
వికారాబాద్ జిల్లా: మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపిన హృదయ విదారక ఘటన జిల్లాలోని బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో చోటు చేసుకుంది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఒక చోట ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి చంపేసింది నాగుపాము. కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి సమయంలో నాగుపాము పెద్ద పెద్దగా బుసలు కొడుతూ అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.