
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండైసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది.
తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్‌ఎస్‌ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది.
ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్స్చేంజీ వెల్లడించింది. కెమికల్స్ రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటంతో పరిశ్రమ ధోరణులు, పెట్టుబడుల అవకాశాలను ట్రాక్ చేయడానికి ఈ ఇండెక్స్ కీలక సాధనంగా ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment