టెస్లా ఆటోపైలట్‌ మోడ్‌లో అనంతలోకాలకు..! | Two Killed In Tesla Car Crash In US | Sakshi
Sakshi News home page

టెస్లా ఆటోపైలట్‌ మోడ్‌లో అనంతలోకాలకు..!

Published Mon, Apr 19 2021 5:21 PM | Last Updated on Mon, Apr 19 2021 8:46 PM

Two Killed In Tesla Car Crash In US - Sakshi

వాషింగ్ట‌న్‌: ఆటోపైల‌ట్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు చెట్టును ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవ‌ర్ సీటులో ఎవ‌రూ లేరని తెలిపారు. డ్రైవ‌ర్ ప‌క్క సీటులో, వెనుక సీటులో కూర్చొన్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. కారు ఆటోపైల‌ట్ మోడ్‌లో వేగంగా ప్ర‌యాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

కారులో ఉన్న డ్రైవర్‌ సహాయక వ్యవస్థ సరిగ్గా పనిచేయక ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్లా కంపెనీ తన వెబ్‌ సెట్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. తమ వాహనాలు పూర్తిగా ఆటోపైలట్‌ ​కాదని, డ్రైవర్‌ పరవేక్షణ కచ్చితంగా ఉండాలని కంపెనీ తెలిపింది. కాగా టెస్లా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు  తరుచుగా ప్రమాదానికి గురవుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: రుజువైతే .. టెస్లా కంపెనీ మూసివేత..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement