![Young Woman Deceased Car Race Accident In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/27/Young-Woman.jpg.webp?itok=Zwq-3vQy)
తనుశ్రీ (ఫైల్)
మండ్య(కర్ణాటక): యువతులు రెండు కార్లలో పోటాపోటీగా ప్రయాణిస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురైంది. మండ్య జిల్లా నాగమంగళ తాలూకాలోని కోణనూరు గేట్ వద్ద ఆదివారం ఉదయం కారు ప్రమాదంలో ఒక యువతి మరణించింది. మృతురాలు బెంగళూరు బాగలకుంటెకు చెందిన హెచ్‌టి. మంజుళాదేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తనుశ్రీ (21)గా గుర్తించారు. ఈమె మైసూరులో బీబీఎ చివరి ఏడాది చదువుతోంది.
చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం
ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటోంది. స్నేహితురాలి పుట్టినరోజు ఉండడంతో ఆదివారం ఉదయం 7.30 సమయంలో సొంత కారును డ్రైవింగ్ చేసుకుంటూ మైసూరుకు బయల్దేరింది. మధ్యలో ఇద్దరు స్నేహితురాళ్లు వారి కారులో వచ్చారు. ఇద్దరూ పోటీలు పడుతూ కార్లను వేగంగా నడుపుతూ వెళ్లారు. ఈ సమయంలో తనుశ్రీ కారు అదుపుతప్పి కోణనూరు దగ్గర వంతెన గోడను ఢీకొని సుమారు 50 అడుగుల దూరం పల్టీలు కొట్టింది. తనుశ్రీ తీవ్ర గాయాలతో అక్కడే కన్నుమూసింది. నాగమంగళ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment