cyberabad
-
Hyderabad: వీధుల్లో వ్యభిచారం!
మూసాపేట: రాష్ట్రంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. కమిషనరేట్ పరిధిలో బస్టాప్‌లు, నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వీధుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆటకట్టించారు. గత నెల రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 53 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. వ్యభిచారంపై నిఘా పెట్టేందుకు మానవ అక్రమ రవాణా విభాగం (ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్‌తో పాటు కూకట్పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో బాలానగర్ డీసీపీ కే సురేష్ కుమార్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి కూకట్పల్లి ఏసీపీ కే శ్రీనివాస రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 7 మంది ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, 36 మంది కానిస్టేబుళ్లతో మొత్తం 49 మంది సిబ్బంది ఉంటారు. బుధవారం రాత్రి భాగ్యనగర్ బస్టాప్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ల పరిధిలో జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించి 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్–35 కింద నోటీసులు జారీ చేశారు. వీరిపై అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం–1956 కింద కూకట్‌పల్లిలో మూడు, కేపీహెచ్బీలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్స్‌లోనూ 22 మందిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. -
HYD: స్కూల్‌కు వెళ్లిన బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇక, ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్‌కు గురైంది. బుధవారం స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలను దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పాపను ఎటు వైపు తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ట్రాఫిక్‌పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్‌లో కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్ కేసు
హైదరాబాద్, సాక్షి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్‌లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు. -
Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్‌లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం! -
Cyberabad: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు కమిషనర్ అవినాష్ మహంతి. తాజాగా కేపీహెచ్‌బీ పరిధిలో సీఐ వెంకట్, ఆర్జీఐ సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీపీ వీరిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పరిధిలో ఓ కేసులో ఎంక్వయిరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టడమే కాకుండా థర్ద్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు బాధితుడి కుటుంబ సభ్యులు. తీవ్రమైన గాయాలతో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. అనంతరం గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో, వెంటనే సీపీ విచారణకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వీరిని సస్పెండ్ చేశారు. ఒకే కేసులో సరిగా విచారణ చేయనందుకే శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. -
సిక్ చౌహానీలో సిక్కు కమ్యూనిటీతో సీపీ స్టీఫెన్ సమావేశం
-
Hyderabad: నగరంలో భారీగా ట్రాఫిక్‌జాం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షం నగరానికి మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. నగరంలో చాలాచోట్ల వాన నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే భారీగా పలు రూట్లలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్.. హైదరాబాద్ శివారు అయిన సైబరాబాద్‌లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఐకియా నుంచి జేఎన్టీయూ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు నానక్‌రామ్ గూడ, బయో డైవర్సిటీ రూట్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ రూట్లలోనూ భారీ వర్షంతో ట్రాఫిక్‌కు విఘాతం కలుగుతోంది. మరికాసేపట్లోనూ వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశాలతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదీ చదవండి: మళ్లీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ -
HYD: భారీగా డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో కింగ్ పిన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నివారణకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సప్లై మాత్రం ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల.. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. సైబరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్‌ను సీజ్ చేశారు. కాగా, డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్‌గా ఉన్న చింతా రాకేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ ముఠా.. ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. తాజాగా దొరికిన ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు.. అసలు విషయం తెలిసి షాక్! -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
-
డేటా లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: డేటా లీక్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 6 మెట్రోపాలిటిన్ సిటిల్లో 4.5 లక్షల ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడు. మొత్తం 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. బుక్ మై షో, ఇన్స్టాగ్రామ్ జొమాటో, పాలసీ బజార్ నుంచి డేటా చోరీ చేశారని తెలిపారు. బైజూస్, వేదాంత సంస్థల డేటా కూడా లీకైనట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటితో పాటు 9, 10, 11, 12 తరగతులు విద్యార్థులు డేటా, పాన్‌కార్డ్, క్రెడిట్‌కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్‌కంట్యాక్స్, ఢిఫెన్స్ డేటా కూడా చోరికి గురైంది. చదవండి: కడుపు తరుక్కుపోయింది.. కన్నీళ్లు ఆగలేదు: సీఎం కేసీఆర్ -
పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
రాయదుర్గం: పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్ పోలీసు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం పునరుద్ధరించిన సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించడం జరుగుతుందని, సొసైటీ సభ్యులంతా కలిసి సొసైటీని ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ సభ్యులకు మేలు చేసే కొత్త ఆలోచలనకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధమన్నారు. సైబరాబాద్ అన్ని రకాల ఫార్మాట్లలో ముందుగా ఉందని, ముఖ్యంగా క్రైమ్ డిటెన్షన్ సైబర్ క్రైమ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్, 17 ఫంక్షనల్ వరి్టకల్స్లో టాప్‌లో ఉందన్నారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క సర్విసులు, సొసైటీ యాప్ ద్వారా సభ్యులు చూసుకోవచ్చన్నారు. సొసైటీలో లావాదేవీలు అన్నీ పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో 72 ఏళ్ల చరిత్ర గల పాత సొసైటీని మూసివేస్తూ కోఆపరేటివ్ సొసైటీ ఆర్డర్ల ప్రకారం కొత్త సొసైటీని ప్రారంభించనున్నారు. సొసైటీలో గతేడాది ఏప్రిల్ 1 నాటికి ఉన్న షేర్ హోల్డర్లకు 40 శాతం, 2022–23 ఏడాదికి ఉన్న షేర్ హోల్డర్లకు 11 శాతం డివిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సభ్యులు నెలవారీ పొదుపునకు ఇచ్చే వడ్డీ 7.5 శాతం నుంచి 8 శాతానికి నిర్ణయించారు. ప్రతి సభ్యుడికి రూ.10 లక్షల గాను 8.5 శాతం వడ్డీపై లోన్లు ఇవ్వడానికి సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, అడ్మిన్ డీసీపీ యోగేష్ గౌతమ్, సొసైటీ సెక్రెటరీ, ఏసీపీ సురేందర్‌రావు, కోశాధికారి జి.మల్లేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, డైరెక్టర్లు, ఎస్ఈ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ సరిత, హెడ్‌కానిస్టేబుల్ రాజారెడ్డి, కె.మాధవీలతా, ఇతర సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. -
సైబరాబాద్ శివారు ఫాంహౌస్లపై ఎస్వోటీ పోలీసుల దాడులు
-
Hyderabad: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!
సాక్షి హైదరాబాద్: ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అనే కాన్సెప్ట్ కాదు వీళ్లది. సమాజానికి తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే గుణం! కార్యాలయాలు, విద్యా సంస్థల పునఃప్రారంభంతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటంతో నియంత్రణ, క్రమబద్దీకరణలో వీళ్లూ భాగస్వామ్యులవుతున్నారు. వారే ట్రాఫిక్ పోలీసులతో సమానంగా రోడ్ల మీద విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ వలంటీర్లు! ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు గత తొమ్మిదేళ్లుగా సైబరాబాద్ పరిధిలో మేము సైతం అంటూ ట్రాఫిక్ సేవ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన ట్రాఫిక్ వలంటీర్లను బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా యెదుల తదితరులు పాల్గొన్నారు. 2013 నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 4,500 మంది ట్రాఫిక్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. వలంటీర్లుగా సేవలు అందించాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఏడీఎట్దిరేట్ఎస్సీఎస్సీ.ఇన్ కు మెయిల్ లేదా 9177283831 నంబరులో సంప్రదించాలి. వలంటీర్లు ఏం చేస్తారంటే... తొలుత సాధారణ ట్రాఫిక్ సమయంలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులకు వలంటీర్లు మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ (డీడీ), ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించి చలాన్లు జారీ చేయించడం, రోడ్డు ప్రమాదాలలో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో వంటి వాటిల్లో కూడా సహాయం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఈ ట్రాఫిక్ వలంటీర్లు 5,500 గంటలు పని చేశారు. 8,200 ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించారు. వీరిలో 6,100 మంది వాహనదారులకు చలాన్లు జారీ అయ్యాయి. (క్లిక్ చేయండి: మెట్రో స్టేషన్లో బ్యాగులు తారుమారు.. ట్వీట్ చేయడంతో..) ఒత్తిడి తగ్గుతుంది అన్ని వర్గాల ప్రజల నుంచి ట్రాఫిక్ వలంటీర్లకు ఆసక్తిగా కనబర్చటం హర్షణీయం. కొన్ని ఐటీ కంపెనీలైతే వారి సెక్యూరిటీ గార్డులను వలంటీర్లగా నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల రాకపోకల సమయంలో వాళ్లే ఆయా మార్గంలోని ట్రాఫిక్‌ను నియంత్రించుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై పని ఒత్తిడి తగ్గుతుంది. – టీ.శ్రీనివాస రావు, డీసీపీ, ట్రాఫిక్ సైబరాబాద్ -
సైబరాబాద్ పీఎస్ పరిధిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు
-
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్‌తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్‌టాప్‌లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం తో దాడి
-
సైబరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్
-
సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కంపెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్ దాడులు చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిగాయి. కంపెనీపై సైబర్ దాడి చేసి కేటుగాళ్లు డేటాను చేజిక్కించుకున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులే సైబర్ అటాక్ చేసినట్టు సమాచారం. హాంగర్ కంపెనీ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం, కంపెనీ ఉద్యోగులు విజయ్‌కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల నుంచి రివాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక, అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. -
పాఠశాలల్లో ‘షీ’క్రెట్ ఏజెంట్స్.. గుడ్, బ్యాడ్ టచ్‌లపై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పనేంటంటే? ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్ టచ్‌లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. నివాసిత సంఘాల్లోనూ.. నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్‌లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్) -
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్‌లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్‌ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్‌ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్‌పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఒక జోన్.. ఏడు ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్ జోన్‌గా.. అలాగే శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లు కలిపి శంషాబాద్ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్‌ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్ జోన్లో కలపనున్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), జోన్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్ పునర్ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్ పరిధిలోని జన్వాడ, శంకర్పల్లి స్టేషన్ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్‌ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
సైబరాబాద్: ఖాకీలపై మూడో కన్ను
సాక్షిహైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల పనితీరుపై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పోస్టింగ్‌లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్ఐ)లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే, అక్రమాలకు పాల్పడే పోలీసులను ఏమాత్రం ఉపేక్షించేదిలేదని స్పష్టంచేస్తున్నారు. అంతర్గత విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకేసారి 126 మంది ఎస్ఐలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. రెండేళ్లు పైబడితే బదిలీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో మొత్తం 36 శాంతి భద్రతల ఠాణాలున్నాయి. ఒకే పీఎస్‌లో రెండేళ్లకు మించి పోస్టింగ్‌లో ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే పోలీసు అధికారుల పనితీరు, సమర్థతను బట్టి పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. తాజాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్ల నుంచి ఒక్కొక్కరు, బాలానగర్ జోన్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎస్ రమేష్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న ప్రశాంత్‌ను, జీడిమెట్ల ఇన్స్పెక్టర్గా ఉన్న బాలరాజు స్థానంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్‌లను బదిలీ చేశారు. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ బాలకృష్ణను బదిలీ చేసి, ఆయన స్థానంలో షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్యను సీసీఎస్‌కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏసీబీ నాగేంద్రబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బీ నివేదికల ఆధారంగా.. పోలీసుల పనితీరుపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో వారి పనితీరు, అక్రమాలపై కూపీలాగుతూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఎస్బీ అధికారులకు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు రుజువైన పోలీసులపై చర్యలతో పాటు భవిష్యత్తులో వారికి పదోన్నతి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో పనిచేసిన ముగ్గురు ఎస్ఐలను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో నార్సింగి ఇన్స్పెక్టర్గా పనిచేసిన గంగాధర్ స్థానికంగా భూ లావాదేవీలలో తలదూర్చి అక్రమార్కులకు వంత పాడిన ఆరోపణల నేపథ్యంలో గంగాధర్‌తో పాటు ఎస్ఐ లక్ష్మణ్‌లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రాములు (ప్రస్తుతం రాజేందర్ పీఎస్) బలరాం నాయక్ (నార్సింగి పోలీస్ స్టేషన్), అన్వేష్ రెడ్డి (ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లు సహకరించారని, అంతర్గత విచారణలో నిజమని తేలడంతో రెండేళ్ల తర్వాత వారిపై వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ మురళీధర్ భగవత్ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్ సీపీని ఇన్చార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు గత వారం సైబరాబాద్ కమిషనర్ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్చార్జ్ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్చార్జ్ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు రూపొందించే పెరిస్కోప్ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో (ఐఎస్బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులతో సైబరాబాద్ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. -
కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙
సాక్షి, హైదరాబాద్: కరక్కాయ పొడి విక్రయం పేరిట సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించి, కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ (ఓపీసీ)కు చెందిన మినీ బస్సు వేలానికి సైబరాబాద్ కాంపిటెంట్ అథారిటీ (సీసీఏ) మరోసారి సిద్ధమైంది. ఈసారి 40 సీట్ల సామర్థ్యం ఉన్న అశోక్ లేల్యాండ్ బస్సు (ఏపీ16 టీసీ 4691) రిజర్వ్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తొలిసారి బస్సు వేలం నిర్వహించినప్పుడు రిజర్వ్ ధర రూ.5 లక్షలుగా, రెండోసారి ఏప్రిల్ 20న ధర రూ.4.50 లక్షలుగా నిర్ధారించారు. అయితే రెండు సందర్భాల్లోనూ బిడ్డింగ్‌లో ఎవరూ పాల్గొనకపోవటం గమనార్హం. దీంతో మూడోసారి బస్సు వేలం నిర్వహించేందుకు సీసీఏ ప్రతినిధులు సిద్ధమయ్యారు. వచ్చే నెల 17, మధ్యాహ్నం 1 గంటలోగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), డాక్యుమెంట్లను సమర్పించాలి. 18న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్లైన్లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన నగదును దామాషా ప్రాతిపదికన బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. ఓపీసీ కంపెనీ కరక్కాయ పొడి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మించి 425 మంది నుంచి రూ.3 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. ఈ కేసులో నిందితులు మాటూరి దేవ్‌రాజ్ అనిల్ కుమార్ అలియాస్ రాజన్, ముప్పాల మల్లికార్జున, వడ్డె వెంకయ్య నాయుడు అలియాస్ వెంకయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.59.5 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకు న్నారు. గోల్డ్, బైక్ వేలం పూర్త యిన విషయం తెలిసిందే. (చదవండి: నూకల పరిహారం ఎంతిద్దాం? )