deceased
-
అనుమానిత వ్యాధి: ఒకరు మృతి.. వెంటిలేటర్‌పై 16 మంది.. 100 దాటిన బాధితులు
ముంబై: మహారాష్ట్రను అనుమానిత వ్యాధి వణికిస్తోంది. గుల్లెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్)గా భావిస్తున్న ఈ వ్యాధి కారణంగా షోలాపూర్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు మృతిచెందారు. కొత్తగా ఈ వ్యాధి మరో 28 మందికి సోకిందని, దీంతో బాధితుల సంఖ్య 101కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ వ్యాధితో బాధపడుతున్న 16 మంది బాధితులు ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిలో 19 మంది తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయస్సు గలవారని, ఇప్పటివరకు 50 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 23 కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. జనవరి 9న పూణేలోని ఒక ఆస్పత్రిలో చేరిన రోగి మొదటి జీబీఎస్ కేసుగా ఆరోగ్య శాఖ అనుమానిస్తోంది.బాధితుల నుండి తీసుకున్న నమూనాలలో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. పూణేకు ప్రధాన నీటి వనరు అయిన ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని బావిలో ఈ. కోలి అనే బాక్టీరియా అధిక స్థాయిలో ఉందని అధికారుల పరీక్షల్లో తేలింది. దీంతో ఈ నీటిని వినియోగించేవారు ముందుగా మరిగించి, వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.ఆదివారం నాటి వరకు 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులను కనుగొనేందుకే ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ చికిత్స చాలా ఖరీదైనదని, ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.20 వరకూ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జీబీఎస్ అనేది శరీర రోగనిరోధక వ్యవస్థను అమితంగా ప్రభావితం చేస్తుంది. మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే నరాలపై దాడి చేస్తుంది. అయితే ఈ వ్యాధి బారినపడిన 80 శాతం మంది రోగులు సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్‌లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్‌లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్‌ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!
ఇటీవల చాలామంది ఎలాంటి నైపుణ్యాలు లేదా స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ లెర్నింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని రకాల కోర్సులు, స్కిల్స్‌కే వర్కౌట్ అవుతుంది. వైద్య విద్యలాంటి కోర్సులకు అస్సలు పనికిరాదు. ఇది ఓ రోగి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఏదైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుంది. చివరికి కటకటాలపాలవ్వుతాం. ఆన్లైన్ లెర్నింగ్‌లో వైద్య విధానం గురించి జస్ట్ అవగాహన తెచ్చుకోగలమే గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడం అసాధ్యం. కానీ ఇక్కడొక మహిళ అలాంటి సాహసానికి ఓడిగట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చివరికి జైటుపాలయ్యింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..వివరాల్లోకెళ్తే..ఆగ్నేయ చైనాలోని వాంగ్ అనే మహిళ ఆన్లైన్ వీడియోల ద్వారా ఆక్యుపంక్చర్ మొత్తం నేర్చుకుంది. ఈ నైపుణ్యంతో తాను నివశించే గ్రామంలోని ప్రజలకు చికిత్స చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి తేడా కొట్టలేదు కాబట్టి డాక్టర్ లైసెన్స్ లేకుండానే ధర్జాగా చేసేసింది. అయితే గతేడాది లీ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆ మహిళ వద్దకు వచ్చాడు. చికిత్స కోసం రూ. 5 వేలు చెల్లించాడుకూడా. ఆమె అతడికి చికిత్స అందించడమే గాక చివరి సెషన్లో భాగంగా చేసిన చికిత్స టైంలో లీ అసౌకర్యానికి గురయ్యాడు. కాసేపటి తర్వాత ఆమె అతడిని ఎంత తట్టి లేపిన లేవకపోవడంతో అతడిని హుటుహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ క్రమంలోనే పరిస్థితి విషమించిన చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరపర్చారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. వాంగ్‌కు అధికారిక ఆక్యుపంక్చర్ శిక్షణ లేదని పరిశోధనలో వెల్లడయ్యింది. ఆమె ఆన్లైన్ వీడియోలతో నేర్చుకుని తనపై, తన భర్తపై సాధన చేసిందే తప్ప క్లినికల్ అనుభవం లేదని తేలింది. ఇక్కడ బాధితుడు లీకి తీవ్రమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంది. అలాంటి వాళ్లకు ఆంక్యుపక్చర్ అనేది ప్రత్యేక నిపుణులు పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి క్లినికల్ శిక్షణలేని వాంగ్ అతడికి తనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో చేయడంతో వికటించి అతని మరణించాడని కోర్టు పేర్కొంటూ ఆ మహిళకు 18 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది. (చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
యువకుడి దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకోంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. ఆయన గుజరాత్‌కు చెందిన హెమంత్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయన ఓక్లహోమాలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హెమంత్ కోరారు. దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్ల్లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిచర్డ్‌ను హోటల్ నుంచి హెమంత్ ఎందుకు వెళ్లిపోవాలన్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే బాలుడు మృతి!
ఓ టీనేజ్ బాలుడు(15) స్విమ్మింగ్ చేసి.. పూల్ నుంచి పైకి ఎక్కి నడుస్తునే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవటంతో అక్కడ ఉన్నవారు.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.In UP’s meerut a 17-Year-old collapses and dies after coming out of the swimming pool. The teenager played cricket before coming for swimming and after swimming for sometime the boy collapses as soon as he steps out and was later declared dead at the hospital. pic.twitter.com/qIFWLSX8Kz— Tanishq Punjabi (@tanishqq9) June 21, 2024 దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిమ్మింగ్ పూల్ మేనెజర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటన చోటు చేసుకున్న వెంటనే స్విమ్మింగ్ పూల్ వచ్చేవారి రాకను మూసివేశారు. -
జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరోసారి కాల్పులు జరిగాయి. ఆదివారం రాత్రి ఉత్తర కశ్మీర్ బండిపోరా జిల్లాలోని ఆరాగం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరాగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రత బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. మృతి చెందిన ఉగ్రవాది మృతదేహాన్ని డ్రోన్ సాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లోని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగిన రోజే ఈ ఘటన చేటుచేసుకుంది. అమిత్ షా.. కశ్మీర్లో చెలరేగుతున్న ఉగ్రవాదం ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మీటింగ్‌లోని అధికారులను ఆదేశించారు. ఇటీవల జమ్ము కశ్మీర్లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడుల పరిస్థితులను పరిశీలించడానికి ఇవాళ(సోమవారం) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ పర్యటించనున్నారు. -
కెనడాలో భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో జరిగిన వరస భారతీయ విద్యార్థుల మృతి ఘటనలు మరువక మునుపే మరో విషాదకర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్ వాంకోవర్‌కి చెందిన భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. గుర్తు తెలియని దుండగలు అతడిపై కాల్పులు జరిపినట్లు సౌత్ వాంకోవర్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు ఈస్ట్ 55 అవెన్యూ నుంచి తమకు సమాచరం వచ్చిందని చెప్పారు. బాధితుడు చిరాగ్ ఆంటిల్(24)గా గుర్తించారు అధికారులు. వాంకోవర్ పోలీసులు ఇంకా అనుమానితులని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. అగంతకుల ఆచూకీకై దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలిపారు. బాధితుడి సోదరుడు రోనిత్ ఉదయం చిరాగ్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను మాట్లాడానని చెప్పాడు. అయితే అతడు ఆడి కారు తీసుకుని ఎక్కడకో వెళ్లాడు. అప్పుడే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదనగా చెప్పాడు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ విషాదకర ఘటనపై తక్షణమే స్పందించి.. దర్యాప్తు వేగంవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయాలని ఎక్స్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు చౌదరి. కాగా, చిరాగ్ కుటుంబం అతడి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక చిరాగ్ యాంటిల్ సెప్టెంబరు 2022లో వాంకోవర్‌కి వచ్చారు. అతను ఇటీవలే యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేసి వర్క్ పర్మిట్ పొందాడని అన్నారు. (చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!..!) -
'ఓ నాన్న ప్రేమ'..! దూరమైన కూతుర్ని ఏకంగా ఏఐ సాంకేతికతో..!
ఏఐ సాంకేతికత చాలా విప్లవాత్మకంగా దూసుకుపోతుంది. ఈ ఏఐ సంకేతికతో దూరమైపోయిన మన కుటుంబికులను మన కళ్లముందు ఉండేలా డిజటల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. ఆయా వ్యక్తుల దూరమయ్యరనే బాధను పోగొట్టి శాంతిని చేకూరుస్తుంది. ఇలా కూడా ఉపయోగపడుతుందా? అనేలా కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి ఆవిష్కరణే ఓ తండ్రి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ 'తండ్రి ప్రేమ' ఎంతటి సాహస కృత్యమైనా చేయిస్తుందనేందుకు నిదర్శనగా నిలిచాడు ఈ 'నాన్న'! తైవాన్ నటుడు, గాయకుడు టినో బావో తనకు దూరమైన 22 ఏళ్ల కూతురు రూపాన్ని, గాత్రాన్ని కుత్రిమ మేధ ఏఐ సాంకేతికతో రూపొందించాడు. తన భార్యకు గర్భసోకాన్ని తీర్చాడు. చెప్పాలంటే ఆమెకు ఒక కొత్త ఆశను కల్పించాడు. తన కూతురు ఎక్కడికో వెళ్లిపోలేదు ఇక్కడే ఉందనే చిన్ని ఆశను రేకెత్తించాడు. ఈ 56 ఏళ్ల నటుడు టినో బావో తన కుమార్తె బావో రాంగ్ డిజిటల్ వెర్షన్ వీడియో క్లిప్‌ని నెట్టింట విడుదల చేశాడు. అందులో ఆమె తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..ఐ మిస్ యూ డాడ్ అండ్ మామ్ అంటున్న మాటాలు వినిపిస్తాయి. అందులో ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇది చూసి ఆమె తల్లి చాలా భావోద్వేగానికి గురవ్వుతుంది. పైగా అచ్చం మన కూతురు బావో రాంగ్‌లా ఉందేంటీ అని ఉద్వేగంగా తన భర్త బావోని అడుగుతుంది. దానికి నటుడు బావో అది మన కూతురే కాబట్టి అని సమాధానమిస్తాడు. నిజానికి ఈ జంట కూతురు పోయిన దుఃఖంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఏదైనా మాట్లాడితే కూతురు లేదనే విషయం గుర్తొచ్చి బాధపడాల్సి వస్తుందని మాట్లాడుకోవడమే మానేశారు ఆ దంపతులు. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ డిజటల్ కుమార్తె వాళ్లిద్దర్నీ మళ్లీ తిరిగి మాట్లాడుకునేలా చేసింది. ఈ మేరకు బావో మాట్లాడుతూ.."నా కూతురు 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త వ్యాధితో మరణించింది. నా కూతురు చివరి రోజుల్లో ట్రాచల్ ఇంట్యూబేషన్ కారణంగా గొంతును కూడా కోల్పోయింది. ఆమె చనిపోయేంత వరకు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ ఘటనే తనను కూతురుని కళ్లముందు ఉండేలా చేయడం ఎల? అనే ఆలోచనకు తెరతీసింది. అదే అతడిని ఈ కృత్రిమ మేధస్సు ఏఐని అధ్యయనం చేసేందుకు దారితీసింది. తన ఏకైక బిడ్డను డిజిటల్‌గా పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఇంతటి ఆవేదన మధ్య ఏఐలో పీహెచ్డీ చేశాను. ఆ తర్వాత నా కుమార్తెను డిజటల్‌గా రూపొందించేందుకు సూపర్ బ్రెయిన్ అనే మెయిన్‌ల్యాండ్ కంపెనీ బృందంలో పనిచేశాను. అయితే కుమార్తె చిత్రాన్ని డిజిటల్‌గా రూపొందించడంలో ఇబ్బంది లేదు ఎందుకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. కేవలం ఆమె వాయిస్‌ని రూపొందించేందుకే శ్రమ పడ్డాను. ఎందుకంటే..? ఆమె ఆ వ్యాధి కారణంగా గొంతును కోల్పోయింది. దీంతో నా కూతురు ఆఖరి ఘడియల వరకు మాతో ఏం మాట్లాడలేకపోయింది. అందువల్ల నా కుమార్తె తన తల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మూడు ఆంగ్ల వాక్యాలను మాత్రమే ఉపయోగించి వాయిస్‌ని క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ డిజటల్ కుమార్తె వీడియో క్లిప్. ఇది నన్ను నా భార్యను మళ్లీ దగ్గరకు చేసింది. ఈ ఐఏ సాంకేతికతో మా కూతుర్ని మళ్లీ పొందేలా చేసింది. కొంత ఉపశమనం కలిగించింది." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు బావో. అయితే బావోకి కూతురంటే ఎంత ప్రేమంటే..ఆమెకు బావో జుట్టుని ముట్టుకోవడం ఇష్టం అందుకని ఆమె తాకిన జుట్టుని అలానే ఉంచాలన్న ఉద్దేశ్యంతో కత్తిరించుకోవడం మానేశాడు. అలాగే ఆమె మరణించిన తర్వాత ఆమె శరీరంలోని ఎముకను కూతురు గుర్తుగా మెడలో గొలుసుగా వేసుకున్నాడు. ప్రేమ ఎంతటి ఘనకార్యాన్నైనా చేయిస్తుందనడానికి ఈ నాన్న ప్రేమే ఉదహారణ కదూ!. (చదవండి: నో స్మోకింగ్ డే ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహార పదార్థాలివే!) -
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ!
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ! -
9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. సినిమా ట్విస్టులు!
2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఆర్ఫన్’ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఒక జంట.. తమ మూడవ సంతానం మృతి చెందిన నేపధ్యంలో రష్యాకు చెందిన ఒక చిన్నారిని దత్తత తీసుకుంటారు. ఈ సినిమాలోని కథనం ప్రకారం ఆ చిన్నారి 9 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టగానే క్రూరంగా ప్రవర్తిస్తూ తన అన్నదమ్ములను, తల్లిదండ్రులను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇది ఒక కథ. అయితే అమెరికాకు చెందిన ఒక జంటకు ఇటువంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆమె చిన్నపిల్ల కాదు.. క్రిస్టీన్ బార్నెట్(45) ఆమె మాజీ భర్త మైఖేల్ బార్నెట్(43)లు తాము దత్తత తీసుకున్న 9 ఏళ్ల నటాలియా గ్రేస్‌ను అమెరికాలోని ఇండియానాలో వదిలివేసి, వారు కెనడా పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ దంపతులకు తాము దత్తత తీసుకున్న నటాలియా చిన్నపిల్ల కాదని యువతి అని, చిన్నపిల్లలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నదని బయటపడింది. మరగుజ్జు లోపంతో.. ఉక్రెయిన్‌లో జన్మించిన నటాలియా గ్రేస్‌ను 2010లో వీరు దత్తత తీసుకున్నారు. అప్పుడు నటాలియాకు 6 ఏళ్ల అని అనాథాశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఆమె బర్త్ సర్టిఫికెట్ మీద కూడా అదేవిధంగా ఉంది. మరుగుజ్జు లోపంతో బాధపడుతున్న నటాలియా మూడు అడుగుల ఎత్తు మాత్రమే వుంది. ఆమెను కొంతకాలం సంరక్షించిన మైఖేల్, క్రిస్టీన్ దంపతులు తరువాత ఆమెను వదిలిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల రిపోర్టులో నటాలియా నడవలేని స్థితిలో ఉన్నదని దానిలో పేర్కొన్నారు. ‘9 ఏళ్లు కాదు.. 22 ఏళ్లు’ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్రిస్టీనా మాట్లాడుతూ తాము ఒక మోసగాడు చేసిన వంచనకు బలయ్యామని పేర్కొంది. దత్తత తీసుకున్న చిన్నారిని తాము విడిచిపెట్టే సమయానికి ఆమెకు 9 ఏళ్లు కాదని, 22 ఏళ్ల యువతి అని తెలిసిందన్నారు. తాము ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో నటాలియా కత్తి తీసుకుని వచ్చి తమను బెదిరించేదని, కాఫీలో బ్లీచ్ కలిపేదని తెలిపారు. ఇంటిలోని విలువైన వస్తువులను పగులగొట్టేదని ఆరోపించారు. నటాలియా రాత్రి వేళ్లల్లో ఇలా ప్రవర్తిస్తుండటంతో తాము నిద్ర పోలేకపోయేవారమని క్రిస్టీనా తెలిపింది. తాము తాగే కాఫీలో నటాలియా బ్లీచ్, విండెక్స్ మొదలైనవాటిని కలపడాన్ని చూశామని పేర్కొంది. ఆ సమయంలో తాను ఇలా ఎందుకు చేస్తున్నవని నటాలియాను అడిగితే ‘మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నానని’ చెప్పిందన్నారు. మీడియా ఆరోపణలపై దంపతుల కలత నటాలియా విషయంలో తాము దుర్మార్గంగా ప్రవరిస్తున్నామని మీడియా ఆరోపిస్తున్నదని, దానిలో నిజం లేదని క్రిస్టీనా తెలిపింది. నటాలియా చిన్న పిల్ల కాదు.. యవతి అని, ఆమెకు పీరియడ్స్ కూడా వస్తుంటాయని, అయితే శారీరకంగా ఎదుగుదల లేకుండా చిన్నపిల్ల మాదిరిగానే కనిపిస్తున్నదని, ఆమె మరుగుజ్జు మనిషి అని క్రిస్టీనా పేర్కొంది. వైద్యులకు నటాలియాను చూపించగా, ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతున్నదని, ఆమెను చిన్న పిల్లగా భావించకూడదని స్పషం చేశారని తెలిపింది. నటాలియాకు అద్దె ఇంటిలో సౌకర్యాలు.. ఈ నేపధ్యంలో తాము నటాలియా విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నామని, తాము కెనడా వెళ్లిపోయే ముందు ఆమె ఉండేందుకు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడాది రెంట్ కూడా ముందే చెల్లించామని తెలిపారు. ఆహారం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆమె ఎదిగిన వయసు కలిగినదనే భావనతో ఆక్కడే ఉంచామన్నారు. అయితే 2013లో నటాలియా ఉన్నట్టుండి మాయమయ్యింది. ఫోను కూడా చేయడం మానివేసిందని క్రిస్టీనా తెలిపారు. తాజాగా నటాలియా తన కొత్త తండ్రితో ఇండియాలోని వాల్‌మార్ట్ పార్కింగ్ లాట్ బయట ఫైర్వర్క్స్ టెంట్లో పని చేస్తూ కనిపించింది. నటాలియా మీడియాకు కనిపించడంతో ఆమె ఉదంతం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఇది కూడా చదవండి: అది అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే.. -
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!
మొన్నటివరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు జూన్ వచ్చిందంటే చాలు హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే?.. ఋతుపవనాలు మారి ఒక్కసారిగా తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి. వర్షాకాలం అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం కానీ ఇది వ్యాధులు ముసురుకునే కాలం. అంతేగాదు మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో జలబు, దగ్గు, గొంతులో కఫం, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడతారు. దీనికి తోడు దోమల బెడద కూడా ఎక్కువ అవ్వడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు అవకాశాలు అక్కువ. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరూ ఆయా వ్యాధుల బారిని పడుతుంటారు. అలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి ఔషధాలు తయారు చేసుకుని సులభంగా ఆయా వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 👉ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్ల ఉండకూదు 👉దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి 👉నిండుగా దుస్తులు ధరించండి. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి 👉తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి 👉పచ్చికాయగూరలు తినొద్దు 👉మరిగించి చల్లార్చిన నీటిని తాగండి ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కషాయం తయారు చేసే విధానం: ధనియాలు: రెండు స్పూన్లు లవంగ-4 యాలుకలు-2 దాల్చిన చెక్క-అంగుళం ముక్క మిరియాలు-8 జీలకర్ర-అరస్పూన్ అల్లం లేదా శోంఠి: అర అంగుళం ముక్క తయారీ విధానం: పైన చెప్పిన వాటిని అన్నింటిని దంచుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుండి. కాచిన నీటిలో ఈ పొడిని చిటికెడు వేసుకుని, ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా నిమ్మరసం కలుపుకుని పరగడపున తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. మీరు కూడా ఓసారి దీన్ని ట్రై చేసి చూడండి. (చదవండి: ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు) -
కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందించిన టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అండగా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మల్యాల-బలవంతాపూర్ స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ నేపధ్యంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కరకొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను ఇటీవల యూబీఐకి మార్చింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు, రూపే కార్డు కింద మరో రూ.10లక్షలను యూబీఐ అందజేస్తోంది. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల డిపో కండక్టర్ బొల్లం సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మంగళవారం బస్‌భవన్‌లో అందజేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవీలత సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెక్కులను అందజేసిన అనంతరం సజ్జనర్ మాట్లాడుతూ.. తన తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో సత్తయ్య అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికె తమ సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు. కుటుంబపోషణలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్‌కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్ కుమార్, యూబీఐ జనరల్ మేనేజర్ పి.క్రిష్ణణ్, రీజినల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ జి.వి.మురళీ కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధాప్య పెన్షన్..ఆరా తీస్తే..
పల్నాడు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధ్యాప్య ఫించన్ ఇస్తున్నారంటూ విమర్శుల వెల్లువెత్తాయి. చాలా ఏళ్ల క్రితం తండ్రి చనిపోతే..అతడి పెన్షన్‌కి ఆశపడి ప్రభుత్వాని మోసం చేస్తున్న కొడుకు ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చనిపోయని వ్యక్తి బతికున్నట్లు నమ్మించి 12 ఏళ్లుగా ఫించన్ తీసుకుంటున్నాడు మృతుడు పారా కిరీటి కుమారుడు సారయ్య. 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకుంటున్నట్లు మృతుడి బంధువులు జాయింట కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అతను 2011లో తన మామ చనిపోతే..అతడిని తండ్రిగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఫించన్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు ఫించన్ మంజూరు చేసేశారు. దీంతో అతడు ధర్జాగా గత 144 నెలలుగా మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును పారా సౌరయ్య కాజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు. (చదవండి: సత్తా చాటిన గుంటూరు జిల్లా ఎడ్లు) -
షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం.. కారణం ఇదే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్లో హసన్పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు. చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత -
షాకింగ్.. మనిషి మెదడును తినేసే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం..
సియోల్: దక్షిణ కొరియాలో 'నాయ్‌గ్లేరియా ఫాలెరీ' తొలి మరణం నమోదైంది. ఈ వ్యాధి సోకి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీన్నే 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని కూడా పిలుస్తారు. డిసెంబర్ 10న థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి(50) ఆ మరునాడే ఆస్పత్రిలో చేరాడని, గత మంగళవారం చనిపోయాడని అధికారులు వివరించారు. దేశంలో ఇదే తొలి కేసు అని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారి వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా కొరియాలోనూ వెలుగుచూసింది. చదవండి: కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్.. -
అయ్యో.. ఉరి తప్పింది కానీ చావు తప్పలేదు!
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఓ యువకుడి పాలిట ఉరి తప్పిందనుకుంటే మృత్యువు మరో రూపంలో వచ్చింది. చెట్టుపై ఉరివేసుకుని కొన ఊపిరితో ఉన్న యువకుడిని కిందికి దించుతుండగా జారి పడి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొత్తకొండ బీరయ్య(35) మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత ఉరివేసుకుని చచ్చిపోతానంటూ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు ఎక్కాడు. జనాలు గుమిగూడటంతో...ఎవరైనా చెట్టెక్కితే పైనుంచి దూకుతానంటూ బెదిరించాడు. భార్య, పిల్లలు, గ్రామ సర్పంచ్, బంధువులు అతడిని దిగమని అడిగినా పట్టించుకోలేదు. అంతలోనే చెట్టుకి ఉరి వేసుకున్నాడు. కొనప్రాణం ఉండటంతో గమనించిన గ్రామస్తులు చెట్టు ఎక్కి కిందికి దించుతుండగా జారి నేలపై పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అయి మృతి చెందాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
పదో తరగతి విద్యార్థిని మృతి.. ఆస్పత్రి ముట్టడి
సాక్షి, చెన్నై(అన్నానగర్): మన్నడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పదో తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్టు ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయార్ పేట ఎంపీటీ కాలనీకి చెందిన రమేష్ చెన్నై పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య వసంతి, కుమార్తె నందిని (15) ఉన్నారు. కుమార్తె నందిని తండయార్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రమేష్, వసంతి దంపతులకు నందిని ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. ఈ స్థితిలో నందినికి కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని మన్నడి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నందిని బుధవారం సాయంత్రం చికిత్స ఫలించక మృతి చెందింది. ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కూతురి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందంటూ నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిని ముట్టడించి డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. -
రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించేందుకు ఏపీ సర్కార్ కార్యాచరణ
రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించాయి. ప్రధానంగా ప్రమాదం సంభవించిన వెంటనే కీలకమైన గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స/అత్యవసర చికిత్సను వెంటనే అందించేలా పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, కాలేజీ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ప్రణాళికను ఆమోదించాయి. త్వరలో పైలట్ ప్రాజెక్టును అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. మృతుల సంఖ్య సగానికి తగ్గింపే లక్ష్యం 2021లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2020తో పోలిస్తే ఇది 18.8% అధికం. అలాగే, 2021లో జరిగిన ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 38 మంది మరణించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, వాటిల్లో మృతుల సంఖ్య తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. 2024నాటికి మృతుల సంఖ్యను కనీసం 50 శాతం తగ్గించడం, 2030 నాటికి ఎవరూ మృతిచెందకుండా చూడటం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు.. రోడ్డు ప్రమాదం సంభవించిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకు వారికి వైద్య సహాయం అందడంలేదన్నది వాస్తవం. ఎందుకంటే.. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రయత్నించేవారు కేసుల దర్యాప్తులో భాగంగా పోలీస్స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయం వారిని వేధిస్తోంది.. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ విధానాన్ని తీసుకొచ్చింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే వారిని ప్రోత్సహించి నగదు బహుమతులు ప్రకటించింది. పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలోగా ప్రథమ చికిత్స/అత్యవసర చికిత్స అందించడం మరో కీలక అంశం. అందుకే వివిధ వర్గాలకు ఈ చికిత్స అందించడంలో శిక్షణనివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. శిక్షణ కార్యక్రమం ఇలా.. ►పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులతోపాటు ఆసక్తి ఉన్న వారికి కూడా శిక్షణనిస్తారు. ►ప్రథమ/అత్యవసర చికిత్సకు సంబంధించిన అంశాల్లో ఆఫ్‌లైన్, ఆన్లైన్లలో శిక్షణనివ్వాలని నిర్ణయించారు. ►శిక్షణ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిమ్యులేటర్లను నెలకొల్పుతుంది. ►అందులో క్షతగాత్రుల గుండె కొట్టుకునేలా చేసేందుకు కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) అందించడంతోపాటు వైద్యులు నిర్దేశించిన ఇతర విధానాలపై శిక్షణనిస్తారు. ►పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులకు బ్యాచుల వారీగా తర్ఫీదునిస్తారు. ►గాయాలను పరిశీలించడం, ఊపిరి ఆడుతోందీ లేనిదీ పరీక్షించడం, గొంతు, నోటిలో ఏమైనా అడ్డంపడ్డాయేమోనని పరిశీలించడం, మెడ/వెన్నెముక గాయాలైతే క్షతగాత్రులను కదపకుండా చూడటం, క్షతగాత్రుల శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించడం, క్షతగాత్రులకు వెంటనే తాగునీరుగానీ ఆహారంగానీ అందించకుండా చూడటం, గాయాలకు ప్రథమ చికిత్స అందించడం, రక్తస్రావాన్ని నిరోధించడం, ఇతరుల సహాయంతో ఆసుపత్రికి ఎలా తరలించాలి.. మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు. ►ఒక్కో బ్యాచ్‌కు మూడ్రోజులపాటు శిక్షణనివ్వాలని భావిస్తున్నారు. అనంతరం సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ►అనంతరం ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తారు. -
సిరిసిల్ల టౌన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి మృతి
సాక్షి, సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని ఒబులాపూర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి 28 ఆగస్టు 1990న కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులతో ఎస్సై స్థాయికి ఎదిగారు. వేములవాడ ఆర్అండ్ఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో భార్య విజయతో ఉంటున్నారు. ఆయన రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైగా పని చేశారు. 2019లో ఎస్సైగా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. 8 నెలల క్రితం బదిలీపై డీపీవో కార్యాలయానికి వచ్చారు. ఉపేందర్‌రెడ్డి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల అవి ఎక్కువవడంతో పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు జరిపించారు. ఎస్సై మృతికి ఎస్పీ రాహుల్‌హెగ్డే సంతాపం ప్రకటించారు. -
Bheemeshwari- Naveen: కన్నీరు పెట్టిస్తున్న ప్రేమకథ
సాక్షి, నారాయణపేట: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పేదరికం వెంటాడుతున్నా ఇరు కుటుంబాలకు దూరంగా వెళ్లి బతుకు బండిని సాగిస్తున్నారు. అంతలోనే విధి వక్రీకరించింది. ఓ పాపకు జన్మనివ్వగానే ఆ తల్లి కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేని భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టిన పసిబిడ్డ అనాధ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. నారాయణ పేట జిల్లా మఖ్తల్‌కు చెందిన నవీన్, అదే గ్రామానికి చెందిన భీమేశ్వరి ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్తే వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా భీమేశ్వరి 2021 మేలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి రెండు నెలలకే నవీన్‌కుమార్‌తో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉంటున్నారు. ఆగస్టు 18న భీమేశ్వరి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు రాత్రి ఓ పాపకు జన్మనిచ్చిన భీమేశ్వరి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సంజీవయ్య పార్కు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన పసిబిడ్డ అనాధగా మారింది. చదవండి: (కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం) -
ఐదు మృతదేహాలు లభ్యం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. శుక్రవారం పూడిమడక తీరానికి వెళ్లిన 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్యకుమార్ (19) మృతదేహం శుక్రవారమే లభ్యమైంది. మునగపాకకు చెందిన ఎస్.తేజ విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది. గల్లంతైన ఐదుగురి కోసం శనివారం తెల్లవారుజాము నుంచి నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మెరైన్ పోలీసులు గాలించారు. తిరిగివస్తారన్న తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తూ యర్రవరం తీరప్రాంతం, తంతడి బీచ్ వద్ద అందరూ విగతజీవులుగా లభ్యమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. గాలింపు చర్యల్లో నేవీకి చెందిన 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక హెలికాప్టర్ పాల్గొన్నాయి. పూడిమడక తీరంలో గాలిస్తున్న నేవీ హెలికాప్టర్ మృతుల వివరాలు: గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్‌కుమార్ (18), విశాఖకి చెందిన కంపర జగదీష్ (19), అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన సుర్ల జశ్వంత్‌కుమార్ (19), మునగపాకకు చెందిన పెంటకోట గణేష్ (19), యలమంచిలికి చెందిన పూడి రామచందు (19). -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి
బాసర/సంగెం: అనారోగ్యం కారణంగా సుమారు నెల కిందట ఇంటికి వెళ్లిన బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన శాబోతు సంజయ్ కిరణ్ (18) కొంతకాలంగా కాలేయ, జీర్ణవ్యవస్థ (ప్యాంక్రియాటైటిస్) సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. జూన్ 20న కడుపునొప్పి వస్తోందని.. అన్నం తింటే వాంతులు అవుతున్నాయని చెప్పి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని తల్లిదండ్రులు వరంగల్, హనుమకొండల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈ నెల 16న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. సంజయ్ వైద్యం కోసం సుమారు రూ.16 లక్షలు వెచ్చించారు. అయినా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంజయ్ మృతిచెందాడు. అయితే తమ కుమారుడి అనారోగ్యానికి బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనే కారణమని మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్ ఆరోపించారు. ఈ ఆరోపణను వర్సిటీ అధికారులు ఖండించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు విద్యార్థి తమ కళాశాలలోనే లేడని పేర్కొన్నారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మృతి
సాక్షి, కోనసీమ జిల్లా : పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి (68) గురువారం తెల్లవారుజామున అమలాపురం ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్‌మన్‌గా పనిచేసిన నారాయణమూర్తి 1996లో జరిగిన నగరం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది 1999 వరకూ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి చెందారు. 2014లో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొంది 2019 వరకు సేవలు అందించారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రవికుమార్, నలుగురు కుమార్తెలున్నారు. పులపర్తి పార్థివదేహానికి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళులు అర్పించారు. ముంగండ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని) -
ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..
సాక్షి, పుంగనూరు (చిత్తూరు): ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పెళ్లి అయి మూడు నెలలు కూడా కాకుండానే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. పుంగనూరు పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సుధాకర్‌రెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.తేజవిష్ణువర్ధన్‌రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ లావణ్యతో వివాహం జరిగింది. ఆషాడమాసం రావడంతో లావణ్య గత వారం పుట్టింటికి వెళ్లింది. తేజవిష్ణువర్ధన్ రెడ్డికి ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసే అలవాటు. శనివారం ఉదయం సైక్లింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తండ్రి సుధాకర్‌రెడ్డి వెంటనే డాక్టర్ చైతన్యతేజారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వచ్చి పరిశీలించి గుండెపోటుతో మృతిచెందినట్టు ధ్రువీకరించారు. భర్త మృతి విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఆషాడం పూర్తికాగానే తిరుమల దర్శనం చేసుకుని హనీమూన్‌కు వెళ్లేందుకు నూతన జంట ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే తేజవిష్ణువర్ధన్‌రెడ్డి మృతిచెందడంతో స్థానికులు కంటతడి పెట్టారు. చదవండి: (Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ) యువకులు జాగ్రత్తలు పాటించాలి వ్యాయామం ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. జిమ్‌లకు వెళ్లేవారు ముందుగా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ల సూచనల మేరకు వ్యాయామం చేయాలి. గుండెపై ఒత్తిడి తీవ్రం కావడం ద్వారా గుండెపోటుకు గురై క్షణాల్లోనే ప్రాణాలు కొల్పోతారు. – డాక్టర్ చైతన్యతేజారెడ్డి, ప్రముఖ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ -
మూడురోజులు ముప్పుతిప్పలు.. ఎలుగుబంటి అనూహ్య మృతి!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి ప్రాణాలు కోల్పోయింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే అస్వస్థతకు గురయిన ఎలుగుబంటి రెస్య్కూ సెంటర్లో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఎలుగుబంటి మృతిపై కారణాలు తెలియాల్సి ఉందని జూ అధికారులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆదివారం కిడిసింగిలో జీడి రైతు కోదండరావుపై దాడిచేసి ప్రాణాలు తీసిన ఈ ఎలుగుబంటి సోమవారం ఆరుగురిని గాయపరచడంతో ఉద్దానమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం) -
శ్రీకాకుళం జిల్లాలో భయబ్రాంతులకు గురిచేసిన ఎలుగుబంటి మృతి
-
డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు
రాయదుర్గం: డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు. ఆ సమయంలోనూ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించాడు. ఓ వైపున నొప్పి గుండెను మెలిపెడుతున్నప్పటికీ పంటి బిగువన బాధను భరిస్తూనే బస్సును నియంత్రించాడు. 40 మంది ప్రయాణికులను కాపాడి.. తాను మాత్రం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కండక్టర్ హరినాథ్ తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన ఇస్మాయిల్ (56) స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఏపీ 02 జెడ్ 4341 నంబరు గల బస్సును తీసుకుని రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలోని డి.హీరేహాళ్ మండలం సోమలాపురం వద్దకు రాగానే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలైంది. నీళ్లు తాగి సముదాయించుకుని బస్సును అలాగే ముందుకు నడిపాడు. కొంత సేపటికే నొప్పి మరింత తీవ్రమైంది. వేగంగా వెళుతున్న బస్సును నియంత్రించి రోడ్డు ప్రక్కగా నిలిపాడు. ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే డ్రైవర్ ఇస్మాయిల్‌ను సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాత్ర మింగిన కొద్దిసేపటికే ఇస్మాయిల్ మృతి చెందాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి దేవుడిలా తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు పేర్కొన్నారు. -
ఈతకు వెళ్లి నలుగురు బాలల మృత్యువాత
అక్కచెరువుపాలెం (కొండపి, జరుగుమల్లి)/రణస్థలం: ఈత సరదా నలుగురు బాలల ప్రాణాలను బలిగొంది. ఈతకొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చింతల కౌషిక్ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి భగవాన్ నారాయణ (11) శనివారం అక్కంచెరువుపాలెంలోని ఓ భవనం వద్ద ఆడుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామానికి తూర్పున ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా చెరువులో కౌషిక్, సుబ్రహ్మణ్యం, శివాజీ, హరిభగవాన్ నారాయణ దిగారు. ఈతకొడుతున్నట్లుగా ముందుకు పోయారు. వారి తర్వాత చందనశ్రీ,, చందనలు సైతం చెరువులోకి దిగారు. చెరువులో ముందుకెళ్లిన బాలురు లోతులో మునుగుతూ భయంతో కేకలు వేశారు. బాలికలు సైతం మునిగిపోతూ కేకలు వేయటం ప్రారంభించారు. చెరువుకు కూతవేటు దూరంలో చేలో పని చేసుకుంటున్న ప్రసాద్ విషయం గమనించి.. పరుగున చెరువులోకి దిగి ఒడ్డుకు దగ్గరలో ఉన్న బాలికలను రక్షించి బయటకు తీశాడు. ఈతరాని ప్రసాద్ అప్పటికే అలసి కేకలు వేయడంతో గ్రామస్తులు చెరువు వద్దకు పరుగున వచ్చారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి బాలురను బయటకు తీయగా అప్పటికే చింతల కౌషిక్, మున్నంగి శివాజీ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మద్దినేని సుబ్రహ్మణ్యం, అబ్బూరి హరి భగవాన్ నారాయణను కారులో కందుకూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన చందనశ్రీ,, చందన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. సముద్రంలో ముగ్గురు గల్లంతు కాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేట సముద్ర తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలానికి చెందిన తిరుపతి గణేష్ శనివారం తన మేనకోడలు దీవెనను తీసుకుని అత్తవారింటికి వచ్చారు. సాయంత్రం పోతయ్యపేట సముద్ర తీరానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. అందరూ స్నానాలు చేస్తుండగా గణేష్‌తోపాటు ఆయన కుమార్తె మానస (9), మేనకోడలు దీవెన (18) ఒక్కసారిగా గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు పడవలపై వెళ్లి గాలించినా ఫలితం కనిపించలేదు. గాలింపు చర్యలను ఎస్ఐ జి.రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. -
మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’
దేవరుప్పుల/బయ్యారం: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి కామారెడ్డిగూడెంలో కన్నుమూసిన విశ్రాంత ఉపాధ్యాయుడు, టీఆర్ఎస్ మండల నేత బిల్లా సోమిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి వరకు మాస్టారి పాడె మోసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. సోమిరెడ్డి భౌతికకాయాన్ని మంత్రి మంగళవారం సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. తాను పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి రాజకీయ సూచనలు, సలహాలు అందజేసిన మాస్టారు సేవలు మరువలేనివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పంచాయతీలకు బాకీ లేదు: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు సర్పంచులను రెచ్చగొడుతున్నారన్నారు. కరోనా మూలంగా మూడేళ్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయని మాట వాస్తవమేనన్నా రు. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. చదవండి: (పలుమార్లు లైంగిక దాడి.. వారం రోజుల క్రితం) -
Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం
క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. గత రాత్రి టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్ మరణించాడు. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. 2003, 2007 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఐసీసీ, ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆడమ్ గ్రిల్‌కిస్ట్, గిల్లెస్పీ, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Think of your most loyal, fun, loving friend who would do anything for you. That’s Roy. 💔😞 — Adam Gilchrist (@gilly381) May 15, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 'కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణించారని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మేము మైదానంలోనూ బయట మంచి సంబంధాన్ని పంచుకున్నాము. వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 ఆస్ట్రేలియా క్రికెట్ మరో అత్యుత్తమైన ఆటగాడని కోల్పోయింది. రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్రపోషించిన క్వీన్స్ ల్యాండర్ సైమండ్స్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ విషాద సమయంలో సైమండ్స్ కుటుంబానికి క్రికెట్ ఆస్ట్రేలియా, స్నేహితులు, సన్నిహితులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 దిగ్గజ క్రికెటర్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ కూడా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం అంటూ ట్వీట్ చేశారు. Horrendous news to wake up to. Utterly devastated. We are all gonna miss you mate.☹️ #RIPRoy — Jason Gillespie 🌱 (@dizzy259) May 14, 2022 చదవండి: (క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి) Deeply saddened by the passing of Andrew Symonds. 💔#RIPRoy pic.twitter.com/qFYbJI2V8y — Mumbai Indians (@mipaltan) May 15, 2022 ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల భారత క్రికెటర్ విరాట్ కోహ్లి సంతాపం వ్యక్తం చేశాడు. ఈ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కోహ్లి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించే శక్తిని సైమండ్స్ కుటుంబ సభ్యులకు దేవుడు అందివ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపాడు. Shocking and saddening to hear of Andrew Symonds passing. May his soul RIP and God give strength to his family in this difficult moment. 🙏🏻 — Virat Kohli (@imVkohli) May 15, 2022 -
పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఎన్నో అనుమానాలు..
పెళ్లంటే తాళాలు, తప్పట్లు, పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడుముళ్లు, బంధువుల సందడి ..ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, పెళ్లి ఇంట సందడే సందడి. ఘనంగా వేడుకకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరేం జరిగిందో...వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. ఆ సందడంతా క్షణకాలంలో చెదిరిపోయింది. బంధువులంతా షాక్ నుంచి తేరుకోలేదు..ఏమైందో ఒకటే ఆందోళన...ఆస్పత్రిలో చేర్పించారు. రాత్రంతా చికిత్స అందించారు. గురువారం ఉదయం నవ వధువు మృతి చెందింది. ఆమె మృతి వెనుక ఎన్నో అనుమానాలు...ఎన్నో సందేహాలు..పెళ్లింట సమాధానం చెప్పలేని ప్రశ్నలు... సాక్షి, మధురవాడ (భీమిలి): మధురవాడ కళానగర్‌కు చెందిన టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, హైదరాబాదు చందానగర్ పాపిరెడ్డి కాలనీ, ఆర్జీకే కాలనీ బ్లాక్ నెంబరు.58 జీఎఫ్ 6లో నివాసం ఉంటున్న ముంజేటి సాయి సృజన (22)కు వివాహం నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం ఈ నెల 7న మధురవాడలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఇందులో భాగంగా 8వ తేదీన ప్రదానం పూర్తయ్యింది. అదే రోజు సాయంత్రం సంగీత్ కూడా జరిపించారు. వధువు రుతుక్రమం నుంచి తప్పించడానికి 5వ తేదీ నుంచి 10 వరకు మాత్రలు వాడింది. బుధవారం ఉదయం 7 గంటలు సమయంలో వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. దీంతో వైద్యం నిమిత్తం వెంకోజీపాలెంలోని అమ్మ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకు వచ్చారు. అదే రోజు 4గంటలకు ఇంటి వద్దనే కాళ్ల గోరు సంబరం, పెళ్లి కూతురుగా అలంకరణ, ఇతర కార్యక్రమాలు కూడా జరిపించారు. 9.45 గంటలకు మధురవాడ కళానగర్‌లోని శివాజీ ఇంటి సమీపంలోని వివాహ వేదిక వద్దకు తీసుకు వచ్చి పెళ్లి తంతు ప్రారంభించారు. యువతి బ్యాగులో లభ్యమైన గన్నేరు పప్పు మాదిరిగా ఉన్న తొక్కలు మరి కొద్ది సయంలో వేద మంత్రాలు నడుమ తాళి బొట్టు కడతాడనుకునే క్రమంలో రాత్రి 10.10 గంటలకు వధువు కుప్పకూలిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి మొదట తరలించారు. పరిస్థితి మెరుగవుతుందని భావించి మళ్లీ 2 గంటలకు కూడా మరో ముహూర్తం ఖరారు చేసి వధువు కోసం పెళ్లి మండపం వద్ద బంధువులు వేచి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వధువు పరిస్థితి విషమించడంతో ఇండస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందిందని వైద్యులు సమాచారం ఇచ్చినట్టు మధురవాడ జోన్(విశాఖ నార్త్ జోన్) ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు చెప్పారు. గుర్తు తెలియని విషపదార్థం తీసుకోవడం వల్ల మృతిచెందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే మృతికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. మృతురాలి తండ్రి ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు బీకాం పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. వధువు సృజన కుటుంబం శ్రీకాకుళం జిల్లా జలుమూరు నుంచి ఉపాది నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈశ్వరరావు ట్రెడెంట్ లైఫ్ కెమికల్స్ కంపెనీలో మెయింటినెన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలి బ్యాగులో గన్నేరు తొక్కలు వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమయ్యాయి. గన్నేరు పప్పు తిని ఉంటుందా? మరేమన్న కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..) -
ప్రాణాలు తీసిన ఈత సరదా
హయత్‌నగర్: ఈత నేర్చుకునేందుకు బావిలో దిగిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్కే నగర్‌కు చెందిన మోదుగుల పరశురాం, మోదుగుల నర్సింహ అన్నదమ్ములు. వృత్తిపరంగా వీరిద్దరూ డ్రైవర్లు. ఇద్దరికీ ఇద్దరు చొప్పున కుమారులున్నారు. నర్సింహ చిన్న కొడుకు దుర్గాప్రసాద్ (12) తట్టి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పరశురాం కొడుకు శ్రీకాంత్ (15) అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం నర్సింహ పెద్ద కొడుకు రాఘవేందర్‌తో కలిసి చిన్న కొడుకు దుర్గాప్రసాద్, పరశురాం కొడుకు శ్రీకాంత్‌లు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లిద్దరూ నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని పసిగట్టి బావిలోనే ఉన్న రాఘవేందర్ కేకలు వేయడంతో సమీపంలోనే పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు హుటాహుటిన వచ్చి దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లను నీటిలోంచి బయటికి తీశారు. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే వీరిద్దరూ మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మొదటి రోజునే దుర్ఘటన జరగడం విద్యార్థుల కుటుంబ సభ్యులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. -
అంతులేని విషాదం: దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి..
ఆరు నెలల పసిప్రాయంలోనే కూతురు చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని కన్నవారు ఎన్నో కలలు కన్నారు. అమ్మానాన్నల ఆశలను ఆవిరి చేస్తూ తనయుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. సాక్షి, అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం కాట్నగల్లుకు చెందిన కొక్కల శ్యామలమ్మ, నారాయణ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు సంతానం. ఆరు నెలల వయసులోనే కుమార్తె మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు జగదీష్ (25)ను బాగా చదివించారు. గత రెండేళ్ల నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. రెండు నెలల నుంచి వారు తమ కుమారుడిని ఓ ఇంటివాడిని చేయాలని భావించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ ఐదు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. జ్వరం తగ్గుముఖం పట్టడంతో ఇంటికి వచ్చేశారు. కాగా గురువారం మళ్లీ జ్వరం వచ్చి స్పృహ కోల్పోవడంతో వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అప్పటికే యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కళ్లెదుటే చెట్టంత కొడుకు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చదవండి👉🏾 (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
సీపీఐ నారాయణకు సతీ వియోగం
సాక్షి, అమరావతి/నగరి: సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సతీమణి వసుమతిదేవి (65) ఆకస్మిక మృతి చెందారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసుమతిదేవి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. 1976లో తిరుపతి మహిళా వర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న సమయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1986లో వర్కింగ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్‌లో చిత్తూరు జిల్లా శాఖకు నాయకత్వం వహించారు. నారాయణతో వివాహం తర్వాత ఆయన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, ఆమె కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సహకరించారు. ఆమె మృతి వార్తతో నగరి నియోజకవర్గంలోని స్వగ్రామం ఐనంబాకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు వసుమతి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. ఆమె మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి అనీరాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి రామానాయుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్ తదితరులు నారాయణను ఫోన్లో పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. గవర్నర్, సీఎం సంతాపం వసుమతిదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకురాలిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసిన వసుమతి బ్యాంక్ ఉద్యోగిగా సేవలు అందించి స్వచ్చంద పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ మీడియా రంగంలోనూ వసుమతి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని గవర్నర్ తెలిపారు. ► సీపీఐ నాయకుడు కె.నారాయణ సతీమణి వసుమతి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ► వేరొక ప్రకటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. -
Software Engineer: మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తానమ్మా అని చెప్పి..
సాక్షి, కర్నూలు(కొలిమిగుండ్ల): యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాపరాతి గని గుంతలో నీట మునిగి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాలి మల్లిఖార్జునరెడ్డి, నాగలక్ష్మి దంపతులకు కుమారుడు మహేంద్రరెడ్డి(23), కూతురు కల్పన సంతానం. బీటెక్ పూర్తి చేసిన మహేంద్రకు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వర్క్‌ఫ్రం హోంలో భాగంగా ఇంటి వద్దే విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రికి బైక్ యాక్సిడెంట్ కావడంతో ఉద్యోగ బాధ్యతలతో పాటు నాపరాతి గని పనులు, ట్రాక్టర్ల నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మీర్జాపురం సమీపంలోని గనుల వద్దకు వెళ్లాడు. గనిలో వర్షపు నీళ్లు కొద్ది రోజుల నుంచి నిల్వ ఉండటంతో వాటిని బయటకు తోడేందుకు కూలీల సాయంతో విద్యుత్ మోటర్‌ను సిద్ధం చేశాడు. తర్వాత దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు వేసేందుకు ట్రాక్టర్లో వెళ్లారు. తిరిగి విద్యుత్ మోటర్ వద్దకు వచ్చేటప్పుడు అదే ట్రాక్టర్లో రాకుండా నీటిలో ఈదుకుంటూ వస్తానని కూలీలకు చెప్పి గనిలో దిగాడు. చదవండి: (మూడు ముళ్లకు వేళాయె!.. నేటి నుంచి జూన్ 23 వరకు శుభ దినాలే) సుమారు 40 మీటర్ల మేర గనిలో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. అందులో ఈదుకుంటు వచ్చే సమయంలో నీటిలోనే మునిగిపోయాడు. గమనించిన కార్మికులు నీళ్లలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మూడు గంటల తర్వాత చెర్లోపల్లె, ఇటిక్యాల, కొలిమిగుండ్లకు చెందిన ముగ్గురు యువకులు అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి మృతదేహం చూసిన తల్లి నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికొస్తానమ్మా అని చెప్పి తిరిగిరానిలోకాలకు వెళ్లావా నాయనా అంటూ బోరున విలపించారు. -
‘నాన్న మరణం కంటే తాగుబోతు అనే మాటే ఎక్కువ బాధిస్తోంది’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన పైడేటి సత్యనారాయణ (73)ది సారా మరణం అంటూ తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడాన్ని అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తమ తండ్రి మరణం కన్నా సారా తాగి చనిపోయారన్న ప్రచారం తమను ఎక్కువ బాధిస్తోందని, బయటకు రావాలన్నా ఇబ్బందిగా ఉందని, దయచేసి దుష్ప్రచారం ఆపి తమను వదిలేయాలని వారు వేడుకున్నారు. మృతుడు సత్యనారాయణ కుమారుడు మహేశ్వర శ్రీనివాస్, కుమార్తె నాగమణి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రికి కాఫీ అలవాటు కూడా లేదని, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కరోజు కూడా ఆయన మద్యం సేవించలేదని చెప్పారు. అలాంటి తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరించి, తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తమ తండ్రికి బీపీతో పాటు ఆయాసం ఉందని చెప్పారు. ఈ నెల ఆరో తేదీ తెల్లవారుజామున ఆయాసం ఎక్కువగా రావడంతో బుట్టాయగూడెం క్లస్టర్ ఆస్పత్రికి తీసుకువెళ్లామని, అక్కడ సెలైన్లు పెట్టిన రెండు గంటల తర్వాత తిరిగి ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. మధ్యాహ్న సమయంలో తీవ్రమైన దగ్గు, ఆయాసం వచ్చి మృతిచెందారని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో దహన సంస్కారాల అనంతరం ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి తమ తండ్రి సారా తాగి మరణించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని దయచేసి ఇకనుంచైనా ఆపేయాలని, తమను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరారు. అసలేం జరిగిందంటే... పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పైడేటి సత్యనారాయణ 40 ఏళ్లుగా కిళ్లీ షాపు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరో తేదీన హైబీపీ రావడం, ఆస్తమా ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లోనే మృతి చెందారు. మధ్యాహ్నం దాటిన తరువాత మృతి చెందడంతో బుట్టాయగూడెంలో అంత్యక్రియలు నిర్వహించడానికి వసతులు లేక మానవత అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనంలో జంగారెడ్డిగూడెం శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. దీంతో ఇది సారా మరణమంటూ విష ప్రచారానికి తెర తీశారు. ఎక్కడెక్కడినుంచో ఎవరో ఫోన్లు చేసి మీ తండ్రి సారా తాగి చనిపోయారు కదా ఇబ్బంది పడవద్దు మేము చూసుకుంటామని మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో మానసికంగా వ్యధ చెందిన ఆ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ఇలాంటి శవరాజకీయాలు చేస్తోందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
చింతకొమ్మదిన్నె: ఆ కూలీలు శ్రమచేసి ఇంటికొచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఇంటిముందు చెట్టుకింద కూర్చున్నారు. వాహనం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యాభర్త, అక్కాచెల్లెళ్లను విగత జీవులుగా మార్చింది. వైఎస్సార్ జిల్లా మద్దిమడుగు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె ఎస్ఐ ఎం.మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమడుగు గ్రామానికి చెందిన గుర్రంకొండ కొండయ్య (35), అతడి భార్య అమ్ములు (28), అదే గ్రామానికి చెందిన చాపల దేవి (28) సమీపంలో చేపట్టిన ఉపాధి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని ముగించుకుని గ్రామానికి చేరుకున్నారు. ఎండనపడి వచ్చినందున కొండయ్య ఇంటిముందు గల చెట్టు కింద కాసేపు సేదతీరదామని మంచంపై కూర్చున్నారు. చాపల దేవి సోదరి చిన్నమండెం మండలం కేశాపురానికి చెందిన మండ్ల లక్ష్మీదేవి (42) వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకుంది. ఇంతలోనే కడప–రాయచోటి ప్రధాన రహదారి మీదుగా రాయచోటి వైపు వెళ్తున్న జాతీయ రహదారుల శాఖకు చెందిన బొలెరో వాహనం వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో కొండయ్య, అతడి భార్య అమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చాపల దేవి, ఆమె అక్క లక్ష్మీదేవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నారులు అబ్దుల్, ధనుష్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ హరిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్ నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. మద్యం మత్తే ప్రాణాలు తీసింది బొలెరో డ్రైవర్ హరిబాబు మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఆర్టీవో శాంతకుమారి, బ్రేక్ ఇన్స్పెక్టర్ దినేష్, హైవే పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు. మృతులు కొండయ్య, అమ్ములు దంపతుల కుమార్తె నందిని పదో తరగతి, కుమారుడు శ్రీకాంత్ నాలుగో తరగతి చదువుతున్నారు. దేవి భర్త వెంకటయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు శ్రీతేజు 4, కుమార్తె వైష్ణవి 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మీదేవి భర్తతో వేరుపడి ఉంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. -
Hyderabad: కృష్ణానగర్‌లో దారుణం.. బౌలింగ్ సరిగా వేయలేదని..
సాక్షి, హైదరాబాద్: కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. స్థానిక సాయికృప పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థుల మధ్య వివాదం జరిగి ఘర్షణ పడ్డారు. తరగతి గదిలో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ సరిగా వేయడం లేదంటూ నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకిరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) -
నీట మునిగి ఏడుగురు మృత్యువాత
పెదపూడి/అడ్డతీగల/వినుకొండ/వెంకటగిరి రూరల్: తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు దుర్ఘటనల్లో నీట మునిగి ఏడుగురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపరలో శివరాత్రి సందర్భంగా ఇద్దరు యువకులు కాలువలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునిగి మృతి చెందారు. కరప గ్రామానికి చెందిన పేపకాయల అజయ్ (19), గొల్లపల్లి యశ్వంత్ (20) శహపురానికి చెందిన కరెడ్ల మణికంఠ స్నేహితులు. ఈ ముగ్గురూ మరికొందరితో కలిసి ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపాన గల తుల్యభాగ నదీపాయ కాలువలో మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రవాహ ఉధృతికి అజయ్, యశ్వంత్ నీట మునగ్గా.. మణికంఠ అదృష్టవశాత్తూ పైకి తేలి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు కాలువలోకి దూకి కొనఊపిరితో ఉన్న యశ్వంత్‌ను బయటకు తీసి పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే యశ్వంత్ మృతి చెందగా.. మరికొంత సేపటికి అజయ్ మృతదేహం బయటపడినట్లు పెదపూడి ఎస్ఐ పి.వాసు తెలిపారు. ఇలా ఉండగా, అడ్డతీగల శివారున మద్దిగెడ్డ జలాశయం ప్రధాన పంట కాలువలో పడి మరో ఇద్దరు మృతి చెందారు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బవురువాక గ్రామానికి చెందిన చెదల కల్యాణ్రామిరెడ్డి, 8వ తరగతి విద్యార్థి జనుమూరి సాయిరామ్ వీరేంద్రరెడ్డి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, శివరాత్రి సందర్భంగా దైవదర్శనం చేసుకునేందుకు వెళ్లిన మాతంగి ప్రతాప్ (16), సర్వేపల్లి బాలాజీ (12) తెలుగు గంగ కాలువలో పడి గల్లంతయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట దళితవాడకు చెందిన మాతంగి ప్రతాప్ ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు, అదే ప్రాంతానికి చెందిన సర్వేపల్లి బాలాజీ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. శివరాత్రి సందర్భంగా బంగారుపేట సమీపంలో ఉన్న జంగాలపల్లి వీరభద్రయ్యస్వామి ఆలయానికని మంగళవారం ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. ఆలయ సమీపంలోని తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వద్ద కాలువలో ఈత కొట్టేందుకు దిగి నీటి ఉధృతికి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు చీకటి పడే వరకు గాలించినా ఫలితం దక్కలేదు. పండుగపూట విషాద ఘటనలు చోటుచేసుకోవడంతో ఆ కుటుంబాల్లో అంతులేని శోకం మిగిలింది. సరదాగా గడిపేందుకు వచ్చి.. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో స్నానానికి దిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వినుకొండకు చెందిన డ్రైవర్ మున్నీరు ఇంట్లో శుభకార్యానికి నరసరావుపేటకు చెందిన బంధువులు ఫైజుల్లాఖాన్, విజయవాడకు చెందిన ఆయేషా వచ్చారు. వీరితో కలిసి మున్నీరు కుటుంబం సరదాగా గుండ్లకమ్మ నది వద్దకు వెళ్లింది. అందరూ బ్రిడ్జి కింద కూర్చుని ఉండగా మున్నీరు కుమార్తె హీనా (19)తోపాటు ఎస్కే ఫైజుల్లాఖాన్ (17), ఆయేషా (19) స్నానానికని నదిలోకి దిగారు. లోతు అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ మునిగిపోయి మృత్యువాత పడ్డారు. వినుకొండ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఉక్రెయిన్‌లో తనయుడి వేదన.. టీవీ చూస్తూ ఆగిన తల్లి గుండె!
సాక్షి, చెన్నై: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో తన కుమారుడు పడుతున్న కష్టాల్ని చూసిన వేలూరుకు చెందిన ఓ తల్లి గుండె ఆగింది. వీడియో కాల్ ద్వారా తల్లి మృతదేహాన్ని చూసుకుని ఆ తనయుడు తీవ్ర వేదనలో మునిగిపోయాడు. వివరాలు.. ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడు లు అక్కడి ప్రజల్ని తీవ్ర కలవరంలోకి నెట్టింది. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని వలసలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తమిళ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. స్వదేశానికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగే కొద్ది ఆ విద్యార్థుల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆవేదన పెరి గింది. తమ పిల్లల్ని త్వరితగతిన భారత్‌కు తీసుకురావాలని సోమవారం కూడా పలు జిల్లాల కలెక్టర్లకు వారు విజ్ఞప్తి చేశారు. తిరుపత్తూరుకు చెందిన 11 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా తమ కష్టాలను తెలియజేశారు. ఆహారం, నీళ్లు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం మరో 23 మంది తమిళ విద్యార్థులు చెన్నైకు చేరడం కాస్త ఊరట కలిగించింది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసి ఆనందం వ్యక్తం చేసినా, ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులందరినీ తీసుకు రావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. చదవండి: (ఉక్రెయిన్ పెయిన్: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి) తనయుడి కష్టం చూడలేక.. వేలూరు జిల్లా పెర్నాంబట్టు సమీపంలోని కొత్తూరు గ్రామ పరిధిలో ఉన్న పత్తూరు ప్రాంతానికి చెందిన శంకరన్ రైతు. ఆయనకు భార్య శశికళ(52), ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శక్తి వేల్ ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి శక్తి వేల్ పడుతున్న కష్టం, ఆవేదనను వీడియో కాల్ ద్వారా చూసిన తల్లి శశికళ తీవ్ర ఆందోళకు గురైంది. అలాగే, టీవీలో వచ్చే ఉక్రెయిన్ సంబంధించిన వార్తలను చూస్తూ, తనకుమారుడ్ని తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి టీవీ చూస్తూ తీవ్ర ఉద్వేగానికిలోనై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లి కడచూపు కూడా శక్తివేల్ నోచుకోలేకపోతున్నాడు. వీడియో కాల్ ద్వారా తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించినా, అతడ్ని ఓదార్చేందుకు అక్కడ ఎవ్వరూ లేకపోవడం మరింత వేదన కలిగిస్తోంది. -
పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..
యశవంతపుర (బెంగళూరు): టూత్‌పేస్ట్ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్రూమ్ వెళ్లిన శ్రావ్య టూత్ పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..) -
నితీశ్ రాణే లొంగుబాటు
ముంబై: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణె కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణె బుధవారం సాయంత్రం సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో జిల్లాకోర్టు ఆయనను జ్యూడీషియల్ కస్టడీకి పంపించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరట్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నితేష్ రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో వాదించాల్సి ఉందని తెలిపారు. అంతకుముందే బోంబే హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. కోర్టులో రాణె లొంగిపోతానని, విచారణకు సహకరిస్తానని ఒప్పుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. నితేశ్ రాణేకు కోర్టులో చుక్కెదురు బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణెకు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. అరెస్టుకు ముందు బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తును మంగళవారం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో నితేష్ రాణె అరెస్టు విషయం ఆయన మెడపై వేలాడుతున్న కత్తిలా తయారైంది. డిసెంబరు 18న సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల ప్రచార సభలో శివసేన కార్యకర్త సంతోష్ పరబ్‌పై దాడి జరిగింది. ఈ దాడి ఘటన వెనుక నితేష్ రాణెతోపాటు ఆయన సహచరుడు గోట్యా సావంత్ హస్తముందని ఆరోపిస్తూ స్థానిక కణకావ్లీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే రాణే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని స్థానిక కణకావ్లీ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సివిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించా రు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టునే ఆశ్రయిం చాలని సలహా ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పిస్తూ పది రోజుల వరకు అరెస్టు చేయవద్దని కూడా ఆదేశించింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే జనవరి 31నాటి విచారణలో నితేష్ రాణె తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌షిండే, ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రదీప్ ఘరత్ ఈ అంశంపై వాదనలు విన్పించారు. తీర్పు మంగళవారం మధ్యాహ్నం వెల్లడిస్తామని చెప్పి వాయిదా వేశారు. వాదోపవాదాల అనంతరం నితేష్ రాణె బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చారు. -
తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
చేపల పెంపకం కోసం డజన్ల కొద్దీ తాబేళ్లకు విషం ఇచ్చి... చివరకు
ముంబై: ముంబైకి సమీపంలోని సరస్సులో డజన్ల కొద్దీ తాబేళ్లను మృతి చెందాయి. అంతేకాదు తాబేళ్ల మరణానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన విషమే కారణమని వన్యప్రాణుల నిపుణులు తెలిపారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్ నగరంలోని సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ స్థానిక రాజకీయ నాయకుడు ఫిర్యాదు మేరకు వైల్డ్ యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఆ సరస్సులో సుమారు 57 ఫ్లాప్షెల్ తాబేళ్లు చనిపోయాయని, కాగా ఆరు తాబేళ్లను రక్షించినట్లు యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందానికి చెందిన సుహాస్ పవార్ చెప్పారు. ఈ మేరకు సుహాస్ పవార్ మాట్లాడుతూ..."గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్-19 ఆంక్షల కారణంగా తాబేళ్లు అధిక సంఖ్యలో పెరిగి ఉండవచ్చు. పైగా సరస్సులో కొంతమంది చేపల పెంపకం సాగిస్తున్నారు. అయితే ఇవి చేపలను తిని అధిక సంఖ్యలో పెరిగాయన్న కోపంతో స్థానికులే ఉద్దేశపూర్వకంగా విషం ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈ తాబేళ్లు అరుదైనవి కావు గానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతి" అని చెప్పారు. (చదవండి: 120 ఏళ్ల వృక్షానికి 24 గంటల కాపలా!!) -
ఆ కాలేజీకి వెళ్లను.. అంతలోనే విషాదం.. తమ్ముడిని చూసి ఒక్కసారిగా..
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): కళాశాలకు వెళ్లనన్న తనయుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. వెంగారెడ్డికండ్రిగ దళితవాడకు చెందిన కొమ్మల మునివెంకటయ్య, ధనమ్మ దంపతులకు కుమార్తె షాలిని, కుమారుడు యశ్వంత్ ఉన్నారు. షాలిని నర్సింగ్ చేస్తుండగా యశ్వంత్ తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ )ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన యశ్వంత్ ఈ నెల 24 నుంచి కళాశాలకు హాజరు కావాల్సి ఉంది. చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో.. తాను ఆ కళాశాలకు వెళ్లేదిలేదని మొండికేశాడు. అయితే ఇప్పటికే ఫీజు చెల్లించేశామని, ఆ కళాశాలకే వెళ్లాలని శనివారం ఉదయం తల్లిదండ్రులు మందలించారు. తరువాత ఉద్యోగరీత్యా వారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని అపాచీ పరిశ్రమకు వెళ్లారు. అక్క షాలినితో కలసి యశ్వంత్ ఇంటిలోనే ఉన్నాడు. అయితే ఉదయం అక్క పొలం వద్దకు వెళ్లిన సమయంలో యశ్వంత్(16) ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. 10గంటల సమయంలో ఇంటికి వచ్చిన షాలిని, ఉరేసుకున్న తమ్ముడిని చూసి ఒక్కసారిగా కేకలు పెట్టింది. స్థానికులు గుమికూడి 108కు సమాచారమివ్వడంతో, వారు సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. -
పాపం ఏమైందో.. వివాహిత ఆత్మహత్య
మొగల్తూరు(పశ్చిమగోదావరి): గొంతేరు డ్రెయిన్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు గ్రామంలో జరిగింది. ఎస్సై ఆర్.మల్లిఖార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని దిగాలుగా ఉండేది. మూడు నెలల క్రితం అశ్వినికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహమైంది. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. ఇటీవల సంక్రాంతి పండుగకు కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్దరాత్రి మోటార్‌సైకిల్‌పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్‌ఫోన్‌ను అక్కడ వదిలేసి డ్రెయిన్‌లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద మోటార్‌సైకిల్ గుర్తించి డ్రెయిన్‌లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పుట్టిన రోజున విషాదం.. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా..
యశవంతపుర (బెంగళూరు): ఓ వైపు చదువుకుంటూ..మరో వైపు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉన్న యువతి తన పుట్టిన రోజే దుర్మరణం చెందింది. ఈ విషాద ఘటన హెబ్బాళ సంచార పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. హెబ్బాళ భద్రప్ప లేఔట్‌కు చెందిన మహశ్రీ..మల్లేశ్వరం ప్రభుత్వ కాలేజీలో చదువుతూ ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. శుక్రవారం పుట్టిన రోజు కావడంతో స్నేహితుడితో కలిసి బైకుపై వెళ్తుండగా భద్రప్పలేఔట్ వంతెన వద్ద అదుపు తప్పి కింద పడింది. ఆమెతలపై క్యాంటర్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. హెబ్బాళ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) -
పెళ్లి చూపులు ఇష్టం లేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పెళ్లి చూపులు ఇష్టం లేక ఓ యువతి సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..కొలిమిగుండ్లకు చెందిన కొప్పురపు శ్రీనివాసులు, భారతి దంపతుల కుమార్తె వైష్ణవి(26) అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్యం పల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. చదవండి: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు.. అనారోగ్య కారణంతో ఈనెల 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సెలవు పెట్టుకొని ఇంటి వద్దే ఉంటోంది. పెళ్లి చూపులు చూసేందుకు రెండు మూడు రోజుల్లో వస్తున్నారని కుమార్తెకు తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లి చూపులు ఇష్టం లేని వైష్ణవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ హరినాథరెడ్డి చెప్పారు. -
ప్రాణం తీసిన చైనా మాంజా.. మంచిర్యాలలో విషాదం
సాక్షి, మంచిర్యాల: సంక్రాంతిపూట గాలిపటాల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో యువతి.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా 20 ఏళ్ల యువతి గొంతు కోయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయినిలోని మాధవ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. -
పాపం ఆ ప్రేమజంట.. ఆనందంగా గడిపి.. అంతలోనే..
తాడిమర్రి(అనంతపురం జిల్లా): దాడితోట గ్రామ సమీపాన చిత్రావతి నదిలో శుక్రవారం సాయంత్రం ప్రేమజంట గల్లంతయ్యింది. ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం మండలం చదళ్ల గ్రామానికి చెందిన ఎర్రి నాగప్ప, నాగేశమ్మ దంపతుల మూడో కుమారుడు అమర్నాథ్ (22) అనంతపురం, తాడిపత్రిలో సెంట్రింగ్ పనులు చేస్తుండేవాడు. అతనితో పాటు సెంట్రింగ్ పనులు చేస్తున్న దాడితోటకు చెందిన పశురాంతో పరిచయమైంది. ఈ క్రమంలో అనంతపురం నగరంలోని ప్రకాష్ రోడ్డుకు చెందిన ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న రామాంజినమ్మ (20)తో అమర్నాథ్కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చదవండి: కన్నతల్లి ఉన్మాదం.. దేవుడు ఆవహిస్తున్నాడని.. వేటకొడవలితో ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం ఉదయం దాడితోటలోని పరుశురామ్ ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులుగా సీబీఆర్‌లో ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నదిలో నీటిని చూడటానికి ముగ్గురూ కలసి చిత్రావతిలోకి వెళ్లారు. అక్కడ నీటిని చూస్తూ సెల్ఫీలు.. తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో నీరు తాగడానికని రామాంజినమ్మ నదిలోకి వెళ్లింది. నీరు తాగుతున్నపుడు కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అమర్నాథ్ రక్షించేందుకు దూకాడు. ఇద్దరు భయాందోళనకు గురై ఒకరిని ఒకరు పట్టుకుని నీటి ఉధృతిలో కనిపించకుండాపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. ముందుగా సీబీఆర్ నుంచి వస్తున్న నీటిని బంద్ చేయించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
బిహార్‌లో ముగ్గురు తెలంగాణ యువకుల మృతి
సాక్షి, మహబూబ్‌నగర్(భూత్పూర్): వారం రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన ముగ్గురు గిరిజన యువకులు సోమవారం రాత్రి బిహార్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మిఠ్యాతండాకు చెందిన వెంకటేష్(22), గుబ్బడితండాకు చెందినవినోద్ (20), సంతోష్(22).. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నారు. వీరు పది రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ‘మేం ఎక్కడుంటే మీకెందుకు..’ అంటూ ఫోన్ కట్ చేసేవారు. దీంతో కొన్ని రోజులకు వారే తిరిగి వస్తారని కుటుంబసభ్యులు అనుకున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ రాజధాని పాట్నాలోని పీఎంసీహెచ్ (పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్)లో తీవ్ర అస్వస్థతతో చేరిన వెంకటేష్, వినోద్, సంతోష్‌లు అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. ఆస్పత్రికి చెందిన వైద్యులు మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని నంబర్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉంటున్న వారి బంధువు పాండుకు వీడియో కాల్ చేసి సమాచారం అందించారు. మృతదేహాలను చూసి గుర్తించిన పాండు.. విషయం తండాలోని తమ బంధువులకు చేరవేశారు. చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’) మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. కల్తీ మద్యం తాగడం వల్ల మృతిచెందినట్లు సమాచారం. వినోద్ తండ్రి స్థానికంగా పెయింటింగ్ కూలీగా పనిచేస్తుండగా.. మిగిలిన ఇద్దరి తండ్రులు కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. మృతుల కుటుంబాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యువకులు మృతి చెందడానికి గల కారణాలు తెలియదని ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. చిన్నతనంలో తండ్రి మృతి.. సంతోష్ చిన్నతనంలోనే తండ్రి కిషన్‌నాయక్ మృతిచెందగా తల్లి దివ్యాంగురాలు కావడంతో మేనమామ సాదు గుబ్బడితండాలో చిన్నపాటి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. పదో తరగతి వరకు చదివిన సంతోష్, నక్కలబండతండాకు చెందిన శంకర్ వద్ద టైల్స్ వేసేందుకు కూలీగా వెళ్తుండేవాడు. డిసెంబర్ 31న మధ్యాహ్నం గుబ్బడితండాలో ఉన్నాడు. అదేరోజు నుంచి కనిపించడం లేదని, ఇంట్లో తల్లి హస్లీకి చెప్పకుండా వెళ్లాడు. ఉన్న ఒక కుమారుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న తల్లి హస్లీ రోదన పలువురి తండావాసులను కంటతడి పెట్టించాయి. – హస్లీబాయి, గుబ్బడితండా కూలీ పని చేస్తూ జీవనం.. గుబ్బడితండాకు చెందిన లలిత, లాలుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు వెంకటేష్‌కు వివాహం కాగా హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తండాలో ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండగా ఇద్దరు కుమార్తెలు, కుమారుడు వినోద్‌తో కలిసి భూత్పూర్లోని బీసీకాలనీలో ఇల్లు అద్దె తీసుకొని ఉంటున్నారు. రెండో కుమారుడు వినోద్ మధ్యలోనే చదువు ఆపేసి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఐదురోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. వినోద్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని వాపోయారు. –లాలూ, గుబ్బడితండా చెప్పకుండానే వెళ్లిపోయాడు నా భర్త చనిపోవడంతో కూలీ పనిచేస్తూ వెంకటేష్‌ను పోషిస్తున్నా. భూత్పూర్లోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. 25 రోజుల క్రితం తండాలో జరిపిన పోచమ్మ పండగకు వచ్చి 20 రోజుల క్రితం చెప్పకుండా పోయాడు. తరుచూ వెళ్లి అక్కడకక్కడ తిరిగి వచ్చేవాడు. మళ్లీ వస్తాడని అనుకున్నా. మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడుంటే నీకెందుకు వస్తాలే అన్నాడు. అంతలో చనిపోయాడని తెలిసింది. ఎట్లా చనిపోయాడో నాకు తెలియదు. –రుక్కి -
కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కన్నబిడ్డలను హత్య చేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామ్‌కుమార్ తాజాగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మంగళవారం ఉదయం రామ్‌కుమార్ భార్య, భర్తల మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. శిరిష తన బంగారాన్ని తీసుకురావాలని భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆవేశంతో ఊగిపోయిన రామ్‌కుమార్ భార్యపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లి బావిలో పడేశాడు. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని, పిల్లలిద్దరిని బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో రామ్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయి మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: (విషాదం: ఇద్దరు పిల్లలను బావిలో పడేసిన తండ్రి!) -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి
న్యూయార్క్:అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ వెస్ట్ బ్రోంక్స్‌లోని 19 అంతస్తుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులతో పాటు 19 మంది మృతి చెందారు. 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్పందిస్తూ.. గత 30 ఏళ్లలో నగరంలో అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదమని తెలిపారు. అపార్టుమెంట్‌లోని ప్రతి అంతస్తులోనూ బాధితులు ఉన్నారని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది. చెలరేగిన దట్టమైన పొగ పీల్చడం వల్ల చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. చదవండి: డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్ -
వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..
సాక్షి, గోపాల్పేట (వనపర్తి): నాలుగు నెలల ఆ గర్భిణి, కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కాలం గడుపుతుండగా వాటర్ హీటర్ రూపంలో మృత్యువు గర్భిణిని కబళించింది. ఈ విషాదకర సంఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నవీద్ తెలిపిన వివరాలిలా.. బుద్దారానికి చెందిన అంజన్నమ్మ, తిరుపతిగౌడ్ కూతురు రవిసుధ (22)ను మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ జీవితం సంతోషంగా సాగుతోంది. వారికి ఇప్పటికే 14నెలల బాబు ఉండగా.. ప్రస్తుతం రవిసుధ నాలుగు నెలల గర్భిణి. ఈక్రమంలో రోజులానే ఇంట్లో శనివారం నీరు వేడి చేసేందుకు నీటితో నిండిన బకెట్లో హీటర్‌ను ఉంచారు. అదే సమయంలో ఇల్లు శుభ్రం చేస్తున్న రవిసుధ చెయ్యి అనుకోకుండా హీటర్ ఉంచిన బకెట్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. చదవండి: (చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!) భర్త నరేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రవిసుధ తల్లిదండ్రులు.. తమ కూతురు వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలన్న ఆశతో సొంత గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ, అనుకోని రీతిలో తమ కూతురు వారిని వీడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): పెంచుకున్న పొట్టేలే.. వెనక నుంచి బలంగా పొడవడంతో ఓ మహిళ చేపల చెరువులో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని యాక్తాపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు... యాక్తాపురానికి చెందిన బోయ చిట్టెమ్మ (40), భర్త రాముడు గత ఆరు నెలల నుంచి మూడు పొట్టేళ్లను పెంచుతున్నారు. రోజులానే శనివారం కూడా పొట్టేళ్లను గ్రామం నుంచి తిమ్మాపురం గ్రామ సమీపంలోని తన పొలం దగ్గరికి మేపేందుకు చిట్టెమ్మ తీసుకెళ్లింది. పొలం దగ్గరున్న చేపల చెరువు కట్టపై పొట్టేళ్లు మేస్తుండగా అకస్మాత్తుగా ఓ పొట్టేలు వెనుక నుంచి బలంగా చిట్టెమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె ఒక్కసారిగా చెరువు నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు నీటి నుంచి ఆమెను బయటికి తీయగా అప్పటికే మృతి చెందింది. ఇదిలాఉండగా, ఇదే పొట్టేలు 20 రోజుల క్రితం చిట్టెమ్మను, 10 రోజుల క్రితం భర్త రాముడిని పొడవడంతో గాయపడ్డారు. సరైన ధర వస్తే ఈ పొట్టేళ్లను విక్రయించాలని అనుకున్నా.. అంతలోనే యజమాని ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మెడికో.. ఎదురుగా వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడ మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్న ఎం.సాయిభార్గవ్(23) శుక్రవారం మధ్యాహ్నం 11.50సమయంలో స్కూటీపై కళాశాల నుంచి శ్రీనివాస కాలనీకి బయల్దేరాడు. మార్గమధ్యలో అప్పన్నపల్లి బ్రిడ్జి సమీపంలో మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న టాటా ఏస్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో సాయిభార్గవ్ తలకు తీవ్రమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు సాయి భార్గవ్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో అద్దెకు ఉంటూ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్నాడు. రోజు కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!) కొవ్వొత్తుల ప్రదర్శన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి భార్గవ్ ఆత్మకు శాంతి కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, డాక్టర్ రామకిషన్ పాల్గొన్నారు. -
సిద్ధూ.. ఒక్కసారి చూడు బాబూ..
వెంకటాచలం(నెల్లూరు జిల్లా): పెద్ద చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కన్న కొడుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు ఆదూరు శీనయ్య – అపర్ణ తల్లడిల్లిపోయారు. కందలపాడు సమీపంలో సాగునీటి కాలువలో ఈతకు వెళ్లి మృతిచెందిన మండలంలోని కనుపూరుకు చెందిన బీటెక్ విద్యార్థి ఆదూరు సిద్ధూ, తిరుపతికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పర్నా అనుదీప్ మృతదేహాలకు శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో అనుదీప్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లగా సిద్ధూ మృతదేహాన్ని బంధువులు శుక్రవారం 12 గంటలకు కనుపూరుకు తీసుకువచ్చారు. చదవండి: రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి.. గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు కనుపూరు గ్రామానికి చెందిన ఆదూరు శీనయ్య – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్ధూ బీటెక్ చదువుతుండగా, రెండో కుమారుడు హర్ష నెల్లూరు నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ తమ ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి వికటించి పెద్ద కుమారుడు సిద్ధూ మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. సిద్ధూ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల దుఃఖానికి అంతేలేదు. సిద్ధూ ఒక్కసారి నన్ను చూడు బాబూ.. అంటూ ఆ తల్లి పడిన ఆవేదన చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే కాకాణి పరామర్శ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆదూరు సిద్ధూ మృతిచెందాడని తెలియడంతో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం కనుపూరుకు వెళ్లి సిద్ధూ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. -
కరెంట్ షాక్‌తో నలుగురు కాలేజీ ఉద్యోగుల దుర్మరణం
సాక్షి, అమరావతి (మహారాష్ట్ర): ఇనుప నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు ఉద్యోగులు విద్యుదాఘాతంతో మరణించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మాజీ మంత్రి ప్రవీణ్ పోటే ఆధ్వర్యంలో నడుస్తున్న పోటే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రవేశద్వారం వద్ద బాధితులు పెయింట్ వేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెయింటింగ్ పనికోసం వారు ఉప యోగిస్తున్న ఇనుప నిచ్చెన ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ తీగకు తాకడంతో నలుగురికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రైవేట్ కళాశాల ఉద్యోగులు, అక్షయ్ సాహెబ్రావ్ సావర్కర్ (25), గోకుల్ శాలిక్రమ్‌జీ వాగ్ (28), ప్రశాంత్ సెల్లుకర్ (30), సంజయ్ దండనాయక్ (45)గా గుర్తించారు. చదవండి: (Hyderabad: విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రిన్సిపాల్ యత్నం) -
ఆరడుగుల తాచు పాము.. ప్రాణాలకు తెగించిన శునకం.. యజమాని వెళ్లి చూసేసరికి
నందిగామ: శునకాన్ని విశ్వాసానికి ప్రతీకగా చెప్తారు. పెంపుడు శునకాలు తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం త్యజించేందుకు వెనుకాడవు. అటువంటి ఘటనే కృష్ణాజిల్లా నందిగామలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తన యజమాని గెస్ట్ హౌస్‌లోకి ప్రవేశించిన తాచుపామును అడ్డుకునే క్రమంలో ఓ శునకం తన ప్రాణాలనే కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నందిగామకు చెందిన వ్యాపారి నర్వనేని మురళికి పట్టణ శివారులో ఓ గెస్ట్ హౌస్ ఉంది. చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే? అందులో ఒక ఆడ, ఒక మగ శునకాలు ఉన్నాయి. ఇవి రెండూ ఆరేళ్లుగా గెస్ట్ హౌస్‌కి కాపలా కాస్తున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయాక గెస్ట్ హౌస్‌లోకి దాదాపు ఆరడుగుల పొడవైన తాచు పాము ప్రవేశించింది. దానిని పసిగట్టిన మగ కుక్క కైజర్ పాముతో పోరాటానికి దిగింది. దానిని చంపేసింది. ఈ క్రమంలో పాము కాటుకు గురైన కైజర్ తానూ ప్రాణాలు విడిచింది. ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌కు వెళ్లిన యజమాని, అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. యజమాని కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన శునకాన్ని సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. -
స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే?
మండ్య(కర్ణాటక): యువతులు రెండు కార్లలో పోటాపోటీగా ప్రయాణిస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురైంది. మండ్య జిల్లా నాగమంగళ తాలూకాలోని కోణనూరు గేట్ వద్ద ఆదివారం ఉదయం కారు ప్రమాదంలో ఒక యువతి మరణించింది. మృతురాలు బెంగళూరు బాగలకుంటెకు చెందిన హెచ్‌టి. మంజుళాదేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తనుశ్రీ (21)గా గుర్తించారు. ఈమె మైసూరులో బీబీఎ చివరి ఏడాది చదువుతోంది. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటోంది. స్నేహితురాలి పుట్టినరోజు ఉండడంతో ఆదివారం ఉదయం 7.30 సమయంలో సొంత కారును డ్రైవింగ్ చేసుకుంటూ మైసూరుకు బయల్దేరింది. మధ్యలో ఇద్దరు స్నేహితురాళ్లు వారి కారులో వచ్చారు. ఇద్దరూ పోటీలు పడుతూ కార్లను వేగంగా నడుపుతూ వెళ్లారు. ఈ సమయంలో తనుశ్రీ కారు అదుపుతప్పి కోణనూరు దగ్గర వంతెన గోడను ఢీకొని సుమారు 50 అడుగుల దూరం పల్టీలు కొట్టింది. తనుశ్రీ తీవ్ర గాయాలతో అక్కడే కన్నుమూసింది. నాగమంగళ పోలీసులు కేసు నమోదు చేశారు. -
యూఎస్‌లో తొలి ఒమిక్రాన్ మరణం.. భయాందోళనలో ప్రజలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి రెండు వేవ్‌ల ప్రతాపానికి ప్రపంచదేశాలు అల్లాడిపోయాయి. ఈ జాబితాలో సంపన్న దేశాలు కూడా ఆర్థికం, ఆరోగ్యంగానూ పతనమైన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా ఈ వైరస్ పీడ నుంచి కాస్త ఉపశమనం లభించింది అనుకునేలోపే అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి మొదలైంది. తాజాగా అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్‌లో 50 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఒమిక్రాన్ సోకడంతో మరణించాడు. అయితే మృతుడు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని, దాని ప్రభావంతోనే వైరస్ దాడిని తట్టుకోలేక మృతి చందినట్లు తెలుస్తోందని హారిస్ కౌంటీ ఆరోగ్య విభాగం తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్‌లో 73 శాతం ఒమిక్రాన్ కేసులున్నట్లు నిర్థారణ అయినట్లు సీడీసీ తెలిపింది. వారం వ్యవధిలో 3 శాతం నుంచి వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగి ఈ స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ప్రధాన వేరియంట్‌గా ఉన్న డెల్టా రకం కేసులు తగ్గుముఖం పట్టాయని అయితే ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడం అక్కడి ప్రజలను వణికిస్తోంది. కేసులు కట్టడి చేయలేకపోతే వైద్య సేవలపై తీవ్ర భారం పడనుందని ఆరోగ్య శాఖ అవేదన వ్యక్తం చేసింది. అంతకుముందు డిసెంబరులో, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే బ్రిటన్‌లో మొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. కాగా ప్రస్తుతం బ్రిటన్‌లో 12 మరణాలు నమోదయ్యాయి. చదవండి: Flower Hair Style: కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదండి..కొప్పునే పువ్వులా దిద్దుకోవడం నయా స్టైల్.. -
భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్..
తణుకు(పశ్చిమగోదావరి): పట్టణానికి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పుష్పలత (21) శుక్రవారం మధ్యాహ్నం ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత, విజయవాడకు చెందిన సాయిబాలచందు ఈ ఏడాది జనవరి 9న ప్రేమవివాహం చేసుకున్నారు. చదవండి: నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి.. సోషల్ మీడియా యాప్‌లో పరిచయంతో వీరు వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలచందు అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. పుష్పలత గృహిణి. శుక్రవారం ఉదయం నుంచి భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన బాలచందు మరో గదిలో ఉండగా పడక గదిలో ఆమె ఉరేసుకుంది. అయితే ఘటనా స్థలంలో ఆనవాళ్లు ప్రకారం ఆమె ఉరేసుకున్నట్లుగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కె.గంగాధరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
హైదరాబాద్‌లో విషాదం: రేకులపై పడిన చెప్పును తీసుకోబోయి..
సాక్షి, హైదరాబాద్: ఇంటి పైకప్పు రేకులపై పడిన చెప్పును తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యలతలోని శాంతినగర్‌లో నివసించే రిచ్‌పాల్ కొడుకు రాహుల్ (18) జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాహుల్ చెప్పు తన ఇంటి మొదటి అంతస్తులోని రేకుల షెడ్డుపై పడింది. అల్యూమినియం రాడ్డుతో దానిని తీసేందుకు యత్నించగా అది పొరపాటున పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన రాహల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడ్ని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని.. -
ఏం జరిగిందో ఏమో.. 20 రోజుల్లో నలుగురి కన్నుమూత
పిఠాపురం: తక్కువ కాల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వరుస మరణాలతో తేరుకోలేకపోతోంది. కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ నిర్వాసిత కాలనీలోని కొల్లావారిపాకలులో కొల్ల సింహాచలం కుటుంబం నివసిస్తోంది. ఈమెకు ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు. ఉద్యోగ రీత్యా కొడుకు శ్రీను హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గత నెల 26న స్వగ్రామంలో బంధువుల ఇంట వివాహానికి వచ్చాడు. ఆ సమయంలో అతడి మేనల్లుడు కామేశ్వరరావు పచ్చ కామెర్ల బారిన పడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేనల్లుడి పెద్దకార్యం అయ్యాక వెళదామని శ్రీను ఉండిపోయాడు. ఈలోగా మనవడు కామేశ్వరరావు చనిపోయాడన్న దిగులుతో శ్రీను తల్లి సింహాచలం మంచం పట్టింది. మృతులు సింహాచలం, కొల్ల శ్రీను (ఫైల్) ఈ నెల 11న వాంతులు విరేచనాలు అవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడింది. మేనల్లుడు, తల్లి మృత్యువాత పడడం తట్టుకోలేక శ్రీను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతడు కూడా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ నెల 12న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. వరుస మరణాలతో కుంగిపోయిన కామేశ్వరరావు భార్య లోవకుమారి కూడా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు కూడా వాంతులు, విరోచనాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న చనిపోయింది. 20 రోజుల వ్యవధిలోనే నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అమ్మ, నాన్న కావాలంటూ దీనంగా చూస్తున్న మనోజ్ ఏం జరిగిందో.. నలుగురిలో ముగ్గురు వాంతులు, విరేచనాల లక్షణాలతోనే చనిపోయారు. అసలేం జరుగుతోందో.. ఎందుకిలా వరుస మరణాలు సంభవించాయో తెలియక ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నలుగురు చనిపోయినా గ్రామంలో స్థానిక అధికారులెవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కానీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది కానీ వచ్చి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటున్నారు. చనిపోయిన వారికి ఏవ్యాధి సోకిందనేది చర్చనీయాంశమైంది.వారి ఆలనాపాలన మాటేంటి..! కామేశ్వరరావు దంపతులు కన్నుమూయడంతో మనోజ్ ఒంటరి అయ్యాడు. అమ్మా నాన్న తప్ప మరో లోకం తెలియని రెండేళ్ల ఈ పసివాడిని చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మృతురాలు సింహాచలానికి నలుగురు కుమార్తెలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. మరో ఇద్దరు కుమార్తెలు రామలక్ష్మి, సూరీడు దివ్యాంగులు. వీరిది లేచి నడవలేని స్థితి. ఇన్నాళ్లూ తల్లి సింహాచలమే అన్నీ తానై సేవలు చేస్తూ పోషించింది. తల్లి సింహాచలం మృతి చెందడంతో అనాథలుగా మిగిలిపోయారు. -
బెంజ్ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి..
బనశంకరి(బెంగళూరు): వాయువేగంతో దూసుకువచ్చిన బెంజ్‌కారు అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం హలసూరు పరిధిలో జరిగింది. నందితా చౌదరి అనే మహిళ కారు నడుపుతూ అదుపుతప్పి వేగంగా జనాల మీదకు దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న రెండుకార్లు, ఆటో, టాటా ఏస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహంత (35) అనేవ్యక్తి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. బెంజ్ కారు కూడా నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. హలసూరు ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. మూడు రోజులుగా.. -
స్నేహితులతో కలిసి పిక్నిక్.. అక్కడ ఏం జరిగిందో శవమై తేలాడు
సాక్షి,బొబ్బిలి(విజయనగరం): మండలంలోని భోజరాజపురం వేగావతి నది దగ్గరకు పిక్నిక్ వెళ్లిన ఓ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. పట్టణంలోని ఐటీఐ కాలనీకి చెందిన డి.సంతోష్‌కుమార్ (16) స్నేహితులతో కలిసి పిక్నిక్ కు వెళ్లి నదీతీరంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. కాగా సంతోష్‌కుమార్ తండ్రి మధుసూదనరావు, బంధువులు మాట్లాడుతూ ఫిట్స్ వల్ల సంతోష్‌కుమార్ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు పాచిపెట: మండలంలోని చీపురువలస సమీపంలో ని పారమ్మకొండ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు పారమ్మకొండకు అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా ఆటో బ్రేకులు ఫెయిలవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ ఆటోను నియంత్రించే క్రమంలో ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వెంటనే 108 సహాయంతో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుల్లో నక్కాన అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ -
హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్ గుండె
సాక్షి, గాంధారి (కామారెడ్డి): గుండెపోటుకు గురైన ఓ రోగికి ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలో వైద్యుడు సైతం గుండెపోటుకు గురయ్యాడు. వైద్యం అందించేలోగానే తుదిశ్వాస విడిచాడు. దీంతో రోగిని అంబులెన్సులో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అతనూ మార్గమధ్యలోనే కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే... గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్గు (60) ఆదివారం ఉదయం గుండెనొప్పితో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధారి మండల కేంద్రంలోని ఎస్వీ శ్రీజ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని నడుపుతున్న డాక్టర్ డి. లక్ష్మణ్ (45) వెంటనే వైద్య సేవలు మొదలు పెట్టారు. రోగిని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే డాక్టర్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది వెంటనే సమీపంలో ఉన్న మరో ఆస్పత్రి వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం అందించే ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే మరణించారు. అదే సమయంలో రోగి జగ్గును అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అటు డాక్టర్, ఇటు రోగి నిమిషాల వ్యవధిలో మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ముందురోజు సరదాగా గడిపి.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ డి. లక్ష్మణ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య స్నేహలత, ఇద్దరు కుమార్తెలు దీక్షణి, దర్శణి ఉన్నారు. ఆరు నెలల క్రితం గాంధారి మండల కేంద్రంలో సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఎం.ఫార్మసీ చదివిన భార్య స్నేహలత ఆస్పత్రిలో మెడికల్ షాప్ చూసుకుంటున్నారు. ఆయన ఇటీవలే అయ్యప్ప మాల ధరించారు. శనివారం భార్య, పిల్లలతో స్థానికంగా ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సరదాగా గడిపి వచ్చిన డాక్టర్ ఆదివారం ఉదయమే మేల్కొని చన్నీటితో స్నానం చేసి పూజలు పూర్తి చేసుకున్న సమయంలోనే గుండెపోటుకు గురైన జగ్గును అతని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతనికి వైద్యం అందించే ప్రయత్నంలో డాక్టర్ లక్ష్మణ్ చనిపోవడం అందరినీ కలచి వేసింది. డాక్టర్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. భార్య, పిల్లల రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం గుండెపోటు రావడంతో గాంధారి మండలంలోని ఎస్వీ శ్రీజ మల్లి స్పెషలిస్ట్ ఆసుపత్రికి వారి బంధువులు తీసుకొచ్చారు. పేషేంట్‌కు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్ లక్ష్మణ్‌కు కూడా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పేషేంట్‌కి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మధ్యమార్గంలో రోగి కూడా మృతి చెందారు. దీంతో గాంధారి మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. చదవండి: టెన్త్ క్లాస్‌మెట్.. పెళ్లి చేసుకుంటానని యువతిని లొంగదీసుకుని.. -
గచ్చిబౌలిలో విషాదం: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక..
సాక్షి, హైదరాబాద్: సెప్టిక్‌ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన కొండాపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి.సురేష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లోని సెప్టిక్‌ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంకర్ డ్రైవర్, యజమాని అయిన స్వామి, హెల్పర్ జాన్ కలిసి క్లీనింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు. చంపాపేట్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన శ్రీనివాస్ (38) అలియాస్ శ్రీను, ఈ ప్రాంతానికే చెందిన ఆంజనేయులు (25)ను సెíప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనులకు రావాలని చెప్పారు. వీరిద్దరూ సరే అనడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌కు ట్యాంకర్‌తో పాటు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ మూతలు తీసి పైపులతో కొంత నీటిని తొలగించారు. భద్రత చర్యలు నిల్.. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలంటే ముందుగా భద్రత చర్యలు చేపట్టాలి. కానీ.. హేమదుర్గా అపార్ట్మెంట్లో లోపలికి దిగిన ఆంజనేయులు, శ్రీనివా స్ ముఖానికి మాస్కులతో కూడిన యంత్రాలు వాడకపోవడం, అంతకుముందే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్‌ను వాడకపోవడం, మూత తెరిచి కనీసం అందులోని విషవాయువులు బయటకు వెళ్లి పోయేంత వరకు వేచి ఉండక పోవడంతోనే ఇద్దరు మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. సెప్టిక్ ట్యాంకర్ జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకున్నా వారి ద్వారా వచ్చిన కాల్ కాకుండా ప్రైవేటుగా వచ్చిన కాల్తోనే వారు వచ్చి శుభ్రం చేసే పనులను చేపట్టినట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు.. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్, ఆంజనేయులు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మంజు తండా. కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఆటో నడపడంతో పాటు ఇతర కూలిపనులు చేస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంజనేయులుది నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట్‌లోని అక్కారం గ్రామం. భార్య పద్మ, అయిదేళ్ల కుమారుడు ఉన్నారు. సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఊపిరి ఆడకపోవడంతోనే.. శుభ్రపరిచేందుకు శ్రీనివాస్, ఆంజనేయులు సెప్టిక్ ట్యాంక్ లోపలికి దిగారు. అరగంట అయినా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో స్వామి, జాన్ కూడా లోపలికి దిగారు. ఇది గమనించిన వాచ్‌మన్ మరికొందరితో కలిసి స్వామిని, జాన్‌ను బయటికి లాగారు. వారు ఊపిరి తీయడం తీవ్ర ఇబ్బందిగా ఉండటంతో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్‌ట్యాంక్ లోపలే ఊపిరి ఆడక బయటకు రాలేకపోయిన శ్రీనివాస్, ఆంజనేయులును అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెలికితీశారు. అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడినట్లు గుర్తించారు. చదవండి: ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న..
సాక్షి,వెంకటాపురం(వరంగల్): పసిప్రాయంలోనే తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. ఇలా అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన వారంతా ఒక్కొక్కరిగా దూరమవుతుంటే ఆమె ఏడ్చిన తీరు వర్ణణాతీతం. పాలుతాగే వయస్సులో అనారోగ్యంతో తల్లి.. బడికి వెళ్లే వయస్సులో తండ్రి ఆత్మహత్య.. అండగా ఉంటాడనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేరింది మండల కేంద్రానికి చెందిన మెట్టు కావేరి.. మెట్టు కవిత–సాంబయ్య దంపతులకు 2003లో కుమారుడు రాజ్‌కుమార్, 2005లో కావేరి జన్మించింది. కావేరికి 8నెలల వయస్సు ఉన్నపుడే తల్లి కవిత అనారోగ్యంతో మృతిచెందింది. బడికి వెళ్లే వయస్సులో 2013లో తండ్రి సాంబయ్య ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో రాజ్‌కుమార్, కావేరిలు అమ్మమ్మ, తాతయ్య అయిన మంద సమ్మక్క, రాంచెంద్రుల వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో రాజ్‌కుమార్ పదో తరగతి తర్వాత చదువు మానేసి, ఏడాది కాలంగా ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ( చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. ) కావేరి ప్రభుత్వ జూనియార్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో ఈనెల 24న దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లిలో శుభకార్యాక్రమానికి హాజరయ్యేందుకు రాజ్‌కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తుంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన కావేరి అండగా ఉంటాడనుకున్న అన్న అకాలమరణంతో అనాథగా మారింది. సోదరుడి అంత్యక్రియలు తానే స్వయంగా నిర్వహించిన దృశ్యం చూసి కంటతడి పెట్టనివారుండరు. అయితే వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలతో ఉన్న కావేరిని ఆదుకునేందుకు దాతలు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి ) వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు మండల కేంద్రంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ.. ఎవరు ఏ పనిచెప్పినా ఓపికతో చేస్తూ అందరితో కలివిడిగా ఉంటే రాజ్‌కుమార్ చెల్లెలికి ఆర్థికంగా చేయూతనందించేందుకు మండల కేంద్రంలోని కొంతమంది యువకులు ‘రాజ్‌కుమార్ సహాయనిధి’ అనే వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చిన విరాళాలు కావేరి ఉన్నత చదువులకు, మరికొంత కావేరి భవిష్యత్ అవసరాలకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. సహాయనిధి గ్రూపు ద్వారా ఇప్పటివరకు రూ.60వేలు జమ అయినట్లు పేర్కొన్నారు. కావేరికి సహకారం అందించాలనుకున్న దాతలు 96400 66420, 97044 33991, 98484 39390 నెంబర్లకు ఫోన్ పే లేదా గూగూల్ పే చేయాలని తెలిపారు. చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. -
పనికి వెళ్లలేదని భర్తని మందలించింది.. ఇంటికి తిరిగి వచ్చేసరికి..
సాక్షి బెంగళూరు: భార్య మందలించడంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కోటపాళ్యంలో క్రిష్ణప్ప(42) కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా పనులకు వెళ్లకపోవడంతో భార్య మందలించి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి భార్య మందలించిందనే బాధతో జీవితంపై విరక్తి చెందిన క్రిష్ణప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తళి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...ముగ్గురి మృతి బైక్‌ను కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీ కొని ముగ్గురు మరణించారు. ఈ ఘటన చామరాజనగర తాలూకా మరియాల బ్రిడ్జి వద్ద జరిగింది. చామరాజనగర నుంచి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై బేడపురకు వెళ్తుండగా ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొట్టినట్లు తెలిసింది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు వచ్చి పరిశీలించారు. చామరాజనగర గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. చదవండి: బాలికతో ప్రేమ.. సోషల్ మీడియాలో పరిచయమై.. మాయమాటలు చెప్పి.. -
సరదాగా కుటుంబంతో అత్తవారింటికి.. అంతలో దారుణం
ఏలేశ్వరం (తూర్పుగోదావరి): కుటుంబసమేతంగా మోటార్ సైకిల్‌పై తన అత్తవారి ఊరు బయలు దేరిన అతడికి రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కళ్లెదుటే భార్యను కోల్పోయి, క్షతగాత్రులైన పిల్లలను చూసి అతడు బోరున విలపించాడు. ఏలేశ్వరం మండల పరిధిలోని యర్రవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఏరుకొండ గ్రామానికి చెందిన పెరాపు సత్యనారాయణ తన అత్తవారి ఊరు పశ్చి మగోదావరి జిల్లా పొలమూరులో సెలూన్ షాపు నడుపుతున్నాడు. భార్య కల్యాణి (26), ఏడేళ్ల కుమారుడు విష్ణువర్దన్, ఐదేళ్ల కుమారై లాస్యశ్రీతో కలిసి సొంతూరు ఏరుకొండ వెళ్లాడు. అక్కడి నుంచి పొలమూరు వెళ్లేందుకు ఉదయం బైక్‌పై భార్యాపిల్లలతో బయలుదేరాడు. మార్గమధ్యంలో యర్రవరం వద్ద వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో కల్యాణి అక్కడికక్కడే మృతిచెందింది. సత్యనారాయణ, ఇద్దరు పిల్లలు గాయపడగా వారిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్సై సుబ్బిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది -
ఒక్కడే కుమారుడు.. దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ..
సాక్షి, నెల్లిమర్ల(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి పుణ్యక్షేత్రంలోని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని వస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. తోటి అయ్యప్ప మాలధారులు, నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు అందించిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని అయ్యకోనేరు సమీపంలోని గుమ్చీ ప్రాంతానికి చెందిన బత్తుల చంటి(21) మరో ఐదుగురు అయ్యప్ప మాలధారులతో కలిసి మంగళవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం అనంతరం స్వాములంతా కలిసి విజయనగరానికి బయలుదేరారు. నెల్లిమర్ల మీదుగా తిరిగి వస్తూ పట్టణంలోని మొయిద వంతెన సమీపంలో చంపావతి నదిలోకి అందరూ స్నానానికి దిగారు. నదిలో కాస్త వరద ఎక్కువగా ఉండటంతో చంటి మునిగిపోయారు. మిగిలిన స్వాములంతా ఆయనను రక్షించడానికి ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తల్లిదండ్రులు సత్యనారాయణ, రమ్మణమ్మ చిన్న టిఫెన్ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. చంటి మెయిన్ రోడ్డులోని వానపాము పూజా సామాగ్రి షాపులో పని చేస్తున్నారు. చంటి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ అయ్యప్ప కూడా దీక్షలో ఉన్న తమ కొడుకును కాపాడలేకపోయారని బోరుమన్నారు. ఎస్ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ? -
చేపల వేటకు వెళ్లి నలుగురు గల్లంతు
పళ్లిపట్టు(చెన్నై): చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన నలుగురిలో ముగ్గురిని గ్రామస్తులు కాపాడగా, యువకుడు మృతిచెందాడు. 18 గంటల తర్వాత మంగళవారం అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పళ్లిపట్టు సమీపంలోని వెంకట్రాజుకుప్పానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సాయంత్రం లవ నదిలో చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారి కేకలు విన్న స్థానికులు ముగ్గురిని కాపాడారు. గల్లంతైన బాలాజీ (22) కోసం అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం ఉదయం పళ్లిపట్టు–షోళింగర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. మృతదేహం లభించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే.. -
అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?
సాక్షి,పాతపట్నం(శ్రీకాకుళం): అలికిడి లేని చిన్న అడవి. ఎప్పుడో గానీ మనుషులు తిరగని ప్రదేశం. అక్కడ ఓ జీడి చెట్టు. దానికి నెల రోజులుగా వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహం. వినేందుకు ఏదో క్రైమ్ కథను తలపిస్తున్న ఈ ఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం పంచాయతీ మామిడిగుడ్డి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని క్వారీ కొండ వెనుక ఉన్న బోడి కొండపై నెల రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. (చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది ) పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మామిడిగుడ్డి గ్రామానికి చెందిన సవర గణేష్ సోమవారం వంట కలప కోసం కొండపైకి వెళ్లాడు. అటుగా తిరుగుతుండగా ఓ జీడి చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండడం చూసి భయపడ్డాడు. వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఎస్ఐ వి.సందీప్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. పాతపట్నం సీఐ ఎం.వినోద్ కుమార్, పాలకొండ సబ్ డివిజన్ క్లూస్ టీమ్‌లు కొండపైకి వెళ్లి ఆ చెట్టు చుట్టూ నిశితంగా పరిశీలించారు. మృతదేహం పరిసరాల్లో నాటుసారా బాటిల్ కనిపించింది. నెల రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చని వారు భావిస్తున్నారు. మృతదేహం బాగా పాడైపోయి ఉండడంతో మెళియాపుట్టి మండలంలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు. అదే మండలం కొసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు (54)గా అదృశ్యమైనట్లు గుర్తించారు. నిర్ధారణ కోసం ధర్మారావు బావమరిది పుడితిరు మల్లేసును అక్కడకు తీసుకువచ్చి మృతదేహాన్ని చూపించగా అది ధర్మారావేనని గుర్తు పట్టారు. కొసమాల గ్రామానికి చెందిన బోర ధర్మారావు కుమారులు నర్సిమూర్తి, వినోద్ కుమార్‌లు గత నెల 19వ తేదీన మెళియాపుట్టి పోలీసు స్టేషన్లో తమ తండ్రి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అనుసరించి దర్యాప్తు చేయగా మృతుడి వివరాలు తెలిశాయి. పాతపట్నం సీహెచ్‌సీ వైద్యుడు ఐ.శ్రీధర్ మృతదేహానికి అక్కడే శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, సవర గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి.. -
విషాదం: పెళ్లి విందులో భోజనం తిని..
సాక్షి, శివమొగ్గ: పెళ్ళి విందులో భోజనం ఆరగించి పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ప్రాణాలు కోల్పోయారు. మృతుడు శివమొగ్గ తాలూకాలోని ఆరికెరె గ్రామా పంచాయతీకి చెందిన పిడిఓ దినేష్‌సింగ్ (42). ఈ నెల 17న అరదోట్లు గ్రామంలో ఒక పెళ్లిలో ఆయన భోజనం తిన్నారు. వెంటనే వాంతులు, విరేచనాలతో పాటు చలి జ్వరం వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విందులో ఆహారం తిన్న అనేకమందికి కూడ వాంతులు, విరేచనాలు అయ్యాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం) చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
నెల్లూరులో విషాదం: గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు:నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు భారీగా వ్యాపించడంతో దంపతులు అబ్బాస్, నౌషాద్కు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తె అయేషాను చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయేషా కూడా మృతి చెందింది. వివరాల ప్రకారం.. అబ్బాస్ కుటుంబం మల్లంలో టిఫిన్ అంగడి నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు అహకారాలు చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో ఉంటున్న ముగ్గురు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో.. -
విషాదం: బాగా చదవలేక పోతున్నా.. అందుకే
నూజివీడు(కృష్ణా జిల్లా): స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈవూరి గౌరీష్(16) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన నగరం గ్రామానికి చెందిన గౌరీష్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్ భవనం ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గౌరీష్‌కు అతని తల్లి ఫోన్ చేయగా స్పందించలేదు. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసినా ఫలితంలేకపోవడంతో అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడించమని చెప్పింది. చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు పరీక్షలు కావడంతో స్నేహితుల రూమ్‌లకు వెళ్లి చదువుకుంటూ ఉంటాడేమోనని రాత్రి 8.30 గంటల సమయంలో అన్ని రూమ్‌లను వెతుకుతుండగా ఒక గది తలుపులు తెరుచుకోలేదు. తలుపులను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని గౌరీష్ కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. తాను బాగా చదువలేకపోతున్నానని, అందుకే చనిపోతున్నట్లుగా గౌరీష్ సూసైడ్ లెటర్ రాశాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది
సాక్షి,నాగోలు(హైదరాబాద్): ఓ వాచ్మెన్ కారును రివర్స్ తీసుకుంటుండగా కారు చక్రాలకింద పడి అతని కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అంగీర్ల రాణీ, లక్ష్మణ్ భార్యభర్తలు. వీరికి కుమారుడు సాత్విక్ (2) ఉన్నాడు. గత సంవత్సరం ఎల్బీనగర్లో కాస్మోపాలిటన్ కాలనీ రాణీ అపార్మ్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మణ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అపార్ట్మెంట్ దగ్గర లక్ష్మణ్ ఇన్నోవా క్రిస్టా కారును క్లీన్ చేసి కారును రివర్స్‌లో తీస్తుండగా వెనకాల సైడ్‌నుంచి వచ్చిన లక్ష్మణ్ కుమారుడు సాత్విక్ కారు వెనుక చక్రాల కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన లక్ష్మణ్ .. కుమారుడిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సాత్విక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూగుల్‌లో వాటి కోసం వెతికారా.. మన బ్యాంక్ అకౌంట్ ఖాళీనే! -
మిస్టరీగా మహిళ మృతి.. హత్యా.. ఆత్మహత్యా..?
సాక్షి,మిర్యాలగూడ అర్బన్(నల్గొండ): పట్టణంలోని అశోక్‌నగర్‌లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ(45)ది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సంఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభించిందని, అందులో జి. రాజ్యలక్ష్మి, భర్త జగదీశ్వర్‌రావు, బంజారాహిల్స్, భువనగిరి అని ఉన్నట్లు టూటౌన్ సీఐ నిగిడాల సురేష్ తెలిపారు. మృతురాలి ఫోన్ డేటా కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి ఫొటోను సైతం పోలీసులు విడుదల చేశారు. కాగా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కాంతారావుతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 40 రోజుల క్రితం.. కాంతారావు, ప్రస్తుతం చనిపోయిన మహిళతో కలిసి అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యాభర్తలమని చెప్పి తమ వివరాలను స్థానికులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. కాగా ఈ నెల 15వ తేదీన ఇంటికి కాంతారావు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత వారు ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మహిళ మృదేహం కుళ్లినస్థితిలో మంచంపై పడి ఉన్న విషయం విదితమే. ఇంటి యజమాని రామచంద్రయ్య ఇచ్చిన వివరాలతో కాంతారావు నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు. మహిళ మృతిచెందిన సమాచారం టీవీల్లో, పేపర్లో చూసిన కాంతారావు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతురాలి ప్రాథమిక ఆధారాలు గుర్తించామని పూర్తి వివరాలు ఆమె కుటుంబ సభ్యులు వస్తే తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. చదవండి: విషాదం: ఆడుకుంటూ.. అనంతలోకాలకు -
వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది
సాక్షి,రేగిడి(శ్రీకాకుళం): ఆశల దీపం ఆరిపోయింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కుమారుడి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి కందిశ గ్రామానికి చెందిన కెల్ల శ్రీనివాసరావు (30) విజయనగరం ఐదో బెటాలియన్‌లో ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఏడేళ్లుగా పని చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సంభవించిన వరదల్లో పలువురు చిక్కుకున్నారు. దీంతో విధి నిర్వహణ కోసం అక్కడకు వెళ్లిన శ్రీనివాసరావు బాధితులను కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం తెలియడంతో కందిశ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గుండెలవిసేలా.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు వరహాలనాయుడు, గౌరీశ్వరిలు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరికి కుమారుడు శ్రీనివాసరావుతోపాటు కుమార్తె ధనలక్ష్మి ఉన్నారు. శ్రీనివాసరావుకు వివాహమై ఏడాదిన్నర కుమారుడు మోక్షజ్ఞంనాయుడు ఉన్నాడు. భర్త మృతి విషయం తెలుసుకొని భార్య సునీతతోపాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మృతదేహం కోసం గ్రామస్తులంతా ఎదురు చూస్తున్నారు. పలువురు సంతాపం శ్రీనివాసరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పాలవలస విక్రాంత్, ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, రేగడి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ వంజరాపు భారతీ అశోక్‌కుమార్, సర్పంచ్ కెల్ల పద్మావతి, ఎంపీటీసీ సభ్యురాలు కెల్ల చిన్నమ్మడు, కెల్ల మన్మథరావు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. -
విషాదం: దైవదర్శనం కోసం వెళ్లి.. భర్త, పిల్లల చూస్తుండగానే..
సాక్షి,టెక్కలి రూరల్( శ్రీకాకుళం): దైవదర్శనం కోసం వచ్చిన మహిళ అనుకోని రీతిలో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. భర్త.. పిల్లల కళ్లెదుటే ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లావేరు మండలం గుంటుకుపేట గ్రామానికి చెందిన కూనపు రమ (32), భర్త పోలీస్‌లు తమ ఇద్దరు కుమార్తెలు ఎనిమిదేళ్ల దీక్షిత, ఏడేళ్ల యశస్వీతలతో కలిసి టెక్కలి మండలం రావివలసలోని ఎండలమల్లికార్జున స్వామి దర్శనానికి శనివారం వచ్చారు. స్వామివారి దర్శనం పూర్తయిన తరువాత స్వగ్రామానికి బయలుదేరుతున్న సమయంలో పెద్ద కుమార్తె దీక్షిత బహిర్భూమికి వెళ్తాననడంతో గుడికి సమీపంలో ఉన్న పెద్ద చెరువు వద్దకు తీసుకొని వెళ్లారు. రమ ప్రమాదవుశాత్తు కాలుజారి చెరువులో పడిపోయి నీట మునిగిపోయింది. దీన్ని చూసిన కుమార్తె కేకలు వేయడంతో తండ్రి పోలీసు, స్థానికులు చెరువులో గాలించి అమెను బయటకు తీసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త అయ్యప్ప మాలలో ఉన్నారు. -
బంగారం కోసం.. వృద్ధురాలి దారుణ హత్య
మహదేవపూర్:జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన లంగారి లక్ష్మీ(65) అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. బంగారు నగల కోసమే గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలిని హృతచేసి ఉంటారని మహదేవపూర్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహదేవపూర్ సీఐ కిరణ్ క కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన లంగారి లక్ష్మీ అనే వృద్ధురాలు కనిపించడం లేదని ఆమె పెద్ద కుమారుడు లంగారి మురళి 2021 నవంబరు 16వ తేదీన ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి ఆచూకి కోసం పోలీసులు గాలించగా గ్రామ శివారులో ఉన్న పాతబావిలో మృతదేహాన్ని శనివారం సాయంత్రం గుర్తించారు. బంగారం కోసమే వృద్ధురాలు కనిపించకుండా పోయిన రోజు నుండి ఆమెకు చెందిన బంగారు నగలు కనిపించడం లేదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బంగారు నగల కోసమే హత్య జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
దీపాలు వెలిగించేందుకు వెళ్లిన కుటుంబం.. టిప్పర్ రూపంలో వెంటాడిన మృత్యువు
మండ్య(బెంగళూరు): కార్తీకపున్నమి రోజున దీపాలు వెలిగించేందుకు ఆలయానికి వెళ్లిన ఒక కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృతువు ఐదుగురిని బలిగొంది. మళవళ్లి తాలూకా దడదపురకు చెందిన బండూరు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు ముత్తమ్మ(45), తన కుమార్తె బసమ్మణి(30), కుమారుడు వెంకటేష్(25), బసమ్మణి పిల్లలు చాముండేశ్వరి(8), రెండు సంవత్సరాల బాలుడితో కలిసి ఆటోలో అదే తాలూకాలోని మద్దూరులోని ఆలయానికి వెళ్లారు. ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా మళవళ్లి తాలూకా నెలమాకనహళ్లి గేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఆటో నడుపుతున్న వెంకటేశ్, వెనుక సీట్లలో కూర్చున్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. మళవళ్లి రూరల్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేమ పెళ్లి.. ఆపై మరదలి మోజు.. అందుకోసం పక్కాగా ప్లాన్ చేసి.. -
వారం రోజుల్లో బిడ్డ పెళ్లి.. బట్టలతో తిరిగి వస్తాడనుకున్న ఆ తండ్రి...
సాక్షి ,నాంపల్లి(మర్రిగూడెం): పెళ్లింట విషాదం అలుముకుంది. కుమార్తె వివాహానికి దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మర్రిగూడ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య (55) కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో జరిగే పెళ్లి వేడుకకు దుస్తులు కొనుగోలు చేసేందుకు శంకరయ్య, సమీప బంధువులు నలుగురితో కలిసి ఆటోలో మాల్‌కు బయలుదేరారు. (చదవండి: Nizamabad: యాక్సిడెంట్ చేసిన భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ ) మార్గమధ్యలో ఎర్రగండ్లపల్లి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఆటో ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న శంకరయ్య ఎగిరి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న నలుగురితో పాటు బైక్‌పై నల్లగొండ నుంచి మాల్‌కు వెళ్తున్న గౌరి మల్లేష్, యోగితకు స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీప పీహెచ్‌సీకి తరలించారు. సమాచారం మేరకు ఎస్ఐ నాగుల్ మీరా ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిలిచిన వివాహం వట్టిపల్లి గ్రామంలో గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న శంకరయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. ఇటీవల కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. అయితే, మూడు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన శంకరయ్య సమీప బంధువులు చింతపలిపల్లి మండలం వెంకటేశ్వరనగర్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన కారణంగానే శంకరయ్య కుమార్తె వివాహ పనులు ఆలస్యమయ్యాయి. మరో వారం రోజుల్లో ఇంట్లో శుభకార్యం ఉండగా ఇంటిపెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వివాహం నిలిచిపోయిందని మృతుడి బంధువులు తెలిపారు. ‘కుమార్తె పెళ్లి బట్టలు తీసుకొచ్చేందుకు వచ్చి ఇక్కడ నిద్దరోయావా అయ్యా’ అంటూ శంకరయ్య భార్య యాదమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా? -
వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు.. కాసేపటికే
భువనేశ్వర్: రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కుట్ర బ్లాక్‌లోని బుడకట గ్రామానికి చెందిన సరోజిని కాకు గురువారం మధ్యాహ్నం రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్‌జిహెచ్)లో చేరింది. రోగి సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించాలని వైద్యులు తెలిపారు. అయితే ఆమె బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ కాగా, B పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆ మహిళ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. మహిళకు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారనీ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: ఎద్దు వయసు మూడున్నరేళ్లు.. విలువ రూ. కోటి!) -
భార్య చేతిలో రియల్టర్ దారుణ హత్య.. అందుకే చంపానని లొంగిపోయింది
రెండో భార్య చేతిలో ఓ రియల్టర్ ను అతని రెండో భార్య ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది.అనంతరం ఆ మహిళ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. కర్ణాటక లోని గళూరు జిల్లా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి రాజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయి బ్యూటీషియన్ అయిన నేత్ర (35)ని రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల తన భర్త తనకి శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే నేత్రను మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఇందుకు నేత్ర అంగీకరించక పోవడంతో ఈ విషయమై వారిద్దరికి గొడవ కూడా జరిగాయి. చివరికి సహనం కోల్పోయిన ఆమె అతను నిద్రిస్తున్న సమయంలో తన భర్త ని రాడ్ తో కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నేత్ర, రాజ్‌లకు ఐదేళ్ల క్రితం వివాహమైందని, ఆస్తి తగాదాల కారణంగా తరచూ గొడవలు జరుగుతుంటాయని, ఇదే హత్యకు కారణమని రాజ్ మొదటి భార్య సత్యకుమారి పోలీసులకు తెలిపారు. ఆమె మదనాయకనల్లి పోలీసులకు కేసు నమోదు చేసిందని దర్యాప్తు అధికారి తెలిపారు. -
ఫ్లాట్ తలుపులు తెరిచే ఉన్నాయి.. లోనికి వెళ్లి చూడగా..
సాక్షి,(కుత్బుల్లాపూర్)హైదరాబాద్: తండ్రి మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండమూడి ఎన్క్లేవ్ రోడ్డులో ఉండే ఎన్సీఎల్ సింధులో నివాసముండే పినకపాణి(56) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కాగా నాలుగు రోజుల క్రితం తండ్రి కృష్ణమూర్తి మృతి చెందాడు. అతడి తల్లి జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో ఉండే పెద్దకుమారుడు వెంకటరమణ ఇంటికి వెళ్లడంతో పినకపాణి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తండ్రి పెద్దకర్మ విషయమై మాట్లాడేందుకు ఎన్సీఎల్ సింధు–సీ బ్లాక్‌లో నివాసముండే అక్క రమాదేవి, బావ సీవీ కుమార్‌లు మొబైల్ ద్వారా మెసేజ్ పెట్టగా సమాధానం ఇవ్వలేదు. దీంతో వారు పినకపాణి ఉంటున్న ఫ్లాట్‌కు రాగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’ -
అన్నం పెట్టడం లేదని కొడుకుతో చెప్పిన తల్లి.. కోడలు క్షణికావేశంలో..
అనంతపురం క్రైం: అత్త తిట్లు భరించలేక ఓ కోడలు నిప్పంటించుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని మున్నానగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పోతులయ్య, బోయ లక్ష్మి దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. ఈ నెల 6న సాయంత్రం అత్తాకోడలి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పట్టించుకోవడం లేదని, అన్నం సక్రమంగా పెట్టడం లేదంటూ కొడుకు పోతులయ్యతో ఈశ్వరమ్మ చెప్పి కోడలిని దూషించింది. కాసేపటికే పోతులయ్య బయటకు వెళ్లగా, ఇంట్లో అత్త, పిల్లలుండగానే లక్ష్మి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈశ్వరమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు చేరుకుని మంటలార్పారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం) -
Anantapur: కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే..
సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వరకు పెళ్లి భాజాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే.. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో క్షణాల వ్యవధిలో తల్లీ, కొడుకులు మరణించారు. పామిడి ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకటస్వామి ఆదివారం కొడుకు పెళ్లయిన వెంటనే గుండెపోటుతో మరణించారు. ఈ మరణవార్త తెలిసిన మరుక్షణమే వెంకటస్వామి తల్లి కోనమ్మ (70) మృతి చెందింది. తల్లీ, కొడుకుల మరణవార్తతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చదవండి: (మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొడుకు వివాహం అనంతరం గుండెపోటుతో మృతి చెందిన పామిడి ఏఎస్ఐ వెంకటస్వామి, ఆయన తల్లి కోనమ్మ మృతదేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు త్రిలోక్, సుధాకర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. -
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు
Man Last Breath After Chicken Bone Stuck in Throat At Chennai చెన్నై: అందియూరు సమీపంలో చికెన్ తింటున్న సమయంలో గొంతులో ఎముక ఇరుక్కుని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈరోడ్ జిల్లా అందియూరు సమీపం కుచ్చి కల్లూరుకు చెందిన సుబ్రమణ్యన్ (56) తాపీ మేస్త్రి. శుక్రవారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో ఉన్న స్నేహితుడు మునిరాజు ఇంటిలో కోడి మాంసం తిన్నాడు. ఆ సమయంలో ఓ చికెన్ ఎముక గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతన్ని హుటాహుటిన అందియూరు ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోయింది. అక్కడ పరిశోధించిన వైద్యులు సుబ్రమణ్యన్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: (త్వరలో పునీత్ సమాధి వద్దే పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగా) -
వివాహిత ఆత్మహత్య కేసులో ట్విస్ట్
పెడన(కృష్ణా జిల్లా): కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడా? భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య చేసి.. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. పెడన పట్టణంలోని ఐదో వార్డు దాదాగుంట సమీపంలో అక్టోబర్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత నఫిసాబేగం(31) కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తు పోయే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అవమానించిందని ఇంటి పెద్ద కోడలిని చంపేశారు..) దీంతో ఈ కేసును తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్య కేసుగా మార్చారు. దీనికి సంబంధించి ఎస్ఐ టి. మురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం పరాసుపేటకు చెందిన నఫిసాబేగం(31)ను పెడన దాదాగుంటకు చెందిన ఎండీ యూసఫ్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల బాబు. వివాహామైన నెల రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరగసాగాయి. ఈ క్రమంలో యూసఫ్ మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం నఫిసాబేగంకు తెలియడంతో ఆ గొడవలు పెద్దవయ్యాయి. యూసఫ్ తనకు అప్పులున్నాయని, పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. (చదవండి: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి) ఈ విషయమై అక్టోబరు 26న ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన యూసఫ్ తన భార్య వంటింట్లో ఉరివేసుకుందని కిందకు దించానని చెప్పి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు మహమ్మద్ గౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూసఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పోస్టు మార్టం నివేదిక ఆధారంగా విచారించారు. ఈ విచారణలో నఫిసాబేగంది ఆత్మహత్య కాదని తేల్చి.. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కాబుల్‌లో బాంబు దాడి, 19 మంది మృతి
కాబుల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతం మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదలు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. చదవండి: Guinness World Records: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం -
ఐస్‌క్రీం కోసం వెళ్లి, తిరిగి వస్తుంటే..
రాయగడ( భువనేశ్వర్): జిల్లా కేంద్రంలోని కొరాపుట్ మార్గం నువాసాహి రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. మృతుడు ఆర్కే నగర్ స్వీపర్ కాలనీలో నివసిస్తున్న సునీల్ సామల్ కుమారుడు సుధాంశుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ ఎస్కే సత్పతి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుధాంశు ఐస్‌క్రీం కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని స్వీపర్ కాలనీవాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళన చేపట్టారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది
సాక్షి,నాంపల్లి(హైదరాబాద్): ఆస్పత్రి అటెండర్ కక్కుర్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన శనివారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ ఆజం కుమారుడు షేక్ ఖాజా(3) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 27న నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి వెంటిలేటర్ అమర్చి వైద్యం అందిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సుభాష్ అనే అటెండర్ శనివారం ఆ వార్డుకు వచ్చాడు. పక్క బెడ్ మీద ఉన్న రోగి సహాయకుల నుంచి వంద రూపాయలు తీసుకుని షేక్ ఖాజాకు సంబంధించిన వెంటిలేటర్‌ను మార్చేశాడు. కొద్దిసేపటికే షేక్ ఖాజా శ్వాస అందక మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించారు. చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి.. -
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత...
Alan Davidson: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ అలాన్ డేవిడ్సన్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిడ్నీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో వెల్లడించింది. 44 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్సన్ 186 వికెట్లు సాధించాడు. 1959లో కాన్పూర్ టెస్టులో భారత్‌పై 7 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలును నమోదు చేశారు. 193 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడు 6804 పరుగులు, 672 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: టిక్కెట్లు లేకుండానే.. ఫ్యాన్స్ రచ్చ.. ఐసీసీ క్షమాపణలు -
జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పీఎంఓ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. చదవండి: Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి -
‘పాడె’ కట్టె అతనికి మృత్యువుగా మారింది
సాక్షి,వర్గల్(సిద్దిపేట): ‘పాడె’ కట్టె కాలనాగైంది. అంత్యక్రియల కలప కోసం వచ్చిన వ్యక్తిని విద్యుత్‌షాక్ రూపంలో కాటేసింది. పాడె కట్టేందుకు అవసరమైన వెదురు చెట్టును కొడుతుండగా అది విద్యుత్‌లైన్‌కు తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.... మజీద్‌పల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు లింగ లక్ష్మినర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. బుధవారం అతడి అంత్యక్రియల కోసం పాడె కట్టేందుకు అవసరమైన వెదురు కట్టెలు తెచ్చేందుకు గ్రామశివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంతానికి గాలం స్వామి(38), పాలేటి ధర్మరాజు, చిగురుఎత్తు రాజు వెళ్లారు. అక్కడ వెదురు చెట్టును స్వామి గొడ్డలితో కొడుతుండగా అది పక్కనే ఉన్న విద్యుత్ లైన్ వైర్లను తాకింది. దీంతో అతను తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్కనే ఉన్న మిగతా ఇద్దరు అప్రమత్తమై దూరంగా జరిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు వెంటనే తెలిసిన వారికి సమాచారం చేరవేసి స్వామిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పేద కుటుంబంలో పెను విషాదం గాలం స్వామి మృత్యువాత పడిన సమాచారంతో కుటుంబసభ్యులు బోరుమని విలపించారు. మృతుడికి భార్య లక్ష్మి, 18 సంవత్సరాలలోపు ఏసుమణి, సంధ్య, కార్తీక్ పిల్లలు ఉన్నారు. తండ్రి సత్తయ్య కూడా వీరి వద్దనే ఉంటున్నాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ కుటుంబం స్వామి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పెనువిషాదంలో మునిగిపోయింది. ఆస్పత్రి వద్ద వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కావడం లేదని బాధ.. ఉదయం తలుపు బద్దలు కొట్టి చూస్తే.. -
పెళ్లి కావడం లేదని బాధ.. ఉదయం తలుపు బద్దలు కొట్టి చూస్తే..
సాక్షి,హిమాయత్‌నగర్(హైదరాబాద్): ఓ వైపు వివాహం కావట్లేదు... మరో వైపు చేతిలో చిల్లిగవ్వ లేని ఆర్థిక ఇబ్బందులు.. వీటిని భరించలేక ఓ యువకుడు పనిచేసే చోటే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్ఐ కొండపల్లి నాగరాజు సమాచారం మేరకు... ఏపీలోని వైఎస్సార్‌కడప పట్టణానికి చెందిన చక్కటి నర్సింహులు కొంతకాలంగా ఉప్పల్ ప్రాంతంలో తల్లి ఓబులమ్మ, అన్నతో కలసి నివసిస్తున్నాడు. హిమాయత్‌నగర్‌లోని శ్రీబాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని తండ్రి వీరికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోగా.. వీరిని పట్టించుకోకపోవంతో తీవ్రమైన అప్పులు ఏర్పడ్డాయి. నర్సింహులు అన్నకు కూడా వివాహం కాలేదు. కొద్దిరోజులుగా నర్సింహులుకు వివాహ సంబంధాలు చూస్తున్నా ఏవీ సెట్ కావడం లేదు. దీంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అప్పులు సైతం తీర్చలేని పరిస్థితి నెలకొంది. తన బాధలను తల్లికి, అన్నకు చెప్పుకోలేక తాను పనిచేస్తున్న చోటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం డ్యూటీకి వచ్చిన వారు రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నర్సింహులు విగతజీవిగా ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. చదవండి: కాల్పులు జరిపింది ఆ ముగ్గురే! -
‘క్షమించండి.. నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ఓ బాలుడు ఆత్మహత్య బహదూర్‌పురాలో కలకలం రేపింది. వారం రోజుల క్రితం గుండెపోటు రావడంతో తనవాళ్లకు చెబితే భయపడతారని ఆందోళన చెందిన ఆ బాలుడు మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి పూర్తిచేసిన ఆ బాలుడు. చనిపోయే ముందు తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. నేను మిమ్మలి వదిలి వెళ్తున్నాను. నన్ను మర్చిపోండి.. నా ఫొన్ అమ్మి నా అంత్యక్రియలు నిర్వహించండి. అప్పుడే నా ఆత్మకు శాంతి జరుగుతుందంటూ’ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. -
బాగా చదువుకో.. ఇదే నా చివరి కాల్
ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు జిల్లా): క్షణికావేశానికి లోనైన ఓ వివాహిత ఎమ్మిగనూరులో శనివారం అర్ధరాత్రి సోడియం హైపోక్లోరైడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లో నివాసముంటున్న మోనే తిమ్మప్ప, లక్ష్మీదేవిలకు కుమార్తె మోనే సుష్మ(25), కుమారుడు మోహన్‌లు సంతానం. తిమ్మప్ప పెద్దకడుబూరు మండలంలో విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. కుమార్తె సుష్మకు ట్రాన్స్‌కో ఏఈగా సంవత్సరంన్నర క్రితం ఉద్యోగం వచ్చింది. కుమారుడు మోహన్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. సుష్మ సిరాలదొడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే నెలలో కర్నూలుకు చెందిన బడేసాబ్, శారదల కుమారుడు కిశోర్‌కుమార్‌తో ఆమెకు వివాహం చేశారు. కిశోర్‌కుమార్ కోడుమూరు మండలం పులకుర్తి కెనరా బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత దంపతుల మధ్య కాపురం ఉండే విషయంలో మనస్పర్థలు వచ్చాయి. కర్నూలులో ఉండాలని భర్త, కాదు ఎమ్మిగనూరులో ఉండాలని భార్య వాదించుకునే వారని తెలిసింది. ఇదే విషయంపై దసరా రోజు ఇంటికి వచ్చిన భర్తతో సుష్మ గొడవ పడినట్లు తెలిసింది. శనివారం విధులకు వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చింది. బంధువులు, అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు, అలాగే హైదరాబాద్‌లో ఉండే తమ్ముడు మోహన్‌కు కాల్ చేసి బాగా చదువుకో ఇదే నా చివరి కాల్ అని చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకుంది. ముందే తెచ్చుకున్న సోడియం హైడ్రోక్లోరైడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందింది. కుమార్తె ఆత్మహత్య చేసుకోవటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ మస్తాన్‌వలి ప్రభుత్వాసుపత్రికి చేరుకొని తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తమ అల్లుడిపై అనుమానం లేదని, కాపురం పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవతో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఎస్ఐకు తెలిపారు. తహసీల్దార్ జయన్న, టౌన్ ఎస్ఐ మస్తాన్‌వలి పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎ‹స్ఐ మస్తాన్‌వలి పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రికి పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు తరలివచ్చారు. చదవండి: ఆ టీడీపీ నాయకుడి దారి.. అడ్డదారి -
తండ్రి పట్టించుకోలేదని.. కుమారుడి కిరాతకం
మైసూరు: మైసూరులో దారుణం చోటు చేసుకుంది. కుమారుడి చేతిలో తండ్రి, మరో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... ఇక్కడి నగరంలోని కేజీ కొప్పలులో శివ ప్రకాశ్ నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు సాగర్. ఇదిలా ఉంటే శివప్రకాశ్, అతని స్నేహితుడు నాగరాజు కలిసి పలు వ్యాపారాలు చేశారు. 2016లో నాగరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ సమయంలో నాగరాజు తనకు ఆరోగ్యం సరిగా లేదని, తన భార్య లత, కుమారుడు నాగార్జునను బాగా చూసుకోవాలని కోరాడు. అప్పటి నుంచి శివప్రకాశ్ వీరి కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఇది నచ్చని కుమారుడు సాగర్ పలుమార్లు తండ్రిని హెచ్చరించాడు. తండ్రి పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి సాగర్ తన తండ్రి వద్దకు వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగ్రహంతో సాగర్ తండ్రి శివప్రకాశ్ (56)ను అతనితో ఉన్న మహిళ లత (48)ను దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోడానికి వచ్చిన లత కుమారుడు నాగార్జునపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి.. -
రష్యాలో భారీ పేలుడు, 16 మంది మృతి
మాస్కో: రష్యాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మాస్కోకు ఆగ్నేయంగా 170 మైళ్ల దూరంలో ఉన్న రష్యాలో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గన్‌పౌడర్ ప్లాంట్ కావడంతో పేలుడు కూడా సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 17 మంది ఉండగా అందులో ఉన్న 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 50 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. ప్లాంట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం! -
రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..
సాక్షి,నందిగామ(రంగారెడ్డి): కోవిడ్ టీకా తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మేకగూడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మేకగూడకు చెందిన చిగుర్లపల్లి మానస (32) మంగళవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన క్యాంప్‌లో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకుంది. ఇంటికి వెళ్లిన ఆమె గంట తర్వాత స్పృహతప్పి పడిపోయింది. ( చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లాడు.. తెల్లారేసరికి! ) కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మానస వ్యాక్సిన్ తీసుకోవడంతోనే మృతి చెందిందా.. లేక అనారోగ్యంతో మృతి చెందిందా అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విచారణ జరుపుతాం.. మానస గత నెల 18న మొదటి డోస్ తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఈరోజు రెండో డోసు తీసుకుంది. డోస్ తీసుకున్న గంట తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందిందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. మానసకు ఇచ్చిన వ్యాక్సిన్ వాయిల్లో తొమ్మిది మందికి టీకాలు ఇవ్వడం జరిగింది. మిగతా ఎనిమిది మంది ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలా చనిపోయిందో విచారణ జరుపుతాం. – డాక్టర్ దామోదర్, జిల్లా ఉప వైద్యాధికారి చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. -
రైలుకు ఎదురెళ్లి.. గాలిలోకి లేచి.. పది కిలోమీటర్ల తర్వాత..
పెనుకొండ(అనంతపురం జిల్లా): జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ బాలాజీ నాయక్ తెలిపిన మేరకు... సోమవారం సాయంత్రం పెనుకొండలోని ఆర్టీసీ డిపో సమీపంలో చిలమత్తూరుకు చెందిన మంజునాథ్ (35) రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం వైపుగా వెళుతున్న స్పెషల్ ట్రైన్ కిందపడేందుకు ప్రయత్నించిన అతను రైలు పట్టాల మధ్యలో నిలబడి ఉండగా ఇంజన్ ఢీకొంది. (చదవండి: తల్లి ఇంట్లో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసి రప్పించి ఎంత పనిచేసింది..) ఘటనలో గాలిలోకి లేచిన మంజునాథ్ తిరిగి అదే ఇంజన్ కప్లింగ్ హుక్కు తగులుకున్నాడు. దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కాజిపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత విషయాన్ని స్టేషన్లో రిపోర్ట్ చేసేందుకు లోకో పైలెట్ ప్రయత్నించినప్పుడు ఇంజన్ కప్లింగ్ హుక్కు తగులుకున్న మంజునాథ్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని తొలగించి పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌కు చెందిన సాయి సుశాంత్(30) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీలో స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుశాంత్ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నేడు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్‌నాయక్ గతంలో బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. -
సెల్ఫీ తీసుకుంటూ.. ప్రాణాలు పోగొట్టుకున్నారు
సాక్షి, నల్లగొండ: డిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. సెల్ఫీ తీసుకుంటూ డిండి ప్రాజెక్టులో యువకులు జారి పడ్డారు. మృతులు జహీరాబాద్‌కు చెందిన సాగర్, ప్రవీణ్‌గా గుర్తించారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్ట్ వద్ద ఫోటోల కోసం నీటిలోకి దిగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. చదవండి: రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు -
విషాదం: అందరూ చూస్తుండగానే.. షాపింగ్‌మాల్‌లో షాకింగ్ వీడియో
సాక్షి, ఖమ్మం జిల్లా: నగరంలో విషాదంలో చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగి.. కస్టమర్‌కు బట్టలు చూపిస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా టేబుల్‌పైనే కూప్పకూలిపోయాడు. ఖమ్మం నగరానికి చెందిన చాంద్ పాషా గత కొద్దికాలంగా కేఎల్ఎం షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. రోజువారి పనిలో భాగంగా కస్టమర్‌కు బట్టలు చూపిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి దాకా మాట్లాడిన ఉద్యోగి.. అంతలోనే మృతి చెందడంతో ఉద్యోగులు, కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. చదవండి: ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ -
బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య
లండన్: బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, డేవిడ్ హత్యను బ్రిటన్ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. చదవండి: (ఆఫ్గానిస్తాన్ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య) -
వారిద్దరు సముద్రస్నానం చేసి వచ్చారు.. అంతలో ఏం జరిగిందో బ్యాగులోంచి..
సాక్షి, శ్రీకాకుళం: మండలంలోని భావనపాడు తీరంలో గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని దవిడిగాం గ్రామానికి చెందిన సిరిపురం ఉచిత(21) అదే గ్రామానికి చెందిన పురుకొండ దుర్గాప్రసాద్ మధ్య ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దుర్గాప్రసాద్‌కు ఐదేళ్ల క్రితమే వేరే యువతితో వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా ఉచిత, దుర్గాప్రసాద్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం భావనపాడు సముద్రతీరానికి ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చారు. సముద్రస్నానం అనంతరం సమీప తోటకు వచ్చారు. ఇంతలో జరిగిందో గానీ ఉచిత.. తన బ్యాగులో తీసుకువచ్చిన పురుగుల మందు తాగింది. ఒక్కసారిగా పెద్ద కేకలు పెట్టడంతో అక్కడికి సమీపంలో వలలు అల్లుతున్న మత్స్యకారులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. నౌపడ ఎస్సై సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకునే సరికే యువతి మృతిచెందింది. వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతురాలి తండ్రి వైజాగ్ ఆటో నగర్లో టైలరింగ్ పనిచేస్తూ కొంతకాలంగా కుటుంబంతో అక్కడే ఉన్నారు. దసరా సెలవులకు సొంత ఊరికి ఒంటరిగా వచ్చిన కుమార్తె.. తీరంలో శవమై పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే -
‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’
సాక్షి,దుబ్బాక( మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లీకూతురు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో చిన్న కుమార్తె చైత్ర(5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతులోకి వెళ్లింది. గమనించిన తల్లి చైత్రను కాపాడటానికి ముందుగా తన చీరను విసిరింది. చీరను అందుకోకపోవడంతో తానే నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ నీటమునిగి ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. చెరువు గట్టుపై ఉన్న పెద్దకుమార్తె రషి్మక, మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద ఉన్న వారు గమనించి మృతదేహాలను బయటకు తీశారు. రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్‌తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రోజా ఇటీవలె తల్లిగారింటికి వచ్చింది. బతుకమ్మ పండగ రోజు తల్లీ కూతురు మృతి చెందడంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మ కావాలే..లే అమ్మా తల్లి, చెల్లి మృతి చెందడంతో రష్మిక ఏమి చేయలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నది. తల్లిదండ్రులను కోల్పోయిన రష్మిక ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. నాకు మా అమ్మ కావాలి.. నువ్వు లే అమ్మా అంటూ ఆ చిన్నారి ఏడవడంతో అందరూ కంటతడి పెట్టారు. చెల్లి చేతులు పట్టుకుని లే చెల్లె ఆడుకుందాం అంటూ ఏడ్చేసింది. చదవండి: Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం -
ఆర్థిక ఇబ్బందులు, తరచూ భార్యతో గొడవలు.. పొద్దున్న తలుపు తెరచి చూస్తే..
సాక్షి,రాజేంద్రనగర్( హైదరాబాద్ ): సెల్ఫీ వీడియో తీసుకోని ఓ ఫోటోగ్రాఫర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(30) కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీనికి తోడు భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకోని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో భార్యతో పాటు బావమరిది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. ఉదయం ఇంట్లో నుంచి చంద్రశేఖర్ బయటకు రాకపోవడంతో స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
అత్త తిట్టిందని.. కోడలు ఎంత పని చేసిందంటే..!
తాడిమర్రి(అనంతపురం జిల్లా): అత్త మందలించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన దాసరి వెంకటేష్ పెద్ద కుమారుడు వెంకటనరసింహులు ప్రైవేట్ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ నౌకరుగా పని చేస్తున్న మాల్యవంతం నివాసి ఏకుల రామాంజినేయులు కుమార్తె పుష్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 14 నెలల కవలలు (బాబు, పాప) ఉన్నారు. (చదవండి: వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు) ఇంటిలో పని సక్రమంగా చేయడం లేదంటూ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో అత్త సావిత్రమ్మ మందలించడంతో మనస్తాపం చెందిన పుష్ప.. గ్రామ శివారులోని వేప చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఏకపాదంపల్లికి చేరుకుని అత్తింటి వారిపై దాడికి ప్రయత్నించారు. స్థానికులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. విషయం తెలుసుకున్న ధర్మవరం రూరల్ సీఐ మన్సూరుద్దీన్, తహసీల్దార్ హరిప్రసాద్, ఏఎస్ఐ వన్నప్ప ఆ గ్రామానికి చేరుకుని ఇరు కుటుంబాలతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు కేసు నమోదుకు విముఖత వ్యక్తం చేయడంతో పోస్టుమార్టం నిమిత్తం పుష్ప మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం -
ఒక్కగానొక్క కొడుకు.. సరదాగా స్నేహితులతో బయటకు.. మృతదేహమై ఇంటికి
సాక్షి,లావేరు( శ్రీకాకుళం): స్నేహితులతో చెరువుకు వెళ్లిన కుర్రాడు మృతదేహమై ఒడ్డుకు చేరాడు. గార, లావేరు మండలాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలోని కేశవరాయునిపురం గ్రామంలో చెరువులో మునిగి అదే గ్రామానికి చెందిన ఇనపకుర్తి సూర్య(12) సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సూర్య లావేరు హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ద సరా సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉన్న విద్యార్థి అదే గ్రామానికి చెందిన మరో నలుగురు విద్యార్థులతో సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గ్రామంలోని ఎర్ర చెరువులో స్నానానికి వెళ్లాడు. ఇటీవలే ఆ చెరువులో జేసీబీతో మట్టి తీశారు. స్నానానికి దిగిన సూర్య లోపలకు వెళ్లి ఆ గోతుల్లో చిక్కుకుని మునిగిపోయాడు. మిగిలిన విద్యార్థులు భయపడి ఇళ్లకు వచ్చేశారు. రాత్రి 7 గంటలు దాటినా సూర్య ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా.. విద్యార్థి చెరువుకు వెళ్లాడని తెలిసింది. అంతా కలిసి చెరువుకు వెళ్లి గాలించగా సూర్య మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కుమారుడు ఇలా పన్నెండేళ్లకే చనిపోవడంతో తల్లిదండ్రులు రమేష్, రాణి దంపతులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: పెళ్లి సంబంధాలు రావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. -
విందుకు వెళ్లి వస్తూ.. కాసేపట్లో ఇంటికి ,అంతలో..
సాక్షి, పరిగి( హైదరాబాద్): ఎదురుగా వస్తున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ పట్టణ కేంద్రంలోని వినాయకచౌక్ పసాలిగల్లికి చెందిన షేక్ అబ్రార్(23), సయ్యద్ ఉమర్ రిజ్వాన్‌లు ఆదివారం నగరంలోని ఓ విందుకు హజయ్యారు. సోమవారం తెల్లవారుజామున తాండూర్ బయలు దేరారు. ఉదయం 5:30గంటలకు మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలో కొడంగల్ నుంచి పరిగి వైపు అతివేంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌నడుపుతున్న షేక్ అబ్రార్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సయ్యద్ ఉమర్ రిజ్వాన్‌కు తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అక్కడికక్కడే మృతి చెందిన అబ్రార్ మృతదేహం రోడ్డుపై పడటంతో వెనుక వస్తున్న వాహనాలు మృతదేహంపై నుంచి వెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతుల బంధువు షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: Drugs Case: రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్..షాకైన పోలీసులు -
మోదీజీ నా చివరి కోరికలు తీర్చండి, ప్లీజ్.. అలా అయితేనే..
భోపాల్:ఇటీవల కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బాలుడు తాను అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నానే బాధతో రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 16 ఏళ్ల బాలుడు కదిలే రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్వాలియర్ నగరంలోని క్యాన్సర్ పహాడియా ప్రాంతానికి చెందిన అజిత్ వంశకర్ అనే 11వ తరగతి విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం కదిలే రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అతని మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు తెలిపారు. అందులో.. తాను ఫేమస్ డ్యాన్సర్ కావాలనే కోరిక తనకు బలంగా ఉండేదని కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది కుదరలేదని అందుకు తీవ్ర నిరాశకు లోనైట్లు రాశాడు. మరో వైపు అతని కుటుంబ సభ్యులు కూడా అతని కలకి అనుకూలంగా లేరని పేర్కొన్నాడు. తన కోసం ఓ పాట ట్యూన్ చేయాలని కోరుతూ.. ఆ పాటను సింగర్ అర్జిత్ సింగ్ పాడాల్సిందిగా, నేపాలీ కొరియోగ్రాఫర్ సుశాంత్ ఖత్రితో డాన్స్ కంపోజ్ చేయాలని అందులో తెలిపాడు. తన చివరి కోరికను నెరవేర్చాలని ఆ బాలుడు ప్రధాని నరేంద్ర మోదీని కూడా అభ్యర్థించాడు. ఇవి చేస్తే తన ఆత్మ శాంతిస్తుందన్నాడు. చివరిలో తన జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారని తెలిపాడు. చదవండి: Drugs Case: రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్..షాకైన పోలీసులు -
నటుడు సత్యజిత్ కన్నుమూత
Kannada Actor Satyajith Passes Away: ప్రముఖ కన్నడ సినీ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కన్నడంలో ఆరు వందలపైగా సినిమాలలో నటించారు. ఇటీవల కాలికి గాయమై గ్యాంగ్రిన్‌తో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. ఆయన అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్. 10వ తరగతి వరకు చదివిన ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టారు. విలన్ పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించారు. సత్యజిత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. చదవండి: (ఆన్లైన్ రమ్మీకి బానిసై ఇంజినీర్ ఆత్మహత్య) -
భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య
పట్నా: వారసత్వ భూమి తగాదాల కారణంగా ఒక వ్యక్తిని, గర్భవతి అయిన అతని భార్యను బంధువులు కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం వైశాలి పోలీస్ స్టేషన్‌లోని బేలార్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లోని జరాంగ్ రాంపూర్ గ్రామంలో ఈ జంట హత్య జరిగింది. మృతులు శశి ఠాకూర్, అతని భార్య సంగీత దేవి ఐదు నెలల గర్భిణి. ఈ దంపతులకు రెండు, మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శశి ఠాకూర్‌కు తన బంధువులతో వారసత్వ భూమికి సంబంధించి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ విషయంపై తన బంధువులతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో శశి ఠాకూర్, అతని భార్య సంగీతా దేవిని వారి బంధువులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆపై పదునైన కత్తితో వారి గొంతులు కోసి హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను ఒక నిందితుడి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ ఘర్షణలో మృతుడికి చెందిన ముగ్గురు బంధువులకు గాయాలు కాగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యకు గురైన గర్భిణీ సంగీతా దేవి తల్లి అహల్య దేవి 17 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సన్నీ ఠాకూర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య -
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ కూతురు స్నేహ ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా రాత్రి గుడిసేలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భార్యభర్తలతో సహా నలుగురు పిల్లలు చనిపోయారు. కూతురు స్నేహకు తీవ్రగాయాలు కావటంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చదవండి: (ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు) -
Adilabad: పిడుగుల వాన.. ముగ్గురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పిడుగులతో దద్దరిల్లింది. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా గరన్ సింగ్ (45) , ఆశాబాయి (30) అక్కడికక్కడే మృతి చెందారు. బండల్ నాగపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రగాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బీమ్‌పూర్ మండలం పిప్పల్ కోటిలో పిడుగుపాటు ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. జైనథ్ మండలం సాంగ్వి కే పిడుగుపాటుకు పదిహేను మేకలు మృతిచెందాయి. -
భర్త మరణవార్త విని భార్య మృతి
సాక్షి, ఒంగోలు: భర్త మరణవార్త విని భార్య మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బల్లికురవ మండలం చిన అంబడిపూడికి చెందిన చినపాపారావు (61), భార్య రమాదేవి (57)కి కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె సునీత ఉన్నారు. కుమార్తెను అదే గ్రామంలోని మేనల్లుడు రమేష్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తె, అల్లుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరంలో ఉంటున్నారు. కుమారుడు చంద్రశేఖర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. రెండేళ్లుగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతూ గ్రామంలో ఉండటం లేదు. పిల్లల దగ్గర ఉంటున్నారు. 15 రోజుల క్రితమే చెన్నై నుంచి భార్యభర్తలు వచ్చి కుమార్తె దగ్గర ఉన్నారు. చదవండి: (విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి) మంగళవారం తెల్లవారుజామున తనకు ఒంట్లో బాగాలేదని పాపారావు చెప్పడంతో అతనిని వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే వేకువజామున 3 గంటల సమయంలో చనిపోయాడు. పాపారావు మృతి విషయం ఉదయం 5 గంటల సమయంలో ఇంటిదగ్గర ఉన్న అతని భార్య రమాదేవికి చెప్పడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను హుటాహుటిన చిలకలూరిపేటలోని ఓప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రెండు గంటల వ్యవధిలోనే భార్య, భర్త ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను చినఅంబడిపూడి తీసుకొచ్చి గ్రామంలో అత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడిగా పాపారావుకు పేరుంది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతల పేరయ్య, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాపారావు, రమాదేవిల మృతదేహాలకు నివాళులర్పించారు. చదవండి: (వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి) చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) -
విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి
సాక్షి, సూళ్లూరుపేట: పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం పరిధిలోని పాములమిట్ట చెరువులో పదుల సంఖ్యలో విదేశీ వలస విహంగాలు ఆదివారం (పెలికాన్స్) మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా విహంగాలు మృతి చెందుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువు నీటిలో వాటి కళేబరాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి సంతనోత్పత్తి కోసం వచ్చే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50కు పైగా పెలికాన్స్ చనిపోయినట్లు సమాచారం. చదవండి: (పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..) చనిపోయిన పెలికాన్ పక్షుల రెక్కలను చూపిస్తున్న వైల్డ్ లైఫ్ సిబ్బంది చెరువులో ఇటీవల టన్నుల కొద్దీ చేపలు చనిపోగా, ఆహార వేటకు వచ్చిన పక్షులు వారం రోజులుగా చనిపోతున్నాయి. ఆదివారం సుమారు 38 పక్షులు చనిపోయిన విషయాన్ని రైతులు గుర్తించి సమాచారం అందించారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది వెళ్లి చెరువులో చనిపోయిన సుమారు 29 పక్షులను గట్టుకు తీసుకొచ్చారు. చెరువులో చనిపోయిన పక్షుల కళేబరాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల నీళ్లు దుర్గంధభరితంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని వన్యప్రాణి సంరక్షణా విభాగం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత ఘోరం జరుగుతుంటే గుర్తించలేని పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కో గార్డు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వాళ్లు ఉద్యోగాలు వదిలిపెట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అన్న మృతిని తట్టుకోలేక..
సాక్షి, కోనరావుపేట(వేములవాడ): సోదరుని మృతిని తట్టుకోలేక సోదరి కూడా ప్రాణాలు విడిచిన సంఘటన మండలంలోని కనగర్తిలో జరిగింది. కనగర్తికి చెందిన బడే రామయ్య శనివారం మృతి చెందాడు. అన్న మృతదేహాన్ని చూసిన చెల్లి నిజామాబాద్‌కు చెందిన తాళ్లపెల్లి లక్ష్మి కుప్పకూలింది. అన్నాచెల్లెళ్లు ఒకేసారి మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. లక్ష్మికి భర్త పోచయ్య, కుమారుడు కిషన్ ఉన్నారు. మరో ఘటనలో.. పాముకాటుతో యువకుడి మృతి కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల)లో పాముకాటుకు యువకుడు బలయ్యాడు. గ్రామానికి చెందిన చీమల ప్రశాంత్(26) 18 రోజుల క్రితం పొలం వద్ద గడ్డి కోస్తుండగా పాము కాటువేసింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 18 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య వైష్ణవి, కుమారుడు నితీష్ ఉన్నారు. చదవండి: Canara Bank: పక్కా ప్లాన్.. రూ.338 కోట్లు ఎగనామం! -
నరసాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నరసాపురం రూరల్ : నరసాపురం నుంచి పాలకొల్లు వెళ్లే రోడ్డులో పద్మశ్రీ కాలనీ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న యువకులను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్టు పేర్కొంటున్నారు. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న తరువాత ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారంతా ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం రక్తపు మడుగులా మారింది. చదవండి: (పాఠశాల సమీపంలో ఘర్షణ.. ఏడో తరగతి విద్యార్థి మృతి) ప్రమాదంలో పోడూరు మండలం జిన్నూరుకు చెందిన చదలవాడ వంశీ, నరసాపురం కనకదుర్గా థియేటర్ ప్రాంతానికి చెందిన చాట్ల ముఖేష్ కుమార్(16), నరసాపురం వనువులమ్మగుడి ప్రాంతానికి చెందిన సమతం సుబ్రహ్మణ్యం(17) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన పోడూరు మండలం జిన్నూరుకు చెందిన ఇంజమూరి గని, నరసాపురం పెద్దచర్చి ప్రాంతానికి చెందిన లంకాని సాయికుమార్‌లను చికిత్స కోసం పోలీసులు 108 అంబులెన్స్‌లో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసా పురం సీఐ శ్రీనివాసయాదవ్ పర్యవేక్షణలో రూరల్ ఎస్సై ప్రియకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) -
స్నానానికి వెళ్లి.. శవమై తేలాడు
సాక్షి, విజయనగరం: ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ ఓ గిరిజన బాలుడిని బలి తీసుకుంది. సీతంపేట పరిధిలోని బర్నగూడ గ్రామానికి చెందిన ఆరిక సుధీర్ కుమార్ (8) బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలోకి స్నానానికి వెళ్లి అందులో మునిగి చనిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మన్యంలోని గెడ్డలన్నీ పొంగిపొర్లుతున్నాయి. బర్నగూడకు సమీపంలో ఉన్న గెడ్డ కూడా పోటు మీద ఉంది. గ్రామంలోని చిన్నారులు స్నానం కోసం బుధవారం గెడ్డలోకి దిగారు. వారిలో సుధీర్ కాస్త లోపలకు వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకునిపోయాడు. దీంతో చిన్నారులంతా భయపడి ఊరిలోకి వచ్చి విషయం చెప్పారు. గిరిజనులు వెళ్లి వెతకగా అరకిలోమీటరు దూరంలో బాలుడు దొరికాడు. వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి శీతంనాయుడు హైదరాబాద్ వలస వెళ్లి అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి ఆరిక సంతోషమ్మ కూలి పనులు చేస్తుంటారు. సుధీర్ స్థానికంగా ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చలాకీ ఉండే కుర్రాడు ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: ఆరేళ్ల సహజీవనం చేసి.. ఆందోళనకు గురై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
ఉసురు తీసిన వర్షం: ముగ్గురు రైతుల బలవన్మరణం
చిట్యాల/ మొగుళ్లపల్లి/ నార్నూర్/ వేల్పూర్: వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న ముగ్గురు రైతుల్ని ఇటీవలి భారీ వర్షాలు బలి తీసుకున్నాయి. వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో, సాగుకు తీసుకొచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఆయా ఘటనలకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.8 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనవేని ఎల్లయ్య (62)కు 6 ఎకరాల వ్యవసాయ భూ మి ఉంది. దీనికి అదనం గా మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగుచేశాడు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మిర్చి, పత్తి చాలావరకు దెబ్బతింది. మిగ తా పంటకు తెగులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పంటసాగుకు తీసుకొచ్చిన రూ.8 లక్షల అప్పు ఎలా తీర్చాలంటూ కుటుంబసభ్యులతో తన బాధను పంచుకున్నాడు. ఈ క్రమం లో బుధవారం పంటచేను వద్ద పురుగుల మందు తా గాడు. ఎల్లయ్య అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గమనించిన మరో రైతు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో ఎల్లయ్యను చిట్యాల సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 8 ఎకరాల్లో పంట నష్టంతో.. ఇదే జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రా మానికి చెందిన పండుగ చిన్న రాజయ్య (60) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరం వరి, మూడెకరాలు పత్తి, నాలుగు ఎకరాలు మిర్చి సాగు చేశాడు. గత ఏడాది చేసిన అప్పుతో పాటు ఈసారి తెచ్చింది కలిపి రూ.12లక్షల వరకు అప్పు అయ్యింది. ఇటీవలి వరుస వర్షాలతో పంటలు మొత్తం దెబ్బతినడంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాజయ్య భార్య సరోజన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు, చెల్లెలి పెళ్లిపై బెంగతో.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన యువరైతు అడే శ్రీనివాస్ తన తండ్రి చనిపోవడంతో గ్రామ శివారులోని ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో పత్తి, ఎకరంలో కూరగాయలు సాగు చేశాడు. కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట తెగుళ్ల బారిన పడి ఎర్రగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంట పాడవడంతో అప్పులు ఎలా తీర్చాలో, చెల్లెలి పెళ్లి ఎలా చేయాలో తెలియక మూడు రోజులుగా దిగులు చెందుతున్నాడు. బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన శ్రీనివాస్ (35) అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.5 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు భార్య, కూతురు, తమ్ముడు, చెల్లెలు, తల్లి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై తెలిపారు. పంట కొట్టుకుపోవడం తట్టుకోలేక.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో వరదనీటిలో కొట్టుకుపోయిన మక్క, పసుపు పంటను చూసి తట్టుకోలేక కానూర్ నాగమణి అనే మహిళా రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పంట చేనులో తాగడానికి యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు రైతులు ఆమెను అడ్డుకున్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మంగళవారం పెద్దవాగుకు భారీ వరద వచ్చింది. దీంతో కరకట్ట తెగిపోయి వరదంతా నాగమణితో పాటు మరో ఏడుగురు రైతుల పంటలను ముంచెత్తింది. నాగమణికి చెందిన ఎకరం పంట భూమి కోతకు గురై వాగులో కలిసిపోగా, మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బుధవారం దెబ్బతిన్న పంటలు చూసిన నాగమణి, ఆమె భర్త లక్ష్మణ్, ఇతర కుటుంబసభ్యులు బోరున విలపించారు. తీవ్ర ఆవేదనతో నాగమణి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా మిగతావారు అడ్డుకున్నారు. వాగులో కలిసిన తమ భూమికి బదులు ప్రభుత్వం భూమి ఇచ్చి ఆదుకోవాలని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని లక్ష్మణ్ కోరాడు. -
ఘోరం: బెంగళూరులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ఐఐఎం సమీపాన బేగూర్‌లోని దేవరచిక్కనహల్లిలోని ఒక అపార్ట్మెంట్లో సిలిండర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం కాగా మరికొంత మందికి గాయాలయ్యాయి. కాగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అశ్రిత ఆస్పైర్ అపార్ట్మెంట్లో పైప్‌లైన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది. అగ్నిమాపక శాఖ నియంత్రణ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4.41 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం రావడంతో అగ్నిమాపకశాఖ సిబ్బందితో పాటు మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. Fire at apartment called Ashrith Aspire near IIM #Bangalore #Karnataka. Fire engines rushed to spot. Locals says people are trapped. pic.twitter.com/O2PpnAEQzu — Imran Khan (@KeypadGuerilla) September 21, 2021 Bengaluru | Fire broke out at an apartment in Devarachikkana Halli, Begur due to gas leakage in pipeline around 3:30 pm, this afternoon. Three fire tenders at the spot: Fire department#Karnataka pic.twitter.com/InXOtx9t6W — ANI (@ANI) September 21, 2021 చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. -
తోడుగా ఒకరు.. కుటుంబం కోసం మరొకరు.. వారి ప్రయాణం ఒకచోటే ఆగింది
సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): ఒకరు భర్తకు తోడుగా పరిశ్రమ నడిపిస్తున్నారు. మరొకరు కట్టుకున్న వాడితో కష్టాన్ని పంచుకుంటున్నారు. కానీ వీరిద్దరి ప్రయాణం ఒక్క చోటే ఆగిపోయింది. పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించి తామూ ఎదగాలనుకున్న మహిళ ఆశ అడియాస కాగా.. నెలకింత సంపాదించి భర్తతో పాటు కుటుంబ భారాన్ని మోస్తున్న భార్య పిల్లలను ఒంటరి చేసి వెళ్లిపోయింది. మండలంలోని పద్మతుల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కప్ప హేమలత(24), పిరియా రజని(35)లు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని మిక్చర్ తయారు చేసే పరిశ్రమ ఉంది. ఈ మధ్యన పనులు పెద్దగా లేకపోవడంతో కార్మికులు ఎవరూ రావడం లేదు. దీంతో నిర్వాహకుడు కప్ప వెంకటరావు భార్య హేమలత(24), అక్కడ పనిచేసే కార్మికురాలు మకరాంపురం గ్రామానికి చెందిన పిరియా రజని(35)లు బుధవారం ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి దిగారు. నీటితో కడుగుతుండగా మిక్చర్ తయారీలో పిండి మిక్సీ చేసే యంత్రం నుంచి కరెంటు పాస్ కావడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. (చదవండి: నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..) కార్మికురాలు పిరియా రజని అక్కడికక్కడే మృతి చెందగా, యజమాని భార్య కప్ప హేమలత కొద్దిసేపటి వరకు మృత్యువుతో పోరాడి తర్వాత మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి హేమలత కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి ఆమెను బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి.. ఈ పరిశ్రమ యాజమాని కప్ప వెంకటరావు స్వగ్రామం కేసరపడ. భార్య హేమలత కన్నవారి గ్రామం పద్మతుల. ఆరు నెలల కిందటే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేశారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో భర్త వెంకటరావుతోపాటు మిగతా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న రజని భర్త నారాయణ సమీపంలో ఉన్న ఒక పీచు పరిశ్రమలో పనిచేస్తున్నారు. భార్య కూడా ఇక్కడ పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. వీరికి వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో సాయి ఆరో తరగతి చదువుతుండగా, సాత్విక్ మూడో తరగతి చదువుతున్నాడు. వీరి స్వగ్రామం సోంపేట మండలం బెంకిలి. బతుకు తెరువుకోసం కొన్నాళ్ల నుంచి మకరాంపురంలో నివాసముంటూ ఇక్కడ పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా? -
నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: చదువు భారమై.. మానసిక ప్రశాంతతకు దూరమై ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణమైన రీతిలో తల్లిదండ్రుల ముందే ప్రాణాలు తీసుకుంది. ఈ దయనీయమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తంగకుమార్ తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలోని సిమెంట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమార్తె అబిదా (19) శ్రీపెరంబుదూరులోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ఇష్టం లేదు.. అమ్మానాన్నల బలవంతం మీద కాలేజీలో చేరానని హాస్టల్లోని తోటి విద్యార్థుల వద్ద తరచూ వాపోయి.. మానసిక కుంగుబాటుకు లోనైంది. ఈ విషయం ప్రిన్సిపల్‌కు తెలియడంతో తల్లిదండ్రులను పిలిపించాడు. అమ్మాయి బాగా కోలుకున్న తరువాత ఆమెకు ఇష్టమైతేనే కాలేజీకి పంపాలని ఆయన సూచించగా వారు సమ్మతించారు. సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరే ముందు.. హాస్టల్ గదిలో ఉన్న సామాన్లు తెచ్చుకుంటానంటూ తల్లిదండ్రులను గౌండ్ ఫ్లోర్లో కూర్చోబెట్టి అబిదా మిద్దెపైకి వెళ్లింది. ఐదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లముందే అబిదా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది తల్లడిల్లిపోయారు. మరో ఘటనలో.. తమ్ముడు తిట్టాడని మరో విద్యార్థిని.. చెన్నై తిరువీక నగర్‌కు చెందిన అశోకన్‌కు ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె కావ్య (17) ఉంది. ఆమెకు, తమ్ముడికి మధ్య సోమవారం వాదులాట చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ నచ్చజెప్పి బయటకు వెళ్లారు. మనస్థాపానికి గురైన కావ్య గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. అక్కను చూసి ఆందోళన చెందిన తమ్ముడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారొచ్చి కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక.. -
ఆమె ఒంటరి,జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేరు.. చివరికి..
సాక్షి, పలాస(శ్రీకాకుళం): ఆమె ఒంటరి. జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేని మహిళ. కట్టుకున్న భర్త కాలం చేసిన నాటి నుంచి కన్నబిడ్డలను కష్టపడి పెంచింది. కొడుకు చేతికి అందివచ్చాడని సంతోషించే లోపు విధి అతడిని తీసుకెళ్లిపోయింది. కుమార్తె కూడా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. నా అనే వారు లేక, అద్దె ఇంటిలో కాలం గడిపిన బత్తిన ఆదిలక్ష్మి (70) మంగళవారం కాలం చేశారు. ఇన్నాళ్లుగా ఆమెను చూస్తున్న స్థానికులు ఆదిలక్ష్మి మృతితో కన్నీరు పెట్టుకున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన బత్తిన ఆదిలక్ష్మి(70) మంగళవారం మృతి చెందారు. ఆమె భర్త చాలా కాలం కిందటే చనిపోయారు. పదేళ్ల కిందట కొడుకు కూడా మరణించాడు. ఒక్కగానొక్క కుమార్తె సుమిత్ర వజ్రపుకొత్తూరులో తన భర్తతో కలసి ఉంటున్నారు. కొద్దికాలంగా ఆదిలక్ష్మి ఆరోగ్య స్థితి బాగోలేదు. ఇటీవల కుమార్తె వద్ద కూడా ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కుమార్తె తల్లి వద్దకు వచ్చే సరికి ఆదిలక్ష్మి ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆమె పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చనిపోయారు. దీంతో ఆమె తాను ఉంటున్న వజ్రపుకొత్తూరుకు తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతితో బొడ్డపాడు గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. దుష్ప్రచారం తగదు.. పింఛన్ అందకపోవడం వల్లే వృద్ధురాలు బత్తిన ఆదిలక్ష్మి మరణించిందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పలాస ఎంపీడీఓ ఎన్.రమేష్‌నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: వైరల్: ‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’ -
గుంతకల్లులో విషాదం: డాక్టర్ ఆత్మహత్య
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఆర్మీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనం భరించలేక ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుంతకల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని భాగ్యనగర్ గంట చర్చి ఏరియాకు చెందిన వెంకటస్వామి, నాగమణి దంపతుల కుమారుడు కార్తీక్ వర్ధన్ (33)కర్నూలు మెడికల్ కాలేజీలో 2011లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తదనంతరం ఆగ్రా మిలటరీ హాస్పిటల్లో వైద్యుడిగా ఉద్యోగం పొందాడు. తనతో పాటు ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆదోనికి చెందిన డాక్టర్ అప్పియాను ప్రేమించి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. (చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో?) ఈమె ప్రస్తుతం పుణేలోని నేవీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా కార్తీక్‌వర్ధన్, అప్పియా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. వారం రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చిన కార్తీక్ వర్ధన్ శనివారం రాత్రి వరకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు. కాగా తానొకచోట, భార్య, తల్లిదండ్రులు మరోచోట ఉండటంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌వర్దన్ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పద్మావతి తెలిపారు. చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు -
గజరాజా.. ఎందుకింత ఘోరం చేశావ్
క్రిష్ణగిరి: అందరూ గజముఖున్ని పూజించే సమయంలో ఇద్దరు రైతులను ఓ అడవి ఏనుగు పొట్టనబెట్టుకుంది. ఈ విషాద సంఘటన సూళగిరి సమీపంలో చోటు చేసుకొంది. వేపనపల్లి సమీపంలోని నేర్లగిరి గ్రామానికి చెందిన రైతులు నాగరాజ్, చంద్రప్ప. శుక్రవారం రాత్రి వారి పొలాల వద్దకు కాపలా వెళ్లారు. ఈ సమయంలో ఒంటి ఏనుగు వారిపై దాడి చేయడంతో ప్రాణాలు విడిచారు. శనివారం ఉదయం ఆ ప్రాంతానికెళ్లిన స్థానికులకు నాగరాజ్, చంద్రప్పల మృతదేహాలను గమనించి అటవీశాఖాధికార్లకు సమాచారమిచ్చారు. అటవీ సిబ్బంది మృతదేహాలను స్వాధీనపరుచుకొని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వేపనపల్లి ఎమ్మెల్యే కే.పి. మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే మురుగన్‌లు ఆస్పత్రికెళ్లి మృతుల బంధువులకు సంతాపం తెలియజేశారు. అటవీశాఖాధికారిణి కార్తిక బాధిత కుటుంబాలకు తలా రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఘోరంతో పేరండపల్లి, కామనదొడ్డి, పోడూరు, ఆళియాళం, రామాపురం, శానమావు తదితర అటవీ ప్రాంత గ్రామాల రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చదవండి: పచ్చని కొమ్మలు వాడనే లేదు.. పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. అంతలోనే.. -
పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. అంతలోనే ఘోరం జరిగింది
రామభద్రపురం(విజయనగరం): ఆ ఇంటి ముంగిట కట్టిన పచ్చని కొమ్మలు వాడనే లేదు.. పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. గణపతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించి.. సంతోషంగా సాగిపోతున్న నూతన జంటపై విధి కన్నెర్ర చేసింది. చెరువు రూపంలో భర్తను కాటేసింది. పెళ్లయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు పట్టణంలోని దుర్గాన వీధికి చెందిన రాంబార్కి తిరుపతిరావు(29) విశాఖపట్టణంలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రామభద్రపురం మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల కుమారిని ఈ ఏడాది జూన్ 24న వివాహం చేసుకున్నాడు. వినాయక చవితిని అత్తవారింట్లో సరదాగా జరుపుకుందామన్న ఉద్దేశంతో భార్యా భర్తలిద్దరూ సాలూరులో గురువారం సాయంత్రం బాలగణపతి విగ్రం కొనుగోలు చేసి జన్నివల స వచ్చారు. వినాయక పూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిపారు. అదేరోజు సాయంత్రం గ్రామం పొలిమేరల్లో ఉన్న పత్తిగుళ్లవాని చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండడం, చెరువు లోతును గుర్తించని తిరుపతిరావు కాస్త ముందుకు వెళ్లాడు. అంతే.. ఈత రాకపోవడంతో కుటుంబ సభ్యుల కళ్లముందే మునిగిపోయాడు. భార్య కుమారి కేకలు వే యడంతో పలువురు చేరుకుని మునిగిపోతు న్న తిరుపతిరావును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడంతో హుటాహుటిన సాలూరు సీహెచ్‌సీకి తరలించినా ఫలితం లేకపోయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహానికి సాలూరు సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. వివాహమైన రెండు నెలలకే తిరుపతిరావు మృతితో అటు కన్నవారు, ఇటు అత్తవారింటిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తవుడమ్మ, తవుడు, అత్త బుచ్చమ్మ, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: ఏడాదిన్నర పాప.. ఆడుకుంటూ.. మృత్యు ఒడిలోకి -
భార్య కోసం అత్తవారింటికి వెళ్తూ.. అంతలో..
కొరాపుట్(భువనేశ్వర్): గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. మహదేవీపురం చట్టిగుడ గ్రామానికి చెందిన భాస్కర్ తరుకు కూలి పనులు చేసుకొంటూ కొరాపుట్‌లో నివసిస్తున్నాడు. 8నెలల గర్భిణిగా ఉన్న తన భార్య ముదిలితో శుక్రవారం రాత్రి గొడవ పడ్డాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యకు నచ్చజెప్పి, ఇంటికి తీసుకు రావడానికి బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో ఐఆర్బీ క్యాంప్, ఆదర్శ విద్యాలయానికి మధ్య జాతీయ రహదారి 26పై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. గ్రానైట్ క్వారీలో ఇద్దరు దుర్మరణం నందిగాం: మండలంలోని గొల్లూరు పంచాయతీ సొంఠినూరు రెవెన్యూ పరిధి సర్వే నంబరు–1లోని సొంఠినూరు కొండపై ఉన్న ఎస్కేఎస్ క్వారీలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాయి మీద పడడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రోజువారీ పనుల్లో భాగంగా క్వారీలో గ్రానైట్ బ్లాక్‌లను యంత్రాలతో తీస్తున్న సమయంలో యంత్రం నుంచి పట్టు తప్పి ఒక బ్లాక్ కిందకు జారడంతో అక్కడ ఉన్న ఇద్దరు ఆ బ్లాక్ కింద చిక్కుకొని మృతి చెందారు. మృతి చెందినవారు ఒడిశాకు చెందిన ఉత్తమ్(43), టెక్కలి మండలం భగవాన్‌పురానికి చెందిన పొన్నాడ బాబూరావు(37)గా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న నందిగాం ఎస్ఐ సనపల బాలరాజు తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గ్రానైట్ బ్లాక్ కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాయి పై నుంచి పడడంతో మృతదేహాలు రాయి కిందనే ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీయడం కష్టమవుతోంది. మృతుల్లో ఒకరైన బాబూరావు తన భార్య, ఇద్దరు పిల్లలతో టెక్కలిలో నివాసం ఉంటున్నారు. ఆయన మరణంతో స్వగ్రామం భగవాన్‌పురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురి ప్రాణాలు గాల్లోకి -
గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
గుత్తి: పట్టణంలో వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప(25) అనే యువకుడు వినాయక మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని స్వీపర్స్ కాలనీకి చెందిన ఓబుళమ్మ కుమారుడు పెద్ద కుళ్లాయప్ప శనివారం రాత్రి 11 గంటల సమయంలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపానికి వెళ్లాడు. అక్కడే సుమారు గంటన్నర పాటు గడిపాడు. తర్వాత మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సీఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం? -
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
హయత్‌నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు. ► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు. ► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది -
అయ్యో..ఎంత ఘోరం, ఒక్కరి నిర్లక్ష్యం.. ముగ్గురి ప్రాణాలు గాల్లోకి
మేడ్చల్(హైదరాబాద్): పనులు ముగించుకుని ఇంటికి బైకుపై బయలుదేరిన ఓ యువకుడు..మూడేళ్ల కుమారునితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరుగుపయనమైన ఓ మహిళ అకస్మాత్తుగా మృత్యుఒడికి చేరుకున్నారు. ఓ కారు డ్రైవర్ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా...వారి ప్రమేయం లేకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి బంధువులకు దు:ఖాన్ని మిగిల్చారు. ఈ విషాదకర సంఘటన శనివారం సాయంత్రం మేడ్చల్ శివారులోని రేకులబావి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు..సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొల్తూర్ గ్రామానికి చెందిన సుధీర్ వర్మ (25) మేడ్చల్‌లో పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లావణ్య (30), కుమారుడు కౌశిక్ (3)తో కలిసి శామీర్‌పేట్ మండలం జగన్‌గూడ గ్రామంలోని తమ బంధువుల ఇంటి వెళ్లి ప్యాసింజర్ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో వీరి వాహనాలు రేకుల బావి వద్దకు రాగానే..రోడ్డుకు ఆవలివైపు తూప్రాన్ వైపు వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి.. వేగంగా ఇవతలికి ఎగిరి పడి ముందు బైకును..ఆ తర్వాత ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో సుధీర్‌వర్మ, లావణ్యలు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా..కౌశిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు గాయపడ్డారు. కారు డ్రైవర్ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో మహిళ ఉన్నారని, వారికి కూడా గాయాలైనట్లు సమాచారం అందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మేడ్చల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కరి నిర్లక్ష్యం.. మూడు నిండు ప్రాణాలు కారు డ్రైవర్ నిర్లక్ష్యం అమాయకులైన ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డూ అదుపూ లేని వేగంతో వెళ్తున్నాయని, దీంతో ఎంతో మంది స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: ఒంటరి ప్రయాణికులనే సెలక్ట్ చేసుకుని.. ఆపై.. -
పండగ పూట పెను విషాదం
నరసన్నపేట(శ్రీకాకుళం): మండలంలోని రావాడపేట వద్ద అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. వినాయక విగ్రహాలు కొనుగోలుకు వస్తూ ఒకరు.. ఉప్పు అమ్మకాలు చేసి ఇంటికీ వెళ్తూ మరొకరు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయా యి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే ఉదయానికే ఇంటి నుంచి జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన చింతు రామారావు(50) లగేజీ ఆటోపై ఉప్పు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయానికే ఇంటి నుంచి బయలుదేరి వ్యాపారం ముగించుకొని ఇంటికి పయనమయ్యాడు. అలాగే గార మండలం తూలుగుకు చెందిన పిట్ట గోవిందరావు సరియాపల్లిలో తన బంధువుల ఇంటికి ఆటోపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకొని నరసన్నపేట వైపు బయలుదేరాడు. రెండు ఆటోలు రావాడపేట వద్దకు వచ్చే సరికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గోవిందరావు ఆటోలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. రామారావు ఆటో కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. నరసన్నపేటలో వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు తన మిత్రులతో కలిసి ఆటోలో వస్తున్న సారవకోట మండలం కొత్తూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి దాసరి శ్యామ్‌సుందరరావు(17) తీవ్రంగా గాయపడటంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే ఘటనలో బురద కొత్తూరుకు చెందిన భార్గవ, సింహాద్రి, ఆటో డ్రైవర్ గోవిందరావు గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని నరసన్నపేట ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తూరులో విషాదఛాయలు సారవకోట: శ్యామసుందరరావు మృతితో కోదడ్డపనస పంచాయతీ కొత్తూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో సరదాగా ఉండే తమ కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు మణమ్మ, కామేశ్వరరావులు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: సైదాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి -
మార్చురీలో కన్న తండ్రి.. ‘ నాన్న... లే నాన్నా!’ అంటూ..
చుట్టూ ఆందోళనతో తిరుగాడే జనం.. ఏం జరిగింది? అంతు చిక్కడం లేదు. అమ్మమ్మ కళ్లు చెమర్చి ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నారో ఏడేళ్ల బాలుడికి తెలియదు. ‘అమ్మమ్మ.. నిన్నటి నుంచి నాన్నను చూడలేదు. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది...’ ఆ బాలుడి మాటలకు గుండెలకు హత్తుకున్న అమ్మమ్మ మౌన రోదనే సమాధానమైంది. కన్నతండ్రిని చూడాలన్న ఆరాటంతో తమను చుట్టు ముట్టిన జనాన్ని తప్పించుకున్న ఆ బాలుడు మెల్లగా మార్చురీలో కాలు పెట్టాడు. డాక్టర్‌గా మెడలో స్టెత్ వేసుకుని హుందాగా తిరుగాడే నాన్న అక్కడ స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు. ‘నాన్న లే నాన్న’అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని కదిపాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు ‘నాన్న పడుకుని ఉన్నాడు.. లేచాక మాట్లాడుదువుగాని రా’ అంటూ నచ్చచెప్పి మార్చురీ బయట ఉన్న అమ్మమ్మ వద్దకు చేర్చారు. గురువారం అనంతపురం శివారులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ రాజేష్ కుమారుడు రోహన్ ఆవేదన ఇది. సాక్షి,అనంతపురం క్రైం: నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీ శిల్పారామం ప్రవేశ మార్గంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ దేశాయి గురు రాజేష్ (39) అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు...బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పనిపై జేఎన్టీయూఏ వద్దకు వెళుతున్నట్లు భార్య డాక్టర్ లక్ష్మి (బి.పప్పూరు పీహెచ్సీ వైద్యాధికారి)కు తెలిపి ఇంటి నుంచి డాక్టర్ రాజేష్ బయటకు వచ్చారు. అర్ధరాత్రి 1 గంటైనా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అంటూ సమాధానం వచ్చింది. వేకువజామున 44వ జాతీయ రహదారిపై శిల్పారామం వద్ద టీ కొట్టు తెరిచేందుకు వచ్చిన వెంకటేష్ నాయక్.. ప్రమాదానికి గురైన కారును గమనించి, ఆ చుట్టుపక్కల గాలించాడు. పక్కనున్న సీ స్క్వయర్ కాఫీ క్లబ్ ప్రహరీ వద్ద ఓ మృతదేహం పడి ఉండడంతో సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్, మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని డాక్టర్ రాజేష్‌గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిందిలా.. నగరంలోని రెండో రోడ్డులో నివాసముంటున్న డాక్టర్ రాజేష్.. అర్ధరాత్రి తన హుండాయ్ వెర్నా కారులో తపోవనం ఫ్లై ఓవర్ నుంచి హైదరాబాద్ వైపుగా వేగంగా వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. సీ స్క్వయర్ కాఫీ క్లబ్‌కు అమర్చిన సీసీ కెమెరాలో రాత్రి 11.37 గంటలకు నమోదైన ఫుటేజీలో డాక్టర్ రాజేష్ గాలిలో చక్కర్లు కొడుతూ ఎగిరి వచ్చి పడిన దృశ్యాలు కనిపించాయి. తొలుత శిల్పారామం నామఫలకాన్ని ఢీకొన్న కారు.. ఆ వేగానికి దాదాపు 15 అడుగుల ఎత్తు గాల్లోకి లేచింది. తెరుచుకున్న కారు డోరు నుంచి డాక్టర్ రాజేష్ బయట పడ్డారు. దాదాపు 181 అడుగుల దూరం గాలిలో చక్కర్లు కొడుతూ వెళ్లి సీ స్క్వయర్ కాఫీ క్లబ్ ప్రహరీ వద్ద పడ్డారు. పడిన వెంటనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురి దిగ్భ్రాంతి నగర పాలక సంస్థ ఎంహెచ్‌ఓగా ఆయన పనిచేస్తున్న సమయంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ రాజేష్ అహరి్నశం శ్రమించారు. ప్రమాదంలో ఆయన మృతి చెందారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనైన మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి, వైఎస్సార్ సీపీ నేత అనంత చంద్రారెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: వివాహితపై గ్యాంగ్ రేప్ -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్ట్ క్రికెటర్ మృతి
డర్బన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్టు క్రికెటర్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాన్ వాట్కిన్స్ (98) మృతి చెందారు. ఆయన కరోనాతో మరణించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. 1949లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాన్ వాట్కిన్స్ 15 టెస్టులు ఆడారు. తన కెరీర్లో 679 పరుగులు చేసి, 31 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా... 1952-53 మధ్యకాలంలో ఆస్ట్రేలియా పర్యటనలో కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు సాధించారు. ఈ సిరీస్‌లో జాన్ వాట్కిన్స్ 408 పరుగులు, 16 వికెట్లు తీశారు. కాగా వాట్కిన్స్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. చదవండి: Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం -
పంజ్‌షీర్ ప్రావిన్స్ పోరులో అఫ్గన్ కీలక ప్రతినిధి మృతి
కాబూల్: ఆదివారం పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో జరిగిన పోరాటంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న బృందంలో కీలక వ్యక్తి మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతి చెందిన వ్యక్తి.. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఫాహిమ్ దాష్టీ, జమియత్-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్ సభ్యుడు, ఆఫ్ఘన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడిగా గుర్తించారు. పంజ్‌షీర్ లోయ హిందూ కుష్ పర్వతాలలో, కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంది. నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వ అనుకూల దళాలలో ఈ ప్రాంతంలో ఉక్కుపాదం మోపిన తరువాత తాలిబాన్లతో వారు పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం లోయ త్వరలో కూలిపోవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అయితే,ఆఫ్గన్ దళాలు మాత్రం అటువంటి వాదనలను ఖండించాయి. దళాల నాయకుడు అహ్మద్ మసౌద్ ఆదివారం మాట్లాడుతూ.. తాలిబాన్లు ప్రావిన్స్ని విడిచిపెడితే తాము పోరాటం ఆపడానికి, చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలిబన్లతో విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మిస్టర్ మసౌద్ అన్నారు. చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్‌పై పట్టు చిక్కేనా? -
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు జవాన్లు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లో నైరుతి ప్రావిన్స్ బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో పారా మిలటరీ సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ జవాన్లు ఐదుగురు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. కాగా తెహ్రీకె తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. క్వెట్టా-మాస్తంగ్ రోడ్డులోని చెక్‌పాయింట్ దగ్గర ఈ దాడి జరిగింది. చెక్‌పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులపైకి ఓ వ్యక్తి బైక్‌పై దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కూడా ఈ దాడిని ఖండించారు. చదవండి: Panjshir: పంజ్‌షీర్ ప్రతిఘటన దళాల దెబ్బ?.. గందరగోళంగా అఫ్గన్ ఆధిపత్యపోరు -
టీవీ మీద పడి చిన్నారి మృతి.. బర్త్‌డేకు తెచ్చిన గౌను వేసి..
సాక్షి, కృష్ణా(నందిగామ): మరో వారంలో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారిని ఇంట్లోని టీవీయే యమపాశమై కబళించింది. మండల పరిధిలోని కంచల గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో చిన్న కుమార్తె చలమల కీర్తి (11 నెలలు) ఇంట్లో ఆడుకుంటూ టీవీ స్టాండ్‌ను తాకడంతో టీవీ చిన్నారిపై పడింది. దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో బయట ఇంటి పనులు చేసుకుంటున్న తల్లి సౌందర్య లోపలికి వచ్చి బంధువుల సాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే చిన్నారి తుది శ్వాస విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కీర్తి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన రోజు వేడుక కోసమని ఆన్లైన్లో కొనుగోలు చేసిన గౌనునే.. ఆ చిన్నారికి ధరింపజేసి అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: బెజవాడలో గోల్డ్ మాఫియా! -
ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను..
మెట్పల్లి(కోరుట్ల): అత్తింటి వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సదాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి సాయిరాంకాలనీకి చెందిన రమ్య(20)కు అదే కాలనీకి చెందిన దొమ్మాటి నరేందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత నరేందర్, అతని తల్లి జమునలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది, గత నెల 31న ఇంట్లో ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు.. -
విషాదం: ప్రియుడి హత్య.. తట్టుకోలేక ప్రియురాలు..
మండ్య(కర్ణాటక): ప్రియుడు హత్యకు గురి కావడంతో ప్రియురాలు అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య నగరంలోని బాలమందిరంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మండ్య నగరసభ స్థాయీ సమితి అధ్యక్షుడు శివలింగ కుమార్తె (17). పోలీసుల వివరాల మేరకు... విశ్వేశ్వరయ్య లేఔట్లో నివాసం ఉంటున్న దర్శన్, మాన్విత ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి శివలింగ ఏప్రిల్ 14న పథకం ప్రకారం కుమార్తెను బెదిరించి దర్శన్‌కు ఫోన్ చేసి రప్పించారు. అనంతరం తీవ్రంగా కొట్టారు. చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా అతను మృతి చెందాడు. ఈ కేసులో తండ్రి శివలింగతో పాటు తల్లి అనురాధ, మరో 17 మందిని పోలీసులు జైలుకు పంపించారు. ఈ క్రమంలో మాన్వితను అధికారులు బాల మందిరంలో ఉంచారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న అమ్మాయి తన ప్రియుని సమాధిని చూపించాలని గొడవ చేసేది. మంగళవారం తెల్లవారుజామున తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఏమైందో తెలియదు.. తరగతి గది నుంచి బయటకి వచ్చి..
కాకినాడ క్రైం: ఓ నర్సింగ్ విద్యార్థిని సోమవారం కాకినాడలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతాప్‌నగర్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న 18 ఏళ్ల దిడ్ల ఉమామహేశ్వరిది కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం. ఈ నెల 23న జీఎన్ఎం మొదటి సంవత్సరంలో చేరింది. సోమవారం స్నేహితులతో కలిసి తరగతులకు హాజరై ఉదయం 11.40 సమయంలో తరగతి గది నుంచి బయటకి వచ్చింది. నేరుగా తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది. జ్వరం వచ్చి తరగతులకు వెళ్లకుండా పక్కగదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఓ విద్యార్థిని ఈ విషయాన్ని గమనించింది. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపింది. ప్రిన్సిపాల్ సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. టేకి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావు, విజయలక్ష్మి దంపతులకు ఉమామహేశ్వరి రెండవ సంతానం, నిరుపేద రైతు కూలీ కుటుంబానికి చెందిన ఈమె ఇంటర్మీడియెట్ కాకినాడలోని ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకుంది. ఉమామహేశ్వరి సున్నిత మనస్కురాలని తోటి విద్యార్థులు, బంధువులు పోలీసులకు తెలిపారు. విగత జీవిగా పడున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించినట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదన్నారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇవీ చదవండి: ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు -
కాటేసిన కరెంటు కంచె..
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన బడుగు జీవులను విద్యుత్ కంచె కాటేసింది.. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మండల పరిధిలోని నంగనూరుపల్లె గ్రామానికి చెందిన బైరగాని దస్తగిరి (42), బత్తల రామలక్షుమ్మ (33) విద్యుదా ఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. రూరల్ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లె గ్రామానికి చెందిన దస్తగిరి, రామలక్షుమ్మతో పాటు మరి కొందరికి గొర్రెల పోషణే జీవనాధారం. వీరు రోజు తమ జీవాలను గ్రామ శివారులో ఉన్న పొలాల గట్టుకు తీసుకెళ్లి మేపుకొని వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రేగుళ్లపల్లె శివారు ప్రాంతాలకు జీవాలను తీసుకెళ్లారు. అక్కడ గొర్రెలు మేస్తుండగా బైరగాని దస్తగిరి, రామలక్షుమ్మలు సమీపంలోని వేరు శనగ సాగు చేసిన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ పొలం చుట్టూ పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగులుకొని అక్కడికక్కడే కుప్ప కూలి పోయారు. మేత మేస్తున్న ఏడు గొర్రెలతో పాటు కాపలాగా ఉన్న కుక్క కూడా మృత్యువాత పడింది. ఇంటి ఉంచి ఉదయం 10.30 గంటలకు వీరు వెళ్లారని, అయితే ప్రమాదం జరిగినట్లు సుమారు 2.30 గంటలకు తమకు తెలిసిందని గ్రామస్తులు చెబుతున్నారు. మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు కంచె ఏర్పాటు నేరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలకు విద్యుత్ కంచెను ఏర్పాటు చేయడం నేరం. కంచె ఏర్పాటు చేసుకున్న రైతులు వేకువ జామునే వెళ్లి విద్యుత్ సరఫరాను తొలగిస్తారని, అయితే తెల్లారినా విద్యుత్ సరఫరా తీసేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియడంతో రూరల్ ఎస్ఐ అరుణ్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో విషాదం.. ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో నంగనూరుపల్లెలో విషాదం నెలకొంది. దస్తగిరి చాలా ఏళ్ల నుంచి గొర్రెలను కాసేవాడు. అతనికి పొలాలు లేవు, గొర్రెలను కాసుకోవడమే జీవనాధారం. భార్య మల్లేశ్వరి, సునీల్, అనిల్ అనే కుమారులతో పాటు కావ్య అనే కుమార్తె ఉంది.కుమారులిద్దరు డిగ్రీ, ఇంటర్ చదువుతుండగా, కుమార్తె ఐటీఐ చదువుతోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దస్తగిరి మృత్యువాత పడటంతో భార్యా, పిల్లలు రోదిస్తున్నారు. రామలక్షుమ్మకు భర్త నాగయ్యతో పాటు నాగేంద్ర, ప్రసన్న అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ పోట్లదుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చదవండి: Afghanistan: పైసల్లేవ్! బన్ను కూడా దొరకని పరిస్థితి తప్పదా? తాలిబన్ల ముందు మార్గాలేంటంటే.. -
బషీర్ బాగ్ కాల్పులకు 21 ఏళ్ళు..
సాక్షి, విశాఖపట్నం: బషీర్ బాగ్ కాల్పులు జరిగి నేటికి 21 ఏళ్ళు అయ్యింది ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బషీర్ బాగ్ కాల్పుల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీపీఎం నేత నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు దుర్మార్గంగా కాల్పులు జరిపించారని, ఈ కాల్పుల్లో ముగ్గురు అమరులు కాగా ఎంతోమంది విద్యార్థులు క్షతగాత్రులు అయ్యారన్నారు. అప్పట్లో జరిగిన ఈ ఉద్యమంలో రాజశేఖర్ రెడ్డితో ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. చరిత్రలో బషీర్ బాగ్ ఉద్యమం నిలిచిపోతుందని తెలిపారు. బషీర్ బాగ్ ఉద్యమంతోనే చంద్రబాబు పాలన అంతమైందని విమర్శించారు. కాగా, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 2000 ఆగష్టు 28న వామపక్షాలు చలో అసెంబ్లీ చేపట్టారు. ఆనాటి ఈ విద్యుత్ ఉద్యమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి మృతి చెందారు. ఈ ముగ్గురు అమరవీరులకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు శనివారం నివాళులు అర్పించారు. -
తల్లడిల్లిన కన్నపేగు.. ఆశలన్నీ ఆవిరయ్యాయి
భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు...తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకున్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుని కష్టమేంటో తెలియకుండా పెంచారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగానే చదువుకుంటున్నారు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాలపై విధి కన్నెర్రజేసింది. నేలబావి రూపంలో ఉసురుతీసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బంధాన్ని తెంపేసింది. ఈత సరదా ఆకుటుంబాలను కన్నీటి పాల్జేసింది. సాక్షి, పెదగంట్యాడ/అగనంపూడి (గాజువాక): ఆనందపురంలో సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హర్షశ్రీ సంతోష్, సాయి పవన్‌లు తరగతులు ముగిసిన తరువాత నీళ్లకుండీల వద్ద నేలబావిలో ఈత కొట్టేందుకు దిగి మృతి చెందారు. సాయిపవన్‌కు ఈత రాకపోవడం...రక్షించే క్రమంలో హర్షశ్రీ సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నిత్యం నవ్వుతూ కళ్లముందు తిరిగిన వీరిద్దరూ ఇప్పడు లేరన్న వార్తను తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తట్టుకోలేకపోతున్నారు. పెదగంట్యాడ సమీపంలోని చిననడువూరులోని రామాలయం వీధిలో సంతోషి కుటుంబ ఉంటోంది. నర్సీపట్నానికి చెందిన మలసాల వెంకునాయుడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం పిల్లలతో సహా చిననడుపూరు వచ్చేశారు. వెంకునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడికి పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు హర్షశ్రీ సంతోష్ (17), చిన్నకుమారుడు నిరుపమ్. పెద్ద కుమారుడు పాలిటెక్నిక్, చిన్న కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. వెంకునాయుడు కుమారులిద్దరికీ ఉన్నత చదువులు చదివించాలని భావించాడు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. కన్నీరుమున్నీరుగా.. వడ్లపూడి నిర్వాసిత కాలనీ సంతమామిడితోట శివాలయం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కఠారి వెంకట సాయి పవన్ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పవన్ తండ్రి రాంబాబు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు సాయి పవన్ ఆనందపురంలోని ప్రైవేటు పాలిటెక్నిక్‌లో మొదటి సంవత్సరం డిప్లమో చేస్తున్నాడు. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన కుమారుడు తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఇంతలో మృతి చెందాడన్న విషాద వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదవండి: వివాహేతర సంబంధం: షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో.. -
అయ్యో భగవంతుడా.. సాయం అందేలోపు.. ఆగిన శ్వాస
సాక్షి, చెన్నై: ప్రభుత్వ పరంగా సాయం అందేలోపు..ఓ క్రీడాకారుడి శ్వాస ఆగింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని మండవర్ మంగళం గ్రామానికి చెందిన దురై పాండియన్, మల్లిక దంపతులకు మురుగేషన్, దినేష్ కుమారులు. గతంలో అనారోగ్యంతో దురై పాండియన్ మరణించాడు. అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలో పనిచేసి పిల్లలను మల్లిక పోషించింది. పెద్దవాడైన మురుగేషన్ (20) తమిళనాడు రాష్ట్ర సబ్ జూనియర్ హాకీ టీం జట్టులో రాణించాడు. ఇటీవల మురుగేషన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. అయితే ఆర్మీ ఎంపిక సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడి రెండు కిడ్నీలు దెబ్బతిని ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లి మల్లిక కుమారుడికి అప్పు చేసి చికిత్స అందించింది. ప్రస్తుతం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన మురుగేషన్‌ను ఆదుకుని ఆధునిక వైద్యం అందించాలని ప్రభుత్వానికి కుటుంబీకులు, సహచర క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు. అయితే సాయం అందేలోపు మురుగేషన్ మంగళవారం రాత్రి నిద్రలోనే మరణించాడు. బుధవారం తనయుడు ఇక లేరన్న సమాచారంతో మల్లిక శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి -
విహారయాత్రలో విషాదం
సాక్షి, కోహీర్(జహీరాబాద్): విహారయాత్రలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన మండలంలోని చింతల్‌ఘాట్ చౌరస్తా వద్ద 65 నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై చల్లా రాజశేఖర్ అందించిన సమాచారం ప్రకారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూష(26) అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె స్నేహితులు శైలు, దివిజ, శివ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం, చిన్న గడవెల్లి గ్రామ నివాసి పినిశెట్టి సత్యనారాయణ కూతురు అనూష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఆమె తన మిత్రులు శైలు, దివిజ, శివతో కలిసి కారులో గోవాకు విహారయాత్రకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో దుర్ఘటన జరిగింది. మరో గంటలో గమ్యాన్ని చేరుతారనగా చింతల్‌ఘాట్ గ్రామ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న అనూష తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారు వెనకసీట్లో కూర్చున్న శైలు, దివిజ కారు నడుపుతున్న శివ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడం, లారీని రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందని మృతురాలి తండ్రి సత్యానారాయణ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చదవండి:Viral Video: ఫ్యాన్ మీద పడింది.. బుడ్డోడు బచాయించాడు