సాక్షి, హైదరాబాద్ : ఆన్‌లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆన్‌లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నలుగురు వ్యక్తులు కలిసి దేశ వ్యాప్తంగా 120 మంది నుంచి 5 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఓ మహిళ వీరి వద్ద 7.26,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయింది.
ఇన్వెస్ట్‌మెంట్ అంతా హవాలా రూపంలో జరిగింది. సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి నిందితులను పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల నుంచి 13 లక్షల రూపాయలు, ఒక ల్యాప్‌టాప్, 6 సెల్‌పోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ట్రేడింగ్ సెంటర్స్ ద్వారా వచ్చే బల్క్ ఎస్‌ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా మెలగాలని, సీఐబీఐలో రిజిస్టర్ అయిన వాళ్ల దగ్గర మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment