Researcher
-
ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం!
మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, స్థూల పోషకాలు ఉండాలని చెబుతుంటారు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మన ఆహారంలో అత్యంత కీలకమైన పోషకాలను కోల్పోతున్నామట. ఇటీవల పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మన తీసుకునే ఆహారంలో అత్యంత కీలకమైన, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను కోల్పోతున్నామని పరిశోధకులు చెప్పారు. ఇంతకీ ఏంటా నాలుగు కీలక పోషకాలంటే..!హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాంటా బార్బరా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు కాల్షియం, ఐరన్, విటమిన్ సీ, ఈతో సహా శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను సరిపోని స్థాయిలో వినయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇలా మొత్తం 31 దేశాలలోని ప్రజల డేటాను సర్వే చేసి మరీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అందులో పురుషుల, స్త్రీల డేటాను వేరు చేసి మరి అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరిపై దాదాపు 15 విటమిన్లు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. అందులో నాలుగు కీలక పోషకాలను ఆహారం నుంచి చాల తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని తేలింది. ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ తగినంతగా తీసుకోవడం లేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక సగానికి పైగా ప్రజల్లో రిబోఫ్లావిన్, ఫోలేట్, విటమిన్ సీ, బీ6, నియాసిన్ తదితరాలను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ప్రపంచ జనాబాలో దాదాపు 22% మంది చాలా తక్కువ స్థాయిలో ఈ పోషకాలను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించేవని తెలిపారు. (చదవండి: పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!) -
పేస్ట్రీ చెఫ్ నుంచి వెల్నెస్ గురుగా..!
ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా విజయం సాధిస్తున్నారు. ఒకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా..! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే మాన్వి లోహియా. పేస్ట్రీ చెఫ్‌గా మొదలైన ప్రస్థానం న్యూట్రిషినిస్ట్, వెల్నెస్ నిపుణురాలిగా ఉన్నత స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది. ఎవరీమె? ఆమె జర్నీ ఎలా మొదలయ్యిందంటే..29 ఏళ్ల మాన్వి లోహియా తొలుత పేస్ట్రీ, బేకింగ్ వంటి పాక శాస్తంలో నైపుణ్యం సంపాదించి డిస్నీలో ఫడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్తో కెరీర్‌ని ప్రారంభించింది. సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా దూసుకుపోతూ ఓ పక్క తనకు ఇష్టమైన వెల్నెస్పై దృష్టిసారించింది. అలా హర్వర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎపిడెమియాలజీ బయోస్టాటిస్టిక్స్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటిన్నర ఏడాది గాయం, గుండె మూత్రపిండాలు, జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లలో పనిచేసింది. కొన్నేళ్లు ఈ విభాగాల్లో పరిశోధనలు చేసింది. ఆ తర్వాత తన మాతృభూమి భారత్‌కు వచ్చి తన దేశ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అలా ఆమె హరిద్వార్‌లో 'ఏకాంత' అనే వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించింది. మాన్వియా ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న రిజిస్టర్డ్ డైటిషియన్. పైగా దాదాపు 500 మందికి పైగా రోగులకు సేవలందించిన అనుభవం గలది. అంతేగాదు ఆమె ఆఫ్రికాలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సర్టిఫైడ్ హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంతోనే మాన్వియా ఏకాంత వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలకు విశ్వసనీయమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తోంది.తమ ఏకాంత వెల్నస్ సెంటర్లో ప్రజలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలన్నింటిని పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు మాన్వి. "ప్రజలు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి సంప్రదాయ వైద్య చికిత్సలు మంచి ప్రభావాన్ని అందించ లేకపోతున్నాయి. ఈ దైనందిన బిజీ జీవితంలో మంచి ఆరోగ్యం కోసం ప్రశాంతత నుంచే స్వస్థత పొందే యత్నం చేయాలి. అది ఇలాంటి వెల్నెస్ సెంటర్‌తోనే సాధ్యం. అంతేగాదు ప్రశాంతత అనేది పచ్చదనంతో కూడిన అభయారణ్యంతోనే సాధ్యమని భావించి ఆ విధంగానే తన వెల్నెస్ సెంటర్‌ని తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడకు విదేశీయులు సైతం వచ్చి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు మాన్వియా. చెప్పాలంటే ఇక్కడ మాన్వియా తన అభిరుచులకు అనుగుణంగా తన కెరీర్‌ని తీసుకువెళ్లింది. పాకశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ రెండు విభిన్న రంగాలు. కానీ ఆమె ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్స్ తోపాటు వెల్నెస్ సెంటర్ రన్ చేయడమే గాక ఆరోగ్య నిపుణురాలిగా, న్యూటిషినిస్ట్గా ఉన్నారు. పట్టుదట, సంకల్పం ఉంటే ఏకకాలంలో విభిన్న రంగాల్లో విజయం సాధించగలమని నిరూపించారు మాన్వి.(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..) -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు. చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు. ఇదీ చదవండి: ‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్ -
ఎలుక కష్టం ఎవరికి ఎరుక.. కొరికితేనే బతికేది!
సాక్షి, అమరావతి: ఎలుకలు సృష్టించే విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. కనిపించిన ప్రతీదీ కొరికేస్తూ.. బోలెడంత నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఈ విధ్వంసం వెనుక ఓ చిన్నపాటి విషాదమూ ఉంది. చిట్టెలుకల్లో ఉండే రెండు కొరుకుడు (ఇన్సైజర్స్) దంతాలు రోజూ 0.4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయట. దీని వల్ల ఈ కోరపళ్లను అవి ఎప్పటికప్పుడు అరగదీయాల్సిందే! లేదంటే అవి ఎలుకల దవడలను చీల్చుకుని బయటకు రావడంతో ఆహారం తినలేవట. దీంతో తిండిలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందట. అందుకే అవి బతకాలంటే నిరంతరం దేన్నైనా కొరుకుతూ ఉండాలి. అయితే.. దాని వల్ల జరుగుతున్న నష్టం మాత్రం అపారం. తినటానికి పనికిరాకున్నా బలమైన విద్యుత్ తీగలు, ప్లాస్టిక్ వస్తువులను సైతం కొరికేస్తాయి. చిట్టెలుకలు తీసుకునే ఆహారం రోజుకు 28 గ్రాములే.. కానీ అవి కలిగించే నష్టం మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఏటా 19 నుంచి 21 బిలియన్ డాలర్ల పంట నష్టం జరుగుతున్నట్లు లెక్కగట్టారు. ఎలుకలు తమ శరీర బరువులో దాదాపు 20 శాతం వరకు ఆహారంగా తీసుకుంటాయని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ గ్రాంట్ సింగిల్టన్ తెలిపారు. ఒకేసారి కాకుండా రోజుకు 3–4 సార్లు తింటాయి. ఎలుక ఏడాదిలో 10 కేజీల ఆహారం తీసుకుంటే అది కొరికి నాశనం చేసే పంట తినేదానికి పదిరెట్లు అంటే.. దాదాపు 100 కిలోలు ఉంటుందని అంచనా. ♦ దేశంలో వరి, గోధుమ పంటలకు ఎలుకలు ఏటా 5 నుంచి 15% నష్టం కలిగిస్తున్నాయి. ఇతర అన్ని పంట లను కలిపితే నష్టం సుమారు 25%వరకు ఉంటుంది. ♦ ఎలుకల కారణంగా కాలిఫోర్నియాలో 504 మిలియన్ డాలర్ల పంట నష్టం జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్–నేషనల్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ సెం టర్ అంచనా వేసింది. ♦ ప్రపంచవ్యాప్తంగా 84 రకాల ఎలుకలున్నా 18 రకాల మూషికాలు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నట్లు ఒడిశా స్టేట్ ఎన్విరాన్మెంట్ విభాగంతెలిపింది. ♦ ఒడిశాలోని 4 గ్రామాల్లో ఎలుకలు 3.60 టన్నుల ఆహార ధాన్యాలను నాశనం చేసినట్లు తేలింది. దుకాణాల్లోని గోడల్లో ఎలుకలు దాచిన ఆహార పదార్థాలను వెలికితీయగాఒక్కోచోట 16.64 నుంచి 21.5 కిలోలు గుర్తించారు. ♦ సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు జీవించే గోధుమ రంగు ఎలుకలు 21 రోజుల్లో 10 నుంచి 14 పిల్లలను పెడుతుంది. ఇవి నాలుగైదు వారాల్లోనే పరిపక్వ దశకు చేరి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఎలుకలు జతకడితే ఏడాదిలో వాటి సంతానం 1,000 దాటిపోతుంది. -
భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. ఎవరూ నమ్మలే..
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి 2300 మందికిపైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించారంటే? నమ్మగలరా? టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి. భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే 'సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే'(SSGEOS) పరిశోధకులు. ఈయన మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ఇది.. 'అతి త్వరలో లేదా తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.' అని ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు. Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV — Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023 అయితే ఈ ట్వీట్‌ను కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు. గతంలో ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదని చులకన చేసి మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన అంచనాలే అక్షరసత్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. భూకంపం అనంతరం ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ట్వీట్ చేశారు. వందేళ్లకు ఓసారి ఇలాంటి భారీ భూకంపం వస్తుందని, 115, 526 సంవత్సారాల్లో కూడా ఇలాంటి పెను విపత్తులే సంభవించాయని వివరించారు. My heart goes out to everyone affected by the major earthquake in Central Turkey. As I stated earlier, sooner or later this would happen in this region, similar to the years 115 and 526. These earthquakes are always preceded by critical planetary geometry, as we had on 4-5 Feb. — Frank Hoogerbeets (@hogrbe) February 6, 2023 భూకంపం తర్వాత ట్విట్టర్లో ఫ్రాంక్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన పేరుతో నకిలీ ఖాతాలు కూడా సృష్టించే పరిస్థితి వచ్చింది. దీంతో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, తన పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
వారంలో 4 రోజులే పని, మిగిలిన టైంలో ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?
కోవిడ్ -19 కారణంగా ప్రపంచ దేశాల్లో ఉద్యోగస్తుల పని దినాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని దినాలు తగ్గించేందుకు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. గతంలో వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు కొన్ని దేశాల్లో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసేలా సంస్థలు ఉద్యోగులకు వెసలుబాటు కల్పించాయి. అయితే వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసిన ఉద్యోగులు మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారు? రెండో ఉద్యోగం చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? అంటూ బోస్టన్ కాలేజీ ఎకనమిస్ట్, రిసెర్చర్ జూలియట్ షోర్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్! జూలియట్ షోర్ ఆరు నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 సంస్థలకు చెందిన ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ అభిప్రాయ సేకరణలో.. వారానికి 4 రోజుల పనిచేస్తున్న ఉద్యోగులు 8 గంటల పాటు నిద్రకే కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 40 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా నిద్రపోలేదన్నారు. ఆఫీస్ వర్క్, ఆరోగ్యం విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గమనించినట్లు రీసెర్చర్ జూలియట్ షోర్ తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే, స్నేహితులతో కాలక్షేపం, సినిమాలు, షికార్ల పేర్లతో ఎంజాయ్ చేయడం కంటే..వారానికి ఎనిమిది గంటల సమయంలో ఏడు గంటల పాటు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. వారానికి నాలుగు రోజుల పని సమయాల్లో రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు భావించే ఉద్యోగుల శాతం 42.6 శాతం నుండి 14.5 శాతానికి పడిపోయింది. ఈ సందర్భంగా జూలియట్ షోర్ మాట్లాడుతూ..‘ఉద్యోగులు ఎక్కువ సేపు నిద్రపోవడంపై నేను ఆశ్చర్యపోలేదు. కానీ ఉద్యోగుల్లో చోటు చేసుకుంటున్న బలమైన మార్పులపై ఆశ్చర్యపోయాను’ అని షోర్ చెప్పారు. ఈ అనూహ్య మార్పుల కారణంగా ఆఫీస్ వర్క్ ఎప్పుడు, ఎక్కడ జరగుతుందోనని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయని అన్నారు. చదవండి👉 ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్! -
ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి, సీఎం ఠాక్రే సంతాపం
సాక్షి,ముంబై: సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్(81)కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె బుధవారం కన్నుమూశారని భర్త, కార్యకర్త భారత్ పటాంకర్ ప్రకటించారు. గెయిల్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. వివిధ సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, మహిళల హక్కులపై ఆమె చేసిన కృషి మరువలేనివని ఠాక్రే నివాళులర్పించారు. అటు పలువురు దళిత, మహిళా ఉద్యమకారులు, ఇతర సాహితీవేత్తలు కూడా గెయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలో వామపక్ష ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని సీపీఎం నేత అజిత్ అభ్యంకర్ అన్నారు. అమెరికాలో జన్మించిన గెయిల్ అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్డీ చేసేందుకు ఇండియాకు వచ్చారు. భారతీయ పౌరురాలిగా మారి సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. దళిత రాజకీయాలు, మహిళా పోరాటాలు, కుల వ్యతిరేక ఉద్యమంపై అనే పుస్తకాలు రచించారు. ముఖ్యంగా శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటు, కుల వ్యతిరేక ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. అలాగే పర్యావరణ సమస్యలపైన కూడా రచనలు చేశారు. కాగా 1941, ఆగస్టు 2వ తేదీన అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గెయిల్ జన్మించారు. 1963-64 కాలంలో ఇండియాను సందర్శించిన ఆమె దళిత, కుల వ్యతిరేక ఉద్యమాల ఆమె ఆకర్షితురాలయ్యారు. అలా పీహెచ్డీ నిమిత్తం 1970-71లో ఇండియాకు వచ్చారు. 1976లో భరత్ పటాంకర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భారతీయ పౌరసత్వం సాధించారు. అప్పటినుంచి సతారా జిల్లాలోని కాసేగావ్‌లో నివాసముంటున్నారు. భర్తతో గెయిల్ (ఫైల్ ఫోటో) భర్తతో కలిసి శ్రామిక్ ముక్తి దళ్‌ను స్థాపించి అక్కడి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీల బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా గెయిల్ పనిచేయడం విశేషం. -
ఆ విషయంలో భారత్‌దే తొలి స్థానం
ఇదివరకటి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి నామమాత్రంగా ఉండేది గాని, ఇటీవలి కాలంలో ఈ రంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో సైతం మహిళలు రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విద్యాభ్యాసంలో భారత మహిళలు ప్రపంచంలోనే ముందంజలో ఉంటున్నారు. అయితే, ఈ రంగాల్లో ఉపాధి పొందడంలో మాత్రం కొంత వెనుకబడి ఉండటమే నిరాశ కలిగిస్తోంది. అయినా, అడుగడుగునా ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమిస్తూ మన దేశానికి కొందరు మహిళలు శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తూ యువతరానికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశంలోని మహిళల స్థితిగతులు, ఈ రంగాల్లో రాణిస్తున్న కొందరు మహిళల గురించి తెలుసుకుందాం... శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న వారిలో ఎక్కువ సంఖ్యలో మహిళలు గల దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న మహిళలకు ఉపాధి కల్పించడంలో మాత్రం 19వ స్థానంలో ఉండటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) రంగాలలో సుమారు 2.80 లక్షల మంది శాస్త్రవేత్తలు ఉండగా, వీరిలో మహిళలు 14 శాతం మాత్రమే ఉన్నారు. ఈ రంగాల్లో పట్టాలు తీసుకుంటున్న మహిళలు పరిశోధనలకు దూరమవుతున్నారు. ఇది భారత్ ఒక్క దేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్తా చాటుకోవడానికి మహిళలకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా, వాటిని అధిగమించి తమ ప్రతిభ నిరూపించుకుంటున్న మహిళలూ ఉంటున్నారు. అలాంటి వారిలో మన దేశానికి చెందిన కొందరు నవతరం మహిళా శాస్త్రవేత్తల సంక్షిప్త పరిచయం... మురికివాడ నుంచి పరిశోధనల వైపు: షాలినీ ఆర్య ముంబై మురికివాడలో పుట్టి పెరిగిన షాలినీ ఆర్య ఆహార శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలోని ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సామాన్యులు చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటకాల్లో పోషకాలను మరింత పెంచడమే కాకుండా, అవి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉపకరించే సాంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతులను సామాన్యులకు మరింత చేరువ చేసే దిశగా ఆమె తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఆహార పదార్థాల్లో పోషకాల పెంపుదల, ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వచేసే సాంకేతిక పద్ధతులపై ఆమె రాసిన పరిశోధన వ్యాసాలు వివిధ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె శాస్త్రవేత్తగా ఎదిగిన తీరు శాస్త్ర సాంకేతిక విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది. షాలినీ తండ్రి రోజు కూలి. ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండేవారు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. తండ్రి షాలినికి ఐదేళ్ల వయసు వచ్చినా బడిలో చేర్చకుండా, ఆమె తమ్ముడిని బడిలో చేర్చాడు. తమ్ముడు రోజూ బడికి వెళుతుంటే తనకూ బడికి వెళ్లాలని ఉండేది. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తమ్ముడి వెనకే అనుసరిస్తూ బడికి చేరుకుంది. పాఠాలు వినాలనే ఆశతో తమ్ముడి తరగతి గదిలో టీచర్ టేబుల్ కింద నక్కింది. టీచర్ ఆమెను గమనించి, ఆమె తండ్రికి కబురు చేసింది. షాలినీని కూడా బడిలో చేర్చమని చెప్పింది. టీచర్ మాటపై షాలినీని బడిలో చేర్పించాడు. బడిలో చేరినా, షాలినీకి ఇంటి పనులు ఎప్పటి మాదిరిగానే ఉండేవి. ఇంటిల్లిపాదికీ వంట చేయడం ఆమె డ్యూటీనే. ఇంటి పనులన్నీ పూర్తయ్యాక చదువుకునేది. హైస్కూలు చదువు పూర్తయ్యాక ఇంజినీరింగ్ చదవాలనుకుంది. ఇంజినీరింగ్ మగపిల్లల కోర్సు, అది చదవొద్దన్నాడు తండ్రి. చివరకు తండ్రి ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేర్పించడానికి ఒప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తుండటంతో తనకు వంటావార్పు అంటేనే విసుగుపుట్టిందని, అయిష్టంగానే ఫుడ్ టెక్నాలజీలో చేరానని, అయితే, ఇందులో చేరిన తర్వాత త్వరలోనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, పూర్తిగా పరిశోధనల వైపు దృష్టి పెట్టానని చెబుతారు షాలినీ. బాల్యంలో పోషకాహార లోపంతో బాధపడిన తాను ఆహార శాస్త్రవేత్తను కాగలిగానని, ఇది తనకెంతో సంతృప్తినిస్తోందని అంటారామె. ఫుడ్ టెక్నాలజీ రంగంలో షాలినీ ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ నుంచి ‘మలాస్పినా స్కాలర్స్ అవార్డు’, భారత్‌లోని అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ నుంచి ‘యంగ్ సైంటిస్ట్ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను దక్కించుకున్నారు. రాయల్ సొసైటీలో దక్కిన చోటు: డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ రెండేళ్ల కిందట ఈ అరుదైన రికార్డు సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఇంటస్టైనల్ విభాగం ప్రొఫసర్‌గా, వైరాలజీ నిపుణురాలిగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఆమె సాగించిన పరిశోధనలకు జాతీయంగా, అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు లభించింది. డయేరియా, రోటావైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె విశేషమైన కృషి చేశారు. రోటావైరస్ వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడంతో పాటు నోటి ద్వారా తీసుకునే పలు రకాల వ్యాక్సిన్ల పనితీరును మెరుగుపరచడంలో సత్ఫలితాలను సాధించి, ‘ఇండియాస్ వ్యాక్సిన్ గ్రాండ్‌మదర్’గా గుర్తింపు పొందారు. ప్రజారోగ్యం, వైరాలజీ, ఇమ్యూన్ రెస్పాన్స్ తదితర అంశాలపై ఆమె దాదాపు మూడువందలకు పైగా పరిశోధన వ్యాసాలను రాశారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో అవి ప్రచురితమయ్యాయి. గగన్‌దీప్ కాంగ్ సిమ్లాలో పుట్టారు. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి రైల్వేలో మెకానికల్ ఇంజినీర్. ఉద్యోగరీత్యా తండ్రికి తరచు బదిలీలు అవుతుండటంతో ఆమె చదువు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. చిన్న వయసు నుంచే ఆమెకు సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి ఉండేది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి ఇంట్లోనే చిన్నసైజు లాబొరేటరీని ఏర్పాటు చేశారు. పన్నెండేళ్ల వయసులోనే ఆమె ఇంట్లోని ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇంటర్ తర్వాత వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, మైక్రోబయాలజీలో ఎండీ, పీహెచ్డీ పూర్తి చేశారు. వైద్య పరిశోధనల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ పీఎన్ బెర్రీ ఫెలోషిప్, ఇన్ఫోసిస్ ప్రైజ్ సహా పలు అవార్డులు, సత్కారాలు దక్కాయి. కట్టుబాట్లను దాటి కోడింగ్ ప్రపంచంలోకి: కోమల్ మంగ్తానీ కోమల్ మంగ్తానీ కోడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టే మహిళలకు, బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ‘ఊబెర్’ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కోమల్ గుజరాత్‌లోని సూరత్‌లో కట్టుబాట్లతో నడుచుకునే సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. వారి కుటుంబాల్లో మగపిల్లలే ఉన్నత చదువులకు వెళ్లరు. ఇక ఆడపిల్లల పరిస్థితి వేరే చెప్పేదేముంది? అయితే, కోమల్ తల్లిదండ్రులు కూతురి కోసం తమ సామాజికవర్గం నుంచి ఎదురైన విమర్శలకు వెరవకుండా ఆమెను ఉన్నత చదువులు చదివించారు. సూరత్‌లోని ధరమ్సిన్హ్ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కోమల్ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరారు. కొన్నాళ్లకు మంచి అవకాశాలు రావడంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఒరాకిల్, వీఎం వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆరేళ్ల కిందట క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ‘ఊబెర్’లో చేరారు. ఆ సంస్థ కోసం ‘ఊబెర్ ఈట్స్’, ‘ఊబెర్ రైడ్స్’, ‘ఊబెర్ ఫ్రైట్’, ‘జంప్ బైక్స్’ వంటి బిజినెస్ యాప్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోడింగ్ పరిజ్ఞానంలో మహిళలను, బాలికలను ప్రోత్సహించేందుకు ‘విమెన్ హూ కోడ్’, ‘గర్ల్స్ హూ కోడ్’ వంటి కార్యక్రమాలను ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఔత్సాహిక మహిళలకు, బాలికలకు కోడింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. భట్నాగర్ పురస్కారం అందుకున్న తొలి మహిళ: అదితి సేన్ దే అదితి సేన్ దే దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు. భౌతికశాస్త్రంలో ఆమె పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రస్తుతం ఆమె అలహాబాద్‌లోని హరీశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీలో ఆమె విశేషమైన కృషి కొనసాగిస్తున్నారు. కోల్‌కతాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన అదితి చిన్ననాటి నుంచే సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తల్లి స్కూల్ టీచర్, తండ్రి పశ్చిమబెంగాల్ రాష్ట ప్రభుత్వోద్యోగి. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని బెథూనే కాలేజీ నుంచి మ్యాథమేటిక్స్ ఆనర్స్‌తో బీఎస్సీ పూర్తి చేసిన అదితి, తర్వాత అదే యూనివర్సిటీ పరిధిలోని రాజాబజార్ సైన్స్ కాలేజీ నుంచి అప్లైడ్ మ్యాథమేటిక్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ చదువుకుంటుండగానే క్వాంటమ్, స్టాటిస్టికల్ ఫిజిక్స్‌పై పరిశోధనలు ప్రారంభించారు. భారత్‌లో కొన్నాళ్లు పరిశోధనలు కొనసాగించాక, పోలండ్‌లోని దాంజిగ్ వర్సిటీలో అవకాశం దొరకడంతో, అక్కడ చేరి పీహెచ్డీ పూర్తి చేశారు. తర్వాత జర్మనీలోని లీబ్నిజ్ యూనివర్సిటీలో కొంతకాలం, ఆ తర్వాత స్పెయిన్‌లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటానిక్ సైన్స్‌లో కొంతకాలం రీసెర్చ్ ఫెలోగా పరిశోధనలు సాగించారు. భారత్ తిరిగి చేరుకున్నాక ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కోరిలేషన్స్ అంశాల్లో అదితి చేసిన పరిశోధనలకు విశేషమైన గుర్తింపు లభించింది. సమాచార సాంకేతికతకు కొత్త పుంతలు: సునీతా సరావాగీ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో తనవంతు పాత్ర పోషించిన శాస్త్రవేత్త సునీతా సరావాగీ. ప్రస్తుతం ఆమె ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలోని సెంటర్ ఫర్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా లెర్నింగ్‌లో ఇన్స్టిట్యూట్ చైర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దిశానిర్దేశం చేసిన కొద్దిమంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సునీతా సరావాగీ డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్ట్స్రాక్షన్ టెక్నిక్స్‌కు రూపకల్పన చేసిన తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ డేటాలోకి చేరిన పేర్లు, అడ్రస్‌ల డూప్లికేషన్‌ను తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సునీతా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్డీ చేశారు. డేటాబేస్ మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కీలకమైన మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలపై సునీతా సాగిస్తున్న పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఆమె ‘గూగుల్ రీసెర్చ్’కు విజిటింగ్ సైంటిస్ట్‌గా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో సాగించిన పరిశోధనలకు గుర్తింపుగా ఆమెకు ‘ఇన్ఫోసిస్’ పురస్కారం సహా పలు అవార్డులు, బహుమానాలు దక్కాయి. బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న వైద్యురాలు: డాక్టర్ రోహిణీరావు చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో అత్యంత పిన్నవయస్కురాలైన వైద్యురాలు డాక్టర్ రోహిణీరావు. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఆమె వృత్తిగా ఎంచుకున్న వైద్యరంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడమే కాదు, తనకు గల రకరకాల అభిరుచుల కోసం కూడా ఆమె సమయం కేటాయిస్తారు. బోట్ సెయిలింగ్, భరతనాట్యం, రంగస్థల నటన, గుర్రపుస్వారీలోనే కాకుండా ‘భైరవముష్టి’ అనే ఒకరకమైన సంప్రదాయ యుద్ధక్రీడలో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ నైపుణ్యమే ఉంది. చెన్నైలోని చెంగల్పట్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువు సాగిస్తూనే సెయిలింగ్‌లో ఏడు చాంపియన్ షిప్‌లు సాధించారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక కావేరీ హాస్పిటల్లో ఇంటర్న్‌గా చేరారు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ రావడంతో అక్కడ ఎమ్మెస్సీ ఇంటర్నల్ మెడిసిన్ కోర్సులో చేరారు. అక్కడ చదువు పూర్తయ్యాక తిరిగి కావేరీ హాస్పిటల్లో చేరి, కిడ్నీ సమస్యలపై డాక్టరేట్ చేశారు. రోగులకు ఉల్లాసం కలిగించేందుకు ఆమె ‘మెడికల్ క్లౌనింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభించారు. నవ్వుతో చాలా సమస్యలు దూరమవుతాయని, రోగులను నవ్వించగలిగితే వారు త్వరగా కోలుకుంటారని రోహిణి చెబుతారు. మెడికల్ క్లౌనింగ్ నిపుణురాలిగా ఆమె అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. మారుమూల ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తూ, అక్కడి వైద్యసేవలు మెరుగుపరచేందుకు కూడా ఆమె తన కృషిని కొనసాగిస్తున్నారు. -
గూగుల్‌కు ఉద్యోగుల షాక్
శాన్ఫ్రాన్సిస్కో : సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఇద్దరు ఉద్యోగులు గుడ్బైచెప్పడం కలకలం రేపింది. గత నెలలో కృత్రిమ మేథ (ఏఐ)పరిశోధకుడు టిమ్నిట్ గెబ్రూపై గూగుల్ వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు కీలక టెకీలు సంస్థకు గుడ్‌బై చెప్పారు. వైవిధ్యం,నైతిక విలువలపై కొనసాగుతున్న వివాదాలు తీవ్రస్ధాయి స్ధాయికి చేరిన నేపథ్యంలో ఇంజనీరింగ్ డైరెక్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్ గూగుల్ నుంచి నిష్క్రమించడం చర్చకు దారితీసింది.యూజర్ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్ బకర్ 16 ఏళ్ల పాటు సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నానంటూ ప్రటించారు.గెబ్రూ నిష్క్రమణ అనంతరం గూగుల్‌లో కొనసాగదల్చుకోలేదని చెప్పారు. మరోవైపు సెర్చింజన్ దిగ్గజంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినీష్ కన్నన్ గూగుల్‌ను వీడుతున్నట్టు బుధవారం ట్వీట్ చేశారు. పేర్కొన్నారు. గెబ్రూ, ఏప్రిల్ క్రిస్టియానాల పట్ల గూగుల్ దురుసుగా ప్రవర్తించిందనీ, వారికి అన్యాయం జరిగిందంటూ కన్నన్ పేర్కొన్నారు. గెబ్రూ, క్రిస్టియానా ఇరువురూ నల్ల జాతీయులు కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి గూగుల్ నిరాకరించింది. అయితే గెబ్రూ నిష్క్రమణ తరువాత సంస్థపై ఉద్యోగుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. -
6 కోట్ల ఏళ్ల చేప..
ఈ శిలాజం 6 కోట్ల సంవత్సరాల కిందటి ఓ చేపది. అమెరికాలోని కన్సస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు రాబర్ట్ డీపాల్మా, ఆయన సహచరులు కలసి చాలా జీవులకు చెందిన అరుదైన శిలాజాలను వెలికితీశారు. 6 కోట్ల ఏళ్ల కిందట భూమిని ఓ గ్రహశకలం ఢీకొన్నప్పుడు దాదాపు 75 శాతం జంతు, వృక్ష జాతులు అంతరించిపోయాయి. ఈ విపత్తు వల్లే డైనోసార్లు కూడా అంతరించిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలు జాతులకు చెందిన జంతువులు, చేపలు కూడా చనిపోయాయి. అవన్నీ శిలాజంగా మారి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నార్త్ డకోటా ప్రాంతంలో దీన్ని పరిశోధకులు గుర్తించారు. -
భూగర్భ జలాల్లో ‘ప్లాస్టిక్’
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తున్న భూగర్భ జలాల్లోనూ ప్లాస్టిక్ భూతం ప్రవేశించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘గ్రౌండ్‌వాటర్’ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికాలోని రెండు జలాశయాల్లో సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఔషధాలు, గృహోపకరణ వ్యర్థాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ప్లాస్టిక్ పర్యావరణంలోకి సూక్ష్మకణాలుగా విచ్ఛిన్నమవుతుంది. ఇది జలచర జీవుల నాశనానికి కారణమవుతుంది’ అని ఇలినాయిస్ టెక్నాలజీ సెంటర్ పరిశోధకుడు జాన్ స్కాట్ చెప్పారు. ఫలితంగా మన ఆహార సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సున్నపురాయి పగుళ్ల ద్వారా, కొన్నిసార్లు మురుగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా కూడా భూగర్భంలోకి నీరు చేరుతుంది. అయితే, పరిశోధకులు సెయింట్ లూయిస్ మెట్రోపాలి టన్, ఇల్లినాయిస్ ప్రాంతాల్లో పలు భూగర్భ జల నమూనాలను సేకరించి పరీక్షించగా 15.2 శాతం ప్లాస్టిక్ సూక్ష్మకణాలు కనిపించాయి. 1940 నుంచి 600 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారైనట్లు ఒక అంచనా. అందులో కనీసం 79 శాతం పర్యావరణంలో కలిసిపోయి ఉంటుందని అనుకుంటున్నామని స్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఫేస్బుక్ పోస్టు చూసి ఇంగ్లండ్ నుంచి భూపాలపల్లికి!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడి దేవుని గుట్ట.. ఎక్కడి బ్రిటన్.. ఫేస్‌బుక్‌లోని ఓ పోస్ట్ అక్కడి పరిశోధకుడిని రాష్ట్రానికి లాక్కొచ్చింది. ఇక్కడి చరిత్ర ఖండాంతరాలను దాటింది.. వరంగల్‌కి చెందిన పరిశోధకుడు, టూరిజం కన్సల్టెంట్ అరవింద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దేవునిగుట్ట గురించి సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. దాన్ని చూసి ఇంగ్లండ్‌కు చెందిన ప్రొఫెసర్ ఆడమ్ హార్డీ ఇక్కడికి వచ్చారు. దేవుని గుట్ట అత్యద్భుత కట్టడం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి సమీపంలో ఉన్న అడవుల్లో ఈ దేవునిగుట్ట ఆలయముంది. గతేడాది వెలుగులోకి వచ్చిన ఈ దేవునిగుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ప్రపంచంలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంటే ముందే తెలంగాణలోనూ అలాంటి నిర్మాణాలు జరిగాయని ఈ ఆలయం నిరూపించింది. ఇటీవల ప్రొఫెసర్ ఆడమ్ హార్డీ, అరవింద్ గ్రామస్తులతో కలసి దేవునిగుట్టపై నిశితంగా అధ్యయనం చేశారు. ఈ ఆలయం సాటిలేని నిర్మాణమని, అత్యద్భుత కట్టడమని ఇలాంటి ఆలయం భారత్‌లో మరెక్కడా లేదని ఆడమ్ అన్నారు. దేవుని గుట్ట క్రీ.శ. 6 లేదా 7 శతాబ్దాలకు చెందిన కట్టడం గా భావిస్తున్నట్లు చెప్పారు. రాతిని ముక్కలు ముక్కలుగా చెక్కి వాటిపై శిల్పాలను కూర్చిన ఆలయం అరుదైన నిర్మాణ పద్ధతులను కలిగి ఉందన్నారు. విష్ణు కుండినుల కాలం నాటి ఆలయ నిర్మాణ పద్ధతులకు, ఈ ఆలయ నిర్మాణానికి సారూప్యత ఉందన్నారు. శిథిల స్థితిలో ఉన్న ఈ ఆలయాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుని ఆలయ పునరుద్ధరణ చేయాలని కోరారు. 38 ఏళ్లుగా పరిశోధనలు.. ఆడమ్ హార్డీ ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు. గత 38 ఏళ్లుగా దక్షిణాసియాలోని పురాతన కట్టడాల నిర్మాణ పద్ధతులను గురించి పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనా క్రమంలో ఆయన సుదీర్ఘ కాలం భారత్‌లో పర్యటించారు. ఈయన చేసిన పరిశోధనల తాలూకు పత్రాలను పుస్తకాలుగా ప్రచురించారు. విదేశీయుల సందర్శన భారతీయ శిల్పకళలో మరో కోణానికి నిదర్శనంగా నిలిచిన దేవునిగుట్ట ఆలయాన్ని ఇప్పటికే పలువురు దేశ, విదేశీ చరిత్రకారులు, పరిశోధకులు పరిశీలించారు. భారత ప్రాచీన చరిత్ర, చిత్ర, శిల్ప కళలపై 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న జర్మనీకి చెందిన కొరీనా గతేడాది దేవుడిగుట్టను సందర్శించారు. ఇటలీ నుంచి లక్ష్మీ ఆండ్రీ అనే విదేశీ మహిళ కూడా గతంలో ఈ ఆలయాన్ని సందర్శించారు. -
హత్యాయత్నానికి పాల్పడ్డారు...!
పోలీసులను ఆశ్రయించిన ‘బసవ తారకం’ క్యాన్సర్ ఆస్పత్రి పరిశోధకులు హైదరాబాద్: గుర్తు తెలియని పదార్థాన్ని పాలల్లో కలిపి ఇచ్చి తమపై హత్యాయత్నాని కి పాల్పడ్డారంటూ హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధకులు శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి ఆర్ అండ్ డీ హెడ్ డాక్టర్ వీవీటీఎస్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. గత ఆరేళ్ల నుంచి తనతోపాటు కపిల్ షా, సతీశ్, సరిత, సౌమ్య, సారిక, శ్రీవాణి తదితర రీసెర్చ్ స్కాలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 3న ఆస్పత్రి ఉద్యోగి తమకు ఇచ్చిన పాలు ఉప్పగా, తేడాగా ఉన్నాయని, తాగిన తర్వాత కొన్ని సందేహాలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై అదేరోజు ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఆర్ అండ్ డీ నిధులను ఆస్పత్రి నిర్వహణకు మళ్లించడం వల్ల రెండు నెలల నుంచి ఆర్అండ్ డీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల రీసెర్చ్ స్కాలర్లు ఆందోళనకు గురవుతున్నా రని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బసవతారకం ఆస్పత్రిలో కలకలం రేపింది. -
గ్రహాంతరవాసుల పిలుపు అందిందా?
రష్యా : గ్రహాంతర వాసుల అన్వేషణలో మానవుడు కీలకమైన అడుగు వేశాడా.. భూమికి 95 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఓ గ్రహం నుంచి బలమైన సంకేతం అందిందా.. అంటే అవుననే అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు. ఈ సంకేతాన్ని బుద్ధి జీవులు పంపిందని చెప్పలేకున్నా.. మరిన్ని పరిశోధనలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొంటున్నారు. గతేడాది రష్యాలోని జెలెన్‌చుక్ స్క్యా ప్రాంతంలో ఉన్న రతన్ 600 రేడియో టెలిస్కోప్ ఈ సంకేతాన్ని గుర్తించింది. ‘హెచ్డీ 164595’ పేరుతో ఉన్న ఓ గ్రహ వ్యవస్థ వైపు నుంచి ఈ సంకేతం అందిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ వ్యవస్థలో ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలున్నాయని ఇప్పటికే గుర్తించారు. సంకేతం శక్తిని బట్టి సాంకేతికంగా మనకన్నా ఎంతో ముందున్న నాగరికతకు చెందిన వారి నుంచి వెలువడి ఉండొచ్చని భావిస్తున్నారు. సైనికులు ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలో దాదాపు 11 గిగాహెడ్జ్ల సామర్థ్యంతో అందిన ఈ సంకేతం ఏంటి.. ఇది గ్రహాంతర వాసుల నుంచే వచ్చిందని ఎలాంటి పరిశోధనల ద్వారా నిర్ధారించుకోవచ్చనే అంశాలపై వచ్చే నెలలో మెక్సికోలో జరిగే 67వ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సమావేశాల్లో చర్చించనున్నారు. -
‘బొద్దింక’తో ప్రొటీన్ ఫుడ్!
బెంగళూరు : బొద్దింక ద్వారా ఆహారమా.. ఆ మాట వింటేనే ఏదోలా ఉంది కదూ..! వాటిని చూస్తేనే కొంతమంది భయపడతారు. అలాంటిది వాటిని తినడమా..? కానీ బొద్దింకలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు పరిశోధకులు. బొద్దింకల కడుపులో మనకెంతో మేలు చేసే ప్రొటీన్లు ఉన్నాయని బెంగళూరులోని ఇన్‌స్టెమ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఆ చిన్న బొద్దింకలోని ఒక్కో ప్రొటీన్ స్ఫటికాల్లో పాలలో ఉన్న శక్తి కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్త సంచారీ బెనర్జీ పేర్కొంటున్నారు. అంతేకాదు ఈ స్ఫటికాల్లో ప్రొటీన్లతోపాటు కొంతమేర కొవ్వులు, చక్కెరలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ‘ప్రొటీన్లలో దాదాపు మనకు అవసరమైన అన్ని అమైనోయాసిడ్స్ ఉంటాయని తెలిసిందే. ఎలాగూ ఈ స్ఫటికాల జన్యుక్రమం మొత్తాన్ని తెలుసుకున్నాం కాబట్టి దాని ఆధారంగా సూపర్ ఆహారాన్ని ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల ద్వారా పెద్ద ఎత్తున తయారు చేయొచ్చు’ అని సంచారీ వివరంచారు. పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
లేట్ నైట్ నిద్రపోతే అంతే సంగతులు!
మీ ఇంట్లో చిన్నపిల్లలు తరచూ నిరాశగా ఏదో కోల్పోయిన వారిలా ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటున్నారా? వారు అలా ఉండడానికి కారణాలు ఏమై ఉండచ్చో ఒకసారి ఆలోచించారా! వారి విచిత్ర మానసిక పరిస్థితికి కారణం సరిగా నిద్ర పోకపోవడమే అని ఇటీవల శాస్త్రవేత్తలు తేల్చారు. లేట్ నైట్ వరకు నిద్రపోని పిల్లలు ఎమోషనల్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. నిద్ర తక్కువగా ఉన్నవారిలో వ్యతిరేక భావావేశాలు ఎక్కువగా ఉంటాయంట! అలాంటి వారు సంతోషాలను ఎక్కువగా అనుభవించలేరని హోస్టన్ యూనివర్సిటీ నిపుణులు తెలిపారు. 7 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలపై పరిశోధనలు జరిపి ఈ మేరకు ఫలితాలను రాబట్టారు. భవిష్యత్తులో అలాంటి పిల్లలు మానసికంగా మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి అనేది మానసిక స్థితిగతులపై అధికంగా ప్రభావం చూపుతుందని వివరించారు. కాగా, ఏడు నుంచి 12 ఏళ్ల పిల్లలు సుమారు రోజుకు 10 గంటల పాటు నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. -
వెన్నతో గుండెకు నష్టం లేదు
వాషింగ్టన్ : వెన్న తినడం వల్ల గుండెకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. నిర్ణీత పరిమాణంలో వెన్నని తీసుకుంటే మధుమేహం నుంచి కూడా తప్పించుకోవచ్చని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వెన్న తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు రావని పేర్కొన్నారు. మొత్తం 15 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు. రోజుకు 14 గ్రాముల (ఒక టేబుల్ టీ స్పూన్) వెన్నను ఆహారంలో తీసుకోవచ్చని వివరించారు. మరీ ఎక్కువ పరిమాణంలో వెన్న తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు ల్యూరా పింపిన్ పేర్కొన్నారు. పిండిపదార్థాలు, చక్కెర, వంట నూనెల కన్నా వెన్న మేలని తెలిపారు. -
అయస్కాంతంతో బంధాలు పదిలం!
న్యూయార్క్: అయస్కాంతంతో ఎక్కువగా గడిపే ప్రేమికుల మధ్య అనుబంధం మరింత దృఢంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన ఏ అండ్ ఎమ్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనలో 18-22 మధ్య వయసున్న విడిపోయిన జంటలు పాల్గొన్నాయి. వీటిలో కొన్ని జంటలకు అయస్కాంతం ముక్కల్ని ఇచ్చి ఆడమన్నారు. మరికొన్ని జంటలకు అయస్కాంతశక్తి లేని ముక్కల్ని ఇచ్చి ఆడమన్నారు. అయస్కాంతంతో ఆడిన ప్రేమికుల మధ్య గాఢమైన అనుబంధం ఉన్నట్లు, అయస్కాంతంతో ఆడిన వారిలో వ్యక్తుల పట్ల ప్రేమ, గాఢమైన అనుబంధం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ తాజా అధ్యయనం ఇటీవలే ప్లస్ వన్ జర్నల్ లో ప్రచురితమైంది. -
కళలతో ఒత్తిడి దూరం!
లండన్: మనకున్న నైపుణ్యాల స్థాయితో సంబంధం లేకుండా ఏదో ఒక కళలో నిమగ్నమవడం ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. యూకేలోని డ్రెక్సెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు మానవ ఉమ్మి నమూనాలోని కార్టిసాల్ అనే హార్మోన్ , ఒత్తిడికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. కార్టిసాల్ స్థాయులు ఎక్కువైనపుడు ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలున్నాయని గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్యనున్న 39 మందిని 45 నిమిషాల పాటు జరిగిన కళారూపాల తయారీకి ఆహ్వానించారు. కాగితం, మట్టి, ఇతర పరికరాలు వారికి అందుబాటులో ఉంచారు. పాల్గొన్నవారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా తమకిష్టమొచ్చిన వస్తువును తయారుచేయమన్నారు. ఈ 45 నిమిషాల కాలంలో 75 శాతం మందిలో కార్టిసాల్ స్థాయులు గణనీయంగా తగ్గిన ట్లు గుర్తించారు. -
వానలోనూ సౌరవిద్యుత్
బీజింగ్: సూర్య కాంతితోపాటు వర్షపు నీటి బిందువుల నుంచి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌరఘటాలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వర్షాకాలంలో తక్కువ సూర్యకాంతి వల్ల ప్రస్తుతం వాడుతున్న సౌరఘటాలు విద్యుత్తును ఉత్పత్తి చేయలేవు. ఓషన్, యానాన్ నార్మల్ వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన సౌరఘటాలతో దీన్ని అధిగమించొచ్చు. కర్బన మూలకాలకు చెందిన ‘గ్రాఫేన్’ వాడి వీటిని తయారు చేశారు. విద్యుత్తుకు వాహకమైన గ్రాఫేన్పై వర్షపు నీరు పడినప్పుడు ధనావేశం ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య బంధం ఏర్పడుతుంది. దీన్ని అనుసరించి గ్రాఫేన్ ఎలక్ట్రోడ్లను వాడి, నీటి బిందువుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. -
సంతోషాన్ని కొనుక్కోవచ్చు
లండన్: డబ్బును మనకు ఇష్టమైన వాటిని కొనడానికి ఖర్చు చేస్తే సంతోషం కూడా వెంటపడి వస్తుందని ఓ అధ్యయనంలో లేలింది. కేంబ్రిడ్జి జడ్జి బిజినెస్ స్కూల్, కేంబ్రిడ్జి వర్సిటీ, యూకేలోని ఒక బ్యాంకుతో కలిసి జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 625 మంది బ్యాంకు ఖాతాదారులు 6 నెలలు జరిపిన 76 వేల లావాదేవీలను పరిశీలించి దీన్ని కనిపెట్టారు. లావాదేవీలను 112 రకాలుగా వర్గీకరించగా, పరిశోధకులు 59 రకాలకు తగ్గించి అనంతరం వాటిని విశ్లేషించారు. వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను కొన్న ఖాతాదారులు వారి బంధువుల దగ్గర ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు చెప్పారంట. ‘ధనం, సంతోషాల మధ్య బలహీన సంబంధం ఉందని గత అధ్యయనాలు చెప్పాయి. బ్యాంకు లావాదేవీలను పరిశీలించి మేం ఇది తప్పని కనుగొన్నాం. వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను కొన్నప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ సంతోషం పొందుతారు’ అని పరిశోధకుల్లో ఒకరైన గ్లాడ్‌స్టోన్ చెప్పారు. -
ఈ శిఖరం నుంచి దూకినా.. ఏమీ కాదు!
నిట్టనిలువునా కిలోమీటరుకు కొంచెం తక్కువగా ఉన్న ఈ కొండ శిఖరం మీది నుంచి దూకినా.. పారాచుట్‌తో ల్యాండ్ అయినట్లు హాయిగా ఉంటుందట. మనకు దెబ్బలేమీ తగలవట. ఎందుకంటే.. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా స్వల్పంగానే ఉంటుంది. బాగుందే.. ఎక్కడుందంటారా? ‘67పీ/చుర్యుమోవ్ గెరాసిమెంకో’ అనే తోకచుక్కపై! ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పదేళ్ల క్రితం ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక వందల కోట్ల కి.మీ. ప్రయాణించి ఈ ఏడాది ఆగస్టులోనే ఈ తోకచుక్కను చేరింది. అప్పటి నుంచి ఈ తోకచుక్క చుట్టూ తిరుగుతూనే భూమికి ఫొటోలు పంపుతోంది. అలా ఈ నెల 10న 20 కి.మీ. దూరం నుంచి రోసెట్టా తీసిన నాలుగు ఫొటోలను కలిపి ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ అట్కిన్సన్ అనే ఔత్సాహిక ఖగోళ పరిశోధకుడు ఈ ఫొటోను రూపొందించారు. అన్నట్టూ.. 4 కి.మీ. సైజు కొండలా ఉన్న ఈ తోకచుక్క ప్రస్తుతం గంటకు లక్ష కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందట. దీనిపైకి ఫీలే అనే ల్యాండర్‌ను నవంబరు 12న జారవిడిచి రోసెట్టా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. -
టీవీక్షణం: ఆ గంట... ఊపిరాడని ఉత్కంఠ!
ఏదైనా పనిమీద పక్క ఊరికి వెళ్లి, దారి తప్పిపోతేనే కంగారు పడిపోతాం. అలాంటిది కారడవిలో దారి తప్పితే? ఎముకలు కొరికే మంచు కొండల్లో మనం ఒక్కరమే మిగిలిపోతే? ఎవరూ కానరాని ఎడారిలో ఒంటరిగా ఉండాల్సి వస్తే? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! మనకి ఇలాంటి పరిస్థితులు పెద్దగా ఎదురుకావుగానీ... సైనికులకు, యాత్రికులకు, పరిశోధకులకు అప్పుడప్పుడూ ఈ దారుణ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో, ఎలా తప్పించుకుని బయటపడాలో చెప్పేందుకు రూపొందించిందే... మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం! ఏ ప్రోగ్రామ్ అయినా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందుతుంది. అయితే దానికి అదనంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు డిస్కవరీ చానెల్‌వారు. యూకేకి చెందిన బేర్ గ్రిల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రిల్స్‌ని ఏదైనా భయంకరమైన నిర్జన ప్రదేశంలో వదిలేస్తారు. తనంత తానుగా దారి వెతుక్కుంటూ అక్క డ్నుంచి బయటపడాలి. దొరికింది తినాలి. ప్రమాదాలను ఎదుర్కోవాలి. కఠిన ప్రయా ణాన్ని కొనసాగిస్తూనే ఎన్నో విలువైన విషయాలను వివరిస్తూంటాడు గ్రిల్స్. స్వతహాగా సైనికుడు కావడంతో తన తెగువ, ధైర్యం, గుండె నిబ్బరంతో షోని రక్తి కట్టిస్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం మనకు లేకపోయినా... పలు రకాల మొక్కలు, జంతువులు, ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది! ఇది ఓ పాఠం... గుణపాఠం! కోటీశ్వరుడి భార్య శారద. ఉత్తమ ఇల్లాలు, సౌమ్యురాలు. అత్తగారికి పరిచర్య చేస్తుంది. భర్తకు అనురాగం పంచుతుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అందరూ ఆనందంగా ఉండేలా చూస్తుంది. కానీ ఆమెకు మాత్రం ఆనందమంటే ఏంటో తెలీదు. సంతకం పెట్టడం కూడా రాని శారదను భర్త అడగడుగునా అవమానిస్తుంటాడు. కూతురు చిన్నచూపు చూస్తుంది. కొడుకు నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది. ఆ బాధ నుంచి ఆమెను గట్టెక్కించాలనుకుంటుంది కోడలు సాక్షి. అత్తగారికి చదువు చెప్పడం మొదలుపెడుతుంది. కోచింగ్ క్లాసులకు పంపిస్తుంది. ఆమె కూడా ఓ మనిషేనని అందరూ గుర్తించేలా చేయాలని ఆరాటపడుతుంది. కోడలి సహకారంతో తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకోవడం కోసం పోరాటం చేస్తోంది శారద... ‘ఎక్ నయీ పెహ్చాన్’ సీరియల్లో. శారద పాత్రలో పూనమ్ థిల్లాన్ నటన గుండెల్ని పిండేస్తుంది! భార్య కూడా మనసున్న మనిషేనని గుర్తించని మగాళ్లకు సోనీ చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఓ పెద్ద పాఠం. తల్లిని గౌరవించడం చేతకాని పిల్లలకు చక్కని గుణపాఠం! షోనే కాదు... కామెడీ కూడా కాపీనే! మనుషుల జీవితాల్లో ఒత్తిడి రాను రాను పెరిగిపోతుండటంతో... వాళ్లకు రిలీఫ్ ఇవ్వడానికి టీవీ కార్యక్రమాల్లో కామెడీ డోసు కూడా పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వారానికో కొత్త కామెడీ షో ఏదో ఒక చానెల్లో పుట్టుకొస్తోంది. ఆ కోవలో వచ్చిందే ‘మ్యాడ్ ఇన్ ఇండియా’. స్టార్ ప్లస్ చానెల్లో ప్రారంభమైన ఈ నవ్వుల షో... నవ్వు పుట్టించ డంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. ప్రముఖ హిందీ యాంకర్ మనీష్ పాల్‌తో కలిసి హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఈ షోని నిర్వహిస్తున్నాడు. ఇద్దరూ మంచి నటులే. అయితే ‘కాపీ’ అన్న ఒక్కమాట ఈ షోని దెబ్బ తీస్తోంది. సునీల్ గ్రోవర్ ఇంతకుముందు కామెడీ కింగ్ కపిల్‌తో పాటు ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’లో పని చేశాడు. అక్కడ అతడికి చాలా మంచి పేరు వచ్చింది. దాంతో తనే సొంతగా ‘మ్యాడ్ ఇన్ ఇండియా’ స్టార్ట్ చేశాడు. కానీ కపిల్ షోలో తాను వేసిన గెటప్పులే వేస్తున్నాడు. అక్కడ చేసిన తరహా కామెడీనే చేస్తున్నాడు. కపిల్ మాదిరిగానే సెలెబ్రిటీలను పిలిచి సందడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే... ఇప్పటికే కపిల్ కామెడీ షో అత్యధిక టీఆర్పీ సాధించి రికార్డు నెలకొల్పింది. మరి అచ్చు అలాంటి షోనే ఎవరు చూస్తారు? ఇప్పటికైనా సునీల్ ఈ విషయాన్ని గుర్తించి తన షో తీరు మారిస్తే బెటర్. లేదంటే కొన్ని వందల షోలలో తనదీ ఒకటిగా మిగిలిపోతుంది. -
ఇది అరబిక్ కళ అందం!
కళారూపాల పునఃసృష్టి కొత్తేమీ కాదు. ఇప్పడు అలాంటి ప్రయత్నం మరోసారి జరిగింది. అల్-జాజరి ‘మెకానికల్ డ్రాయింగ్స్’ను పునఃసృష్టి చేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞ అనే ‘విశేషం’ చాలా సహజంగా అల్-జాజరి పేరు ముందు అమిరిపోతుంది. ఈ ఇరాకీ ప్రతిభావంతుడు రచయిత మాత్రమే కాదు పరిశోధకుడు, ఇంజనీర్, గణితశాస్త్రవేత్త. జాజిరత్ ఉమర్ నగరంలో పుట్టిన అల్-జాజరికి ఆ పట్టణం పేరు స్ఫురించేలా తల్లిదండ్రులు పేరు పెట్టారు. నిజానికి ఆయన ప్రతిభ గురించి తెలిసినంతగా వ్యక్తిగత విషయాలు తెలియవు. రకరకాల కళాత్మక వస్తువులను తయారు చేయడం మీద జాజరికి బాగా ఆసక్తిగా ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేసి కొత్త కొత్త పరికరాలను రూపొందించేవాడు. వాటర్-పవర్డ్ సిస్టమ్‌తో పని చేసే ఎన్నో యంత్రాలను తయారుచేశాడు. వాటర్ ఫ్లో, మూమెంట్‌తో రకరకాల పరికరాలను తయారుచేశాడు. కొన్ని తన సృజనలో నుంచి పుడితే మరికొన్ని పాతవస్తువుల నుంచి స్ఫూర్తి పొందాడు. తాను రాసిన ప్రసిద్ధ పుస్తకంలో ఆ పరికరాల పరిచయం ఉంది. ఆనాటి విజ్ఞానస్పృహకు అవి అద్దం పడతాయి. ‘మీరు కూడా స్వయంగా తయారుచేయవచ్చు’ అనే పద్ధతిలో ఆయన రచనలు ఉంటాయి. నీటిశక్తితో పనిచేసే పరికరాలను ‘షక్లు’ అనిపిలుస్తారు. వీటితో గ్రాఫికల్ డ్రాయింగ్స్ సృష్టించడంతో పాటు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరబిక్ అక్షరమాల నుంచి కొన్ని భిన్నమైన అక్షరాలను ఉపయోగించి బొమ్మలను గీయడమనే పద్ధతి ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో అల్-జాజరి రూపొందించిన మెకానికల్ డ్రాయింగ్స్‌ను ఇప్పుడు పునఃసృష్టిస్తున్నారు. తాజాగా ఎనిమిదివందల సంవత్సరాల క్రితం నాటి అల్-జాజరి పుస్తకం ఆధారంగా చరిత్రకారుడు బెర్ట్ హాల్ టోరోంటోకు చెందిన డిజైనర్ క్రిస్ సహాయ సహాకారాలతో ఆనాటి ‘మెకానికల్ డ్రాయింగ్స్’ను పునఃసృష్టిస్తున్నాడు.