించింది.‘ఆన్లైన్లో మాకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది తల్లులు ఆ బొమ్మలతో ఐడెంటిఫై అయ్యారు. ఎందుకంటే వారంతా బాల్యంలో అలాంటి బొమ్మలతోనే ఆడారు కనుక. తమ పిల్లలకు సరిగ్గా అలాంటివే దొరకడంతో వారి ఆనందానికి హద్దులు లేవు’ అని చెప్పిందామె. ఇప్పుడు మీతా తయారు చేయిస్తున్న బొమ్మలు అమెరికా, యు.కె, సింగపూర్‌కు కూడా రవాణా అవుతున్నాయి. నెలలో 8000 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. 100 మంది కళాకారులు చేతినిండా పనితో ఉపాధి పొందుతున్నారు. ఆటే పరిశోధన ‘పిల్లల అసలైన పరిశోధన వారు ఆడే ఆటలతోనే మొదలవుతుందని పిల్లల మనస్తత్వ నిపుణులు తెలుపుతారు. పిల్లల్ని పిల్లల్లా ఉంచే ఆటబొమ్మలతో వారిని ఆడనివ్వాలి. హింసాత్మకమైన బొమ్మల నుంచి వారిని దూరం పెట్టాలి. హింసను ప్రేరేపించే గేమ్స్ నుంచి కూడా. పిల్లలు బొమ్మలతో స్నేహం చేసి వాటిని పక్కన పెట్టుకుని భయం లేకుండా నిద్రపోతారు. వారికి బాల్యం నుంచి అలాంటి నిశ్చింతనిచ్చే బొమ్మల వైపుకు నడిపించాలి’ అని సలహా ఇస్తోంది మీతా. ఒక ఉద్యోగిగా కంటే తల్లిగా ప్రయోజనాత్మక అంట్రప్రెన్యూర్‌గా ఆమె ఎక్కువ సంతృప్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని పొందుతోంది. అదీ విజయమేగా. -
ఆడపిల్లకు ఒక అక్క ఉండాలి!
పనిలో ఉన్నాడు అతను. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ‘అవునా!’ అన్నాడు మెల్లిగా. ముఖం మీదకు చిరునవ్వు వచ్చి వాలింది. అప్పటికి అతడి లంచ్ అవలేదు. అవకపోయినా కొంచెం వెయిట్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యాడు. చేమంతి పుట్టినప్పుడు కాదు.. ఇప్పుడయ్యాడు అతడు ఆడపిల్ల తండ్రి! స్కూల్ నుంచి వచ్చాడు చేమంతి అన్నయ్య. వస్తూనే ‘అమ్మా, చేమంతి ఎక్కడ?’ అని వెతుక్కున్నాడు. అమ్మ పుట్టాక (వాడు పుట్టాక అని అర్థం) అమ్మని వెతుక్కున్నాడు. చెల్లి పుట్టాక చెల్లిని వెతుక్కుంటున్నాడు. నిన్నటి ఆటేదో మధ్యలో ఆపేశారు అన్నాచెల్లెళ్లు. దాన్ని కంటిన్యూ చెయ్యాలి. అందుకే చెల్లి కోసం చూశాడు. ‘ఎక్కడుందో చూడు’ అని చెప్పే తల్లి.. ‘ఎందుకురా చేమంతి?’ అంది ఆరోజు! అదేం గ్రహించలేదు చేమంతి అన్నయ్య. ‘ఎక్కడికెళ్లింది చేమంతి?’ అని అడిగాడు. ‘ఎక్కడికీ వెళ్లలేదు. ఇకనుంచి చెల్లితో ఆటలు తగ్గించు. ఏడిపించడం కూడా..’ అంది తల్లి. తను కూడా కొన్ని తగ్గించింది. మొదట కూతుర్ని ముద్దు చెయ్యడం తగ్గించింది. ఆడపిల్ల ఎదిగాక అకస్మాత్తుగా ఆ ఇంట్లో పాత్రలు మారిపోయాయి. తండ్రి ఆమెకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యాడు. అన్న ఆమెకు ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండో. తల్లి ఆమెకు ఆంతరంగిక సలహాదారు. ముగ్గురూ ఆమెకు కొంచెం దూరం కూడా అయ్యారు. రక్షణ వలయం కాస్త ఎడంగానే కదా ఉంటుంది. అమ్మ, నాన్న, అన్నయ్యలా అమ్మాయికి ఒక స్నేహితుడు కూడా ఉంటే అతడు ఆమెకు జడ్ ప్లస్ కేటగిరీ అయ్యేవాడు. చేమంతి ఎందుకైనా మౌనంగా ఉంటే.. ‘ఏమైంది తల్లీ.. ఒంట్లో బాగోలేదా?’ అని తల్లి ఒళ్లోకి లాక్కుంటుంది. ‘పిల్లేంటి డల్‌గా ఉంది’ అని చేమంతి తండ్రి చేమంతి తల్లిని అడుగుతాడు. ‘చేమంతీ.. ఎందుకలా ఉన్నావ్!’ అని అన్నయ్య అడుగుతాడు. ‘ఏమైంది చేమంతీ! నేనేమైనా అన్నానా?’ అని చేమంతి స్నేహితుడు వెనక్కి ఆలోచిస్తాడు. చేమంతి కళ్లలో ఎందుకైనా నీళ్లు తిరుగుతుంటే ‘బయట ఎవరైనా ఏడిపిస్తున్నారా అమ్మా?’ అని తల్లి లోపలికి తీసుకెళ్లి అడుగుతుంది. ‘నేనున్నాను కదరా.. నాకు చెప్పు..’ అని తండ్రి కూతురి తల నిమురుతాడు. ‘చేమంతీ.. ఇలా రా.. కాలేజ్‌లో ఏమైనా జరిగిందా?’ అని అమ్మానాన్న లేకుండా చూసి అన్నయ్య అడుగుతాడు. ‘ఎవడాడు చేమంతీ.. పద’ అని హాకీ స్టిక్ చేతికిచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు చామంతి స్నేహితుడు. (చదవండి: గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) పన్నెండేళ్ల వయసుకొచ్చాక ఆడపిల్ల ఒంటికి ప్రొటెక్షన్ వస్తుంది. ఆమె ఆలోచనలకు ప్రైవసీ పోతుంది. ఎవడాడో చెప్పాలి. కాలేజ్‌లో ఏమైందో చెప్పాలి. మౌనంగా ఎందుకుందో చెప్పాలి. కన్నీళ్లు ఎందుకొస్తున్నాయో చెప్పాలి. చెప్పాలని ఉండి కూడా.. అమ్మకీ, నాన్నకీ, అన్నకీ, ఆఖరికి స్నేహితుడికీ చెప్పలేకపోతుంటే? తనే ధైర్యంగా ఉండాలి. తనే ధీమాగా, తనకు తనే హామీగా, తనే భద్రంగా, తనకు తనే రక్షణగా ఉండాలి. అలా ఉండాలంటే ఒక అక్క ఉండాలి. పన్నెండేళ్లు రాగానే ఇంట్లో వాళ్లంతా ఇంటి ఆడపిల్ల కోసం కత్తీ డాలూ పట్టుకుని రెడీ అయిపోతారు. పన్నెండేళ్లు వచ్చాక కాదు, పన్నెండేళ్లు వచ్చేలోపు ఆ కత్తీ డాలు పట్టుకోవడం తనకే తెలిసుండాలంటే ఇంట్లో అక్క ఉండాలి. అమ్మ ఇవ్వలేని అనువు, నాన్న ఇవ్వలేని చనువు, అన్న ఇవ్వలేని సుళువు, స్నేహితుడు ఇవ్వలేని నెలవు అక్క ఇస్తుంది. బయట జరిగింది ఇంట్లో చెప్పుకోడానికే కాదు, ఇంట్లో జరిగింది బయటికి చెప్పుకోడానికీ అక్క ఉండాలి. చెల్లెలికి అక్కను మించిన ఆప్తురాలు, ఆత్మీయ నేస్తం ఎవరూ ఉండరని 38 దేశాల్లో లక్షా 20 వేలమంది పిల్లల్ని స్టడీ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా వెల్లడించింది. అక్క గుండె చెల్లెలి కోసం కూడా కొట్టుకుంటుందట. అపరిచితురాలైనా.. ఆపదలో ‘అక్కా..’ అని పిలిస్తే అక్క కాకుండా పోతుందా?! - మాధవ్ శింగరాజు -
రజనీ కాషాయమైతే పొత్తు నో
