New York Stock Exchange
-
అమెరికా మార్కెట్లు ఢమాల్ : ట్రేడింగ్ నిలిపివేత
కోవిడ్-19 (కరోనా వైరస్) గ్లోబల్ మార్కెట్లను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా అమెరికా మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎస్ అండ్ పీ 500 7 శాతం, నాస్డాక్ కంపోజిట్ 7.1 శాతం కుప్పకూలింది. బెంచ్ మార్క్ డౌజోన్స్ ఇండస్ట్రీయిల్ యావరేజ్ 2000 పాయింట్లకు పైగా (7.8శాతం) నష్టపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపివేశారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే అదిపెద్ద పతనంగా నిపుణులు తెలిపారు.15 నిమిషాలు పాటు ట్రేడింగ్ నిలిపివేయడంమంటేనే అమ్మకాల సెగ ఏ స్థాయిలో వుందో అంచనా వేయవచ్చు. 15 నిమిషాల తరువాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనా భారీ నష్టాలుకొనసాగుతున్నాయి. అటు చమురు ధరలు రికార్డు కనిష్టానికి చేరడంతో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో 2450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 1942 నష్టంతో ముగిసింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5శాతం, క్షీణించగా, ఆస్ట్రేలియా మార్కెట్లు 7.3 శాతం కుప్పకూలాయి. చైనాలో, షాంఘై కాంపోజిట్ బెంచ్ మార్క్ 3శాతం, పడిపోగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించింది. దీంతో మహా పతనంగా, బ్లాక్ మండేగా విశ్లేషకులు అభివర్ణించారు. వైరస్ భయాలకు తోడు సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ కారణంగా చమురు ధర సోమవారం దాదాపు 30 శాతం క్షీణించి 31.14 డాలర్లకు చేరుకుంది. ఇది 1991లో గల్ఫ్ యుద్ధం ప్రారంభం తరువాత ఇదే అతిపెద్ద సింగిల్-డే పతనం. ఇంతటి పతనాన్ని ఇటీవలి కాలంలోచూడలేదని సెవెన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు జస్టిన్ ఉర్క్హార్ట్-స్టీవర్ట్ వ్యాఖ్యానించారు. చదవండి : రిలయన్స్‌కు చమురు షాక్ కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు -
4 నెలల కనిష్టానికి పసిడి
ప్రపంచ మార్కెట్లో ధరలు క్షీణించిన ప్రభావంతో గతవారం దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి ధర రూ. 26,000 లోపునకు దిగొచ్చింది. అంతక్రితంవారంతో పోలిస్తే రూ. 250 క్షీణించి రూ. 25,920 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛతగల పుత్తడి ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 25,770 వద్ద ముగిసింది. న్యూయార్క్ ఎక్స్చేంజ్లో ఔన్సు పసిడి ధర దాదాపు 15 డాలర్లు కోల్పోయి.. 1,132 డాలర్ల వద్ద క్లోజయ్యింది. -
ఎన్వైఎస్ఈ ఎఫెక్ట్... రిస్క్ మేనేజ్మెంట్పై సెబీ సమీక్ష
ముంబై : అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్వైఎస్ఈ)లో సాంకేతిక సమస్య కారణంగా బుధవారం 4 గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోవడంతో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు దృష్టిసారించాయి. దేశీ మార్కెట్లలో మొత్తం రిస్క్ మేనేజ్మెంట్, విపత్తుల రికవరీ వ్యవస్థలపై గురువారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా సిస్టమ్స్ అన్నింటినీ క్రమంగా ఇప్పటికే అప్‌గ్రేడ్ చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు. సమీక్షలో అన్ని సిస్టమ్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైందని, ఎలాంటి సమస్యలూ గుర్తించలేదన్నారు. ఎన్వైఎస్ఈలో సాంకేతిక సమస్యను నాలుగు గంటల తర్వాత పరిష్కరించడంతో ఆ ఎక్స్ఛేంజ్లో ముగింపు సమయంలో ట్రేడింగ్ జరిగింది. కాగా ఈ సాంకేతిక సమస్యకు అంతర్గత సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్స్ కొంతవరకూ కారణమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సైబర్ దాడులు వంటివి ఈ సమస్యకు కారణం కాదని కూడా అమెరికా నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలు స్పష్టం చేశాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎస్ఈసీ) పేర్కొంది. మరోపక్క, బుధవారం కంప్యూటర్ సంబంధ సమస్యల కారణంగానే యునెటైడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు రెండు గంటలపాటు నిలిచిపోవడం, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెబ్సైట్ తాత్కాలికంగా పనిచేయకపోవడంతో అక్కడి నియంత్రణ సంస్థలకు ముచ్చెమటలు పట్టించింది. -
నిలిచిపోయిన ఎన్వైఎస్ఈ
♦ సాంకేతిక సమస్యలతో న్యూయార్క్ ఎక్స్ఛేంజీ నిలిపివేత ♦ షేర్లలో లావాదేవీల్లేవు; ముందస్తు ఆర్డర్లు కూడా రద్దు ♦ బుధవారం రాత్రి 9కి హాల్టు; అర్ధరాత్రికీ చక్కబడని తీరు ♦ సైబర్ దాడి కాదని... సాంకేతిక సమస్యలేనని చెబుతున్న అధికారులు ♦ యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌కూ సాంకేతిక బెడద; విమానాలన్నీ నిలిపివేత ♦ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్ డౌన్ న్యూయార్క్ : అమెరికాలో అనూహ్య సంఘటనలు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా పేరొందిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ తీవ్రమైన సాంకేతిక సమస్యలతో అల్లాడిపోయింది. ఫలితంగా ఈ ఎక్స్ఛేంజీలో లిస్టయిన షేర్లన్నిట్లోనూ లావాదేవీలు నిలిపేశారు. అప్పటికే పెట్టిన ఓపెన్ ఆర్డర్లన్నిటినీ రద్దు చేస్తున్నట్లు కూడా ఎక్స్ఛేంజీ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ విమానయాన సంస్థ యునెటైడ్ ఎయిర్లైన్స్నూ సాంకేతిక సమస్యలు అట్టుడికించాయి. దీంతో అమెరికాలోని తమ విమానాలన్నిటినీ ఈ సంస్థ అత్యవసరంగా కిందికి దింపేసింది. బయలుదేరాల్సిన విమానాలనూ కొంతసేపు నిలిపివేసింది. అదే సమయంలో ప్రముఖ ఫైనాన్షియల్ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్ కూడా పనిచేయకుండా డౌనయిపోయింది. దీనికి కారణాలు తెలియరాకపోగా... యునెటైడ్ ఎయిర్‌లైన్స్ మాత్రం రౌటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని, దీన్ని సరిచేసి మళ్లీ అన్నిటినీ పునరుద్ధరించామని తెలియజేసింది. ఈ 3 ఘటనలకూ సంబంధం లేకపోయినా, దాదాపు ఒకే సమయంలో జరగటంతో ప్రాధాన్యమేర్పడింది. రాత్రి 9 గంటల నుంచీ నిలిపివేత... భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గ ంటల సమయంలో ట్రేడింగ్‌ను నిలిపేస్తున్నట్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. దాదాపు రాత్రి 12 గంటల సమయానికి కూడా పరిస్థితి చక్కబడలేదు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (ఎస్ఈసీ) అధికారులు అధ్యక్షుడు ఒబామాకు కూడా పరిస్థితిని తెలియజేశారు. ‘‘ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. కాకపోతే ఇది సాంకేతిక సమస్యే తప్ప సైబర్ దాడి కాదని మేం నమ్ముతున్నాం’’ అని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ట్రేడింగ్‌ను ఎప్పుడు పునరుద్ధరించేదీ మాత్రం ఈ వర్గాలు చెప్పలేకపోయాయి. రోజుకు 180 బిలియన్ డాలర్ల లావాదేవీలు... న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ పరిధిలో దాదాపు నాలుగు ఇండెక్స్లున్నాయి. ఎన్వైఎస్ఈ కాంపోజిట్ ప్రధాన ఇండెక్స్ కాగా, ఎన్వైఎస్ఈ 100 కూడా దీన్లో భాగమే. ఇంకా డౌజోన్స్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు కూడా ఒప్పందం మేరకు దీని పరిధిలోనే పనిచేస్తాయి. ఎన్వైఎస్ఈలో ప్రతిరోజూ నమోదయ్యే లావాదేవీల పరిమాణ సగటు 180 బిలియన్ డాలర్లు. మార్కె ట్ క్యాపిటల్ దృష్ట్యా ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్ఛేంజీ. ఎందుకంటే దీన్లో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ దాదాపు 16.6 ట్రిలియన్ డాలర్లు. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ (ఐసీ ఈ) అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండగా.. ట్రేడింగ్ నిలి చిపోయే సమయానికి ఆ సంస్థ షేరు విలువ దాదాపు 4% నష్టపోయింది. -
న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ఢాం..
న్యూయార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం 11:30 గంటలకు) ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇలా జరిగిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. 'తదుపరి సమాచారం కాసేపట్లో' అనే సమాధానం తప్ప ఎక్నేంజికి సంబంధించిన సైట్ లో వివరాలేవీ కానరావడంలేదు. ఒక్కసారిగా క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లు గాభరాపడ్డారు. అయితే సమస్యను పరిష్కరిస్తామని స్టాక్ ఎక్సేంజ్ అధికారులు ప్రకటించడంతో కాస్త కుదుటపడినట్లు తెలుస్తోంది. -
నాస్డాక్లో వీడియోకాన్ డీ2హెచ్ లిస్టింగ్
32.5 కోట్ల డాలర్ల ఏడీఆర్‌ల సమీకరణ న్యూయార్క్: భారత్‌లో డెరైక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలందించే వీడియోకాన్ డీ2హెచ్ కంపెనీ అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్(నాస్డాక్)లో లిస్టయింది. అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్(ఏడీఆర్)ద్వారా ఈ కంపెనీ 32.5 కోట్ల డాలర్లు సమీకరించింది. లిస్టింగ్ సందర్భంగా భారత ఎంపీ రాజ్‌కుమార్ ధూత్, వీడియోకాన్ డీ2హెచ్ ఎండీ సౌరభ్ ధూత్‌లు నాస్డాక్ స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ బెల్‌ను మోగించారు. నాస్డాక్లో లిస్టింగ్ కావడం తమ కంపెనీ చరిత్రలోనే కాకుండా మొత్తం భారత మీడియా పరిశ్రమకు కీలకమైన మైలురాయని సౌరభ్ ధూత్ చెప్పారు. 2000 సంవత్సరం తర్వాత విదేశాల్లో లిస్టైన తొలి భారత ప్రైవేట్ కంపెనీ ఇదే. అంతేకాకుండా నాస్డాక్లో లిస్టైన తొలి భారత మీడియా కంపెనీ కూడా ఇదే.