షియోమీ ఎంఐ4 మొబైల్ రూ. 19,999
ఫిబ్రవరి 10 నుంచి విక్రయాలు
న్యూఢిల్లీ: చైనా ‘యాపిల్’గా పేరొందిన షియోమీ... తాజాగా దేశీ మార్కెట్లో ఎంఐ4 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 19,999. ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి షియోమీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ4లో 5 అంగుళాల తెర, 2.5 గిగాహెట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్, 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇందులో అదనపు ప్రత్యేకతలు. జనవరి 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా విక్రయాలు ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతాయి. తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి కొత్త అప్‌డేట్ ఎంఐయూఐ 6ని రూపొందించనున్నట్లు షియోమీ ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. మరోవైపు, బెంగళూరులో తమ పరిశోధన , అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చప్పారు.
సొంత పోర్టల్‌తో విక్రయాలు..
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తున్న షియోమీ ఇకపై తమ సొంత వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు జరపాలని యోచిస్తున్నట్లు మను జైన్ చెప్పారు. ఇందులో భాగంగా తమ ఎంఐడాట్‌కామ్ పోర్టల్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వివరించారు.