wellness center
-
బెంగళూరులో కింగ్ చార్లెస్–3
బెంగళూరు: బ్రిటన్ రాజు చార్లెస్–3 సతీసమేతంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో రహస్యంగా పర్యటించారు. రాజదంపతులు సమోవా దేశంలో కామన్వెల్త్ సమావేశంలో పాల్గొన్న తర్వాత యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్తూ మధ్యలో బెంగళూరులో ఆగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. వారిద్దరూ నగరంలోని ప్రముఖ వెల్నెస్ కేంద్రంలో చికిత్స పొందినట్లు తెలిసింది. వైట్‌ఫీల్డ్ సమీపంలోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్లో రాజు చార్లెస్–3, రాణి కెమిల్లా మూడు రోజులపాటు బస చేశారు. యోగా, ధ్యానంతోపాటు ఇతర థెరపీలకు ఈ హెల్త్ సెంటర్ పేరుగాంచింది. శరీరం, మనసు అలసిపోయినప్పుడు పునరుత్తేజం పొందడానికి ఇక్కడ నిపుణులు ప్రకృతిసిద్ధమైన చికిత్స అందిస్తుంటారు. డాక్టర్ ఐజాక్ మథాయ్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ సెంటర్‌కు చార్లెస్–3 రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఆయన ఇక్కడే 71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ‘మనసుకు స్వాంతన లభించే యోగా క్రియల్లో బ్రిటన్ రాజ దంపతులు పాల్గొన్నారు. కోడిగుడ్లతోపాటు కేవలం శాకాహారం తీసుకున్నారు. ధ్యానం చేశారు. చార్లెస్–3 ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతితో కూడిన వెల్‌నెట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు’’ అని సౌఖ్య హెల్త్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. రాజదంపతులకు ప్రత్యేక మర్యాదలేవీ చేయలేదని, ఇతర అతిథుల తరహాలోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. హెల్త్ సెంటర్లో మూడు రోజులపాటు ఉన్న చార్లెస్–3 దంపతులు ఇక్కడ సాగవుతున్న ఆర్గానిక్ పంటలను పరిశీలించారు. ఔషధాల గార్డెన్‌ను సందర్శించారు. గోవుల మధ్య కలియతిరిగారు. ప్రకృతికి దగ్గరగా జీవించారు. పర్యావరణ హిత పద్ధతులు పాటించారు. రాజదంపతులు బుధవారం ఉదయమే హెల్త్‌సెంటర్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. -
పేస్ట్రీ చెఫ్ నుంచి వెల్నెస్ గురుగా..!
ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా విజయం సాధిస్తున్నారు. ఒకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా..! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే మాన్వి లోహియా. పేస్ట్రీ చెఫ్‌గా మొదలైన ప్రస్థానం న్యూట్రిషినిస్ట్, వెల్నెస్ నిపుణురాలిగా ఉన్నత స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది. ఎవరీమె? ఆమె జర్నీ ఎలా మొదలయ్యిందంటే..29 ఏళ్ల మాన్వి లోహియా తొలుత పేస్ట్రీ, బేకింగ్ వంటి పాక శాస్తంలో నైపుణ్యం సంపాదించి డిస్నీలో ఫడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్తో కెరీర్‌ని ప్రారంభించింది. సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా దూసుకుపోతూ ఓ పక్క తనకు ఇష్టమైన వెల్నెస్పై దృష్టిసారించింది. అలా హర్వర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎపిడెమియాలజీ బయోస్టాటిస్టిక్స్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటిన్నర ఏడాది గాయం, గుండె మూత్రపిండాలు, జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లలో పనిచేసింది. కొన్నేళ్లు ఈ విభాగాల్లో పరిశోధనలు చేసింది. ఆ తర్వాత తన మాతృభూమి భారత్‌కు వచ్చి తన దేశ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అలా ఆమె హరిద్వార్‌లో 'ఏకాంత' అనే వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించింది. మాన్వియా ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న రిజిస్టర్డ్ డైటిషియన్. పైగా దాదాపు 500 మందికి పైగా రోగులకు సేవలందించిన అనుభవం గలది. అంతేగాదు ఆమె ఆఫ్రికాలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సర్టిఫైడ్ హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంతోనే మాన్వియా ఏకాంత వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలకు విశ్వసనీయమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తోంది.తమ ఏకాంత వెల్నస్ సెంటర్లో ప్రజలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలన్నింటిని పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు మాన్వి. "ప్రజలు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి సంప్రదాయ వైద్య చికిత్సలు మంచి ప్రభావాన్ని అందించ లేకపోతున్నాయి. ఈ దైనందిన బిజీ జీవితంలో మంచి ఆరోగ్యం కోసం ప్రశాంతత నుంచే స్వస్థత పొందే యత్నం చేయాలి. అది ఇలాంటి వెల్నెస్ సెంటర్‌తోనే సాధ్యం. అంతేగాదు ప్రశాంతత అనేది పచ్చదనంతో కూడిన అభయారణ్యంతోనే సాధ్యమని భావించి ఆ విధంగానే తన వెల్నెస్ సెంటర్‌ని తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడకు విదేశీయులు సైతం వచ్చి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు మాన్వియా. చెప్పాలంటే ఇక్కడ మాన్వియా తన అభిరుచులకు అనుగుణంగా తన కెరీర్‌ని తీసుకువెళ్లింది. పాకశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ రెండు విభిన్న రంగాలు. కానీ ఆమె ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్స్ తోపాటు వెల్నెస్ సెంటర్ రన్ చేయడమే గాక ఆరోగ్య నిపుణురాలిగా, న్యూటిషినిస్ట్గా ఉన్నారు. పట్టుదట, సంకల్పం ఉంటే ఏకకాలంలో విభిన్న రంగాల్లో విజయం సాధించగలమని నిరూపించారు మాన్వి.(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..) -
సెలెవిదా వెల్నెస్ పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా సెలెవిదా వెల్నెస్ డైరెక్ట్ టు కంజ్యూమర్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఈ పోర్టల్ ద్వారా మధుమేహ రోగుల కోసం పలు ఉత్పత్తుల అమ్మకంతోపాటు ఆహార సిఫార్సులు, సమాచారం అందిస్తారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2019 నుంచి సెలెవిదా బ్రాండ్‌లో న్యూట్రాస్యూటికల్స్ తయారీ చేపడుతోంది. దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు పిన్‌కోడ్స్‌కు వీటిని సరఫరా చేస్తోంది. -
Haut Monde Mrs India Worldwide: ప్రతిభా షా
ఉద్యోగం చేసి అలసిపోయి..అబ్బా చాలా కష్టపడ్డాం... అనుకునే వాళ్లు కొందరైతే...ఈ ఉద్యోగం ఇంకెన్నాళ్లు చేస్తాం? ఇక చాలు విసుగొస్తుంది. ఇంకేదైనా కొత్తగా నేర్చుకుందాం! అని సరికొత్త ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకుపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన వ్యక్తే అమిషా సేథీ. రచయితగా... వెల్నెస్ కోచ్‌గా... గ్లోబల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా విజయవంతంగా రాణిస్తూనే.. తాజాగా ప్రతిష్టాత్మక ‘హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్– 2021’ పదో సీజన్ విన్నర్‌గా నిలిచి, కిరీటాన్ని కైవసం చేసుకుంది. అమిషా రాజ్‌కోట్‌లో పుట్టినప్పటికీ పెరిగిందంతా ఢిల్లీలోనే. బాల్యంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్‌షోలు చూడడం. థ్రిల్లర్, రొమాంటిక్ నవలలు చదువుతూ... సినిమాలు చూస్తూనే చదువులో మంచి గ్రేడ్లు తెచ్చుకునేది. తను చూసిన డ్యాన్స్షోల ప్రభావంతో చిన్ననాటి నుంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని కలలను కనేది. కానీ వివిధ కారణాలతో కొరియోగ్రఫీ చేయలేకపోయింది. దీంతో ఇంటర్మీడియట్ అయ్యాక నోయిడాలోని బిజినెస్ స్కూల్లో ఎమ్బీఏ చదివింది. తరవాత చికాగోలోని‘ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’లో ఎగ్జిక్యూటివ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ చేసింది. బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా.. అమిషా చదువు పూర్తయిన వెంటనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసాక, బ్లాక్‌బెర్రీ కంపెనీకి మారింది. ఈ రెండు కంపెనీలలో వివిధ హోదాల్లో పనిచేసింది. బ్లాక్‌బెర్రీలో బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా, ఎయిర్ ఏసియాలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా, జఫీన్లో గ్లోబల్ సీఎమ్వోగా అత్యుతమ సేవలందించింది. అనేక బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా అమిషా అందించిన సేవలకుగాను.. వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ ఇచ్చే ‘యంగ్ ఉమెన్ రైజింగ్ స్టార్’, ద ఏసియా పసిఫిక్ యంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు, సీఎన్‌బీసీ యూత్ అచీవర్స్ అవార్డు, మార్కెటింగ్ ఎక్స్‌లెన్స్ లాంటి ఎన్నో అవార్డులు వరించాయి. రచయిత నుంచి మోటివేషనల్ స్పీకర్ వరకు... కన్సల్టెంట్‌గా విజయవంతంగా దూసుకుపోతూ, అనేక ఉన్నతస్థాయి పదవుల్లో తనని తాను నిరూపించుకున్న అమిషాకు గ్రంథాలు, శిల్పాల మీదకు ఆసక్తి మళ్లింది. దీంతో వివిధ గ్రంథాలను చదువుతూ అనేక విషయాలు తెలుసుకునేది. గ్రంథాలను చదివేటప్పుడు తనకు వచ్చిన ఆలోచనలను కాగితం మీద పెట్టేది. అలాగే వివిధ భాషల్లో తను చదివిన గ్రంథాలను అందరూ చదివేందుకు వీలుగా అనువాదాలు చేసింది. ఇలా అమిషా రాసి పుస్తకం ‘ఇట్ డజంట్ హర్ట్ టు బి నైస్’ బెస్ట్‌సెల్లర్ బుక్‌గా నిలిచింది. పుస్తకాల ప్రమోషన్లో భాగంగా అమిషా మాటతీరు ఆసక్తికరంగా ఉండడంతో, ‘‘అంతా ఇంకా మాట్లాడండి’’ అంటూ ప్రోత్సహించడంతో అమిషా మోటివేషనల్ స్పీకర్‌గా మారింది. ప్రతి సెషన్‌కు ఏం మాట్లాడాలి? ఆరోజు ఏం సందేశం ఇవ్వాలి... అని బాగా సన్నద్ధమయ్యేది. ఏన్షియంట్ టైమ్‌లెస్ టెక్నిక్స్, మెడిటేషన్, ఫన్ గేమ్స్, న్యూరోసైన్స్, సైకలాజికల్ టెస్టులను వివిధ వర్క్‌షాప్స్‌లో అందిస్తూ తన కంటెంట్‌ను మెరుగుపరుచుకుంది. ఇవేగాక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఆసుపత్రులు, సపోర్ట్ సెంటర్లలో తరచూ హ్యాపీనెస్ సెషన్లను నిర్వహిస్తుండేది. వెల్నెస్కోచ్.. ఫిట్‌నెస్‌కు బాగా ప్రాముఖ్యతనిచ్చే అమిషా ‘ఏజ్ రివర్సల్ థెరపీస్’, యోగా, మెడిటేషన్, ఆధునిక వ్యాయామాలపై ఆసక్తితో వాటి గురించి లోతుగా తెలుసుకుని తను ఆచరించడంతోపాటు.. ఫిట్‌గా ఎలా ఉండాలో తోటి వాళ్లకు నేర్పించేంత ప్రావీణ్యాన్ని సంపాదించింది. తన ఫిటెనెస్, ఆకర్షించే రూపం, తెలివితేటలతో బెంగళూరు తరపున పాల్గొని ప్రతిష్టాత్మక హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్–2021 సీజన్–10 విజేతగా నిలిచింది. యూఏఈలో జరిగిన ఈ పోటీలో 21 దేశాల నుంచి అతివలు పాల్గొనగా, అందులో 96 మంది ఫైనలిస్టులలో గ్లామర్, గుడ్‌లుక్స్, తెలివితేటల ప్రతిభ ఆధారంగా అమిషా సేథీ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ‘‘జీవితంలో విజయం, ఓటమి రెండూ లేవు. జీవితమంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే. ఈ సూత్రం నమ్మే నేను ఈ స్థాయికి ఎదిగాను.’’ అంటూ అమిషా నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
‘వెల్నెస్’ కూడబెట్టింది..రూ.500 కోట్లకు పైనే
సాక్షి, న్యూఢిల్లీ: ‘వెల్ నెస్’కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న ఓ ఆశ్రమంపై గడిచిన మూడు రోజులుగా జరిగిన ఐటీ దాడుల్లో దాదాపు రూ. 500 కోట్లకు పైగా వెల్లడించని ఆస్తులు వెలుగు చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఏకత్వం’అనే తత్వంతో ఓ ఆధ్యాత్మిక గురువు 1980లో స్థాపించిన ఒక ట్రస్టు ‘వెల్నెస్’కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాల్లో శిక్షణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందనీ..ఈ సంస్థపై దాడులు, దర్యాప్తు కొనసాగుతోందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఎక్కడా ఆశ్రమం ఎవరిదనే అంశాన్ని ప్రస్తావించలేదు.కల్కి భగవాన్ ఆశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని రెండు రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ సంస్థ పేరు ఈ ప్రకటనలో ప్రస్తావించలేదు. ఓ ఆధ్యాత్మిక గురువు అంటూ ప్రకటన మొదలైంది. ‘1980 లలో ‘ఏకత్వం‘అనే తత్వంతో ఓ ఆధ్యాత్మిక గురువు స్థాపించిన ఈ గ్రూపు క్రమంగా దేశ, విదేశాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణం, క్రీడలు మొదలైన అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూపును ఆ ఆధ్యాత్మిక గురువు, అతని కుమారుడు నిర్వహిస్తున్నారు. విదేశీయులు ఈ కోర్సుల్లో చేరడం ద్వారా ఈ గ్రూపు విదేశీ మారక ద్రవ్యాన్నీ సంపాదించింది. ఈ సొమ్మును ఏపీ, తమిళనాడుతో పాటు విదేశాల్లోనూ పెట్టుబడులుగా పెట్టింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వరదయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 40 చోట్ల దాడులు జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆస్తుల అమ్మకాల ద్వారా కాగితాలపై ఉన్న విలువ కంటే అదనంగా సొమ్మును నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు లభించాయి. 2014–15 నుంచి లెక్క చూపని ఇలాంటి నగదు రూ. 409 కోట్లుగా ఉన్నట్టు ఐటీ విభాగం అంచనా వేసింది. ఇక లెక్క చూపని నగదు, ఇతర విలువైన వస్తువులు ఈ గ్రూపు వ్యవస్థాపకుడు, అతని కుమారుడి ఇళ్లల్లో, ప్రాంగణాల్లో లభించాయి. రూ. 43.9 కోట్ల మేర నగదును ఐటీ విభాగం స్వాధీనంచేసుకుంది. ఇవి కాకుండా విదేశీ నగదును సీజ్ చేసింది. దీని విలువ రూ. 18 కోట్లు. అలాగే రూ. 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారాన్నీ సీజ్ చేసింది. రూ. 5 కోట్ల విలువ గల 1,271 కేరట్ల వజ్రాలనూ సీజ్ చేసింది. వీటికీ లెక్కలు లేవు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ రూ. 93 కోట్లు. లెక్కా పత్రం లేని, వెల్లడించని ఆస్తుల విలువ దాదాపు రూ. 500 కోట్లకు పైబడి ఉంటుంది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి..’అని పేర్కొంది. విదేశాలకు మళ్లింపు.. తనిఖీల్లో వెల్లడైన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రూపు దేశ, విదేశాల్లో..ప్రధానంగా పన్ను పోటు లేని దేశాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. చైనా, యుఎస్ఎ, సింగపూర్, యుఎఇ, తదితర దేశాల్లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీలు.. భారతదేశంలో అందించే వివిధ ‘వెల్ నెస్’కోర్సులకు హాజరయ్యే విదేశీ ఖాతాదారుల నుంచి ఫీజులు అందుకున్నట్టు ఐటీ విభాగం తనిఖీల్లో వెలుగుచూసింది. -
నొప్పి మటాష్
జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగరవాసులు వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. వీటిని పెద్ద సమస్యలుగా భావించి చాలామంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ తక్కువ ఖర్చులోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకుఉపశమనం కల్పిస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్‌ఆయూష్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌వెల్‌నెస్ సెంటర్. సాక్షి, సిటీబ్యూరో: తలనొప్పి, కండరాల, మోకీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, విటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది చాలా పెద్ద జబ్బులుగా భావిస్తుంటారు. చిన్నచిన్న చిట్కాలు, సహజ పద్ధతులతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు కానీ చాలా మంది ఈ చికిత్సల కోసం కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. రకరకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, మందుల పేరుతో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వచ్చిన నొప్పి కన్నా వైద్య చికిత్సల పేరుతో చేసిన ఖర్చు గుర్తొచ్చి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సాధారణ నొప్పులతో పాటు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయూష్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్స్ పేరుతో యో గ, ఆయుర్వేద, ప్రకృతి వైద్య సేవలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్(జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు) లబ్ధిదారుల కోసం ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో ఈ సేవలను అందిస్తున్న ఆయుష్ విభాగం తాజాగా నిమ్స్‌కు వచ్చే వీఐ పీలు సహా సాధారణ రోగులకు ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ సేవలను అందిస్తుంది. ఒక్కో చికిత్సకు..ఒక్కో ప్యాకేజీ పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్, వంటి సేవలతో పాటు పకృతి వైద్య సేవలల్లో భాగంగా జనరల్ మసాజ్, స్ట్రీమ్‌బాత్, డైట్‌కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకీళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది.ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా (రూ.150 నుంచి రూ.750 వర కు)చార్జీలు వసూలు చేస్తుంది. అయితే బాధితులు ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకస్లాట్‌గా, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మరో స్లాట్‌గా నిర్ణయించారు. దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉండాలనే.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం నగరంలో చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. విటమిన్లలోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే, పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనారోగ్యం పాలవుతున్నారు. నొప్పులకు, జబ్బులకు ముందే కారణం గుర్తించగలిగితే చాలా తక్కువ ఖర్చుతో చిన్నపాటి చిట్కాలతోనే వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. జబ్బు ముదురిన తర్వాత వచ్చే కంటే ముందే ఈ చికిత్సలను చేయించుకోవడం వల్ల నొప్పుల భారీ నుంచే కాదు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా చూసేందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆయుర్వేద, ప్రకృతి వైద్య సేవలు, స్లాట్ బుకింగ్ కోసం 040–23489023, 9652292825, 9440974984 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. – ఎం.డాక్టర్ నాగలక్ష్మి, ఇంచార్జి, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్సెంటర్, నిమ్స్ -
వెల్‘లెస్’ సెంటర్
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో సేవలు కొరవడుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డు ద్వారా వైద్య సేవలు పొందేం దుకు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట ‘వెల్నెస్’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తుంది. అయినా నేటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో పాటు పరికరాలు కూడా లేకపోవడంతో వైద్య సేవలు నామమాత్రంగానే అందుతున్నాయి. చిన్ని చిన్న జబ్బులకు వైద్యం చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో వెల్నెస్ కేంద్రాలు ఏడాది క్రితమే ఏర్పడి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాయి. కాని ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. అధికారులు అలసత్వం వహించడంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పోస్టుల భర్తీ ఎప్పుడో.! ఎంప్లాయీ, పెన్షనర్స్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (వెల్నెస్) సెంటర్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా హెల్త్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కాని జిల్లాలో మాత్రం అవి పనికిరాకుండానే పోతున్నాయని కొంతమంది ఉద్యోగులు పేర్కొంటున్నారు. బీపీ, షుగర్, జ్వరం, తదితర చిన్న చిన్న జబ్బులకు మందులు ఇవ్వడం తప్పా నాణ్యమైన వైద్య సేవలు లభించడంలేదు. ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు ఉండాల్సిన చోట కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు బీడీఎస్ వైద్యులకు గానూ ఒకరు, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు పనిచేస్తున్నారు. ముగ్గురు ఫార్మాసిస్టులు విధులు చేపడుతున్నారు. ఒక అల్ట్రాసౌండ్ టెక్నీషియన్, ముగ్గురు స్టాఫ్ నర్సులకు గానూ ఇద్దరే పనిచేస్తున్నారు. నలుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండాల్సి ఉంది. కాని ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. వారికి పరీక్ష నిర్వహించినప్పటికీ నియమాకాల్లో అంతులేని జాప్యం జరుగుతుంది. జాడలేని పరికరాలు.. వెల్నెస్ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి వైద్య పరికరాలకు కూడా నోచుకోకుండా పోయింది. నియమించిన కొద్దిమంది సిబ్బంది పరికరాలు లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఈ కేంద్రం ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, సెలవు దినాల్లో, ఆదివారం 9 నుంచి ఒంటిగంట వరకు పనిచేయాల్సి ఉంది. ఓపీ సేవలు మాత్రమే అందిస్తారు. అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ ఉన్నప్పటికి స్కానింగ్ మిషన్ లేదు. ఫిజియోథెరఫిస్టులు ఉన్నప్పటికీ పరికరాలు లేకుండా పోయాయి. డెంటల్కు సంబంధించి వైద్యులు ఉన్నప్పటికీ కుర్చీలు తప్పా మరే పరికరం లేదు. ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించినప్పటికీ పరికరాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసి తీసుకొస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కేవలం 50శాతం వరకు మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, జర్నలిస్టులకు ఏ స్థాయిలో వైద్యం అందుతుందో ఇట్టే అర్థమవుతోంది. స్పెషలిస్టులేరీ.. ప్రస్తుత కాలంలో వివిధ జబ్బులతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు సతమతమవుతున్నారు. సంబంధిత జబ్బులకు వైద్య సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ పరికరాలు, సిబ్బంది కొరత కారణంగా వైద్యం అందని ద్రాక్షగానే మారింది. ఒక్క ఎంబీబీఎస్ వైద్యుడిని మాత్రమే నియమించారు. గైనకాలజిస్టులు, ఫిజీషియన్, అర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఆప్తాలమిస్ట్, పిల్ల ల వైద్య నిపుణులు, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, తదితర పోస్టులను భర్తీ చేస్తే తప్పా ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరేలా కనిపించడం లేదని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వైద్యం కోసం ఒకసారి ఆ కేంద్రానికి వెళ్లిన వారు మరోసారి వెళ్లేందుకు జంకుతున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి వెల్నెస్ కేంద్రంలో వైద్య పరికరాలతో పాటు సరిపడా సిబ్బందిని నియమించాలని ఉద్యోగులు, జర్నలిస్టులు కోరుతున్నారు. -
వెల్నెస్ సెంటర్ సిద్ధం
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూర్చేలా..ఎంప్లాయిస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా ఖమ్మంలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్‌ను సిద్ధం చేశారు. దీనిని..సోమవారం ఉదయం 11గంటలకు కలెక్టర్ కర్ణన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు పలు జిల్లాల్లో 11 ప్రారంభించగా తాజాగా ఖమ్మంలో 12వది సిద్ధమైంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సల కోసం ట్రామా కేర్ భవనాన్ని ఇందుకు కేటాయించారు. దీనిని నూతనంగా నిర్మించి..ఐదు నెలలు పూర్తయినా వినియోగంలోకి తీసుకురాలేదు. రూ. 7 కోట్ల వ్యయంతో కట్టిన ఈ భవనాన్ని ఇటీవల కలెక్టర్ సందర్శనలో పరిశీలించి..ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పుడు వెల్నెస్ సెంటర్ కోసం ఆ నూతన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను కేటాయించారు. ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉత్వర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాట్లు.. కలెక్టర్ కర్ణన్ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ జేహెచ్ఎస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి మూడు రోజులుగా తిష్ట వేసి..పనులు చేయించారు. ఆస్పత్రికి చెందిన అధికారులు, ఇంజనీరింగ్ వారితో మాట్లాడి ట్రామా కేర్ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను స్వాధీనం చేసుకుని..వెల్నెస్ సెంటర్‌కు కావాల్సిన పరికరాలు, సామగ్రిని హైదరాబాద్ నుంచి తెప్పించి..ఇక్కడ ఏర్పాటు చేయించారు. 24 మంది ఉద్యోగులతో సేవలు.. వెల్నెస్ సెంటర్లో 24 మంది ఉద్యోగుల ద్వారా వైద్యసేవలు అందించనున్నారు. అందుకోసం ఇటీవల వారి నియామకం చేపట్టారు. ఎంబీబీఎస్ డాక్టర్లు 4, బీడీఎస్లు 2, ఫిజియోథెరపిస్ట్‌లు 2, ఫార్మాసిస్ట్లు 3, జీఎన్ఎంలు 3, డెంటిస్ట్‌లు 4, డెంటిస్ట్ అసిస్టెంట్లు 2, వార్డుబాయ్‌లు 3, అబ్డామిన్ స్కానర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1 నియమించారు. వెల్నెస్ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ వైద్యసేవలు పొందాలనుకునేవారు ఎంప్లాయి, జర్నలిస్టు, పెన్షనర్, వారి కుంటుంబ సభ్యులు హెల్త్ కార్డును తీసుకొచ్చి వైద్యసేవలు పొందొచ్చు. ఓపీ మాత్రమే.. నూతనంగా ప్రారంభించనున్న వెల్నెస్ సెంటర్లో ఔట్ పేషంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రాథమిక వైద్యసేవలు నిర్వహించనున్నారు. రోగులకు వైద్య పరీక్ష చేశాక మందులు ఇస్తారు. త్వరలో స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందించనుండగా, అత్యవసర వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు పంపి స్తారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తం గా 250 ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఠీఠీఠీ.్ఛజిట.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో ఆ దవాఖానాల వివరాలు, అందుకు సంబంధిచిన పూర్తి సమాచారం ఉంటుంది. ఈహెచ్ఎస్ ద్వారా 1800 రకాల వైద్య సేవలు అందించనున్నారు. -
‘డల్’నెస్ సెంటర్లు!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెడికల్ రీయింబర్స్మెంట్ కంటే మెరుగైన వెల్నెస్ సెంటర్ల నిర్వహణకు మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉన్నతాధికారుల వైఖరితో వెల్నెస్ సెంటర్ల కార్యక్రమం క్రమంగా నిర్వీర్యమవుతోంది. ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్ఎస్)ను ఆరోగ్యశ్రీ ట్రస్టులో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈహెచ్ఎస్ సీఈవోగా ఉన్న కె.పద్మను సొంత శాఖకు బదిలీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా ఉన్న కె.మనోహర్‌కు ఈహెచ్ఎస్ నిర్వహణ బాధ్యతలను అదనంగా అప్పగించింది. దీంతో ఈహెచ్ఎస్కు ఉన్న ప్రత్యేకత తగ్గినట్లు అయ్యిందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. వెల్నెస్ సెంటర్ల నిర్వహణ అయోమయంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఈవోగా పద్మను తొలగించడం సరైంది కాదు..: జర్నలిస్టులు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సీఈవో బాధ్యతల నుంచి కె.పద్మను తప్పించటం సరైంది కాదని గురువారం పలువురు జర్నలిస్టులు మంత్రి కేటీఆర్‌ను శాసనసభ ప్రాంగణంలో కలసి విన్నవించారు. పథకం ప్రారంభం నుంచి పద్మ సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తించారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు సేవలు అందించటంలో పద్మ అంకితభావం మింగుడు పడక వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మంత్రికి ఫిర్యాదు చేశారు. పద్మకు తిరిగి ఈహెచ్ఎస్ సీఈవో బాధ్యతలు అప్పగించాలని కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతకుమారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రిని కలసిన వారిలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమౌళిచారి, ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శైలేష్‌రెడ్డి తదితరులున్నారు. -
వెల్నెస్ కేంద్రం సమయం కుదింపు
ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఔట్ పేషెంట్ (ఓపీ) వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన వెల్నెస్ కేంద్రం సమయాన్ని కుదించారు. ఇటీవలే ప్రారంభించిన ఈ కేంద్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా 12 గంటల పాటు వైద్య సేవలు అందించాల్సి ఉంది. మొదట్లో రెండు మూడు రోజులు 12 గంటలపాటు సేవలు అందించింది. కానీ ఆ తర్వాత సమయాన్ని కుదించారు. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పరిమితం చేశారు. ఇప్పుడు 8 గంటలే సేవలు అందిస్తోంది. రాత్రి 8 గంటల వరకు సమయం ఉండటం వల్ల విధులు ముగించు కొని ఇంటికి పోయే ఉద్యోగులు వెల్నెస్ కేంద్రానికి వెళ్లడానికి అవకాశం ఉండేదని... కానీ ఆఫీసు సమయంలోనే పనిచేస్తే వెల్నెస్ కేంద్రానికి వెళ్లడం కుదరదని అంటున్నారు. సిబ్బంది కొరత.. వైద్యులు అనాసక్తి వల్లే... ఓపీతో పాటు రిఫరల్ సేవలు అందించే కీలకమైన వెల్నెస్ కేంద్రం సమయాన్ని కుదించడం వల్ల ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, మరో 15 మంది పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరందరినీ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే ఆయుష్ కేంద్రం కూడా ఉంది. రోజుకు 300 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది సరిపోవడంలేదు. దీనికి తోడు తాజాగా పని గంటలు కూడా తగ్గించడంతో ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. కాగా... వైద్యులు, ఇతర సిబ్బంది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండటానికి ఒప్పుకోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకు న్నామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదనపు సిబ్బందిని నియ మించుకోవాలంటే ఆర్థిక సమస్యలు న్నాయని ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.