
ఇటీవల ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ తెగ నెట్టింట ఫిట్‌నెస్ మంత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. పాపం కొందరు ఫాలో అయ్యి వర్కౌట్ అవ్వాక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజగా ఓ ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన విభిన్నమైన వెల్‌నెస్ రోటీన్‌ని నెట్టింట షేర్ చేశాడు. అది చూసి నెటిజన్లు బాబోయ్ మరీ ఇంత మంచి అలవాట్లా..అని విస్తుపోతున్నారు. నో ఛాన్స్ అదంతా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరీ అంత విచ్రితంగా అనిపించినా.. అతడి వెల్‌నెస్ రొటీన్ ఏంటో చూద్దామా..!.
29 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్‌తన తీవ్రైమన ఆరోగ్య స్ప్రుహ కారణంగా నెట్టింట వైరల్‌గా మారాడు. అతడి ఫిట్‌నెస్ మంత్ర చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడి స్ట్రిట్ ఫిట్‌నెస్ రొటీన్ ఎలా ఉంటుందంటే..
అత్యంత క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అతడిది. హాల్ ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ఉదయం 3:52 ప్రారంభమైమార్నింగ్ 9.30 గంటలకు ముగుస్తుంది. హాల్ నిద్రపోయేటప్పుడు తన నోటికి మౌత్‌ట్యాప్ వేసుకుంటాడు. ఇది గురకను నివారస్తుందనేది అతడి నమ్మకం. ఆ తర్వాత 7.30 నుంచి 8.30 గంటల వరకు స్విమ్మింగ్ పూల్‌లో గడిని తదనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపళ్లు తీసుకుంటాడు.
ఆ తర్వాత అదే అరటిపండు తొక్కలను ముఖానికి రుద్దుకుంటాడు. ఆ తర్వాతమ బ్రాండెడ్ మినరల్ వాటర్, గిలకొట్టన పచ్చిగుడ్లు, అవకాడో టోస్ట్ వంటివి అతడి ఆహారాలు. ఈ వెరైటీ దినచర్యకు గానూ హాల్ నెట్టింట వైరల్‌గా మారాడు. ఇది సాధ్యమయ్యేది కాదనేది నెటిజన్ల వాదన. అంతేగాదు సోషల్ మీడియాలో బ్రో బిజీ లైప్ ఇవన్నీ కష్టం అని కామెంట్ చేస్తూ పోస్టుల పెడుతున్నారు
హాల్ అనుసరించే కొన్ని మంచి వెల్‌నెస్ ట్రెండ్‌లు..
మౌత్ ట్యాపింగ్
మౌత్ ట్యాపింగ్ అనేది రాత్రిపూట నోటిని మూసి ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక టేప్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రసిద్ధ వెల్‌నెస్ ట్రెండ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకునేలా చేస్తుంది. అలాగే పీల్చే గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా అలర్జీ కారకాలు, శిధిలాలు లేదా విషపదార్థాలు ఊపిరితిత్తులకు చేరక మునుపే ఫిల్టర్ అవుతాయి. అంతేగాదు తేలికపాటి స్లీప్ అప్నియా ఉంటే మౌత్ ట్యాపింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం..
చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి హర్మోన్ స్థాయిని తగ్గిస్తుందట. నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీరు రక్త నాళాలను ఇరుకుగా చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.
చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగుని అందించడంలో హెల్ప్ అవుతుందట. అంతేగాదు ఈ మంచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి మొటిమల రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. అదే సమయంలో వాపు వంటివి దరిచేరనీయదు అని చెబుతున్నారు నిపుణులు.
చర్మంపై అరటి తొక్క ప్రభావం
అరటిపండ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియంల శక్తివంతమైన వనరు. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. గీతలు లేకుండా చేస్తుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు చర్మ నిపుణులు
మార్నింగ్ వ్యాయామం
ఉదయం వ్యాయామం ప్రత్యేకమైన జీవక్రియ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసే సమయంలో శరీరం జీవక్రియ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఉదయం వ్యాయామాలు కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అంతేగాదు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కూడా. అలాగే బాడీని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మంచి నిద్రను, మెరుగైన ఏకాగ్రత అందిస్తుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: చిరాకుగా ఉన్నా..చిద్విలాసంగా ఉన్నా..చిరుతిండికే ఓటు..!)