HYD: స్కూల్‌కు వెళ్లిన బాలిక మిస్సింగ్‌.. గాలిస్తున్న పోలీసులు | School Girl Missing In Cyberabad Rayadurgam Area | Sakshi
Sakshi News home page

HYD: స్కూల్‌కు వెళ్లిన బాలిక మిస్సింగ్‌.. గాలిస్తున్న పోలీసులు

Published Wed, Aug 14 2024 9:18 PM | Last Updated on Wed, Aug 14 2024 9:20 PM

School Girl Missing In Cyberabad Rayadurgam Area

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్‌ కావడం కలకలం సృష్టించింది. స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇక, ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్‌కు గురైంది. బుధవారం స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్‌ గాలింపు చర్యలను దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పాపను ఎటు వైపు తీసుకెళ్లాడు  అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement