indices
-
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఎస్బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్ఎల్సీ 4%, ఎన్సీఎల్ 3.50% క్షీణించాయి. ⇒ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. -
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
మరో భారత్ బాండ్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ తాజాగా మరో బాండ్ ఇండెక్సును ప్రారంభించింది. నిఫ్టీ భారత్ బాండ్ ఇండెక్స్ సిరీస్‌లో భాగంగా ఏప్రిల్ 2033ను ప్రవేశపెట్టింది. అత్యధిక భద్రతగల ఏఏఏ రేటింగ్ ప్రభుత్వ బాండ్లతో ఎన్ఎస్ఈ బాండ్ ఇండెక్సులను ఆవిష్కరిస్తోంది. వీటిలో భాగంగా ఏప్రిల్ 2033ను విడుదల చేసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. భారత్ బాండ్ ఇండెక్స్‌లో భాగంగా తొలు త 2019 డిసెంబర్లో ఏప్రిల్ 2023, ఏప్రిల్ 2030 గడువులతో బాండ్ ఇండెక్సులను ప్రవేశపెట్టింది. తదుపరి 2020 జులైలో మరోసారి ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2031 గడువులతో ఇండెక్సులను ఆవిష్కరించింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ సిరీస్‌లో భాగంగా త్వరలో విడుదల చేయనున్న ఆరో భారత్ బాండ్ ఈటీఎఫ్ ద్వారా భారత్ బాండ్ ఇండెక్స్ 2033ను ట్రాక్ చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
లాజిస్టిక్స్ సూచీలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
న్యూఢిల్లీ:ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిల్చే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో గుజరాత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన 2021 సూచీలో వరుసగా మూడోసారి టాప్‌లో నిల్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హర్యానా (2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన వాటితో 2021 నివేదిక రూపొందింది. దీన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1,405 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. వచ్చే అయిదేళ్లలో లాజిస్టిక్స్ వ్యయాలను అయిదు శాతం మేర తగ్గించుకునేందుకు ఆయా వర్గాల అభిప్రాయాలు దోహదపడగలవి గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి. -
వ్యాపార విశ్వాస సూచీ రయ్!
న్యూఢిల్లీ: ఎకానమీ వేగవంతమైన రికవరీకి సంకేతంగా తన వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్ క్వార్టర్‌తో పోల్చి) 90 శాతం పెరిగినట్లు ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎన్సీఏఈఆర్ పేర్కొంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... - కోవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్ వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడింది. అంతకుముందు మూడు నెలలతో పోల్చితే పలు విభాగాలు పురోగతి బాట పట్టాయి. బీసీఐ త్రైమాసికంగా చూస్తే, 90 శాతం పెరిగితే, వార్షికంగా 80 శాతం పురోగతి సాధించింది. - సెప్టెంబర్ 2021లో చేపట్టిన వ్యాపార అంచనా సర్వే (బీఈఎస్) 118వ రౌండ్ అంశాల ఆధారంగా తాజా గణాంకాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లోని 500 సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే, 1991 నుంచి త్రైమాసికం ప్రాతిపదికన ఎన్సీఏఈఆర్ ఈ సర్వే నిర్వహిస్తోంది. - వెస్ట్ జోన్ మినహా, అన్ని ప్రాంతాల్లో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడింది. 2021–22 రెండవ త్రైమాసికంలో పశ్చిమ ప్రాంతంలో బీసీఐ దాదాపు 10 శాతం తగ్గింది. అయితే తూర్పు (కోల్‌కతా), ఉత్తర (ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం), దక్షిణ (చెన్నై, బెంగళూరు) ప్రాంతాల్లో వృద్ధి తీరు బాగుంది. - ప్రధానంగా నాలుగు భాగాలకు సంబంధించిన సెంటిమెంట్లు మెరుగుపడ్డాయి. ఈ నాలుగు అంశాలనూ పరిశీలిస్తే, ‘మొత్తం ఆర్థిక పరిస్థితులు రాబోయే ఆరు నెలల్లో మెరుగుపడతాయి... రాబోయే ఆరు నెలల్లో సంస్థల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది... ఆరు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుత పెట్టుబడి వాతావరణం సానుకూలంగా ఉంది... ప్రస్తుత సామర్థ్య వినియోగం సరైన స్థాయికి దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంది’. - 2019–20 రెండవ త్రైమాసికం– 2020–21 మూడవ త్రైమాసికం మధ్య విస్తరించిన పెద్ద సంస్థలు, చిన్న సంస్థల వ్యాపార సెంటిమెంట్ల మధ్య వ్యత్యాసం తాజాగా తగ్గింది. ముఖ్యంగా 2021–22 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ వ్యత్యాసం భారీగా తగ్గడం గమనార్హం. ప్రస్తుతం ఒడిదుడుకులుగా ఉన్న రికవరీ, రానున్న త్రైమాసికాల్లో కుదుటపడుతుందన్న ఆశావాదాన్ని ఇది కల్పిస్తోంది. - ఉత్పత్తి, దేశీయ విక్రయాలు, ఎగుమతులు, కొత్త ఆర్డర్లు, ముడిసరుకు దిగుమతులు, పన్నుకు ముందు లాభాలపై సెంటిమెంట్లు వంటి పలు అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగయ్యాయి. - ఇక 2021–22 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి యూనిట్‌కు ముడి పదార్థాల ఖర్చులు 54 శాతం పెరిగాయి. రానున్న త్రైమాసికాల్లో ఈ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మూడింట సర్వేలో పాల్గొన్న రెండు వంతుల సంస్థలు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వ్యయాలకు సంబంధించి సెంటిమెంట్లు, ముఖ్యంగా ముడి పదార్థాలకు సంబంధించి ప్రతికూలంగా ఉన్నాయి. పొలిటికల్ ఇండెక్స్ కూడా... కాగా, ఎన్సీఏఈఆర్ పొలిటికల్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ (పీసీఐ) కూడా 2021–22 ఏప్రిల్–జూన్ త్రైమాసికంతో పోల్చితే 2021–22 జూలై–సెప్టెంబర్ కాలంలో దాదాపు 110 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే కూడా ఇండెక్స్ పురోగమనం 60 శాతం కంటే ఎక్కువగా ఉంది. -
లాభాలని మొత్తుకుంటే సరిపోయిందా? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి?
బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీల్లోకి పెట్టుబడుల వరద వస్తోందని, ఇన్వెస్టర్ల జేబుల్లో కనక వర్షం కురుస్తుందంటూ ఇటీవల వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. దేశీ సూచీల బుల్ జోరు రేపుతున్న దుమ్ములో బ్రోకరేజీ సంస్థల ఆగడాలు, వాటి వల్ల నష్టపోతున్న ఇన్వెస్టర్ల సంగతులు బయటకు రావడం లేదు. దీనిపై స్టాక్‌మార్కెట్ విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ తొలిసారిగా గళమెత్తారు. నాణేనికి మరోవైపు అంతర్జాతీయ వ్యవహరాలు, దేశీయంగా నెలకొన్న పరిస్థితులతో సంబంధం లేకుండా స్టాక్‌మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఒక సెషన్‌ని మించి మరో సెషన్లో బుల్‌జోరు కొనసాగుతోంది. వారాల వ్యవధిలోనే వేల పాయింట్లు దాటేస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపయితే మరోవైపు ఇన్వెస్టర్ల నగదుకి మార్కెట్లో గ్యారెంటీ లేకుండా పోతోంది. నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతున్నాయి కొన్ని స్టాక్‌మార్కెట్ బ్రోకరేజీ సంస్థలు. మోసాలు.. నిషేధాలు ఇటీవల ఇన్వెస్టర్లకు నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం, స్టాక్ మార్కెట్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బ్రోకరేజీ సంస్థలపై ఇటు బీఎస్ఈ, అటు ఎన్ఎస్ఈలు కొరడా ఝులిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలోనే ఏకంగా 30కి పైగా బ్రోకరేజీ సంస్థలను నిషేధించాయి. తాజాగా ఫస్ట్ ఫ్యూచర్స్ అండ్స్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిషేధిస్తూ ఎన్ఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఉదహరిస్తూ సుచేతా స్టాక్ మార్కెట్లను ప్రశ్నించారు. వాళ్ల సంగతేంటి ? స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్టాలను టచ్ చేస్తున్నాయి. బుల్ జోరు కొనసాగుతోంది. కొత్తగా డీమ్యాట్ అకౌంట్లు తెరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అనే విధంగా ప్రచారం జరుగుతుంది తప్పితే. బ్రోకరేజీ సంస్థలు మోసాలకు పాల్పడిన సమయంలో ఇన్వెస్టర్లకు ఏ తరహా సాయం అందుతుంది. వారు నష్టపోకుండా ఏం చేస్తున్నారు అనే విషయంపై స్టాక్ ఎక్సేంజీలు ఎందుకు చొరవ చూపించడం లేదు అన్నట్టుగా ఆమె ప్రశ్నించారు. మోసాలకు పాల్పడిన వారిని నిషేధిస్తే సరిపోతుందా ? నష్టపోయిన వారి సంగతేంటంటూ నిలదీస్తూ ట్వీట్ చేశారు. కంటి తుడుపు సాయం ఎన్ఎస్ఈ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో ఫస్ట్ ఫ్యూచర్ అండ్స్ స్టాక్స్ ప్రైవేట్ లిమిడెట్ బ్రోకరేజీ సంస్థ వల్ల నష్టపోయిన వారికి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ కింద రూ. 25 లక్షల వంతున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే దీనిపై ఇన్వెస్టర్ల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. కోట్ల రూపాయలు నష్టపోతే కేవలం రూ. 25 లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదంటూ చెబుతున్నారు. దీనికి ఉదాహారణగా కేవలం ఆరుగురు ఇన్వెస్టర్లకే ఈ బ్రోకరేజీ వల్ల రూ. 6 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇలాంటి వారు ఎందరో ఉన్నారని చెబుతున్నారు. This must be 30 brokers expelled in past 2 years. #SEBI Coll with it! Probably thinks @NSEIndia is purging system! No talk of investors. Maybe NSE should celebrate these numbers like it celebrates NIFTY highs? Or turnover? @FinMinIndia @nsitharaman ?? pic.twitter.com/7lcUo9fqcw — Sucheta Dalal (@suchetadalal) October 19, 2021 ఎవరీ సుచేతా దలాల్ ఇక స్టాక్‌మార్కెట్ విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ విషయానికి వస్తే... 1992లో హర్షద్ మెహతా స్కామ్‌ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చిన బిజినెస్ జర్నలిస్ట్‌గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టాక్‌మార్కెట్ వ్యవహరాలు, అక్కడ జరుగుతున్న అవకతవకలపై ఆమె తరచుగా స్పందిస్తూ ఇన్వెస్టర్లను హెచ్చరిస్తుంటారు. తాజాగా బ్రోకరేజీ సంస్థల వల్ల ఇన్వెస్టర్లకు జరుగుతున్న నష్టంపై ఆమె చేసిన ట్వీట్ మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. చదవండి :ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
స్టాక్మార్కెట్లో అస్థిరత
ముంబై : స్టాక్ మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఉదయం నుంచే లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఊగిసలాడుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ స్థిరంగానే ఉంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 52,919 పాయింట్ల వద్ద ప్రారంభమై గరిష్టంగా 53,006 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత నష్టపోతూ ఉదయం పది గంటల సమయానికి 52,805 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 15,819 పాయింట్ల దగ్గర మొదలై 15,850 పాయింట్లకు చేరకుంది. ఉదయం పదిగంటల సమయంలో మొత్తగా 10 పాయింట్లు నష్టపోయి 15,880 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈరోజు ఏషియన్ పేయింట్స్, టాటాస్టీల్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ లాభపడగా మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ లీవర్, టైటాన్ షేర్లు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు క్లెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జీ ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఐపీవోకు రానున్నాయి. -
నష్టాల్లో రియాల్టీ, మెటల్, పవర్ సూచీలు
-
ఫలితాలు కీలకం
ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులంటున్నారు. అక్టోబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ వారంలోనే ఉండటంతో స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకులకు గురికావచ్చని వారంటున్నారు. క్యూ2 ఫలితాలు, డెరివేటివ్స్ ముగింపుతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం తదితర అంశాలు కూడా స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, విజయ బ్యాంక్‌లు, ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లు క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. వీటితో పాటు ఐటీసీ, హిందుస్తాన్ యూనిలివర్, మారుతీ సుజుకీ, ఐఓసీ, ఓఎన్జీసీ, అంబుజా సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్, బయోకాన్, సన్ ఫార్మా, యస్ బ్యాంక్, కంపెనీల ఫలితాలు కూడా వస్తాయి. జీఎస్టీ అమలు భారత కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఈ ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. బ్యాంక్ ఫలితాలు అధ్వానంగా ఉండని పక్షంలో సెన్సెక్స్, నిఫ్టీలు ప్రస్తుత స్థాయిల్లోనే కన్సాలిడేట్ అవుతాయని విశ్లేషకులంటున్నారు. భారీగానే ‘మొండి’ ప్రభావం ! కంపెనీల క్యూ2 ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ ఎలెన్ ఈ వారాంతాన చేసే వ్యాఖ్యలు గమనించదగ్గ అంశమని పేర్కొన్నారు. మొండి బకాయిలు బ్యాంక్‌లపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. జీఎస్టీ అమలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనున్నదనే దిశగా కంపెనీల ఫలితాలు వస్తాయనే మార్కెట్ ఆశిస్తోందని వివరించారు. జోరుగా విదేశీ డెట్ పెట్టుబడులు.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన డెట్ మార్కెట్లో పెట్టుబడుల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ 200 కోట్ల డాలర్ల మేర (రూ.12,135 కోట్లు )పెట్టుబడులు పెట్టారు. వడ్డీరేట్లు సానుకూలంగా ఉండడం, కరెన్సీ ఒడిదుడుకులు తక్కువ స్థాయిలో ఉండటంతో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులంటున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు డెట్‌మార్కెట్లో నికరంగా రూ.1.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు ఈ నెలలో లాభాల స్వీకరణ ధ్యేయంతో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.3,408 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఒక ఐపీఓ, రెండు లిస్టింగ్‌లు రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీఓ ఈ నెల 25న ప్రారంభమై, 27న ముగుస్తుంది. ఈ ఐపీఓకు ధర శ్రేణిని రూ.247–రూ.252గా కంపెనీ నిర్ణయించింది. రూ.1,542 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ షేర్లు వచ్చే నెల 6న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ షేర్లు నేడు(సోమవారం) స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కానున్నాయి. రూ1,001 కోట్ల ఈ ఐపీఓ 2.28 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ.1,650. ఇక జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లు బుధవారం(25న) స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కానున్నాయి. రూ.11,370 కోట్ల ఈ ఐపీఓ 1.38 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. -
9,900 దాటేసిన నిఫ్టీ
స్వల్ప లాభాలతో నూతన గరిష్ట స్థాయిలకు సూచీలు ముంబై: మార్కెట్లు సోమవారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరాయి. గత కొన్ని రోజులుగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న మద్దతు కొసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద క్లోజయ్యాయి. బ్లూచిప్ కంపెనీల నుంచి మెరుగైన ఆర్థిక ఫలితాలు వస్తాయన్న అంచనాలతో కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఇప్పటి వరకు వర్షపాతం సాధారణం కంటే పైనే ఉండడం కూడా సానుకూల వాతావరణానికి దారితీసింది. అటు చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలకు మించి ఉండొచ్చన్న సంకేతాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు నిరాశపరచడంతో యూఎస్ ఫెడ్ తన విధానాన్ని కఠినం చేస్తుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 32,131.92 జీవిత కాల గరిష్ట స్థాయి నమోదు చేసింది చివరికి 54 పాయింట్ల లాభంతో 32,074 వద్ల క్లోజ యింది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 9,915.95 వద్ద ముగి సింది. సూచీల్లోని స్టాక్స్ లో విప్రో అత్యధికంగా 3 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్ 1.37% పెరిగింది. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, హెచ్‌యూఎల్, రిలయన్స్ సైతం లాభపడ్డాయి. జూన్ త్రైమాసికంలో 25 శాతం అధికంగా లాభాలను నమోదు చేసిన జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేరు 9.31 శాతం లాభపడడం గమనార్హం. ‘‘పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, బ్యాంకింగ్ రంగంపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో నిఫ్టీ 10,000 మార్కుకు దూరంలో నిలిచింది. ఫలితాల సీజన్ కావడంతో స్టాక్స్ వారీ కొనుగోళ్లకు ఉత్సాహం కనిపించింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్‌జేమ్స్ అన్నారు. 5 లక్షల కోట్లకు ఆర్ఐఎల్ విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా 5 లక్షల కోట్ల మార్కును దాటిం ది. దీంతో దేశంలో విలువ పరంగా నంబర్ 1 స్థానానికి చేరింది. సోమవారం ఆర్ఐఎల్ స్టాక్ 1.33 శాతం లాభపడి బీఎస్ఈలో రూ.1,551.35 వద్ద క్లోజయింది. దీంతో సోమవారం ఒక్కరోజే రూ.6,672 కోట్ల మేర విలువ పెరిగి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,04,458 కోట్లకు చేరింది. ఈ ఏడాదిలో ఆర్ఐఎల్ స్టాక్ ఇప్పటి వరకు 43 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఆర్ఐఎల్ తర్వాత టీసీఎస్ రూ.4,58,605.88 కోట్ల విలువతో రెండో స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.4,33,133 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. -
పరిమిత శ్రేణిలో కదలికలు
స్వల్పంగా పెరిగిన సూచీలు ముంబై: ప్రపంచ మార్కెట్లు మందకొడిగా ట్రేడయిన నేపథ్యంలో బుధవారం దేశీయ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగడంతో స్వల్పలాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 31,285–31,178 పాయింట్ల మధ్య కేవలం 100 పాయింట్ల శ్రేణిలో కదిలి, చివరకు 36 పాయింట్ల పెరుగుదలతో 31,256 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ రోజంతా కీలకమైన 9,600 పాయింట్లపైన ట్రేడయిన అనంతరం చివరకు 24 పాయింట్ల లాభంతో 9,637 పాయింట్ల వద్ద ముగిసింది. సమీప భవిష్యత్తులో మార్కెట్ బాగుంటుందన్న అంచనాలతో అధిక షేర్లు పెరిగాయని, అయితే జీఎస్టీ అమలుతో కార్పొరేట్ లాభాలు తగ్గుతాయన్న భావనతో భారీ కొనుగోళ్లు జరగడం లేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. దేశంలో సర్వీసుల రంగం కార్యకలాపాలు 8 నెలల గరిష్టస్థాయికి చేరినట్లు నికాయ్ పీఎంఐ డేటా వెలువడినప్పటికీ, మార్కెట్ డల్‌గా ముగిసిందని, దక్షిణ కొరియా క్షిపణిని ప్రయోగించడంతో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల దృష్ట్యా మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసిందని బీఎన్పీ పారిబా సీనియర్ ఫండ్ మేనేజర్ లక్ష్మణన్ విశ్లేషించారు. లుపిన్ టాప్... అమెరికా మార్కెట్లో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టినట్లు ఫార్మా కంపెనీ లుపిన్ ప్రకటించడంతో ఈ షేరు 3.82 శాతం ర్యాలీ జరిపింది. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా పెరిగిన షేరు ఇదే. మరో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 1 శాతం పెరిగింది. మహీంద్రా 2.24 శాతం, ఓఎన్జీసీ 1.69 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.58 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.20 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.09 శాతం చొప్పున ఎగిశాయి. మరోవైపు ఐటీసీ 1.79 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, విప్రోలు స్వల్పంగా తగ్గాయి. -
తీవ్ర హెచ్చుతగ్గులు
♦ తొలుత భారీ ర్యాలీ... చివరకు స్వల్పలాభాలతో ముగింపు ♦ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు పెరిగిన కారణంగా గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో జోరుగా ర్యాలీ సాగించిన భారత్ సూచీలు...గరిష్టస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి ఏర్పడటంతో ముగింపు సమయంలో నష్టాల్లోకి జారిపోయాయి. అయితే చివరకు స్వల్పలాభాలతో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత 260 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ 31,098 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. అటుతర్వాత గరిష్టం నుంచి 300 పాయింట్ల మేర పతనమై 30,795 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు 23 పాయింట్ల స్వల్ప లాభంతో 30,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,576 పాయింట్ల గరిష్టస్థాయి, 9,494 పాయింట్ల కనిష్టస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 13 పాయింట్ల లాభంతో 9,504 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో పాటు ఎయిర్ఇండియాను డిజిన్వెస్ట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో..సంస్కరణలు కొనసాగుతాయన్న భరోసా ఏర్పడి, ట్రేడింగ్ ప్రారంభంలో ర్యాలీ జరిగిందని మార్కెట్ వర్గాలు వివరించాయి. గతరాత్రి అమెరికా మార్కెట్ 1 శాతం మేర ర్యాలీ జరిపిన ప్రభావంతో ఆసియా, యూరప్ ప్రాంతాల్లోని ప్రధాన సూచీలు 0.5–1 శాతం మధ్య లాభపడ్డాయి. లాభాల స్వీకరణ... కానీ జూన్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు గురువారం ముగింపురోజుకావడం, జీఎస్టీ అమలుకానున్న నేపథ్యంలో జాగురూకత వంటి అంశాలతో ట్రేడింగ్ ముగింపు సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ అమలుతో రానున్న కొద్ది త్రైమాసికాల్లో సమస్యలు వుంటాయన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, దీంతో మార్కెట్ కన్సాలిడేషన్ దశలోనే వుంటుందని భావిస్తూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ 3.48 శాతం జంప్... సెన్సెక్స్–30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ అన్నింటికంటే అధికంగా 3.48 శాతం ర్యాలీ జరిపి రూ. 511 వద్ద ముగిసింది. టాటా స్టీల్ 2.85 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి రూ. 533 వద్ద క్లోజయ్యింది. సిప్లా, భారతి ఎయిర్టెల్, ఐటీసీలు 1 శాతంపైగా పెరిగాయి. మరోవైపు కొటక్ బ్యాంక్ 1.95 శాతం నష్టపోగా, టాటా మోటార్స్ 1.40 శాతం, ఎస్బీఐ 1.39 శాతం, సన్‌ఫార్మా 1.23 శాతం చొప్పున తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 2.15 శాతం పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం లాభపడింది. -
మార్కెట్లకు ‘యూపీ’ బీపీ!
ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కొత్త రికార్డు స్థాయికి సూచీలు ⇒ ఓడితే సెంటిమెంట్‌కు దెబ్బ... ⇒ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లపై అధిక ప్రభావం ⇒ ఫలితాలపై విశ్లేషకుల అంచనా ముంబై: ఉత్తరప్రదేశ్‌తో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రేపు (శనివారం) ప్రారంభం కానుంది. కీలకమైన యూపీలో మెజార్టీ సీట్లు బీజేపీవేనంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సమాజ్‌వాది, కాంగ్రెస్ కూటమి గెలుపుపై ప్రతికూల అంచనాలతో ఉన్న మార్కెట్ వర్గాలు.. యూపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కమలనాథులేనని భావిస్తున్నాయి. అదే జరిగితే సంస్కరణలకు గట్టి ఊతం లభిస్తుందని, మార్కెట్లు మరింతగా పరుగులు తీయగలవని ఆశిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 12 బ్రోకింగ్ సంస్థలకు చెందిన విశ్లేషకుల్లో 9 మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. యూపీలో అధికార పార్టీ మళ్లీ పగ్గాలు దక్కించుకుంటే దేశీ ఈక్విటీ మార్కెట్‌కు ప్రతికూలమే కాగలదని సర్వేలో పాల్గొన్న వారిలో 91 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఆసియాలోని ఇతర ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్ మెరుగైన పనితీరు కనపర్చింది. గతేడాది నవంబర్ 9న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పరిణామాలతో వచ్చిన నష్టాలన్నింటినీ భర్తీ చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా మళ్లీ తిరిగొచ్చారు. ఈ ఏడాది తొలి రెండు ¯ð లల కాలంలో బాండ్లు, ఈక్విటీల్లో దాదాపు 2.4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 9 శాతం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాల నుంచి కోలుకుంటూ.. గత కొన్నాళ్లుగా ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరువలో తిరుగాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే.. నిఫ్టీ గత రికార్డు స్థాయి 9,119 పాయింట్లను అధిగమించడంతో పాటు మొత్తం మీద దాదాపు 8.7 శాతం మేర ఎగిసేందుకు కావాల్సిన ఊతం దక్కగలదని సర్వేలో పాల్గొన్న మొత్తం 12 మంది అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో కూడా బలం పుంజుకునేందుకు యూపీలో గెలుపు బీజేపీకి తోడ్పడుతుందని వారు విశ్లేషించారు. రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో గతంలో పలు కీలక సంస్కరణల బిల్లులకు చుక్కెదురైన నేపథ్యంలో యూపీలో గెలిస్తే.. అధికార పార్టీ తలపెట్టిన సంస్కరణలకు ఆటం కం ఉండబోదని వారు పేర్కొన్నారు. బీజెపీ గెలుపు, ఓటముల ప్రభావం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంపై అధికంగా వుండగలదని వారు అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ యూపీలో అధికారం చేజిక్కించుకోలేకపోతే, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడి, మార్కెట్ క్షీణిస్తుందని వారు అంచనా వేశారు. సాధ్యపడేనా .. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇది ఒకరకంగా డీమోనిటైజేషన్‌పై రెఫరెండంలాంటిదిగా అంతా పరిగణిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కమలనాధులకు తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ మరింత కీలకంగా మారింది. యూపీ జనాభా ఏకంగా 20.4 కోట్ల మేర ఉంటుంది. ఇక్కడి నుంచే రాజ్యసభకు అత్యధిక ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా.. అందులో 31 సీట్లు యూపీవే ఉంటాయి. అందుకే యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 80 సీట్లలో ఏకంగా 71 సీట్లు దక్కించుకుని యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇటీవలి పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలే దక్కించుకుంది. మార్కెట్లను ప్రభావితం చేయబోయే మరిన్ని అంశాలు.. యూపీ ఎన్నికల ప్రభావాలు ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలపై పడగలవని బ్రోకరేజి సంస్థలు భావిస్తున్నాయి. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిశాక.. స్వల్పకాలికంగా చూస్తే మార్చి 14–15 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. -
రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: ఆయిల్ ధరలు, ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. అటు ఎఫ్ఐఐల అమ్మకాలు, ఇటు డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో 27,736 వద్ద, నిఫ్టీ కూడా41 పాయింట్లు క్షీణించి 8,573 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ బలహీనత,టాటా గ్రూప్ షేర్లలో అమ్మకాలు ఈ రోజుకూడా కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఐటీ, ఆటో, మెటల్స్ రంగాలు బలహీనంగా ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా హోటల్స్ , టాటా కమ్యూనికేషన్స్, షేర్లలో భారీఅమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, లుపిన్ నష్టపోతుండగా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, మారుతీ, టెక్ మహీంద్రా స్వల్పంగా లాభపడుతున్నాయి. అటు దేశీయమారకపు రేటుతో రూపాయి 0.04పైసల నష్టంతో రూ.66.87వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా. రూ. 32నష్టంతో రూ. 29,866 వద్ద ఉంది. -
వెలుగులో మెటల్, ఐటీ షేర్లు
స్వల్పంగా పెరిగిన సూచీలు వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు చవిచూసిన భారత్ స్టాక్ సూచీలు సోమవారం స్వల్పంగా కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్ల పెరుగుదలతో 28,082 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్లు ఎగిసి 8,708 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సానుకూల ఆసియా మార్కెట్ల కారణంగా ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగినప్పటికీ, వరుసగా రెండు రోజులపాటు మార్కెట్‌కు సెలవుకావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ జరిపారు. దాంతో సూచీలు కొద్దిపాటి పెరుగుదలతో ముగిసాయి. ఆసియా మార్కెట్లలో చైనా షాంఘై ఇండెక్స్ 1.45 శాతం ర్యాలీ జరిపింది. దాదాపు 10 రోజుల సెలవు తర్వాత ప్రారంభమైన చైనా మార్కెట్ ఒకే రోజు పెద్ద ర్యాలీ జరపడం విశేషం. టాటా స్టీల్ టాప్... ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా మెటల్ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. టాటా స్టీల్ 2.7 శాతం ర్యాలీ జరిపి, రెండేళ్ల గరిష్టస్థాయి రూ. 419 వద్ద ముగిసింది. వేదాంత 2.36 శాతం, హిందాల్కో 1.65 శాతం చొప్పున పెరిగాయి. మరో రెండు రోజుల్లో ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు 1 శాతంపైగా ఎగిసాయి. పెరిగిన షేర్లలో ఆసియన్ పెయింట్స్, సిప్లా, ఇన్ఫోసిస్, లుపిన్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఐటీసీ, టీసీఎస్, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో కార్ప్‌లు వున్నాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతంపైగా క్షీణించి రూ. 1,096 వద్ద క్లోజయ్యింది. భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, అదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఆటోలు సైతం తగ్గాయి. నేడు, రేపు మార్కెట్లకు సెలవు దసరా పండుగ సందర్బంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. అలాగే మొహర్రం కారణంగా బుధవారం సైతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. తిరిగి గురువారం మార్కెట్లు ప్రారంభమవుతాయి. -
ముగింపులో రికవరీ...
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ బలహీనత కారణంగా ట్రేడింగ్ సమయంలో చాలాభాగం ఒడుదుడుకులకు లోనైన భారత్ మార్కెట్ ముగింపులో కోలుకుంది. దాంతో స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజు స్వల్పలాభాలతో ముగిసాయి. ఒకదశలో 28,311 పాయింట్ల వరకూ క్షీణించిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 41 పాయింట్ల లాభంతో 28,413 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 8,705 పాయింట్ల స్థాయి నుంచి రికవరీ అయ్యి 16 పాయింట్ల లాభంతో 8,743 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వచ్చే వారం అటు అమెరికా, ఇటు జపాన్ కేంద్ర బ్యాంకుల పాలసీ మీటింగ్‌లు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారని, దాంతో మార్కెట్ స్వల్ప శ్రేణిలో కదలాడిందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రిలయన్స్ నేతృత్వం: మార్కెట్ రికవరీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు నేతృత్వం వహించింది. సూచీల్లో గణనీయమైన వెయిటేజి కలిగిన ఈ షేరు బీఎస్ఈలో 1.63 శాతం పెరిగి రెండు వారాల గరిష్టస్థాయి రూ. 1,063 వద్ద ముగిసింది. కానీ సెన్సెక్స్-30 షేర్లలో 13 మాత్రమే పెరిగాయి. సిప్లా, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ, ఐటీసీలు 1-2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, ఎన్టీపీసీ, మహింద్రా, గెయిల్‌లు క్షీణించాయి. -
మందకొడిగా ట్రేడింగ్
♦ స్వల్పంగా తగ్గిన సూచీలు ♦ ఫెడ్ ఛైర్పర్సన్ ప్రసంగం కోసం ఎదురుచూపులు ముంబై: సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్‌లో తొలిరోజైన శుక్రవారం ట్రేడింగ్ మందకొడిగా సాగింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్ జానెట్ యెలెన్ శుక్రవారం రాత్రి అమెరికాలో చేయనున్న ప్రసంగంలో వడ్డీ రేట్లపై ఎటువంటి సంకేతాలు వెలువడతాయోనన్న సందిగ్దత ఇన్వెస్టర్లను వెన్నాడటంతో ట్రేడింగ్ నిస్తేజంగా సాగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడ్ మొగ్గుచూపితే, భారత్ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి కొద్దికాలంపాటు విదేశీ నిధులు తరలివెళతాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ రాయ్ చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్ల తగ్గుదలతో 27,782 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 20 పాయింట్ల క్షీణతతో 8,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 295 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్ల చొప్పున తగ్గాయి. ఆసియాలో జపాన్, సింగపూర్ సూచీలు తగ్గగా, హాంకాంగ్ మార్కెట్ స్వల్పంగా పెరిగింది. యూరప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఐటీ షేర్లు వెలవెల... సెన్సెక్స్-30 షేర్లలో 17 షేర్లు నష్టాల్లో ముగిసాయి. ఐటీ షేరు విప్రో అన్నింటికంటే అధికంగా 3 శాతం క్షీణించగా, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు 1-2 శాతం మధ్య తగ్గాయి. ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీలు కూడా 1-2 శాతం మధ్య నష్టపోయాయి. ఇక తాజాగా ఆర్థిక ఫలితాలు ప్రకటించిన టాటా మోటార్స్ షేరు 2 శాతం ఎగిసింది. గెయిల్, ఆర్ఐఎల్ 1-2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. -
15 నెలల గరిష్టానికి నిఫ్టీ ఆర్బీఐ పాలసీ నేడు
♦ ఈ నేపథ్యంలో ఆశావహ కొనుగోళ్లు ♦ కలసివచ్చిన సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ♦ 104 పాయింట్ల లాభంతో 28,183కు సెన్సెక్స్ ♦ 28 పాయింట్ల లాభంతో 8,711కు నిఫ్టీ ఆర్బీఐ పాలసీ మంగళవారం వెలువడనుండటంతో ఇన్వెస్టర్ల ఆశావహ కొనుగోళ్ల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కూడా కలసి రావడంతో బీఎస్ఈ సెన్సెక్స్28వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,700 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 28,183 పాయింట్లకు, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 పాయింట్లకు చేరాయి. నిఫ్టీకి ఇది 15 నెలల గరిష్ట స్థాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 485 పాయింట్లు లాభపడింది. రోజంతా లాభాల్లోనే శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో అమెరికా సూచీలు రికార్డ్ స్థాయిలో ముగిశాయి. చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో ముగియడంతో సోమవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ వెల్లడించే నేటి పాలసీలో రేట్లు యథాతథంగానే ఉంటాయన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పొజిషన్లు బిల్డప్ చేసుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. హీరో మోటొకార్ప్ నికర లాభం ఈ క్యూ1లో 18 శాతం పెరగడం, విదేశీ పెట్టుబడులు జోరు కొనసాగుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. హిందాల్కో 4 శాతం వరకూ అప్..:అమెరికా అనుబంధ కంపెనీ నొవాలిస్ మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో హిందాల్కో షేర్4 శాతం వరకూ పెరిగి రూ. 149 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.152ను తాకింది. నికర లాభం 9 శాతం పెరగడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 9 శాతం పెరిగి రూ. 3,152 వద్ద ముగిసింది. కోల్గేట్ పామోలివ్ నికర లాభం 9 శాతం వృద్ధి చెందడంతో ఈ షేర్ 6 శాతం లాభపడి రూ.1,016 కు చేరింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,032ను తాకింది. -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: బ్రెగ్జిట్ ప్రకంపనల అనంతరం సోమవారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 స్క్రిప్టుల సెన్సిటివ్ ఇండెక్స్ ( సెన్సెక్స్ ), 53 పాయింట్ల నష్టంతో 26,347 దగ్గర ప్రారంభం కాగా, నిఫ్టీ 17 పాయింట్లనష్టంతో 8.071 పాయింట్ల దగ్గర ప్రారంమైంది,గ్లోబల్ మార్కెట్ల అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో భారత ఈక్విటీ సూచీలు స్వల్పం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మదుపర్లు వేచి చూసే ధోరణిని కొనసాగించే అవకాశం ఉందిన విశ్లేషకుల అంచనా. అటొ రంగం నష్టాల్లో ఉండగా, ఆయిల్ రంగంపాజిటివ్ ట్రెండ్ లో ఉంది. ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్ , ఇన్ ఫ్రా సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. వాతావరణ సూచనలతో కొనుగోళ్ల మద్దతులభించే అవకావం ఉందని భావిస్తున్నారు. మరోవైపు దేశీయ కరెన్సీ, పుత్తడి పాజిటివ్ గా ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 12 పైసలు లాభపడి 67.84 దగ్గర ఉంది. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం రూపాయి కోలుకుందని ఎనలిస్టులు అంటున్నారు. అటు ఈరోజుకూడా పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. 200 రూ. లాభంతో పది గ్రా. 31,605 దగ్గర ఉంది. దీంతో జ్యువెల్లరీ షేర్ల లాభాలుకొనసాగుతున్నాయి. -
వెలుగులో ప్రభుత్వ బ్యాంకు షేర్లు
♦ ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు ♦ ప్రభావం చూపిన ఫెడ్, బ్రిటన్ రిఫరెండం మే నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు అంతర్జాతీయ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు జాగురూకత వహించడంతో మంగళవారం స్టాక్ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1 పాయింటు క్షీణతతో 26,396 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల క్షీణతతో 8,109 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రిటైల్ టోకు ద్రవ్యోల్బణాలు రెండూ పెరగడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయన్న నిరుత్సాహం ఇన్వెస్టర్లలో ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో ఆందోళన... మంగళవారం ప్రారంభమై రెండురోజులపాటు జరగనున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఆందోళనతో వేచిచూస్తున్నాయని, దీనికి తోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే అంశమై జూన్ 23న జరిగే రిఫరెండం పట్ల మార్కెట్లో భయాలు వున్నాయని విశ్లేషకులు వివరించారు. దాంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్ తదితర ఆసియా మార్కెట్లు 1 శాతంవరకూ క్షీణించగా, యూరప్ సూచీలు 2-3 శాతం మధ్య పతనమయ్యాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు క్షీణతతో ట్రేడవుతున్నాయి. పీఎన్బీ 8 శాతం అప్... ఇక దేశీయంగా సూచీలు ఫ్లాట్‌గా క్లోజయినా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు జోరుగా పెరిగాయి. కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బ్యాంకుల కేటాయింపులు, తదితర అంశాల్లో రిజర్వుబ్యాంక్ నిబంధనల్ని సరళీకరించడంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అన్నింటికంటే అధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8 శాతం ర్యాలీ జరిపి రూ. 90 వద్ద ముగిసింది. ఎస్బీఐ 2.65 శాతం పెరగ్గా, ఓరియంటల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 4 శాతం చొప్పున, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2 శాతం చొప్పున ఎగిసాయి. -
ముంచిన మారిషస్ పన్ను
♦ తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ సూచీలు ♦ 176 పాయింట్ల నష్టంతో 25,597కు సెన్సెక్స్ ♦ 39 పాయింట్ల నష్టంతో 7,849కు నిఫ్టీ మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం గురువారం స్టాక్ మార్కెట్‌ను తీవ్రమైన ఒడిదుడుకులకు గురి చేసింది. ఈ పన్నుపై కొంత స్పష్టత రావడంతో ఆరంభంలో భారీ నష్టాల పాలైన స్టాక్ సూచీలు కొంత కోలుకున్నాయి. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి నష్టపోయింది. 176 పాయింట్లు క్షీణించి 25,597 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 7,800 మార్క్ దిగువకు పడిపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7,849 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ఏప్రిల్ నెల వినియోదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు(గురువారం) వెల్లడి కానున్న నేపథ్యంలో బ్లూ చిప్ షేర్లలో అప్రమత్త లావాదేవీలు జరిగాయి. వాహన, ఫార్మా, ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోయాయి. 13 రంగాల సూచీల్లో 12 నష్టాల్లోనే ముగిశాయి. -
సెన్సెక్స్ హై జంప్...
♦ 460 పాయింట్లు ఆప్ ♦ 25,689 పాయింట్ల వద్ద ముగింపు ♦ నాలుగు వారాల్లో ఇదే పెద్ద ర్యాలీ ముంబై: విదేశీ ఫండ్స్ కొనుగోళ్ల జోరుతో సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ నాలుగువారాల్లో ఎన్నడూలేనంత పెద్ద ర్యాలీ జరిపింది. 460 పాయింట్ల భారీ పెరుగుదలతో 25,689 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 13 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే భారీ ర్యాలీ. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్ నెలలో వడ్డీ రేట్లు పెంచకపోవొచ్చన్న అంచనాలతో పాటు కొన్ని కంపెనీల నుంచి వెలువడిన ప్రోత్సాహకర క్యూ4 ఫలితాలు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సంకేతాలివ్వడంతో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు పెరిగిందని, దాంతో సూచీలు కదం తొక్కాయని విశ్లేషకులు చెప్పారు. 7,800 పాయింట్ల స్థాయిని అవలీలగా అధిగమించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 133 పాయింట్ల లాభంతో 7,866 వద్ద ముగిసింది. అమెరికాలో ఉపాధి కల్పన ఏప్రిల్‌లో నెమ్మదించిందన్న వార్తలతో ఫెడ్ జూన్ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచదన్న ఆశలు నెలకొన్నాయని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. జర్మనీలో మార్చి నెలలో తయారీ ఆర్డర్లు బాగా పెరిగాయన్న వార్తలతో యూరప్ సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో ర్యాలీ జరపడంతో, ఇక్కడి మార్కెట్ పటిష్టంగా ముగిసిందని బ్రోకింగ్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఆసియాలో చైనా షాంఘై సూచి 2.79 శాతం నష్టపోయింది. తైవాన్, కొరియా సూచీలు స్వల్పంగా క్షీణించాయి. హాంకాంగ్, జపాన్, సింగపూర్ ఇండెక్స్‌లు 0.23-1.29 శాతం మధ్యపెరిగాయి. బజాజ్ ఆటో జోరు...: సెన్సెక్స్-30 షేర్లలో అధికంగా ద్విచక్రవాహన కంపెనీ బజాజ్ ఆటో 3.78 శాతం ర్యాలీ జరిపి రూ. 2,528 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 3.41 శాతం పెరగ్గా, ఆకర్షణీయమైన క్యూ4 ఫలితాలతో గత కొద్ది ట్రేడింగ్ సెషన్ల నుంచి పెరుగుతూవస్తున్న హెచ్డీఎఫ్సీ మరో 3.12 శాతం ఎగిసి, రూ. 1,204 వద్దకు చేరింది. సిగరెట్ల ఉత్పత్తిని పునర్ప్రారంభించిందన్న వార్తలతో ఐటీసీ 2.38 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్, ఆసియన్ పెయింట్స్ షేర్లు 2-3.2 శాతం ఎగిసాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.9 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,141 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ ఇండెక్స్ టాప్...: వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్ఈ బ్యాంకింగ్ సూచి 2.45 శాతం ర్యాలీ జరిపింది. క్యాపిటల్ గూడ్స్, టెలికాం, రియల్టీ, ఆటో, టెక్నాలజీ, పవర్ సూచీలు 1.4-1.86 శాతం మధ్య పెరిగాయి. ర్యాలీకి కారణాలు... 1. జూన్‌లో ఫెడ్ రేటు పెంచకపోవొచ్చు: అమెరికాలో ఉపాధి కల్పన ఏప్రిల్ నెలలో గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనంత మందకొడిగా వుందంటూ వెలువడిన గణాంకాలతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను జూన్ నెలలో పెంచకపోవొచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి. జూన్‌లో వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గుచూపుతూ గత కొద్దిరోజులుగా ఫెడ్ అధికారులు చేస్తున్న ప్రకటనలకు తాజా డేటాతో బ్రేక్‌పడింది. ఈ అంశం స్టాక్ మార్కెట్‌కు టానిక్‌లా పనిచేసింది. 2. క్రూడాయిల్ ధరల పెరుగుదల: సోమవారం ఆసియా ట్రేడింగ్‌లో బ్యారల్ ముడి చమురు ధర 2.5 శాతంపైగా ఎగిసింది. ఏప్రిల్ నెలలో చైనాకు క్రూడ్ దిగుమతులు 7 శాతం పెరిగాయన్న వార్తలు, కె నడా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగడంతో ప్రపం చ మార్కెట్లోకి చమురు సరఫరాలు తగ్గుతాయన్న అంచనాలు క్రూడ్ పెరుగుదలకు దారితీసాయి. ఈ అంశం కూడా ఈక్విటీ మార్కెట్‌కు మద్దతునిచ్చింది. 3. క్యూ4 ఫలితాల ఎఫెక్ట్: కొన్ని కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలకంటే మెరుగ్గా వుండటంతో బుల్స్ కొనుగోళ్ల జోరు పెంచారు. ఇన్ఫోసిస్, హీరో మోటో, అల్ట్రాటెక్ సిమెంట్లతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ను ఆకర్షించినట్లు విశ్లేషకులు చెపుతున్నారు. -
నాలుగోరోజూ లాభాలే..
♦ సెన్సెక్స్ 39 పాయింట్లు అప్ ♦ ఇంట్రాడేలో 7500 దాటిన నిఫ్టీ ♦ ఒక వారంలో సూచీలు ఇంత లాభపడడం నాలుగేళ్లలో ఇది తొలిసారి... సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో శుక్రవారం స్టాక్‌మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 7,500 పాయింట్లపైకి ఎగసింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 24,646 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, కొన్ని వాహన షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, కీలక రేట్ల కోత అవకాశాలు మరింత మెరుగుపడడం, రూపాయి రెండున్నర నెలల గరిష్ట స్థాయి అయిన 67.08కు చేరడం(వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి బలపడింది) సానుకూల ప్రభావం చూపాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు(6.44 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 456 పాయింట్లు(6.48 శాతం) చొప్పున లాభపడ్డాయి. ఒక వారంలో స్టాక్ సూచీలు ఈ స్థాయిలో లాభపడడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. బ్యాంక్ నిఫ్టీ 11 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంక్ సూచీ 18 శాతం చొప్పున లాభపడ్డాయి. పాయింట్ల రీత్యా బ్యాంక్ నిఫ్టీకి పదేళ్లలో ఇదే అత్యధిక లాభాల వారం. బ్యాంకింగ్ రంగంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు వెలువడతాయన్న అంచనాలు దీనికి కారణం. మహా శివరాత్రి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. -
డ్రాగన్.. ఎటాక్!
చైనా మందగమనంపై మళ్లీ రేగిన ఆందోళనలు... * ఆజ్యం పోసిన మధ్య ఆసియా ఉద్రిక్తతలు * ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం * సెన్సెక్స్ 538 పాయింట్లు డౌన్.. 25,623 వద్ద ముగింపు * నాలుగు నెలల్లో ఇదే పెద్ద పతనం * 7,800 పాయింట్ల దిగువకు నిఫ్టీ * 172 పాయింట్ల నష్టంతో 7,791కు చేరిక కొత్త సంవత్సరం రెండో ట్రేడింగ్ సెషన్లోనే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలకు గురైంది. చైనా షాంఘై సూచీ భారీగా పతనం కావడంతో ప్రపంచమార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా కుదేలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాజాగా ఆందోళనలు చెలరేగడం, మధ్య ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సోమవారం స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. బీఎస్ఈ సెన్సెక్స్ 26 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 538 పాయింట్లు(2.16 శాతం) నష్టపోయి 25,623 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 172 పాయింట్లు(2.16 శాతం) నష్టపోయి 7,791 పాయింట్ల వద్ద ముగిశాయి. నాలుగు నెలల కాలంలో ఒక్కరోజులో స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. టెలికం, బ్యాంక్, వాహన, పారిశ్రామిక, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఫార్మా... అన్ని రంగాల షేర్లలో అమ్మకాటు జరిగాయి. విస్తరిస్తోన్న చైనా సంక్షోభం... చైనా సంక్షోభం విస్తరిస్తోందని, ఇది అన్ని వర్ధమాన మార్కెట్లపై ప్రభావం చూపుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. సెలవుల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెంచుతారనే అంచనాలున్నాయని, ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్‌కు ఇది మంచి ప్రారంభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్ సం‘గతి’... * టాటా మోటార్స్‌కు లాభాలు అధికంగా వచ్చే జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాల్లో అధిక భాగం చైనా నుంచే వస్తున్నాయి. అలాంటి చైనా మందగమనంలో ఉందన్న ఆందోళనతో టాటా మోటార్స్ షేర్ల లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ స్టాక్ 6 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. * కాల్‌డ్రాప్ నిబంధనలను ఈ నెల 1 నుంచే పాటించాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ లేఖలు రాయడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా 4-5 % రేంజ్లో పడ్డాయి. ఆర్‌కామ్ 9% నష్టపోయింది. * లోహాలను అధికంగా వినియోగించే చైనాపై ఆందోళన కారణంగా హిందాల్కో,టాటా స్టీల్, వేదాంత వంటి లోహ షేర్లు 1-4% రేంజ్లో నష్టపోయాయి. * ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, భెల్ వంటి సెన్సెక్స్ షేర్లతో పాటు కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తదితర షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. * 30 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విప్రో, హిందూస్తాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్ స్వల్పంగా (0.2 శాతం రేంజ్లో) లాభపడ్డాయి. * అదానీ పోర్ట్స్ 3.6 శాతం, భెల్ 3.4 శాతం, హెచ్డీఎఫ్సీ 3.2 శాతం, ఎస్బీఐ 2.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.8 శాతం, లుపిన్ 2.5 శాతం, ఎల్ అండ్ టీ 2.5%, గెయిల్ 2.4 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.3%, సన్ ఫార్మా 2.1 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.9 శాతం చొప్పున నష్టపోయాయి. * 1,,599 షేర్లు నష్టాల్లోకి జారుకోగా... 1,289 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎందుకు పడిపోయిందంటే... * చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తి వరుసగా పదో నెలలో కూడా తగ్గిపోయిందని ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడంతో దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభమైన ఆసియా మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. నవంబర్‌లో 48.6గా ఉన్న కైక్సిన్ తయారీరంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) డిసెంబర్లో 48.2కు పడిపోయింది. దీంతో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా మందగమనంపై తాజాగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ భయాలతో చైనా షాంఘై సూచీ 6.8 శాతం పడిపోవడంతో ట్రేడింగ్‌ను ఆపేశారు. ఈ ప్రభావంతో ఆసియా, యూరప్, అమెరికా.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలమయ్యాయి. * చైనా పీఎంఐయే కాకుండా భారత పీఎంఐ కూడా కొన్ని నెలల కనిష్టానికి పడిపోవడం ప్రభావం చూపింది. చెన్నైలో డిసెంబర్లో భారీగా వరదలు రావడం దేశీయ తయారీరంగంపై ప్రభావం చూపింది. నవంబర్‌లో 50.3గా ఉన్న నికాయ్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డిసెంబర్లో 49.1కు పడిపోయింది. * షియా మత పెద్ద షేక్ నిమ్ ్రఅల్ నిమ్న్రు సౌదీ అరేబియా ఉరితీసింది. దీంతో షియాలు అధికంగా ఉంటే ఇరాన్లో సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంపై దాడులు జరిగాయి. దీంతో ఇరాన్‌తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ మధ్య ఆసియా భౌగోళిక ఉద్రిక్తత కూడా మన స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. * దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళనలూ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. లక్షన్నర కోట్ల సంపద ఆవిరి అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.54 లక్షల కోట్లు అవిరైంది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. శుక్రవారం నాడు రూ.100.93 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద సోమవారం రూ.99,39,378 లక్షల కోట్లకు క్షీణించింది. ప్రపంచ మార్కెట్లు... బేర్! కొత్త ఏడాదికి ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికాయి. ఈ నెల 1 శుక్రవారం నాడు భారత్ మార్కెట్ పనిచేసినప్పటికీ, చాలా దేశాల మార్కెట్లకు సెలవు. నూతన సంవత్సరంలో తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. చైనా తయారీ రంగ పీఎంఐ డిసెంబర్లో 50 పాయింట్ల దిగువకు పడిపోవడంతో చైనా షాంఘై సూచీ ఇంట్రాడేలో 7 శాతానికి పైగా పడిపోయింది. మరో చైనా స్టాక్ సూచీ షెన్జెన్ కాంపొజిట్ 8 శాతానికి పైగా నష్టపోయింది.సూచీలు 7 శాతానికి పైగా క్షీణిస్తే ఆరోజుకు ట్రేడింగ్‌కు నిలిపేయాలన్న కొత్త సర్క్యూట్ బ్రేకర్ నిబంధనల కారణంగా ట్రేడింగ్ నిలిపేశారు. ఇతర ఆసియా మార్కెట్లు భారీగానే నష్టపోయాయి. జపాన్ నికాయ్ 583 పాయింట్లు(3.1 శాతం), హాంగ్ సెంగ్ 2.7 శాతం చొప్పున నష్టపోయాయి. దక్షిణ కొరియా, సింగపూర్ సూచీలు 2 శాతం వరకూ పతనమయ్యాయి. ఇక యూరప్ మార్కెట్ల విషయానికొస్తే జర్మనీ డ్యాక్స్ 460 పాయింట్లు (4.3 శాతం), ఫ్రాన్స్ సీఏసీ 40 సూచీ 115 పాయింట్లు (2.5 శాతం), లండన్ ఎఫ్టీఎస్ఈ 100 సూచీ 149 పాయింట్లు (2.4 శాతం) చొప్పున పతనమయ్యాయి. యూరోప్ దేశాల వస్తువులను అధికంగా చైనాయే కొనుగోలు చేస్తుందని, అందుకని యూరప్ మార్కెట్లు అధికంగా నష్టపోయాయని విశ్లేషకులంటున్నారు. ఇక అమెరికా మార్కెట్ల విషయానికొస్తే, కడపటి సమాచారం అందేసరికి నాస్డాక్ 139 పాయింట్లు(2.8 శాతం), డోజోన్స్ 423 పాయింట్లు (2.4 శాతం) నష్టాలతో ట్రేడవుతున్నాయి. కనకం కళకళ.. స్టాక్ మార్కెట్ పతనంతో రూపాయి క్షీణించగా, పుత్తడి మాత్రం వెలుగులు విరజిమ్మింది. స్టాక్స్, రూపాయి పతనం వల్ల, సురక్షిత మదుపు సాధనంగా బంగారమే సరైనదన్న భావనతో దేశీయంగా, అంతర్జాతీయంగా కనకం ధరలు కళకళలాడాయి. సింగపూర్‌లో ఔన్స్ బంగారం 0.9 శాతం లాభంతో 1,070డాలర్లకు, అలాగే లండన్‌లో 1.17 శాతం వృద్ధితో 1,073.4 డాలర్లకు పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.195 పెరిగి రూ.25,615కు ఎగసింది. ఇక ముంబైలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం రూ.295 పెరిగి రూ.25,460కు చేరగా, చెన్నైలో రూ.310 పెరిగి రూ.25,690కు పెరిగింది.