4 నెలల కనిష్టానికి పసిడి
ప్రపంచ మార్కెట్లో ధరలు క్షీణించిన ప్రభావంతో గతవారం దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి ధర రూ. 26,000 లోపునకు దిగొచ్చింది. అంతక్రితంవారంతో పోలిస్తే రూ. 250 క్షీణించి రూ. 25,920 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛతగల పుత్తడి ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 25,770 వద్ద ముగిసింది. న్యూయార్క్ ఎక్స్చేంజ్‌లో ఔన్సు పసిడి ధర దాదాపు 15 డాలర్లు కోల్పోయి.. 1,132 డాలర్ల వద్ద క్లోజయ్యింది.