Texas
-
భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యం
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్‌మస్క్(Elon Musk) భారత్, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలిచ్చారు. ఇటీవల టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్(SpaceX) స్టార్‌బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తన మద్దతును వ్యక్తం చేశారు.ఆతిథ్యం(hosting)లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో ప్రశాంత్ రుయా (డైరెక్టర్ - ఎస్సార్ క్యాపిటల్), జయ్ కోటక్ (కోహెడ్ - కోటక్ 811), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), కళ్యాణ్ రామన్ (సీఈఓ - ఫ్లిప్‌కార్ట్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ - ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), నీలేష్ వేద్ (ఛైర్మన్ - అప్పారెల్ గ్రూప్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.ఈ ఆతిథ్యంలో భాగంగా భారత పారిశ్రామికవేత్తలు స్పేస్ ఎక్స్ అత్యాధునిక సౌకర్యాలను సందర్శించారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ నొక్కి చెప్పారు. ‘పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావంఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘స్థిరమైన, సాంకేతిక ఆధారిత భవిష్యత్తును రూపొందించడంలో భారత్‌కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో అర్థవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీజీజీ) కో-ఛైర్మన్‌గా మస్క్‌ను ప్రతిపాదించారు. -
టాంటెక్స్‌లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 208 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ''తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు'' అనే అంశంపై సదస్సు రసవత్తరంగా జరిగింది. ముందుగా ఈ వేదిక లెనిన్ వేముల "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి,' మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. లెనిన్ వేముల గుర్రం జాషువా ''గబ్బిలం'' పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత సత్యం మందపాటి మధురాంతకం రాజారాం, నరేంద్రలతో ఉన్న తన జ్ఞాపకాలను పంచుకొన్నారు.. మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ మధురాంతకం నరేంద్రతో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం జరిగింది . ఈ వేదికకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రి మధురాంతకం రాజారాం తెలుగు, ఆంగ్లభాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.తన తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పారు. మన నుంచి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి, నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు. తరువాత మధురాంతకం రాజారామ్ గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి సాహితీ ప్రియులతో పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటి నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, తదుపరి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్ర గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందన్నారు ఆచార్య మధురాంతకం నరేంద్ర . సభలో ప్రత్యక్షంగా, అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. చివరిగా దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ,ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలిపారు అధ్యక్షులు సతీష్ బండారు. (చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం') -
రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!
నవజాత శిశువులకు తల్లిపాలు వివిధ వ్యాధుల బారిన పడకుండా రక్షించే అమృత ధారలు. కొందరూ తల్లులకు వివిధ కారణా వల్ల ఆ అమృతధారలు ఉత్పత్తి కావు. దీంతో అలాంటి తల్లులు పిల్లలకు స్వచ్ఛమైన అమ్మపాలు ఎలా అందించాలో తెలియక చాలా సతమతమవుతుంటారు. అలాంటి తల్లుల వెతలను తీర్చేలా కొంతమంది తల్లులు తమ బ్రెస్ట్ మిల్క్‌ని స్వచ్ఛందంగా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలా ఓ తల్లి రెండు లీటర్లకు పైగా తన రొమ్ము పాలను అందించి ఎందరో బిడ్డల ఆకలిని తీర్చి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఎవరామె..?. ఆమెకి ఇదెలా సాధ్యమయ్యింది..?టెక్సాస్‌కి చెందిన అలిస్సా ఓగ్లేట్రీ ఈ రికార్డుని సృష్టించింది. గతంలో 2014లో 1,569.79 లీటర్ల పాల దానంతో తనపేరు మీదు ఉన్న రికార్డును ఓగ్లేట్రీనే బద్దలుగొట్టి తిరగరాసింది. ఈసారి ఏకంగా రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్‌ని దానం చేసి ఆమె హృదయం చాలా విశాలం అని చాటిచెప్పింది. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ప్రకారం..ఒక లీటరు తల్లిపాలతో నెలలు నిండకుండా పుట్టిన దాదాపు 11 మంది చిన్నారులను పోషించొచ్చట. . దీని ఆధారంగా ఆమె ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మందికి పైగా శిశువుల ఆకలిని తీర్చిందని గిన్నిస్ రికార్డు అంచనా వేసింది. ఓగ్లెట్రీ 2010లో కొడుకు కైల్కి జన్మనిచ్చినప్పటి నుంచి తల్లి పాలను దానం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే తాను అరుదైన హైపర్‌లాక్టేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. దీనికారణంగా ఆమె చనుబాల ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుంటుంది. అలా రోజు రోజుకి రెండింతలుగా పాలు వస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆ క్రమంలోనే ఆమె మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ టైంలోనూ పాలధారలు ఆగలేదు. అలా నేటివరకు రోజుకి ఆరులీటర్ల చొప్పున తల్లిపాలు ఉత్పత్తవ్వుతున్నాయి. ఈ చనుబాల ఉత్పత్తి ఆగిపోవాలంటే మందులు వాడడం లేదా డబుల్ మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ రెండింటిని వద్దని నెలనిండకుండా పుట్టిన పిల్లలకు అందించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలా ఆమె తన పిల్లలు పాలు తాగడం మానేసిన తర్వాత కూడా పంపింగ్ కొనసాగించి లీటర్లకొద్ది పాలను మిల్క్ బ్యాంక్‌కి ఇచ్చేది. అందుకోసం తాను ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి మరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. ఎందుకంటే తాను ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆమె పాలు నవజాత శిశువుకు పోషణకు ఉపయోగపడతాయని అంటోంది ఓగ్లేట్రీ. నేను ఇలా ఎంతమంది చిన్నారుకు సహాయం చేశానో.. అనేది తలచుకుంటే చాలా సంతృప్తినిస్తుందని చెబుతోంది. అంతేగాదు ఓగ్లేట్రీ తల్లిపాలను దానం చేయడంపై అవగాహన కల్పించాలనుకుంటోంది. తనలాగే ఇతర మహిళలు కూడా స్వచ్ఛందంగా పాలను దానం చేసేలా ముందుకురావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఓగ్లేట్రీ.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!) -
తెలుగోడు.. టెక్సాస్ మేయర్ ఎన్నికల బరిలో!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులూ.. అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం చూస్తున్నాం. చిన్న పదవుల మొదలుకుని జడ్జిలు, చట్ట సభలు, దేశ ప్రధానుల్లాంటి ఉన్నత పదవులనూ అధిరోహిస్తున్నారు. తాజాగా.. ఓ తెలుగోడు టెక్సాస్ స్టేట్‌లో మేయర్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ట్రాన్స్పరెన్సీ(పారదర్శకత) ఈజ్ ద గేమ్.. కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ.. 35 ఏళ్ల యువకుడు ట్రావిస్ కౌంటీలోని ది హిల్స్ మేయర్ ఎన్నికల ప్రచారంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు(ప్రస్తుతం బాపట్ల) చెందిన కార్తీక్ నరాలశెట్టి Karthik Naralasetty.. ది హిల్స్ మేయర్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కార్తీక్.. న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్‌సైన్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఆపై చదువు ఆపేసి ఇండియాకు తిరిగొచ్చి సోషల్‌బ్లడ్ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి.. క్రమక్రమంగా వ్యాపారవేత్తగా ఎదిగాడు. అదే టైంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీ స్థాపించాడు.అమెరికాలో ఉన్న తొలినాళ్లలోనే అధితితో పరిచయం.. ఆపై వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ‘ది హిల్స్’ మేయర్ ఎన్నికలపై దృష్టి సారించాడు కార్తీక్. ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టిన కార్తీక్.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన అనుభవంతో ది హిల్స్ అభివృద్ధికి దోహదపడతానని ప్రచారం చేశాడు కూడా. ది హిల్స్‌లో 2,000 జనాభా ఉంది. కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అయితే న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహకారంతో ప్రచారం ఉధృతం చేశాడు కార్తీక్. నవంబర్ 5న ఇక్కడ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ.. కార్తీక్ ఈ ఎన్నికల్లో గెలిస్తే గనుక.. ‘ది హిల్స్’ మేయర్ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ వ్యక్తిగా నిలుస్తాడు. -
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్‌కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్‌లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్‌లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్‌కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్‌లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్‌కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్‌కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్‌కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్‌కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు
ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ శనివారం డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ 53 వ టెక్సాస్ సాహిత్య సదస్సు కోపెల్, టెక్సాస్ నగరంలో నిర్వహించారు. 'న భూతో న భవిష్యత్' అన్నట్లుగా ఈ సదస్సు జరిగింది. ఈ ''సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల'' సదస్సు ప్రారంభ సూచికగా శ్రీరామ చంద్ర మూర్తి ని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ ''"రామ నామ ఉమ్మే....'' భక్తి గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో రాగయుక్తంగానూ వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది. టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహితీ వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా గారు స్వాగతోపన్యాసం చేశారు. ఇటీవలే దివంగతులయిన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ,శే.వడ్డేపల్లికృష్ణ సంస్మరణగా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణగారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాలను పంచుకొన్నారు.తర్వాత మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ గారు ''సాహిత్యంలో నారీభేరీ''అంశం గా ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ''రామాయణ కల్పవృక్షం ''కావ్య వైశిష్ట్యాన్ని వివరించారు. అలాగే కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తెలుగు పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింబింప చేసిన వైనాన్ని ఉదాహరణంగా వివరించటమేగాక వారి రచనలలోని తెలుగు భాషా మాధుర్యాన్ని వివరణాత్మక ఉపన్యాసించడాన్ని గుర్తుచేశారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరి సంపదలు'' అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో శ్లేష అలంకార భూషిత పద ప్రయోగాలతో పాటు, అక్షరాల పద భ్రమకాలుకొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియుల నుంచిసమాధానాలను రాబట్టడంలో విజయవంతమయ్యారు.మహాకవి గురజాడ 162 వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ గారు గురజాడ రచనల్లోని ఆధునికత శాస్త్రీయ దృష్టి గురించీ , తన సమకాలీకులలో ఆయన ప్రత్యేకతలను గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకం రాయడంలో ఆనాటి సమాజంలో పేరుకొని పోయిన ద్వంద ప్రమాణాలను కపటత్వాన్ని గురజాడ మహాకవి ఎండగట్టిన తీరును సోమసుందర్ గారు అద్భుతంగా వివరించారు. ప్రాధమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగా ఉండాలని సోమసుందర్ అకాంక్షించారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు బి.లలితానంద ప్రసాద్, పుస్తక పరిచయంలో విశ్వ మానవుడు సంజీవ్ దేవ్ ఆలోచనా సరళిని అర్ధం చేసుకోవాలని అన్నారు. తర్వాత ''సాహిత్యంలో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహితీ వీక్షణంలో కృష్ణశాస్త్రి గారి రచన ప్రతిభా పాటవాల్ని" శ్రీ నరేందర్ చక్కగా విశ్లేషించడం జరిగింది. ''సాహిత్యము, దాని ప్రభావము-మానవజీవన పరివర్తన'' అనే అంశముపై విట్టల్ రామశర్మ గారి ప్రసంగము,,''శ్రీ రామ రక్ష'' అంశంపై డా వెంకట నక్త రాజు గారి ప్రసంగము, ''సమాజంపై గురువుల ప్రభావం''అంశంపై శ్రీరామకృష్ణ శర్మగారి ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన '''శ్రీమతి ప్రేమలేఖ ''కథ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు .అనంతరం వేటూరి, దాశరథి,వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సినీ గీతాలను శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ,శ్రీమతి ఆకునూరి శారద,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు. గురజాడ విరచిత ''దేశమును ప్రేమించుమన్నా''గేయాన్ని దయాకర్ మాడ, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల , చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా ఆలపించడం జరిగింది. డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా, హార్దికంగా తోడ్పడుతున్న పోషక దాతలకూ, కార్యకర్తలకు, అలాగే మంచి విందు భోజనాన్ని అందించిన 'సింప్లి సౌత్' యాజమాన్యానికి అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథ రెడ్డి కుమ్మెత, వీర లెనిన్ తుల్లూరి, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చంద్ర కన్నెగంటి, చిన సత్యంల తోపాటు పుదూర్ జగదీశ్వరన్, రమణ జువ్వాడి, శ్రీధర్, సుమ, సాయి, కిరణ్మయి, గౌతమి, స్వర్ణ మరియు డాలస్,హ్యూస్టన్ ,ఆస్టిన్, టెంపుల్ నగరాల నుంచి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు , సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు .(చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!) -
డల్లాస్ లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
-
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. -
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్‌లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు
అమెరికాలోని టెక్సాస్‌లోగల హనుమంతుని భక్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక్కడి హ్యూస్టన్‌లో తాజాగా 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వెనుక చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు ఉన్నాయి.‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఈ విగ్రహం యునైటెడ్ స్టేట్స్‌లోని మూడవ అతి ఎత్తయిన విగ్రహం. అలాగే హనుమంతునికి సంబంధించిన 10 ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వామివారి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. This is the “Third Tallest Statue” in the United States 🇺🇸. A grand Pran Pratishtha ceremony was held in Houston, Texas, on Aug 18, where a 90 foot tall Hanuman statue was inaugurated.pic.twitter.com/Ng7W4CFewV— Gems of Engineering (@gemsofbabus_) August 20, 2024 -
ఆ ప్రయాణమే ఆఖరిదైంది!
కాలం కత్తిగట్టింది.. కాపుకాసి కాటేసింది.. సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కన్నీటి ముగింపు పలికింది. కుమార్తెను యూనివర్సిటీలో చేరుస్తున్నామన్న ఆనంద క్షణాల్లో ఘోరం జరిగి పోయింది.. రెప్పపాటులో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు ఘంటికలు మోగాయి. ఒకే కుటుంబంలోని సభ్యుల ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. నిండు మనసుతో ఆశీస్సులు.. సరదా కబుర్లు, సందళ్లతో ఇంటి నుంచి యూనివర్సిటీకి సాగిన కారు ప్రయాణం ఊహించని కుదుపుతో విషాదాంతమైంది.అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులున్నారు. లియాండర్‌లో నివసించే అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీపా అరవింద్(40), వారి 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్, ఆదిర్యాన్ (14)నివసిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల హైస్కూల్ డిప్లామాను పూర్తి చేసుకున్న ఆండ్రిన్ అరవింద్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే మహా ఇష్టం. డల్లాస్ యూనిర్సిటీలో చదవాలనేది ఆమె కోరిక. అందుకే కుమర్తె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు.. ఆమెను యూనివర్సిటీలో చేర్పించేందుకు కారులో బయలు దేరారు. ఆ ప్రయాణమే ఆఖరిదైంది! ఉన్నతమైన లక్ష్యాలు..ఎన్నో కోరికలతో ఇంటి నుంచి యూనివర్సిటీకి కారులో బయలు దేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో అరవింద్ మణి కుటుంబాన్ని కబళించింది. లాంపాస్ కౌంటీ సమీపంలో గత బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అరవింద్ మణి దంపతులు వారి కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మృతి చెందారు.కారు ప్రమాదం ఎలా జరిగింది?కారు ప్రమాదంపై టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ (డీపీఎస్)అధికారి ట్రూపర్ బ్రయాన్ వాష్కో స్పందించారు. ‘కాపెరాస్ కోవ్‌కు చెందిన 31 ఏళ్ల జాసింటో గుడినో డ్యూరాన్, 23 ఏళ్ల యోసిలు గాస్మాన్ మార్టినెజ్‌లు హైపర్ కార్ ‘కాడిలాక్ సీటీఎస్’లో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో అరవింద్ మణి ప్రయాణిస్తున్న 65 నుంచి 70 ఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న కియా ‘టెల్లూరైడ్’ను.. 100 ఎంపీహెచ్ స్పీడుతో వస్తున్న కాడిలాక్ సీటీఎస్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత దాటికి కియా కారు సగానికి పైగా ధ్వంసమైంది.అరవింద్ ఫ్యామిలీ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. అరవింద్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో మరణించారు’అని తెలిపారు.బతికే అవకాశాలు లేవుఘోర రోడ్డు ప్రమాదంపై 26 ఏళ్లలో నేను చూసిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇది. అందుకు ప్రమాదం జరిగిన తీవ్రత, మరణాల సంఖ్యే కారణమని ట్రూపర్ బ్రయాన్ వాష్కో మీడియాకు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బతికే అవకాశాలు ఉండవు అని వెల్లడించారు. కుటుంబాన్ని ఢీకొట్టిన కారు 160 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.విషాద సమయం.. పరిమళించిన మానవత్వంఇంతటి విషాదం నింపిన ఈ రోడ్డు ప్రమాదం 14ఏళ్ల అరవింద్ మణి కుమారుడు ఆదిర్యాన్ ఒంటరయ్యాడు. ఇక, ప్రమాదం తర్వాత దాతలు స్పందించి తీరు మానవత్వానికి అద్దం పడుతోంది. దుఃఖంలో ఉన్న బాలుడికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫండ్ రైజర్ ఆర్గనైజర్ రాజారామన్ వెంకటాచలం గోఫండ్‌మీ ద్వారా ఫండ్ రైజ్ చేశారు. అందుకు 7లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో దాతలు విరాళం ఇచ్చినట్లు రాజారామన్ చెప్పారు. ఆదిర్యాన్ భవిష్యత్ కోసం తాము ఫండ్ రైజ్ ప్రారంభించామని, బాలుడిని ఆదుకునేందుకు దాతలు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. సేకరించిన ఫండ్‌తో బాలుడి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్‌లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్‌గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్‌కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్‌లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్‌గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం
ఆస్టిన్: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన తాడిబోయిన రవితేజ(28) స్విమ్మింగ్ ఫుల్లో జారిపడి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ నెల 18వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఘటన చోటు చేసుకుంది. అయితే రవితేజ నేపథ్యం గురించి.. ఘటన గురించి అక్కడి అధికారుల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
అమెరికాలోని డల్లాస్‌లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఇతనిపై ఇంతకుముందు కూడా హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు.జూన్ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. -
ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!
వయసు శరీరానికే గానీ మనసుకు కాదు అని చేసి చూపిస్తున్నారు కొందరూ. చాలామంది వయసు రీత్యా పెద్దవారైనా.. యువకుల మాదిరిగా తమకు ఇష్టమైన రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు. అలానే ఓ మహిళ ఏడు పదుల వయసులో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. పైగా ఈ వయసులో ఇలాంటి పోటోల్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించింది. ఈ పోటీలో ఆమె గెలవకపోయినప్పటికీ అంత పెద్ద వయసులో కూడా తన కోరికను నెరవేర్చుకునేందుకు ముందుకు వచ్చి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు అందానికి వయసుతో సంబంధం లేదని చాటి చెప్పింది. ఎవరామె అంటే..ఏడు పదుల వయసులో మారిస్సా టీజో అనే మహిళ మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో పాల్గొనాలనే తన కలను సాధించింది. గత వారాంతంలో హ్యూస్టన్‌లో జరిగిన ఈ మిస్ టెక్సాస్ ఈవెంట్లో పాల్గొన్న 75 మంది మహిళలో టీజో కూడా ఉన్నారు. ఈ ఈవెంట్లో ఆరియోన్నా వేర్ విజేతగా నిలిచినప్పటికీ..71 ఏళ్ల టీజోనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పైగా ఈ ఏజ్‌లో పాల్గొన్న వృద్ధురాలిగా రికార్డు సృష్టించారు. ఇక టీజో తాను ఈ పోటీల్లో పాల్గొనడానికి గల కారణాలను ఇన్స్టాగ్రాం వేదికగా చెబుతూ..తాను ఈ మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో పోటీదారుగా పాల్గొనడం అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నాను. అందులో తాను భాగమైనందుకు సంతోషిస్తాన్నాను. ఇది కేవలం మహిళలు తమ శారీరక, మానసికంగా ధృఢంగా ఉండటమేగాక వారు ఏ వయసులోనైనా అందంగానే ఉంటారని విశ్వసించేలా ప్రేరేపించేందుకే ఇలా చేశానని పోస్ట్‌లో తెలిపారు. అంతేగాదు తాను ఈ పోటీలో పాల్గొనేల మద్దతు ఇచ్చిన స్పాన్సర్లందరికి ధన్యవాదలని కూడా చెప్పారు. కాగా, ఇటీవలే అందాల పోటీల్లో వయోపరిమితి నిబంధనను తొలగించాలనే మార్పుకు శ్రీకారం చుడటంతోనే టీజోకి ఈ మిస్ టెక్సాస్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అంతేగాదు ఈ సరికొత్త నిబంధన మార్పులో.. వివాహం చేసుకున్న లేదా వివాహితలు, గర్భణీ స్త్రీలు, పిల్లలు కలిగిన మహిళలు సైతం అందాల పోటీలో పాల్గొనడానికి అనుమతివ్వడం విశేషం. అయితే ఈ విధానం 2023 నుంచి అమలులోకి రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Marissa Teijo (@marissateijo) (చదవండి: పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!) -
అమెరికాలో సుడిగాలుల బీభత్సం
వ్యాలీ వ్యూ (టెక్సాస్): అమెరికాలో టెక్సాస్, ఒక్లహామా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భీకర సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ట్రక్కుల పార్కింగ్ స్టేషన్, ఇళ్లను తుడిచిపెట్టేస్తూ సాగిన విధ్వంసకాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్లహామాలో టోర్నడోలు భీకర వినాశనానికి కారణమయ్యాయి. భీకర గాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో జనం అంధకారంలో మగ్గిపోయారు. -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
టెక్సాస్‌లో భారీ వర్షం.. ఎటుచూసినా వరద నీరే..
టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం.వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 28వ రాష్ట్రం టెక్సాస్. దీని రాజధాని ఆస్టిన్. జనాభారీత్యా చూసినప్పుడు ఆస్టిన్ 9.58 లక్షలు. దీని కన్నా ఇదే రాష్ట్రంలోని డల్లాస్ ( 13 లక్షలు ), సాన్అంటానియో ( 14.45 లక్షలు ), హుస్టన్( 23 లక్షలు ) నగరాల్లో ఎక్కువ జనాభా. అయినా చారిత్రక ప్రాధాన్యాన్నిబట్టి రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల ఆస్టినే రాజధాని అయింది. ఆస్టిన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, మంత్రుల చాంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ ఉన్నది ఆస్టిన్‌లోనే. తప్పక చూడాల్సింది స్పేస్ సెంటర్..ఈ నగర జనాభాలో మూడింట ఒక వంతు హిస్పానిక్స్, ఆఫ్రికన్ / ఏసియన్ అమెరికన్లు. టెక్సాస్‌లోని అతి పెద్ద నగరమైన హుస్టన్ సిటీలో చూడదగ్గవి ఎన్నోఉన్నాయి. హుస్టన్ సిటీలో నేను మొదటగా చూసినవి అక్వేరియం, చిల్డ్రన్స్ మ్యూజియం లాంటివి. తప్పక చూడాల్సిన సందర్శనీయ స్థలాల్లో గాల్వెస్టన్ సముద్రతీరం, నాసా (NASA) వారి స్పేస్ సెంటర్ వంటివి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా.. శాస్త్ర సాంకేతికత మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉంటే.. నాసా సెంటర్ చూడాలనుకుంటారు. లిండన్ బి. జాన్సన్ స్పేస్ సెంటర్ పేరిట హ్యూస్టన్‌లో నిర్మించిన NASA కేంద్రాన్ని స్పేస్‌క్రాఫ్ట్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ అంతరిక్షయాన శిక్షణ, పరిశోధన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రానికి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ పేరు పెట్టారు. తటస్థ ప్రయోగశాల అంటే..దీన్ని నవంబర్ 1961లో పూర్తి చేశారు. క్లియర్ లేక్ ఏరియాలో 1,620 ఎకరాల్లో 100 భవనాల్లో నిర్మించిన ఈ కేంద్రంలో దాదాపు 3,200 మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్.. జెమిని 4 ( అపోలో , స్కైలాబ్ , అపోలో-సోయుజ్ మరియు స్పేస్ షటిల్‌తో సహా ) నుంచి ప్రతి అంతరిక్ష ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. అంటే ఒక స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి దాని లాంచ్ టవర్‌ను క్లియర్ చేసిన క్షణం నుంచి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చే వరకు దాని కంట్రోల్‌ను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రంలో ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేలా ఎన్నో ఆకర్షణీయ ఏర్పాట్లు ఉన్నాయి. తటస్థ ప్రయోగశాల.. అంటే అంతరిక్షంలో ఉన్నట్టుగా గాలిలో తేలే వాతావరణాన్ని ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే సుమారు 6.2 మిలియన్ యూఎస్ గ్యాలన్ల నీళ్లు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో వ్యోమగాములు జీరో గ్రావిటీని అనుకరిస్తూ శిక్షణ పొందుతారు. సందర్శకులను స్పేస్ సెంటర్ వరకు అనుమతిస్తారు. అక్కడ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నట్లే..ఇక టెక్సాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. టెక్సాస్‌లో చాలా చోట్ల తెలుగు వాళ్లు కనబడతారు. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఎక్కడయినా.. చూస్తూ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక్క బిర్యానీనే కాదు, సీజన్లో హాలీం కూడా దొరుకుతుంది. ఇరానీ ఛాయ్, సమోసాలు, ఇడ్లీ-దోశ సెంటర్లు.. చూస్తూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. ఒక్క భోజనమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఏ వస్తువు అయినా.. టెక్సాస్‌లో కొనుక్కోవచ్చు. జండూబామ్ నుంచి గోధుమ పిండి వరకు, బియ్యం, నుంచి బాదాంపప్పు వరకు ఏం కావాలన్నా సులువుగా దొరుకుతాయి. కిషోర్ పబరి ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్ కిరాణ మార్కెట్, సరిగమప సూపర్‌మార్కెట్, సబ్జీ మండీలతో పాటు బంగారు, వజ్రాల దుకాణాలు బాగానే కనిపిస్తాయి. ఇండియన్ దుస్తులు పంజాబీ డ్రెస్ నుంచి లుంగీల దాకా అన్నీ దొరుకుతాయి. చాలా చోట్ల సంగీతం, భరత నాట్యం నేర్పే వాళ్లు, యోగా క్లాసులు, తెలుగు భాష, మ్యాథ్స్ క్లాసులు దర్శనమిస్తాయి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనవాళ్లే టాప్. అన్నట్టు ఇక్కడ మనవాళ్లు అప్పుడే రియల్ ఎస్టేట్‌ను పీక్‌లోకి తీసుకెళ్లారు. అలాగే ఇండియన్ ఈవెంట్స్ కూడా. డాలస్ నగరాన్ని జలవనరుల ఆధారితంగా నిర్మించారు. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ సిటీ కట్టారు. నదికి ఇరువైపులా మట్టి గోడలను కట్టి ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌లు, రెస్టారెంట్లతో వినోద విహార కేంద్రంగా మారింది. డాలస్ మొత్తం నగరం నదీతీరం పక్కనే.. దాదాపు 20 మైళ్ళు సిటీని ఆనుకుని నదీ తీరం ఉంటుంది. ప్రశాంతంగా రాజధానిడల్లాస్ ఓ రకంగా హైదరాబాద్ వాతావరణంలా అనిపిస్తుంది. హ్యూస్టన్లా గాలిలో తేమ ఉండదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. హుస్టన్ కాలుష్య వాతావరణంతో పోల్చుకున్నప్పుడు ఆస్టిన్ నాకు ప్రశాంతంగా తోచింది. ఒక రాష్ట్ర రాజధాని ఇంత సింపుల్‌గా ఉండడం గొప్ప విషయమే అనిపించింది. మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా.? అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఓ సారి ఓ లుక్కేయండి. మీరే చెబుతారు.వేముల ప్రభాకర్(చదవండి: అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !) -
US: టెక్సాస్ హ్యుస్టన్‌లో మేమంతా సిద్ధం!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకి మద్దతుగా టెక్సాస్‌లోని హ్యుస్టన్ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ హ్యుస్టన్ నాయకులు బ్రహ్మనంద రెడ్డి , మారుతి , పుల్లా రెడ్డి , శ్రీనివాస్ ఎర్రబోతుల ,యాదగిరి రెడ్డి కుడుముల, విశ్వ సానపరెడ్డి, నర్సి రెడ్డి మరియు దాదాపు 90 మంది వైఎస్సార్సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆన్లైన్ ద్వారా కిలారి రోశయ్య , ఎంపీ అయోధ్య రామి రెడ్డి మరియు పండుగాయల రత్నాకర్ గారు జాయిన్ అయ్యి ప్రసంగించారు. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగినందుకుగాను జగన్ గారి మేమంత సిద్ధం బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ తదితర ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 వైస్సార్సీపీ ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక శ్రీనివాస్ ఎర్రబోతుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్‌లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదింటి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, విద్యార్థులకు ట్యాబ్స్ వంటివి అద్భుతాలు అన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో నాడు–నేడు ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల రూపు రేఖలే మారాయన్నారు. మారుతి మాట్లాడుతూ.. జగన్ అన్న ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు. పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా ఆయనే స్యయంగా జగన్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే కదా అన్నారు. పుల్లా రెడ్డి మాట్లాడుతూ జగన్ గారు పేద ప్రజల కోసం అమ్మఒడి , జగన్ అన్న విద్యా కానుక, గోరు ముద్ద, సచివాలయ వ్యవస్థ, పోర్టులు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలు వైస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు . (చదవండి: ఎన్నికల తర్వాత బాబు, లోకేష్ ఎన్ఆర్ఐలే అవుతారు: రత్నాకర్) -
నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం నిజంగా చల్లటి కబురు. టెక్సాస్‌లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్‌ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు. అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు. టెక్సాస్‌లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్వుడ్ డ్రైవ్‌లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. CRITICAL MISSING-Frisco PD is seeking assistance in locating 17-year-old Ishika Thakore, last seen Monday, Apr 8 at 11:30p in the 11900-block of Brownwood Dr. in Frisco. She is approx 5’4” and 175 lbs, last seen wearing a black, long-sleeve t-shirt and red/green pajama pants. pic.twitter.com/L7fDV7HuEH — Frisco Police (@FriscoPD) April 9, 2024 కాగా గత కొన్ని నెలల్లో అమెరికాలో 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా గత నెల నుంచి తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. -
టెక్సాస్‌లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్‌ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.