
బెంగళూరులో ఉంటున్న ఖమ్మం వాసి ఇంట్లో కేన్‌కోర్సో జాతి శునకం
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని మధురానగర్‌కు చెందిన ఇస్రో శాస్త్రవేత్త వల్లూరి ఉమామహేశ్వరరావు ఇంట్లో పెంపుడు కుక్క ‘ఐరా’ఒకే ఈతలో 13 కుక్కపిల్లలకు జన్మనిచి్చంది. ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్న ఉమామహేశ్వరరావు ఇటాలియన్ మూలాలు కలిగిన కేన్‌కోర్సో జాతి శునకాన్ని రూ.లక్షతో కొనుగోలు చేసి పెంచుతున్నారు.
సాధారణంగా నాలుగు నుంచి ఐదు కుక్కపిల్లలకు మాత్రమే జన్మనిస్తాయని ఆయన తెలిపారు. కానీ ఒకే ఈతలో 13 కుక్కపిల్లలకు జన్మనివ్వడం, అన్నీ ఆరోగ్యంగా ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారని చెప్పారు. గతంలో ఇదే జాతిరకం కుక్క ఒకటి 19 కూనలకు జన్మనిచి్చన రికార్డు నమోదై ఉంది. కాగా, తమ శునకం రికార్డుల్లో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.