![Young Woman Committed Suicide In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/1/Karnataka.jpg.webp?itok=-VDOd_fI)
ప్రియుడు, ప్రియురాలు (ఫైల్)
మండ్య(కర్ణాటక): ప్రియుడు హత్యకు గురి కావడంతో ప్రియురాలు అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య నగరంలోని బాలమందిరంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మండ్య నగరసభ స్థాయీ సమితి అధ్యక్షుడు శివలింగ కుమార్తె (17). పోలీసుల వివరాల మేరకు... విశ్వేశ్వరయ్య లేఔట్‌లో నివాసం ఉంటున్న దర్శన్, మాన్విత ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి శివలింగ ఏప్రిల్ 14న పథకం ప్రకారం కుమార్తెను బెదిరించి దర్శన్‌కు ఫోన్ చేసి రప్పించారు. అనంతరం తీవ్రంగా కొట్టారు. చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా అతను మృతి చెందాడు.
ఈ కేసులో తండ్రి శివలింగతో పాటు తల్లి అనురాధ, మరో 17 మందిని పోలీసులు జైలుకు పంపించారు. ఈ క్రమంలో మాన్వితను అధికారులు బాల మందిరంలో ఉంచారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న అమ్మాయి తన ప్రియుని సమాధిని చూపించాలని గొడవ చేసేది. మంగళవారం తెల్లవారుజామున తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment