equity markets
-
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఎస్బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్ఎల్సీ 4%, ఎన్సీఎల్ 3.50% క్షీణించాయి. ⇒ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. -
ఈక్విటీ రాబడులపై పన్ను సున్నా!
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది. ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను తగ్గించుకునే మార్గాలు..ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.ట్యాక్స్ హార్వెస్టింగ్ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం. ఇల్లు కొనడం.. ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు. బాండ్లు సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.షరతులు ఉన్నాయ్... దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సరైన నిర్ణయమేనా?మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.నష్టాలతో భర్తీ..ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్కెట్‌కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
బీఎస్ఈ కంపెనీల సరికొత్త రికార్డ్ 5 లక్షల కోట్ల డాలర్లు
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో యూఎస్ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది. -
2027 నాటికి భారత్... టాప్3
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది. గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.415 లక్షల కోట్లు) చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. స్థిరమైన వృద్ధి ప్రక్రియలో భాగంగా, 2030 నాటికి భారత స్టాక్ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ 4.3 ట్రిలియన్ డాలర్లు విలువతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. టాప్4లో అమెరికా (44.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.8 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.8 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. గత 5–20 సంవత్సరాల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ డాలర్ మారకంలో ఏటా 10 శాతం చొప్పున స్థిరమైన రాబడిని ఇచ్చింది. వర్ధమాన మార్కెట్లలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా మెరుగైన పనితీరు చూపించింది. మూలధన వ్యయాలు తిరిగి పుంజుకోవడం, కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేసే స్థితిలో ఉండడం వల్ల భారత మార్కెట్ వచ్చే 5–7 ఏళ్లలోనూ మంచి వృద్ధిని నమోదు చేయనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. భారత ఈక్విటీల్లోకి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను జెఫరీస్ ప్రస్తావించింది. ఇప్పటికీ గృహ పొదుపులో కేవలం 4.7 శాతమే ఈక్విటీల్లోకి వస్తున్నట్టు తెలిపింది. డిజిటల్‌గా ఎంతో పురోగతి సాధించడంతో సంప్రదాయ, రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య అంతరాన్ని తగ్గించినట్టు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు అసాధారణ స్థాయిలో మార్కెట్ ప్రవేశాన్ని పొందుతున్నట్టు తెలిపింది. సిప్‌కు అమిత ఆదరణ పెరగడం, పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో ఉన్న క్రమశిక్షణను తెలియజేస్తోందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లోకి మరింతగా పొదుపు నిధులు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. బహుళజాతి కంపెనీల లిస్టింగ్ బలమైన వృద్ధి గమనం, మార్కెట్ల పెరుగుదల, అధిక రాబడుల ట్రాక్ రికార్డ్ ఇవన్నీ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాయని జెఫరీస్ పేర్కొంది. దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ హ్యుందాయ్ ఇండియా తన భారతీయ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావించింది. బలమైన భవిష్యత్తుకు పునాది అధిక వృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన నిరంతర సంస్కరణలను నివేదిక ప్రశంసించింది. ‘‘దేశంలో సులభతర వ్యాపారాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది. 2017 నాటి చరిత్రాత్మక జీఎస్టీ చట్టం అనేక పన్నుల నిర్మాణాలను ఏకైక ఉమ్మడి జాతీయ విధానంగా కుదించింది ఇది. రాష్ట్రాల వ్యాప్తంగా ’యూరోజోన్’ శైలి వస్తువులు, సేవల ప్రవాహాన్ని సృష్టించింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొండి బకాయిల ప్రక్షాళనను వేగవంతం చేయడంలో 2016 నాటి దివాలా చట్టం కీలకంగా మారింది. 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) విస్తారమైన, అసంఘటిత స్థిరాస్తి రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహాయపడింది’’ అని నివేదిక పేర్కొంది. -
ఆర్బీఐ పాలసీ అప్రమత్తత
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి (నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 621 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72,152 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 71,938 వద్ద కనిష్టాన్ని, 72,559 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 22,053 – 21,860 రేంజ్ లో కదలాడింది. చివరికి ఒక పాయింటు లాభపడి 21,930 వద్ద నిలిచింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, 0.38% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,691 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,096 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, ఇండోనేíసియా, చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.10% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 0.25% లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పాటు ఇటీవల ర్యాలీ నేపథ్యంలో ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా 2.31%, ఇన్ఫోసిస్ 2%, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ► పేటీఎం రికవరీ ప్రయాణం బుధవారం కొనసాగింది. బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభంలో 10% పెరిగి రూ.496 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి లాకైంది. రెండు రోజుల్లో షేరు 13% బౌన్స్‌బ్యాక్‌తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,720 కోట్లు పెరిగి రూ.31,548 కోట్లకు చేరింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటా కొనుగోలుకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో యస్‌బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వరుసగా 17%, 7% చొప్పున లాభపడ్డాయి. -
సెంటిమెంట్ సానుకూలం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు. ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్ ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్‌కు ఆర్బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు. డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
పెట్టుబడులకు భారత్ బెస్ట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ, డెట్ మార్కెట్లలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. బడా ఎకానమీల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేస్తోంది. డెమోగ్రాఫిక్స్, మహిళా శ్రామిక శక్తి పెరగడం తదితర సానుకూల అంశాలతో మధ్యకాలికంగానూ ఇదే ధోరణిని కొనసాగించనుంది. అలాగే, అంతర్జాతీయంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకుని, నిలవగలిగేలా ఫారెక్స్ నిల్వలను పెంచుకుంది. ద్రవ్య లోటు అధికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా ఆర్థిక క్రమశిక్షణ బాటలో పురోగమిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు భారీ స్థాయి పన్ను వసూళ్లు తోడ్పడనున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ నిర్వహించిన సింపోజియంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సింపోజియంనకు సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ అధిక ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఈ ప్రీమియం గణనీయంగా పెరిగింది. అయితే, రాబడుల నిష్పత్తి మెరుగ్గా ఉండటం, అధిక వృద్ధికి ఆస్కారం ఉండటం వంటి అంశాలు ఇందుకు న్యాయం చేకూరుస్తున్నాయి. వృద్ధి రేటుపరంగా చూస్తే వేల్యుయేషన్లు సముచితంగానే కనిపిస్తున్నాయి. మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఆకర్షణీయ స్టాక్స్ కన్నా పటిష్టమైన వ్యాపారాలను ఎంచుకోవడం ముఖ్యం. ► ప్రైవేట్ వినియోగం, ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత కార్పొరేట్ సంస్థలు తమ సామరŠాధ్యలను విస్తరించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. కొత్త ఫ్యాక్టరీలు, రోబోటిక్స్, ఆటోమేషన్, టెక్నాలజీ మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు కూడా మెరుగుపడుతుండటంతో పెట్టుబడులకు అవసరమైన నిధులకు పెద్దగా కొరత లేదు. ► దేశీయంగా వినియోగ డిమాండ్ మెరుగుపడుతోంది. 2023లో తలసరి ఆదాయం 2,500 డాలర్ల మార్కును దాటింది. దీనితో చైనా, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి ఇతరత్రా వర్ధమాన మార్కెట్లలో కనిపించిన విధంగానే విచక్షణ ఆధారిత వినియోగం పెరిగే అవకాశం ఉంది. కార్లు, రియల్ ఎస్టేట్ మొదలైన వాటిల్లో ప్రీమియం ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగవచ్చు. ► మ్యుచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా మార్కెట్లలోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయి. దేశీయంగా క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగానే ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్కెట్లలో పెట్టుబడుల వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. రిస్కులు ఉన్నాయి.. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ► సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే రాజకీయ అస్థిరతకు దారి తీయొచ్చు. అయితే, ఇందుకు అవకాశాలు చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల గ్రామీణ ఎకానమీ పుంజుకోవడానికి మరింత జాప్యం జరగవచ్చు. దీనితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటునిచ్చేందుకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాల్సి రావచ్చు. రంగాలవారీగా అంచనాలు ఇలా.. ► బ్యాంకింగ్: డిమాండ్ పెరిగే కొద్దీ బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు మెరుగుపడుతోంది. నిరర్థక ఆస్తులు తగ్గుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనుండటంతో నికర వడ్డీ మార్జిన్లు కొంత దిగిరావచ్చు. బ్యాంకింగ్ వేల్యుయేషన్ సముచిత స్థాయిలోనే ఉంది. ► కన్జూమర్: గ్రామీణ ప్రాంతాల్లో బలహీన డిమాండ్ కారణంగా వినియోగ వస్తువుల విక్రయాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా మటుకు కంపెనీలు పుంజుకునేందుకు సకాల వర్షాలు కీలకంగా నిలుస్తాయి. అయితే, విచక్షణాధారిత వినియోగానికి సంబంధించి అఫోర్డబుల్ సెగ్మెంట్లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్లు మెరుగ్గా రాణించవచ్చు. ► ఐటీ సేవలు: సంపన్న దేశాల్లో మందగమనం రావచ్చన్న అంచనాల వల్ల గ్లోబల్ కంపెనీలు ఐటీపై చేసే వ్యయాలపై ప్రభావం పడుతోంది. దీంతో డిమాండ్ బలహీనంగా కనిపిస్తోంది. సరఫరాపరమైన ఆందోళనలు తొలగిపోవడంతో ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గాయి. ► ఫార్మా: అమెరికాలో ఔషధాల కొరత అనేది ఎగుమతి ఆధారిత ఫార్మా కంపెనీలు సైక్లికల్‌గా పుంజుకోవడానికి తోడ్పడుతోంది. ముడివస్తువుల ధరలు తగ్గుతుండటంతో మార్జిన్లు మెరుగ్గా ఉండవచ్చు. సింపోజియంలో బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్(కుడివైపు), బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ సీఈవో గణేష్ -
రికార్డు స్థాయిల్లో లాభాల స్వీకరణ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల అందడంతో రికార్డు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా స్టాక్ సూచీల అయిదు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకొని ప్రథమార్ధంలోనే జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 73,428 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 22,124 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు తాకాయి. సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఐటీ, రియలీ్ట, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ చేసుకోవడంతో సెన్సెక్స్ 199 పాయింట్ల నష్టపోయి 73,427 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పతనమై 22,032 వద్ద ముగిశాయి. చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.31%, 0.43% చొప్పున పతనమయ్యాయి. మరోవైపు మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలతో ఇటీవల భారీగా ర్యాలీ చేసిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుకుంది. చిన్న, మధ్య తరహా షేర్ల విలువలు భారీ పెరిగిపోవడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగకపోవచ్చు. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే తాజా అంశాలేవీ లేకపోవడంతో ఎఫ్ఐఐలు నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. భౌగోళిక ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర(రూ.331)తో పోలిస్తే షేరు బీఎస్ఈలో 12% ప్రీమియంతో రూ.372 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 34% ఎగసి రూ.445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 31% లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,851 కోట్లుగా నమోదైంది. ► క్యూ3 లో నికర లాభం 56% క్షీణించడంతో జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు 7% నష్టపోయి రూ.249 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 8% పతనమై రూ.247 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ ఒక్క రోజులోనే రూ.11,372 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్ 2%, విప్రో 2%, టెక్ మహీంద్ర 1.40%, ఇన్ఫోసిస్ 1.27%, టీసీఎస్ 1% చొప్పున నష్టపోయాయి. ► గతవారంలో 8% ర్యాలీ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3 ఆర్థిక ఫలితాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.2747 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ 671 పాయింట్లు క్రాష్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాల ప్రకటనకు ముందు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సోమవారం దేశీయ మార్కెట్లు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 671 పాయింట్లు పతనమై 71,355 వద్ద నిలిచింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 725 పాయింట్లు నష్టపోయి 71,301 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పతనమైన 21,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.87% నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.16.03 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ► అమెరికాలో డిసెంబర్‌కు సంబంధించి వ్యవసాయేతర రంగాల్లో 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడంతో ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. చైనా ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు డేటాతో సహా ఆయా దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు అప్రమత్తత చోటు చేసుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ► మెక్వైర్ ఈక్విటీస్ రీసెర్చ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులపై రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 1.51% నష్టపోయాయి. ► బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.2.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.366 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► నష్టాల మార్కెట్లో కొన్ని చిన్న రంగాల షేర్లు రాణించాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేరు ఇంట్రాడేలో 2.50% పెరిగి రూ.1182 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. షేరుకి రూ. 10,000 ధర మించకుండా 40,00,000 షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 4,000 కోట్లు వెచి్చంచనుంది. -
మళ్లీ రికార్డుల మోత
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తొలిసారి 72,000 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 21,650 స్థాయిపై ముగిశాయి. ఉదయం లాభాల తో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 71,492 పాయింట్లు వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 783 పాయింట్లు ఎగసి 72,120 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 701 పాయింట్లు లాభపడి 72,038 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 235 పాయింట్లు బలపడి 21,676 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 213 పాయింట్లు లాభపడి 21,655 వద్ద నిలిచింది. ఆయిల్ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,926 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లు విక్రయించారు. ర్యాలీ ఎందుకంటే...? ఫెడ్ రిజర్వ్ 2024 మార్చి కంటే ముందుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలత దేశీయ మార్కెట్‌కు కలిసొచి్చంది. గత 20 ఏళ్ల ట్రేడింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఈక్విటీ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ కొనసాగుతుంది. (డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్లు, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు). వాల్ స్ట్రీట్‌లో ‘సెల్ చైనా, బై భారత్’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్లో ఎఫ్ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్ ఖాతా లోటు తగ్గడం కలిసొచి్చంది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► చైనా తయారీ రంగం పుంజుకోవడం, డాలర్ బలహీనతతో అంతర్జాతీయంగా బేస్ మెటల్ ధరలు పెరగడం మెటల్ షేర్లకు డిమాండ్ పెంచింది. హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% లాభపడ్డాయి. టాటా స్టీల్, వెల్‌స్పాన్ కార్ప్, హిందుస్థాన్ కాపర్, వేదాంతా, జిందాల్ స్టీల్ షేర్లు 1% వరకు పెరిగాయి. ► ఇటీవల ర్యాలీలో వెనకబడిన బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి. పీఎన్బీ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఎస్బీఐ 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.50%, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్‌లు 1–6% లాభపడ్డాయి. ► 4 రోజుల్లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తో దలాల్ స్ట్రీట్‌లో రూ.11.11 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరింది. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ బూస్ట్!
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి. ► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది. -
యుద్ధ భయాల నుంచి కోలుకున్న మార్కెట్
ముంబై: ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ భయాల నుంచి దలాల్ స్ట్రీట్ తేరుకుంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో మంగళవారం సూచీలు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న రికవరీ ర్యాలీ కలిసొచ్చింది. క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతానికి పెంచింది. ఫలితంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 66,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 19,690 వద్ద నిలిచింది. ఒకదశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 66,180 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు దూసుకెళ్లి 19,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. ఫెడ్ రిజర్వ్ అధికారుల సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ పోర్ట్స్, సెజ్ వివరణ ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు 4% లాభపడి చేసి రూ.819 వద్ద స్థిరపడింది. పండుగ డిమాండ్‌తో సెప్టెంబర్ రిటైల్ అమ్మకాల్లో 20% వృద్ధి నమోదైనట్లు డీలర్ల సమాఖ్య ఫెడా ప్రకటనతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. టాటా మోటార్స్ 2%, ఎంఅండ్ఎం 1.50%, మారుతీ 1.32% లాభపడ్డాయి. అశోక్ లేలాండ్ 1.22%, హీరో మోటో 0.66%, బజాబ్ ఆటో 0.64%, ఐషర్ 0.42%, టీవీఎస్ 0.36% పెరిగాయి. -
మార్కెట్లపై ‘ఫిచ్’ పంచ్
ముంబై: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 66,064 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పతనమై 19,655 వద్ద మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో రోజంతా నష్టాల్లో కదలాడాయి. విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల సూచీలు గరిష్టంగా రెండున్నర శాతం వరకు క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1027 పాయింట్లు నష్టపోయి 65,432 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు క్షీణించి 19,423 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. చివర్లో కనిష్ట స్థాయిల వద్ద స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 65,783 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,527 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1878 కోట్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.2 కోట్లను షేర్లను విక్రయించారు. రూపాయి ఆరునెలల్లో అతిపెద్ద పతనం రూపాయి విలువ ఆరు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో 45 పైసలు కరిగిపోయి 82.67 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణలు ఇందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.38 వద్ద మొదలైంది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి(82.67) వద్ద ముగిసింది. ‘ప్రపంచ మార్కెట్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు ఆసియా కరెన్సీల బలహీన ట్రేడింగ్‌తో రూపాయి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటమూ దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒక్క రోజులో రూ.3.46 లక్షల కోట్ల నష్టం సెన్సెక్స్ ఒక శాతానికి పైగా క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.303 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలు ఎందుకంటే ► ‘గత 20 ఏళ్లలో అమెరికా అప్పుల కుప్పగా మారింది. పాలనా వ్యవస్థలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. యూఎస్ రుణ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏప్లస్ రేటింగ్‌కు తగ్గిస్తున్నాము’ అని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ► ఫిచ్ రేటింగ్ కుదింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మళ్లాయి. అమెరికా పదేళ్ల కాలపరిమిత బాండ్లపై రాబడి ఏకంగా 4% పెరిగింది. ► యూరో జోన్, చైనా జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో అంతర్జాతీయ వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 2–1% క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. ► దేశీయంగా గడిచిన నాలుగు నెలల్లో సూచీలు 13% ర్యాలీ చేయడంతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. -
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
సెన్సెక్స్ అరశాతానికి పైగా లాభపడటంతో మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.09 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 290 లక్షల కోట్లకు చేరింది. ముంబై: మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్ ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు పెరిగి 62,779 వద్ద, నిఫ్టీ 30 లాభంతో 18,632 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. మిడ్ సెషన్ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 425 పాయింట్లు పెరిగి 63,177 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 18,729 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆఖరికి సెన్సెక్స్ 418 పాయింట్ల లాభంతో 63,177 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 18,716 వద్ద నిలిచింది. ఇరు సూచీలకు ఈ ముగింపు ఆరునెలల కనిష్ట స్థాయి కావడం విశేషం. రియల్టి , కన్య్సూమర్ డ్యూరబుల్స్, టెలీ కమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, మెటల్, షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.17%, 0.82 శాతం చొప్పున పెరిగాయి. ఆటో షేర్లు మాత్రమే నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 3 డాలర్లు దిగిరావడంతో బర్గర్ పెయింట్స్, కన్షాయ్ నెరోలాక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 4–2% శాతం బలపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,678 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 203 కోట్ల షేర్లను విక్రయించారు. డాలర్ మారకంలో రూపాయి ఐదు పైసలు బలపడి 82.38 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే ఆశలతో ప్రపంచ ఈక్విటీ మా ర్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎంఆర్ఎఫ్ ః రూ. 1 లక్ష ఆరు అంకెల ధర తాకిన తొలి దేశీ షేరు ఇంట్రాడేలో రూ. 1,00,300; రూ. 99,950 వద్ద క్లోజింగ్ దేశీ టైర్ల దిగ్గజం ఎంఆర్ఎఫ్ షేరు కొత్త రికార్డు సృష్టించింది. రూ. 1 లక్ష మార్కును అధిగమించిన తొలి షేరుగా ఘనత దక్కించుకుంది. మంగళవారం బీఎస్ఈలో 52 వారాల గరిష్టం రూ. 1,00,300 స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 1.02% లాభంతో రూ. 99,950.65 వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో రూ. 1,00,439.95ని తాకి చివరికి 0.94% లాభంతో రూ. 99,900 వద్ద ముగిసింది. స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 12.89% పెరిగింది. -
ద్రవ్యోల్బణ డేటా.., ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల పురోగతికి సంబంధించిన వార్తలను పరిగణలోకి తీసుకోవచ్చంటున్నారు. ఇదేవారంలో ఫెడ్‌తో సహా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు తమ ద్రవ్య విధానాలపై చేసే ప్రకటనలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వెల్లడించే ద్రవ్య విధాన వైఖరి అనుగుణంగా ఈక్విటీ మార్కెట్లు కదలాడొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 18,680 – 18,780 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు కొనసాగితే దిగువ స్థాయిలో 18,500 – 18,450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అవుట్‌లుక్‌ను(5.2% నుంచి 5.1 శాతానికి)ను ఆశించిన స్థాయిలో తగ్గించకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఫలితంగా మార్కెట్ గతవారం చివరి రెండు ట్రేడింగ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అయినప్పటికీ.., వారం మొత్తంగా సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్లు చొప్పున బలపడ్డాయి. ఎఫ్ఐఐలు.., డీఐఐలు కొనుగోళ్లే.. గడచిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు).., సంస్థాగత ఇన్వెస్టర్లు ఇరువురూ కొనుగోళ్లు చేపట్టారు. జూన్ 5–9 తేదీల మధ్య ఎఫ్ఐఐలు నికరంగా రూ.979 కోట్లు, డీఐఐలు రూ. 1938 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఎఫ్ఐఐలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించే విధంగా సెబీ ఇటీవల నిబంధనలను కఠినతరం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో భారత్ ధృడవైఖరిపై ఇది మరోసారి చర్చకు దారీ తీసింది’’ బీడీఓ ఇండియా ఫైనాన్సియల్ సర్వీసెస్ టాక్స్ చైర్మన్ మనోజ్ పురోహిత్ తెలిపారు. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ ఏడాది మే రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఏప్రిల్ నమోదైన 4.79% కంటే తక్కువగానే మేలో 4.34శాతంగా నమోదవచ్చొని ఆర్థిక అంచనా వేస్తున్నారు. మరుసటి రోజు(జూన్ 13) డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జూన్ రెండోవారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. ఎఫ్ఓఎంసీ నిర్ణయాలపై దృష్టి అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం మంగళవారం(జూన్ 13న) మొదలై బుధవారం ముగిస్తుంది. ఈసారి కీలక వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. పాలసీ వెల్లడి సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసే వ్యాఖ్యలు ఈక్వి టీ మార్కెట్ల స్థితిగతులను మార్చగలవు. ప్రపంచ పరిణామాలు... అమెరికా మే సీపీఐ ద్రవ్యల్బణ డేటా మంగళవారం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వెల్లడి బుధవారం వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా మే రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోపియన్ జోన్ ఏప్రిల్ వాణిజ్య లోటు డేటా యూరోపియన్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య విధాన వైఖరి విడుదల అవుతుంది. చైనా మే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ రేటు డేటా వెల్లడి కానుంది. మరుసటి రోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల డేటా, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా కన్జూమర్ సెంటిమెంట్ గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్‌తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్‌లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్‌కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్‌ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్‌కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్‌ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్‌కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్‌కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్‌లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
నాలుగు నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు ఆగడం లేదు. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్ సూచీలు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్ క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత)కి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు 2% నుంచి 1.5% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 58,796 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 17,255 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టపోయి 58,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,304 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు 4 నెలల కనిష్టం కావడం గమనార్హం. అయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, వినిమయ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,559 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,610 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 82.58 స్థాయి వద్ద స్థిరపడింది. -
ఫలితాలు, ఆర్థిక గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం ప్రధానంగా ఐటీ దిగ్గజాల క్యూ3(అక్టోబర్– డిసెంబర్) ఫలితాలు ఈక్విటీ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఆర్థిక గణాంకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల సీజన్ ఈ నెల 9నుంచి ప్రారంభంకానుంది. గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం నికర అమ్మకందారులుగా నిలిచిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీంతో విదేశీ పెట్టుడి పరిస్థితులు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలియజేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం నేడు(సోమవారం) సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది క్యూ3 ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 12న, విప్రో 13న క్యూ3 పనితీరును ప్రకటించనున్నాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ 14న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఇక మరోవైపు ప్రభుత్వం 12న నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు సైతం ప్రకటించనుంది. వెరసి ఈ వారం పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఈ వారం యూఎస్, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం ఈ నెల 12నే విడుదలకానున్నాయి. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. గత వారం విడుదలైన మినిట్స్ ప్రకారం యూఎస్ ఫెడ్ 2023లోనూ వడ్డీ రేట్ల పెంపువైపు మొగ్గు చూపనున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కొంతమేర బలహీనపడ్డాయి. దేశీయంగా సెన్సెక్స్ 940 పాయింట్లు(1.55 శాతం), నిఫ్టీ 246 పాయింట్లు(1.4 శాతం) చొప్పున క్షీణించాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి సైతం 82–83 మధ్య కదులుతోంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు పలు అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐల వెనకడుగు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త కేలండర్ ఏడాది(2023) తొలి వారంలో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–6 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 5,872 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పలు దేశాలలో మరోసారి కోవిడ్–19 సమస్య తలెత్తడం, ఫెడ్ వడ్డీ పెంపు, రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడనున్న అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇకపై క్యూ3 ఫలితాలు, ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలు వంటి అంశాలు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నిజానికి గత 11 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 14,300 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే డిసెంబర్ నెలలో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. నవంబర్‌లో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్ జత చేసుకోవడం గమనార్హం! పూర్తి ఏడాది(2022)లో మాత్రం దేశీ ఈక్విటీల నుంచి నికరంగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు పలు ప్రపంచవ్యాప్త ప్రతికూలతల నడుమ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
మార్కెట్‌పై యుద్ధ మేఘాలు
ముంబై: రష్యా – ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో కమ్ముకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంతో కీలకపాత్ర పోషిస్తున్న ఈ దేశాల మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 95 డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను మార్చి కంటే ముందుగానే పెంచవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో ఆసియా మార్కెట్ల నుంచి యూరప్ సూచీలు, అమెరికా ఫ్యూచర్ల వరకు నష్టాల కడలిలో కుంగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్‌పైనా ఆ ప్రభావం కనిపించింది. ఇక దేశీయ ప్రతికూలతలను పరిశీలిస్తే.., ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు నష్టపోయి 9 వారాల కనిష్ట స్థాయి 75.60కి పడిపోయింది. దేశీయ మార్కెట్లో సోమవారం ఎఫ్ఐఐలు రూ.4,254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది తొలి నెల జనవరి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,747 పాయింట్లు క్షీణించి 56,406 వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఫిబ్రవరి 26 తరువాత ఈ సూచీకిదే అతిపెద్ద నష్టం. నిఫ్టీ 532 పాయింట్లు పతనమైన ఈ ఏడాదిలో తొలిసారి 17,000 స్థాయి దిగువన 16,843 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలోని మొత్తం 19 రంగాల ఇండెక్సులు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్, బ్యాంకింగ్ షేర్ల సూచీలు ఐదుశాతానికి పైగా క్షీణించాయి. విస్తృతస్థాయిలో అమ్మకాలు జరగడంతో స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్సులు నాలుగు చొప్పున నష్టపోయాయి. ఆసియాలో స్టాక్ సూచీలన్నీ ఒకశాతం నుంచి రెండున్న శాతం నష్టపోయాయి. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మార్కెట్లు 1.50%– 3% చొప్పున క్షీణించాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,433 క్షీణించి 56,720 వద్ద, నిఫ్టీ 299 పాయింట్ల పతనంతో 17,375 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ నష్టాల నేపథ్యంలో దిగువస్థాయిల వద్ద కొంత కొనుగోళ్ల మద్దతు లభించినా.., ఆదిలోనే హంసపాదులాగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. ఒక దశలో సెన్సెక్స్ 1,858 పాయింట్ల నష్టంతో 56,295 వద్ద, నిఫ్టీ 565 పాయింట్లను కోల్పోయి 16,810 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలకు దిగివచ్చాయి. లాభాలు ఒక్క షేరుకే... సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఒక్క టీవీఎస్(ఒకశాతం లాభం) మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండెక్సుల్లో దిగ్గజాలైన టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు అత్యధికంగా ఐదున్నర శాతం క్షీణించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, విప్రో షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి. సూచీలో అధిక వెయిటేజీ షేరు రిలయన్స్ షేరు రెండు శాతం నష్టపోయింది. రెండురోజుల్లో రూ.12.43 లక్షల కోట్లు... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ ప్రతికూలతలతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 2,520 పాయింట్లు, నిఫ్టీ 763 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీల భారీ పతనంతో గడిచిన రెండురోజుల్లో బీఎస్ఈలో రూ.12.43 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గతవారాంతపు రోజైన శుక్రవారం రూ. 3.91 లక్షల కోట్లు, ఈ సోమవారం రూ.8.47 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.255 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘ఊహించినట్లే ప్రపంచ ప్రతికూలతలు దేశీయ మార్కెట్ పతనాన్ని శాసించాయి. కొన్ని వారాల స్థిరీకరణ తర్వాత మార్కెట్‌పై బేర్స్ పట్టు సాధించాయి. రష్యా – ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. పెరుగుతున్న క్రూడ్ ధరలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రానున్న రోజుల్లో సూచీలకు అంతర్జాతీయ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 23 శాతం ఎగసి 22.98 స్థాయికి చేరుకుంది. ► నష్టాల మార్కెట్లో టీసీఎస్ షేరు మాత్రమే ఒకశాతం లాభపడి రూ.3734 వద్ద ముగిసింది. బైబ్యాక్ రికార్డు తేదీ(ఫిబ్రవరి 23)ని ప్రకటించడం షేరు రాణించేందుకు కారణమైంది. ► స్పైస్‌జెట్ ఆఫర్‌ను కళానిధి మారన్ తిరస్కరించడంతో ఆ షేరు ఐదున్నర శాతం క్షీణించి రూ.59 వద్ద స్థిరపడింది. ► బ్యాంకింగ్ షేర్ల పతనంలో భాగంగా ఐసీఐసీఐ షేరు పదినెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో 5% పతనమై రూ.754 వద్ద ముగిసింది. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: కీలక వడ్డీరేట్ల పెంపు మార్చిలో ఉంటుందనే అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో గురువారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం దేశీయ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు నెలకొని ఎనిమిదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లను తాకింది. డాలర్ విలువ ఐదు వారాల గరిష్టానికి చేరింది. ఈ అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లను కోల్పోయి 17,110 వద్ద నిలిచింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. ద్వితీయార్థంలో బ్యాంకింగ్ షేర్లు భారీగా రాణించాయి. ఆటో, మీడియా షేర్లలో చెప్పుకోదగిన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,267 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2,881 కోట్ల షేర్లను కొన్నారు. సూచీలు ఒకశాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒకరోజులో రూ.2.81 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. తద్వారా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,59 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలను పరిమితం చేసిన బ్యాంకింగ్ సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 57,317 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పతనమై 17,062 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1419 పాయింట్లు కోల్పోయి 56,439 వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయి 16,867 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్ సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ నష్టాలు (–)1,419 పాయింట్ల నుంచి (–)581కు, నిఫ్టీ (–) నష్టాలు 411 పాయింట్ల నుంచి (–)167 పరిమితయ్యాయి. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలహీనపడి 75.09 వద్ద ముగిసింది. ఐపీవో బాటలో బోట్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
వదంతులను నమ్మొద్దు: సెబీ
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల సంస్థ సెబీ అప్రమత్తమైంది. వదంతుల ఆధారంగా పెట్టుబడులకు దిగవద్దంటూ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించారు. లావాదేవీలను రిజిస్టరైన ఇంటర్మీడియరీల ద్వారా మాత్రమే నిర్వహించవలసిందిగా సూచించారు. కోవిడ్–19 మహమ్మారి తదుపరి దేశీ సెక్యూరిటీల మార్కెట్ భారీ వృద్ధిలో సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఊపందుకోవడంతోపాటు.. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు భారీగా పెరిగాయి. వీటికి జతగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి సైతం రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అత్యధిక స్థాయిలో ప్రవహిస్తున్నట్లు అజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్కెట్లలో పెట్టుబడులు చేపట్టేముందు తగినంత పరిశోధన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు. ప్రధానంగా మార్కెట్లో పుట్టే వదంతుల ఆధారంగా లావాదేవీలు చేపట్టవద్దంటూ 2021 ప్రపంచ ఇన్వెస్టర్ల వారం(డబ్ల్యూఐడబ్ల్యూ)పై నిర్వహించిన సదస్సు సందర్భంగా అజయ్ సూచించారు. ఈ ప్రపంచ సదస్సును అంతర్జాతీయ సెక్యూరిటీల మార్కెట్ కమిషన్ ఈ ఏడాది నవంబర్ 22–28 మధ్య నిర్వహిస్తోంది. -
బుల్ బౌన్స్‌బ్యాక్
ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్‌లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి. మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి. నిరాశపరిచిన ఫినో పేమెంట్స్ బ్యాంక్... లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజ్‌లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది. ► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్‌లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. ► నైకా షేరుకు డిమాండ్ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది. -
ఫెడ్ నిర్ణయాలు... ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, స్థూల ఆర్థిక, ఆక్టోబర్ ఆటో అమ్మక గణాంకాలు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. గురువారం దీపావళీ, శుక్రవారం బలి ప్రతిపద సందర్భంగా ఎక్చ్సేంజీలకు సెలవుకావడంతో ట్రేడింగ్ మూడు రోజులే జరుగుతుంది. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ సమావేశానికి ముందు అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. మూడురోజుల పరిమిత ట్రేడింగ్‌లో అమ్మకాలు కొనసాగవచ్చు. నిఫ్టీకి 17,250 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయి ఉంది. నిర్ణయాత్మక ఈ స్థాయిని కోల్పోతే అమ్మకా తీవ్రత మరింత పెరగవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ద్ ఖేమా తెలిపారు. గతవారంలో సెన్సెక్స్ 1,515 పాయింట్లు, నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయాయి. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాల ప్రకటన, ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., నేడు వాహన విక్రయ గణాంకాల వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు నేడు(సోమవారం) తమ అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడయ్యే అవకాశం ఉంది. సెమి కండెక్టర్ల కొరత, రవాణా ఛార్జీలు, ముడి సరుకు ధరల పెరుగుదల తదితర అంశాలు వాహన విక్రయాలను పరిమితం చేసి ఉండొచ్చని పరిశమ్ర నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(నవంబర్ 2న) మొదలై.., మూడో తేదిన(బుధవారం)ముగియనున్నాయి. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ఆర్థిక ఉద్దీపనల ఉపసంహరణ(ఫెడ్ ట్యాపరింగ్), బాండ్ల క్రయవిక్రయాలపై కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ నవంబర్ మొదటి వారంలోనూ కొనసాగనుంది. హెచ్డీఎఫ్సీ, టాటామోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఐషర్ మోటార్స్, హెచ్‌పీసీఎల్, దివీస్ ల్యాబ్స్, ఐఆర్సీటీసీలతో సహా 350కి పైగా కంపెనీలు ఈ వారంలో తమ సెప్టెంబర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. గతవారంలో కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గురువారం ముహురత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు రోజు అయినప్పటికీ.., ఆ రోజు సాయం త్రం ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్ 06:00 – 06:08 మధ్య ప్రారంభమవుతుంది. ప్రధాన సెషన్ 06:15 నుంచి 07:15 నిర్వహించబడుతుంది. ఎక్చ్సేంజీల సమయ పాలన మినహా ట్రేడింగ్ విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నిర్ధిష్ట సమయంలో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని ట్రేడర్ల విశ్వాసం. ఈ వారంలో మూడు ఐపీఓలు మూడు కంపెనీలు ఈ వారంలో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. పాలసీ బజార్, సంఘీ ఇండస్ట్రీస్, జేఎస్ఎస్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల పబ్లిక్ ఇష్యూలు సోమవారం మొదలైన బుధవారం ముగియనున్నాయి. ఇందులో పాలసీ బజార్ రూ. 5,625 కోట్లను, ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్ రూ.800 కోట్లను, సంఘీ ఇండస్ట్రీస్ రూ.125 కోట్ల నిధుల సమీకరించున్నాయి. అలాగే గతవారం ప్రారంభమైన నైకా, ఫినో పేమేంట్స్ బ్యాంక్ ఐపీఓలు మంగళవారం ముగియనున్నాయి. అక్టోబర్‌లో అమ్మేశారు రెండు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో దేశీయ ఈక్విటీలను అమ్మేశారు. గత నెలలో భారత మార్కెట్ నుంచి రూ.12,278 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,550 కోట్ల షేర్లను విక్రయించగా.., డెట్ మార్కెట్లో రూ.1,272 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిట రీ గణాంకాలు తెలిపాయి. ‘‘షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే నెపంతో మిర్లేంచ్, యూఎస్బీ, నోమురా బ్రోకరేజ్ సంస్థలు భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు ఇదొక కార ణం అయ్యిండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
మూడు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీల మూడు రోజుల లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, ఆర్థిక, టెలికాం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్థిక అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల్లో తలెత్తిన ఇబ్బందులు భారత్‌తో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు(గురువారం) దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. డాలర్ మారకంలో రూపాయి 23 పైసలు పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 60 వేల దిగువున 59,668 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17,749 వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ఆద్యంతం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1243 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 337 పాయింట్ల రేంజ్ కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1958 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.161 కోట్ల షేర్లను కొన్నారు. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 208 పాయింట్లు లాభంతో 60,286 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,906 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లో ప్రతికూలతలతో పాటు గరిష్ట స్థాయి లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాలతో మొదలవడంతో అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,288) నుంచి 1243 పాయింట్లు నష్టపోయి 59,046 వద్ద, నిఫ్టీ డే హై(17,913) నుంచి 337 పాయింట్లు కోల్పోయి 17,912 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు పరిమితం మిడ్ సెషన్ చివర్లో సూచీలకు దిగువ స్థాయిల వద్ద మద్దతు లభించడంతో అమ్మకాలు తగ్గాయి. మరో గంటలో ట్రేడింగ్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు రాణించాయి. దీంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకొని పరిమిత నష్టాలతో ముగిశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఎన్టీపీసీ షేరు నాలుగు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. ►ఆర్బీఐ రెండు కోట్ల జరిమానా విధించడంతో ఆర్బీఎల్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.187 వద్ద ముగిసింది. ►గోవా షిప్‌యార్డ్ నుంచి కాంట్రాక్టు దక్కించుకోవడంతో భెల్ షేరు ఆరుశాతం ర్యాలీ చేసి రూ.60 వద్ద స్థిరపడింది. -
ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు
ముంబై: సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి ఒక్కఈక్విటీ మార్కెట్ల మద్దతే చాలదని.. బ్యాంకు రుణాల మాదిరి డెట్ మార్కెట్లు సైతం బలంగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యక్తం చేశారు. బ్యాంకులు బ్యాలన్స్ షీట్లను శుద్ధి చేసుకున్నాయని.. అవి ఇప్పుడిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా రుణ వితరణను వేగవంతం చేయాలని సూచించారు. బ్యాంకింగేతర రుణ సంస్థల లాబీ గ్రూపు ఎఫ్ఐడీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంజీవ్ సన్యాల్ మాట్లాడారు. ‘‘ఆర్థిక చరిత్రను పరిశీలించినట్టయితే.. దీర్ఘకాలంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగడం అన్నది ఒక్క ఈక్విటీ మార్కెట్ల నిధుల చేదోడుతోనే సాధ్యం కాలేదు. డెట్ క్యాపిటల్ (రుణాలు) మద్దతుతో ఇది సాధ్యమైంది. ఎక్కువ మొత్తం బ్యాంకుల నుంచి నిధుల సాయం అందుతోంది’’ అని సన్యాల్ పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ మార్గం మెరుగ్గానే ఉందన్న ఆయన.. అదే సమయంలో డెట్ మా ర్కెట్ చెడ్డగా ఏమీ లేదన్నారు. పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ‘‘భారత్ ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగాలంటే అందుకు.. ప్రస్తుతమున్న దానితో పోలిస్తే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కావాలి. బ్యాంకులు తమ రుణ వితరణ కార్యకలాపాలను విస్తరించాలి’’ అని సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎన్నో ఏళ్ల పాటు బ్యాలన్స్‌షీట్లను ప్రక్షాళన చేసుకున్నందున అవి తమ రుణ పుస్తకాన్ని మరింత విస్తరించుకోవడానికి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. చైనా జీడీపీ సైతం బ్యాంకు బ్యాలన్స్ షీట్ల విస్తరణ మద్దతుతో మూడు దశాబ్దాల కాలలో బలమైన వృద్ధిని చూసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం -
బ‘బుల్’ రిస్క్..!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 శాతం క్షీణిస్తుందన్న అంచనాల నేపథ్యంలోనూ దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు పరుగులు చేయడంపై స్వయంగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘బుడగ పేలే (రిస్క్ ఆఫ్ ఏ బబుల్) అవకాశం ఉంది’’ అని హెచ్చరిక చేసింది. తద్వారా స్టాక్ మార్కెట్ పెరుగుదల నిలబడకపోవచ్చని సూచించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో మార్కెట్‌కు సంబంధించి ఆర్బీఐ అభిప్రాయాలను క్లుప్లంగా పరిశీలిస్తే... ► భారత్ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ 2021 జనవరి 21న 50,000 పాయింట్ల మైలురాయిని దాటింది. ఫిబ్రవరి 15న గరిష్టంగా 52,154 పాయింట్లను తాకింది. కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రారంభమయిన నాటి నుంచీ చూస్తే (2020 మార్చి 23 నుంచీ) మార్కెట్ 100.7% పెరిగితే, ఒక్క 2020–21లో 68 శాతం ఎగసింది. ► జీడీపీ క్షీణ అంచనాల నేపథ్యంలోనూ మార్కెట్ భారీ పెరుగుదల ‘బబుల్ రిస్క్’ను సూచిస్తోంది. వాస్తవిక ఆర్థిక క్రియాశీల రికవరీకి అలాగే అసెట్ ప్రైస్ పెరుగుదలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుండడం ఇప్పుడు గ్లోబల్ విధాన నిర్ణయ అంశాల విషయంలో ఆందోళనకు కారణమవుతోంది. ► నిధుల సరఫరా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు స్టాక్ మార్కెట్ల భారీ పెరుగుదలకు కారణం. ఎకానమీ మెరుగుపడుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్ పెరుగుదలకు కొంత కారణమయినప్పటికీ, మనీ సప్లై, ఎఫ్‌పీఐల ప్రభావమే ఇందులో అధికం. ఆర్థిక రికవరీకి వ్యవస్థలోకి మనీ పంప్ చేయడం (లిక్విడిటీ) కూడా అసెట్ ధరల పెరుగుదలకు కారణం. అయితే ఈ తరహా ద్రవ్యలభ్యత, మద్దతు వ్యవస్థలో నియంత్రణ లేకుండా, నిరంతరం కొనసాగుతుందని భావించరాదు. ► భవిష్యత్ ఆర్జనలకు భరోసాను ఇచ్చింది. ► తాజా పరిస్థితిని విశ్లేషిస్తే, మహమ్మారి వేవ్‌ల కట్టడి జరిగి, ఎకానమీ వాస్తవిక వృద్ధి బాట పట్టే వరకూ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వినియోగం, పెట్టుబడులు కీలకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్ ప్రభావం కొనసాగనుంది. 10.5 శాతం వృద్ధి సాధిస్తామన్న తొలి అంచనాలకు కోత పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కోవిడ్ సవాళ్ల అనంతరం దేశం వృద్ధి బాటన నిలదొక్కుకోవడానికి ప్రైవేటు వినియోగం పెట్టుబడుల మళ్లీ ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్పీఏల పట్ల దృష్టి పెట్టాలి సెకండ్ వేవ్ నేపథ్యంలో మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితిని బ్యాంకులు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎన్పీఏల వర్గీకరణపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించిన నేపథ్యంలో తగిన స్థాయిలో ప్రొవిజనింగ్ (ఎన్పీఏ కేటాయింపులు)పై దృష్టి పెట్టాలి. తగిన స్థాయిలో లిక్విడిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)తగిన స్థాయిలో ఉండడానికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఎటువంటి అవరోధాలూ లేకుండా ద్రవ్య,పరపతి విధానం కొనసాగేలా చర్యలు ఉంటాయి. బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ పెరిగింది 2020–21లో బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ పెరిగింది. మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వినియోగదారు నగదు తన వద్ద ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం దీనికి కారణం. ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ విలువ 16.8 శాతం పెరిగితే, పరిమాణం విషయంలో ఇది 7.2 శాతం. 2019–20లో ఈ శాతాలు వరుసగా 14.7 శాతం, 6.6 శాతంగా ఉండడం గమనార్హం. విలువ రీత్యా చూస్తే, 2021 మార్చి 31 నాటికి మొత్తం సర్క్యులేషన్లో రూ.500, రూ.2000 నోట్ల వాటా 85.7 శాతం. ఇది 2020 మార్చి 31 నాటికి 83.4 శాతంగా ఉంది. 2,000 నోటుకు గుడ్‌బై! రూ.2,000 నోట్లను క్రమంగా పూర్తి స్థాయిలో వ్యవస్థలోంచి వెనక్కు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020–21లో ఆర్బీఐ రూ.57,757 కోట్ల విలువైన రూ.2000 నోట్లకు వ్యవస్థలో నుంచి ఉపసంహరించింది. 2019–20లో 2000 నోట్ల విలువ రూ.5,47, 952 కోట్లు కాగా, 2020–21లో ఈ విలువ రూ.4,90,195 కోట్లకు పడిపోయింది. 2017–18లో ఈ నోట్ల పరిమాణం 33,630 లక్షలు కాగా, 2021 మార్చికి 24,510కి తగ్గింది. ఇక వ్యవస్థలో డిమాండ్‌ను నెరవేర్చడానికి రూ.500 నోట్లను భారీగా సర్క్యులేషన్లోకి తెస్తోంది. ప్రస్తుత సర్క్యులేషన్ నోట్లలో వీటి వాటా 68.4%. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ వాటా 61%. -
మార్కెట్‌కు ఫెడ్ జోష్..!
ముంబై: కీలక వడ్డీరేట్లపై సరళతర ధోరణికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు రాణించడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు వరుసగా ఐదురోజూ లాభాల్లో ముగిశాయి. అలాగే కొత్త రికార్డుల నమోదును కొనసాగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభంతో 46,890 వద్ద సిర్థపడింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద నిలిచింది. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు కనిపించడం, పలు దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్‌కు అనుమతినివ్వడం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆర్థిక, ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెనెక్స్ ఇంట్రాడేలో 326 పాయింట్లు లాభపడి 46,992 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 90 పాయింట్లు ర్యాలీ చేసి 13,773 వద్ద నూతన ఆల్‌టైం హైని నమోదు చేసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా షేర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీలు కొత్త రికార్డు సృష్టిస్తున్నప్పటికీ.., ఇటీవల మధ్య, చిన్న తరహా షేర్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. గురువారం రికార్డు ర్యాలీలో ఈ షేర్ల వాటా అత్యంత స్వల్పంగా ఉంది. ఈ తరుణంలో అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్ అవసరమని వారు సూచించారు. ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్ రిజర్వ్ బూస్టింగ్... అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బుధవారం రాత్రి వెలువడ్డాయి. కరోనాతో పూర్తిగా కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మార్చలేదు. నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ, ఉద్యోగ కల్పన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు సరళతరమైన విధానాలకే కట్టుబడి ఉంటామని ఫెడ్ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యతను పెంచేందుకు 12 బిలియన్ డాలర్ల విలువైన నెల బాండ్ల కొంటామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫెడ్ సులభతరమైన ద్రవ్య పరపతి విధాన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత దూసుకెళ్లాయి. ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇందులో జపాన్‌కు చెందిన నికాయ్ సూచీ 29 ఏళ్ల గరిష్ట స్థాయి చేరువలో ముగిసింది. యూరప్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ ర్యాలీ చేశాయి. అమెరికా సూచీల్లో నాస్డాక్ ఇండెక్స్ బుధవారం సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఉద్దీపన ప్యాకేజీ ఆమోదం లభించవచ్చనే ఆశలతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ హాంఫట్ 198 రెట్ల బిడ్లు బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 198 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 176.85 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 620.86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 29.28 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.220గా పలుకుతోంది. ఐపీఓ ద్వారా రూ.540 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. -
స్టాక్ మార్కెట్..తారా‘జువ్వే’!
కరోనా వైరస్ సంక్షోభంతో సంవత్ 2076లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అనిశ్చితి, నిరాశావాదం ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. 2020 జనవరిలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 12,431 తాకిన నిఫ్టీ .. కరోనా దెబ్బతో మార్చిలో ఏకంగా మూడేళ్ల కనిష్ట స్థాయి 7,511కి పతనమైంది. అయితే, ఈక్విటీ మార్కెట్లు శరవేగంగా కోలుకుని మళ్లీ కొత్త రికార్డు స్థాయిని తాకగా, అటు పసిడి సైతం కొత్త గరిష్ట స్థాయిని చూడటం గమనార్హం. మొత్తం మీద సంవత్ 2076కి మార్కెట్ లాభాలతో వీడ్కోలు పలికింది. కార్పొరేట్ల ఆదాయాలు మెరుగుపడుతుండటం, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటుండటం, వ్యవస్థలో పుష్కలంగా నిధుల లభ్యత వంటి అంశాలతో 2077 సంవత్ మరింత ఆశావహంగా ఉండవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కోణంలో చూస్తే 2003 నాటి పరిస్థితులు పునరావృతం కావచ్చని చెబుతున్నాయి. 2003 జూలై–2008 డిసెంబర్ మధ్యకాలంలో సెన్సెక్స్ ఏకంగా అయిదు రెట్లు పెరిగిన సంగతి గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఆటోమొబైల్, ఆయిల్.. గ్యాస్, టెలికం, భారీ యంత్ర పరికరాలు, సిమెంట్, మెటల్స్ కంపెనీల షేర్లు సంవత్ 2077లో రాణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల షేర్లు సుమారు 20 శాతం నుంచి 39 శాతం దాకా పెరగొచ్చని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ మరో 10–12 శాతం పెరగవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ భావిస్తోంది. అమెరికా మరో విడత ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశంతో పాటు అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో కొనసాగనుండటం, వచ్చే ఏడాది తొలినాళ్లలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండటం ఇందుకు తోడ్పడవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈక్విటీల్లో 70 శాతం, బాండ్లలో 20 శాతం, పసిడిలో 10 శాతం మేర పెట్టుబడులను కేటాయించవచ్చంటూ ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ పేర్కొంది. వివిధ బ్రోకింగ్ సంస్థల సిఫార్సులు ఈ వారం ప్రాఫిట్ ప్లస్ స్పెషల్ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర రూ. 481 టార్గెట్ ధర రూ. 597 ప్రపంచంలోనే టాప్ టెలికం దిగ్గజాల్లో ఒకటి. డేటా వినియోగం, టారిఫ్‌ల పెరుగుదలతో యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఆర్పీయూ రూ. 175–180 స్థాయికి చేరొచ్చని అంచనా. సుమారు రూ. 22,700 కోట్ల నగదు నిల్వలు, ఏజీఆర్ బాకీల గడువుపరంగా కాస్త వెసులుబాటు మొదలైన అంశాలు కంపెనీకి సానుకూలంగా ఉండవచ్చు. చిన్న సంస్థల కోసం క్లౌడ్ కమ్యూనికేషన్స్ విభాగంలోనూ అడుగుపెట్టింది. జియోతో పోటీ, భారీ పెట్టుబడులు, సాంకేతిక.. నియంత్రణ సంస్థపరమైన మార్పులు, కరెన్సీ ఒడిదుడుకులు తదితర ప్రతికూలాంశాలు ఉన్నాయి. క్యాడిలా హెల్త్‌కేర్ ప్రస్తుత ధర రూ. 429 టార్గెట్ ధర రూ. 508 దేశీయంగా దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఒకటి. అంతర్జాతీయంగా అమెరికా, యూరప్ తదితర మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. దేశీ ఫార్మా మార్కెట్లో సుమారు 4.2 శాతం వాటాతో నాలుగో అతి పెద్ద సంస్థగా కొనసాగుతోంది. బ్రాండ్స్, ఇన్–లైసెన్సింగ్ ఒప్పందాలు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో కంపెనీ ఆదాయాలు మెరుగ్గా ఉండవచ్చని అంచనా. ఇక, బయోలాజిక్స్, టీకాలు మొదలైన ఇతర విభాగాల ఉత్పత్తులు కూడా ఇందుకు తోడ్పడవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 486 టార్గెట్ ధర రూ. 503 దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకు హోదా. రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. యస్ బ్యాంక్, ఇతరత్రా సహకార బ్యాంకుల్లో ప్రతికూల పరిణామాల కారణంగా డిపాజిటర్లు క్రమంగా పెద్ద ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల వైపు మళ్లే అవకాశాలు ఉండటం ఐసీఐసీఐ బ్యాంకుకు సానుకూలంగా ఉండగలదు. ఇన్ఫోసిస్ ప్రస్తుత ధర రూ. 1,133 టార్గెట్ ధర రూ. 1,205 ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో డీల్స్ దక్కించుకుంది. వ్యయాలను నియంత్రించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కోటక్ సెక్యూరిటీస్ బజాజ్ ఆటో ప్రస్తుత ధర రూ. 3,042 టార్గెట్ ధర రూ. 3,900 దేశీయంగా మోటార్ సైకిళ్లకు డిమాండ్ మళ్లీ దాదాపు గతేడాది స్థాయికి చేరుతోంది. ఎగుమతులు కూడా పెరుగుతుండటం సానుకూలాంశం. కంపెనీ కీలకంగా ఉన్న విదేశీ మార్కెట్లలో దీర్ఘకాలికంగా వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎల్అండ్టీ ప్రస్తుత ధర రూ. 1,059 టార్గెట్ ధర రూ. 1,300 కంపెనీ ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. దేశవిదేశాల్లో కాంట్రాక్టుల విలువ సుమారు రూ. 6.1 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. రాబోయే రోజుల్లో వీటి నుంచి క్రమంగా ఆదాయాలు అందుబాటులోకి రావచ్చు. అంబుజా సిమెంట్స్ ప్రస్తుత ధర రూ. 259 టార్గెట్ ధర రూ. 300 విస్తరణ ప్రణాళికలు, వ్యయ నియంత్రణ చర్యలతో పటిష్టమైన వృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత లాభదాయకంగా ఉండే ఉత్తరాదిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. ఆకర్షణీయ వేల్యుయేషన్‌తో షేరు లభిస్తోంది. ఐటీసీ ప్రస్తుత ధర రూ. 188 టార్గెట్ ధర రూ. 260 కీలకమైన సిగరెట్ల వ్యాపార విభాగం స్థానిక లాక్డౌన్ల కారణంగా జూలై, ఆగస్టుల్లో కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో మళ్లీ పుంజుకుంది. ఎఫ్ఎంసీజీ ప్రధాన పోర్ట్‌ఫోలియో మెరుగ్గా ఉంది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుత ధర రూ. 312 టార్గెట్ ధర రూ. 362 వివిధ రకాల సాధనాలు, ప్రాంతాల్లో పెట్టుబడులతో వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తోంది. 2020–21 రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నిర్వహణలోని అసెట్స్ పరిమాణం 12–15 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తోంది. తగినంత స్థాయిలో మూలధన నిల్వలు, తగ్గుతున్న నిధుల సమీకరణ వ్యయాలు మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ఏంజెల్ బ్రోకింగ్ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ప్రస్తుత ధర రూ. 1,842 టార్గెట్ ధర రూ. 2,075 అధిక మార్జిన్ ఉండే స్పెషాలిటీ కేర్ ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం మొత్తం ఆదాయాల్లో వీటి వాటా 40 శాతం దాకా ఉంటోంది. మిగతాది సర్ఫెక్టెంట్ వ్యాపారం ద్వారా వస్తోంది. పలు బహుళ జాతి దిగ్గజ సంస్థలతో పటిష్టమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. భారత్‌తో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ మొదలైన ఖండాల్లోని దేశాల్లో సంస్థలకు కూడా ముడి వస్తువులు ఎగుమతి చేస్తోంది. తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ కారణంగా కంపెనీపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ వివిధ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో కార్యకలాపాలు సత్వరం కోలుకోగలవని అంచనా. మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర రూ. 229 టార్గెట్ ధర రూ. 300 దేశీ ఎకానమీ మెరుగుపడే కొద్దీ ఎస్బీఐ ఆదాయాలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ చేయడానికి అనువైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పటిష్టమైన సంస్థ. హీరో మోటోకార్ప్ ప్రస్తుత ధర రూ. 3,117 టార్గెట్ ధర రూ. 3,700 మార్కెట్లో ఆదిపత్యం, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి గల పోర్ట్‌ఫోలియో కారణంగా ఇతర ద్విచక్ర వాహనాల సంస్థలతో పోలిస్తే హీరో మోటోకార్ప్ మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన ఉత్పత్తులను మెరుగైన ధరల్లో అందించగలుగుతుండటం సంస్థకు సానుకూలాంశం. ఎకానమీ నుంచి ఎగ్జిక్యూటివ్ దాకా అన్ని వర్గాలకు కావాల్సిన వాహనాలు అందిస్తుండటం సంస్థకు అనుకూలించనుంది. క్రాంప్టన్ కన్జూమర్ ప్రస్తుత ధర రూ. 299 టార్గెట్ ధర రూ. 360 ఫ్యాన్లు, పంపుల మార్కెట్లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వాటర్ హీటర్ల సెగ్మెంట్లో రెండో స్థానానికి చేరింది. పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గ కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ. 517 టార్గెట్ ధర రూ. 600 హెర్బల్ సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. నేరుగా పంపిణీ చేసే వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. వ్యయాల నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇవన్నీ కలిసి సంస్థ ఆదాయాలు మెరుగుపడేందుకు దోహదపడగలవని అంచనా. దివీస్ ల్యాబ్ ప్రస్తుత ధర రూ. 3,445 టార్గెట్ ధర రూ. 3,520 ఏపీఐలకు డిమాండ్ ఉండటం, ఇంటర్మీడియరీస్ను ఇన్ హౌస్‌లో తయారీ పెంచుకోవడం వల్ల మార్జిన్లు పెరిగే అవకాశాలు, కొత్త ఇన్వెస్ట్మెంట్ల నుంచి అద నపు ఆదాయాలు తదితర అంశాలు దివీస్ ల్యాబ్నకు సానుకూలంగా ఉండగలవు. -
మ్యూచువల్ ఫండ్స్‌కి బ్రేక్!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా ధోరణి మారినట్టుంది. దీనికి ప్రతిబింబంగా నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.2,480 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ప్రచారం కారణంగా ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహనతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ప్రతీ నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి చూశాము. కానీ కరోనా రాకతో ఈ పరిస్థితి మారిపోయింది. తగ్గిపోయిన ఆదాయాలు, అత్యవసర ఖర్చుల కోసమో లేక, ఈక్విటీ పథకాల పనితీరు నచ్చక ఇటీవల ర్యాలీ తర్వాత వచ్చినంత చాలనుకునే ధోరణితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. జూలై నెల గణాంకాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్ల తీరు ప్రస్ఫుటమవుతుంది. జూలైలో ఈక్విటీ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,480 కోట్లను ఉపసంహరించుకున్నారు. 2016 మార్చి నెలలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాల నుంచి రూ.1,370 కోట్లను వెనక్కి తీసుకోగా, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలైలో అదే పరిస్థితి కనిపించింది. అంతక్రితం జూన్ నెలలో ఈక్విటీ స్కీమ్ ల్లోకి రూ.240 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక అంతకుముందు నెలల్లో.. మేలో రూ.5,256 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.6,213 కోట్లు, మార్చిలో రూ.11,723 కోట్లు, ఫిబ్రవరిలో రూ.10,796 కోట్లు, జనవరిలో రూ.7,877 కోట్ల చొప్పున ఈక్విటీ పథకాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. అంటే 2020లో మొదటి ఐదు నెలలు ఈక్విటీ పథకాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. ► జూలై మాసంలో ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ.89,813కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే రూ.7,625 కోట్లు అదనంగా వచ్చినట్టు. ప్రధానంగా డెట్ ఫండ్స్ లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో లిక్విడ్, లో డ్యురేషన్ ఫండ్స్ అధిక పెట్టుబడులను ఆకర్షించాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.1,033 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి రూ.579 కోట్లు, వ్యాల్యూ ఫండ్ విభాగం నుంచి రూ.549 కోట్ల చొప్పున బయటకు వెళ్లాయి. ► స్థిరాదాయ పథకాలు లేదా డెట్ ఫండ్స్ లోకి జూన్ నెలలో కేవలం రూ.2,862 కోట్లు పెట్టుబడులే రాగా, జూలైలో రూ.91,392 కోట్ల మేర భారీగా ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్ లోకి కుమ్మరించారు. ఇందులో డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.14,219 కోట్లు, లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.14,055 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ లోకి రూ.11,910 కోట్లు, బ్యాంకింగ్ అండ్ పీఎస్ యూ ఫండ్స్ లోకి రూ.6,323 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.670 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి రూ.921 కోట్లు నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ► జూలై ఆఖరుకు 45 సంస్థలతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహలోని పెట్టుబడుల విలువ రూ.27.12 లక్షల కోట్లుగా ఉంది. లాభాల స్వీకరణే.. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ విభాగంలో ఈఎల్ఎస్ఎస్, ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకుంది. అయితే, దీన్ని లాభాల స్వీకరణగా యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. మల్టీక్యాప్, లార్జ్ క్యాప్ విభాగంలో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. తగ్గిన వడ్డీ రేట్ల కారణంగా మెరుగైన రాబడులతో డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ‘‘మల్టీక్యాప్ ఫండ్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ నెలకొనగా, ఆ తర్వాత మిడ్‌క్యాప్, వ్యాల్యూ ఫండ్ విభాగాల్లో ఈ పరిస్థితి కనిపించింది’’ అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరగడంతో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. ‘‘ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం అనంతరం ఇన్వెస్టర్లు వచ్చిన లాభాలతో బయటకు వెళ్లిపోవడం సాధారణంగా కనిపించే ధోరణే. అయితే పరిణతి చెందిన ఇన్వెస్టర్లు మాత్రం తమ సిప్ పెట్టుబడులను కొనసాగించడంతో వాటి రాక పెరిగింది’’అని గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు,సీవోవో జైన్ పేర్కొన్నారు. -
మూడో రోజూ నష్టాల బాటే
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మూడో రోజూ అమ్మకాల ఒరవడి కొనసాగింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో లాభాల స్వీకరణతో ప్రధాన సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 37,607 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 11,073 వద్ద స్థిరపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 522 పాయింట్లు (1.36 శాతం), నిఫ్టీ 121 పాయింట్లు (1.07శాతం) చొప్పున నికరంగా నష్టపోయాయి. రిలయన్స్‌కు అమ్మకాల సెగ ఫలితాల ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఈ స్టాక్ బీఎస్ఈలో 2 శాతం నష్టపోయింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయింది ఈ స్టాకే. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంకు, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించడంతో ఎస్బీఐ 3 శాతం వరకు లాభపడడం గమనార్హం. యూఎస్ జీడీపీ రికార్డు స్థాయిలో మైనస్ 32.9 శాతానికి జూన్ త్రైమాసికంలో పడిపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం ఆవిరైంది. హాంకాంగ్, టోక్యో, సియోల్ నష్టపోగా, షాంఘై లాభపడింది. -
ఆగని అమ్మకాలు
ముంబై: ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ గురువారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రితం రోజు యూఎస్ ఫెడ్ పాలసీకి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి, లాభాల స్వీకరణతో మార్కెట్లు నష్టపోగా.. ఫెడ్ పాలసీ ప్రకటన సానుకూలంగానే వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫెడ్ తన డోవిష్ పాలసీని యథాతథంగా కొనసాగిస్తూ, వడ్డీ రేట్లను సున్నా స్థాయిలోనే కొనసాగిస్తూ, బాండ్ల కొనుగోలు సహా ఇతర ఆర్థిక ఉద్దీపన చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగానే పాలసీ చర్యలు ఉన్నాయి. అయినా, దేశీయంగా జూలై నెల ఎఫ్‌అండ్‌వో ముగింపు రోజున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను కొనసాగించారు. కరోనా కేసుల పెరుగుదలే ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్ఈ ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలు పెట్టినప్పటికీ.. చివరకు 335 పాయింట్లు (0.90 శాతం) నష్టంతో 37,736 వద్ద క్లోజయింది. అదే విధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 101 పాయింట్లు (0.90 శాతం) క్షీణించి 11,102 వద్ద స్థిరపడింది. ► నిఫ్టీలో ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ 4%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1.5% నష్టపోయాయి. ► బీపీసీఎల్‌లో ప్రభుత్వ పెట్టుబడుల విక్రయానికి సంబంధించి బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించడంతో ఈ స్టాక్ భారీగా 7 శాతం నష్టపోయింది. ► ఇండస్ఇండ్ బ్యాంకు 5 శాతం, ఐవోసీ 4 శాతం, యాక్సిస్ బ్యాంకు 3 శాతం, భారతీ ఎయిర్టెల్ 3 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. ► డాక్టర్ రెడ్డీస్ కౌంటర్లో ర్యాలీ కొనసాగింది. గురువారం మరో 5 శాతం వరకు లాభపడింది. ► అదే విధంగా సన్‌ఫార్మా 4 శాతం, విప్రో రెండున్నర శాతం, మారుతి ఒకటిన్నర శాతం వరకు లాభపడ్డాయి. ► రంగాల వారీ సూచీలను గమనిస్తే.. బీఎస్ఈ టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, యుటిలిటీస్, పవర్ సూచీలు నష్టపోయాయి. హెల్త్‌కేర్, ఐటీ సూచీలు లాభపడ్డాయి. జోష్‌నివ్వని అన్‌లాక్ 3.0 యూఎస్ ఫెడ్ పాలసీని యథాతథంగా కొనసాగించినప్పటికీ అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార పరిస్థితులు మందగమనంగా ఉండడం, వైరస్ కేసుల పెరుగుదల ఇందుకు కారణమైంది. దేశీయంగా అన్‌లాక్ 3.0 ఉత్సాహాన్నివ్వలేకపోయింది’’ – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ -
ఫలితాలు, భౌగోళిక పరిణామాలదే కీలక పాత్ర
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయ ఈక్విటీ మార్కెట్లను ఈ వారంలో కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాల ధోరణి, భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు గత వారం అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు.. వీటికితోడు దేశీయంగా కరోనా వైరస్ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కనిష్టాల నుంచి గణనీయంగా ర్యాలీ చేసిన నేపథ్యంలో స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ వారంలో కోటక్ మహీంద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర ముఖ్యమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. గత వారం సెన్సెక్స్ నికరంగా 1,109 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు లాభపడడం గమనార్హం. ఇన్ఫోసిస్‌లో శిభూలాల్ వాటాల విక్రయం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్డీ శిభూలాల్ కుటుంబ సభ్యులు కంపెనీలో 85 లక్షల షేర్లను ఈ నెల 22–24 తేదీల మధ్య విక్రయించినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల డేటా తెలియజేస్తోంది. వీటి విలువ రూ.777 కోట్లు. దాతృత్వ కార్యక్రమాలు, పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు వారు తెలిపారు. -
తీవ్ర ఒడిదుడుకులు...
ముంబై: ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల్లో మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం ర్యాలీ చేయడం సూచీలు భారీగా నష్టపోకుండా ఆదుకుందనే చెప్పాలి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 487 పాయింట్ల శ్రేణిలో చలించి చివరకు 12 పాయింట్ల నష్టంతో 38,129 వద్ద ముగియగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,194 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలకుతోడు, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను బేరిష్‌గా మార్చినట్టు విశ్లేషకులు తెలిపారు. హూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ను మూసేయాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. చైనాలోని చెంగ్డులో ఉన్న అమెరికా కాన్సులేట్‌ను మూసేయాలని డ్రాగన్ ఆదేశించడం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత క్షీణించడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. ‘‘ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు ట్రేడ్ ఆరంభంలో లాభాల స్వీకరణతో సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. రిలయన్స్ ర్యాలీ నష్టాలను పరిమితం చేసింది . దేశీయంగా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడం కూడా ఎర్నింగ్స్ కోలుకోవడంపై ప్రభావం చూపించొచ్చన్న ఆందోళన ఇన్వెస్టర్లలో కనిపించింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. మెటల్, బ్యాంకెక్స్, రియల్టీ, ఫైనాన్స్, టెలికం సూచీలు నష్టపోగా, ఐటీ, ఇంధన సూచీలు లాభపడ్డాయి. రిలయన్స్ 4 శాతానికి పైగా ఎగసి రూ.2,146.20 వద్ద బీఎస్ఈలో క్లోజయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.14,14,825.44 కోట్లకు దూసుకుపోయింది. ఇంట్రాడేలో రూ.2,162.80 వరకు వెళ్లడం గమనార్హం. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంకు అధికంగా నష్టపోయాయి. -
ఈక్విటీల్లో ర్యాలీ కొనసాగుతుంది: క్రిస్ వుడ్
కోవిడ్-19 రెండోదశ వ్యాధి వ్యాప్తి ఆందోళనలు కేవలం ముందస్తు భయాలేనని, రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగవచ్చని జెఫ్పారీస్ బ్రోకరేజ్ సంస్థ గ్లోబల్ హెడ్‌ఆఫ్‌ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టోఫర్ వుడ్ అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్లు కరోనా కేసుల రెండో దశ వ్యాప్తి ఆందోళనల కంటే... ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంపైనే అధిక దృష్టిని సారించాయని స్పష్టమైంది. మొదటిసారి లాక్డౌన్లో భాగంగా ఇన్వెస్టర్లు సైక్లికల్స్, గ్రోత్ షేర్లకు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇప్పడు రెండోదశ కోవిడ్ కేసులు పెరగడంతో సైక్లికల్స్ షేర్ల కొనుగోళ్లను తగ్గించి వృద్ధి షేర్లను అధికంగా కొంటారు. అయితే వచ్చే త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యపాలసీ సరళంగా ఉండటం గ్రహించి మార్కెట్లు వీ-ఆకారపు రికవరీని అంచనా వేస్తూ తిరిగి సైక్లికల్ షేర్లను కొంటారు.’’ అని వుడ్ తన వీక్లీ నోట్ గ్రీడ్ అండ్ ఫియర్లో తెలిపారు. ఈక్విటీ ఇన్వెస్టర్లు వృద్ధి, వ్యాల్యూయేషన్ స్టాక్లను సొంతం చేసుకునేందుకు ‘‘బార్బెల్ వ్యూహాన్ని’’ అమలుపరచాలని వుడ్ సలహానిచ్చారు. కోవిడ్-19 రెండోదశ వ్యాప్తి భయాలు తెరపైకి రావడంతో గ్రోత్ స్టాక్‌లు ఆలస్యంగా ర్యాలీని ప్రారంభించాయి. అయితే మార్కెట్ వీ-ఆకారపు రికవరీ సెంటిమెంట్ బలపడటంతో ఫైనాన్షియల్, అటో, ఇంధన, మెటీరియల్(సైక్లికల్స్ స్టాక్స్) మరోసారి ర్యాలీ చేయవచ్చు అని తెలిపారు. అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ లాక్డౌన్ ఉండకపోవచ్చని వుడ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండటంతో ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం మళ్లీ ఆర్థికవ్యవస్థను మూసివేయడానికి మొగ్గుచూపకపోవచ్చన్నారు. రాబోయే త్రైమాసికంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మార్కెట్లను ప్రభావితం చేయటం ప్రారంభిస్తుందని వుడ్ చెప్పారు. -
స్వల్ప నష్టంతో ముగిసిన పసిడి
దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్ప నష్టంతో ముగిసింది. ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.80లు నష్టపోయి రూ. 47334.00 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు ఊహించని రీతిలో నష్టాల నుంచి రికవరీ కావడంతో పసిడి ఫ్యూచర్లపై ఒత్తిడిని కలిగించింది. అలాగే అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్ అవడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా నష్టాల ముగింపే : అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ఫ్యూచర్స్ ధర నష్టంతో ముగిసింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 2.50డాలర్లు క్షీణించి 1,737.30డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్‌తో పాటు బాండ్ ఈల్స్ బలపడటం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గించాయి. అలాగే అమెరికా ఈక్విటీ మార్కెట్ల లాభాల ముగింపు కూడా పసిడి ఫ్యూచర్ల నష్టాలకు కారణమైంది. ఇక వారం మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 3శాతం లాభపడ్డాయి. అమెరికా ఫెడ్‌రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఛైర్మన్ పావెల్ ఆర్థిక వృద్ది, రికవరిపై ఆందోళన వ్యక్తం చేయడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. అలాగే అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభం కావచ్చనే భయాలు పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. -
అంబానీ సంపద ఆవిరి
ముంబై: దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద, కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ల పతనంతో గణనీయంగా పడిపోయింది. కేవలం రెండు నెలల వ్యవధిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 35 శాతం పడిపోగా, ముకేశ్ అంబానీ సంపద విలువ కూడా 28 శాతం తగ్గి మార్చి 31 నాటికి 48 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముకేశ్ నికర విలువ 19 బిలియన్ డాలర్లు తగ్గినట్టు హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ పేర్కొంది. ఫలితంగా అంతర్జాతీయంగా కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 8 స్థానాలు దిగజారి 17వ స్థానానికి వచ్చినట్టు హరూన్ తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఇదే కాలంలో (ఫిబ్రవరి–మార్చి) అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ సైతం 37 శాతం (6 బిలియన్ డాలర్లు) తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్‌నాడార్ సంపద 26 శాతం (5 బిలియన్ డాలర్లు), కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ సంపద 28 శాతం (4 బిలియన్ డాలర్లు) తగ్గినట్టు హరూన్ నివేదిక తెలియజేస్తోంది. స్టాక్ మార్కెట్ల పతనంతోపాటు, రూపాయి విలువ క్షీణించడం భారత పారిశ్రామిక వేత్తల సంపదపై ప్రభావం చూపించినట్టు హరూన్ పేర్కొంది. ఓయో రూమ్స్ ప్లాట్‌ఫామ్ అధిపతి రితేష్ అగర్వాల్ బిలియనీర్ స్థానాన్ని కోల్పోయినట్టు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ జెఫ్ బెజోస్ స్థానం చెక్కు చెదరలేదు. 131 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. కాకపోతే, గడిచిన రెండు నెలల్లో బెజోస్ సంపద కేవలం 9 శాతమే తగ్గింది. బిల్‌గేట్స్ 91 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (బ్యాంక్‌లపై కరోనా పిడుగు) -
వీడని వైరస్ భయాలు
ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండడం, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా భారత బ్యాంకింగ్ రంగం పట్ల మూడీస్ తన దృక్పథాన్ని నెగెటివ్‌కు తగ్గించడం పెద్ద ప్రభావాన్నే చూపించింది. బ్యాంకు స్టాక్స్‌లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ప్రభావంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి (2.06%) 8,084 వద్ద క్లోజయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి (2.39%) 27,591 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోతుండడం, ఫలితంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో విడత 76 స్థాయికి జారిపోవడం.. ఇన్వెస్టర్లను కొనుగోళ్ల విషయమై వేచిచూసే ధోరణి అనుసరించేలా చేసినట్టు ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 2,225 పాయింట్లు (7.46%), నిఫ్టీ 576 పాయింట్లు (6.65%) చొప్పున నష్టపోయాయి. ఈ వారంలో చివరి రెండు రోజుల్లో నష్టాల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4,82,033 కోట్ల మేర తరిగిపోయి రూ.1,08,66,723 కోట్లకు పడింది. అమ్మకాలకు దారితీసిన అంశాలు ► కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోవచ్చన్న అంచనాతో ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి ప్రతికూలానికి మారుస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ► కరోనా పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఆందోళన నెలకొంది. ► కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై 4.1 ట్రిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ► డాలరుతో రూపాయి విలువ శుక్రవారం 53 పైసలు నష్టపోయి 76.13 వద్ద క్లోజయింది. బ్యాంకు స్టాక్స్ బేర్... మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత బ్యాంకింగ్ రంగ రేటింగ్‌ను నెగెటివ్‌కు మార్చడం, అందులోనూ కొన్ని బ్యాంకుల రేటింగ్లను తగ్గించడం ఆయా స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. అత్యధికంగా ఆర్బీఎల్ బ్యాంకు 15.5 శాతం, బంధన్ బ్యాంకు 13 శాతం చొప్పున నష్టపోయాయి. సూచీల్లోని బ్యాంకు స్టాక్స్ అయిన.. యాక్సిస్ బ్యాంకు 9 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 8.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 8 శాతం, ఎస్బీఐ 6 శాతం చొప్పున పడిపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు 2 శాతం చొప్పున నష్టపోయాయి. కరెన్సీ మార్కెట్ల పనివేళలు తగ్గింపు ముంబై: లౌక్‌డౌన్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ డెట్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను వచ్చే మంగళవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి కుదిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ మార్కెట్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ నెల 7 నుంచి ఉదయం 10 గంటలకు మార్కెట్లు ప్రారంభం అయి, మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తాయి. -
బ్లాక్ మండే: బ్యాంకింగ్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: ఆర్థిక మాంద్య భయాలతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. 10శాతం పతనంతో లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో 45 నిమిషాలు నిలిపివేయబడింది. విరామం తరువాత స్వల్పంగా కోలుకున్నా, అనంతరం మరింత దిగజారి బెంచ్ మార్క్ సెన్సెక్స్ 3,499,( 11.7శాతం) 26,417 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 1,008(11.5శాతం) నష్టంతో 7737.25 పాయింట్లకు పడిపోయి మరో బ్లాక్ మండే నమోదైంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 12 శాతం పతనమై ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను నమోదు చేసుకుంటోంది. ముఖ్యంగా దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఏడాది గరిష్ట స్థాయి నుంచి కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ స్టాక్స్ ఏకంగా 45 శాతం పైగా పతనం అయ్యాయంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 552 కాగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో 15 శాతం క్షీణించి రూ. 293.85కు పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి మరీ దారుణం ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 827 నుంచి రూ. 342కు పడిపోయింది. ఈ ఒక్క రోజే యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర 20 శాతం క్షీణించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 14 శాతానికి పైగా కుప్పకూలింది. దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 11 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 5 నుంచి 11 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా ప్రపంచ మాంద్యం నెలకొనే అవకాశం, ఆయా దేశాల సెంట్రల బ్యాంకుల తీవ్ర చర్యలు, లాక్డౌన్ల ఆటుపోట్ల కారణంగా ఆసియా షేర్లు పడిపోయాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అలాగే ఆర్థిక వ్యవస్థలో తగినంత ద్రవ్యతను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బహిరంగ మార్కెట్ కార్యకలాపాలతో సహా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇన్వెస్టర్ల ఆందోళన అప్రతిహతంగా కొనసాగుతోంది. రూ .30,000 కోట్ల ప్రభుత్వ బాండ్లను బహిరంగ మార్కెట్ ద్వారా రెండుసార్లు( మార్చి 24, మార్చి 30) కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. చదవండి: 12 ఏళ్లలో మొదటిసారి... -
స్టాక్స్‌లో నష్టపోకూడదంటే..?
సంపద కూడబెట్టుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈక్విటీలది అగ్ర తాంబూలం. మార్కెట్ పతనాలే మంచి పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడతాయి. గతంలో భారీ పతనాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్లు పడి లేచిన బంతి మాదిరిగా ఆ పతనాల నుంచి నూతన శిఖరాలకు చేరడాన్ని చూశాం. ప్రపంచ ఆర్థిక మాంద్యం 2008లో మన ఈక్విటీ మార్కెట్లను 50 శాతానికి పైగా పడవేయగా, ఆ తర్వాత కాలంలో మార్కెట్లు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ మార్కెట్‌ను ముంచేస్తోంది. షేర్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇప్పటికే సూచీలు 30 శాతానికి పైగా నష్టపోయాయి. ‘అందరూ ఎగబడి కొంటుంటే ఆ సమయంలో జాగ్రత్త పడాలి.. అందరు భయంతో అమ్మకాలు సాగిస్తుంటే అప్పుడు ఆశతో కొనుగోలు చేయాలన్నది’ వారెన్ బఫెట్ నమ్మే సూత్రం. ఇప్పుడు దీన్ని అనుసరించే సమయం ఆసన్నమైంది. అయితే, ఈక్విటీల్లో రాబడులు తెచ్చుకోవాలంటే కరెక్షన్లో షేర్లను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేయడం ఒక్కటే కాదు.. ఆ షేర్లు నాణ్యమైన కంపెనీలవి అయి ఉండాలి. భవిష్యత్తు ఉన్నవి కావాలి. అంటే చేసే పెట్టుబడుల్లో తప్పటడుగులకు చోటు లేకుండా చూసుకోవాలి. ఈక్విటీ రాబడులకు తగిన విషయ పరిజ్ఞానం, అధ్యయనం అవసరం. కేవలం కొన్ని తప్పులు పెట్టుబడి మొత్తాన్ని హరించేస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో చాలా మంది కనీసం ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా సాగిపోతుంటారు. తమ రిస్క్ స్థాయిలను తెలుసుకోకుండా రాబడుల కాంక్షతో దూకుడుగా వెళ్లి చేతులు కాల్చుకుంటుంటారు. కానీ, ఏదైనా కోల్పోవడం అంత సులభం కాదు రాబట్టుకోవడం. ఇదే సూత్రం ఈక్విటీలకూ వర్తిస్తుంది. ఈక్విటీల పట్ల సరైన అవగాహన లేకుండా, భారీ నష్టాలను మూటగట్టుకుంటే.. ఆ తర్వాత పెట్టుబడులపై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను కాపాడుకుంటూ, దీర్ఘకాలంలో రాబడులు పోగేసుకోవాలంటే కొన్ని తప్పులకూ దూరంగా ఉండాలి. ఆ వివరాలను డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఏవీపీ అమిత్ గ్రోవర్ వెల్లడించారు. సమయం ఎంచకూడదు ఈక్విటీ పెట్టుబడులకు సమయం నిర్దేశించుకోవడం సరైనది కాదు. ఇటాలియన్ ఆర్థికవేత్త పారెటో పరిశోధన 80–20 సూత్రాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు కంపెనీల ఉత్పత్తుల్లో 20 శాతం ఉత్పత్తుల నుంచి 80 శాతం ఆదాయం వస్తుంటుంది. అలాగే, ఓ కంపెనీ లాభాలకు 20 శాతం ఉద్యోగుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అలాగే, 20 శాతం ప్రయత్నాలు మన విజయాల్లో 80 శాతం పాత్ర పోషిస్తాయి. పారెటో రూపొందించిన సూత్రం ఈక్విటీలకు కూడా అమలవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రాబడుల్లో 80 శాతం కేవలం 20 శాతం సమయంలోనే వస్తుంటాయి. కానీ, ఈ 20 శాతం సమయం ఎప్పుడన్నది ఊహించడం అసాధ్యం. ఎంతో ఓపికగా, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసా గించేలా ఉండాలి. అప్పుడే ఆ 20 శాతం సమయంలోకి అడుగుపెట్టి మంచి రాబడులు పొందే అవకాశం లభిస్తుంది. కొంత కాలం పాటు పెట్టుబడులను కొనసాగించి, రాబడుల సమయం వచ్చే వరకు వేచి చూడలేక నిరాశతో వెనక్కి తీసేసుకుంటే.. ఆ విలువైన రాబడుల అవకాశాన్ని కోల్పోయినట్టే. వైవిధ్యం లేకపోవడం క్రికెట్లో ప్రతీ బాల్‌కు ఆరు పరుగులు (సిక్సర్) నమోదు చేయడం సాధ్యం కాదన్న విషయం బ్యాట్స్‌మెన్‌కు తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆరు పరుగులు, నాలుగు, రెండు పరుగులు, ఒక పరుగు ఇలా అన్నీ సమకూర్చుకుంటేనే సెంచరీ మార్కు సాధ్యపడుతుంది. పెట్టుబడి కూడా అంతే. గత 40 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రను తిరగేస్తే 100 రెట్లు పెరిగిన కంపెనీలు ఎన్నో కనిపిస్తాయి. తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా అవతరించినవీ ఉన్నాయి. మరోవైపు దివాలా తీసిన కంపెనీలూ కనిపిస్తాయి. కానీ, ఇన్వెస్టర్లకు ఇలా ఎన్నో రెట్లు లాభాలను ఇచ్చిన మల్టీబ్యాగర్ కథనాలే ఆసక్తి కలిగిస్తాయి. వైఫల్య కథనాలను పట్టించుకోకుండా.. మల్టీబ్యాగర్ ఆకాంక్షతో కేవలం కొన్ని స్టాక్స్‌లోనే తమ పెట్టుబడులు అన్నింటినీ కుమ్మరించేస్తుంటారు. కానీ, ఇది ఎంతో రిస్క్‌తో కూడిన వ్యాపారం. తమ పెట్టుబడులు, కాల వ్యవధికి అనుగుణంగా తగినంత వైవిధ్యంతో కూడిన స్టాక్ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులు పొందడంతోపాటు ఒక్కో స్టాక్ వారీ రిస్క్ కూడా తక్కువ అవుతుంది. తగినంత అధ్యయనం లేకుండా.. ఓ విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఎన్నో నెలల పాటు అధ్యయనం చేస్తుంటారు. ఏ ఏ ప్రాంతాలను చుట్టి రావాలి, అక్కడ ఉండే వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖర్చులు ఇలా అన్నింటిపైనా అవగాహన కోసం ఎంతో మందిని విచారిస్తాం. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలన్నా ఇదే స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ, భవిష్యత్తు కోసం ఉద్దేశించి పెట్టుబడులు పెట్టే ముందు తగినంత అధ్యయనం లేకపోతే ఎలా..? కంపెనీ వాటాలను కొనుగోలు చేస్తున్నారంటే.. ఆయా కంపెనీల వ్యాపారం, యాజమాన్యం, ఆర్థిక పరిస్థితులు, ఆ కంపెనీ పనిచేసే రంగం, దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఎన్నో అంశాలను అర్థం చేసుకోవాలి. అదృష్టం కలిసివస్తే స్టాక్స్ ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు తమ సామర్థ్యంపై నమ్మకం మరింత బలపడుతుంది. నిజానికి బుల్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. దాంతో తమ నైపుణ్యాలు, అదృష్టం మధ్య వ్యత్యాసం వారికి అర్థం కాదు. కానీ, ఆటుపోట్లు బయటపడినప్పుడే అసలు విషయం బయటపడుతుందని విఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పే మాట ఇక్కడ గమనార్హం. భరించలేనంత రిస్క్ ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా ఆటుపోట్లతో కూడి ఉంటాయి. స్వల్పకాలంలోనే స్టాక్స్‌లో లేదా సూచీల్లో 10–20% నష్టాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008, హర్షద్ మెహతా స్కామ్ వెలుగుచూసిన 1990ల్లో అయితే స్టాక్ మార్కెట్లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. సాధారణ మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఎక్కువ మంది పోర్ట్‌ఫోలియో నిర్మాణం చేసుకుంటుంటారు. కానీ, మార్కెట్ పతనాల్లో పెట్టుబడి హరించుకుపోకుండా ఉండాలంటే రిస్క్ నిర్వహణ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే విధంగా జవానులు ఎలా తర్ఫీదు అయితే పొందుతారో.. ఇన్వెస్టర్లు సైతం అత్యంత ప్రతికూల పరిస్థితులనూ నెగ్గుకొచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాబడుల కోసం పరుగు రాబడుల కోసం పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులకు సంబంధించి నిర్దేశిత ప్రక్రియను పాటించడం ఎంతో అవసరం. ఎలుకకు ఏదో ఒక ఆహారాన్ని వేసి బంధించినట్టుగానే.. మనల్ని బుట్టలో వేయాలంటే అందుకు ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తే సరి. స్కామర్లు భారీ రాబడులను ఎరగా చూపుతుంటారు. వీటికి ఆకర్షితులైన వారు ఎలుకల మాదిరే వాటిల్లో చిక్కుకుంటారు. రాబడులు అన్నవి కంటికి కనిపించేవి. కానీ, రిస్క్ కనిపించని రూపంలో ఉంటుంది. గత నాలుగు ఐపీవోలు లిస్టింగ్‌లో 10 శాతం పైనే రాబడులు ఇచ్చాయనుకుంటే.. ఐదో ఐపీవో కూడా లిస్టింగ్‌లో ఇదే విధమైన రాబడులు ఇస్తుందని భావించడం సురక్షితమేనా..? ఇన్వెస్టింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడం వల్ల స్టాక్ పెరుగుదల, పతనాల్లో నిశ్చింతగా ఉండే బలాన్నిస్తుంది. తద్వారా దీర్ఘకాలం పాటు సౌకర్యంగా వాటిల్లో కొనసాగగలరు. స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్మెంట్ 40 ఏళ్లలో సెన్సెక్స్ (1979–2019) ప్రయాణాన్నే పరిశీలిస్తే.. మీరు ఏడాది కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే 33 శాతం కేసుల్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు 8 శాతమే. అదే 10 ఏళ్ల కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు 3 శాతమే. 15 ఏళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం సున్నా. 40 ఏళ్ల కాలంలో సెన్సెక్స్ పనితీరు ఆధారంగా అంచనాలు ఇవి. అమెజాన్ చైర్మన్, సీఈవో జెఫ్ బెజోస్ ఒకసారి వారెన్ బఫెట్‌ను.. ‘మీ పెట్టుబడుల సిద్ధాంతం చాలా సులభంగా ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ దీన్ని ఎందుకు అనుసరించరు?’ అని ప్రశ్నించారు. ‘‘ఎందుకంటే ఎవరూ కూడా నిదానంగా ధనవంతులు కావాలని కోరుకోరు’’ అంటూ బఫెట్ బదులిచ్చారు. అంటే చాలా వేగంగా రాబడులు పోగేసుకోవాలనే ఆకాంక్షే తప్పటడుగులకు దారితీస్తుందని గ్రహించాలి. విలువకు విలువ ఇవ్వకపోవడం.. ధర అన్నది చెల్లించేది.. కానీ, విలువ అన్నది మీరు పొందేది. మార్కెట్లు అన్నవి ఉత్సాహం, నిరాశావాదం మధ్య చలిస్తుంటాయి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కంటే.. వదంతులు, ఊహాజనితాల ఆధారంగానే ఎక్కువగా చలించడం ఉంటుంది. దీంతో తాము కొనుగోలు చేస్తున్న వాటి విలువను పరిశీలించకుండా, ఈ విధమైన కథనాలపై ఆధారపడి అడుగులు వేయవద్దు. భవిష్యత్తు రాబడులు అన్నవి మీ కొనుగోలు ధరపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. కనుక మీరు ఓ స్టాక్‌లోకి ప్రవేశించే ధర చాలా అధిక స్థాయిలో ఉంటే భవిష్యత్తు రాబడులు తక్కువగా ఉండడం లేదా ప్రతికూలంగా ఉండడం జరగొచ్చు. కనుక అసలు విలువను గుర్తించడం నేర్చుకోవాలి. తగిన అవగాహన లేకుండా... ఇన్వెస్టింగ్ అనేది ప్రత్యేకమైన ఉద్యోగమే. ఫైనాన్స్, అకౌంటింగ్, వ్యాల్యూషన్లు వీటన్నింటిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. యాజమాన్యం గురించి తెలుసుకోవాలి. ఆ కంపెనీ పనిచేస్తున్న విభాగం/రంగం గురించి తగినంత అవగాహన ఉండాలి. మార్కెట్ ఆటుపోట్లను అధిగమించే ప్రశాంతత అవసరం. ఎంతో అనుభవం, సమయం, శక్తి పెట్టుబడులకు అవసరం. అందుకే దీన్ని పార్ట్ టైమ్ కాకుండా పూర్తికాలపు ఉద్యోగంగా పేర్కొంటారు. కనుక అంత సమయం వెచ్చించలేని వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను నిపుణులు నిర్వహిస్తుంటారు. పైగా పెట్టుబడుల్లో తగినంత వైవిధ్యం కూడా ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుకే తగినంత వైవిధ్యాన్ని ఫండ్స్ ద్వారా పొందొచ్చు. -
మాంద్యం కోరల్లో!
ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్‌ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది. మాంద్యం భయాలు... భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్‌లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్‌ను కూడా నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం ‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు 24 శాతం, పవర్‌గ్రిడ్ 12 శాతం, కోటక్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ 11 శాతం చొప్పున, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 శాతం, ఎన్టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది. భారత్ ‘వృద్ధి’కి ఎస్ అండ్ పీ కోత న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ, అమెరికా, యూరోప్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్‌లో ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్ అంచనావేసింది. 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది. క్రూడ్, బంగారం మరింత పతనం కోవిడ్–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. ► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ► ఇక క్రూడ్ విషయానికి వస్తే, స్వీట్ బ్యారల్ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ఆయిల్ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
రెండో రోజూ నష్టాలే
కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. వైరస్ కారణంగా చైనాలో పెరిగిపోతున్న మరణాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై దీని ప్రతికూల ప్రభావాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. దీంతో మన మార్కెట్లతోపాటు నికాయ్, హాంగ్‌కాంగ్, సియోల్, తైపీ, జకార్తా మార్కెట్లు అర శాతం వరకు నష్టపోయాయి. సిడ్నీ 0.1 శాతంతో ముగియగా.. కరోనా బాధిత దేశం చైనాలోని షాంఘై మార్కెట్లు తొలుత అర శాతం నష్టపోగా, ఆ తర్వాత కోలుకుని అర శాతం లాభంతో ముగిశాయి. యూరోప్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ఆరంభమయ్యాయి. చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం విడుదల కాగా, వినియోగ ఉత్పత్తుల ధరలు ఎనిమిదేళ్లలోనే అత్యధికంగా పెరిగాయి. ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరిగాయి. కరోనా వైరస్ ప్రభావం ద్రవ్యోల్బణ గణాంకాల రూపంలో ప్రతిఫలించింది. చైనా వ్యాప్తంగా ముఖ్యమైన తయారీ కేంద్రాలను కూడా మూసేస్తున్నారు. యాపిల్‌కు సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్, వాహన దిగ్గజం టయోటాకూ సరఫరా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రసరించడంతో సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 40,980 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 373 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 67 పాయింట్ల నష్టంతో 12,031 వద్ద క్లోజయింది. ప్రధానంగా మెటల్, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఎంఅండ్ఎం 7 శాతం డౌన్ అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 7% నష్టపోయింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం భారీ నష్టాలకు దారితీసింది. టాటా స్టీల్ 6%, ఓఎన్జీసీ 3%, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్ 2 శాతం చొప్పున క్షీణించాయి. లాభపడిన వాటిల్లో టీసీఎస్, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. జనవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 6 శాతానికి పైగా తగ్గినట్టు సియామ్ గణాంకాలను విడుదల చేయడం ఆటో రంగ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. కరోనా వైరస్ వల్ల మరణాలు సార్స్ మరణాలను దాటుతుండడం దాని తీవ్రతపై ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. -
మార్కెట్లో ‘శాంతి’ ర్యాలీ!
ముంబై: ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశం అమెరికా.. చమురు ఉత్పత్తి పరంగా బలమైన ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తేలికపడడం ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. గత వారం ఇరాక్‌లో ఇరాన్ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా దళాలు చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాల్లో అధిక శాతం మేర గడిచిన రెండు రోజుల్లో మన ఈక్విటీ మార్కెట్లు తిరిగి పూడ్చుకున్నాయి. ప్రతీకార చర్య కింద ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినా కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తీసుకోకపోవడం, తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పడం పరిస్థితిని కుదుటపరిచింది. ఫలితంగా గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభాన్ని (1.55 శాతం) నమోదు చేసుకుంది. 41,482 పాయింట్ల గరిష్టస్థాయిని తాకి... చివరకు 41,452 వద్ద క్లోజయింది. అటు నిఫ్టీ సైతం 191 పాయింట్లు పెరిగి (1.58 శాతం) 12,216 వద్ద క్లోజయింది. ట్రంప్ ప్రకటనతో క్రితం రాత్రి యూఎస్ మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. తమ ఉపాధ్యక్షుడు లీ వచ్చే వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తారని, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారంటూ చైనా చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లను రిస్క్ తీసుకునే దిశగా ప్రోత్సహించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► అధికంగా లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు ముందుంది. ఆ తర్వాత ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్బ్యాంకు, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ► నష్టపోయిన షేర్లలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి. ► బీఎస్ఈ రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, ఎనర్జీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ సూచీ నష్టపోయింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.55 శాతం వరకు పెరిగాయి. ► షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ 2.31 శాతం వరకు గరిష్టంగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించాయి. ఒక్కరోజులో 2.25 లక్షల కోట్లు గురువారం నాటి మార్కెట్ ర్యాలీ పుణ్యమా అని ఒక్కరోజే ఇన్వెస్టర్ల వాటాల విలువ రూ.2.25 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ముగింపుతో పోలిస్తే.. రూ.2,25,554 కోట్లు పెరిగి మొత్తం రూ.1,57,06,155 కోట్లకు చేరుకుంది. మార్కెట్లపై క్యూ3 ఫలితాల ప్రభావం.. ‘‘వృద్ధిని పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లారడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన చర్యలు, నిర్ణయాలు దీర్ఘకాలంలో ఈక్విటీలకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్లను మూడో త్రైమాసికం ఫలితాలు నిర్ణయిస్తాయి. తక్కువ బేస్(క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోలిస్తే) కారణంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కొంత పురోగతి ఉంటుందని అంచనా’’ అంటూ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘ఈక్విటీ మార్కెట్లకు అసాధారణ రోజు. ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. చల్లారిన పసిడి.. క్రూడ్ రూపాయికి 48 పైసలు లాభం న్యూయార్క్/న్యూఢిల్లీ: యుద్ధాన్ని కాంక్షించడంలేదంటూ అమెరికా–ఇరాన్ నుంచి వెలువడుతున్న సంకేతాలతో తిరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాలైన బంగారం, క్రూడ్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయంగా పసిడి, క్రూడ్ ధరలు గురువారమూ తగ్గాయి. ఈ ధోరణి భారత్ రూపాయి బలోపేతం కావడానికీ దోహదపడింది. బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ మార్కెట్ నైమెక్స్‌లో గురువారం ఈ వార్తరాసే 10.30 రాత్రి గంటల సమయానికి క్రితం ముగింపుతో పోల్చిచూస్తే, 10 డాలర్ల నష్టంలో 1,550 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బుధవారం గరిష్టంతో పోల్చితే ఇది 62 డాలర్లు తక్కువ. ట్రేడింగ్ ఒక దశలో ఈ ధర 1,541 డాలర్ల కనిష్టాన్నీ తాకింది. ► నైమెక్స్ క్రూడ్ పావు శాతం తగ్గుదలతో 59.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ► డాలరుతో రూపాయి విలువ 48 పైసలు లాభపడి 71.21 వద్ద ముగిసింది. ► దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.377 నష్టంతో రూ.39,733 వద్ద ట్రేడవుతోంది. ‘‘యూఎస్–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు బలం చూపిస్తున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్ బలంగా ముగియడం ఆసియాలోనూ కొనుగోళ్లకు దారితీసింది. ఇప్పుడు యూరోప్‌లోనూ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తోంది. యూఎస్, ఇరాన్ ఇప్పటికీ ఒకరిపట్ల మరొకరు విభేదంగా ఉన్నా, వివాదం ముదరకపోతే మంచి వాతావరణం కొనసాగే అవకాశమే ఉంటుంది’’ అని బ్రిటన్‌కు చెందిన సీఎంసీ మార్కెట్స్ అనలిస్ట్ డేవిడ్ మాడెన్ పేర్కొన్నారు. -
ఐపీవోలకు అచ్ఛేదిన్!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్)తో ప్రైమరీ మార్కెట్లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు ఎంతో అనిశ్చి తులను చవిచూశాయి. ఫలితంగా మొదటి పది నెలల కాలంలో వచ్చిన పేరున్న ఐపీవో ఇష్యూలు 20లోపునకే పరిమితమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా సబ్స్క్రయిబ్ అవుతాయన్న నమ్మకం ఉన్న కంపెనీలే వాటిని చేపట్టాయి. చాలా కంపెనీలు ఐపీవో ఇష్యూ చేపట్టాలని అనుకుంటున్నా, సానుకూల వాతావరణం కోసం వేచి చూస్తున్నాయి. కొన్ని ఆఫర్ పత్రాలను దాఖలు చేసినా ముందుకు వెళ్లలేకపోయాయి. సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను భారీ తగ్గింపు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో పడ్డాయి. దీంతో ఐపీవో ఇష్యూలతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గత రెండు నెలల్లో రూట్ మొబైల్, మాంటే కార్లో, మజ్గాన్ డాక్ షిప్‌బిల్డర్స్, ఇండియన్ రెన్యువబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ, ముంబైకి చెందిన పురానిక్ బిల్డర్స్ సంస్థలు సెబీ వద్ద ఐపీవో ఆఫర్ పత్రాలను మరోసారి దాఖలు చేశాయి. తాజాగా ఎస్బీఐకి చెందిన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (క్రెడిట్‌కార్డు కంపెనీ) కూడా ఆఫర్ పత్రాలను దాఖలు చేసింది. వచ్చే కొన్ని నెలల్లో ఐపీవో కోసం యూటీఐ మ్యూచువల్ ఫండ్, పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఐపీవో పత్రాలను సెబీ ముందు దాఖలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. 27 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్... ఇప్పటి వరకు సెబీ నుంచి ఐపీవో కోసం 27 కంపెనీలు అనుమతి పొందాయి. ఇవి ఐపీవో ఇష్యూల ద్వారా రూ.18,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బజాజ్ ఎనర్జీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, పెన్నా సిమెంట్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో ఏడు సంస్థల వరకు ఆఫర్ పత్రాలను దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయి. ఈ ఏడాది 14 కంపెనీలు కలసి సుమారు రూ.15,000 కోట్ల వరకు నిధులను ఐపీవో ద్వారా సమీకరించాయి. వీటిల్లో ఒక్కటి మినహా (స్టెర్లింగ్ అండ్ విల్సన్) అన్నీ ఇష్యూ ధర కంటే ఎక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో ఐఆర్సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ మాత్రం ఇష్యూ ధర కంటే నూరు శాతం మించి పెరిగాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో మార్కెట్లో రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరిగింది. స్థిరమైన ర్యాలీ ఉంటేనే... సెకండరీ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటే తప్ప, ప్రైమరీ మార్కెట్లో (ఐపీవోలు) వాతావరణం మారకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా రివకరీ సంకేతాలు ఇవ్వలేదని, కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లిక్విడిటీ (నిధుల రాక) ఆధారంగా జరుగుతున్న ప్రస్తుత మార్కెట్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నది బ్రోకరేజీల అభిప్రాయం. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం మేర పెరిగింది. ‘‘ఈ ఏడాది పలు ఐపీవోలకు అనుమతుల గడువు కూడా తీరిపోయింది. తాము ఆశిస్తున్న ధరకు తగినంత డిమాండ్ లేని పరిస్థితుల్లో ఇదే వాతావరణం కొనసాగొచ్చు’’ అని ప్రైమ్ డేటా బేస్ ఎండీ ప్రణవ్ హల్దియా పేర్కొన్నారు. ‘‘మార్కెట్లో ఇప్పటికీ ఎంతో అనిశ్చితి ఉంది. తిరిగి ఆఫర్ పత్రాలను దాఖలు చేయడం వల్ల ఈ వాతావరణం మెరుగుపడిన వెంటనే ఐపీవోలకు వచ్చేందుకు కంపెనీలకు వీలు కలుగుతుంది’’ అని పీఎల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ దారా కల్యాణి వాలా చెప్పారు. మంచి ఇష్యూలకు భారీ డిమాండ్ ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మంచి వ్యాపార నమూనాలు కలిగిన కంపెనీలు, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణే దక్కింది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్, పాలీక్యాబ్, నియోజన్ కెమికల్స్, సీఎస్బీ బ్యాంకు ఇష్యూలకు భారీ స్పందనే లభించింది. లిస్టింగ్‌లోనూ లాభాలు కురిపించాయి. ఐఆర్సీటీసీ షేరు ఇష్యూ ధర రూ.320 కాగా, లిస్టింగ్‌లోనే వాటాదారులకు 100% లాభాలిచ్చింది. యాఫ్లే ఇండియా కూడా ఇష్యూ ధర నుంచి చూస్తే ఇప్పటికే 119% ర్యాలీ చేసింది. కేరళకు చెందిన సీఎస్బీ బ్యాంకు ఇష్యూ ఈ నెల 27న ముగియగా 87 రెట్లు అధికంగా బిడ్లు రావడం గమనార్హం. వచ్చే వారం మొదలయ్యే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోకు, త్వరలో రానున్న ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూకు సైతం మంచి స్పందన ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. త్వరలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో... ఇష్యూ సైజు రూ.9,500 కోట్ల రేంజ్లో... ముంబై: ఎస్బీఐకు చెందిన దేశంలోనే రెండో అతి పెద్ద క్రెడిట్ కార్డ్ కంపెనీ... ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో పత్రాలను సెబీకి బుధవారం సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో ఎస్బీఐ, కార్లైల్ గ్రూప్‌నకు చెందిన సీఏ రోవర్ హోల్డింగ్స్ సంస్థలు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. మొత్తం మీద ఈ ఐపీవో సైజు రూ.8,000–9,500 కోట్ల రేంజ్లో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీ విలువ రూ.65,000 కోట్ల మేర ఉండగలదని అంచనా. సెబీ ఆమోదం లభిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుంది. వచ్చే ఏడాది మార్చిలోనే మార్కెట్లో లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. -
తక్కువ రిస్క్.. చక్కని రాబడి
ఏడాది కాలంగా అనిశ్చితులతో ట్రేడ్ అయిన ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు స్థిరమైన ర్యాలీ బాటలో ఉన్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నూతన గరిష్టాలకు చేరువయ్యాయి. కానీ పరిశీలించి చూస్తే స్టాక్స్ పనితీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తుండగా, అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ వెనుకబడే ఉంటున్నాయి. మార్కెట్ ర్యాలీ చాలా సంకుచితంగా ఉంటోంది. దీంతో భిన్న మార్కెట్ క్యాప్ విభాగాల్లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భిన్న విభాగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఆధారిత ఫోకస్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్–25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాబడులు..: ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 20 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 టీఆర్ఐ పెరుగుదల 13.8 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 17.5 శాతం, ఐదేళ్ల కాలంలో 12.9 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. ఇదే కాలంలో నిఫ్టీ 50 టీఆర్ఐ వృద్ధి 14.2 శాతం, 8.6 శాతంగానే ఉంది. అంటే బెంచ్ మార్క్ పనితీరు కంటే ఎంతో ఉత్తమ రాబడుల చరిత్ర ఈ పథకంలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ పథకం 2012లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు వార్షిక రాబడులు సగటున 16 శాతం పైనే ఉండటం మెరుగైన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోనూ అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న పథకాల్లోనూ యాక్సిస్ ఫోకస్డ్ 25 అగ్ర పథాన ఉంది. పెట్టుబడుల వ్యూహాలు..: సెబీ నిబంధనల ప్రకారం ఫోకస్డ్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్స్ వరకు పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండొచ్చు. ఈ పథకం మాత్రం 25 స్టాక్స్‌నే పరిమితిగా పెట్టుకుంది. అది కూడా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ నుంచి వీటిని ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 24 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే మొత్తం పెట్టుబడుల్లో 64.5 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. బోటమ్‌అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెట్టుబడుల్లో 42.5 శాతం మేర వీటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కెమికల్స్, సేవల రంగంలోని కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. -
ఐటీ, బ్యాంకు షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ రంగ షేర్లలో అమ్మకాలతో ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు నష్టపోయి (0.53 శాతం) 40,359 వద్ద క్లోజయింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 54 పాయింట్లు కోల్పోయి (0.45 శాతం) 11,914 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ప్రధాన సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ నికరంగా 2.72 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. సూచీలోని ఐటీ రంగ షేర్లలో ఇన్ఫోసిస్ అత్యధికంగా 3 శాతం నష్టపోయింది. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు కూడా నష్టాల పాలయ్యాయి. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యోగ వీసా అర్హతల్లో అమెరికా మార్పులు చేయనుందన్న వార్తలు ఐటీ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. సూచీల్లో టాటా స్టీల్ గరిష్టంగా 4 శాతం వరకు పెరిగింది. ఎన్టీపీసీ, వేదాంత, ఓఎన్జీసీ సైతం 2–3 శాతం మధ్య లాభపడ్డాయి. జీడీపీ డేటాపై దృష్టి...: ‘‘బ్లూచిప్ స్టాక్స్ అధిక వ్యాల్యూషన్ కారణంగా మార్కెట్ అంచుకు చేరింది. ట్రెయిలింగ్ (గత 12 నెలల కాలం) పీఈ 26 రెట్ల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ప్రధాన సూచీలు మరింత ముందుకు వెళ్లేందుకు బలం చాలడం లేదు. రానున్న వారంలో ఎటువంటి ప్రధాన సానుకూలాంశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించే జీడీపీ డేటాపై దృష్టి సారించొచ్చు. ఇది మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఆర్బీఐ ఒకవేళ తన సర్దుబాటు ధోరణిని తటస్థానికి మార్చుకుంటే అది మార్కెట్ ర్యాలీకి విఘాతం కలిగిస్తుంది. యూఎస్ హెచ్1–బీ వీసా నిబంధనల కఠినతరంపై తాజా ఆందోళనలు ప్రధాన ఐటీ షేర్లను నష్టపోయేలా చేశాయి’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. రంగాల వారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు గరిష్టంగా 2.21 శాతం వరకు నష్టపోగా, మెటల్, పవర్, యుటిలిటీలు, బేసిక్ మెటీరియల్స్, ఆటో, ఇంధన రంగ సూచీలు 2.08 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.14 శాతం వరకు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ లాభపడగా, షాంఘై నష్టపోయింది. యూరోప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌లోకి నెస్లే, టైటాన్, అల్ట్రాటెక్ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ సూచీలోకి కొత్తగా నెస్లే, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ అడుగు పెట్టనున్నాయి. ప్రస్తుతం సూచీలో ఉన్న వేదాంత, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, బయటకు వెళ్లిపోనున్నాయి. డిసెంబర్ 23 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్టాక్ ఎక్సేంజ్ ప్రకటించింది. ఎస్అండ్పీ డోజోన్స్, బీఎస్ఈ జాయింట్ వెంచర్లో ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ నిర్వహణ కొనసాగుతోంది. సెన్సెక్స్50, నెక్స్ట్50, బీఎస్ఈ 100, 200, 500 సూచీల్లోనూ మార్పులు చేసింది. -
అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!
ఈక్విటీ మార్కెట్లలో సాధారణంగా అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి అసాధారణ స్థాయికి చేరుతుంటాయి. ముఖ్యంగా ఈ తరహా ఆటుపోట్లు, అనిశ్చిత పరిస్థితుల్లో మల్టీక్యాప్ విభాగం ఈక్విటీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ఈ విభాగంలోని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కేవలం ఒక విభాగానికే పరిమితం కాకుం డా.. చిన్న, మధ్య, పెద్ద స్థాయి ఇలా అన్ని ర కాల మార్కెట్ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటుతో ఉంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే వెసులుబాటు వీ టి కి ఉంటుంది. అయినప్పటికీ ఈ పథకాలు లార్జ్‌క్యాప్‌నకు, మధ్య స్థాయి విభాగంలోని పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకంటే వీటిల్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండడం వల్ల అవసరమైన సందర్భాల్లో వేగంగా విక్రయించేందుకు వీలుంటుంది. అలాగే, అధిక రాబడుల కోసం స్మాల్, మిడ్‌క్యాప్‌లోనూ కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మల్టీక్యాప్ విభాగంలో ఇన్వెస్టర్లు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ (ఏబీఎస్ఎల్) ఈక్విటీ ఫండ్ ప్రధానమైనది. రాబడులు ఏబీఎస్ఎల్ ఈక్విటీ ఫండ్‌లో మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ వాటా సాధారణంగా 25 నుంచి 35 శాతం మధ్య ఉంటుంది. మిగిలిన పెట్టుబడులను ఈ పథకం లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. ఇది డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్. 1998లో ఈ పథకం ఆరంభం కాగా, నాడు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే 2017 నాటికి రూ.73 లక్షలు అయ్యేవి. 73 రెట్లు వృద్ధి చెందినట్టు. దీర్ఘకాలంలో ఈ పథకం చక్కని పనితీరును చూపించింది. మూడేళ్ల కాలంలో ఏబీఎస్ఎల్ ఈక్విటీ పథకం వార్షికంగా 11.47 శాతం చొప్పున రాబడులను ఇవ్వగా, ఇదే కాలంలో బీఎస్ఈ 200 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇచ్చిన వార్షిక రాబడులు 12.22 శాతంగా ఉన్నాయి. కానీ ఐదేళ్ల కాలంలో మాత్రం బీఎస్ఈ 200 రాబడులు 10.55 శాతంతో పోలిస్తే.. ఏబీఎస్ఎల్ ఈక్విటీ ఫండ్ అధికంగా, 11.38 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇన్వెస్టర్లకు పంచింది. ఏడేళ్లలో 16.86 శాతం, పదేళ్ల కాలంలో 14.34 శాతం, 12 ఏళ్లలో 10.59 శాతం, 15 ఏళ్లలో 18.99 శాతం చొప్పున వార్షిక రాబడులను ఏబీఎస్ఎల్ ఈక్విటీ పథకం ఇచ్చింది. ఆరంభం నుంచి చూసుకుంటే బీఎస్ఈ 200కు మించి పనితీరు చూపించడమే కాకుండా, 22.64 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక ప్రతిఫలాన్ని ఇచ్చింది. పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల విధానం టాప్డౌన్, బోటమ్ అప్ విధానాల మిశ్రమంగా ఉంటుంది. బోటమ్‌అప్ స్టాక్ ఎంపికలో భాగంగా ఫండ్ మేనేజర్.. ఏ కంపెనీలు ప్రస్తుత స్థాయి నుంచి మంచిగా వృద్ధి చెందగలవన్నది చూసి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పథకం ప్రైవేటు బ్యాంకులు, మెటల్స్, ఫార్మా, సిమెంట్ రంగాల స్టాక్స్ పట్ల అధిక వెయిటేజీతో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీలో అధిక పెట్టుబడులు కలిగి ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు విషయానికొస్తే.. మంచి ఆస్తుల నాణ్యత, బలమైన రిటైల్ ఫ్రాంచైజీ కలిగిన బ్యాంకు. 20 శాతానికి పైగా ఎర్నింగ్స్ వృద్ధి కారణంగా ఈ స్టాక్ అధిక వ్యాల్యూషన్ కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు టర్న్ అరౌండ్ స్టోరీ. ఐటీసీ ఇతర కన్జ్యూమర్ స్టాపుల్ స్టాక్స్‌తో పోలిస్తే చౌకగా ఉంది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో దృష్ట్యా రానున్న 15–18 నెలల కాలానికి డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయంగా ఉంది. డి.జయంత్‌కుమార్ థర్డ్‌పార్టీ ప్రొడక్ట్స్ హెడ్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ -
ఎన్ని ఆటుపోట్లున్నా... రూ.8,231 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు భారీ అస్థిరతల మధ్య చలిస్తున్నా కానీ, ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో చలించడం లేదు. ఆగస్టు నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.8,231 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన సిప్ పెట్టుబడులతో పోలిస్తే 7.5 శాతం అధికం. దీంతో కలిపితే ఈ ఆరి్థక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) సిప్ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.41,098 కోట్లుగా ఉన్నాయి. గత ఆరి్థక సంవత్సరం తొలి ఐదు నెలల్లో వచ్చిన రూ.36,760 కోట్లతో పోల్చి చూసుకుంటే 12 శాతం వృద్ధి చోటు చేసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లకు సిప్ మార్గం అనుకూలంగా ఉన్నట్టు యాంఫి పేర్కొంది. అయితే, ఈ ఏడాది జూలైలో సిప్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి వచి్చన రూ.8,324 కోట్లతో పోలిస్తే... ఆగస్టు మాసంలో వచ్చిన సిప్ పెట్టుబడులు (రూ.8,231 కోట్లు) కొంచెం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక జూన్‌లో రూ.8,122 కోట్లు, మే నెలలో రూ.8,183 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,238 కోట్ల చొప్పున సిప్ మార్గంలో పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఆగస్టు వరకు అంతక్రితం 12 నెలలుగా చూసుకుంటే ప్రతీ నెలలోనూ సగటున రూ.8,000 కోట్ల మేర సిప్ పెట్టుబడులు ఉండడం నిలకడను సూచిస్తోంది. ఇక ఈ నెలలోనూ ఈక్విటీ పథకాల్లోకి సిప్ పెట్టుబడుల రాక బలంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ మాత్రం అస్థిరతలు ఎదుర్కోవచ్చని అంచనా. 2016–17లో రూ.43,900 కోట్లు, 2017–18లో రూ.67,000 కోట్లు, 2018–19లో రూ.92,700 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వివిధ పథకాల పరిధిలో 2.81 కోట్ల సిప్ ఖాతాలు నడుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రతీ నెలా సగటున 9.39 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. -
పసిడి ధరలు పటిష్టమే..!
న్యూఢిల్లీ/న్యూయార్క్: పసిడి బులిష్ ట్రెండ్ కనబడుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి .. ప్రత్యేకించి అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అమెరికా ఆర్థికాభివృద్ధి మళ్లీ మాంద్యంలోకి జారిపోతుందన్న అంచనాలు, దీనితో వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడ్ మొగ్గు చూపిస్తుందన్న విశ్లేషణలు పసిడికి బలాన్ని ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఒక తక్షణం ఒక సురక్షిత సాధనంగా ఎంచుకుంటున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్‌ల నేపథ్యంలో– శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ఒకేరోజు 28 డాలర్లు ఎగిసి 1,537 డాలర్లకు పెరిగింది. ఇది వారం వారీగా 16 డాలర్ల పెరుగుదల. 1,546 డాలర్లు ఈ ఏడాది గరిష్టం కావడం గమనార్హం. 1,360 డాలర్ల కీలక నిరోధాన్ని దాటిన తర్వాత పసిడి వేగంగా 1,546 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. రానున్న వారం రోజుల్లో పసిడి 1,600 డాలర్ల స్థాయిని చేరడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఇక దేశీయంగా చూసినా పసిడి రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా పసిడి బలపడ్డంతోపాటు, డాలర్ మారకంలో రూపాయి (శుక్రవారం 71.66 వద్ద ముగింపు)బలహీన ధోరణి కూడా దేశీయంగా పసిడికి కలిసివస్తోంది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ ఎంసీఎక్స్‌లో పసిడి ధర 10 గ్రాములకు రూ.38,765 వద్ద ఉంది. -
ఎన్నికల ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రథమార్ధంలో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపనున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే దాకా అనిశ్చితి నెలకొనవచ్చని పేర్కొన్నారు. ‘మార్కెట్‌కు దీర్ఘకాలికంగా దిశా నిర్దేశం చేయగల పరిణామం ఈ వారం చోటు చేసుకోనుంది. సంపద సృష్టిలో కూడా ఇదే కీలకాంశం కాగలదు. సాధారణంగా ఎన్నికల ఫలితాల్లాంటి పరిణామాలు కొన్ని సంవత్సరాల దాకా ట్రెండ్స్‌ను నిర్దేశిస్తుంటాయి. కాబట్టి ఎకానమీకి, ఇన్వెస్టర్లకు ఇలాంటివి చాలా కీలకం‘ అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. సాధారణంగానైతే మార్కెట్లు ఏదో ఒక వైపు భారీగా కదిలే అవకాశం ఉన్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్ కారణంగా కొంత అనిశ్చితి కూడా నెలకొందని ఆయన పేర్కొన్నారు. ‘ఈ వారంలో అందరి దృష్టి స్టాక్ కోట్స్ కాకుండా వోట్ కోట్స్‌పై ఉంటుంది‘ అని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ వ్యవస్థాపక సీఈవో జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ‘మార్కెట్లు ఇప్పటికీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో ట్రేడవుతోంది. దానికి భిన్నంగా జరిగితే తీవ్ర నిరుత్సాహం ఉంటుంది. అదే సానుకూల ఫలితాలు వస్తే మార్కెట్లు ఓ మోస్తరుగా ర్యాలీ చేయొచ్చు‘ అని ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ ఫారెక్ అండ్ రేట్స్ విభాగం హెడ్ సజల్ గుప్తా తెలిపారు. కంపెనీలపై ఆర్థిక ఫలితాల ప్రభావం.. టాటా మోటార్స్, కెనరా బ్యాంక్, సిప్లా వంటి దిగ్గజ సంస్థలు ఈ వారంలోనే తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. భారత్ ఫోర్జ్, గ్లాక్సోస్మిత్‌క్లై¯Œ ఫార్మా, హిందుస్తాన్ పెట్రోలియం, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, ఇండియా సిమెంట్స్, ఎ¯Œ టీపీసీ మొదలైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల షేర్లపై వాటి ప్రభావం ఉండనుంది. ఇవి కాకుండా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ముడి చమురు రేట్లు, రూపాయి కదలికలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణి మొదలైనవి ట్రేడింగ్ సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెప్పారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి సుదీర్ఘ సమయం, అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై అస్పష్టత కొనసాగుతున్నప్పటికీ దేశీ మార్కెట్లు పటిష్టతని కనపర్చాయని సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వీపీ జగన్నాధం తూనుగుంట్ల చెప్పారు. క్రితం వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 37,931 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,407 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సాంకేతికంగా నిఫ్టీకి 11–227–11,180 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసాని పేర్కొన్నారు. పుల్‌బ్యాక్ ర్యాలీ గానీ జరిగితే 11,457 వద్ద నిరోధం ఉండొచ్చని తెలిపారు. రూపాయి మారకం విలువ గత వారం 31 పైసలు క్షీణించి 70.23 వద్ద క్లోజయ్యింది. ఈ వారం రూపాయి 69.20–70.80 మధ్య ట్రేడ్ కావొచ్చని ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. రూ. 6వేల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వెనక్కి.. గత మూడు నెలలుగా భారత క్యాపిటల్ మార్కెట్స్‌లో (ఈక్విటీ, డెట్) ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ. 6,399 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే, మే లో ఇందుకు భిన్నమైన ట్రెండ్ నమోదైంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే 2–17 మధ్య కాలంలో ఈక్విటీల నుంచి రూ. 4,786 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ. 1,613 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించారు. ఇది పూర్తిగా ఊహించని పరిణామమేమీ కాదని.. దేశ, విదేశాల్లో ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణమని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. -
రూపాయి ‘బెస్ట్’!
న్యూఢిల్లీ: మొన్నటి వరకు ఆసియా ప్రాంతంలో బలహీనంగా కనిపించిన రూపాయి ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. ఆసియాలోనే వరస్ట్ పనితీరు నుంచి అత్యుత్తమ పనితీరు చూపించే స్థాయికి మారిపోయింది. కేవలం ఐదు వారాల్లోనే రూపాయి తన దిశను మార్చుకోవడం వెనుక మోదీ ఫ్యాక్టరే ప్రధానంగా పనిచేయడం ఆసక్తిదాయకం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడుల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరిగి మోదీ నాయకత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఇవే అంచనాలు దన్నుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలోకి ఐదు వారాలుగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. దీంతో రూపాయి కళను సంతరించుకుంది. డాలర్ మారకంలో 70లోపునకు దిగొచ్చింది. మోదీ రెండోసారి విజయం సాధిస్తే రూపాయి మరింత బలపడుతుందని సింగపూర్‌లోని స్కాటియా బ్యాంకు కరెన్సీ స్ట్రాటజిస్ట్ గావోక్వి తెలిపారు. జూన్ చివరి నాటికి డాలర్‌తో రూపాయి 67 స్థాయికి పుంజుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ వృద్ధి పడిపోతుండడంతో ప్రధాన సెంట్రల్ బ్యాంకులు డోవిష్ విధానాన్ని వ్యక్తీకరించడం కూడా విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన ఆసియా కరెన్సీల్లో రాబడుల కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడుల వెల్లువ... మార్చి నెలలో(18 నాటికి) విదేశీ ఇన్వెస్టర్లు భారత్ ఈక్విటీ మార్కెట్లో 3.3 (రూ.23వేల కోట్లు అంచనా) బిలియన్ డాలర్లను కుమ్మరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 5.6 బిలియన్ డాలర్లలో 50 శాతానికంటే ఎక్కువ కేవలం గత 3 వారాల్లోనే రావడం గమనార్హం. బాండ్లలో ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు. డాలర్ల వెల్లువతో రూపాయి గతేడాది ఆగస్ట్ తర్వాత తిరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల్లో డాలర్లలో రుణాలు తీసుకుని రూపాయి ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వచ్చిన రాబడులు 3.8 శాతంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ క్యారీ ట్రేడింగ్ రాబడులు రూపాయిలోనే ఉండడం గమనార్హం. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే త్వరలో జరిగే ఎన్నికల్లో 272 లోక్‌సభ స్థానాలను సాధిస్తుందని రెండు ఒపీనియన్ పోల్స్ అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘మార్కెట్లు మోదీ విజయాన్ని పరిగణనలోకి తీసుకున్నాయి. ఉన్నట్టుండి మార్కెట్ వాతావరణం మారేందుకు మరే ఇతర అంశం లేదు’’ అని కోటక్ సెక్యూరిటీస్ అనలిస్ట్ అనిద్య బెనర్జీ పేర్కొన్నారు. రూపాయి పట్ల ఆశావహ పరిస్థితి డెరివేటివ్ మార్కెట్లపైనా ప్రతిఫలిస్తోంది. నెలవారీ ఆప్షన్లలో రూపాయి కొనుగోలు కంటే విక్రయం 19 బేసిస్ పాయింట్లు అధికం ఉన్నాయి. ‘‘అంతర్జాతీయ పరిస్థితులు ఫెడ్, ఈసీబీ డోవిష్ ధోరణి దేశీయంగా మరింత మద్దతుగా మారాయి. బీజేపీ విజయావకాశాలపై విశ్వాసం పెరగడం, అదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల్లో రికవరీ నెలకొనడం రూపాయిని నడిపిస్తున్నాయి’’ అని నోమరా కరెన్సీ స్ట్రాటజిస్ట్ దుష్యంత్ పద్మనాభన్ తెలిపారు. రూపాయి మూడు నెలల అంతర్గత వోలటాలిటీ కూడా 5.87 శాతానికి పడిపోయింది. గతేడాది ఆగస్ట్ తర్వాత మళ్లీ ఇదే తక్కువ స్థాయి. ఇది రూపాయి బుల్లిష్ ధోరణిని తెలియజేస్తోంది. రూపాయి సమీప కాలంలో స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బార్క్లేస్ స్ట్రాటజిస్ట్ ఆశిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ కనుక మరలా విజయం సాధిస్తే ఈ ఏడాది మిగిలిన కాలంలో రూపాయి బలం చూపిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
కీలక అవరోధశ్రేణి 36,285–36,560
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన గత శుక్రవారం వెలువడింది. ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు అంశాల్లో మార్కెట్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, తమ పాలసీ ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బందిగా పరిణమిస్తున్నదని భావిస్తే పాలసీని సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ చేసిన ప్రకటనతో అమెరికా, యూరప్ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ బాటలోనే ఆసియా ఇండెక్స్ ఫ్యూచర్లు భారీగా పెరిగాయి. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... జనవరి 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారం ప్రధమార్థంలో 36,285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 35,382 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 382 పాయింట్ల నష్టంతో 35,695 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ ఫలితంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే సెన్సెక్స్‌కు 36,235 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35,380 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే క్రమేపీ 34,400 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 10925–10,985 గతవారం 10,924 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,629 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 10,727 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 10,895 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,150 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం పైన సూచించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,630 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,535 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపై కొద్దిరోజుల్లో 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే ప్రమాదం ఉంటుంది. -
మ్యూచ్‌వల్ ఫండ్స్.. చలో ఫారిన్!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో మన ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆస్థిరతల మధ్య కదలాడుతూ, నష్టాలను పంచుతున్నాయి. ఇందుకు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలే కారణం. దీంతో దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌లో పేరొందిన పథకాల రాబడులు గత ఏడాది కాలంలో చూసుకుంటే మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్నాయి. మన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి నష్టాలు, అమెరికా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాలు అన్నట్టు పరిస్థితిలో మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అమెరికా తదితర విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కనీసం 10 శాతం పెట్టుబడులను విదేశీ కంపెనీలకు కేటాయించుకోవాలని నిపుణులు సూ చిస్తున్నారు. గణనీయమైన పెట్టుబడులు మన దేశ మార్కెట్లలోకి రావడం వల్లే గత రెండు సంవత్సరాల్లో భారీ ర్యాలీకి కారణంగా పేర్కొంటున్నారు. ఐఐఎఫ్ఎల్ ఏంఎసీ నుంచి పథకం ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ ‘ఐఐఎఫ్ఎల్ యూఎస్ టెక్నాలజీ ఫండ్’ను ఈ నెల్లోనే ప్రారంభించనుంది. ‘‘అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలున్నప్పటికీ భారతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం లేదు. టెక్నాలజీ కంపెనీలైన ఫేస్బుక్, యాపిల్ గత కొన్నేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాయి. కానీ భారత ఇన్వెస్టర్లు వీటిలో పాలు పంచుకోలేదు’’ అని ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ సీఈవో ప్రశస్తసేత్ తెలిపారు. ఈ తరహా పథకాలను ఈ సమయంలో తీసుకురావడం అనుకూలమని... డాలర్ బలోపేతం అవడం వల్ల ఇన్వెస్టర్లకు అదనపు రాబడులు సమకూరుతాయన్నారు. ఇటువంటివే మరికొన్ని పథకాలను తర్వాత ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు సేత్ చెప్పారు. ఉదాహరణకు... ‘‘ఈ ఏడాది ప్రారంభం నుంచి డాలర్‌తో రూపాయి 14 శాతం క్షీణించింది. అంటే ఎస్అండ్పీ500పై రూ.100 డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కాస్తా రూ.114 డాలర్లు అయింది. అమెరికా స్టాక్స్ పెరుగుదల కలపకుండా చూస్తేనే ఈ మాత్రం పెరుగుదల ఉంది. డాలర్ రూపంలో చూస్తే... జపాన్, అమెరికా ఈ ఏడాదిలో 5–9 శాతం మధ్యలో రిటర్నులు ఇచ్చాయి. రూపాయి మారకంలో చూస్తే ఈ రాబడులు 20–24 శాతానికి సమానం’’ అని నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే మేము పలు అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలతో పథకాలను అందిస్తున్నాం. వీటి అవసరంపై క్లయింట్లతో మాట్లాడుతున్నాం. రూపాయి క్షీణతతో దేశీయ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ అవకాశాలు కేవలం అమెరికా మార్కెట్లకే పరిమితం కాదు. చైనా, యూరోప్, అమెరికా, కొన్ని ఆసియా దేశాలు సైతం ఇటీవల మంచి ర్యాలీ చేశాయి’’అని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా తెలిపారు. యాక్సిస్ నుంచి కొత్త పథకం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇప్పటికే యాక్సిస్ గ్రోత్ అపార్చునిటీస్ ఫండ్‌ను ఆరంభించింది. ఈ పథకం 65–70 శాతం పెట్టుబడులను దేశీయ కంపెనీలకు కేటాయిస్తుంది. 30–35 శాతం పెట్టుబడులను విదేశీ కంపెనీలకు కేటాయిస్తుంది. అమెరికా, యూరోప్, పశ్చిమాసియా, జపాన్ ప్రాంతాల్లో అవకాశాలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ష్రోడర్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సూచనల మేరకు పెట్టుబడులు పెడుతుంది. -
పిల్లల కోసం... రిస్క్ లేకుండా!!
ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలలుగా ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇక డెట్ మార్కెట్లోనూ గడిచిన ఆరు నెలలుగా ఊగిసలాట ధోరణే ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో రిస్క్ లేని రాబడులు ఆశించేవారు.. తమ చిన్నారుల చదువు కోసం లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అవసరమైన నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారు పరిశీలించతగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ స్డడీ ప్లాన్ కూడా ఒకటి. ఇది దేన్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే... ఈ పథకం 75– 80 శాతం పెట్టుబడుల్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అందులోనూ ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్), అధిక రేటింగ్ కలిగిన ఏఏఏ కార్పొరేట్ బాండ్లలోనే పెట్టుబడి పెడుతుంది. కనుక ఆ మేరకు రిస్క్ లేనట్టుగానే భావించాలి. మిగిలిన పెట్టుబడుల్ని... అంటే 20 శాతం వరకు లార్జ్‌క్యాప్ షేర్లకు కేటాయిస్తుంటుంది. దీంతో ఈక్విటీ పెట్టుబడులకు రిస్క్ పరిమితంగా ఉంటుంది. ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ప్లాన్ ఎక్కువగా మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ తీసుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మాత్రం రిస్క్ తక్కువగా ఉంచే ఉద్దేశంతో లార్జ్క్యాప్పై దృష్టి పెడుతుంది. రాబడులు ఇలా ఉన్నాయ్... చిన్నారులకు ఉద్దేశించిన పథకాల కేటగిరీలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ స్డడీ ప్లాన్ రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. మూడు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో రాబడుల విషయంలో ఈ విభాగం బెంచ్‌మార్క్ రిటర్నుల కంటే 1–5 శాతం ఎక్కువే అందించింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 9 శాతం చొప్పున, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15 శాతం చొప్పున, పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున లాభాలను పంచింది. అయితే, ఏడాది కాలం పనితీరు విషయంలో మాత్రం ఈ కేటగిరీ కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. దీనికి కారణం డెట్ పెట్టుబడుల్లో అధిక భాగం 2017లో గడువు తీరిపోవడమే. అలాగే, డెట్ మార్కెట్లో ఆటుపోట్ల ప్రభావం కూడా రాబడులపై ఉంది. కానీ, స్వల్పకాలంలో పనితీరు అన్నది అంత ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఎందుకంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడి పథకం ఇది. 17 ఏళ్ల కాలంలో దీని పనితీరు చూసుకున్నా ఆకర్షణీయంగానే ఉంది. ఈ పథకం 2001లో ప్రారంభం కాగా, ఏటా 12.4 శాతం చొప్పున రాబడులు అందించింది. సంప్రదాయ ఇన్వెస్టర్లు, దీర్ఘకాల లక్ష్యాలతో ఇన్వెస్ట్ చేసే వారు ఈ పథకాన్ని నిశ్చింతగా ఎంచుకోవచ్చు. చార్జీలు ఇలా ఉంటాయ్... చిన్నారుల విద్యావసరాల కోసం ఉద్దేశించిన పథకం కావడంతో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే చార్జీలుంటాయి. నిర్ణీత కాలం కంటే ముందుగా వైదొలిగితే పెట్టుబడుల విలువపై 3 నుంచి 1 శాతం వరకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఏడాదిలోపు 3 శాతం, ఏడాది నుంచి రెండేళ్లలోపు 2 శాతం, రెండు నుంచి మూడేళ్లలోపు ఒక శాతం ఎగ్జిట్‌లోడ్ అమలవుతుంది. మూడేళ్లపాటు లేదా చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు ఈ రెండింటిలో ఏది ఆలస్యం అయితే అప్పటి వరకు లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. -
అస్థిరతల నడుమ స్థిరమైన రాబడులు
ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఆటుపోట్లకు నిలయాలు. ప్రపంచ పరిణామాలు, దేశీయ పరిణామాలన్నింటికీ ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అయితే, ఈ ప్రభావం అంతా స్వల్పకాలిక పెట్టుబడులపైనే అధికం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీలు రెండంకెల స్థాయిలో రాబడులు ఇచ్చినట్టు గణాంకాలు చూస్తే తెలు స్తుంది. కనుక రిస్క్ ఉన్నాగానీ, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా గణనీయమైన రాబడులు ఆశించేవారు, అదే సమయంలో ఆటుపోట్లు సైతం పరిమితంగా ఉండాలనుకునే వారు, బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ రాబడులను ఈ ఫండ్ అందించింది. పనితీరు ఐదేళ్ల కాలంలో ఈ ఫండ్ ఇచ్చిన రాబడులు వార్షికంగా సగటున 17.4 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో బెంచ్ మార్క్ నిఫ్టీ– 500 రాబడులు 14.8 శాతానికే పరిమితమయ్యాయి. అంటే ఈ పథకం రాబడులు ప్రామాణిక సూచీని మించి ఉన్నాయి. అదే పదేళ్ల కాలంలో రాబడులను గమనిస్తే సగటున వార్షికంగా 13.3 శాతం చొప్పున ఉన్నాయి. ఈ కాలంలో నిఫ్టీ– 500 రాబడులు 7.9 శాతమే. మూడేళ్ల కాలంలో 10.9 శాతం చొప్పున ప్రతిఫలాన్ని పంచింది. మధ్యస్థంగా రిస్క్ భరించేవారు, దీర్ఘకాలం పాటు కొనసాగేవారు ఈ ఫండ్‌ను పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆటుపోట్లు పెరిగి, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యూషన్లు అధిక స్థాయికి చేరిన ప్రస్తుత సమయంలో ఈ పథకం అనువైనది. ఇది ప్రధానంగా బ్లూచిప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. 2014లో ఈ ఫండ్ అసాధారణమైన పనితీరు చూపించింది. బెంచ్‌మార్క్ రాబడులు 35 శాతంగా ఉంటే, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ 53 శాతం రిటర్నులు ఇచ్చింది. అయితే, 2015, 2016 సంవత్సరాల్లో మాత్రం పనితీరులో వెనుకబడింది. బ్యాంకింగ్, ఐటీ రంగ స్టాక్స్ పెద్దగా రాణించకపోవడమే కారణం. ఈ పథకం ప్రధానంగా బ్యాంకు లు, ఐటీ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల అలా జరిగింది. అయితే, 2017లో మళ్లీ మెరుగైన ప్రదర్శన చూపించింది. బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కలిసొచ్చింది. గతేడాది 36.8 శాతం రాబడులు ఇచ్చింది. బెంచ్ మార్క్ పెరుగుదల 30.6 శాతంగానే ఉంది. బ్యాంకింగ్ రంగంలో రికవరీ, ఐటీ రంగం టర్న్ అరౌండ్ అయితే దీర్ఘకాలంలో ఫండ్ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం లేకపోలేదు. పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల విధానం ప్రాధాన్య రంగాలైన బ్యాంకింగ్, ఐటీతోపాటు కన్స్రక్షన్ ప్రాజెక్ట్స్, విద్యుత్ రంగం స్టాక్స్‌కు గడిచిన ఏడాదిలో ఎక్కువ కేటాయింపులు చేసింది. దాదాపు 60 శాతం పెట్టుబడులు ఈ నాలుగు రంగాల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఐదు స్టాక్స్ వాటాయే దాదాపు 40 శాతంగా ఉంది. దీర్ఘకాల దృష్టితో ఫండమెంటల్ స్టాక్స్‌లో ఎక్స్పోజర్కు ప్రాధాన్యం ఇస్తుంది. స్వల్ప కాల దృష్టితో ఇన్వెస్ట్ చేయదు. పెట్టుబడుల్లో మార్పు, చేర్పులు గమనిస్తే ఎస్బీఐలో ఎక్స్పోజర్ తగ్గించుకుని, గడిచిన నాలుగు నెలల కాలంలో యాక్సిస్ బ్యాంక్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంది. రిలయన్స్ నిప్పన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా చేర్చుకుంది. అలాగే, అవెన్యూ సూపర్‌మార్ట్స్, వేదాంత, టాటా కెమికల్స్, సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, కంటెయినర్ కార్పొరేషన్ స్టాక్స్‌ను కూడా యాడ్ చేసుకుంది. ఆటోమొబైల్స్, మీడియా ఎంటర్టైన్మెంట్, రవాణా, పెస్టిసైడ్స్ రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకుంది. మారుతి సుజుకీ, నెట్వర్క్ 18, అదానీ పోర్ట్స్‌లో లాభాలను స్వీకరించింది. అలాగే, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, ఎన్‌హెచ్‌పీసీ, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ స్టాక్స్‌లో గడిచిన ఏడాదిలో పెట్టబడులను పూర్తిగా వెనక్కి తీసేసుకుంది. మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 22 శాతం పెట్టుబడులను కేటాయించింది. టాప్ హోల్డింగ్స్ స్టాక్ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 10.1 లార్సన్ అండ్ టూబ్రో 9.80 ఎస్బీఐ 9.43 ఇన్ఫోసిస్ 7.54 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5.97 ఆర్ఐఎల్ 3.73 బాలకృష్ణ ఇండస్ట్రీస్ 3.14 యాక్సిస్ బ్యాంకు 2.72 సీఈఎస్సీ 2.68 గెయిల్ 2.50 -
రిస్కు తీసుకున్నా.. తీసుకోకున్నా..!
♦ ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు బెటరే!! ♦ అందరికన్నా అగ్రెసివ్ ఇన్వెస్టర్లకే కాస్త అధిక లాభం ♦ అల్ట్రా సేఫ్ ఇన్వెస్టర్లకు కూడా 10–12 శాతం రాబడి ♦ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో కొన్ని వర్గాలకు అధిక లాభం ♦ వీటన్నిటికీ అదనంగా పన్ను మినహాయింపు కూడా ♦ రెండేళ్లుగా ఎన్‌పీఎస్‌లో పెరుగుతున్న చందాదారులు ♦ బాండ్ ఫండ్స్ నిర్వహణలో ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ టాప్ ప్రస్తుతం ఉద్యోగుల్లో ప్రైవేటు రంగం వారే ఎక్కువ. స్వయం ఉపాధిపై ఆధారపడ్డవారూ అధికమే. ప్రభుత్వ ఉద్యోగుల్లా వీరికి పదవీ విరమణ తరవాత పింఛను లాంటి సౌకర్యాలేవీ ఉండవు. పీఎఫ్ నుంచి పింఛను వచ్చినా... అది మనకయ్యే ఖర్చుల్లో కనీసం 10 శాతానికి కూడా సరిపోదు. మరేం చెయ్యాలి? పదవీ విరమణ తరవాత జీవనం ఆటుపోట్లకు గురికాకుండా నిలకడగా, నిశ్చింతగా కొనసాగాలంటే ఆర్థికపరమైన ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఇందుకు సమాధానమే మార్కెట్లో లభిస్తున్న పింఛను పథకాలు. వాటిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పింఛను నిధి నియంత్రణ, ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తున్న ఎన్పీఎస్ ఒకటి. కొన్నాళ్ల కిందట విధుల్లో చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పింఛను పథకం కిందే కొనసాగుతున్నారు. దీన్లో ప్రైవేటు వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. నిజానికి దీన్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పలు ఆప్షన్లున్నాయి. ఈక్విటీ, డెట్ ఫండ్స్ కలబోతగా ఉన్న వివిధ విభాగాలు, వాటిలో రాబడుల గురించి తెలియజేసేదే ఈ కథనం. ఎన్పీఎస్ పథకాన్ని తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసమే తీసుకొచ్చారు. ఎనిమిదేళ్ల కిందట ఇతరులను కూడా ఈ పథకంలో పెట్టుబడి చేయటానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, పెద్దగా ఆదరణ పొందింది లేదు. గత రెండేళ్లుగా మాత్రం దీని పట్ల క్రమంగా ఆదరణ కనిపిస్తోంది. ఎందుకంటే? ఎన్‌పీఎస్‌లో స్వచ్ఛందంగా చేరిన 4.39 లక్షల చందాదారుల్లో 80 శాతం మంది గత రెండేళ్లలో వచ్చిన వారే. 5.85 లక్షల కార్పొరేట్ చందాదారుల్లోనూ 75 శాతం మంది గత నాలుగేళ్లలో దీన్లో సభ్యులైన వారే. ఈ పథకం కింద లభిస్తున్న పన్ను ప్రోత్సాహకాలు వీరిని ఆకర్షించాయనడంలో సందేహం అక్కర్లేదు. రూ.50 వేల వరకూ పన్ను లేదు ఎన్‌పీఎస్‌లో పెట్టే పెట్టుబడులు ఒక ఏడాదిలో రూ.50,000 వరకూ సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద అదనంగా పన్ను మినహాయింపును కల్పిస్తూ కేంద్ర సర్కారు రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకోవడమే దీనికి ఆదరణ పెరగటానికి ప్రధాన కారణం. సెక్షన్ 80సీ కింద ఒక ఏడాదిలో నిర్దేశిత పథకాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్పీఎస్ను కూడా దీనిలో భాగంగానే చూసేవారు. కానీ రెండేళ్ల కిందట... ఎన్‌పీఎస్‌లో వార్షికంగా పెట్టే రూ.50 వేల వరకూ మొత్తానికి అదనపు పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది అధిక పన్ను పరిధిలో ఉన్న వారిని ఆకర్షించింది. దీంతో ఈ పథకంలో స్వచ్ఛందంగా చేరే సభ్యుల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగి 86,774 నుంచి 2.15 లక్షలకు చేరింది. 2016 బడ్జెట్ సందర్భంగా ఎన్పీఎస్ నిధి ఉపసంహరణ సమయంలో 40 శాతంపై పన్ను లేదంటూ ప్రభుత్వం ప్రకటించడం మరింత ఆకర్షణీయమయింది. అవ్యవస్థీకృత రంగం నుంచి చందాదారులు రెట్టింపై 4.39 లక్షలకు చేరారు. పెట్టుబడులకు పలు అవకాశాలు ఎన్‌పీఎస్‌లో చేరేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నా... ఇందులో అందుబాటులో ఉన్న వాటిలో ఏది ఎంచుకోవాలన్నది అయోమయంగా ఉంటోంది. దీని నిర్వహణకు దాదాపు ఏడు ఫండ్లు, రిస్క్ ఆధారంగా వివిధ రకాల పెట్టుబడి తరగతులు ఉండడమే ఇందుకు కారణం. ఇందులో ఈక్విటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు అని మూడు వర్గాలున్నాయి. అసలు రిస్క్ భరించడానికి ఇష్టపడని (అల్ట్రాసేఫ్) ఇన్వెస్టర్లు 60 శాతం పెట్టుబడులు గిల్ట్ ఫండ్స్‌లో (ప్రభుత్వ బాండ్ల), 40 శాతం కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారనుకుందాం. కొద్దిగా రిస్క్ తీసుకోగల సంప్రదాయ ఇన్వెస్టర్లు (కన్సర్వేటివ్) 20 శాతం స్టాక్స్‌లో, 30 శాతం కార్పొరేట్ బాండ్స్‌లో, 50 శాతం గిల్ట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారని అనుకోవచ్చు. మూడింటిలోనూ 33.3 శాతం చొప్పున సమానంగా పెట్టుబడులు పెట్టే బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్లు మరో రకం. ఇక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 50 శాతం స్టాక్స్‌లో, 30 శాతం కార్పొరేట్ బాండ్లలో, 20 గిల్ట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. వీరి విషయంలో రాబడులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అల్ట్రాసేఫ్ ఇన్వెస్టర్లు ఎన్‌పీఎస్‌లో బాండ్ ఫండ్స్ గత ఏడాదిలో 12 శాతం రాబడులనిచ్చాయి. కానీ, గడిచిన ఆరు నెలల్లో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. వడ్డీ రేట్ల నిర్ణయంలో ఆర్బీఐ కఠిన వైఖరి కారణంగా బాండ్ ఈల్డ్స్ పెరిగిపోవడంతో బాండ్ ఫండ్ల ఎన్ఏవీలు తగ్గిపోయాయి. అంతకుముందు వరకూ ఈ ఫండ్స్ పనితీరు చక్కగా ఉంది. 2015–16లో ఆర్బీఐ రేట్ల కోత, డీమోనిటైజేషన్ ఫలితంగా బాండ్ ఫండ్స్ మంచి రాబడులను ఇచ్చాయి. వీటిలో పెట్టుబడులు పెట్టిన వారు గణనీయమైన రాబడులనే పొందారు. ఏ ఫండ్ బెటర్? ఈ విభాగంలో ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ మంచి పనితీరుతో ముందుంది. బాండ్ మార్కెట్లో ఎల్ఐసీకి అపార అనుభవం ఉండడం ఇందుకు కలిసొచ్చింది. గిల్ట్ ఫండ్స్ దీర్ఘకాల వ్యవధి గల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక వడ్డీ రేట్లపై వీటి రాబడులు ఆధారపడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడులతో పోలిస్తే గిల్ట్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రాబడులు ఇటీవలి కాలంలో చాలా తక్కువగానే ఉన్నాయి. సంప్రదాయ ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు నూరు శాతం పెట్టుబడులను డెట్ విభాగంలోనే పెడితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మెరుగైన రాబడులను ఆర్జించడం కష్టం. అందుకే పెట్టుబడుల్లో కనీసం కొంతయినా ఈక్విటీలకు కేటాయించాలని నిపుణులు సూచిస్తుంటారు. ఎన్‌పీఎస్‌లో 20 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, 80 శాతం డెట్‌కు (గిల్ట్, కార్పొరేట్ బాండ్లు) కేటాయించే వారు కూడా మంచి రాబడులనే అందుకున్నారు. స్వల్ప కాలంలో డెట్ విభాగం రాబడులు పడకేసినప్పటికీ... మధ్య కాలం, దీర్ఘకాలంలో మాత్రం పనితీరు బాగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏ ఫండ్ బెటర్? ఈ విభాగంలోనూ ఎల్ఐసీ పెన్షన్ ఫండే మంచి పనితీరును ప్రదర్శించింది. ఎందుకంటే 80 శాతం పెట్టుబడులు డెట్ విభాగానికి చెందినవి కావడమే. గత మూడేళ్లలో చూస్తే సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టేవారికి రాబడులు 10.25 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎన్పీఎస్ విభాగంలో కూడా సంప్రదాయ ఇన్వెస్టర్లకు (ఈక్విటీలకు 15 శాతమే కేటాయించేవారు) సంబంధించి రాబడులు గత ఐదేళ్లుగా ఈపీఎఫ్ కంటే రెండు శాతం అధికంగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ మంచి రాబడులనిచ్చిన ఫండ్‌గా నిలిచింది. అయితే, ఈ పనితీరే భవిష్యత్తులోనూ ఉంటుందని చెప్పలేం. బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్లు ఈక్విటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో 33.3 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టేవారికి రాబడులు పైన చెప్పుకున్న అల్ట్రాసేఫ్, సంప్రదాయ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువే ఉన్నాయి. ఏడాది క్రితం వరకూ బాండ్ల మార్కెట్లలో ర్యాలీ, తర్వాత ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ వీరికి కలసి వచ్చింది. దీనివల్ల ఇటీవలి కాలంలో బాండ్ల విభాగంలో రాబడులు తగ్గినప్పటికీ... ఈక్విటీల్లో గణనీయమైన రాబడులు వాటిని కవర్ చేసేశాయి. ఏ ఫండ్ బెటర్? ఈ విభాగంలో రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్ మంచి పనితీరును చూపింది. గత ఆరు నెలల్లో 14.03 శాతం రాబడులను ఇచ్చింది. కోటక్ పెన్షన్ ఫండ్ మాత్రం దీర్ఘకాలంలో ఆకట్టుకునే రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో సిప్ పెట్టుబడులపై రాబడులు 10.39 శాతంగా, ఐదేళ్ల కాలంలో సిప్పై రాబడులు 11.22 శాతంగా ఉన్నాయి. అగ్రెసివ్ ఇన్వెస్టర్లు ఈక్విటీలకు 50 శాతం, మిగిలిన 50 శాతం గిల్ట్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌కు కేటాయించే రిస్క్ ఇన్వెస్టర్లు ఎన్‌పీఎస్‌లో అధిక రాబడులను అందుకుంటున్నారు. మార్కెట్ జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతుండడం ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ విభాగంలో కోటక్ పెన్షన్ ఫండ్ గడిచిన ఏడాది కాలంలో సగటున 16.3 శాతం రాబడులనిచ్చింది. యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ గడిచిన ఐదేళ్ల కాలంలో చూస్తే సిప్ పెట్టుబడులపై 11.78 శాతం సగటు రాబడులతో ముందుంది. ఏ ఫండ్ బెటర్? వాస్తవానికి యుక్తవయస్సులో ఉన్న వారు అధిక రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీరు 75 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించగలరు. వీరు అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్‌ను ఎంచుకున్నట్టయితే గడిచిన ఆరు నెలల్లో 10.8 శాతం రాబడులు అందుకునే వారు. ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయింపులు చేసేందుకు అగ్రెసివ్ లైఫ్‌సైకిల్ ఫండ్, కేవలం 25 శాతమే ఈక్విటీలకు కేటాయింపులు చేసే కన్జర్వేటివ్ లైఫ్‌సైకిల్ ఫండ్ అంటూ గతేడాది ఎన్‌పీఎస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. అగ్రెసివ్ లైఫ్‌సైకిల్ ఫండ్‌లో ఇన్వెస్టర్‌కు 35 ఏళ్లు వచ్చిన తర్వాత ఏటా ఈక్విటీలకు 4 శాతం చొప్పున తగ్గించుకుంటూ వెళ్లడం జరుగుతుంది. 45 ఏళ్లు వచ్చిన తర్వాత 3 శాతం చొప్పున తగ్గుతూ వెళుతుంది. -
గ్లోబల్ ఫండ్స్ ఎవరి కోసం..?
ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పించే వేదికే గ్లోబల్ ఫండ్స్. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఏ గ్లోబల్ మార్కెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండ్స్‌తో డైవర్సిఫికేషన్.. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు గ్లోబల్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ విస్తృతి పెరుగుతుంది. అప్పుడు మనకు నచ్చిన వాటిల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్లన్నీ ఒకే దిశలో పయనించవు. కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. అందుకే గ్లోబల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మార్కెట్ల అస్థిరతల నుంచి పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవచ్చు. ప్రయోజనాలు: ⇔ మనకు అనువైన గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చెయొచ్చు. ⇔ దేశీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఒక్కో దేశపు మార్కెట్లు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటాయి. దీంతో రిస్క్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రతికూలతలు: కరెన్సీ ప్రభావం: ఫండ్ పనితీరుతో నిమిత్తం లేకుండా గ్లోబల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్‌ను ఆయా దేశాల కరెన్సీ బాగా ప్రభావితం చేస్తుంది. ప్రాంతీయ రాజకీయాలు: ఇన్వెస్ట్ చేసే ప్రాంతాల్లో ఏవైనా రాజకీయ సమస్యలు ఉత్పన్నమైతే వాటి ప్రభావం గ్లోబల్ ఫండ్స్ రాబడిపై ప్రతికూలంగా ఉండొచ్చు. అలాగే ఆయా దేశాల్లో వరదలు, భూకంపాలు వంటి ఇతర ప్రమాదాలు సంభవించినా కూడా వాటి ప్రభావం ఫండ్ రాబడిపై పడొచ్చు. ఈ విషయాలు మరువొద్దు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ ఉండాలి. ఈ విధంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఆ ఫండ్ మనకు సరిపోతుందా? లేదా? అని ఒక నిర్ణయానికి రావాలి. అలాగే ఫండ్ ఎంటర్, ఎగ్జిట్ లోడ్ తదితర చార్జీల వివరాలు తెలుసుకోవాలి. -
ఈక్విటీలో ఈపీఎఫ్ఓ పెట్టుబడి సరైనదేనా?
ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 5 శాతం నుంచి 10 శాతానికి పెంచనున్నదని ఇటీవలే ఒక వార్త చదివాం. ఇలా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెంచడం వల్ల ఈపీఎఫ్ఓ సభ్యులుగా మాకేమైనా ప్రయోజనం కలుగుతుందా ? స్టాక్ మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కాబట్టి నష్టాలు వస్తే, ఆ ప్రభావం మాకు వచ్చే రాబడులపై ఏమైనా ఉంటుందా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒడిదుడుకులుంటాయి కాబట్టి ఆందోళన చెందుతున్నాం. సరైన వివరణ ఇవ్వండి? - రమేశ్, సురేశ్, హైదరాబాద్ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడం వల్ల మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఈక్విటీల్లో పెట్టుబడులను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ఓకు దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయని చెప్పవచ్చు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై గత ఏడాది ఈపీఎఫ్ఓకు 13.24 శాతం రాబడులు వచ్చాయి. ఈ రాబడులు, దీనిపై చక్రవడ్డీ కలుపుకొని మీకు, మీరు రిటైరయ్యేనాటికి మంచి రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. 5-7 ఏళ్ల కాలానికి మించి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని భావిస్తున్నాం. కాకుంటే ఈక్విటీ మార్కెట్లో ఎక్కువగా ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈక్విటీల్లో ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్స్ వద్దని విమర్శకులు అంటూ ఉంటారు. స్వల్పకాలంలో ఈక్విటీలు ఒడిదుడుకులకు గురవుతాయనే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ దీర్ఘకాలంలో మాత్రం మంచి రాబడులే వస్తాయి. ఉదాహరణకు గత పదేళ్ల కాలంలో వివిధ ఇన్వెస్ట్మెంట్ విధానాల్లో రాబడులను చూస్తే, పదేళ్ల క్రితం రూ.లక్ష ను ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుతం రూ.2.48 లక్షలు వస్తాయి. ఇదే లక్షను నిఫ్టీ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రూ.3.9 లక్షల వరకూ వచ్చేవి. ఈ పదేళ్ల కాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తడం, దీర్ఘకాలం పాటు మార్కెట్ స్తబ్ధుగా ఉండటం వంటి ప్రతికూలతలు ఉన్నా, ఈక్విటీలు మంచి రాబడులనే ఇచ్చాయి. అందుకని దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయని చెప్పొచ్చు. నేను ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ప్లాన్ అంతంత మాత్రమే రాబడులను ఇచ్చింది. ఈ యులిప్ నుంచి వైదొలుగుదామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? - కౌశిక్, విశాఖపట్టణం ఈ తరహా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించడం సరైన నిర్ణయం కాదు. మీ భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవాలంటే ఈ యులిప్ నుంచి వైదొలగడమే మంచిది. ఈ యులిప్ నుంచి బయటకు రావాలన్న మీ నిర్ణయం సరైనదే. యులిప్‌లు భారీగా చార్జీలను వసూలు చేస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాన్ల ప్రారంభ సంవత్సరాల్లో ఈ చార్జీల వడ్డింపు అధికంగానే ఉంటుంది. అందుకని మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి ఈ చార్జీలన్నింటినీ మినహాయిస్తే, మీ నికర ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీకు వచ్చే రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరిచినప్పటికీ, అధిక చార్జీల భారం కారణంగా మీరు పొందే రాబడులు చెప్పుకోదగిన స్థాయిలో ఉండవు. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్, బీమా కలగలసిన పాలసీల్లో ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీలు తీసుకోండి. వీటిల్లో ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటాయి. ఇక పిల్లల చదువు, రిైటైర్మెంట్ అవసరాలు, సొంత ఇల్లు అమర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం (కనీసం ఐదేళ్లకు మించి) ఇన్వెస్ట్ చేయండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. రూ.5 లక్షల వరకూ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ నెలా నెలా కొంత మొత్తం నా జీతంలో కోత విధిస్తున్నారు. ఇది కాకుండా మరో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మేలని మిత్రులంటున్నారు. మరో హెల్త్ పాలసీ తీసుకోవలసిన అవసరం ఉందా? - కార్తీక్, వరంగల్ మీకు మీ కంపెనీ తరపున మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, మరో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిదే. మీరు సదరు కంపెనీలో కొనసాగినంత వరకే మీ కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఏదైనా కారణాల వల్ల మీరు ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తే ఈ పాలసీ వర్తించకపోయే అవకాశాలు ఉండవచ్చు. మీరు ఉద్యోగం వదిలివేసినా, లేదా రిటైరైనా ఈ పాలసీ వర్తించదు. రిటైరైన తర్వాతనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరం అధికంగా ఉంటుంది. ఇక 50 దాటాకా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అప్పటికే ఏవైనా రోగాలుంటే వాటికి కవరేజ్ ఉండదు. మీ కంపెనీ ద్వారా మీరు తీసుకున్న బీమా పాలసీ మీ కుటుంబ సభ్యులందరినీ కవర్ చేసేలా ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. అందుకని మీ కుటుంబ సభ్యులందికీ వర్తించేలా ఒక సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిదే. -
ఎగిసే మార్కెట్లలో.. ఆచితూచి పెట్టుబడి
మార్కెట్లు ఒక్కసారిగా ఎగిసేటప్పుడు.. పెట్టుబడి అవకాశాలు కోల్పోతామేమో అన్న ఆందోళనతో తొందరపడొద్దని ఇన్వెస్టర్లకు సూచించారు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ అజయ్ త్యాగి. షేర్లు కొనుగోలు చేసేందుకు మధ్య మధ్యలో వచ్చే కరెక్షన్లను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు.. మార్కెట్లు కాస్త గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తుంటారని, మార్కెట్లు ఏమాత్రం కరెక్షన్కు లోనైనా ఇన్వెస్ట్ చేయడానికి జంకుతుంటారని త్యాగి తెలిపారు. అయితే ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడైనా సరే ఒక 5-10 శాతం మేర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయన్నది ఇన్వెస్టర్లు గుర్తెరిగి వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇటీవలి ర్యాలీలో కొన్ని షేర్లను చూస్తే.. పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) నిష్పత్తికి దాదాపు ఇరవై రెట్లు అధిక స్థాయికి చేరాయని, మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగినప్పుడు అకస్మాత్తుగా కరెక్షన్లకు లోనవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని త్యాగి పేర్కొన్నారు. ఇక, బ్యాంకుల విషయానికొస్తే... మొండిబకాయిలు మొదలైన వాటి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)పై ప్రతికూల ధోరణే ఉందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు నిధులు సమీకరించి.. వృద్ధికి వినియోగించుకోనుండగా.. పీఎస్‌బీలు తాము సమీకరించే నిధులను ఖాతాల ప్రక్షాళనకు ఉపయోగించుకోవాల్సి రావొచ్చని త్యాగి తెలిపారు. -
అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు
ముంబై: సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరికి స్వల్పనష్టాలతో ముగిసాయి. సెన్సెక్స 48.74 పాయింట్ల నష్టంతో 28,003, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 8,636.55 దగ్గర ముగిసింది. లాభాల స్వీకరణ,ఆయిల్ ధరల్లో క్షీణతనుమార్కెట్లను నష్టాల్లోకి తీసుకెళ్లాయి. అమ్మకాల ఒత్తిడి, తక్కువ ముడి చమురు ధరలు, రెండు రాబోయే ప్రపంచ సంఘటనల పై మార్కెట్ నెగిటివ్ గా స్పందించింది. దీంతో సోమవారం భారత ఈక్విటీ మార్కెట్ లోని కీలక సూచీలు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రారంభంలో అన్ని వైపులనుంచీ పెరిగిన కొనుగోళ్లతో ప్రామాణిక సూచీ సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. వెరసి గరిష్టంగా 28,285కు చేరింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 8,700ను అధిగమించింది. ఇది 15 నెలల గరిష్టంకాగా, మిడ్‌సెషన్ నుంచీ ట్రేడర్లు లాభాల స్వీకరణకు ఉపక్రమించడంతో మార్కెట్లు వెనకడుగు వేశాయి. బ్యాంకు షేర్లు బేర్.. ఆదుకున్న ఐటీ ప్రధానంగా బ్యాంకు షేర్లలో అమ్మకాలు మార్కెట్లను దెబ్బకొట్టాయి. ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఐటీ కౌంటర్లకు డిమాండ్ పుట్టడంతో ఈ రంగం 2 శాతంపైగా ఎగసింది. ఈ బాటలో మెటల్స్, మీడియా, ఆటో రంగాలు 1.5-0.6 శాతం మధ్య పురోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్, మారుతీ, ఇండస్ఇండ్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో 3.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు ఐసీఐసీఐ 5 శాతం, ఎల్అండ్టీ 4 శాతం చొప్పున పతనమై మార్కెట్లను వెనక్కిలాగాయి. క్యూ1 ఫలితాలు నిరాశపరచడం దీనికి కారణమైంది. మిగిలిన దిగ్గజాలలో భెల్, బీవోబీ, అదానీ పోర్ట్స్, బాష్, కొటక్ బ్యాంక్, ఐడియా, లుపిన్, స్టేట్‌బ్యాంక్ 2.7-0.7 శాతం మధ్య నీరసించాయి. -
కొన్నా.. అమ్మినా.. ఆప్షన్ మీదే!
ఉమెన్ ఫైనాన్స్ / ఆప్షన్స్ ఈక్విటీ మార్కెట్లో షేర్లలో పెట్టుబడి పెట్టాలంటే ఆ షేర్ విలువ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని చెల్లించి ఆ షేర్లను పొందవలసి ఉంటుంది. అలాగే కొన్న తర్వాత వాటి విలువ తగ్గితే మూలధనాన్ని కూడా నష్టపోవలసి వస్తుంది. అలాగే కొంతమందికి పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో షేర్లు కొనడానికి డబ్బు అందుబాటులో లేకపోవచ్చు. వీటన్నిటికీ పరిష్కారమే ‘డెరివేటివ్స్’ . డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం. ఈవారం అప్షన్స్పై అవగాహన కలిగించుకుందాం. ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేవి ఇండెక్స్, షేర్ మార్కెట్ ధర మీద ఆధారపడి ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని సరిగా అవగాహన చేసుకొని ట్రేడ్ చేస్తే మంచి లాభాల పొందవచ్చు. అలాగే ఏ మాత్రం తేడా జరిగినా భారీగా నష్టపోవలసి వస్తుందని గ్రహించాలి. మరీ ముఖ్యంగా ఆప్షన్స్‌ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు ఈ ఆప్షన్స్ ఎలా పని చేస్తాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? వీటిలో ఉన్న రిస్క్ ఏమిటో చూద్దాం. ఆప్షన్స్‌లో రెండు రకాలు ఉన్నాయి. 1. కాల్ ఆప్షన్. 2. పుట్ ఆప్షన్. ఆప్షన్స్‌ని కొనేవారు ఏ షేర్ / ఏ ఇండెక్స్నైతే కొంటున్నారో ఆ షేరు / ఇండెక్స్ రేటు మొత్తాన్ని చెల్లించనవసరం లేదు. ఆ ఆప్షన్‌కి ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఎటువంటి మార్జిన్ మొత్తాన్ని కూడా చెల్లించనవసరం లేదు. అదే ఆప్షన్స్ అమ్మేవారైతే ఆ ప్రీమియం మొత్తాన్ని వారు పొందుతారు. కానీ వారు ఆ ఆప్షన్‌కు ఉన్నటువంటి మార్జిన్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఆప్షన్ అమ్మడం అనేది చాలా రిస్కుతో కూడుకున్నటువంటిది. కాల్ ఆప్షన్ : ఈ ఆప్షన్ని కొనేవారు తాము తీసుకున్న షేరు / ఇండెక్స్.. స్ట్రైక్ ధర కన్నా పెరిగితే లాభపడతారు. ఒకవేళ తగ్గితే ఎటువంటి మొత్తాన్నీ చెల్లించనవసరం లేదు. కాకపోతే తాము కట్టిన ప్రీమియం సొమ్ము వెనక్కు రాదు. ఆ మొత్తాన్ని వారు నష్టపోతారు. అంటే కాల్ ఆప్షన్ తీసుకున్నవారికి గరిష్టంగా ఎంత నష్టపోతారనేది కచ్చితంగా తెలుస్తుంది. అదే కాల్ ఆప్షన్ అమ్మేవారైతే ఎంతైతే ప్రీమియం పొందుతారో ఆ సొమ్ము మాత్రమే వారి గరిష్ట లాభంగా ఉంటుంది. నష్టపోవలసి వస్తే మాత్రం అది అపరిమితంగా ఉంటుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
పసిడి మెరుపుపై అమెరికా ఫెడ్ నీడ: నిపుణులు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్.. ఫండ్ రేటును పెంచుతుందన్న అంచనాలు అంతర్జాతీయంగా పసిడిపై ఒకపక్క ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తుండగా... దేశీయంగా మార్కెట్ జరుపుతున్న ర్యాలీ ప్రభావమూ ఈ విలువైన మెటల్‌పై కనబడుతోంది. సమీపకాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ఔన్స్ (31.1గ్రా) ధర వారంవారీగా శుక్రవారం అంతక్రితం వారంతో పోల్చితే 16 డాలర్లు తగ్గి 1,213 డాలర్లకు చేరింది. గతవారం కూడా ధర దాదాపు 21 డాలర్లు పడిపోయింది. మూడు వారాల క్రితం దాదాపు 1,300 డాలర్లకు చేరిన ధర.. ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో భారీగా పడిపోవడం గమనార్హం. గతనెల్లో సమావేశమైన అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశ మినిట్స్ వివరాల ప్రకారం- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆందోళనలు కొంత తగ్గుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత ఆశావహంగా ముందుకు నడిచే అవకాశం ఉంది. ఫెడ్ అభిప్రాయాల నేపథ్యంలో- త్వరలో ఫండ్ రేటు ప్రస్తుత 0.50 శాతం స్థాయి నుంచి పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీపకాలంలో పసిడిలో అమ్మకాల ఒత్తిడి నెలకొన వచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డాలర్ బలపడిన ప్రభావం సైతం రెండు వారాలుగా పసిడిపై ప్రభావం చూపిస్తోంది. దేశీయంగా రూ.1,000 డౌన్... ఇక దేశీయంగా పసిడికి కొనుగోలు మద్దతు కొరవడింది. దీనికితోడు అంతర్జాతీయ ప్రభావం, ఈక్విటీ మార్కెట్ల పరుగుకూడా దేశీయంగా పసిడి ధరను వెనక్కు నెడుతున్న అంశం. ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా భారీగా రూ.1,000 (3.34 శాతం) తగ్గింది. రూ.28,905 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ.28,775 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీకి రూ.1,040 (3 శాతం) పడిపోయి రూ.39,355 వద్ద ముగిసింది. -
ఆ కారణాలతోనే పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సోమవారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో శుక్రవారం ప్రకటించిన రిలయన్స్ ఫలితాలతో మార్కెట్ పుంజుకుంటుందని భావించిన ఇన్వెస్టర్లు నిరాశకు లోనయ్యారు. ఆసియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, దేశీయ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్, పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో మిడి సెషన్ లో 240 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రధానంగా ఆయిల్, బ్యాంకింగ్ , ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టాల్లో ముగిసాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను చవిచూశాయి. అయితే చివరలో కొద్దిగా కోలుకుని సెన్సెక్స్ 159 పాయింట్ల నష్టంతో 25,678దగ్గర , నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 7,855 దగ్గర క్లోజ్ అయింది. ఒక వైపు మార్కెట్ దిగ్గజం రిలయన్స్ మెరుగైన ఫలితాలను నమోదు చేసినా మార్కెట్ లో ఆ షేర్ పతనం ఇన్వెస్టర్లను గందరగోళంలో పడేసింది. మరోవైపు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో మన మార్క్టెట్లు పతనం దిశగా పయనించాయి. ఈ నెల 27-28 లలో జరగనున్న పెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు భారత్ సహా, వివిధ దేశాల్లో ఆయిల్ ధరల పతనం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్యపరపతి విధానం సమీక్ష నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. లాభాల స్వీకరణ, లాంగ్ పొజిషన్ల నుంచి పెట్టుబడిదారుల ఉపసంహరణ లాంటి అంశాలు మార్కెట్లను నష్టాల్లోకి లాక్కెళ్లాయి. ఇది ఇలా వుంటే ఈక్విటీ మార్కెట్ల పతనంతో పసిడి ధరలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
మార్కెట్లలో అస్థిరత ఉంటే.. అసెట్ అలొకేషన్ ఫండ్లే మందు!!
ఈక్విటీ మార్కెట్ అంటే రిస్కు సహజం. అందుకే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు, అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉ ండాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరత నుంచి తప్పించుకోవాలంటే ‘డైనమిక్ అసెట్ అలొకేషన్’ వ్యూహం సరైనదని చెప్పొచ్చు. అసెట్ కేటాయింపులు ఇలా... చాలా మంది ఇతరులను అనుసరిస్తుంటారు. అది సరికాదు. బయటైనా, స్టాక్ మార్కెట్లోనైనా. తమకు తెలిసిన వారు షేర్లు అమ్మేస్తున్నారు కదా అని వీరు కూడా స్టాక్స్ అమ్మేస్తారు. అలాగే అందరూ కొంటున్నారు కదా అని వీరు కూడా కొనేస్తారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు. సరైన ప్లానింగ్ లేకుండా ఇలా చేస్తే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అసెట్ అలొకేషన్ వ్యూహాన్ని అనుసరించాలి. అసెట్ అలొకేషన్ వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. ఇన్వెస్ట్మెంట్ల నుంచి సెంటిమెంట్‌ను తరిమేయొచ్చు. దీంతో మనం మార్కెట్ బాగులేనపుడు స్టాక్స్‌ను అమ్మేయడం, బాగున్నప్పుడు కొనడం వంటి చర్యలకు దూరంగా ఉంటాం. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సాయంతో ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. డైనమిక్ రీ-బ్యాలెన్సింగ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో తక్కువ కొనడం, ఎక్కువ అమ్మడం అనే విధానాన్ని గమనిస్తాం. ఇక్కడ మన సెంటిమెంట్లతో సంబంధం ఉండదు. ఈక్విటీ మార్కెట్స్ ఆశాజనకంగా లేనప్పుడు (పడ్డప్పుడు) అందులో ఇన్వెస్ట్‌చేసి, పెరుగుతున్నప్పుడు కొన్ని షేర్లను విక్రయించి లాభాలను స్వీకరించవచ్చు. ఫండ్ నిబంధనల ప్రకారం అసెట్ అలొకేషన్స్ను మార్చుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్‌ను తీసుకుంటే.. ఇందులో రీ-బ్యాలెన్సింగ్ ప్రతిరోజూ జరుగుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీల వాటా షేర్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు 30 శాతంగా, ధరలు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు 80 శాతంగా ఉంటుంది. దీని కోసం ఫండ్ కొన్ని ప్రమాణాలను అవలంబిస్తూ ఉంటుంది. సాధారణంగా అందరికీ తెలిసిన సూత్రం... ‘ప్రైస్-బుక్ వేల్యూ’. ఈక్విటీల ప్రైస్-టు-బుక్‌వేల్యూ ఆధారంగా మార్కెట్ స్థితిని అంచనా వేయవచ్చు. పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు సంబంధించి డైన మిక్ అసెట్ అలొకే షన్ ఫండ్స్ ప్రతిరోజూ ప్రైస్-బుక్ వేల్యూను గమనిస్తాయి. దీని ప్రకారమే అసెట్స్‌ను రీ-బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఒకానొక రోజు బుక్ వేల్యూ అనుకున్న స్థాయికి కన్నా దిగువకు వచ్చినప్పుడు ఫండ్ తర్వాతి రోజు ఎక్కువ ఈక్విటీలను కొంటుంది. బుక్ వేల్యూ ఇంకా పడితే ఈక్విటీ కేటాయింపును పెంచుకుంటుంది. పోర్ట్‌ఫోలియోలోని మొత్తం ఈక్విటీ పరిమితిలోనే ఇదంతా జరుగుతుంది. ఇలా రోజూ రీ-బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల పోర్ట్‌ఫోలియో దృఢంగా తయారవుతుంది. ఫండ్స్ ప్రయోజనాలు మీరు ఈక్విటీ ఎంచుకున్నారా? ఫిక్స్డ్ ఇన్కమ్ మార్గాన్ని ఎన్నుకున్నారా? అనే దాంతో సంబంధం లేకుండా రిస్క్ ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యాల ఆధారంగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిద్వారా మార్కెట్లోకి అడుగుపెడితే ైడె వర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనే ప్రయోజనాలను పొందొచ్చు. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్లకు ప్రతిఫలం ఉంటుంది. ఇవి కొత్త ఇన్వెస్టర్లకు, ఒక రకంగా రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లకు మాత్రమే బాగుంటాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. సీహెచ్.రామ్ ప్రకాశ్ -
పుత్తడివైపు మళ్లీ ఇన్వెస్టర్ల చూపు..
న్యూయార్క్/ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు క్రమేపీ బలహీనపడుతుండటం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 2016లో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడంతో ఇన్వెస్టర్లు తిరిగి పుత్తడిలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని బులియన్ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు, ఈక్విటీలు క్షీణించగా, బంగారం ధర మాత్రం 10 శాతంవరకూ పెరిగింది. గత శుక్రవారం అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు బలహీనంగా వుండటంతో న్యూయార్క్ ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర ఒక్కసారిగా 16 డాలర్ల మేర పెరిగి 1,173 డాలర్ల స్థాయికి చేరింది. వరుసగా మూడు వారాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరుగుదలతో ముగియడం విశేషం. అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నదన్న సంకేతాలు ఈ జాబ్స్ డేటా ద్వారా అందాయి. దాంతో ఫెడ్ ఇక వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తక్కువేనన్న అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ నెలలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత ఇప్పటివరకూ అక్కడ పుత్తడి ధర 1,045 డాలర్ల నుంచి క్రమేపీ ర్యాలీ జరపడం గమనార్హం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తడం, అనిశ్చితి సమయాల్లో సురక్షిత ఆస్తిగా పుత్తడికి వున్న గుర్తింపు తాజా కొనుగోళ్లకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అలాగే అమెరికా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన గణాంకాలు అయోమయంగా వెలువడుతున్నందున, బంగారంలో ఇన్వెస్టర్లు ఇటీవలకాలంలో పెట్టుబడుల్ని పెంచుకుంటున్నారని విశ్లేషణా సంస్థ క్యాపిటల్ ఎకనామిక్ విడుదల చేసిన నోట్లో పేర్కొంది. అనిశ్చితి సమయాల్లో సురక్షిత సాధనంగా బంగారానికి వున్న గుర్తింపు తాజా కొనుగోళ్లకు కారణమని కామర్జ్ బ్యాంక్ కార్పొరేట్స్ అండ్ మార్కెట్స్ ఒక నోట్లో విశ్లేషించింది. అమెరికా డాలరు ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే క్రితం వారం బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం కూడా బంగారం పెరుగుదలకు సహకరించినట్లు కామర్జ్‌బ్యాంక్ పేర్కొంది. భారత్‌లో 8 నెలల గరిష్టస్థాయి... ఇక భారత్‌లో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే భారీగా రూ. 880 మేర పెరిగి రూ. 27,580 స్థాయికి చేరింది. ఇండియాలో ఈ ధర 8 నెలల గరిష్టం. అంతర్జాతీయ ట్రెండ్‌కు తోడు ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ మొదలుకావడంతో జ్యువెల్లర్స్ నుంచి పుత్తడికి డిమాండ్ ఏర్పడిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
పసిడి కళకు మార్కెట్ల ఊతం!
జాగ్రత్త తప్పదంటున్న నిపుణులు న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడికి కలిసి వచ్చింది. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఈ ఏడాది మొదటి నుంచీ స్థిరంగా ముందుకు కదులుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర కీలక స్థాయి 1,100 డాలర్లను దాటింది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫెడ్ ఫండ్స్ రేటును యథాతథంగా కొనసాగిస్తామని ఇటీవలి తన ప్రకటనలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ప్రకటించడం... మార్కెట్ల పతనాన్ని నివారించలేకపోవడంతో సమీప కాలానికి పసిడిని ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా భావించడమే పసిడి ప్రస్తుత పెరుగుదలకు కారణమని ప్రస్తుతం నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవే అంశాలు ఇకముందూ పసిడిని నడిపిస్తాయని వారి అంచనా. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఫెడ్ రేటు పెంపు అనంతరం పసిడి ధర క్రమంగా వెయ్యి డాలర్లలోపునకు పడిపోతుందని గత ఏడాది అంచనాలు వినిపించిన సంగతి తెలిసిందే. గడచిన వారాంతానికి పసిడి 1,118 వద్ద ముగియగా, వెండి 14 డాలర్లపైకి చేరింది. దేశీయంగా మూడు నెలల గరిష్టం... అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా పసిడి బలోపేతమవుతోంది. తాజాగా ముగిసిన వారంలో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ కాలంలో సహజంగానే పసిడికి డిమాండ్ కొంత ఉంటుందని, అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణి పసిడి ధరకు మరింత బలాన్ని ఇస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరగడం, పెళ్లిళ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో ముందస్తు కొనుగోళ్లు వంటి అంశాలు దేశీయంగా పసిడి డిమాండ్‌ను పెంచుతున్నాయి. వరుసగా నాల్గవ వారమూ లాభాల బాటన మెరిసింది. వారంలో పసిడి కదలికలను చూస్తే... పటిష్ట స్థాయిలో ప్రారంభమైన ధర... వారం మధ్యకు వచ్చే సరికి స్టాకిస్టులు, ట్రేడర్ల కొనుగోళ్ల మద్దతుతో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. అయితే అటు తర్వాత కొంత లాభాల స్వీకరణ జరిగింది. ఇదే సమయంలో ఈక్విటీలూ స్వల్పంగా మెరుగుపడ్డం గమనార్హం. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా రూ.320 ఎగసి రూ.26,700 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే మొత్తం ఎగసి రూ.26,550 వద్దకు చేరింది. ఇక వెండి కేజీకి రూ.275 ఎగసి రూ.34,920కి చేరింది. కాగా అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా కేంద్రం గత వారం పసిడి దిగుమతుల టారిఫ్‌ను పెంచింది. -
ప్రస్తుతానికి పసిడి అక్కడక్కడే
ఈ జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా తగ్గినా, పలు ఇతర కారణాల వల్ల బంగారం ధర కేవలం 3 శాతమే పెరిగిందని, సమీప భవిష్యత్తులో కూడా దాదాపు ఇదే స్థాయి వద్ద స్వల్ప హెచ్చుతగ్గులుండవచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడుతున్నా, బంగారానికి పెట్టుబడుల డిమాండ్ పెరగడం లేదని, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం కనిష్టస్థాయిలో వుండటం కూడా పసిడి తగినంతగా పెరగకపోవడానికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తులో ఈక్విటీ షేర్లు మరింతగా పతనమై, చైనా మాంద్యంలోకి జారుకుంటే వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కరెన్సీ ముద్రణను మొదలుపెడతాయని వారు అంచనావేశారు. దాంతో బంగారం ఔన్సు ధర 1,100 డాలర్లస్థాయి ఇన్వెస్టర్లకు చౌకగా కన్పిస్తుందని, ఆ సందర్భంలో మాత్రం పసిడి భారీ పెరిగే అవకాశాలుంటాయని వారు విశ్లేషించారు. గత వారం ముందడుగే: కాగా శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయంగా పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర స్వల్పంగా ఐదు డాలర్లు ఎగసి 1,096 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగా ముంబై స్పాట్ మార్కెట్లో 99.5 స్వచ్ఛత ధర శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.370 ఎగసి (1.42 శాతం) రూ.26,230 వద్దకు చేరింది. 99.9 స్వచ్ఛత ధర సైతం అంతే ఎగసి 26,380 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ.720 ఎగసి (2.12 శాతం) పెరిగి రూ. 34,645కు చేరింది. -
ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ నిధులు!
- ఈటీఎఫ్‌ల్లో 5 శాతం వరకూ నిధులు - 2015-16లోనే రూ.17,000 కోట్లు పంప్... - త్వరలో నిబంధనల నోటిఫై! న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ సంబంధిత పథకాలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిధులను మళ్లించడం దాదాపు ఖాయమయినట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి నియమనిబంధనలను త్వరలో కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతం వరకూ తొలుత ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే ఫండ్‌లోని దాదాపు రూ.17,000 కోట్లు ఈటీఎఫ్‌ల్లోకి మళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల్లో కూడా.... ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్‌మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2001లో భారత్‌లో ఈటీఎఫ్‌ల శకం ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్‌లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల హవా భారీగా ఉంది. -
రిస్క్ లేకపోతే డెట్ బెటర్
రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్నాయన్న స్పష్టమైన సంకేతాలు ఆర్బీఐ నుంచి వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి తోడు వృద్ధిరేటు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు తీసుకొంటుండటంతో వడ్డీరేట్లు ఇక తగ్గడమే కానీ పెరిగే అవకాశం లేదన్న విషయం స్పష్టమైంది. ఇటువంటి తరుణంలో మార్కెట్లో ఉన్న వివిధ డెట్ పథకాలు, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. ఈక్విటీ మార్కెట్లు ఒకపక్క దూసుకుపోతూ... నూతన గరిష్ట స్థాయిలు చేరుతున్నా... ఇప్పటికీ చిన్న ఇన్వెస్టర్లు దూరంగానే ఉంటున్నారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ పెట్టుబడులనేవి తీవ్ర ఒడిదుడుకుల లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా, గత అనుభవాలు ఇంకా మది నుంచి తొలగకపోవడమే. ఇలా రిస్క్ చేయలేని వారికి డెట్ పెట్టుబడులు అనువైనవి. వీటిల్లో కూడా రిస్క్ సామర్థ్యం ఆధారంగా పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల దగ్గర నుంచి ఆల్ట్రా షార్ట్‌టర్మ్ వరకు అనేక రకాల పెట్టుబడి సాధనాలున్నాయి. బ్యాంకు డిపాజిట్లు ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఇప్పటికే పలు స్వల్పకాలిక డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి. రానున్న కాలంలో వడ్డీరేట్లు ఇంకా బాగా తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై 8-9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉండటంతో ఇప్పుడు డిపాజిట్ చేసేవాళ్లు దీర్ఘకాలిక డిపాజిట్లను ఎంచుకోవడం ఉత్తమం. ప్రభుత్వ బాండ్లు వివిధ ప్రభుత్వ సంస్థలు వాటి అవసరాల కోసం దీర్ఘకాలిక బాండ్లను జారీ చేస్తుంటాయి. ఇవన్నీ రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. కనీస ఇన్వెస్ట్మెంట్ రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటాయి. ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్, ఇన్ఫ్రా, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అన్నీ వీటి కోవలోకే వస్తాయి. అలాగే హడ్కో, సిడ్బి వంటి సంస్థలు ఎప్పుడూ డిపాజిట్లను స్వీకరిస్తూనే ఉంటాయి. సాధారణంగా వీటి వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితి దాటిన వాటిపై వడ్డీరేటు 6%పైన ఉంది. ప్రైవేటు బాండ్లు వివిధ కంపెనీలు బాండ్లు, డిపాజిట్ల ద్వారా నిధులు సేకరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కంపెనీల చట్టం కంపెనీల డిపాజిట్ల సేకరణపై ప్రభావం చూపనుంది. బ్యాంకుల వలే కంపెనీలు కూడా సేకరించే డిపాజిట్లకు బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆ చట్టంలో నిర్దేశించింది. కంపెనీల డిపాజిట్లకు బీమా ఇచ్చే పథకాలు ఇపుడు అందుబాటులో లేకపోవడమే అసలు సమస్య. ఈ దిశగా బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలైతే ఇక కార్పొరేట్ డిపాజిట్లు, బాండ్లు కూడా అత్యంత ఆకర్షణీయంగా మారతాయనడంలో సందేహం లేదు. సాధారణంగా కార్పొరేట్ డిపాజిట్లపై వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్ల కంటే కొద్దిగా అధికంగా ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కేంద్ర ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్బీఐ ద్వారా వివిధ రూపాల్లో నగదును సేకరిస్తుంది. ఇందులో ప్రధానమైనవి గవర్నమెంటు సెక్యూరిటీస్(జీ-సెక్), ట్రెజరీ బిల్లులు. దీర్ఘకాలిక అవసరాల కోసం విడుదల చేసే వాటిని సెక్యూరిటీస్ అనీ, రోజులు, నెలలు, సంవత్సరం లోపు కాలపరిమితి ఉండే స్వల్పకాలిక అవసరాల కోసం విడుదల చేసే వాటిని ట్రెజరీ బిల్లులనీ అంటారు. సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. వీటిల్లో ఫైనాన్షియల్ సంస్థలైన పీపీఎఫ్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలవు. రిటైల్ ఇన్వెస్టర్లు పరోక్షంగా ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అందించే గిల్ట్ ఫండ్స్ అవకాశాన్ని కల్పిస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం రూ.2 లక్షలుండాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం డెట్ ఫండ్స్.. పైన పేర్కొన్న చాలా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ వీటిల్లో పరోక్షంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల డెట్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి రాబడులనేవి వడ్డీరేట్ల కదలికలపై ఆధారపడి ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగేటప్పుడు కొన్ని పథకాలు అధిక రాబడులను అందిస్తే మరికొన్ని వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు లాభాలను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్స్ లేదా స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పన్ను ప్రయోజనాల పరంగా డెట్ ఫండ్స్ అనువైనవి. ఇప్పుడు వివిధ రకాల డెట్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుకూలమైనవేనా అనే అంశాలను తెలుసుకుందాం. గిల్డ్ ఫండ్స్: ఇవి కేవలం గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అంత అనుకూలం కాదు. వీటిల్లో వడ్డీరేట్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు ఇవి అధిక లాభాలను అందిస్తాయి. ఒకసారి ట్రెండ్ మారి వడ్డీరేట్లు పెరుగుతుంటే వీటి నుంచి తక్షణం వైదొలిగే ప్రయత్నం చేయాలి. ఇన్కమ్ ఫండ్స్: వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు అధిక రాబడులను అందించే వాటిలో ఇన్కమ్ ఫండ్స్ ముఖ్యమైనవి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అన్నిరకాల డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకాలకు ఉంది. డైనమిక్ బాండ్స్, ఫ్లెక్సీ డెట్ ఫండ్స్ ఈ కోవలోకే వస్తాయి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్: ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలపరిమితి గల డెట్ ఫండ్స్‌ను షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. వడ్డీరేట్లు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా కనిపించే తరుణంలో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్: స్వల్ప కాలిక ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ఎటువంటి లాకిన్ పీరియడ్ లేకపోవడం, బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని అందించే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ అధికం. కానీ, వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు పైవాటితో పోలిస్తే వీటి రాబడి తక్కువ. లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్: వడ్డీరేట్లు బాగా తగ్గే అవకాశాలున్నప్పుడు వీటి రాబడులు క్షీణిస్తాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఫిక్స్డ్ మెచ్యూర్టీ ప్లాన్స్ (ఎఫ్ఎంపీ): వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఫిక్స్డ్ మెచ్యూర్టీ ప్లాన్ (ఎఫ్ఎంపీ)లు అనువుగా ఉంటాయి. వడ్డీ రేట్ల కదలికల వల్ల వచ్చే రిస్క్ లేకుండా ఒక పరిమిత కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.