Puppies
-
కుక్క పిల్లలకు బారసాల
-
ఒకే ఈతలో 13 కుక్కపిల్లలు
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని మధురానగర్‌కు చెందిన ఇస్రో శాస్త్రవేత్త వల్లూరి ఉమామహేశ్వరరావు ఇంట్లో పెంపుడు కుక్క ‘ఐరా’ఒకే ఈతలో 13 కుక్కపిల్లలకు జన్మనిచి్చంది. ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్న ఉమామహేశ్వరరావు ఇటాలియన్ మూలాలు కలిగిన కేన్కోర్సో జాతి శునకాన్ని రూ.లక్షతో కొనుగోలు చేసి పెంచుతున్నారు. సాధారణంగా నాలుగు నుంచి ఐదు కుక్కపిల్లలకు మాత్రమే జన్మనిస్తాయని ఆయన తెలిపారు. కానీ ఒకే ఈతలో 13 కుక్కపిల్లలకు జన్మనివ్వడం, అన్నీ ఆరోగ్యంగా ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారని చెప్పారు. గతంలో ఇదే జాతిరకం కుక్క ఒకటి 19 కూనలకు జన్మనిచి్చన రికార్డు నమోదై ఉంది. కాగా, తమ శునకం రికార్డుల్లో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. -
వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్..
ఆత్మీయత.. అనురాగం.. అనుబంధం.. వీటిని మించి.. అమ్మంటే అంతులేని ప్రేమ. బిడ్డలపై అమ్మ ప్రేమకు సరితూగగలదేది ఈ లోకంలో ఉండదు. తనకోసం గాక పిల్లల కోసం తమను అర్పించగల కరుణామూర్తి తల్లి. ఈ స్వభావం సృష్టిలో అన్ని జీవుల్లోనూ కనిపిస్తుంది. జంతువులు సైతం పిల్లల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మాతృప్రేమను చాటే ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క పడే యాతన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు బీబీత్సం సృష్టించాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసుల చుట్టే ఓ కుక్క తిరిగింది. ఏదో చెప్పాలన్నట్లు ఆవేదన చెందుతూ పోలీసుల వంకే దీనంగా చూస్తూ ఏడిచింది. దీంతో పోలీసులు కుక్క ఇంతలా వెంబడించడానికి గల కారణమేంటని ఆలోచించారు. దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులను ఆ కుక్క వరదల్లో మునిగిన ఓ ఇంటి వైపుకు తీసుకెళ్లింది. #APPolice rescued puppies stranded in flood water: In #NTR(D) due to massive floods loomed the puppies were trapped in a house. Cops realized the distress of mother #dog for her children. They immediately rescued them&safely brought them to their mother&showed humanity.(1/2) pic.twitter.com/UdA8KD99XD — Andhra Pradesh Police (@APPOLICE100) July 30, 2023 అక్కడే పోలీసులు ఆ కుక్క పిల్లలను గుర్తించారు. వరద నీటిలో బురదలో చిక్కుకున్న కుక్క పిల్లలు ఆ ఇంటిలో ఉన్నాయి. వెంటనే వాటిని బయటకు తీశారు. వాటికి అంటుకున్న బురదను శుభ్రపరిచి కుక్కకు అందించారు. పిల్లలను ముద్దాడిన తల్లి కుక్క పోలీసుల సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లు సంతోషాన్ని వెలిబుచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తల్లి ప్రేమను ప్రతిబింబించే సాంగ్‌ను జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు చేసిన సహాయానికి జంతుప్రేమికులు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన విజయవాడ సిటీ పోలీసులను రాష్ట్ర డీజీపీ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసించారు. ఇదీ చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
కుక్కపిల్లలను భయపెట్టాలనుకున్నారు.. కానీ.. తల్లి కుక్క ఎంట్రీతో సీన్ రివర్స్..
కొత్త వ్యక్తులు కనిపిస్తే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. ఇంకా కోపం ఎక్కువ ఉన్న కుక్కలైతే అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయాల్లో బెదిరిస్తే కొన్నికుక్కలు భయంతో పారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోలో చూపిన విధంగా.. ఇద్దరు యువకులు దారి వెంట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన రెండు కుక్క పిల్లలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. కుక్క పిల్లలే కదా..! అన్నట్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు యువకులు. అంతే.. భయంతో వెనక్కి పరుగులు పెట్టాయి. కానీ అసలు ట్విస్టు ఇక్కడే ఎదురైంది ఆ యువకులకు. వెనక్కి వెళ్లిన కుక్క పిల్లలు తన తల్లిని తీసుకువచ్చాయి. తల్లి కుక్క భారీ ఆకారంలో ఉండటంతో యువకులు.. చచ్చాం.. రా.. బాబోయ్.. అన్నట్లు భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. Don't underestimate anything, there is always something stronger than you! Made me laugh a lot! 🤣🤣pic.twitter.com/r8WWEP5NSA — Figen (@TheFigen_) July 8, 2023 వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. కుక్క పిల్లలే కదా..! అని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్ చేశారు. దేన్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదని.. దాని వెనకాల ఎంత పెద్ద బలం ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి మరికొంతమంది నవ్వులు కురిపించారు. కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరికొందరు. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది!
వికారాబాద్ జిల్లా: మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపిన హృదయ విదారక ఘటన జిల్లాలోని బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో చోటు చేసుకుంది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక చోట ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి చంపేసింది నాగుపాము. కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి సమయంలో నాగుపాము పెద్ద పెద్దగా బుసలు కొడుతూ అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
Viral Video: డార్లింగ్ ఈ స్నాక్స్ తిను.. నీరసంగా ఉన్నావు...
మూగ జీవాల ప్రేమానుబంధాలు ఒక్కోసారి అమితాశ్చర్యాలకు గురయ్యేలా చేస్తాయి. అరే.. మనుషులమైన మనమే అంత ఇదిగా ఉండమే అనిపిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత వింతగా అవేం చేశాయో మీరు కూడా ఓ లుక్కెయండి. ఈ వీడియోలో కిటికీ పక్కన బెడ్‌షీట్‌పై కూర్చుని పప్పీలకు పాలు ఇస్తున్న తెల్ల కుక్క కనిపిస్తుంది. నల్లకుక్క (బహుశా పప్పీల నాన్నేమో) నడుచుకుంటూ దాని దగ్గరకు వచ్చి తినడానికి స్నాక్స్ పక్కన పెడుతుంది. పిల్లల సంరక్షణలో అలసిన తల్లికుక్క దాన్ని ఆబగా తింటుంది. ఆ తర్వాత ఒకదానిమరొకటి ఆలింగనం చేసుకుని పడుకోవడం కనిపిస్తుంది. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. ముచ్చట గొలిపేలా ఉన్న ఈ కుక్కల ప్రవర్తన జంతు ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తోంది. ఇంకేముంది కామెంట్ల రూపంలో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘అద్భుతం ఇప్పటివరకూ నేను చూసిన వాటిల్లో ఇదే స్వీటెస్ట్ ఫ్యామిలీ’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘కుటుంబాన్ని హత్తుకున్న మంచి అబ్బాయి’ అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదేమైనా జంతువులకు కూడా కుటుంబం పట్ల అనురాగ ఆప్యాయతలు ఉంటాయనిపించేలా ఉన్న ఈ వీడియోని వేల మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా.. -
దుర్మార్గుడు.. కుక్క పిల్లలను బైకుతో తొక్కి చంపాడు
-
ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు.. కుక్క పిల్లలను బైకుతో తొక్కి చంపాడు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో క్రూర ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన ఓ వ్యక్తి మూగ జీవుల ప్రాణాలను అన్యాయంగా బలితీసుకున్నాడు. ఆగ్రాలోని సికందరా ప్రాంతంలో రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను బైక్‌పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి బైకుతో ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి చంపేశాడు. ఈ ఘటన జూన్ 14న రాత్రి 10.30 గంటల సమయంలలో జరగగా.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి.. వీడియోను పరిశీలిస్తే.. ముందుగా అతడు రోడ్డు మీద ఆడుకుంటున్న ఓ కుక్క పిల్ల మీదకు బైకు స్పీడ్‌గా ఎక్కించాడు. ఆ ప్రమాదంలో కుక్క పిల్లకు కొంతగాయమవ్వగా. అడ ఉన్న ఆ కుక్క పిల్ల తల్లి, మిగతా కుక్కలన్నీ దాని చుట్టూ చేరాయి. అదే సమయంలో అదే బైకర్ మళ్లీ వెనక్కి వచ్చి.. మరో కుక్క మీద నుంచి తొక్కుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. దుండగుడు చేసిన పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనికరం లేకుండా ప్రవర్తించిన సదరు దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మీద ‘జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం’ కింద కేసు నమోదు చేశారు. చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు? భార్య కోసం ప్రేమగా గజల్ పాడుతున్న భర్త.. కానీ ఆమె మాత్రం! -
యజమానికి ఆకలి తెలుస్తుంది
పెట్ డాగ్‌ను పెంచుకోవాలనే కోరిక ఇటీవల బాగా పెరుగుతోంది. అయితే పెట్‌కి ఎంత ఆహారం పెట్టాలనే కొండంత సందేహం పెట్పేరెంట్ని (పెట్ యజమాని) వెంటాడుతూనే ఉంటుంది. దానికి సమాధానం ఒక్కటే... దాని ఆకలిని బట్టి అది తినగలిగినంత పెట్టడమే. శునకాన్ని పెంచుకోవాలనుకునే వాళ్లు ముఖ్యంగా దానిని ఏ వయసులో పెంపకానికి తెచ్చుకోవాలనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండు నెలల లోపు కుక్కపిల్లను పెంపకానికి తెచ్చుకోకూడదు. అప్పటి వరకు అది తల్లిపాలు తాగాల్సిందే. ఆ తర్వాత పెంపకానికి తెచ్చుకుని మామూలు ఆహారం పెట్టవచ్చు. పెరిగే దశ రెండు నెలల నుంచి ఏడాది లోపు కాలాన్ని పెట్ గ్రోత్ పీరియడ్. ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో పెట్‌కి ఆకలి, అల్లరి రెండూ ఎక్కువే. రెండు నెలలు నిండిన పప్పీకి రోజుకు ఆరుసార్లు ఆహారం ఇవ్వాలి. ఆరు నెలల వయసుకు వచ్చేటప్పటికి మూడుసార్లు పెడితే సరిపోతుంది. ఎనిమిది నెలలు నిండేటప్పటికి రోజుకు రెండుసార్లు తినేటట్లు అలవాటు చేయవచ్చు. ఇది ప్రధానంగా అనుసరించే ఆహారపు వేళలు. అయితే పిల్లలు ఎలాగైతే అందరూ ఒకేలాగ ఉండరు, ఒకేలాగ తినరో... అలాగే పెట్లో కూడా ఒకదానికీ మరొకదానికీ కొద్దిపాటి మార్పులు ఉంటాయి. కుక్కపిల్లను పెంచుకునేటప్పుడు దానికి– యజమానికి మధ్య అనుబంధం పెరుగుతుంది. దాంతో దానికి ఆకలి అయ్యే సమయం, దాని పొట్ట ఎంత పడుతుంది... వంటివన్నీ ‘పెంపుడు’ తల్లిదండ్రులకు అర్థమవుతాయి. -
తల్లి కుక్క.. పిల్లలు క్షేమం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం మాసాబ్‌ట్యాంకు నుంచి విజయనగర్ కాలనీ వెళ్లే ప్రధాన మార్గంలోని జీహెచ్ఎంసీ వెటర్నరీ ఆస్పత్రి ఫుట్‌పాత్‌పై ఓ కుక్క నిస్తేజంగా పడి ఉంది. అనారోగ్యం, తీవ్ర నీరసంతో కదలలేని కొనఊపిరితో ఉంది. అటుగా వెళ్తున్న ఓ యువకుడు దానికి ప్రాథమిక చికిత్స చేయాల్సిందిగా ఆ ఆస్పత్రి సిబ్బందిని కోరగా, దాని బాధ్యత పూర్తిగా తీసుకునే వారుంటేనే చికిత్స చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి చేతులెత్తేశారు. ఆ కుక్క పక్కనే దాని రెండు పిల్లలు పాల కోసం అల్లాడుతున్నాయి. తల్లి కుక్క వద్ద పాలు రాకపోతుండటంతో అవి రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉండటంతో ఆ యువకుడు వెంటనే పీపుల్ ఫర్ యానిమల్స్సంస్థ సిబ్బందికి ఫోన్ చేసి వివరించడంతో పాటు ఫోన్లో దాని వీడియో తీసి పంపించాడు. సంస్థ ప్రతినిధి లత దాన్ని వాట్సాప్ గ్రూపులో ఉంచటంతో చేరువలో ఉన్న వలంటీర్లు సయ్యద్ తఖీ అలీ రజ్వీ, షబ్బీర్ అలీఖాన్‌లు అరగంటలో అక్కడికి చేరుకుని అట్టడబ్బాలో శునకం, దాని కూనలను తీసుకుని బేగంబజార్‌లోని రెస్క్యూహోమ్‌కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. దీంతో కుక్క కోలుకుంది. మూగజీవాల పట్ల జాలితో వ్యవహరించాలని, ప్రమాదంలో ఉన్న వాటి ప్రాణాలు కాపాడాలని వారు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో అమానుషం..
సాక్షి, హైదరాబాద్ : పిల్లలకు చిన్నదెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది తన కళ్లముందే తన బిడ్డలు మంటల్లో కాలి పోతుంటే.. ఆ మాతృమూర్తి కడుపుకోత వర్ణణాతీతం. తన కళ్ల ముందే కాలి బూడిదయిపోతున్న బిడ్డల్ని కాపుడుకోలేక.. సాయం చేసేవారు రాక.. నిస్సహయంగా చూస్తూ మూగగా రోదిస్తున్న ఆ తల్లి కుక్కను చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తోంది. మానవత్వం లేని ఆ రాక్షసులను కసితారా తిట్టాలనిపిస్తుంది. విచక్షణ మరిచిన వారేవరో తమ రాక్షసానందం కోసం నాలుగు చిన్న కుక్కపిల్లలను మంటల్లో పడేసి సజీవ దహనం చేసిన దారుణమైన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పాపం వాటి తల్లి ముందే ఆ చిన్న పప్పీలను మంటల్లో పడేశారు. బిడ్డలు కళ్ల ముందే కాలిపోతుంటే రక్షించుకోలేక నిస్సహయంగా చూస్తూ ఏడుస్తూ ఉన్న కుక్కకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఈ దారుణానికి ఒడిగట్టిందేవరో.. అసలు ఏ ఉద్దేశంతో ఇంతటి అమానవీయ సంఘటనకు పాల్పడ్డారో తేలీదు. కుక్కప్లిలలు మంటల్లో కాలిపోతున్న వీడియో.. ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఇది గమనించిన స్థానికులు ఈ దారుణం గురించి ఆ ప్రాంతంలో ఉండే ఓ జంతు ప్రేమికుడికి సమాచారం ఇచ్చారు. సదరు వ్యక్తి సంఘటన స్థలానికి చేరేలోపే నాలుగు కుక్కపిల్లలో మూడు మంటల్లో కాలి మరణించగా ఒకటి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. ఇది గమనించిన సదరు వ్యక్తి వైద్యం నిమిత్తం ఆ పప్పిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ సాయంత్రానికి అది కూడా మరణించింది. జరిగిన దారుణం గురించి ‘పీపుల్స్ ఫర్ యానిమల్ ప్రొటెక్టర్’ కార్యకర్త ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ దారుణం చోటుచేసుకున్న ప్రాంతానికి సంబంధించిన సీసీ టీవీ ఫూటేజిని పరిశీలిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం 2016, జులైలో కొంతమంది యువకులు కొన్ని కుక్కపిల్లలని మంటల్లో పడేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. -
ఇది డాగ్స్ స్పెషల్!
ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటే ఇదేనేమో. హైదరాబాద్‌లోని కుక్కలకు ఓ రోజేం ఖర్మ.. ఏకంగా ఓ పార్కే వచ్చింది. అలాంటి ఇలాంటి పార్కు కాదు.. నడిపించేందుకు వాకింగ్ ట్రాక్.. ఆటలాడించేందుకు స్థలం.. ఆటలకు ప్రత్యేక ఉపకరణాలు.. ఆటలు, విన్యాసాలకు శిక్షణ సదుపాయాలు.. స్నానం చేయించేందుకు స్లా్పష్ పూల్.. ఈత కొట్టించేందుకు స్విమ్మింగ్ పూల్... ఇలా ఎన్నో సదుపాయాలు. గచ్చిబౌలి సర్కిల్ పరిధిలోని కొండాపూర్‌లో జయభేరి ఎన్క్లేవ్ సమీపంలో రూపుదిద్దుకున్న ఈ ‘డాగ్ పార్కు’త్వరలో ప్రారంభం కానుంది. జపాన్, అమెరికా తదితర దేశాల్లో పెంపుడు కుక్కలకున్న వినోద, వ్యాయామ పార్కులు మన దేశంలో ఇప్పటి వరకు లేవు. ఇక్కడి డాగ్ పార్కులో ప్రత్యేక అలంకరణలు చేయించుకోవచ్చు. కుక్కతోపాటు యాంపీ థియేటర్లో కూర్చొని వినోదం పొందవచ్చు. – సాక్షి, హైదరాబాద్ ప్రవేశ రుసుము రూ. 10 జీహెచ్ఎంసీ నుంచి లైసెన్సు పొందిన కుక్కలకే ఇందులో ప్రవేశం కల్పిస్తారు. లైసెన్సు ఇచ్చేందుకు, ఏడాది కాలపరిమితి తరువాత దాని రెన్యువల్‌కూ అవకాశం కల్పిస్తారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లూ చేయనున్నారు. కుక్క పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేశారు. మిగతా పార్కుల్లాగే దీనికీ ప్రవేశ రుసుము ఉంది. యజమానితో సహా కుక్కకు రూ.10 ప్రవేశ రుసుము ఉంటుంది. దాన్ని చెల్లించి ఎంట్రీ పాసు పొందాలి. నెలవారీ పాసులు కూడా ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. పార్కు నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. అర్హత పొందినవారికి నిర్వహణ బాధ్యతలప్పగిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో..: కేటీఆర్ పెట్స్, పెట్ పేరెంట్స్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పార్కును తీర్చిదిద్దినట్లు కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పెంపుడు కుక్కల కోసం ఇలాంటి పార్కు దేశంలో మరెక్కడా లేదని ప్రస్తావించారు. బెంగళూర్, చెన్నైల నుంచి సంప్రదిస్తున్నారు జపాన్‌లో ఇలాంటి డాగ్ పార్కును చూశాను. నగరంలోని వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్లలో దాదాపు రెండున్నర లక్షల మంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కలకు కూడా ఆహ్లాదం, వ్యాయామాలకు పార్కుంటే బాగుంటుందని అనిపించింది. ఇక్కడి డాగ్ పార్కు గురించి తెలిసి బెంగళూర్, చెన్నైల నుంచి కూడా సంప్రదిస్తున్నారు. పార్కులో వెటర్నరీ డాక్టర్, కాంపౌండర్‌తో క్లినిక్‌ను కూడా తెరుస్తాం. కుక్కల వినోదానికి తగిన విధంగా ఏర్పాట్లున్నాయని ‘కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా’కూడా సర్టిఫై చేసింది. – హరిచందన దాసరి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ -
కుక్క పిల్లలపై పైశాచిక ఘటన
-
హైదరాబాద్‌లో పైశాచిక ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. మూగ జీవి నుంచి పిల్లలను ఎత్తుకెళ్లిన కొందరు దుండగులు.. వాటి తల నరికి చంపారు. పురానాపూల్ లోని పార్థివాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే క్రాంతి రాజా అనే వాలంటీర్ ఓ కుక్కకు, దాని పిల్లలకి భోజనం పెడుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి అవి కనిపించకుండా పోవటంతో చుట్టుపక్కల గాలించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ సిమెంట్ పైప్ లైన్ల వద్ద ఓ పిల్ల దేహం ముక్కలై పడి ఉండగా.. తల్లి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. ఓ పైపులో మిగతా మృతదేహాలు పడి ఉన్నాయి. నాలిగింటిని తల నరికి చంపగా.. మరో దానిని చర్మంతో సహా వలిచి ముక్కలుగా నరికారు. ఈ దారుణంపై స్థానిక పోలీసులకు క్రాంతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తీరతామని చెబుతున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవటంతో నిందితుడిని గుర్తించటం కష్టం మారిందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కొందరు తాగుబోతులు ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించగా.. ఆ కుక్క వారిని చూసి మొరిగింది. ఈ కోపంలోనే వాళ్లు ఈ దాష్టీకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఖననం చేశాక కూడా ఆ తల్లి శునకం సిమెంట్ పైపులైన్ల వద్దే తచ్చాడుతూ రోదిస్తుండటం స్థానికులను కలిచివేస్తోంది. -
కుక్కలను కాల్చేశారు..
హైదరాబాద్ : పైశాచికానందం కోసం విశ్వాసానికి మారుపేరైన శునకాలను కర్కశంగా చంపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధి లో కొందరు యువకులు కుక్క పిల్లల్ని సజీవ దహనం చేసి.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని మరువకముందే మరో ఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఓ టెక్స్టైల్స్ కంపెనీలో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన గోల్కొండ టెక్స్టైల్స్ యజమానులు బాబా, మహమ్మద్ అలీఖాన్ అన్నదమ్ములు. మహమ్మద్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ ... అతని స్నేహితులతో కలసి రెండు రోజుల కిందట వీధి కుక్కలను పట్టుకున్నాడు. టెక్స్టైల్స్ కంపెనీ గేటు వద్ద ఒక శునకాన్ని, కంపెనీ లోపల మరో మూడు శునకాలను గన్ తో కాల్చి చంపారు. కొన్నింటిని ఓ పెద్దమంట పెట్టి అందులో సజీవ దహనం చేసిన ఆనవాళ్లు కనిపిం చారుు. శునకాలను చంపుతూ వీడియోలు తీసి తర్వాత సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. శనివారం ఈ విషయం గుర్తించిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ.. జంతు ప్రేమికురాలు అమలకు సమాచారం ఇవ్వడంతో ఆమె డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టెక్స్టైల్స్ కంపెనీ సిబ్బంది... శునకాలను చంపిన ప్రదేశాల్లో ఇసుక పోసి కప్పెట్టారు. కాగా, దాదాపు ఎనిమిది మంది కలసి శునకాలను చంపినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన డీఎస్పీ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి, చేవెళ్ల సీఐ ఉపేందర్, వికారాబాద్ సీఐ రవి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుక్కలను చంపినట్లు ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేవని, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. -
ఎంత నిర్దయ ..!
వర్షం కురుస్తుండగా కుక్క పిల్లలను రోడ్డుపై పడేసిన మహిళ కూనలు మృతి ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో మహిళ అరెస్ట్ బెంగళూరు (బనశంకరి) : కుక్క పిల్లల మరణానికి కారణమైన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... తుమకూరు రోడ్డు కృష్ణరాజనగరలో మాజీ సైనికుడి కుటుంబ నివసిస్తోంది. ఆ ఇంటి సమీపంలో ఓ కుక్క ఏడు కూనలకు జన్మనిచ్చింది. ఈ కుక్క పిల్లలను చూసిన ఆ సైనికుడి భార్య పూనమ్మ ఈనెల 15న భారీ వర్షం వస్తున్న సమయంలో కూనలను తీసుకుని రోడ్డుపై పడేసింది. సుమారు గంట పాటు వర్షంలో తడిచి ముద్దైన ఆ 15 రోజుల వయసు ఉన్న కూనలు చలికి తట్టుకోలేక చనిపోయాయి. దీనిని గమనించిన స్థానికులు మృతి చెందిన కూనలకు అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ విషయంపై ఓ సేవా సంస్థ పూనమ్మపై పీణ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూనమ్మను అరెస్ట్ చేసి జామీనుపై విడుదల చేశారు. -
నూతన పద్ధతిలో శునకాల జన్మ!
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (కృత్రిమ ఫలదీకరణ) ద్వారా ప్రపంచంలోనే తొలిసారి కుక్కపిల్లలను సృష్టించారు అమెరికా శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి ద్వారా పుట్టిన 7 పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మొత్తం 19 అండాలను ఆడ కుక్కలోకి ప్రవేశపెట్టగా అది జూలై నెల్లో పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు పురోగతి చెందితే... మనుషులు, జంతువుల్లో వ్యాధినిరోధక లక్షణాలపై మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1970ల నుంచే కుక్కలపై ఐవీఎఫ్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా అవి సఫలం కాలేదని కార్నెల్ కాలేజ్ ఆఫ్ వెటర్నిటీ మెడిసిన్ ప్రొఫెసర్ అలెక్స్ ట్రావిస్ తెలిపారు. కుక్కల అండవాహికలో అండాలను ఒక రోజు అదనంగా ఉంచితే అవి ఫలదీకరణ చెందేందుకు మంచి అవకాశాలు ఉంటాయని కనుగొన్నారు. ఈ ప్రక్రియలో మెగ్నీషియంకు సెల్ కల్చర్‌ను జోడించడంతో ఇతర జంతువుల్లా కాకుండా ఆడ శునకాల్లో పునరుత్పత్తి వ్యవస్థపై పనిచేసి పిండంగా మారేందుకు సహాయపడుతుందని వారు చెప్తున్నారు. తాము చేసిన రెండు కొత్త మార్పులు ఇప్పుడు 80 - 90 శాతం విజయం సాధించేందుకు ఉపయోగపడ్డాయని ట్రావిస్ చెప్పారు. కుక్కల పునరుత్పత్తి చక్రంలో సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు ఇంప్లాంట్ చేసే అవకాశం ఉందని.. ఫలదీకరణ చెందిన అండాలను ప్రవేశపెట్టడం కూడా పెద్ద సవాలేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించుకునేందుకు ఐవీఎఫ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
పులి... కుక్క
మధ్య చైనాలోని చాన్‌క్వింగ్‌లో కుక్కపిల్లలు అమ్మే వ్యాపారులు ఈ మధ్య తెలివిమీరి పోయారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఇదిగో ఇలా కుక్క పిల్లలపై పులి చారలు రంగుతో వేసేస్తున్నారు. చూడడానికి వింతగా ఉండటంతో జనం కూడా ముచ్చటపడి కొనుక్కుంటున్నారట. ఒక్కో కుక్కపిల్లను 2,700 రూపాయలకు అమ్మేస్తున్నారట. అయితే పెటా మాత్రం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కుక్క పిల్లలకు అద్దే రంగుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని, ఒకవేళ అవిగనక రంగువేసిన బూరును నాకితే... కొద్దిరోజుల్లో చనిపోవడం ఖాయమని చెబుతోంది. వారానికి మించి బతకవని, ముద్దొచ్చే కుక్కపిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వ్యాపారులను ప్రోత్సహించవద్దని పెటా చైనీయులకు విజ్ఞప్తి చేస్తోంది. -
టంబుల్స్ ట్రబుల్స్ పరార్
ఈ బుజ్జి కుక్కపిల్లను చూశారా.. ఎంచక్కా చక్రాలు కట్టుకుని తిరుగుతోందో.. పుట్టుకతోనే కాళ్లు కోల్పోయిన ఈ కుక్క పిల్ల పేరు టంబుల్స్. రెండు నెలల వయసున్న ఈ టంబుల్స్ను అమెరికాలోని ఒహాయోకు చెందిన కారెన్, పిచర్ జంట పెంచుకోవాలనుకుంది. అయితే దీనికి కాళ్లు లేకపోవడంతో తల్లడిల్లిన ఆ జంట ఏదైనా చేయాలనుకుంది. వెంటనే బుల్లి చక్రాల కుర్చీ డిజైన్ చేశారు. ఆ తర్వాత ఒహాయో యూనివర్సిటీలో ఉన్న ఇన్నోవేషన్ సెంటర్లో త్రీడీ ప్రింటర్ ద్వారా చక్రాలు తయారు చేయించారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా దీన్ని తయారు చేసేందుకు దాదాపు 14 గంటలు పట్టిందట.