అంతర్జాతీయ సంకేతాలు కీలకం
ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు.
‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి.
అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
స్థూల ఆర్థిక డేటాపై దృష్టి
అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.
ఈ వారం ఐపీఓల పండుగ
దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి.
‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు.
తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు
ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్‌ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్‌ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment