సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐలకు స్థానచలనం కలిగింది.
సాక్షి,సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. సైబర్‌క్రైమ్స్ సీఐ కె.బాలకృష్ణారెడ్డిని కొత్తగా ఏర్పాటు చేసిన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు, దుండిగల్‌లో పనిచేస్తున్న సీహెచ్ శంకర్‌రెడ్డిని జీడిమెట్లకు, శంషాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బొల్లం శంకరయ్యను దుండిగల్‌కు, శంషాబాద్ సీసీఎస్‌లో ఉన్న చంద్రబాబును సైబర్‌క్రైమ్స్‌కు, వెకెన్సీ రిజర్వులో ఉన్న పుష్పన్‌కుమార్‌ను సీసీఎస్ శంషాబాద్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.