Domestic market
-
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
ఈ–లూనా వచ్చేసింది
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లోకి ఈ–లూనా అడుగు పెట్టింది. కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ–లూనా ఎలక్ట్రిక్ రవాణాకు వీలు కలి్పస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష ఈ–లూనాలను విక్రయించనున్నట్టు కినెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. బీటూబీ కస్టమర్లు, ఈ–కామర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చిందని, వారికి 50,000 యూనిట్లు విక్రయిస్తామనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ఈ–లూనా ఆరంభ ధర రూ.69,990 (ఎక్స్‌షోరూమ్). 2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చే ఈ–లూనా ఒక్కసారి చార్జింగ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల టర్నోవర్ సాధించాలని.. ఇందులో రూ.800 కోట్ల ఆదాయం ఈ–లూనా నుంచే వస్తుందన్న అంచనాతో కంపెనీ ఉంది. -
స్మార్ట్‌ఫోన్స్ ఆదాయాల్లో యాపిల్ టాప్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గతేడాది (2023) అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తొలిసారిగా ఆదాయాలపరంగా అగ్రస్థానం దక్కించుకుంది. అమ్మకాల పరిమాణంపరంగా శాంసంగ్ నంబర్‌వన్‌గా ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నెలవారీ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ..దాదాపు అంతక్రితం ఏడాది స్థాయిలోనే 15.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. కొరియన్ దిగ్గజం శాంసంగ్, చైనా మొబైల్స్ తయారీ సంస్థలు వివో, ఒప్పో తమ మార్కెట్ వాటాలను పెంచుకోగలిగాయి. భారత్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా యాపిల్‌కి కలిసి వస్తోందని కౌంటర్‌పాయింట్ తమ నివేదికలో తెలిపింది. స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా గతేడాది ప్రథమార్ధం సవాళ్లతో గడిచిందని, డిమాండ్ పడిపోయి, నిల్వలు పెరిగిపోయాయని పేర్కొంది. 5జీ అప్గ్రేడ్లు, పండుగ సీజన్ అమ్మకాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో ద్వితీయార్ధంలో మార్కెట్ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టిందని వివరించింది. మొత్తం ఫోన్ల మార్కెట్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 52 శాతం దాటిందని, వార్షిక ప్రాతిపదికన 66 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మరోవైపు, 2023 నాలుగో త్రైమాసికంలో దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 25 శాతం వృద్ధి చెందినట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. మరిన్ని విశేషాలు.. ► స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు ప్రీమియం ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2023లో రూ. 30,000 పైన రేటు ఉన్న ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ స్కీములు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ఫైనాన్స్ మీదే కొన్నారు. ► ప్రీమియం సెగ్మెంట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు మరింతగా ఆదరణ పెరగవచ్చు. వాటి అమ్మకాలు 2024లో 10 లక్షలు దాటవచ్చని అంచనా. ► స్మార్ట్ఫోన్లలో ఆడియో–వీడియోపరంగా డాల్బీ అటా్మస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు మరింతగా పెరగవచ్చు. -
దేశీ మార్కెట్‌పై గ్లోబల్ దిగ్గజాల కన్ను
ముంబై: కన్జూమర్ ప్రొడక్టుల గ్లోబల్ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్ యూనిలీవర్, లారియల్ దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్ ప్రొడక్ట్ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి. మార్కెట్‌ను మించుతూ సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్ ప్రొడక్టుల దిగ్గజం లారియల్ పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది. పానీయాలకు భళా 2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్ జోప్ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. రెండంకెల వృద్ధి 2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్ మార్కెట్లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్ అమ్మకాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది. -
ఐకామ్ ప్లాంటులో కారకల్ ఆయుధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి దిగ్గజం కారకల్ ఇంటర్నేషనల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ టెలీ సాంకేతిక బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈలోని అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఐడీఈఎక్స్ 2023 కార్యక్రమంలో మంగళవారం ఇరు సంస్థల మధ్య డీల్ కుదిరింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్.. భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంది. తాజా డీల్ ప్రకారం హైదరాబాద్ ప్లాంటులో కారకల్ టెక్నాలజీతో చిన్న పాటి ఆయుధాలను తయారు చేస్తామని ఐకామ్ టెలి ఎండీ పి.సుమంత్ తెలిపారు. క్షిపణులు, కమ్యూనికేషన్స్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మందుగుండు, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్–డ్రోన్ సిస్టమ్స్‌ను ఐకామ్ ఇప్పటికే తయారు చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఐకామ్‌కు హైదరాబాద్ శివారులో 110 ఎకరాల్లో ప్లాంటు ఉంది. -
ముందుంది ఎండలు మండే కాలం! కిటికీలకు ఈ ఫిల్మ్‌లు అతికిస్తే! కూల్‌కూల్!
విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు ఇళ్లలోకి అతినీలలోహిత కిరణాలు చొరబడకుండా కాపాడే విండో ఫిల్మ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాంతిని నిరోధించకుండానే గదిని చల్లబరచగ లగటం దీని ప్రత్యేకత. ‘పారదర్శక రేడియేటివ్ కూలర్లు’గా పిలిచే ఈ ఫిల్మ్‌ను కిటికీలకు వినియోగిస్తే.. ఒక్క వాట్ విద్యుత్ కూడా వాడక్కర్లేకుండా భవనాల లోపలి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ ఫిల్మ్‌లు మన దేశీయ మార్కెట్లోనూ లభ్యమవుతున్నాయి. సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన విధానంలో అనేక మార్పులొస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే సరికొత్త వ్యాపారాలూ పుట్టుకొస్తున్నాయి. కిటికీ అద్దాలకు విండో ఫిల్మ్‌ను అతికిస్తే ఇల్లు మొత్తం కూల్‌గా మారిపోయే విండో ఫిల్మ్ మార్కెట్లోకి వచ్చేసింది. విద్యుత్ బిల్లులను తగ్గించడంతోపాటు ఆల్ట్రా వయొలెట్ (అతినీలలోహిత) కిరణాల నుంచి రక్షణ కల్పించేలా దీనిని అభివృద్ధి చేశారు. ట్రాన్స్పరెంట్ రేడియేటివ్ కూలర్లుగా పిలుస్తున్న ఈ ఫిల్మ్‌లను వినియోగించటం వల్ల ఏసీలు, కూలర్లతో పని లేకుండా గదులన్నీ కూల్ అయిపోతాయి. ప్రపంచంలో దాదాపు 15 శాతం విద్యుత్‌ను కేవలం గదుల శీతలీకరణకే వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికత వల్ల ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా భవనాల లోపల ఉష్ణోగ్రతను తగ్గించగలదు. అమెరికన్ కెమికల్ సొసైటీ ఎనర్జీ లెటర్స్ నివేదిక ప్రకారం.. భవనాలు, వాహనాల్లో చల్లదనం కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ‘ట్రాన్సపరెంట్ రేడియేటివ్ కూలర్లు’ విండో మెటీరియల్‌గా ఉపయోగపడతాయి. ఇవి వాతావరణ మార్పులను పరిష్కరించడంలోనూ తోడ్పడతాయి. ప్రయోజనాలెన్నో..! విండో ఫిల్మ్ అనేది ఒక సన్నని పదార్థం. దీనిని పాలిస్టర్ పొరలతో తయారు చేస్తారు. ప్రతిబింబం కనిపించేలా పూత పూస్తారు. ఇలా తయారైన విండో ఫిల్మ్‌ను కిటికీలకు అమర్చడం వల్ల సూర్యరశ్మిని గదిలోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. సూర్య కిరణాల్లో ఉండే హానికరమైన అతినీలలోహిత (ఆల్ట్రా వయొలెట్) కిరణాలను ఈ ఫిల్మ్ 97 శాతం అడ్డుకుంటుంది. సాధారణ గ్లాస్ కిటికీలకు కూడా ఈ ఫిల్మ్ వేస్తే బ్రాండెడ్ కిటికీల్లా మారతాయి. భవనంలోకి ప్రవేశించే సౌరశక్తిలో 80 శాతం వరకూ నిరోధించడానికి ఈ ఫిల్మ్‌లను రూపొందించారు. ఇవి సాధారణ కిటికీల కంటే 31 శాతం ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి. చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. గదికి, ఇంటికి కొత్త కళ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫిల్మ్‌ను కిటికీ అద్దాలకు అతికించడం వల్ల ఇంటిలో వేడి వాతావరణం తగ్గి గది చల్లబడుతుంది. తద్వారా ఫ్యాన్లు, ఏసీల వినియోగం తగ్గి విద్యుత్ ఆదా అవుతుంది. శీతాకాలంలో ఇంట్లోని వేడిని బయటకు పోనివ్వకుండా నిలుపుదల చేస్తూ.. బయట వాతావరణంలోని చల్లదనాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసి గృహస్తుల ఆరోగ్యానికి కారణమవుతుంది. భారీగా పెరుగుతున్న మార్కెట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రచురించిన గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ నివేదిక ప్రకారం.. బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఖర్చులు 2019లో ప్రపంచవ్యాప్తంగా 152 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2018తో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. దీంతో ఇంధన సామర్థ్యం, సమర్థ వినియోగం చేయగల భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. అదే విండో ఫిల్మ్ మార్కెట్ వృద్ధికి కారణమవుతోంది. విండో ఫిల్మ్ మార్కెట్ ఆసియా–పసిఫిక్, పశ్చిమ యూరప్, తూర్పు యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో బాగా విస్తరించింది. భారత్ సహా 30 దేశాల మార్కెట్లను అధ్యయనం చేసిన తరువాత విండో ఫిల్మ్ గ్లోబల్ మార్కెట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్ 2021లో 13.08 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2022లో 13.90 బిలియన్ డాలర్లకు చేరింది. 2026 నాటికి 6.40 శాతం వార్షిక వృద్ధితో 17.79 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫిల్మ్‌లు ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. ధరలు కూడా కనిష్టంగా ఒక్కో ఫిల్మ్ కేవలం రూ.150 నుంచే మొదలవుతున్నాయి. ఆన్లైన్లో కొనే ముందు నాణ్యత తెలుసుకుంటే మంచిది. -
ఎన్నికల ఫలితాలు, యుద్ధ పరిణామాలు కీలకం
ముంబై: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిణామాలు ఈ వారం దేశీయ మార్కెట్ గమనాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, కమోడిటీ ధరల కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. చమురు ధరలు దశాబ్దపు గరిష్టానికి చేరిన నేపథ్యంలో క్రూడ్ సంబంధిత షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఎఫ్ఐఐలు పెద్ద మొత్తంలో బ్యాంకింగ్ రంగ షేర్లను అమ్మేస్తున్నారు. అయితే మెటల్, ఐటీ, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు జరగొచ్చు. యుద్ధ భయాలకు ద్రవ్యోల్బణ భయాలు ఆజ్యం పోయడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,525 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు ఏ కొంత తగ్గుముఖం పట్టినా.., షార్ట్ కవరింగ్ బౌన్స్‌బ్యాక్ జరుగొచ్చు. గతవారంలో నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ప్రతిసారి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అలాగే ప్రతిట్రేడింగ్లోనూ గ్యాప్ అప్‌తో మొదలైంది. నిఫ్టీ ప్రస్తుతానికి దిగువస్థాయిలో 16,200 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమై న నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు ఎన్నికల ఫలితాల ప్రభావం ఏడు విడుతల్లో దాదాపు నెలరోజులు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి పదోతేది(గురువారం) వెల్లడి అవుతాయి. కీలక రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి చవిచూస్తే స్వల్పకాలం పాటు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఎన్నికల ఫలితాల ప్రభావితం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ పరిణామాలు రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుంటే ఉక్రెయిన్ ధీటుగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడిని నిరసిస్తూ పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఫలితంగా సరఫరా భయాలతో క్రూడాయిల్ సహా కమోడిటీ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు ఎగబాకింది. క్రూడ్ ధరలు భగ్గుమనడంతో దిగుమతులపైనే 80 శాతం ఆధారపడిన భారత్‌కు వాణిజ్య లోటు మరింత పెరుగుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ భయాలు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో చమురు ధరలు పదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రానున్న రోజుల్లో గోధుమ, పాయిల్, కోల్ ధరలు సైతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరలు ఆకాశానికి ఎగుస్తున్న తరణంలో తాజాగా ద్రవ్యోల్బణ భయాలు తెరపైకి వచ్చాయి. ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఆర్బీఐ ద్రవ్య పరపతి చర్యలను మరింత కఠినం చేయొచ్చనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు కేంద్ర గణాంకాల శాఖ నేడు దేశీయ ఫిబ్రవరి పారిశ్రామిక, ఉత్పాదక ఉత్పత్తి గణాంకాలను విడుదల చేయనుంది. అంతర్జాతీయంగా చూస్తే., రేపు యూరోజోన్ నాలుగో క్వార్టర్ జీడీపీ అంచనా గణాంకాలు, బుధవారం చైనా ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా, గురువారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు యూరోపియన్ యూనియన్ బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనలు వెలువడునున్నాయి. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణంకాల ప్రకటన ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ల నుంచి మార్చి మొదటి మూడు రోజుల్లోనే రూ. 17,537 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. ఎఫ్ఐఐలు నెల 2–4 తేదీల మధ్య ఈక్విటీల నుండి రూ. 14,721 కోట్లు, డెట్ విభాగం నుండి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో డెట్ విభాగంలోనూ ఎఫ్‌పీఐలే అమ్మకందారులుగా ఉంటూ వస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న అనిశ్చితి, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. -
ఇక్కడ ఎస్‌యూవీలంటేనే ఇష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ వచ్చే రెండేళ్లలో కొత్తగా నాలుగు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌ను (ఎస్యూవీ) మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం టిగువన్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. భారతీయులకు ఎస్‌యూవీలపై మక్కువ ఎక్కువని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ స్టీఫెన్ న్యాప్ శుక్రవారమిక్కడ చెప్పారు. ఈ విభాగంలో రానున్న రోజుల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటామన్నారు. 2020లో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో నూతన మోడళ్లను ప్రదర్శిస్తామని తెలియజేశారు. కంపెనీ 20వ కార్పొరేట్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచి్చన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫోక్స్‌వ్యాగన్ కార్లు ఖరీదైనవని కస్టమర్లు అనుకునేవారు. నాలుగేళ్ల వారంటీ, విడిభాగాల ధర 15 శాతం తగ్గించడం ద్వారా ఆ భావన నుంచి బయటపడేలా చేశాం’ అని చెప్పారు. ఎస్‌యూవీలతోపాటు మరో రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అయిదేళ్లలో 3 శాతం.. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్‌కు 1.4 శాతం వాటా ఉంది. అయిదేళ్లలో 3 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు స్టీఫెన్ చెప్పారు. ‘ఇండియా 2.0 కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి రూ.8,000 కోట్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించాం. మోడళ్ల అభివృద్ధి, ఆర్అండ్ డీ కోసం ఈ పెట్టుబడి పెడతాం. పుణే ఆర్అండ్ డీ కేంద్రంలో ప్రస్తుతం 650 మంది ఇంజనీర్లు ఉన్నారు. దీనిని 5,000 స్థాయికి పెంచుతాం. భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్ కోసం ఇక్కడ కార్లను అభివృద్ధి చేస్తాం. బీఎస్–4 వాహనాల తయారీని డిసెంబర్ నుంచి నిలిపేస్తున్నాం. మార్కెట్లో బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనాల ధర డీజిల్ 12– 15 శాతం, పెట్రోల్ 5 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత మోడళ్లన్నిటినీ కొనసాగిస్తాం. చార్జింగ్ స్టేషన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెడతాం’ అని తెలిపారు. -
దేశీ అవకాశాలతో... ఐటీ తొలగింపులకు కళ్లెం!!
ముంబై: ఐటీ కంపెనీలు స్థానిక అవకాశాలను అందిపుచ్చుకొని, తద్వారా ఉద్యోగ తొలగింపులను తగ్గించుకోవాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ సూచించింది. 155 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం ఉద్యోగాల తొలగింపు భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘మన ఐటీ కంపెనీలు దేశీ మార్కెట్‌పై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం. విదేశీ మార్కెట్లలో పరిస్థితులు బాగోలేవు. అందుకే ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. వ్యూహాలను సమీక్షించుకోవాలి. దీనివల్ల కనీసం ఉద్యోగాల కోత ను కొంతైనా తగ్గించుకోవచ్చు’ అని వివరించింది. జన్‌ధన్, ఆధార్ సేవలతో అవకాశాలు.. భారత్‌లో అవకాశాలు అస్థిరమైనవని, సింగిల్ డిజిట్ రెవెన్యూనే కష్టమని, పేమెంట్స్ చెల్లింపుల్లో సమస్యలు ఉంటాయని ఐటీ కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే జన్‌ధన్ యోజన, ఆధార్ ఆధారిత సర్వీసుల వల్ల అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అసోచామ్ పేర్కొంది. వీటి ద్వారా ఎఫ్ఎంసీజీ, ఆటో, టెలికం, ఇన్సూరెన్స్, అగ్రి రంగాల్లో ప్రతిఫలం పొందొచ్చని తెలిపింది. టెక్ కంపెనీలు దేశీ మార్కెట్‌పై దృష్టిపెట్టడం వల్ల అటు ఐటీ పరిశ్రమతోపాటు, ఇటు దేశం కూడా వృద్ధి దిశగా పయనిస్తాయని పేర్కొంది. లక్షల ఉద్యోగాలు సృష్టించొచ్చు!! స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటే.. ఇక్కడ కొన్ని లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించొచ్చని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. కొత్త టెక్నాలజీలు, విదేశీ మార్కెట్లలోని అస్థిరతల వల్ల కలిగిన నష్టాల నుంచి గట్టేక్కవచ్చని పేర్కొన్నారు. -
ఆసుస్ జెన్‌వాచ్–3 విడుదల
రెండు వేరియంట్లలో లభ్యం న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఆసుస్ జెన్‌వాచ్–3ని శుక్రవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. లెదర్ స్ట్రాప్‌తో ఉన్న మోడల్ ధర రూ.18,999 కాగా, రబ్బర్ స్ట్రాప్‌తో ఉన్న వాచ్ ధర రూ.17,599. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్వేర్ 2100 ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. సౌకర్యాలు, డిజైన్ పరంగా ఈ వాచ్ యూజర్ల అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్టులో ముందస్తు ఆర్డర్లను స్వీకరించనున్నట్టు సంస్థ తెలిపింది. -
సమీపంలో పసిడి పటిష్టమే..!
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పసిడి తళతళలాడుతోంది. సమీప కాలంలో ప్రత్యేకించి తాజా వారంలో పసిడి ధర పటిష్ట ధోరణిలోనే కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఈ రంగంలో నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించి ఈ నెల 23వ తేదీన జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రభావం ప్రధానంగా రానున్న ఐదారురోజుల్లో పసిడి ధరపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో ధర ఔన్స్‌కు (31.1గ్రా) వారం వారీగా 25 డాలర్లు పెరిగి 1,302 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. దేశీయంగా భారీ లాభం... ఇక అంతర్జాతీయంగా దూకుడు... దేశంలో కొనుగోళ్ల మద్దతు నేపథ్యంలో ముంబై ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో భారీగా లాభపడింది. 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర వారం వారీగా శుక్రవారం భారీగా రూ.470 లాభంతో రూ. 30,060 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో లాభపడి రూ.29,910 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.510 లాభపడి, రూ. 41,560 వద్ద ముగిసింది. వారంలో ఒక దశలో ధర 2014 సెప్టెంబర్ 10 గరిష్ట స్థాయి రూ.42,570కి ఎగయడం గమనార్హం. ధరల పటిష్ట ధోరణి దేశీయంగా కొనసాగే వీలుంది. ఇన్వెస్టర్లకు పసిడే ప్రత్యామ్నాయం భౌగోళిక అంశాలు ఎప్పుడూ పసిడిపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. బ్రిగ్జిట్ ఇందులో ఒకటి. అమెరికాలో ఉపాధి అవకాశాల సంఖ్య తగ్గడం నుంచీ ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీ బ్రిగ్జిట్ వరకూ కొనసాగుతుంది. ఈ అనిశ్చితి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల భద్రతకు పసిడినే ఎంచుకుంటారు. ఒకవేళ బ్రిగ్జిట్‌కు ప్రతికూలంగా ఓటు పడినా... పసిడి భారీగా పడిపోయే అవకాశాలూ ఏమీ లేవు. అయితే ఏ స్థాయి వరకూ పెరుగుతాయన్నదే ప్రస్తుత ప్రశ్న. - కియూర్ షా, ముథూట్, ప్రీసియస్ మెటల్స్ డివిజన్, సీఈఓ ‘యస్’ ఓటయితే... 1,400 డాలర్లకే యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోడానికే బ్రిటన్ ఓటేస్తే... పసిడి ఔన్స్‌కు 1,400 డాలర్ల వైపునకు దూసుకుపోవడం ఖాయం. ఇది 1,350-1,400 డాలర్ల శ్రేణిలో ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ ధరల శ్రేణి రూ.31,800-రూ.32,500 మధ్య ఉంటుంది. ‘‘నో’ ఓటు అయితే దేశీయంగా ధర రూ.30,600-రూ.30,400 మధ్య ఉంటుంది. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో పసిడి ధర భారీగా పడిపోదన్న అంశంపై విశ్లేషకుల్లో ఏకాభిప్రాయం ఉంది. - నవ్‌నీత్ దమానీ, మోతీలాల్ ఓస్వాల్, కమోడిటీ డివిజన్, ఏవీపీ -
పసిడి ధర మళ్లీ వెనక్కి!
న్యూయార్క్/ముంబై: పసిడి ధర తాజాగా వెలవెలబోతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లో లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనబడుతోంది. స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు తమ నిల్వలను తగ్గించుకోవడం, కొనుగోళ్ల మద్దతు కొరవడ్డం వంటి అంశాలూ దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ నెమైక్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రాములు) ధర బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి మంగళవారం ముగింపుతో పోల్చితే 29 డాలర్లు తక్కువగా 1,220 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో సైతం కొనసాగుతోంది. రాత్రి కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల కాంట్రాక్ట్ రూ.500కు పైగా నష్టంతో రూ.28,542 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర సైతం రూ.1,000కిపైగా నష్టంతో రూ.36,772 వద్ద ట్రేడవుతోంది. కాగా ఇక్కడి స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల ధర భారీగా రూ.350 తగ్గింది. 99.9 స్వచ్ఛత ధర రూ.28,510, 99,5 స్వచ్ఛత ధర రూ.28,360కు దిగివచ్చింది. వెండి కేజీ ధర సైతం రూ.535 తగ్గి రూ.37,900కు చేరింది. -
సెన్సెక్స్ 150 పాయింట్లు అప్
రెండు నెలల కనిష్టం నుంచి హైజంప్ * బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు ముంబై: ఇటీవల భారీగా పతనమైన బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో దేశీ స్టాక్‌మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. కీలకమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో రెండు నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని 150 పాయింట్ల లాభంతో క్లోజయ్యింది. సోమవారం ట్రేడింగ్‌లో ఒక దశలో సెన్సెక్స్ రెండు నెలల కనిష్ట స్థాయి 25,451 పాయింట్లకు పతనమైనప్పటికీ .. తర్వాత సెషన్లో అక్కణ్ణుంచి కోలుకుని 25,866 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. చివరికి 0.58 శాతం లాభంతో 25,760 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 44 పాయింట్లు (0.57%) పెరిగి 7,807 వద్ద క్లోజయ్యింది. పారిస్‌లో ఆత్మాహుతి దాడులు, జపాన్ నుంచి నిరాశాజనక గణాంకాల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ధోరణికి అనుగుణంగా దేశీ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. అయితే రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడులపరంగా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించడం మొదలైనవి స్టాక్ మార్కెట్ కోలుకోవడానికి కారణమై ఉంటాయని జియోజిత్ బీఎన్పీ పారిబా టెక్నికల్ రీసెర్చ్ డెస్క్ కో-హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల తోడ్పాటుతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు అర శాతం దాకా పెరిగాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీల్లో కొనుగోళ్లు.. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు జరగ్గా.. ఐటీ, టెక్నాలజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం 1,374 స్టాక్స్ లాభాల్లోనూ, 1,259 స్క్రిప్‌లు నష్టాల్లోనూ ముగిశాయి. ఆసియా మార్కెట్లు డౌన్.. మరోవైపు పారిస్‌లో దాడులు, జపాన్ మళ్లీ మాంద్యంలోకి ప్రవేశించిందన్న గణాంకాల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమ ధోరణి కనపర్చాయి. లిస్టింగ్‌లో ఎస్‌హెచ్ కేల్కర్ పరిమళాలు.. పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థ ఎస్‌హెచ్ కేల్కర్ అండ్ కో.. లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర రూ. 180తో పోలిస్తే సంస్థ షేరు ఏకంగా 23.3 శాతం అధికంగా రూ.222 వద్ద బీఎస్ఈలో లిస్టయ్యింది. ఆ తర్వాత 23.72 శాతం దాకా పెరిగి రూ. 222.70ని తాకింది. చివరికి 15 శాతం లాభంతో రూ. 207.30 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 54.83 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 2.3 కోట్ల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,998 కోట్లుగా ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించింది. -
మళ్ళీ దేశీయ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్
తొలుత ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా ఎల్ఈడీ టీవీల అమ్మకాలు - రూ. 300 కోట్లతో హైదరాబాద్‌లో తయారీ యూనిట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుమారు పదేళ్ల విరామం అనంతరం థామ్సన్ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం థామ్సన్ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే విధంగా రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ యూనిట్ నుంచి తయారైన ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మంగళవారం మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. వచ్చే మూడేళ్లలో ఈ యూనిట్‌పై రూ. 300 కోట్ల పెట్టుబడితో పాటు, మార్కెటింగ్ కోసం రూ. 50 కోట్లు వ్యయం చేయనున్నట్లు రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్ సీఈవో ఎ.గోపాలకృష్ణ తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ రేటు కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకే వీటిని అందించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరునెలల్లో టీవీల తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఏసీలను తయారు చేసి విక్రయించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడాదిలోగా 500 స్టోర్లను, ఆ తర్వాత 1,000 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏటా 10 శాతం వృద్ధితో ప్రస్తుతం రూ. 80,000 కోట్లుగా ఉన్న దేశీయ ఎలక్ట్రానిక్ కన్సూమర్ మార్కెట్లో మూడేళ్లలో 5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ పరిమాణం 2020 నాటికి రూ. 1.25 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కృష్ణ తెలిపారు. మొదటి ఏడాది రూ. 200 కోట్ల అమ్మకాలను జరుపుతామన్న ధీమా ను ఆయన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో అనుబంధ కంపెనీ థామ్సన్ ఇండియా పేరుతో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినా వ్యూహాత్మక వ్యాపార నిర్ణయంలో భాగంగా 2005లో వెనక్కి వెళ్ళినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ హబ్‌గా హైదరాబాద్ తమ ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘మేకిన్ తెలంగాణ’కు మంచి స్పందన లభిస్తోందని తారకరామారావు తెలిపారు. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయని, ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీ థామ్సన్ కూడా ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ. 350 కోట్లు వ్యయం చేయడం ద్వారా నేరుగా 500 మందికి పరోక్షంగా మూడు రెట్ల మందికి ఉపాధి లభించనుందన్నారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో హైదరాబాద్ ఎలక్ట్రానిక్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. -
పంచదార ఎగుమతులు పెంచాలి: ప్రధాని
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల అధికంగా ఉన్న పంచదార నిల్వలను వినియోగించటం కోసం.. ఎగుమతులను పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. చెరకు రంగ అంశాలపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం మంత్రులు, అధికారులతో భేటీ నిర్వహించారు. దేశంలో పంచదార సరఫరాకు - డిమాండ్‌కు మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటూ.. పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపటం పెంచాలని మోదీ పిలుపునిచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పంచదార మిగులు ఉత్పత్తి వల్ల దేశీయ మార్కెట్లో పంచదార ధర తగ్గిందని.. ఫలితంగా పంచదార పరిశ్రమ రైతులకు రూ. 14,398 కోట్ల మేర బకాయిపడిందని వివరించింది. మంత్రులు రాధామోహన్, పాశ్వాన్, నిర్మలాసీతారామన్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
4 నెలల కనిష్టానికి పసిడి
ప్రపంచ మార్కెట్లో ధరలు క్షీణించిన ప్రభావంతో గతవారం దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి ధర రూ. 26,000 లోపునకు దిగొచ్చింది. అంతక్రితంవారంతో పోలిస్తే రూ. 250 క్షీణించి రూ. 25,920 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛతగల పుత్తడి ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 25,770 వద్ద ముగిసింది. న్యూయార్క్ ఎక్స్చేంజ్లో ఔన్సు పసిడి ధర దాదాపు 15 డాలర్లు కోల్పోయి.. 1,132 డాలర్ల వద్ద క్లోజయ్యింది. -
ఫీచర్ ఫోన్ ధరకే 3జీ స్మార్ట్ ఫోన్..
⇒ రూ.2,345లకే సెల్కాన్ ఏ359 ⇒ 16 జీబీ మెమరీతో బేసిక్ ఫోన్లు ⇒ సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్.. క్యాంపస్ ఏ359 పేరుతో రూ.2,345లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఫీచర్ ఫోన్ ధరలో 3జీ మోడల్‌ను తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలో తమదేనని సెల్కాన్ సీఎండీ వై.గురు శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. యువత కోసం 11 రంగుల్లో ఈ మోడల్‌ను విడుదల చేశామన్నారు. దుబాయితోసహా పలు దేశాలకు ఏ359ను ఎగుమతి చేస్తామని చెప్పారు. మూడు నెలల్లో దేశీయ మార్కెట్లో 5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక క్యాంపస్ ఏ359లో 3.5 అంగుళాల హెచ్వీజీఏ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, కిట్‌క్యాట్ ఓఎస్, 2 ఎంపీ కెమెరా, వైఫై, జి-సెన్సార్, 1,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెమరీ కార్డులో 35,000 పాటలు..: ఫీచర్ ఫోన్ విభాగంలో సెల్కాన్ 2.4 అంగుళాల స్క్రీన్‌తో సి-27 మోడల్, 2.8 అంగుళాల స్క్రీన్‌తో సి-287 మోడల్‌ను ప్రవేశపెట్టింది. వీటి ధరలు వరుసగా రూ.1,650, రూ.1,800. 16 జీబీ మెమరీ కార్డును జోడించడం వీటి ప్రత్యేకత. మెమరీ కార్డులో 35,000ల పాటలను భద్రపర్చుకోవచ్చు. ఎఫ్ఎం సదుపాయం లేని ప్రాంతాల్లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చామని గురు తెలిపారు. ‘రూ.5 వేలకే డ్యూయల్ సిమ్ హెచ్డీ ట్యాబ్‌ను మార్కెట్లోకి తెచ్చాం. నెలరోజుల్లో 15 ఫోన్లను ప్రవేశపెడతాం. వీటిలో లాలిపాప్ ఓఎస్‌తోనూ మోడళ్లుంటాయి’ అని వివరించారు. జూన్‌లో మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్.. అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు పనులను సెల్కాన్ వేగిరం చేసింది. జూన్‌లో సెల్కాన్ మేక్ ఇన్ ఇండియా మొబైల్‌ను తీసుకు రావాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు వై.గురు స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. అయితే ప్లాంట్ల ఏర్పాటుకు ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతోనూ సెల్కాన్ చర్చిస్తోంది. 3 కంపెనీలు ఇప్పటికే ఆసక్తి కనబరిచాయి. ప్లాంటు ఎక్కడ ఏర్పాటయ్యేది ఈ నెలలోనే ఖరారయ్యే అవకాశం ఉంది. -
ఒకే సంస్థ.. నాలుగు బ్రాండ్లు!
‘సాక్షి’ ఇంటర్వ్యూ : హావెల్స్ ఇండియా సీఎండీ అనిల్‌రాయ్ గుప్తా హావెల్స్ ఇండియా సక్సెస్‌కు కారణమిదే * గతేడాది రూ.8,000 కోట్ల టర్నోవర్ * తెలంగాణ, ఏపీల్లో రూ.400 కోట్ల వ్యాపారం * జూలైకల్లా మార్కెట్లోకి హావెల్స్ గీజర్లు నిమ్రానా (రాజస్థాన్) నుంచి ఎ.శ్రీనాథ్ : ఒక కంపెనీ ఒకే బ్రాండ్‌ను తయారు చేస్తే కొనుగోలుదారులకు ఆప్షన్ ఉండదు. ఒక షాప్‌కు వెళ్లినవారు ఆ బ్రాండ్‌ను కొనటం ఇష్టం లేకుంటే వేరే బ్రాండ్‌కు వెళ్లిపోతారు. అలాంటి వినియోగదారుల్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక మేం మా కంపెనీ నుంచే నాలుగు బ్రాండ్లను ఉత్పత్తి చేస్తున్నాం’’ ఇదీ ఎలక్ట్రిక్ ఉపకరణాల సంస్థ ‘హావెల్స్’ ఇండియా సీఎండీ అనిల్ రాయ్ గుప్తా మాట. కస్టమర్ ఏ బ్రాండ్‌ను ఎంచుకున్నా అది తమదై ఉండాలన్న ఉద్దేశంతోనే హావెల్స్, క్రాబ్ట్రీ, స్టాండర్డ్, సైల్వానియా పేరిట నాలుగు బ్రాండ్ల ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. గృహ, వాణిజ్య సర్క్యూట్లు, కేబుల్స్, వైర్లు, మోటర్స్, ఫ్యాన్లు, స్విచ్చులు, పవర్ కెపాసిటర్లు, సీఎఫ్ఎల్ బల్బులు వంటి ఎలక్ట్రికల్ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్న హావెల్స్‌కు రాజస్థాన్‌లోని నిమ్రానాలో అత్యాధునిక ప్లాంటు ఉంది. శనివారం ఈ ప్లాంట్‌లో లూమినో ఎల్ఈడీ లైట్‌ను, ఈఎస్-40 ఫ్యాన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే.. బ్రాండ్ విలువ ముఖ్యం దేశ, విదేశీ మార్కెట్లో పోటీని తట్టుకోవటానికి ఒక బ్రాండ్ సరిపోదు. ఒక్కసారి కస్టమర్లు బ్రాండ్‌కు అలవాటు పడితే వేరే ఎన్ని బ్రాండ్లొచ్చినా అటువైపు వెళ్లరు. ఉదాహరణకు థమ్సప్నే చూడండి. కోక్ దాన్ని కొనేశాక తమలో కలిపేసుకుంది. కానీ ఆ తరవాత కూడా చాలామంది కస్టమర్లు కోక్ బదులు థమ్సప్ కావాలని అడగటంతో చేసేదేమీ లేక కంపెనీ దేశీయ మార్కెట్లో థమ్సప్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. అందుకే మేం విడివిడి బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనూ బ్రాండింగ్ కోసం ఏటా రూ.300 కోట్లు ఖర్చుపెడుతున్నాం. ప్రస్తుతం హావెల్స్ ఇండియాకు 11 తయారీ ప్లాంట్లున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సైల్వానియా, దేశీయ మార్కెట్లో హావెల్స్, క్రాబ్ట్రీ, స్టాండర్డ్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఎల్ఈడీ, ఫ్యాన్ల మీదే దృష్టి.. ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లపై దృష్టి పెట్టాం. స్మార్ట్ సిటీలు, విద్యుత్ వినియోగం తక్కువగా ఉండటం వల్ల దేశంలో ఈ ఉత్పత్తుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది దేశంలో ఎల్ఈడీ లైట్ల మార్కెట్ రూ.850 కోట్లుగా ఉంది. ఏటా 45% వృద్ధి చెందుతోంది. వచ్చే రెండేళ్లలో ఎల్ఈడీ లైట్ల విభాగంలో మేం రూ.600 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫ్యాన్ల మార్కెట్ దేశంలో రూ.5,500 కోట్లుగా ఉంటే.. ఇందులో మా వాటా 14%. వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్ల వ్యాపారం లక్ష్యం గా పెట్టుకున్నాం. 2004లో మా టర్నోవర్ రూ.419 కోట్లుండగా.. 2013-14లో రూ.8,185 కోట్లకు చేరింది. ఇందులో దేశీ మార్కెట్ వాటా రూ.5 వేల కోట్లు కాగా.. మిగతాది అంతర్జాతీయ మార్కెట్‌ది. హవెల్స్ గ్రూప్ ఏటా 15% వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2020 కల్లా రూ.10 వేల కోట్లకు చేరుకుంటాం. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.400 కోట్ల వ్యాపారం జరిగింది. హైదరాబాద్, విజయవాడల్లో కార్యాలయాలున్నాయి. జూలైకల్లా హావెల్స్ గీజర్లు...: మాది పూర్తిగా కుటుంబ వ్యాపారం. కంపెనీలో పీఈ పెట్టుబడులు, విదేశీ ఇన్వెస్టర్లు ఎవరూ లేరు. నిధుల సమీకరణ అవసరమూ లేదు. గత ఐదేళ్లలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టాం. వచ్చే మూడేళ్లలో మరో రూ.600 కోట్ల పెట్టుబడులు పెడతాం. రూ.80 కోట్ల పెట్టుబడితో నిమ్రానాలో పెట్టిన గీజర్ల తయారీ యూనిట్‌ను త్వరలో ఆరంభిస్తాం. జూలై కల్లా గీజర్లను మార్కెట్లోకి తెస్తాం. ఈ ఏడాది చివరికి సబ్మెర్సిబుల్ పంపులనూ తెస్తాం. వచ్చే మూడేళ్లలో సోలార్ స్ట్రీట్ లైట్లు, ఎయిర్ కండీషనర్లు (ఏసీ) కూడా తీసుకొస్తాం. వీటితోనే గట్టి పోటీ.. మాకు ధరలో చైనా ఉత్పత్తులతోను, నాణ్యతలో జర్మనీ, అమెరికా ఉత్పత్తులతోను పోటీ ఉంది. అయితే దేశీ వినియోగదారులిపుడు ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మేం టెక్నాలజీ వినియోగించి నాణ్యతతో రాజీపడకుండా ఉత్పత్తులు తెస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్, అల్యూమినియం ధరలు తగ్గుముఖం పడుతున్నా... దేశంలోని పన్నుల వల్లే విద్యుత్ ఉపకరణాల ధరలు తగ్గటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో యూరో ధరలు మారినప్పుడల్లా దిగుమతి సుంకం పెరుగుతుండటమూ ఒక కారణమే. మా టర్నోవర్‌లో 2 శాతాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వెచ్చిస్తున్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు మా ఉత్పత్తుల్ని ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. 6 నెలల్లో మేమే సొంతంగా ఈ-కామర్స్‌లోకి వస్తాం. -
ఎల్జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది భారత్‌లో రూ. 23,500 కోట్ల టర్నోవరును లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం అధికం. 2014లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా టర్నోవరు రూ. 18,500 కోట్లు. ఇక, పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) కార్యకలాపాలపై కంపెనీ ఈ ఏడాది కనీసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం ఎల్జీ ఇండియా టెక్ షో 2015 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ వాన్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. రాబోయే మూడేళ్లలో భారత్‌ను తమకు మూడో అతి పెద్ద మార్కెట్‌గా మల్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాన్ వివరించారు. 105 అంగుళాల టీవీ..: టెక్‌షోలో భాగంగా మొబైల్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్, ఎయిర్ కండీషనర్స్, గృహోపకరణాలకు సంబంధించి 4 కొత్త ఉత్పత్తులను ఎల్జీ ఆవిష్కరించింది. తమ రెండో కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ జీ ఫ్లెక్స్2ని, 105 అంగుళాల టీవీని ప్రవేశపెట్టింది. జీ ఫ్లెక్స్ ధర రూ. 55,000 కాగా టీవీ రేటు రూ. 60 లక్షలు. మొబైల్స్ విభాగంలో ఈ ఏడాది 30 కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వాన్ తెలిపారు. -
నాట్కో, హెటిరోల నుంచి దేశీయ మార్కెట్లోకి హెపటైటిస్-సి జెనరిక్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి నాట్కో ఫార్మా, హెటిరో ల్యాబ్స్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీ) అనుమతి మంజూరు చేసింది. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. ఇప్పుడు వీటి జెనరిక్ వెర్షన్‌ను నాట్కో ‘సోఫాస్బువిర్’ పేరుతో త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 28 ట్యాబ్లెట్ల ధరను రూ. 19,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ మధ్యనే ఈ ఔషధాన్ని నేపాల్ విక్రయించడానికి నాట్కో ఫార్మాకి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇదే జెనరిక్ ఔషధాన్ని ‘సొఫోవిర్’ పేరుతో ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హెటిరో ల్యాబ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ జెనరిక్ ఔషధాన్ని 91 దేశాల్లో తయారు చేసి విక్రయించుకోవడానికి హెటిరో ల్యాబ్స్, నాట్కో ఫార్మాలు హక్కులు పొందాయి. ఈ వార్తల నేపథ్యంలో నాట్కో ఫార్మా గురువారం సుమారు 15 శాతం పెరిగి రూ. 2,057 వద్ద ముగిసింది. -
దేశీయ విపణిలో ఎస్‌ఎంఈలూ కీలకమే!
తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ రామచంద్రు నాయక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విపణిలో కీలకమైన చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) రంగంలో దళితులకూ తగిన స్థానం కల్పించాలని ఐఏఎస్ (రిటైర్డ్), తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ రామచంద్రు నాయక్ కోరారు. దళిత్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శనలో భాగంగా శనివారమిక్కడ ‘ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఇన్ ఎస్ఎంఈ’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళిత జనాభాలో 50 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు కూడా లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో దళితులు ఆదాయ వనరులను సృష్టించే వారిగా ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు. అందుకే కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు దళిత ఎస్ఎంఈలను ప్రోత్సహించేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు దళిత పారిశ్రామికవేత్తల కోసం పథకాలు రచించడమే కాదు.. వాటి గురించిన పూర్తి అవగాహన కల్పించడంలోనూ కృషిచేయాలన్నారు. అప్పుడే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, దీన్ని ఎస్ఎంఈ రంగం అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రబ్యాంక్ జీఎం (ఎంఎస్ఎంఈ) రాధాకృష్ణమూర్తి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ జే రాజు, బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) కిశోర్ కరప్ పాల్గొన్నారు. -
టాటా మోటార్స్ లాభం 25% డౌన్
క్యూ3లో రూ. 3,581 కోట్లు.. - దేశీ మార్కెట్లో మందగమనమే కారణం ముంబై: దేశీ మార్కెట్లో అమ్మకాల మందగమనం కారణంగా వాహన దిగ్గజం టాటా మోటార్స్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ కంపెనీలతో కలిపి) ప్రాతిపదికన రూ.3,581 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.4,805 కోట్లతో పోలిస్తే లాభం 25.47 శాతం దిగజారింది. అయితే, మొత్తం ఆదాయం రూ.63,513 కోట్ల నుంచి రూ.69,122 కోట్లకు పెరిగింది. 8.83 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) క్యూ3 ఆదాయం రూ.58,550 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది క్యూ3లో రూ.53,893 కోట్లతో పోలిస్తే 8.64 శాతం వృద్ధి చెందింది. భారత్ విషయానికొస్తే... దేశీయంగా కార్యకలాపాలపై(స్టాండెలోన్) కంపెనీ నష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ డిసెంబర్ క్వార్టర్లో నికర నష్టం రూ.2,123 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,251 కోట్ల నష్టంతో పోలిస్తే... 70 శాతం అధికం కావడం గమనార్హం. కాగా, మొత్తం ఆదాయం రూ.7,671 కోట్ల నుంచి రూ.8,944 కోట్లకు పెరిగింది. క్యూ3లో దేశీయంగా వాహన విక్రయాలు 3.48 క్షీణించి వృద్ధితో 1,27,484 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ షేరు ధర గురువారం బీఎస్ఈలో 0.39 శాతం నష్టపోయి రూ.590 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. -
షియోమీ ఎంఐ4 మొబైల్ రూ. 19,999
ఫిబ్రవరి 10 నుంచి విక్రయాలు న్యూఢిల్లీ: చైనా ‘యాపిల్’గా పేరొందిన షియోమీ... తాజాగా దేశీ మార్కెట్లో ఎంఐ4 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 19,999. ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి షియోమీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ4లో 5 అంగుళాల తెర, 2.5 గిగాహెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్, 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇందులో అదనపు ప్రత్యేకతలు. జనవరి 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా విక్రయాలు ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతాయి. తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి కొత్త అప్డేట్ ఎంఐయూఐ 6ని రూపొందించనున్నట్లు షియోమీ ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. మరోవైపు, బెంగళూరులో తమ పరిశోధన , అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చప్పారు. సొంత పోర్టల్‌తో విక్రయాలు.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తున్న షియోమీ ఇకపై తమ సొంత వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జరపాలని యోచిస్తున్నట్లు మను జైన్ చెప్పారు. ఇందులో భాగంగా తమ ఎంఐడాట్‌కామ్ పోర్టల్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వివరించారు. -
పుత్తడి ధరలు పెద్దగా పెరగవు
ఇక్రా సర్వే అంచనా ముంబై: దేశీయ మార్కెట్లో బంగారు ఆభరణాలకు డిమాండ్ ఈ ఏడాది 10 శాతం పెరగనున్నదని ఇక్రా తాజా సర్వే వెల్లడించింది. ఐతే బంగారం ధరలు ప్రస్తుతమున్న స్థాయిలోనే ఉంటాయని ఇక్రా నిర్వహించిన ఇండియన్ గోల్డ్ జ్యూయలరీ రిటైల్ ఇండస్ట్రీ సర్వే అంచనా వేస్తోంది. అంతకంతకూ బలపడుతున్న డాలర్, తగ్గుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలు.. ఈ అంశాలన్నింటి కారణంగా పుత్తడి ధరలు పెరిగే అవకాశాలు స్వల్పమేనని పేర్కొంది. అయితే భారత్, చైనాల్లో డిమాండ్ పెరిగితే ధరలు పెరగవచ్చని వివరించింది. గతేడాది మందకొడిగా ఉన్న బంగారు ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది 10 శాతం వృద్ధితో 3,200 కోట్ల డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ధరలు తక్కువగా ఉండడం, నిబంధనలు సరళీకరణ, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర కారణాల వల్ల డిమాండ్ పుంజుకోనున్నదని పేర్కొంది. బంగారానికి భారతీయ సంస్కృతిలో భాగం ఉండడం, భారీ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, మదుపు చేయడానికి ఉత్తమమైన సాధనాల్లో పుత్తడి ఒకటిగా ఉండడం, వంటి కారణాల వల్ల భారత్‌లో రిటైల్ జ్యూయలరీ పరిశ్రమ జోరుగా ఉన్నదని ఈ సర్వే వివరించింది. గతంలో 11 శాతంగా మాత్రమే ఉన్న వ్యవస్థీకృత రిటైల్ సంస్థలు 20 శాతానికి పెరగడం ఆసక్తికరమైన అంశమని పేర్కొంది. ధరలు తగ్గుతుండడం వల్ల పలువురు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని వివరించింది. బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు కేంద్రం బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువను తగ్గించింది. బంగారం 10 గ్రాములకు ఈ విలువ 396 డాలర్ల నుంచి 392 డాలర్లకు తగ్గింది. వెండి కేజీకి సంబంధించిన విలువ 561 డాలర్ల నుంచి 519 డాలర్లకు తగ్గింది. -
టాప్ గేర్‌లో మారుతీ..
- ఆగస్టులో జోరుగా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు - పండుగల సీజన్‌పై ఆశలు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయి. సెంటిమెంట్ మెరుగుపడడంతో మారుతీ సుజుకి, హోండా కార్స్, హ్యుందాయ్, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో మంచి వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటార్స్, తదితర కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. మారుతీ సుజుకి కాంపాక్ట్ కార్లు(స్విఫ్ట్, ఎస్టిలో, సెలెరియో, రిట్జ్, డిజైర్ కార్ల) అమ్మకాలు 53 శాతం పెరగడం విశేషం. మొత్తం మీద మారుతీ దేశీయ అమ్మకాలు 27 శాతం పెరిగాయి. గత నెలలో కూడా మారుతీ అమ్మకాలు మెరుగుపడ్డాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు మాత్రం 19 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి) విషయంలో ఆగస్టు నెల వివిధ కంపెనీలకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇక టూవీలర్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలన్నీ విక్రయాల్లో 20 శాతానికి మించి వృద్ధి సాధించాయి. పండుగ సీజన్లో మరింత జోరుగా ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని, ఈ ప్రభావం వాహనాల కొనుగోళ్లపై ఉంటోందని నిపుణులంటున్నారు. మొత్తం వార్షిక అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఉండే పండుగల సీజన్లో (దసరా, దీపావళి) డిమాండ్ పెరిగి వాహన విక్రయాలు జోరుగా ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండడం, కొత్త మోడళ్లు, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర అంశాల కారణంగా పండుగల సీజన్ సందర్భంగా అమ్మకాలు బాగుంటాయనే ఆశాభావాన్ని వివిధ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ రంగం కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని దీంతో వాహన మార్కెట్లో వ్యాపార విశ్వాసం మెరుగైందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యాఖ్యానించారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోగలవని పేర్కొన్నారు. పండుగల సీజన్ సందర్భంగా కొత్త మోడళ్లను, అప్‌గ్రేడ్ వేరియంట్లను మొత్తం 10 కొత్త ఉత్పత్తులను అందించనున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలు... • ఐషర్ మోటార్స్ దేశీయ అమ్మకాలు 66% పెరి గాయి. ఎగుమతులు 47% వృద్ధి చెందాయి. • మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 27 శాతం, ఎగుమతులు 10 శాతం చొప్పున పెరిగాయి. • హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 19% పెరగ్గా, ఎగుమతులు 40% తగ్గాయి. ఎలైట్ ఐ20, ఎక్సెంట్, గ్రాండ్ వంటి కొత్త కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. • మహీంద్రా దేశీయ అమ్మకాలు 7% తగ్గాయి. • టయోటా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. • నెలా నెలా తమ అమ్మకాలు పెరుగుతున్నాయని హోండా కార్స్ ఇండియా పేర్కొంది. రానున్న నెలల్లో అమ్మకాల్లో మరింత వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది.