Girl missing
-
చిత్తూరులో 14 ఏళ్ల బాలిక అదృశ్యం
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. నగరంలోని చామంతిపురానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి గల్ఫ్ దేశంలో పొట్టకూటి కోసం వెళ్లారు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలిక ఆదివారం చికెన్ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి, తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు చెప్పి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మంగళవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని.. మహిళలు మిస్ అవుతున్నా, అఘాయిత్యాలు, అత్యాచారాలకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. చిత్తూరులో కనిపించకుండాపోయిన బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చామంతిపురం వాసులు మంగళవారం రాత్రి వన్‌టౌన్ స్టేషన్ వద్దకు చేరుకుని బాలిక వివరాలు చెప్పాలని నిరసన తెలిపారు. -
తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక?
సాక్షి, తిరుపతి: నగరంలోని కొర్లగుంటలో నివాసం ఉంటున్న ఓ బాలిక అదృశ్యమైంది. ఈస్ట్ సీఎస్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్లగుంట మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమార్తె ఆక్సా క్వీన్(14) సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.దీంతో వెంటనే ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాప హైదరాబాద్‌కి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తూ.. వాటర్ డ్రైవర్‌తో మాట్లాడినట్లుగా గుర్తించారు. బాలిక ఆచూకీ లభ్యమైతే 9440348671, 9440796748 నంబరులో సంప్రదించాలని సూచించారు. మరో బాలిక..ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
HYD: స్కూల్‌కు వెళ్లిన బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇక, ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్‌కు గురైంది. బుధవారం స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలను దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పాపను ఎటు వైపు తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
Gunshot: చిన్నారులపై అత్యాచారాలు.. బాబుకు కనపడవు, పవన్ కు వినపడవు
-
ముచ్చుమర్రి బాలిక కేసులో నిందితులు చెప్పిన నిజాలు
-
గిరిజన బాలిక ఎక్కడ బాబూ?
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. – ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాష్ట్రంలో 34వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు. వలంటీర్లు ఎత్తుకుపోయారు. వాళ్ల ఆచూకీ తెలియాలి. మేం అధికారంలోకి వస్తే అదృశ్యమైన బాలికలను సురక్షితంగా వెనక్కి రప్పిస్తాం. – ఎన్నికలకు ముందు పవన్‌కళ్యాణ్ సాక్షి, అమరావతి/నందికొట్కూరుగత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నానా యాగీ చేసిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి పది రోజులైంది. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు.ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు మీడియాకు లీకులివ్వడం విడ్డూరంగా ఉంది. వారంరోజులుగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు సాగిస్తున్న డ్రామా వెనుక పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. బాలిక అదృశ్యం వెనుక ఉన్న టీడీపీ పెద్దల కుటుంబ సభ్యులను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ముగ్గుర్ని అరెస్టుచేశామని హోంమంత్రి అనిత సోమవారం చెప్పగా.. నంద్యాల పోలీసులు మాత్రం అరెస్టుచేసినట్లు చెప్పనేలేదు. అంటే ఆ ముగ్గుర్ని అరెస్టు చూపించడం ద్వారా అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నిందన్నది సుస్పష్టమవుతోంది. బాలిక తల్లిదండ్రుల మొర వినిపించిందా?అదృశ్యమైన గిరిజన బాలిక ఎక్కడుంది చంద్రబాబు? మీరు పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అయిదో తరగతి విద్యార్థిని ఈనెల 7న అదృశ్యమైందనే విషయం తెలుసా అసలు? శ్వేతపత్రాల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే హడావుడిలో ఉన్న మీకు ‘మా అమ్మాయిని సురక్షితంగా తీసుకురండి.. కనీసం బతికుందో లేదో చెప్పండి’.. అన్న ఆమె తల్లిదండ్రుల మొర వినిపించనే లేదు. కనీసం హోంమంత్రిని పంపించి ధైర్యం చెప్పాలనిపించలేదు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డితోనైనా ధైర్యం చెప్పించారా? ఈ ఒక్క బాలికనైనా తీసుకురండి పవన్..రాష్ట్రంలో వలంటీర్లు ఏకంగా 34వేల మంది బాలికలను అదృశ్యం చేశారని ఎన్నికల ముందు నానా యాగీ చేసిన పవన్.. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నోరెందుకు మెదపడంలేదు!? తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించాలని బాలిక తల్లిదండ్రులు ప్రాథేయపడుతున్నారు. మరి మీరెందుకు ఆ బాధిత తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు? పోలీసు అధికారులను ఎందుకు ప్రశ్నించలేదు? గిరిజన బాలిక విషయంలో మీరెందుకు చిత్తçశుద్ధి చూపించలేదు? ఈ ఒక్క బాలికనైనా తీసుకొచ్చి చూపించండి పవన్!దర్యాప్తు పక్కదారి పట్టిస్తున్న పోలీసులు..ఇక గిరిజన బాలిక అదృశ్యం కేసును పోలీసు శాఖ ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈనెల 7న ఉదయం నుంచి బాలిక కనిపించడంలేదు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండ్రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారం రోజులుగా విచారిస్తున్నారు. అయినా, బాలిక ఆచూకీపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది.ఎందుకంటే ఆ ముగ్గురే బాలికను అత్యాచారం చేసి హత్యచేసినట్లు పోలీసులే మీడియాకు లీకులివ్వడం ప్రశ్నార్థకంగా మారింది. మృతదేహం కోసం పోలీసుల గాలింపు సందేహాస్పదంగా ఉంది. నిందితులు చెప్పారంటూ మూడుచోట్ల గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం చేసిన హడావుడితో ఈ కేసులో అసలు దోషులను కాపాడేందుకు సిద్ధమైందన్నది తేలిపోయింది.బాలిక అదృశ్యం వెనుక కొందరు టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులుగానీ సన్నిహితుల పాత్రగాని ఉందని ముచ్చుమర్రిలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాలిక సురక్షితంగా ఉందా.. అత్యాచారం చేశారా.. హత్య చేశారా అన్నది ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. ముగ్గురు నిందితులు అరెస్టు : హోంమంత్రిఇక నంద్యాల జిల్లాలో గిరిజన బాలిక ఘటన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేశామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదని ఆమె సోమవారం మీడియాకు చెప్పారు. ఈ ఘటనలో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు, విజయనగరం జిల్లాలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయంగా చంద్రబాబు ప్రకటించారని ఆమె తెలిపారు. మరోవైపు.. నంద్యాల జిల్లా పోలీసులు మాత్రం నిందితులను అరెస్టుచేసినట్లు సోమవారం అర్థరాత్రి వరకు వెల్లడించలేదు.చంద్రబాబు, పవన్‌పై జనాగ్రహం..సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వారెందుకు మౌనం వహించారని ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ దత్తత తీసుకున్న కొణిదెల గ్రామానికి కూతవేట దూరంలో బాలిక అదృశ్యమై పది రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో లా అండ్ ఆర్డర్ అంటే ఇదేనా పవన్ అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లభించకపోవడం విడ్డూరం.ఆ ముగ్గుర్ని చంపేయాలిపది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’.. అని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. -
బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రుల ఆవేదన
-
ఇంకా వీడని ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యం మిస్టరీ
-
ఇంకా మిస్టరీగానే నంద్యాల ముచ్చుమర్రి కేసు!
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు. అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.చదవండి: రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! -
సెల్‌ఫోన్ మాట్లాడవద్దన్నందుకు..
కాచిగూడ: సెల్‌ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాచిగూడ ఎస్ఐ నరేష్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచిగూడ, సుందర్‌నగర్ లోని బంధువుల ఇంటికి వచ్చారు. బాలాజీరావు కుమార్తె సీహెచ్ గౌరీ (13) 8వ తరగతి చదువుతోంది. సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి లోనైన మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. సెల్‌ఫోన్ కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. గౌరి సోదరుడు విష్ణు కార్తి ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వద్దంటే భర్త డ్యూటీకి వెళ్లాడని..
హైదరాబాద్: నెల రోజుల క్రితమే నేపాల్‌లో వివాహం చేసుకుని భర్తతో నగరానికి వచ్చిన నేపాల్‌కు చెందిన యువతి అదృశ్యమైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్ఐ నరేష్ కుమార్ సమాచారం మేరకు... హిమాయత్‌నగర్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేసే సోను తాప నెల క్రితం నేపాల్‌లోని తన పక్క గ్రామం అంజ్‌కోట్‌కు చెందిన ఊర్మిళ (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే భార్య ఊర్మిళను నగరానికి తీసుకొచ్చాడు. హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ హాల్ లేన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీన మధ్యహ్నం 2 గంటల సమయంలో భర్త సోను డ్యూటీకి వెళ్తుండగా ఊర్మిళ ఈ రోజు డ్యూటీ వెళ్లవద్దని చెప్పిందని, అయినా సోను డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో భార్య ఊర్మిళ తాను తన అమ్మవారి ఇంటికి నేపాల్‌కి తిరిగి వెళ్లిపోతున్నట్లు భర్తకు మెసేజ్ చేసింది. వెంటనే భర్త ఇంటికి వచ్చి చూడగా తాను కనిపించలేదని తన అమ్మవారింటికి వెళ్లిందని అనుకున్నాడు. అయితే రెండు రోజులు గడిచినా నేపాల్‌కి వెళ్లిందో లేదో అని ఊర్మిళ అమ్మవారికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయడం లేదని, భర్త నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్కుమార్ తెలిపారు. -
సన్నీ లియోన్ గొప్పమనసు .. రూ.50 వేల రివార్డ్ ప్రకటించిన నటి!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే రూ.50 వేల రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ సంబంధించిన వివరాలు షేర్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం. సన్నీ లియోన్ ఇంట్లో ముంబయికి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే 9 ఏళ్ల కూతురు ఉంది. అయితే 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ చెబితే 11 వేల రూపాయలు పారితోషికం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రూ.50 వేల రివార్డ్ అయితే బాలిక సమాచారం ఇచ్చినవారికి తాను వ్యక్తిగతంగా రూ.50 వేల రూపాయలు ఇస్తానని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ.. సన్నీ లియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీలో కనిపించింది. ఇది చూసిన సన్నీ అభిమానులు.. దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు సన్నీ లియోన్ మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
రాజస్తాన్‌లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం
జైపూర్: రాజస్తాన్‌లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
లేఆఫ్స్ సంక్షోభం: పాప మిస్సింగ్.. ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాల కోత ఆయా కుటుంబాల్లో తీరని క్షోభ మిగిల్చుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఉంటూ ఐటీ ఉద్యోగం కోల్పోయిన వారు హెచ్1బీ వీసా గడువు ముగిస్తుండటం, 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు మధ్య వారి కష్టాలు వర్ణనాతీతం. యూఎస్‌లో ఉంటున్న భారతీయ కుటుంబంలో ప్రస్తుతం అలాంటి ఇబ్బందుల్లో పడింది. ఇండియాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో ఒక బాలిక కనిపించకుండా పోయిన వైనం ఆందోళన రేపింది. న్యూస్మినిట్అందించిన వివరాల ప్రకారం అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్న పవన్ రాయ్ మరుపల్లి, శ్రీదేవి దంపతుల కుమార్తె తన్వి (14) గత రెండు వారాలకు పైగా కనిపించకుండా పోయింది. ఎందుకంటే పవన్ ఉద్యోగం పోతుందన్న భయంతో, తిరిగి ఇండియాకు వెళ్లి పోవాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి భయపడే తన్వి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని అంచనా. తన్వి కోసం స్నేహితులు, బంధువులు ఇతరులు ఎంత శోధించినా ఎలాంటి ఫలితం లేదు. చివరిసారిగా జనవరి 17న బస్సులో పాఠశాలకు బయలు దేరినప్పుడు ఆమె పరిసరాల్లో కనిపించింది. జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్లో బస్ పికప్ ఏరియా వైపు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఆమె చివరిసారిగా కనిపించిందట. బస్సు ఎక్కుండా, తన్వి డేవిస్ స్ట్రీట్‌లో ఉత్తరాన నడుస్తూ కనిపిస్తోంది. తన్వి తన మొబైల్ , స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్లడంతో కనుక్కోవడం మరింత కష్టమని తెలుస్తోంది. దీంతో ఆమె ఆచూకీ తెలిపిన వారికి 5వేల డాలర్ల నగదు బహుమతి కూడా ప్రకటించారు ఎవరైనా (501) 450-6120లో కాన్వే పోలీస్ డిపార్ట్మెంట్ (CPD)ని సంప్రదించాలి లేదా అత్యవసర సేవలను సంప్రదించాలని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. -
కవాడిగూడలో బాలిక అదృశ్యం.. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేదంటున్న తల్లిదండ్రులు
-
హైదరాబాద్‌లో 13 ఏళ్ల బాలిక అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజ్‌లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక మిస్సింగ్‌పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఉదయం బయటకెళ్లిన బాలిక అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: మెదక్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి.. -
హైదరాబాద్: కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం
-
దమ్మాయిగూడ బాలిక మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది. దమ్మాయిగూడలో ఉద్రిక్తత దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. -
మేడ్చల్: జవహార్‌నగర్ బాలిక అదృశ్యం విషాదాంతం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఏం జరిగింది? దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు హెచ్ఐవీ సోకే విధంగా వైద్యం -
ఫోన్ మాట్లాడొద్దన్న తల్లి.. అదృశ్యమైన కూతురు
బంజారాహిల్స్(హైదరాబాద్): తరచూ ఫోన్ మాట్లాడుతున్నావని కోప్పడ్డందుకు తన కూతురు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సింగాడబస్తీలో నివసించే భీమ్‌బాయి గృహిణి. ఆమె 15 సంవత్సరాల కూతురు పూజ ఇంటర్ చదువుతోంది. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పోలీసులకు పట్టించిన భార్య ఈ నెల 15వ తేదీన ఫోన్ తరచూ ఎందుకు మాట్లాడుతున్నావని అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గతంలో కూడా పలుమార్లు ఇంట్లో నుంచి వెళ్లి తన స్నేహితుల వద్ద ఉండేదని ఈ సారి కూడా వస్తుందని చూడగా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94914 87605లో సంప్రదించాలని ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
9 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు బాలిక
ముంబై: తొమ్మిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన మైనర్ బాలిక ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెను అపహరించిన జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంధేరీలో తల్లిదండ్రులతో కలిసి జీవించే ఏడేళ్ల పూజ 2013 జనవరి 22న స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యింది. సంతానం లేని జోసెఫ్ డిసౌజా ఆమెను అపహరించాడు. పూజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూజ ఫొటోలతో పోస్టర్లు రూపొందించి, నగరంలో అన్ని చోట్లా అతికించారు. అప్పట్లో మీడియాలోనూ ఈ కేసు సంచలనాత్మకంగా మారింది. పూజ ఆచూకీ పోలీసులకు దొరకలేదు. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్ డిసౌజా–సోనీ దంపతులకు కుమార్తె జన్మించింది. దీంతో పూజను పని మనిషిగా మార్చేశారు. నిత్యం చిత్రహింసలు పెట్టేవారు. నువ్వు మాకు జన్మించలేదంటూ నిజం చెప్పేశారు. పూజ తన గోడును స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద వెళ్లబోసుకుంది. సదరు మహిళ పూజకు సంబంధించిన వార్తలు, వివరాల కోసం ఇంటర్నెట్లో శోధించింది. తొమ్మిదేళ్ల క్రితం అపహరణకు గురికాగా, కేసు నమోదైనట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం చేరవేసింది. పూజను పోలీసులు ఇటీవలే సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం -
Girl Missing: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో?
పెండ్లిమర్రి(అన్నమయ్య జిల్లా): మండలంలోని ఎగువపల్లె గ్రామానికి చెందిన దుత్తలూరు ఖాదర్ మున్ని (16) సోమవారం అదృశ్యం అయినట్లు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆ బాలిక పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉన్నది. తల్లిదండ్రులు ఉదయం కూలీ పనులకు వెళ్లారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక ఇంటి వద్ద లేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు, బంధువులు గ్రామం చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు నంబర్: 9121100527కు ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. -
అమీర్‌పేట్‌లో స్కూల్ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, అమీర్‌పేట: ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతి అదృశ్యం కలకలం: హీరో సూర్య ఆందోళన
చెన్నె: నీట్ భయం ఇంకా తమిళనాడు విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట్ ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్‌ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా కూడా విద్యార్థులు ఊరట చెందడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నీట్ పరీక్ష రాసి వచ్చిన అనంతరం కీ పేపర్ చూసుకున్న విద్యార్థిని కనిపించకుండాపోయింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కర్ జిల్లాకు రాసిపురం పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన శ్వేత (19) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-నీట్)ను ఈనెల 12వ తేదీన రాసింది. ఈనెల 17వ తేదీన రాసిన పరీక్షకు సంబంధించిన కీ పేపర్ చూసుకుంది. ఉత్తీర్ణత సాధించలేనని గ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అదృశ్యం కేసు ఫిర్యాదు చేయడంతో రాసిపురం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్ మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా కూడా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారు భవిష్యత్ ఎంతో ఉంది’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఓ పిలుపునిచ్చారు. -
14 ఏళ్లకే ఇంట్లో నుంచి పరార్.. 2 ఏళ్ల తర్వాత 4 నెలల శిశువుతో!
చెన్నై/తిరువనంతపురం: కేరళలో కనిపించకుండా పోయిన ఓ మైనర్ బాలికను రెండేళ్ల తరువాత తమిళనాడులోని మదురైలో పోలీసులు గుర్తించారు. తప్పిపోయిన సమయంలో బాలిక వయస్సు 14 ఏళ్లు కాగా ప్రస్తుతం ఆమెకు 16 ఏళ్లు. అయితే ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి. ఆమె తమిళనాడు 22 ఏళ్ల వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని(తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం)కోజింజపారాకు చెందిన 14 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఓ వ్యక్తితో కలిసి 2019లో ఇంట్లోనుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించగా.. కోజింజంపారా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇక తాజాగా రెండేళ్ల తరువాత జూన్ 18న వీరిద్దరూ మదురైలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె తన తల్లితో కలిసి క్యాటరింగ్ పనిచేసే వ్యక్తితో మదురైలోని ఇంట్లో కనిపించింది. కాగా ఆ వ్యక్తికి చెందిన దూరపు బంధువులు అతని ఇంటి సమీపంలో నివసిస్తున్నారని, బాలికను అతని భార్యగా వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలిక వయసు గురించి ఖచ్చితంగా తెలియదన్నారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి అని పాలక్కాడ్ జిల్లా డీఎస్పీ జాన్ సీ తెలిపారు. వీర్దిరూ కలిసి జీవిస్తున్నారన్న ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఉందో లేదో తమకు తెలియదని పోలీసులు అన్నారు. బాలికను, శిశువును తిరిగి కేరళకు పంపించామని, సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం సెక్షన్ల కింద వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం శిశువు, బాలిక డీఎన్ఏ నమూనాలను సేకరిస్తామని వెల్లడించారు. చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి -
ఇంట్లో గొయ్యి... అమ్మాయి అదృశ్యం!
ఎర్రుపాలెం: ఒకవైపు గుప్తనిధుల కోసం ఇంట్లో తవ్వకాలు.. మరోవైపు ఆ ఇంటికే చెందిన బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో చోటుచేసుకుంది. రేమిడిచర్లకి చెందిన వెల్లంకి వెంకట్రావు,రాణి దంపతుల కుమార్తె రాజశ్రీ (16) వరంగల్‌లో నివసిస్తున్న తన బాబా యి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉంటోంది. ఆ ఊర్లోనే నివసిస్తున్న గద్దె నర్సింహారావు(నాగేశ్వరరావు మామ) ఇంట్లో లంకె బిందెలున్నా యని క్షుద్రపూజారులు చెప్పడంతో ఇంట్లో సొరంగంలా పెద్దగొయ్యి తీశారు. ఓ బాలికను నరబలి ఇస్తే ఫలితం ఉంటుందని పూజారులు చెప్పడంతో రాజశ్రీతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ఈ విషయం బాలిక తల్లిదండ్రులకూ తెలుసనే ప్రచారం జరుగుతోంది. రాజశ్రీ తల్లిదండ్రులు ఈ నెల 17న గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని గుడికి వెళ్లారు. రాజశ్రీకి జ్వరం వస్తోందని ఆమెను ఇంటి వద్దే ఉంచారు. వారు తిరిగి వచ్చేసరికి బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పైచదువుల నిమిత్తం ఇల్లు విడిచి వెళ్తున్నానని బాలిక ఇంగ్లిష్‌లో రాసిన లేఖ ఆమె ఇంట్లో పోలీసులకు దొరికింది. విషయం తన స్నేహితురాలు శరణ్యకు తెలుసని, చదువు పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని అందులో పేర్కొంది. ఈ లేఖ రాజశ్రీనే రాసిందా, లేక బలవంతంగా రాయించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శరణ్యను విచారించగా, మహారాష్ట్రలోని అంబాని ఆశ్రమానికి వెళ్తానని రాజశ్రీ చెప్పినట్లు వివరించింది. రాజశ్రీ మొబైల్‌ను లొకేషన్ ట్రేసింగ్ చేస్తున్నారు. రాజశ్రీని నర బలి ఇచ్చారా లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయిందా.. మాంత్రికులు వేరే ప్రాంతాలకు తమ వెంట తీసుకెళ్లారా..అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఉసురు తీసిన నాలా
నేరేడ్మెట్ (హైదరాబాద్): అమ్మా... కాసేపు ఆడుకొని వస్తానని తల్లికి చెప్పిందా చిన్నారి. సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లింది. ఇక ఎప్పటికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోయింది. నోరు తెరిచిన ఓపెన్ నాలా ఆ పన్నెండేళ్ల బాలికను మింగేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యా నికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది. సైకిల్ తొక్కడానికి వెళ్లి అదృశ్యమైన బాలిక చివరకు చెరువులో శవమై తేలింది. కనిపించ కుండా పోయిన దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో బాలిక విగతజీవిగా లభించింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగిన తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద సంఘ టన హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో... ఈస్ట్ దీనదయాళ్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈస్ట్ దీనదయాళ్నగర్ రోడ్ నం.2లోని అద్దె ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగి అభిజిత్ కపూరియా, సుకన్య దంపతులు నివసిస్తున్నారు. రెండు నెలల కిందటే వీరు కాకతీయనగర్ నుంచి దీనదయాళ్‌నగర్‌కు మారారు. వీరికి కూతురు సుమేధ కపూరియా (12), ఒక కుమారుడు ఉన్నారు. కూతురు సుమేధ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గురు వారం సాయంత్రం సుమారు 6.15 గంటల ప్రాంతంలో సుమేధ సైకిల్ తొక్కడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అంతర్గత రోడ్లపై 6.26 వరకు సైకిల్ తొక్కుతున్నట్టు కాలనీలోని సీసీ టీవీలో రికార్డయింది. ఆ తరువాత బాలిక అదృశ్యమైంది. రాత్రి 7 గంటలు కావస్తున్నా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వారిని అడిగినా జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలోని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రమాదవశాత్తు కూతురు నాలాలో పడిపోయిందా? అనే అనుమానం కలిగింది. బాలిక అదృశ్యమైన విషయం స్థానికులకు తెలియడంతో వారూ తల్లిదండ్రులతో కలిసి వెతకడం ప్రారంభించారు. మూడు గంటల పాటు గాలించినా జాడ తెలియలేదు. గురువారం సాయంత్రం కాలనీలో సైకిల్‌పై వెళుతున్న బాలిక సుమేధ (సీసీ టీవీ దృశ్యం) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటలకు కాలనీకి చేరుకొని అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రెస్క్యూ బృందం వచ్చి గాలింపు మొదలుపెట్టింది. కాలనీలోని మురుగునీరు వెళ్లే బండచెరువు నాలాలో రెస్క్యూ బృందం వెతుకుతుండగా సుమేధ తొక్కిన సైకిల్ లభించింది. అదే నాలా వెంట గాలిస్తూ సుమారు రెండు కి.మీ.దూరంలో ఉన్న బండచెరువు వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందానికి బాలిక సుమేధ విగతజీవిగా లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కాసేపు ఆడుకొని వస్తానని చెప్పి వెళ్లిన కూతురు...చెరువులో శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం చూసి కాలనీ వాసులు కంటతడిపెట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు. ఎవరు తెచ్చిస్తారు? తన కూతురు మరణానికి కారణం ఎవరని సుమేధ తండ్రి అభిజిత్ కపూరియా ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం ఓపెన్‌నాలా వల్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే బాలిక సుమేధ ప్రమాదానికి గురై మరణించిందని స్థానికులు తీవ్రంగా విమర్శించారు. బాలిక అదృశ్యమైన విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేసినా స్పందించలేదని, సకాలంలో గాలింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహారించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్ దీనదయాళ్నగర్ను సందర్శించి నాలా పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాలిక మృతిపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కలివిడిగా ఉండేది చిన్నారి సుమేధ మా దగ్గర భరత నాట్యం నేర్చుకుంటోంది. రోజూ మధ్యాహ్నాం వేళ ఒక గంట భరత నాట్యం నేర్చుకునేది. మా కాలనీకి వచ్చి రెండు నెలలే అవుతున్నా...గడిచిన నెలన్నర రోజులుగా భరతం నాట్యం నేర్చుకోవడానికి వచ్చేది. నాట్యంలో మెళకువలను ఇట్టే గ్రహించేది. స్నేహితులతోనూ కలివిడిగా ఉండేది. షీ ఈజ్ వెరీ షార్ప్. నాట్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోని కుక్కపిల్లతో చాలాసేపు ఆడుకునేది. పెట్స్ అంటే ఇష్టమని సుమేధ చెబుతుండేది. మాతో కలిసిపోయి ఆడుతూపాడుతూ ఉండే చిన్నారి నాలాలో పడి మృతి చెందటం బాధ కలిగించింది. –అర్షిత, నాట్య శిక్షకురాలు ప్రమాదమేనా? బాలిక సుమేధ అదృశ్యం, మృతి సంఘటన ప్రమాదమా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నాలాలో పడి.. అందులో కొట్టుకుపోయి చనిపోయిందా? ఎవరైనా పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ తొక్కుతుండగా బాలికతో ఎవరైనా మాట్లాడారా? నాలాలో పడితే రెండు కి.మీ. దూరంలోని చెరువు వరకు కొట్టుకుపోయినా.. బాలిక ముక్కు నుంచి రక్తం రావ డం మినహా ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ‘సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన సుమేధ నాలా వద్ద నుంచి వెళుతుండగా చూశాను. తరువాత ఆమె కోసం వెతుకుతున్నారని తెలిసి నాలా ప్రాంతంలో గాలించాం’ అని కాలనీవాసి జ్ఞానకుమార్ తెలిపారు. -
బాలిక అదృశ్యం: నాలా వద్ద సైకిల్
-
బాలిక అదృశ్యం: కిడ్నాప్ చేశారేమో!
సాక్షి, మేడ్చల్: సైకిల్ తొక్కుకుంటూ ఇంటినుంచి బయటికెళ్లిన ఓ బాలిక అదృశ్యం కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని నేరెడ్మేట్ కాకతీయ నగర్లో గురవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగుచూసింది. కాకతీయ నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నసుమేధ కపురియా (12) నిన్న సాయంత్రం సైకిల్ తీసుకొని బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిగిరి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నిన్న కురిసిన భారీ వర్షానికి దీన్ దయాళ్ నగర్లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో నాలా వద్ద జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలతో గాలింపు చేపట్టగా బాలిక సైకిల్ కనిపించింది. సుమేధ నాలాలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖైరాలీ పబ్లిక్ స్కూల్లో సుమేధ 5 వ తరగతి చదుతున్నట్టు తెలిసింది. (చదవండి: ప్రగతి భవన్: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) కిడ్నాప్ చేశారు..! బాలిక గల్లీలో ఉన్నపెద్ద నాలాలో పడి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్కడ ఉన్న ఓపెన్ నాలాలో బాలిక సైకిల్ లభించడంతో మోరీపై ఇళ్ల ముందున్న పైకప్పును తొలగంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తమ పాప నాలాలో పడి తప్పిపోయిందని అనుకోవడం లేదని బాలిక తల్లి సుకన్య చెప్తున్నారు. ఎవరైనా తమ బిడ్డను కిడ్నాప్ చేశారేమోనని భావిస్తున్నట్టు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి) -
ఓ అనామిక కథ!
ఆ చిన్నారి ఐదేళ్ల వయసులో ఒడిశాలో తప్పిపోయింది. తల్లిదండ్రులు అప్పట్లో వెతికినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. ఆశలు వదులుకుని వారు స్వగ్రామానికి వచ్చేశారు. ఆ బాలికను ఒడిశా ప్రభుత్వం సంరక్షించి చదివిస్తోంది. ఎప్పటికైనా తన తల్లిదండ్రులను చూడకపోతానా అని ఆశతోనే ఉండేది. అధికారుల సాయంతో తన స్వస్థలం వీకోట మండలంలోని బోడిగుట్టపల్లెగా తెలుసుకుంది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. సాక్షి, పలమనేరు:చిన్న తనంలో ఒడిశాలో తప్పిపోయిన బాలికకు పదేళ్ల తర్వాత తన పుట్టిన నేల గురించి తెలిసినా.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పూర్తి వివరాలు తెలుసుకునే సరికి కన్నవారు లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం తన కుటుంబీకులను కలుసుకోవాలని ఆరాటపడుతోంది. పదేళ్ల తర్వాత ఆమెకు తన వివరాలు ఎలా లభించాయి. అసలు ఏం జరిగిందంటే.. వీకోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన పరమేష్, లక్షమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం చిన్న కూతురితో పాటు ఒడిశా రాష్ట్రం పూరి సమీపంలోని కనాస్ ప్రాంతానికి వలసకూలీలుగా వెళ్లారు. అక్కడ బిడ్డ తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. బాలిక ఫొటో కావాలన్నారు. తమవద్ద లేదని చెప్పడంతో కేసు కూడా నమోదుచేయలేదు. కొన్నాళ్లు తప్పిపోయిన ప్రాంతంలో వెతికి చేసేదిలేక స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. ఇక్కడ కూలిపనులు చేసుకుంటూ ఉండిపోయారు. వికోట మండలం బోడిగుట్టపల్లిలో బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న అధికారులు బాలికను చేరదీసిన స్వచ్ఛంద సంస్థ ఒడిశాలోని కనాస్లో అనాథగా తిరుగుతున్న చిన్నారిని నిలాచల్ సేవా ప్రతిష్టాన్ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. అక్కడి ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) అధికారులకు అందజేసింది. వారు అక్కడి ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్(దయావిహార్)కు అప్పగించారు. ఆ సంస్థ నిర్వాహకులు ఆ బాలికకు అనామిక అని పేరు పెట్టి అక్కడే చదివిస్తున్నారు. బాలిక పెరిగి పెద్దయ్యాక రెండేళ్ల క్రితం తమది ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లాలోని బోడిగుట్టపల్లె అని చెప్పింది. అక్కడి అధికారులు చిరునామా కనుగొనేందుకు బాలిక 8వ తరగతి ఫొటోను చిత్తూరు ఐసీడీఎస్ అధికారులకు పంపారు. బోడిగుట్టపల్లి పేరిట పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాలుండడంతో స్థానిక సీడీపీఓలు రెండేళ్లుగా చిరునామా కోసం విచారిస్తున్నానే ఉన్నారు. ఇలా ఉండగా వికోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన ఓ బాలిక ఒడిశాలో తప్పిపోయిందని స్థానికుల ద్వారా సీడీపీఓ రాజేశ్వరికి సమాచారం అందింది. ఆమె నాన్ ఇన్స్టిట్యూషన్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శివకు ఆ విషయం తెలిపారు. ఆయన బోడిగుట్టపల్లికి చేరుకుని బాలికకు సంబంధించిన ఫొటో, వివరాలను చెప్పారు. కుటుంబ సభ్యుల ఫొటోలను ఒడిశాలో బాలిక ఉంటున్న చైల్డ్‌హోమ్‌కు వాట్సాప్‌లో పంపారు. వారిని చూసిన బాలిక తన అన్న, అక్కలుగా గుర్తించింది. అంతలోనే కన్నీరుమున్నీరు తన వారిని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూపాలని ఆత్రుతగా అడిగింది. వారు మృతి చెందారనే సమాచారం తెలుసుకుని బాలికకు చెప్పారు. దీంతో అనామిక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కనీసం తన బంధువుల వద్దకు వెళతానని బాలిక కోరింది. దీంతో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక సీడీపీఓలు మంగళవారం బోడిగుట్టపల్లెలోని కుటుంబ సభ్యులను విచారించారు. వీడియో కాల్ ద్వారా బాలికతో మాట్లాడించారు. ఈ వివరాలతో నివేదికను ఒడిశా ప్రభుత్వానికి పంపి ఆపై బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కాగా అనామిక ప్రస్తుతం అక్కడి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షలు పూర్తయ్యాక ఇక్కడికి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని విచారణకు వచ్చిన అధికారి శివ తెలిపారు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ బతికే ఉందని, ఆ బాలిక ఇప్పుడెలా ఉందో చూడాలని వారి కుటుంబ సభ్యులే కాదు.. ఆ గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. -
షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!
సాక్షి, విజయవాడ : షాపింగ్ కోసం వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన కంకిపాడు మండలం&గ్రామంలో చోటుచేసుకుంది. అంకమ్మగుడి మార్కెట్లో షాపింగ్ కోసం గురువారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన కర్రె తేజ (17) కనిపించకుండా పోయింది. కూతురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి నారాయణరావు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాలిక అదృశ్యం
శంషాబాద్: బాలిక అదృశ్యమైన సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా పెద్దలింగారెడ్డిపల్లికి చెందిన కె.శ్రీనివాస్ భార్యాపిల్లలతో కలిసి శంషాబాద్ రాళ్లగూడలో నివాసముంటూ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ కుమార్తె పల్లవి (13) నర్కూడలోని ప్రభుత్వ పాఠశాలో ఏడో తరగతి పూర్తి చేసింది. ఈ నెల 18 సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లిన పల్లవి తిరిగి రాలేదు. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పల్లవి తండ్రి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన చిన్నారి మృతి
యాచారం (రంగారెడ్డి) : చింతుల్లలో తప్పిపోయిన చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతి పట్ల తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తమవుతోంది. యాచారం సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాలు... మండల పరిధిలోని చింతుల్ల గ్రామంలోని బీఎన్సీ ఇటుక బట్టీల్లో ఒడిశాకు చెందిన హేతురాం చత్రియ, తులసి చత్రియలు పనులు చేసుకుంటూ తన ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. హేతురాం చత్రియ, తులసి చత్రియల రెండో కుమార్తె ఊర్మిళ(7) ఈనెల 26న అదృశ్యమైంది. రెండు రోజుల పాటు వెతికినా జాడలేకపోవడంతో యజమాని రాజేందర్‌రెడ్డి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం ఇటుక బట్టీ సమీపంలోని పొలాల్లో వెతికారు. అంతకుముందే ఊర్మిళ తల్లి తులసి చిన్నారి మృతిచెంది ఉన్న స్థలం వద్ద ఉండి ఏడవడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అదే స్థలంలో చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ ఎంవీరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వివరాలు సేకరించారు. తల్లిదండ్రులు చిన్నారి మృతిపై అనుమానంగా మాట్లాడుతుండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, చిన్నారి మృతికి గల కారణాల కోసం విచారణ చేస్తున్నట్లు సీఐ కృష్ణంరాజు తెలిపారు. -
అక్కా.. నువ్వెక్కడా?
సిరిసిల్ల : ఆ పిల్లలకు అమ్మానాన్నలు లేరు. ముగ్గురు అమ్మాయిలు.. ఒక్క అబ్బాయి. అందరూ అనాథలే.. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో చేరి చదువు సాగిస్తున్నారు. పదోతరగతి పరీక్ష రాసిని అంబాల స్వరూప(17) మూడ్రోజుల క్రితం ఇద్దరు చెల్లెల్లను, తమ్ముడ్ని వదిలేసి ట్రస్ట్ నుంచి వెళ్లిపోయింది. ‘అక్కా.. నువ్వెక్కడా’.. అంటూ ఆ చిన్నారులు బెంగతో మూడ్రోజులుగా బిక్కుబిక్కుమంటున్నారు. ట్రస్ట్‌లోనే ఎదిగి.. ధర్మపురి ప్రాంతానికి చెందిన అంబాల కరుణ– సమ్మయ్య దంపతుల పిల్లలు స్వరూప, సాంబయ్య, సౌజన్య, సంగీత. కరుణ– సమ్మయ్యలు అనారోగ్య సమస్యలతో మరణించారు. వారి నలుగురు పిల్లలను రంగినేని ట్రస్ట్‌లో ఐదేళ్లకిందట చేర్పించారు. ఇటీవలే స్వరూప పదోతరగతి పాసైంది. మోడల్స్కూల్లో ఇంటర్మీడియెట్ చేసేందుకు సిద్ధమైంది. తమ్ముడు సాంబయ్య పదోతరగతికి రాగా.. చెల్లెల్లు సౌజన్య 8, సంగీత 7వ తరగతి చదువుతున్నారు. ఆదివారం వేకువజామున స్వరూప ట్రస్ట్ నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం ట్రస్ట్ నిర్వాహకులు వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. అక్క జాడ తెలియకపోవడంతో ముగ్గులు పిల్లలు ఆవేదనకు లోనవుతున్నారు. ‘అక్కా.. నువ్వు ఎక్కడ ఉన్నా తిరిగి రావాలంటూ’ వేడుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు.. స్వరూప ట్రస్ట్ నుంచి వెళ్లిపోవడంతో నిర్వాహకులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదు చేశారు. స్వరూప ఆచూకీ తెలిసిన వారు సిరిసిల్ల రంగినేని ట్రస్ట్‌కు సమాచారం ఇవ్వాలని, 92906 87853, 92463 18382 నంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు. -
బాలిక అదృశ్యం
రాయికోడ్(అందోల్): మండలంలోని హస్నాబాద్‌కు చెందిన బాలిక అదృశ్యమైంది. స్థానిక ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు... గ్రామానికి చెందిన సార కిషన్ మూడవ కూతురు సార అనిత (17) సోమవారం ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా అనిత ఆచూకీ తెలయక పోవడంతో ఆమె తండ్రి కిషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. అనిత ఆచూకీ తెలిసిన వారు 94409 01829, 08451 286733 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. -
అదృశ్యమైన చిన్నారి దారుణ హత్య
వనపర్తి : జిల్లాలోని పెద్దగూడెంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి నాగేశ్వరి దారుణ హత్యకు గురైంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామకృష్ణ అలియాస్ బాబా ఇంట్లో చిన్నారి మృతదేహం లభించింది. కాగా ఈ నెల 10న పెద్దగూడెంలో చిన్నారి అదృశ్యమైంది. నాగేశ్వరి హత్యకేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే క్షుద్ర పూజలా? లేక చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బుజ్జి మిస్సింగ్ కేసు.. వీడని మిస్టరీ!
సాక్షి, విజయవాడ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుజ్జి అనే బాలిక మరణం మిస్టరీగా మారింది. వన్‌టౌన్‌లోని ఓ వస్త్ర దుకాణంలో బుజ్జి పనిచేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన బుజ్జి అదృశ్యం కాగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వంశీ అనే యువకుడిపై ఆ ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. 45 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు ఆ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం బుజ్జి మృతదేహం కృష్ణానదిలో దొరికిందని, అనాథ శవంగా భావించి తామే అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు వారికి చెప్పారు. తమ కూతుర్ని అప్పగించమంటే మృతదేహం ఫొటోలు చేతిలో పెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసు పెడితే అనాథ శవంగా అంత్యక్రియలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ కూతుర్ని వంశీయే హత్య చేసి కృష్ణా నదిలో పడేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని వైర్లతో కట్టేసినట్టు ఫొటోల్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. -
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..
హైదరాబాద్: కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబ నగర్‌కు చెందిన ప్రీతి(17) చింతల్‌లోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 20న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక అదృశ్యం కేసులో యువకుడు అరెస్ట్
- ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు - విలేకర్ల సమావేశంలో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు మైదుకూరు టౌన్: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లెకు చెందిన విపురాపురం రాముడు తన కూతురు కనిపించలేదని మార్చి 23వ తేదీన మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు అదృశ్యం కేసును ఛేదించారు. నిందితుని అరెస్టు వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాయుడు కుమార్తె రామాంజనమ్మ(17) ఇంటర్మీడియట్ చదువుకుంటూ పట్టణానికి వస్తూ పోతుండగా విశ్వనాథపురం గ్రామానికి చెందిన పొట్టం సురేష్ అనే ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి మార్చి 22వ తేదీ రాత్రి బైక్‌లో తీసుకెళ్లాడు. సురేష్ ఎక్కడ ఉండేది ఎవ్వరికీ సమాచారం తెలియకూడదని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వనిపెంట, గంజికుంట, జంగాళ్లపల్లె, బెంగళూరు, రాయచోటి తదితర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా సమాచారం లేదు. స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి కేసును ప్రత్యేకంగా పరిశీలించగా చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో ఓ మామిడితోటలో ఉన్నట్లు సమాచారం రావడంతో కానిస్టేబుళ్లు ఇజ్రాయిల్, రాజేష్, సాగర్ బాలిక తల్లిదండ్రులను తీసుకొని వెళ్లి అదుపులోకి తీసుకున్నారన్నారు. బాలిక మైనర్ కావడంతో ఫోక్స్‌యాక్ట్ 2012, ఏపీసీ 366ఏ ప్రకారం కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. అదే విధంగా మైనర్ బాలిక కిడ్నాప్‌నకు సహకరించిన వారిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో ఎస్ఐ ఎం.శాంతమ్మ, హెడ్‌కానిస్టేబుల్ గుర్రప్ప, రామసుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు. -
బోడుప్పల్లో యువతి అదృశ్యం
బోడుప్పల్(హైదరాబాద్‌సిటీ): ఆఫీసుకు వెళ్లి జీతం తెచ్చుకుంటానని వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈసంఘటన జరిగింది. ఎస్సై సుధాకర్ వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ ఇందిరానగర్‌కు చెందిన జె. స్వామి కుమార్తె రేణుక (18) నగరంలోని యశోద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తుంది. ఈనెల 12న ఆఫీసుకు వెళ్లి జీతం తెచ్చుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ బాలిక (15) అదృశ్యమైంది. స్థానికంగా ఉంటున్న మారెప్ప అనే యువకుడు కిడ్నాప్ చేశాడని బాలిక తల్లి గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
యువతి అదృశ్యంపై కేసు నమోదు
పుట్లూరు : మండలంలోని కోమటికుంట్లలో యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్‌బాబు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన లక్ష్మీ అనే యువతి ఈ నెల 25 నుంచి కనిపించలేదని ఆమె తండ్రి క్రిష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూలుకు వెళ్లి..బాలిక అదృశ్యం
రసూల్‌పురా(హైదరాబాద్): పాఠశాలకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన బాలిక కనిపించకుండా పోయిన ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... బోయిన్పల్లి ఆరావళీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే మహేష్‌కుమార్ వ్యాపారి. ఇతని కూతురు శృతిగోయల్ (14) సమీపంలోని ప్రైవేట్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 7.55 గంటలకు పాఠశాలకు రోజు మాదిరిగానే బయలుదేరింది. పదకొండు గంటల ప్రాంతంలో మహేష్‌కుమార్ పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శృతి రాలేదని తెలిసింది. మహేష్ బంధువులు, తెలిసిన వారి వద్ద వాకబు చేసి, ఫలితం లేకపోవటంతో బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిటీలో బాలిక అదృశ్యం
సంతోష్‌నగర్ (హైదరాబాద్): ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సుల్తాన్ కుమార్తె ఉజ్మా బేగం (17) స్థానికంగానే ఉన్న తన అక్క రెహానా బేగం ఇంటి వద్ద ఉంటోంది. కాగా, బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఉజ్మా బేగం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరి బయటకు వెళ్లింది. బాలిక ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో రెహానా బేగం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అదృశ్యమైన బాలికలు దొరికారు
హైదరాబాద్: వారం రోజుల క్రితం గుంటూరులో అదృశ్యమైన ముగ్గురు బాలికలు లేఖారెడ్డి, దివ్య, యశస్వి సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కూకట్ పల్లిలో వీరి ఆచూకీ కనుగొన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వీరి జాడ గుర్తించారు. స్నేహతురాలి పెళ్లి కోసం వీరు ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. తల్లిదండ్రులకు అప్పగించేందుకు గుంటూరు పోలీస్ స్టేషన్ కు వీరిని తీసుకెళ్లారు. ఈనెల 14న అదృశ్యవడంతో గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో బాలికల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ముగ్గురు బాలికల అదృశ్యం
హైదరాబాద్: గుంటూరులో ముగ్గురు బాలికలు అదృశ్యమవడంతో కలకలం రేగింది. లేఖారెడ్డి, దివ్య, యశస్వి అనే బాలికలు ఈనెల 14న గుంటూరులో అదృశ్యమయ్యారు. తర్వాతి రోజు వీరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దిగినట్టు పోలీసులు గుర్తించారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి వీరు బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీరితో ముగ్గురితో పాటు మరో యువతి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ యువతే వీరిని గుంటూరు నుంచి ఇక్కడకు తీసుకువచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు బాలికలు ఇంటి నుంచి వచ్చేటప్పుడు పెద్దమొత్తంలో బంగారం, డబ్బు తీసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. వీరి అదృశ్యంపై గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దిల్ షుఖ్ నగర్ కు చెందిన యశస్వి గుంటూరులో చదువుకుంటోందని పోలీసులు తెలిపారు. వీరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ముగ్గురి కోసం గుంటూరు, హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
బాలిక అదృశ్యం
హైదరాబాద్ :మహబూబ్‌నగర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.....మహబూబ్‌నగర్‌కు చెందిన చెన్నయ్య కుమార్తె సింధూ హైదరాబాద్‌లో ఉండే మేనమామ ఇంటికి వచ్చింది. మార్చి 17న తిరిగి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. బస్టాండ్ వరకు తోడుగా వెళ్లిన మేనమామ ఆమెను ఎంజీబీఎస్‌లో మహబూబ్‌నగర్ వెళ్లే బస్పు ఎక్కించారు. అయితే సింధూ మహబూబ్‌నగర్ చేరలేదు. కుమార్తె ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులందరినీ వాకబు చేసినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చివరకు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. బాలికను ఎవరైనా అపహరించి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విచారణ పేరుతో పోలీసులు హింసిస్తున్నారు!
విజయవాడ: తమ కుమార్తె అదృశ్యం కేసులో పోలీసులు హింసిస్తున్నారని కావ్య తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కుమార్తె అదృశ్యం కేసులో దర్యాప్తు ముందుకు సాగక పోగా, తమను పదే పదే విచారిస్తూ వేధిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను ప్రక్కకు పెట్టిన పోలీసులు.. కుటుంబ సభ్యులనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు. పాప ఆచూకీ కనిపెట్టడం మాని తమనే విచారించడం ఎంతవరకు సమంజసమని మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. కేసు పెట్టడమే తప్పయిందని పోలీస్ శాఖపై అసహనం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
విశాఖ: హైదరాబాద్‌లో అదృశ్యమైన బాలిక శ్రావణి(13) ఆచూకీ లభించింది. ఈనెల 5న కృష్ణా నగర్ లో బయటకు వెళ్లిన బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పో్యింది. అదే రోజు ఎంతకూ బాలిక ఆచూకీ లభించకపోవంతో తల్లి దండ్రలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని రైల్వే స్టేషన్ లకు సమాచారం ఇచ్చి రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఈక్రమంలో ఆ బాలిక విశాఖ పట్టణంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. తనను జూనియర్ ఆర్టిస్టు జెస్సీ నాయుడు అనే వ్యక్తి ట్రైన్ ఎక్కించినట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక అదృశ్యంనకు సంబంధించి వివరాలు సేకరించే కోణంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.