న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ఢాం..
న్యూయార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం 11:30 గంటలకు) ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇలా జరిగిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
'తదుపరి సమాచారం కాసేపట్లో' అనే సమాధానం తప్ప ఎక్నేంజికి సంబంధించిన సైట్ లో వివరాలేవీ కానరావడంలేదు. ఒక్కసారిగా క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లు గాభరాపడ్డారు. అయితే సమస్యను పరిష్కరిస్తామని స్టాక్ ఎక్సేంజ్ అధికారులు ప్రకటించడంతో కాస్త కుదుటపడినట్లు తెలుస్తోంది.