పులి... కుక్క
మధ్య చైనాలోని చాన్‌క్వింగ్‌లో కుక్కపిల్లలు అమ్మే వ్యాపారులు ఈ మధ్య తెలివిమీరి పోయారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఇదిగో ఇలా కుక్క పిల్లలపై పులి చారలు రంగుతో వేసేస్తున్నారు. చూడడానికి వింతగా ఉండటంతో జనం కూడా ముచ్చటపడి కొనుక్కుంటున్నారట. ఒక్కో కుక్కపిల్లను 2,700 రూపాయలకు అమ్మేస్తున్నారట. అయితే పెటా మాత్రం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కుక్క పిల్లలకు అద్దే రంగుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని, ఒకవేళ అవిగనక రంగువేసిన బూరును నాకితే... కొద్దిరోజుల్లో చనిపోవడం ఖాయమని చెబుతోంది. వారానికి మించి బతకవని, ముద్దొచ్చే కుక్కపిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వ్యాపారులను ప్రోత్సహించవద్దని పెటా చైనీయులకు విజ్ఞప్తి చేస్తోంది.