MI4 phone
-
చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి మరో సంచలనంతో ముందుకొచ్చింది. ఇంతకుముందు ఎంఐ3, రెడ్ ఎంఐ1ఎస్ ఫోన్లతో సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన షియోమి కార్పొరేషన్.. తాజాగా 16 జీబీ, 64 జీబీ వేరియంట్లతో కూడిన ఎంఐ4 స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే.. అదీ మంగళవారమే రెండు వేర్వేరు ఫ్లాష్ సేల్స్‌లో అమ్ముతున్నారు. ఈసారి ఎన్ని ఫోన్లు అమ్మకానికి పెట్టామన్న విషయాన్ని మాత్రం షియోమి ప్రకటించలేదు. సోమవారంతోనే రెండు వేరియంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు పూర్తయింది. 16 జీబీ వేరియంట్ ధరను రూ. 19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ. 23,999 గాను నిర్ణయించారు. 16 జీబీ వేరియంట్ మొత్తం 25వేల యూనిట్లు పెట్టగా 15 సెకండ్లలోనే అమ్ముడయ్యాయి. ఇంతకుముందు పర్చేజ్ ఆప్షన్ క్లిక్ చేసి, మనకు ఫోన్ వచ్చిందనుకున్న తర్వాత 4 గంటల్లోగా చెల్లింపు పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడా సమయాన్ని అరగంటకు కుదించారు. షియోమి ఎంఐ 4 ఫోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ ఉంది. దీని వేగం 2.5గిగా హెర్ట్జ్లు. ఫోన్లో ర్యామ్ 3 జీబీ ఇచ్చారు. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3080 ఎంఏహెచ్. -
షియోమీ ఎంఐ4 మొబైల్ రూ. 19,999
ఫిబ్రవరి 10 నుంచి విక్రయాలు న్యూఢిల్లీ: చైనా ‘యాపిల్’గా పేరొందిన షియోమీ... తాజాగా దేశీ మార్కెట్లో ఎంఐ4 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 19,999. ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి షియోమీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ4లో 5 అంగుళాల తెర, 2.5 గిగాహెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్, 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇందులో అదనపు ప్రత్యేకతలు. జనవరి 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా విక్రయాలు ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతాయి. తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి కొత్త అప్డేట్ ఎంఐయూఐ 6ని రూపొందించనున్నట్లు షియోమీ ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. మరోవైపు, బెంగళూరులో తమ పరిశోధన , అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చప్పారు. సొంత పోర్టల్‌తో విక్రయాలు.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తున్న షియోమీ ఇకపై తమ సొంత వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జరపాలని యోచిస్తున్నట్లు మను జైన్ చెప్పారు. ఇందులో భాగంగా తమ ఎంఐడాట్‌కామ్ పోర్టల్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వివరించారు.