చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4 | xiaomi releases mi4 with two variants | Sakshi
Sakshi News home page

చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4

Published Tue, Feb 24 2015 2:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4

చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4

చైనా యాపిల్గా పేరొందిన షియోమి మరో సంచలనంతో ముందుకొచ్చింది. ఇంతకుముందు ఎంఐ3, రెడ్ ఎంఐ1ఎస్ ఫోన్లతో సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన షియోమి కార్పొరేషన్.. తాజాగా 16 జీబీ, 64 జీబీ వేరియంట్లతో కూడిన ఎంఐ4 స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఈసారి కూడా ఫ్లిప్కార్ట్లోనే.. అదీ మంగళవారమే రెండు వేర్వేరు ఫ్లాష్ సేల్స్లో అమ్ముతున్నారు. ఈసారి ఎన్ని ఫోన్లు అమ్మకానికి పెట్టామన్న విషయాన్ని మాత్రం షియోమి ప్రకటించలేదు. సోమవారంతోనే రెండు వేరియంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు పూర్తయింది. 16 జీబీ వేరియంట్ ధరను రూ. 19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ. 23,999 గాను నిర్ణయించారు.

16 జీబీ వేరియంట్ మొత్తం 25వేల యూనిట్లు పెట్టగా 15 సెకండ్లలోనే అమ్ముడయ్యాయి. ఇంతకుముందు పర్చేజ్ ఆప్షన్ క్లిక్ చేసి, మనకు ఫోన్ వచ్చిందనుకున్న తర్వాత 4 గంటల్లోగా చెల్లింపు పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడా సమయాన్ని అరగంటకు కుదించారు. షియోమి ఎంఐ 4 ఫోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ ఉంది. దీని వేగం 2.5గిగా హెర్ట్జ్లు. ఫోన్లో ర్యామ్ 3 జీబీ ఇచ్చారు. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3080 ఎంఏహెచ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement