ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా విజయం సాధిస్తున్నారు. ఒకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా..! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే మాన్వి లోహియా. పేస్ట్రీ చెఫ్‌గా మొదలైన ప్రస్థానం న్యూట్రిషినిస్ట్, వెల్‌నెస్ నిపుణురాలిగా ఉన్నత స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది. ఎవరీమె? ఆమె జర్నీ ఎలా మొదలయ్యిందంటే..
29 ఏళ్ల మాన్వి లోహియా తొలుత పేస్ట్రీ, బేకింగ్ వంటి పాక శాస్తంలో నైపుణ్యం సంపాదించి డిస్నీలో ఫడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్‌మెంట్‌తో కెరీర్‌ని ప్రారంభించింది. సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా దూసుకుపోతూ ఓ పక్క తనకు ఇష్టమైన వెల్‌నెస్‌పై దృష్టిసారించింది. అలా హర్వర్‌లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎపిడెమియాలజీ బయోస్టాటిస్టిక్స్‌లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటిన్నర ఏడాది గాయం, గుండె మూత్రపిండాలు, జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లలో పనిచేసింది. కొన్నేళ్లు ఈ విభాగాల్లో పరిశోధనలు చేసింది.
ఆ తర్వాత తన మాతృభూమి భారత్‌కు వచ్చి తన దేశ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అలా ఆమె హరిద్వార్‌లో 'ఏకాంత' అనే వెల్‌నెస్ సెంటర్‌ని ప్రారంభించింది. మాన్వియా ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న రిజిస్టర్డ్ డైటిషియన్. పైగా దాదాపు 500 మందికి పైగా రోగులకు సేవలందించిన అనుభవం గలది. అంతేగాదు ఆమె ఆఫ్రికాలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సర్టిఫైడ్ హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంతోనే మాన్వియా ఏకాంత వెల్‌నెస్ సెంటర్‌ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలకు విశ్వసనీయమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తోంది.
తమ ఏకాంత వెల్‌నస్ సెంటర్‌లో ప్రజలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలన్నింటిని పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు మాన్వి. "ప్రజలు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి సంప్రదాయ వైద్య చికిత్సలు మంచి ప్రభావాన్ని అందించ లేకపోతున్నాయి. ఈ దైనందిన బిజీ జీవితంలో మంచి ఆరోగ్యం కోసం ప్రశాంతత నుంచే స్వస్థత పొందే యత్నం చేయాలి. అది ఇలాంటి వెల్‌నెస్ సెంటర్‌తోనే సాధ్యం. అంతేగాదు ప్రశాంతత అనేది పచ్చదనంతో కూడిన అభయారణ్యంతోనే సాధ్యమని భావించి ఆ విధంగానే తన వెల్‌నెస్ సెంటర్‌ని తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు.
ఇక్కడకు విదేశీయులు సైతం వచ్చి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు మాన్వియా. చెప్పాలంటే ఇక్కడ మాన్వియా తన అభిరుచులకు అనుగుణంగా తన కెరీర్‌ని తీసుకువెళ్లింది. పాకశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ రెండు విభిన్న రంగాలు. కానీ ఆమె ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్‌మెంట్స్ తోపాటు వెల్‌నెస్ సెంటర్ రన్ చేయడమే గాక ఆరోగ్య నిపుణురాలిగా, న్యూటిషినిస్ట్‌గా ఉన్నారు. పట్టుదట, సంకల్పం ఉంటే ఏకకాలంలో విభిన్న రంగాల్లో విజయం సాధించగలమని నిరూపించారు మాన్వి.
(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..)
Comments
Please login to add a commentAdd a comment