కేంబ్రిడ్జ్ (మసాచుసెట్స్): సూపర్‌స్టార్ రజనీకాంత్ కాషాయ(బీజేపీ) రాజకీయాలు చేస్తే ఆయనతో ఎటువంటి రాజకీయ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. తాము రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల రజనీకాంత్, కమల్‌హాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన యాన్యువల్ ఇండియన్ కాన్ఫరెన్స్‌లో కమల్‌హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తమ ఆలోచనలు, మేనిఫెస్టోలో ఏకాభిప్రాయం ఉంటే రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే తమ మధ్య ప్రస్తుతం ఉన్న వ్యత్యాసం మతం.. కాషాయం మాత్రమే అని చెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా చేయి కలిపేందుకు సిద్ధమని చెప్పారు. ఎన్నికల ముందు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు లేదని సమాధానం చెప్పారు. ఎవరికీ మెజారిటీ రాకుండా ప్రజలు తీర్పు ఇస్తే.. తాను ప్రతిపక్షంలోనే కూర్చుంటానని, తర్వాత ఎన్నికల కోసం సిద్ధమవుతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు కమల్ వెల్లడించారు. కాగా, ఈ నెల 21న కమల్ హాసన్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. -
అమ్మా.. నే చెప్పానా..!
వాషింగ్టన్: ఫేస్బుక్ అధినేత మార్క్ జకర్బర్గ్ (33) హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద సామాజిక నెట్ వర్క్‌కి అధిపతిగా ఉన్న జుకర్ 13 సం.రాల తరువాత చివరకు తన పట్టాను అందుకున్నారు. హార్వర్డ్‌లో చదువుకుని డ్రాప్ అవుట్‌గా బయటకు వెళ్లిన జుకర్‌బర్గ్ తిరిగి ఇదే యూనివర్సిటీ నుంచి గురువారం గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో యూనివర్శిటీని వీడి. తనఅద్భుతమైన ప్రతిభతో బిలియనీర్‌గా అవతరించిన 2017లో యూనివర్శిటీ స్నాతకోత్సవంగా ప్రసగించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడిన జుకర్‌బర్గ్ కొత్త సవాళ్లను స్వీకరించి గొప్ప గొప్ప పనులు చేయాల్సి సమయం వచ్చిందన్నారు. కేవలం పురోగతి కోసమే కాదు మంచి ప్రయోజనాలకోసం మంచి కార్యక్రమాలు చేపడదాం. ఇక మన జేనరేషన్ వంతు వచ్చిందంటూ అనేక సూచనలు చేశారు. ఆటోమేషన్ (యంత్రీకరణ) ఉద్యోగాలను తగ్గిస్తుందని ఫేస్బుక్ అధినేత పేర్కొన్నారుర. యంత్రీకరణ వల్ల లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, భవిష్యత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లమూలంగా ఉద్యోగ కొరత ఏర్పడుతుందని కొత్త ఉద్యోగాన్వేషణ చేయాలని యువతకు సూచించారు. ఫేస్‌బుక్‌తో పాటు అనేక సంస్థలు అభివృద్ధి చేసిన టెక్నాలజీల తో భారీ ఉపయోగాలతో పాటు అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రపంచానికిఅవసరమైన టెక్నాలజీని వృద్ది చేయాలని జుకర్‌బర్గ్ చెప్పారు. మరోవైపు ‘‘అమ్మా.. తిరిగి వచ్చి నా డిగ్రీని అందుకుంటానని ఎపుడూ చెబుతూ ఉండేవాడిని" అంటూ తన ఫేస్బుక్ పేజీలో తల్లిదండ్రులతో ఉన్న ఫోటోను ఒకదాన్ని షేర్ చేశారు.