
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా పరిచయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలేసి పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోతున్న తన భార్యను భర్త పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దీంతో, సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల ప్రకారం..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గోపి (22) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కూకట్‌పల్లిలోని హాస్టల్ ఉంటూ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్‌కు చెందిన సుకన్య(35)కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో, వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. సుకన్యకు అప్పటికే వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా గోపి లేకుండా ఉండలేనని భావించిన సుకన్య.. ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి ఉంటోంది.
తన భార్య సుకన్య కనిపించకపోవడంతో భర్త జయరాజ్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా గోపితో వెళ్లిందని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో జయరాజ్ వారికోసం గాలిస్తుండగా మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్‌పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. బైక్‌ను అక్కడే వదిలేసి సుకన్య, గోపి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ పారిపోయారు. ఈ ఘటనలో భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత
మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్
తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన… pic.twitter.com/e0oDcb0593— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
Video Credit: Telugu Scribe