రసూల్‌పురా(హైదరాబాద్): పాఠశాలకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన బాలిక కనిపించకుండా పోయిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... బోయిన్‌పల్లి ఆరావళీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే మహేష్‌కుమార్ వ్యాపారి. ఇతని కూతురు శృతిగోయల్ (14) సమీపంలోని ప్రైవేట్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది.
బుధవారం ఉదయం 7.55 గంటలకు పాఠశాలకు రోజు మాదిరిగానే బయలుదేరింది. పదకొండు గంటల ప్రాంతంలో మహేష్‌కుమార్ పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శృతి రాలేదని తెలిసింది. మహేష్ బంధువులు, తెలిసిన వారి వద్ద వాకబు చేసి, ఫలితం లేకపోవటంతో బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూలుకు వెళ్లి..బాలిక అదృశ్యం
Published Wed, Jul 1 2015 11:06 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement