గెస్ట్ హౌస్‌లో చనిపోయిన శునకం.. ఇన్‌సెట్లో రెండు భాగాలైన సర్పం
నందిగామ: శునకాన్ని విశ్వాసానికి ప్రతీకగా చెప్తారు. పెంపుడు శునకాలు తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం త్యజించేందుకు వెనుకాడవు. అటువంటి ఘటనే కృష్ణాజిల్లా నందిగామలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తన యజమాని గెస్ట్ హౌస్‌లోకి ప్రవేశించిన తాచుపామును అడ్డుకునే క్రమంలో ఓ శునకం తన ప్రాణాలనే కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నందిగామకు చెందిన వ్యాపారి నర్వనేని మురళికి పట్టణ శివారులో ఓ గెస్ట్ హౌస్ ఉంది.
చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే?
అందులో ఒక ఆడ, ఒక మగ శునకాలు ఉన్నాయి. ఇవి రెండూ ఆరేళ్లుగా గెస్ట్ హౌస్‌కి కాపలా కాస్తున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయాక గెస్ట్ హౌస్‌లోకి దాదాపు ఆరడుగుల పొడవైన తాచు పాము ప్రవేశించింది. దానిని పసిగట్టిన మగ కుక్క కైజర్ పాముతో పోరాటానికి దిగింది. దానిని చంపేసింది. ఈ క్రమంలో పాము కాటుకు గురైన కైజర్ తానూ ప్రాణాలు విడిచింది. ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌కు వెళ్లిన యజమాని, అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. యజమాని కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన శునకాన్ని సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment