
అయస్కాంతంతో బంధాలు పదిలం!
న్యూయార్క్: అయస్కాంతంతో ఎక్కువగా గడిపే ప్రేమికుల మధ్య అనుబంధం మరింత దృఢంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన ఏ అండ్ ఎమ్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనలో 18-22 మధ్య వయసున్న విడిపోయిన జంటలు పాల్గొన్నాయి. వీటిలో కొన్ని జంటలకు అయస్కాంతం ముక్కల్ని ఇచ్చి ఆడమన్నారు. మరికొన్ని జంటలకు అయస్కాంతశక్తి లేని ముక్కల్ని ఇచ్చి ఆడమన్నారు.
అయస్కాంతంతో ఆడిన ప్రేమికుల మధ్య గాఢమైన అనుబంధం ఉన్నట్లు, అయస్కాంతంతో ఆడిన వారిలో వ్యక్తుల పట్ల ప్రేమ, గాఢమైన అనుబంధం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ తాజా అధ్యయనం ఇటీవలే ప్లస్ వన్ జర్నల్ లో ప్రచురితమైంది.