79,000 స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు
విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ఎఫెక్ట్
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3%, ఎస్‌బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్‌ఎల్‌సీ 4%, ఎన్‌సీఎల్ 3.50% క్షీణించాయి.
⇒ బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది.
⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment