xiaomi corporation
-
షావోమీ గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఒకే రోజున 500 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో ’మి స్టోర్స్’ పేరిట అక్టోబర్ 29న వీటిని ప్రారంభించామని షావోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఉన్న పెద్ద స్థాయి ‘మి హోమ్‘ స్టోర్స్ తరహాలోనే ఇవి కూడా ఉంటాయని తెలియజేశారు. 2019 ఆఖరు నాటికి 5,000 పైచిలుకు ’మి స్టోర్స్’ను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు జైన్ చెప్పారు. దీనివల్ల 15,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ‘మి స్టోర్’ ఒకొక్కటీ సుమారు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్ అమ్మకాలతో ప్రారంభమైన షావోమీ.. భారత్‌లో అత్యంత వేగంగా ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతం 50 దాకా ఉన్న మి హోమ్ స్టోర్స్ సంఖ్యను 100కి పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. కేవలం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా లగేజీ, పాదరక్షలు, దుస్తులు వంటి టెక్నాలజీయేతర విభాగాల్లోకి కూడా షావోమీ ప్రవేశిస్తోంది. -
భారత్‌లో షావోమి...
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వీటితోపాటు తమిళనాడులో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ) అసెంబుల్ కోసం తొలి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ) ప్లాంటును కూడా ప్రారంభించింది. తాజా విస్తరణతో కంపెనీ సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా స్థానిక డిమాండ్‌ను అందుకోగలమని షావోమి ధీమా వ్యక్తంచేసింది. ‘ఇప్పటికే స్మార్ట్‌ఫోన్స్ తయారీకి మాకు రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. ఇప్పుడు శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు)లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేశాం. వీటి కోసం ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని షావోమి వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఎండీ మను జైన్ తెలిపారు. యూనిట్ల ఏర్పాటుకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు. ఇక్కడ జరుగుతున్న ‘సప్లయర్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో 50కిపైగా గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కాంపొనెంట్ సప్లయర్స్ పాల్గొంటున్నారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, డీఐపీపీ సెక్రటరీ రమేశ్ అభిషేక్, ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా సంయుక్తంగా ఈ సదస్సును ప్రారంభించారు. భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలని గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కాంపొనెంట్ సప్లయర్స్‌కి మను జైన్ పిలుపునిచ్చారు. ‘ఒకవేళ కాంపొనెంట్ సప్లయర్స్ అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు రావొచ్చు. 50వేల మందికిపైగా ఉపాధికి లభించొచ్చు’ అన్నారాయన. ఇండియాలోని పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు కాంపొనెంట్ సప్లయర్స్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, ఎఫ్‌డీఐ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ వంటి పలు అంశాలను పరిశీలిస్తారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి సప్లయర్స్‌కి తెలియజేసి, వారిని ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని జైన్ తెలిపారు. సెకన్‌కు రెండు ఫోన్ల తయారీ!! భారత్‌లో తాజా విస్తరణతో కంపెనీ తయారీ సామర్థ్యం రెట్టింపవుతుందని, సెకన్‌కు రెండు ఫోన్లను తయారు చేయగలుగుతామని జైన్ తెలిపారు. ‘‘మేం భారత్‌లో తయారు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఫోన్ విలువలో పీసీబీదే సగభాగం. వచ్చే క్యూ3 నాటికి భారత్‌లో తయారయ్యే అన్ని షావోమి ఫోన్లలో ఇక్కడ తయారు చేసిన పీసీబీలనే వాడతాం’’ అన్నారాయన. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్మార్ట్పోన్ల విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించిన నేపథ్యంలో కంపెనీ తయారీ యూనిట్ల ప్రకటన చేయడం ఆసక్తికరం. శామ్సంగ్కు మాత్రమే ప్రస్తుతం ఇండియాలో పీసీబీ కేంద్రం ఉంది. వివో, ఒప్పొ కూడా ఇక్కడే పీసీబీ ఫెసిలిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. భారత్‌లో షావోమికి ఫాక్స్‌కాన్, హిపాడ్ భాగస్వామ్యంతో ఆరు స్మార్ట్‌ఫోన్స్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
సై అంటున్న చైనా యాపిల్
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కార్పొరేషన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు సై అంటోంది. ఎంఐ మాక్స్ పేరుతో ఏకంగా 6.44 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్న ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇది 7.5 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇందులో అధిక సామర్థ్యం కలిగిన 4850 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. దీనివల్ల ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుందన్న భయం అక్కర్లేదు. ఈ కొత్త ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి 32 జీబీ, 64 జీబీ, 128 జీబి. బేస్ మోడల్ ఒక్కదాంట్లో స్నాప్‌డ్రాగన్ 650 చిప్సెట్ ఉండగా, మిగిలిన రెండింటిలో స్నాప్‌డ్రాగన్ 652 చిప్సెట్ ఉంటుంది. 128 జీబీ మోడల్లో 4 జీబీ ర్యామ్ ఉండగా మిగిలిన రెండింటికీ 3జీబీ ర్యామ్ ఉంటుంది. దీని స్క్రీన్ సైజు, ఇతర పారామీటర్లకు అనుగుణంగానే ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 32 జీబీ మోడల్ రూ. 15350, 64 జీబీ మోడల్ అయితే రూ. 17,400, 128 జీబీ మోడల్ అయితే రూ. 20,450 చొప్పున ధర నిర్ణయించారు. వీటన్నింటిలోనూ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వీటితోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జి డ్యూయల్ సిమ్, 4850 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా మూడు వేరియంట్లలోను ఉన్నాయి. తెలుపు, బంగారు, ఊదా రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇందులో ఎంఐయుఐ వెర్షన్ 8 ఉండటంతో.. కొత్త డిజైన్ ఉంటుందని, దాంతోపాటు గ్యాలరీ, నోట్స్, కాలిక్యులేటర్, స్కానర్ లాంటి అన్నీ అప్ డేట్ అయ్యాయని అంఉటన్నారు. అయితే ఇది మార్కెట్లలోకి ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం ఇంకా తెలియలేదు. -
చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి మరో సంచలనంతో ముందుకొచ్చింది. ఇంతకుముందు ఎంఐ3, రెడ్ ఎంఐ1ఎస్ ఫోన్లతో సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన షియోమి కార్పొరేషన్.. తాజాగా 16 జీబీ, 64 జీబీ వేరియంట్లతో కూడిన ఎంఐ4 స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే.. అదీ మంగళవారమే రెండు వేర్వేరు ఫ్లాష్ సేల్స్‌లో అమ్ముతున్నారు. ఈసారి ఎన్ని ఫోన్లు అమ్మకానికి పెట్టామన్న విషయాన్ని మాత్రం షియోమి ప్రకటించలేదు. సోమవారంతోనే రెండు వేరియంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు పూర్తయింది. 16 జీబీ వేరియంట్ ధరను రూ. 19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ. 23,999 గాను నిర్ణయించారు. 16 జీబీ వేరియంట్ మొత్తం 25వేల యూనిట్లు పెట్టగా 15 సెకండ్లలోనే అమ్ముడయ్యాయి. ఇంతకుముందు పర్చేజ్ ఆప్షన్ క్లిక్ చేసి, మనకు ఫోన్ వచ్చిందనుకున్న తర్వాత 4 గంటల్లోగా చెల్లింపు పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడా సమయాన్ని అరగంటకు కుదించారు. షియోమి ఎంఐ 4 ఫోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ ఉంది. దీని వేగం 2.5గిగా హెర్ట్జ్లు. ఫోన్లో ర్యామ్ 3 జీబీ ఇచ్చారు. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3080 ఎంఏహెచ్.